• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 11: ప్రత్యక్ష గుడారం

[11-19] సువర్ణ దీప వృక్షము (నిర్గమ 25:31-40)

(నిర్గమ 25:31-40)
“మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను. దాని కలశములు దాని మొగ్గలు. దాని పువ్వులు దానితో ఏకాండమై యుండవలెను. దీప వృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు. అనగా దానిల ప్రక్క నుండి ఆరు కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, అట్లు దీప వృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్షము ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును, వాటి పువ్వులును ఉండవలెను. దీప వృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒకొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును, అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషీపనిగా ఉండవలెను. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగించవలెను. దాని కత్తెర, దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.’’
 

ఆ బంగారు దీప స్తంభము మేలిమి బంగారుతో నకిషీ పనిగా చేయబడెను. దాని ప్రకారము ఏకాండమైన ఒకే మేలిమి బంగారు నుండి చేయబడినది. దాని రెండు ప్రక్కల నుండి మూడేసికొమ్మలు బయటికి వచ్చినవి. ప్రకాండముపైన మరియు దాని ఆరు కొమ్మలపైన ఏడు దీపములు ఉంచబడినవి. అది చూచుటకు ఎంతో రమ్యముగాను, అందముగాను ఉండి చూపులను పట్టుకొనునట్లుండును.
సువర్ణ దీప వృక్షముపైన తైలమును పోసి ఎల్లప్పుడు పరిశుద్ధ స్థలములో వెలుగుచుండుటకై వెలిగించుటకు ఏడు దీపములు ఉన్నవి. ఒకడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ప్రత్యక్ష గుడారము యొక్క నీలి ధూమ్ర వర్ణ దారముతో నేయబడిన పేనిన సన్నపునారతో చేయబడిన తలుపులను తెరచుట ద్వారానే సాధ్యపడును.ఈ స్థలములో ప్రవేశించగలవారు నీలి ధూమ్ర రక్తవర్ణదారములో బయలు పరచబడిన రక్షణయొక్క కార్యమును విశ్వసించువారు అలాగే ఇట్టి విశ్వాసము లేకుండా ఎవరునూ పరిశుద్ధ స్థలములో ప్రవేశించలేరు. ఎట్లనగా ప్రత్యక్ష గుడారపు గుమ్మపు తెరలో బయలుపరచబడిన నీలి, ధూమ్ర రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపునార యొక్క మర్మమును తెలిసికొన్న వారు మాత్రమే దానిలో ప్రవేశించుటకు అర్హులు.
కాబట్టి నీలి ధూమ్ర రక్తవర్ణ దారములు మరియు పేనిన సన్నపునారతో నేయబడిన అద్భుత రక్షణను విశ్వసించువారు మాత్రమే దేవుని సంఘము యొక్క సభ్యులు కాగలరు. ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారపు తెర యొక్క నాలుగు వర్ణములు, నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క నీడయు యేసు రాకడను ముందే సూచించును. ఆయన బాప్తిస్మం పొందుట ద్వారా లోకము యొక్క పాపములన్నిటిని తనపై మోపుకొనెను మరియు ఆయన సిలువ మరణము నొంది తన రక్తమును కార్చుట ద్వారా మన పాపశిక్షను భరించెను.
నీరు మరియు ఆత్మమూలమైన సువార్త గాకయే సువార్త ప్రభువు మనకిచ్చిన నిజమైన పాప పరిహారము యొక్క సువార్త కాదు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యేసు పొందిన బాప్తిస్మము మరియు పాపక్షమాపణ అను దీవెనలను మనకు ఇచ్చుటకై సిలువలో ఆయన పొందిన తీర్పుతో తయారు చేయబడినది. అలాగే ఎవరైతే పూర్ణ హృదయంతో ఈ సత్యమును విశ్వసిస్తారో వారు తమ పాపాలన్నిటికి క్షమాపణ పొందగలరు. మరో విధంగా దేవుడు నీలి, ధూమ్ర,రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపు నార యొక్క సత్యములో నమ్మికయుంచువారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలరు.
పరిశుద్ధ స్థలములోగల సువర్ణ దీప వృక్షము తన తీక్షణ కాంతిని ఎల్లప్పుడు ప్రసరించుచున్నట్లే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా దేవుని పిల్లలైన వారు కూడా ప్రజలను వారి పాపము నుండి రక్షించు రక్షణ యొక్క వెలుగుతో వెలుగుచుండవలెను. అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా పాపక్షమాపణ పొందిన వారు మాత్రమే రక్షణ వెలుగునిచ్చు సువర్ణ దీప వృక్షము యొక్క పాత్రను నెరవేర్చగలరు. కనుక ఇతరులు కూడా ఈ సత్యమును తెలిసికొని వారి పాపముకు క్షమాపణ పొందుకొనగలరు.
ఆ బంగారు దీపవృక్షము, పువ్వులు, మొగ్గలు మరియు కలశమును కలిగియున్నది. దీప వృక్షము పై ఏడు దీపములు ఉంచవలెనని దేవుడు ఆజ్ఞాపించినట్లే దీప వృక్షము వెలిగించబడినప్పుడు పరిశుద్ధ స్థలములోని చీకటి కనబడకపోవును. దీని భావమేమనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటతో తమ పాపము నుండి శుద్ధి చేయబడిన పరిశుద్ధులు అందరూ కూడుకొని దేవుని సంఘమును నిర్మించి ఈ లోకమును వెలిగించెదరు. పరిశుద్ధ స్థలములో కనబడుచున్న దీప వృక్షము యొక్క వెలుగు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయై యున్నది. అది ఈ లోక చీకటి అంతటినీ పారద్రోలును. 
మనలను పాపమునుండి రక్షించుటకు, యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మానవ రూపమును ధరించుకొనెను. మన పాపములను వహించుకొనెను. ఆయన సిలువ వేయబడెను. అందును బట్టి యేసురక్షణ యొక్క వెలుగైయుండెను. ప్రత్యక్ష గుడార ప్రాంగణములో పాపులు తమ పాపమును పాప పరిహారార్థ బలిపశువుపై చేతులుంచి వాటిని దానిపై మోపి, ఆ బలిపశువును చంపుటతో తమ పాపశిక్షను భరించునట్లు చేసెను.
అలాగే యేసు కూడా బాప్తిస్మం పొంది దేవుని చట్టప్రకారము సిలువలో చనిపోయి మన రక్షణను సంపూర్తి చేసెను. మరియు ఆయన నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడిన పరిచర్యతో యేసు మానవుల రక్షణను నెరవేర్చెను ఆ విధముగా మనము యేసు మనకిచ్చిన ఆయన బాప్తిస్మము మరియు రక్తము యొక్క సువార్తను విశ్వసించుట ద్వారా మనము మన పాపము నుండి రక్షింపబడెదము యేసును నమ్మువారందరూ ఈ సత్యము యొక్క వెలుగును కూడా కనుగొనవలెను.
యేసు ఈ లోకమునకు రక్షణ యొక్క వెలుగును చూపించెను కనుక నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన తిరిగి జన్మించిన వారే దేవుని రాజ్యములో ప్రవేశించగలరు. అలాగే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తిరిగి జన్మించిన వారు మాత్రమే దేవుని సంఘములో బాగస్థులవుతారు. మరియు ఈ లోకమంతటా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క వెలుగును ప్రకాశింపజేసి వ్యాప్తి చేయగలరు. ఎందుకనగా వారు కేవలము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను దేవుడు వారికి అప్పగించెదను. వారు సత్యసువార్త వెలుగును ప్రకాశింపజేయుటకు అనుమతి పొందిరి.
అటువలే ఈ లోకమంతయూ సువార్త వెలుగును ప్రసరింపచేయునట్టి ఈ క్రియలు కేవలము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను సత్యమని విశ్వసించువారి వలననే సాధ్యమగునని మనం గుర్తించవలెను. పాపులు పరిశుద్ధ స్థలములో ప్రవేశింపలేరు ప్రత్యక్ష గుడారము యొక్క గుమ్మము యొక్క నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన సువార్తను నమ్మినవారే ప్రవేశించెదరు. కాబట్టి నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము సత్యమును ఎరిగినవారు మరియు తమ హృదయాలలో దానిని విశ్వసించువారు ప్రత్యక్ష గుడారములోకి రాగలరు. మరియు రక్షణ యొక్క ప్రకాశమానమైన వెలుగును. వెలిగించుట అను క్రియలను కొనసాగించగలరు.
ప్రత్యక్ష గుడార ఆవరణము యొక్క ద్వారము దగ్గర నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముతో చేయబడిన తెర కూడా వెలిగించబడినది. ఎట్లనగా తన కానుకను ప్రత్యక్ష గుడారములో సమర్పించుచూ వారికి, దేవుడు అవే నాలుగు రంగులతో చేయబడిన గుమ్మములను ఉంచెను. కానీ పాత నిబంధన కాలపు ప్రజలు తమ అనుదిన కానుకతో ఎప్పటికీ పరిపూర్ణులు కాలేకపోయిరి. కనుక వారు మెస్సయ్య కొరకు కనిపెట్టవలసి వచ్చెను. ఏమైననూ మెస్సయ్య అయిన యేసుక్రీస్తు నిజముగా వచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారము ద్వారా తెర యొక్క రంగులతో చేయబడిన ప్రకటనలను అనుసరించిన శాశ్వత బలిగా తన్ను అర్పించుకొనుటతో ఆయనే నిజమైన మెస్సయ్య అని గుర్తించలేకపోయారు.
ఇది ఈ దినాలలోని క్రైస్తవులు వలే వారు యేసు నామమును ఉచ్చరించిననూ మనలను పూర్తిగా రక్షించుట నీలి, ధూమ్ర,రక్తవర్ణపు దారము మరియు పేనిన సన్నపునార ద్వారా వచ్చెనని వారు ఎరుగరు. ప్రతి దినము పాత నిబంధన ప్రజలు బలిపశువుపై చేతులుంచుట మరియు దాని రక్తముతో బలి ఇచ్చునప్పుడు కేవలము వారి బలిపశువువలెనని ఈ విధముగానే రక్షకుడు ప్రత్యక్షమగునని వారు నమ్మవలెను.
అలాగే యేసుక్రీస్తు అను రక్షకుడు ఈ లోకమునకు వచ్చెను. చేతులుంచుట మరియు రక్తము చిందించుట అను పాత నిబంధన బలిపశువువలే ఆయన బాప్తిస్మం పొందెనని సిలువ వేయబడి తన రక్తమును చిందించెననియు, తద్వారా తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించెనని ఈ లోక ప్రజలు నమ్మవలెను. కానీ వారు పాత నిబంధన యొక్క బలివ్యవస్థ కూడా ఎరుగనివారై యేసు బాప్తిస్మము మరియు రక్తము ద్వారా వచ్చెనని కానీ ఎరుగక లేదా సిలువ రక్తముతోనే లేక సాధారణ రక్షకుడని తలంచెదరు.
దేవుని దృష్టిలో ఈ దినాలలో క్రైస్తవులు పాత నిబంధన యొక్క బలివ్యవస్థపై ఉంచు నమ్మిక ఇశ్రాయేలు ప్రజలు ఉంచు తప్పుడు విశ్వాసం వంటిదే. బలి వ్యవస్థలో బయలుపరచబడిన మెస్సయ్యను వారు నమ్మలేదు కనుక వారు మెస్సయ్య వచ్చెనని బాప్తిస్మం పొందెనని తన రక్తమును కార్చెనని నమ్మరు. కానీ ఈ లోకములోని ప్రజలందరూ ఇశ్రాయేలీయులతో సహా యేసు తన బాప్తిస్మము మరియు సిలువ త్యాగమును పరిచర్య ద్వారా తమ్మును తాము పాపము నుండి రక్షించినట్టి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తప్పక నమ్మవలెను.
నిన్ను నన్ను మన పాపము నుండియు శిక్ష నుండియు రక్షించుటకు యేసు బాప్తిస్మం పొంది తన రక్తమును చిందించెను. ప్రత్యక్ష గుడార ద్వారములో బయలుపరచబడిన నీలి ధూమ్ర రక్తవర్ణదారములో నున్న సత్యము ద్వారా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క నీడ ద్వారాను మనము యేసుక్రీస్తును తెలిసికొనగలుగుచున్నాము. ఆ ప్రజలు తమ పాప క్షమాపణను నిజసువార్తను తమ హృదయములో తెలిసికొనుటయే ఈ రక్షణ యొక్క సత్యమైయున్నది. వాస్తవముగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మం పొంది సిలువపై మరణించినట్టి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటతో నిన్ను రక్షించు ఆ నమ్మికను నీ హృదయంలో కలిగియుండవలెను. ఈ సత్యమే నిన్ను నీ పాపాలన్నిటి నుండి రక్షించినది.
దేవుని పరిశుద్ధ గృహములో మూడు ద్వారపు తెరలున్నవి. ఈ తెరలన్నియూ నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నారతో నేయబడినవి. నేను మరల మరల మీకు చెప్పుచున్నట్లే ఈ నాలుగు రంగులు దేవుని రక్షణను ఖచ్చితముగా చూపుచున్నవి. మనలను మన పాపము నుండి రక్షించుటకు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునార ద్వారా నెరవేర్చబడిన పాప క్షమాపణ యొక్క శాసనమును దేవుడు నియమించెను. కాబట్టి మనము ఈ పాపక్షమాపణ యొక్క శాసనమును అనుసరించిన నమ్మిన యెడల దేవుడు మన విశ్వాసమును అంగీకరించును. మన పాపాల నుండి మనలను శాశ్వతంగా రక్షించును.
నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములో బయలుపరచబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటతో మనలో ఎవరైననూ పాపము నుండి శాశ్వతంగా రక్షింపబడెదము. దేవుడు ఇచ్చిన బలి వ్యవస్థ యొక్క నిజప్రాముఖ్యతను తెలిసికొని, నమ్ముటతో ఎవరైననూ ఆయన యొద్దకు వెళ్ళగలరు. పరిశుద్ధ స్థల ప్రవేశ స్థలము యొద్ద, దేవుని గృహములో ఐదు స్తంభములున్నవి. నీలి, ధూమ్ర,రక్తవర్ణ దారములతో పేనిన సన్నపునారతో నేయబడిన ఒక తెర ఈ ఐదు స్తంభములపై నుండి వ్రేలాడదీయబడినవి. దేవుని యొద్దకు వెళ్ళుటకు ద్వారపు తెరకున్న నాలుగు రంగులలో బయలుపరచబడిన నాలుగు విశ్వాసము మనము కలిగి యుండవలెను.
నీలి దారములో చూపబడిన విశ్వాసము బాప్తిస్మం పొందుట ద్వారా యేసు మన పాపాలను అంగీకరించుటైయున్నది. ధూమ్ర, వర్ణపు దారములో చూపబడినది. యేసు పాపశిక్షను వహించి సిలువ వేయబడి తన రక్తమును కార్చెను. రక్తవర్ణములో చూపబడినది యేసు తానే దేవుడని నమ్ముట మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడినది ఆయన యొక్క విస్తార వాక్యమును నమ్ముట ఎట్లనగా ముందు చెప్పబడినదారము ద్వారా మన పాపములను తుడిచిపెట్టి దేవుడు మనలను పాప రహితులనుగా చేసెను. అనగా నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములతో ఈ సత్యమే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అలాగే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా యేసు మనలను రక్షించెనని విశ్వసించునట్లు మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలము. ఈ విశ్వాసముతో ఎవరైననూ ప్రత్యక్ష గుడార తలుపులు తెరచును మరియు పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలరు.
నీలి ధూమ్ర రక్తవర్ణదారములుతోనే నేయబడిన ప్రత్యక్ష గుడార ఆవరణ ద్వారము దేవుడు మనలను రక్షించుటకు గల ఆయన ప్రణాళికను మనము గుర్తించునట్లు చేయును. పాప క్షమాపణ నుండి వచ్చు మన రక్షణ దేవుడు ఏర్పరచినదని చూపును. అది మన స్వంత మానవ కల్పిత ప్రయత్నముల ద్వారా కాదు. ప్రతి దినము మన పాపమునకైన బలిఅర్పణ చేతులను ఉంచుట ద్వారా పాపమును మోపుట మరియు రక్తము కార్చుట అనునవి లేకుండా మన నిత్య పాపాల నుండి మనము రక్షించబడలేము. మన పాపాల నుండి మనలను రక్షింపవచ్చిన ఆ బలిపశువు లోకము యొక్క నిత్య పాపమును వహించుకొనినప్పుడే ఈ సత్యమును విశ్వసించుట ద్వారా మనము పూర్ణముగా రక్షింపబడెదము మరియు పాపక్షమాపణను పొందెదము.
సత్య సువార్తను నమ్ము విశ్వాసము మన హృదయంలో ఉన్నప్పుడు తప్పిపోయిన ప్రతి ఆత్మకు నిత్యజీవమును చేకూర్చు రక్షణ సువార్తను వ్యాప్తి చేయగలవు. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచిన యేసుని పరిచర్యను నమ్ముటచే పాపక్షమాపణ అను సత్యముతో మనము ఈ లోకమును వెలిగించగలము. పరిశుద్ధ స్థలములోని దీపవృక్షము ఏడు దీపములు కలిగియున్నది. ఆ దీపము వెలిగించబడినప్పుడు వాటి వెలుతురు బంగారము పొదిగిన పలకలతో చేయబడిన ప్రత్యక్ష గుడారపు గోడను ప్రతిబింబింపచేయును. అందుచే పరిశుద్ధ దీప వృక్షము లేనట్లయితే అది కేవలము చీకటిమయమైయుండును. ఈ కారణము చేతనే చీకటియైన ఈ లోకములో దేవుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మువారైన తన పరిశుద్ధులను పరిచారకులను ఉంచెను.
 

బంగారు దీప వృక్ష పాత్ర ఏమిటి?

ఆ బంగారు దీప వృక్షము మనకు తెలియజేయునదేమనగా సత్యమును నమ్ము విశ్వాసమును దేవుడు మనకిచ్చెను. అది లోకమునకు వెలుగాయెను. మన విశ్వాసము యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందెను. ఆయన సిలువలో రక్తము కార్చెనని నమ్మును. దేవుడు మనతో చెప్పునదేమనగా ఈ విశ్వాసంతోనే రక్షణ యొక్క సువార్తను పట్టుకొనినప్పుడు ఈ విశ్వాసమును ప్రచురించినప్పుడు, ఆ సమయములోనే సత్యము యొక్క వెలుగు ప్రకాశించును. అప్పుడు ప్రజలలా వెలుగు చూచి దాని యొద్దకు వచ్చి నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపునారతో ప్రభువు వారిని రక్షించెనని గ్రహించి దేవుని సొంత ప్రజలగుదురు. తండ్రియైన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వ్యూహపరచి నెరవేర్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యము యొక్క వెలుగై యున్నది.
యేసు ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందెను, సిలువ వేయబడి తన రక్తమును కార్చి చనిపోయెను. మరియు మన పాపాలన్నిటికి క్షమాపణ నిచ్చుటకు మృతి నుండి తిరిగి లేచెనని సత్యములో మనకున్న విశ్వాసముతోనే ఇంకనూ రక్షింపబడవలసినవారికి సువార్తను పొంది మన కొరకు బలియాయెను కదా నీవు నేను ఎప్పటికీ మరెన్నటికి మన పాపాల నుండి రక్షింపబడలేము.
యేసు బాప్తిస్మం పొంది రక్తమును కార్చి మన కొరకే బలియాయెను కనుక ఆయన పాపులను పాపము నుండి రక్షించగల విశ్వాసమును వారికిచ్చెను. ఇక్కడ మనము ఏదో ఒక తప్పుడు బోధనలను వ్యాప్తిచేయుట లేదు. ఈ లోకమంతటిలోను నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నార ద్వారా బయలుపరచబడిన రక్షణ యొక్క వెలుగును మనము వ్యాప్తి చేయుచున్నాము. మనకున్న విశ్వాసము యేసు యొక్క బాప్తిస్మమును ఆయన సిలువ త్యాగమును తెలిసి విశ్వసించునట్టి విశ్వాసమును కలిగియున్నాము కనుక మనము జీవపు వెలుగును హృదయమందు అంధకారముగల వారికి వ్యాప్తి చేయుచున్నాము. ఈ వెలుగుచే వెలిగించబడిన వారందరూ తమ హృదయాల నుండి పోయిన తమ పాపము యొక్క అద్భుత ఆశ్చర్యములను గూర్చి సాక్ష్యమును కలిగియుంటారు. ఈ లోక ప్రజలందరూ యేసు పొందిన బాప్తిస్మమును లోక పాపాలన్నిటిని తుడిచివేయుటకు ఆయన తన్ను తాను బలిగా అర్పించుకొన్న త్యాగమును తెలుసుకొని, ఇవే వారి పాపాలకు క్షమాపణ అని నమ్మి వారు సత్యము యొక్క వెలుగును కనుగొంటారు.
యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను? ఆయన ఎందుకు బాప్తిస్మం పొందాలి? ఆయన ఎందుకు సిలువపై మరణించాలి? ఆయన ఎందుకు మృతి నుండి తిరిగి మూడవ దినమున లేవాలి? వీటన్నిటికి కారణమేమనగా యేసుక్రీస్తే మెస్సయ్యగా రక్షణ క్రియలన్నీ నెరవేర్చుటకు యేసు బాప్తిస్మం పొందెను. తన రక్తమును కార్చెను. తద్వారా ఆయన పాపులకు రక్షణ వెలుగును చూపించెను. కాబట్టి ఈ లోకమంతటికీ రక్షణ యొక్క వెలుగును ప్రచురపరచుటతో అనేకులు ఈ సత్యమును తెలిసికొనునట్లు విశ్వసించునట్లు మరియు నిత్యజీవమును పొందునట్లుగా చేయగలము.
నీవు నేను ఈ లోకమును నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వెలిగించు దీప స్తంభముపై యున్నాము. మనము ప్రచురపరచుచున్న ఈ సువార్త ద్వారా ప్రజలు తమను రక్షించు సత్యము యొక్క వెలుగును తెలుసుకొనగలుగుతారు. ఈ అంధకార లోకములో వెలుగు కొరకు చూచుచున్నవారు మనము ప్రచురించుచున్న ఈ ప్రకాశమానమైన వెలుగును చూడగలుగుతారు. సత్య వెలుగులోనికి వస్తారు. తమ పాపాలన్నిటి నుండి విడిపించబడతారు. ఈ సత్యమును నమ్ము విశ్వాసంలోకి వచ్చుట వలన ప్రతి మనిషి రక్షింపబడతారు.
ఈ సువార్త థియరీకి సంబంధించిన విషయం కాదు. అలాగే మనం మన నిజ హృదయంతో విశ్వసించాలి. నీలి ధూమ్ర రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునారలో చూపబడిన యేసు యొక్క పరిచర్యను మనము నిజముగా నమ్మినపుడే ఈ సువార్తను ప్రచురించు క్రియలను చేయగలము. కానీ మనం పాపక్షమాపణ పొందినప్పటికి నూనె పోయునట్టి దీపము లేకుండా మనం ఎప్పటికి వెలుగును ఇవ్వలేము కనుక దేవుడు మనకు దేవుని సంఘమును ఇచ్చెను. అదే మన దీపస్తంభము దీప స్తంభము యొక్క ప్రతి కొమ్మపై మూడు కలశములున్నవి. వాటి క్రిందుగా నకిషి మొగ్గలున్నవి. దీని భావమేమనగా విశ్వాసము ద్వారా నిర్మించబడిన సంఘమే.
నిజముగా పాప పరిహారమును తమ హృదయంలో నమ్ముకొన్న వారందరూ సమావేశమయ్యే స్థలమే దేవుని సంఘము. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తే. సంఘము ఆయన యేసుక్రీస్తు ఆజ్ఞాపించునట్లు తన చేతులను కాళ్ళను కదలించును. ఈ విధముగా సువార్త పంచబడును. అప్పుడు దేవుని సంఘము దేనిని చూచును? అంధకార పాపములో కూరుకొనిపోయి లోకమంతయూ చనిపోవుచున్నది. వాటి మధ్య సంఘము తప్పించుకొనలేక నరక పాత్రులమైన ఆత్మలను చూచును? దేవుని సంఘము వారిని రక్షణ యొక్క వెలుగుతో నీవు నేను సువార్తయందున్న మన విశ్వాసముతో చేయుచున్నది ఇదే.
క్రైస్తవ్యానికి సుదీర్ఘ చరిత్ర కల సంఘాల్లో, బైబిల్‌ను చేర్చుకొని, అధిక జ్ఞానము కలవారు అనేకులున్నారు. అట్టి ప్రజలలో నిజ సత్యము కొరకు ఎదురుచూచుచున్నవారు ఈ సత్యమును తెలిసికొనగలరు. వారు ఒక్కసారిగా పాప పరిహారమును పొందుతారు. అట్టి ప్రజలకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను అందించుటకు తిరిగి జన్మించిన వారితో కలసి విశ్వాసంతో నేను పనిచేస్తాను.
ఎందుకనగా క్రైస్తవ్యము ఇతర మతము వలే వాక్యముపైనే దాని పునాది వేసినది ప్రజలు పాపక్షమాపణ పొందేది కేవలము మనము వాక్యమును సరిగా ప్రచురించినప్పుడే సాధ్యము. కానీ ఈ సత్యమునకు భయంకరముగా ఎదురు నిలుచువారు కలరు. కేవలము దానిని తెలిసికొని విశ్వసించినయెడల వారికి బోధించిననూ ఉపయోగము లేదు. ప్రత్యేకముగా దేవుని వాక్యమును విశ్వసించని మొండి భక్తులు అనేకులు కలరు. మరియు అట్టివారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఎన్నటికి విశ్వసించరు. కానీ బైబిలును దేవుని వాక్యముగా అంగీకరించువారి సంగతి ఏమటి? ఈ సువార్తను విని విశ్వసించుట ద్వారా అనేకులు పాప క్షమాపణ పొందగలరు.
నేను ఇట్టి నమ్మిక కలిగి మీతో కలిసి దేవుని సేవించుచున్నది. ఈ దినము వరకూ ఈ కారణముగానే రాబోవు దినాలలో అనేకమంది ప్రజలకు ఈ సువార్త ప్రచురించబడును మరియు సువార్త యొక్క గొప్ప క్రియలు జరుగును. వాస్తవ పరిస్థితి ఏమిటంటే దేవుడు క్రియలు చేయుచుండగా మనము చూడలేకపోవచ్చు. ప్రతి దినము వేలమంది ప్రజలు తమ పాపక్షమాపణ పొందుకొనుచున్నారు. నీ వలే, నా వలే అనేక ప్రజల సమూహాలు దీపములై నీలి, ధూమ్ర, వర్ణదారము మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడిన సువార్త రక్షణలో తమ హృదయము నమ్మికయుంచు నమ్మికతో లోకమంతటికి ప్రచురపరచెదరు. వారు లోకమంతటినీ వెలిగించుచున్నట్లే. నూతన విశ్వాసులు లేచుచూనే ఉంటారు. వారు కూడా తిరిగి ఈ సువార్తను అభివృద్ధి చేసి, ప్రచురించెదరు.
ఇప్పుడు దేవుని దీపములైయున్న మనము నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపు నారలో బయలుపరచబడిన సత్యమును విశ్వసించు మన నమ్మికతో రక్షణ యొక్క వెలుగును వెలిగించుచున్నాము. యేసుని బాప్తిస్మము యొక్క సత్యమును వెలుగునిచ్చు నీలిదారము అనగా యోహానుచే బాప్తిస్మం పొందుట ద్వారా యేసు ఈ లోకపాపాలన్నిటిని వహించెను. ధూమ్ర వర్ణ దారము యేసే రాజుల రాజు అను సత్యము యొక్క వెలుగును వెలిగించుచున్నది. రక్తవర్ణ దారము యేసు లోకపాపాలను సిలువ వరకు మోసెననియు దానిపై తన రక్తమును కార్చెనను సత్యము యొక్క వెలుగును ప్రకాశించుచున్నది మరియు పేనిన సన్నపునార దేవుని వాక్యము పాపులను నీతిమంతులనుగా చేసెనను సత్యము యొక్క వెలుగుతో వెలుగుచున్నది. దేవుడనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నారలో బయలుపరచబడిన సత్యము యొక్క వెలుగైయున్నది.
రెండవ రాకడ యొక్క ప్రభువై ఆయన ఈ లోకమునకు తిరిగి వచ్చుననియు మనలను సజీవులనుగా చేయును. వెయ్యేండ్ల రాజ్యములో ఆయనతోపాటు ఏలునట్లు చేసి నిత్య రాజ్యమైన దేవుని రాజ్యములో ప్రవేశించునట్లుగా చేసి శాశ్వత జీవమునిచ్చునని కూడా ఈ సువార్త చెప్పుచున్నది. నిత్యజీవము అనగా ఏమి నీవు ఊహించవచ్చును?
ఈ విశ్వము ఎంతో విశాలమైనది మరియు విస్తరించునది సైంటిస్టులు చెప్పునదేమనగా నక్షత్ర వ్యవస్థఫై మరొక నక్షత్ర వ్యవస్థ ఉన్నది. మన సూర్య వ్యవస్థ వెనుక లెక్కలేనన్ని గెలాక్సీ మరియు పాల పుంతలు ఉన్నవి. దేవుడు సృజించిన విశ్వాసము యొక్క పాలకులు అత్యద్భుతముగా నియమించబడినవి. మనకు తెలిసియున్న విశ్వమునకు వెనుక గెలాక్సీ అంతటా ఉన్న లెక్కలేనన్ని వ్యవస్థలు మనకు తెలియవు. ఇప్పుడు రాలిపడుచున్న తారల గ్రహశకములై యున్నవి. అవిలోపలున్న గెలాక్సీ నుండి ఎప్పుడో బిలియన్ల సంవత్సరాల క్రితమే ముక్కలైయున్నవి. ఇవి ఇప్పటికి భూ వాతావారణమును చేరి మండుచున్నవి.
అనగా మనము బిలియన్ల సంవత్సరాల క్రితమే జరిగినవాటికి అవి ఇప్పుడు సాక్షులైనవి. అలాగే దేవునిచే సృజించబడిన ఈ విశ్వము యొక్క అనంత విభాగము ఇప్పటికీ తెలియకుండానే మిగిలినవి కానీ విశ్వమే మనకు తెలియకున్ననూ దేవునికి అది అరచేతి అంత చిన్నదైయున్నది. దేవుడు సర్వాంతర్యామి సర్వశక్తిగలవాడు. ఆయనే సమస్తమును సృజించి విశ్వమునకు ఒక క్రమమును ఏర్పరచెను.
మనము లోకమును సత్యము యొక్క వెలుగుతో వెలిగించుచున్నాము. అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముటతో అందరూ శాశ్వతముగా పాపపరిహారమును పొంది నిత్యజీవమును అనుభవించెదము. దేవుని పిల్లలు యేసుక్రీస్తుతో నిత్యము జీవించుటకు తమను అనుమతించు ప్రకాశమానమైన జీవపు వెలుగును కలిగియున్నారు. దేవుడు ఎల్లప్పుడు మనతో జీవించును. ఆయన ఆనందమును పొందునట్లు మనలను అనుమతించును మరియు తన మహిమతో మనలను కప్పును ఎందుకు? ఎందుకనగా మనము ఆయన శక్తియైన ఆయన సువార్త యొక్క వెలుగును నమ్ముచున్నాను. ఒకసారి మనము ఈ సత్యమును మనం తెలుసుకొనునట్లు చేసిన వెలుగును కనుగొన్న తరువాత ఈ వెలుగును ఇతరులకు ప్రకటించకుండా ఉండలేము.
మరియు ఈ విశ్వం అంతటా పనిచేయుచున్న దేవుని యొక్క సర్వశక్తిని చూచినప్పుడు ఆయన క్రియలలో మనకున్న విశ్వాసము ఎక్కువ కాక మానదు. కొన్ని నక్షత్రాలు కొన్ని బిలియన్‌ సంవత్సరాల క్రితమే అంతరించవచ్చు కానీ ఇప్పటికి మన కన్నులు వాటిని చూడగలుగుతున్నాయి. ఎట్లనగా అవి ఈ గ్రహానికంటే ఎన్నో బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనం విశ్వము యొక్క అనంతాన్ని చూచినప్పుడు నిత్యత్వమును గూర్చిమనము ఊహించవచ్చును.
ఇప్పుడు దేవుని సంఘములో భాగమైన మనము సువార్త వెలుగును వ్యాప్తి చేయుచూ జీవించాలి. ఎందుకనగా నీలి, ధూమ్ర, రక్తవర్ణదారాలలో బయలుపరచబడిన సత్యమైన దీవెనలకు జీవితమునకైన నమ్మినిచ్చుచున్నది. మనుష్యులందరూ సత్యమును గూర్చిన జ్ఞానము తెలిసికొని, రక్షించబడవలెనని దేవుడు కోరుచున్నాడని (1తిమోతి 2:4) మనకు తెలియును. కాబట్టి రక్షణ వెలుగు తెలిసినవారు దేవుడు తమకు అప్పగించిన సవాలైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రకటించుటకు కొనసాగించవలెను.
ఈ పని మనము చేయగలుగునట్లు దేవుడు మనలను దీవించెను. ఈ సత్యము ఎంత గొప్ప దీవెనో తెలిసికొనిన మనము చేయదగిన మంచి ఏదనగా మనకు అప్పగించబడిన సవాలును విశ్వాసముతో కొనసాగించుటయే. మీరందరూ దేవుని యొక్క సత్యమును తెలిసికొను వెలుగుతో మీ హృదయమును నిలుపుకొంటారని నేను నమ్ముచున్నాను. దేవుని సన్నపునారలో బయలుపరచబడిన రక్షణ యొక్క పరిచర్యలను నమ్మినాము. మరియు లోకమంతటికి మనము రక్షణ వెలుగైనాము. లోకమంతటిని వెలిగించిన వారమైనాము హల్లెలూయ! కృతజ్ఞత అంతయూ దేవునికే చెల్లించుచున్నాను.