• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 10: ప్రకటన గ్రంధం (ప్రకటనగ్రంధం పై నున్న వ్యాఖ్యానాలు)

[అధ్యాయము 5-1] తండ్రియైన దేవుని ప్రతినిధిగా సింహాసనం అధిష్టించిన యేసు (ప్రకటన 5: 1-14)

(ప్రకటన 5: 1-14)
‘’మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనము నందు ఆసీసుడైయుండు వాని కుడిచేత చూచితిని.మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగాచూచితిని. అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగాఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడుముద్రలను తీసి ఆగ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతోచెప్పెను. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులునుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను. ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణలను,ధూపద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు;
నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, 
నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, 
ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, 
ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, 
దేవునికొరకు మనుష్యులను కొని, 
మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; 
గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను. 
వారువధింపబడిన గొఱ్ఱపిల్ల, 
శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు
మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
అంతట పరలోకమందును భూలోకమందును 
భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతిసృష్టము, 
అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైయున్న వానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.’’
 
 
వ్యాఖ్యానం
 
1 వ వచనం: “మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహా సనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.”
తండ్రి దేవుని కుడిచేతిలో ఏడు ముద్రలతో చుట్టబడిన గ్రంధపు చుట్ట ఉందని ఇక్కడ పేర్కొంది. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి చేతిలో ఉంచిన ఈ గ్రంధపు చుట్ట తీసుకున్నాడు, అనగా యేసుకు పరలోకం మీద అధికారం ఇవ్వబడింది.
 
2-4 వ వచనాలు: “మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా’’.
 ప్రపంచాన్ని తీర్పు తీర్చగల, క్రొత్త ఆకాశమును, భూమిని సృష్టించగల తండ్రి అయిన దేవుని ప్రతినిధిగా, పరిశుద్ధులతో నివసించగల యేసు తప్ప మరెవరూ లేరు.
5 వ వచనం: “ఆ పెద్దలలో ఒకడుఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.’’
ఇక్కడ, “యూదా గోత్రపు సింహం, దావీదు యొక్క చిగురైన వేరు మరియు మూలం” అనే పదం యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు తండ్రి ప్రణాళికను పూర్తిగా నెరవేర్చగల యోగ్యమైన మరియు రాజుల రాజు అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. యేసుక్రీస్తు దేవుడు మరియు తండ్రి ప్రణాళికను నెరవేర్చగల దేవుని ప్రతినిధి.
6 వ వచనం: “మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులునుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు’’.
యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుని నుండి పరలోకం పై మరియు భూమిపై సర్వ అధికారాన్ని పొందాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. మానవ ఆకారముతో ఈ భూమి మీదకు వచ్చినవాడు, ప్రపంచంలోని అన్ని పాపాలను అందుకున్నాడు, మన పాపాలన్నిటి నుండి మనలను విమోచించడానికి ఈ పాపాల కోసం మరణించాడు.
7 వ వచనం: “ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.’’
యేసుక్రీస్తు దేవుడిగా అర్హత పొందినందున, ఆయన తండ్రి నుండి ఆ గ్రంధపు చుట్టను తీసుకోవచ్చు. దీని అర్థం, తీసుకున్నప్పటి నుంచి, మన ప్రభువు దేవుని పనులన్నీ చేయునని అర్ధం.
8 వ వచనం: “ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు’’.
దీని అర్థం యేసుక్రీస్తు తండ్రి కొరకు దేవుడిగా వ్యవహరించును, మొదటి దీని పని 24 మంది పెద్దలు మరియు నాలుగు జీవులచే అందించబడిన పరిశుద్ధుల ప్రార్థనలను వినడం.
 
9 వ వచనం: “ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,”
ఇక్కడ, యేసుక్రీస్తు దేవుని ప్రతినిధి అయిన తరువాత పరలోకపు సేవకులచేత ప్రశంసించబడ్డాడు.ప్రపంచంలోని పాపాల నుండి ఈ భూమిపై పాపులను రక్షించినందుకు పరలోకపు సేవకులు యేసుక్రీస్తును ప్రశంసించారు. ఈ భూమిపై ఉన్నప్పుడు, యేసు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు మరియు ప్రపంచంలోని అన్ని పాపాల నుండి పాపులను రక్షించడానికి సిలువపై మరణించాడు, మరియు పాపపు వేతనాలను తన రక్తంతో చెల్లించి తండ్రి కోసం ఈ పాపులను విమోచన చేశాడు. ఈ కారణంగానే పరలోకపు సేవకులు తమ దేవుడిగా మారిన వారి నీతి పనులను ప్రశంసిస్తున్నారు.
10 వ వచనం: “మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.’’
తండ్రి అయిన దేవుని ప్రతినిధిగా మారిన యేసుక్రీస్తు, పరిశుద్ధులను దేవుని రాజ్యం యొక్క ప్రజలగాను మరియు యాజకులుగాను చేయును మరియు వారిని రాజ్యం పై అధికారం చేయుటకు అవకాశమిచ్చును.ఆయన పరలోకపు సేవకులు నుండి సకల కీర్తి మరియు ప్రభావంను పొందటానికి మరింత అర్హుడు.
11-12 వచనాలు: ”మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను. వారువధింపబడిన గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.’’
యేసు తన బాప్తిస్మం ద్వారా ప్రపంచంలోని సమస్త పాపాలను తన బాప్తిస్మం ద్వారా తన పైకి తీసుకున్నందున, ఆయన సిలువపై రక్తం చిందించగలిగెను, మరియు దీని కోసం ఆయన నిత్య శక్తియు, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, గౌరవం, కీర్తి మరియు ఆశీర్వాదం పొందటానికి అర్హుడు. పరలోకంలో ఉన్న సకల జీవులు తండ్రిని సూచించే వ్యక్తిగా. చుట్టుపక్కల పరలోక యొక్క సేవకులు మరియు దాని దేవదూతలు, ద్వారా ఆయన వారి స్తుతులు మరియు ఆరాధనలన్నింటినీ అందుకుంటారు. హల్లెలూయా! దేవునికి నమస్కారము! దేవుని సింహాసనం చుట్టూ నలుగురు జీవులు మరియు 24 మంది పెద్దలు ఉన్నారు. పాపం నుండి విడిపించబడిన ఆత్మలన్నియు దేవుణ్ణి స్తుతించారు, ఎందుకంటే ఆయన మహిమ అంతులేనిది.
13-14 వ వచనం: “అంతట పరలోకమందును భూలోకమందును భూమిక్రిందను సముద్రములోను ఉన్న ప్రతిసృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైయున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.’’
చివరగా, దేవుని ప్రతినిధిగా మారిన యేసుక్రీస్తు పరలోకం యొక్క సేవకులు నుండి సమస్త స్తుతులు మరియు ఆరాధనలను స్వీకరించడానికి అర్హుడు. పరలోకం యొక్క సేవకులందరూ ఆయనకు శాశ్వత ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు చెల్లించిరి, ఎందుకంటే దేవుడు ఎంతో యోగ్యుడు కావడం చాలా అద్భుతమైనది .పరలోకములోను మరియు భూమిపై ఉన్న పరిశుద్ధులందరూ దేవుని ప్రతినిధిగా సింహాసనం పొందిన ఆయనకు కీర్తి మరియు మహిమ ప్రభావములు చెల్లించెదరు.