• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 11: ప్రత్యక్ష గుడారం

[11-23] పాపుల యొక్క రక్షణ (నిర్గమకాండము 27: 9-21)

(నిర్గమకాండము 27: 9-21)
‘’మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను.కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి.ఆ స్తంభముల వంకులును వాటి పెండె పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభ ములు పది వాటి దిమ్మలు పది. తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. రెండవ ప్రక్కను పదునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు. ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించుము.సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.’’
 

 చతురస్రాకార ఆవరణము యొక్క ప్రత్యక్షపుగుడారం కంచె నూరు మూరలు పొడవు కొలవబడింది. బైబిల్ లో ఒక మూర అనేది ఒకరి మోచేతి నుండి అతని వ్రేలు వరకు పొడవు ,ఈ నాటి కొలత ప్రకారం 45 సెంటి మీటర్లు. అలాగే ,ఆవరణము యొక్క ప్రత్యక్షపుగుడారం కంచె నూరు మూరలు పొడవు అనగా 45 మీటర్ల,వెడల్పు50 మూరలు అనగా దాదాపు 22.5 మీటర్ల వెడల్పు.కావున దేవుడు పాతనిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన గుడారం యొక్క పరిమాణం ఇది.


ప్రత్యక్షపుగుడారo యొక్క ఆవరణం చుట్టూ కంచెతో నిర్మించబడింది 

 ప్రత్యక్షపుగుడారం యొక్క నమూనా రూపాన్ని లేదా చిత్రించటాన్ని ఏదైనా సమయములో చూసారా? మరింత విపులంగా,ప్రత్యక్షపు గుడారము ఆవరణముగాను మరియు గుడారముగాను దానికదే దేవుని యొక్క ఇంటిగా విభజించబడింది. ఈ దేవుని ఇంటి లోపల,పరిశుద్ధస్థలముగా పిలువబడే చిన్న ఆకారము ఉన్నది. ఈ పరిశుద్ధస్థలము నాలుగు రకాల వివిధ తెరలతో కప్పబడి ఉంటుంది:ఇందులో ఒక తెర నీలం,ఊదా, రక్తవర్ణము గల దారం మరియు సన్నని పేనిన నారతో కప్పబడింది: మరొకటి మేక వెండ్రుకలతో,ఎరుపు రంగు పొట్టేళ్ల తోళ్ల తోను: మరియు సముద్రవత్సల తోళ్లతోను కప్పబడి ఉన్నాయి. 
 ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణపు తూర్పు దిక్కున వాటి ద్వారములు నేసిన నీలం,ఊదా ,మరియు రక్తవరణముగల దారం మరియు సన్నని పేనిన నారతో కనుగొనబడెను, ఈ ద్వారం గుండా ఒకరు ప్రవేశించినట్లైతే,దహనబలి యొక్క బలిపీఠము మరియు గంగాళమును మనము చూడగలము.గంగాళమును దాటుతుండగానే, ప్రత్యక్షపుగుడారమును చూడగలము. ప్రత్యక్షపుగుడారము పరిశుద్ధస్థలముగాను మరియు అతి పరిశుద్ధస్థలముగా విభజించబడెను, ఇక్కడే దేవుని సాక్షపు మందసము ఉంచబడియున్నది. గుడారము ఆవరణము యొక్క కంచె ఆరవై స్తంభాలతో నిర్మించబడి నేసిన తెల్లని దారంతో వ్రేలాడదీయబడెను. ప్రత్యక్షపుగుడారము, మరొక విధంగా, 48 పలకలతోను మరియు తొమ్మిది స్తంభాలతో నిర్మించబడింది. మనకు ప్రత్యక్షపుగుడారము యొక్క బయటి విషయాలను గూర్చిన కనీస అవగాహన కొంతఉండాలి. ఎందుకంటే దాని నమూనా ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నాడో అర్ధం చేసుకోవటం కోసం.
 దేవుడు 48 పలకలతో నిర్మించబడిన ప్రత్యక్షపుగుడారము లోపల నివసించును. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన సన్నిధిని పగలు మేఘ స్తంభములోను మరియు రాత్రి అగ్ని స్తంభముగాను ప్రత్యక్షపుగుడారమునాకు పైగా కనపరచుకున్నాడు. మరియు పరిశుద్ధస్థలము లోపల,ఆయన నివసించు స్థలము దేవుని మహిమతో నింపబడింది. పరిశుద్ధస్థలము లోపల,సన్నది రొట్టెల బల్లయు, దీపస్తంబము,మరియు దూప వేదిక యొక్క బలిపీఠం,అతిపరిశుద్ధస్థలము లోపల సాక్షపు మందసము మరియు కరుణాపీఠమును ఉన్నవి. సామాన్య ఇశ్రేయేలు ప్రజలకు ఇవి పరిమితి స్థలములు మాత్రమే;యాజకులు మరియు ప్రధాన యాజకులు మాత్రమే ఈ పరిశుద్ధస్థలములలోకి ప్రత్యక్షపుహుడారం యొక్క క్రమమును బట్టి ప్రవేశించుదురు. ఇది ఇలా వ్రాయబడింది,``ఇవి ఈలాగు ఏర్పరచబడి నప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని సంవత్సరమునకు ఒక్క సారిమాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును.ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును``(హెబ్రీయులు 9:6-7). ఇది ఈ కాలాన్ని తెలియజేస్తుంది, బంగారము వంటి విశ్వాసము ఉన్నవారు అనగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసమున్నవారు మాత్రమే దేవుణ్ణి సేవిస్తూ ఆయనతో వారి జీవితాన్ని గడపగలరు.
 సన్నిధి రొట్టెల బల్ల మీద ఉంచబడిన రొట్టె యొక్క అర్థమేమిటి ?దీని అర్ధం దేవుని యొక్క వాక్యము. అలాగే దూపవేదిక బలిపీఠం యొక్క అర్థమేమిటి ?ఇది మన ప్రార్థనలను తెలియజేస్తుంది.అతిపరిశుద్ధస్థలము లోపల,సాక్షపు మందసము ఉండెను మరియు కరుణాపీఠము,పూర్తిగా బంగారముతో చేయబడి, మందసము పైన ఉంచబడెను. కెరూబుల యొక్క రెండు రెక్కలు చాపబడి,కరుణాపీఠనికి ఒకదానికొకటి ఎదురెదురుగా వాటి ముఖములు ఉంచబడెను. ఈ కరుణాపీఠం నుండి,దేవుడు తన కృపను అనుగ్రహించును. మందసములోపల, పదిఆజ్ఞలు చెక్కబడిన,రెండు రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర, మన్నతో నింపబడిన ఒక పాత్రయు ఉంచబడెను. మందసము బంగారముతో పొడిగించబడింది(కరుణాపీఠము),మరియు పైన ఉంచబడిన రెండు కెరూబులు కరుణాపీఠము వైపు చూస్తూ ఉండును.


వారు జీవించు చున్న పాపముల నుండి విడుదల ఎక్కడ పొందియున్నారు

 పరిశుద్ధస్థలము లోపల జీవించు చున్న పాపముల నుండి వారు విడుదల పొందియున్నారు. ఈ పరిశుద్ధస్థలము 48 పలకలతో నిర్మించబడి,పూర్తిగా అంతయు బంగారముతో చేయబడింది. దీని గురుంచి ఆలోచించు. నీవు ఆ బంగారపు గోడలను చూచినప్పుడు చిన్నదియు కాక,48 బంగారపు పలకలతో చేయబడింది. ఇది ఎంత గొప్పగా ప్రకాశిస్తుంది?పరిశుద్ధస్థలము లోపలి భాగమంతయు మరియు దాని యొక్క వస్తువులన్నియు,ఈ విధముగా బంగారముతో చేయబడి, ప్రకాశవంతముగా ప్రకాశించును.
 దహనబాలి బలిపీఠం మరియు ప్రత్యక్షపుగుడార ఆవరణము వెలుపల ఉన్న గంగాళమును ఇత్తడితో చేయబడెను,ఆవరణము యొక్క కంచె యొక్క స్తంభాలు వెండితోను మరియు నేసిన తెల్లని నారతో తయారు చేయబడింది. దీనికి వ్యత్యాసంగా,పరిశుద్ధస్థలము లోపల పాత్రలన్నియు బంగారముతో చేయబడ్డాయి; దీపవృక్షము బంగారము నుండి వేరుచేయబదిండి,మరియు అలాగే సన్నది రొట్టెల బల్ల కూడ.పరిశుద్ధస్థలములో ఉన్న అన్ని వస్తువులు వాటి మూడు ప్రక్కల -గోడలు పూర్తిగా బంగారముతో చేయబడెను. పరిశుద్ధస్థలము లోపల అనునిత్యం బంగారము యొక్క కాంతితో ప్రకాశవంతముగా ప్రకాశిస్తుంది.
 పరిశుద్ధస్థలము లోపల ప్రకాశించే బంగారము యొక్క కాంతి రక్షించబడిన పరిశుద్ధులు దేవుని సంఘములో విశ్వాసముతో జీవించు ప్రశస్తమైన జీవితాల పోలికను తెలియజేస్తుంది.నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసముంచు పరిశుద్ధులు పరిశుద్ధస్థలము లోపల ఉన్న స్వచ్ఛమైన బంగారమును పోలియున్నారు. పరిశుద్ధస్థలము సంఘము లోపల నివసించు పరిశుద్ధులు యొక్క జీవితాలు దీవించబడిన జీవితాలు,వారు దేవుని వాక్యము చేత పోషించబడుతూ, ఆయనకు ప్రార్థనలు స్తుతులు చెల్లిస్తూ, ప్రతి రోజు ఆయన కృపను ధరించుచు దేవుని సింహాసనము యొద్దకు చేరదము. ఇది అంతయు ఆయన సంఘము ద్వారా జరుగును. పరిశుద్ధస్థలము లోపల జీవించు విశ్వాస జీవితాలు ఈ విధంగా ఉండును. నీతిమంతుడు మాత్రమే నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా రక్షించబడిన వాడు పరిశుద్ధస్థలములో ప్రశస్తమైన విశ్వాస జీవితమును గడపగలడు. దీనిని తప్పక మీ హృదయాలలోనికి తీసుకొనవలెయును.


దేవుడు పరిశుద్ధస్థలమును లోపలను బయటను స్పష్టముగా విభజించెను

 అనేక ఇండ్లకు కంచెలు ఉన్నట్లే, ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణము కూడా ఆరవై స్తంభాలతో చుట్టూతా నేసిన తెల్లని నారతో వ్రేలాడదీయబడెను. ఆవరణము యొక్క తూర్పు దిక్కున, ద్వారము యొక్క తెర నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార అమర్చబడి,అందరు చూచుటకు,తొమ్మిది మీటర్లు పొడవుగా కొలవబడినది.
 ప్రత్యక్షపుగుడారము యొక్క అద్యాయములో, దేవుడు మన నుండి ఏలాంటి ప్రకాశవంతమైన విశ్వాసమును కోరుచున్నాడో, మనం స్పష్టముగా తెలుసుకోవలెయును.ఎలాంటి విశ్వాసము రక్షించబడిన విశ్వాసము,మరియు ప్రభువు ప్రత్యక్షపుగుడారానికి వాడిన వస్తువుల ద్వారా ప్రభువు మనలను ఎలా రక్షించాడో తప్పకచూడగలము. పరిశుద్ధస్థలము లోపల బంగారం యొక్క ఈ విశ్వాసము మరియు ఆకర్షణీయమైన ఈ విశ్వాసమును ఏమైయున్నదో నేర్చుకొనవలెను. దహనబలి బలిపీఠం,గంగాళమును మనము తప్పక జాగ్రత్తగా చూడవలెను. ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణం వెలుపల కంచె వేయబడింది. వాటికి ప్రతి వస్తువు ఉపయోగించబడింది. అలా చేసినట్లయితే కానీ, ప్రకాశవంతమైన పరిశుద్ధస్థలములోకి ప్రవేశించటానికి ఎలాంటి విశ్వాసము అవసరమో మనము తెలుసుకొనగలము.
 ప్రత్యక్షపుగుడారం యొక్క వెలుపల ఆవరణములో ఏమున్నది?అక్కడ గంగాళమును మరియు దహనబలి బలిపీఠం ఉన్నది. మరియు ఇది చుట్టూతా అరవై చక్క స్తంభాలతో నేసిన నారతో ఆవరణము యొక్క కంచెలో వ్రేలాడదీయబడెను. కంచె యొక్క స్తంభాలు తుమ్మ కర్రతో చేయబడి, ఇది బరువు తగ్గించబడి తేలిక చేయబడింది. ఈ స్తంభాలు చెక్కతో చేయబడి సుమారు 2. 25 మీటర్లు ఎత్తును, ప్రత్యక్షపుగుడారం లోపలకు ఆవరణం యొక్క వెలుపల కంచె నుండి తొంగి చూచుటకు సాధారణ ఎత్తుకంటే మరింత ఎత్తుగా చూడలేని విధంగా తయారు చేయబడింది.కానీ ఉద్దేశపూర్వకంగా ఈ గోడలకు మెట్లు ఉంచినట్లయితే, బహుశా ఎవరైనా ఆవరణము లోపలి చూడగలరు. ఆ విధమైన సహాయము లేకుండా లోపలికి తొంగి చూచుట అసాధ్యమైనది. ఇది మనకు మనిషి-చేయు స్వయం కృత పనులను తెలియజేస్తుంది,ఈ విధంగా మనము ఎన్నడును పరలోకరాజ్యములో ప్రవేశించలేము.
 ఆవరణం వెలుపల చెక్కతో చేయబడిన స్తంభాలు చివరి అడుగున, ఇత్తడి రంధ్రాలు ఉంచబడ్డాయి, మరియు పై భాగమున వెండి మూతలతో కప్పబడ్డాయి. స్తంభాలు వాటికి అవే స్థిరముగా నిలబడలేవు, వెండి త్రాడులు స్తంభాలు ఒకదానికొకటి తగలకుండా సరిచేయబడి స్థిరముగా ఉండునట్లు కట్టబడును. మరియు స్తంభాలు ఎదురెదురు దిశలో గట్టిగా నిర్మించబడ్డాయి.వెండి మేకులు స్తంభాలు యొక్క వెండితో పొదగబడి ఇత్తడి దిమ్మలకు త్రాడులతో కట్టబడెను.


ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణ ద్వారమునకు ఏ వస్తువులు ఉపయోగించారు

 ప్రత్యక్షపుగుడారం యొక్క ఆవరణ ద్వారమునకు ఉపయోగించిన వస్తువులు నీలం ,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార. ద్వారము యొక్క ఎత్తు 2.25 మీటర్లు, మరియు దాని వెడల్పు తొమ్మిది మీటర్లు ఉండెను. నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార, నాలుగు స్తంభముల మీదుగా తెర వలె వ్రేలాడదీయబడెను. అలాగే, ఎవరైనా ప్రత్యక్షపు గుడారము లోపలికి ప్రవేశించుటకు ప్రయత్నించినప్పుడు, దాని ద్వారమును తేలికగా చూచెదరు.
 ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణం ద్వారమునకు నీలం ,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార అను వస్తువులను ఉపయోగించిరి, దీని ద్వారా దేవుడు ఆయన కుమారుడైన యేసు ఆయన నాలుగు రకాల పరిచర్య ద్వారా రక్షించాలనుకున్నాడు. చెక్కతో చేయబడిన ఆరవై స్తంభాలు మరియు ప్రత్యక్షపుగుడార ఆవరణం యొక్క సన్నని పేనిన నార కూడా స్పష్టముగా చూపిస్తుంది,ఏ విధముగా దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా నిన్ను మరియు నన్ను రక్షించునది.
 గుడారము యొక్క ఆవరణ ద్వారము గుండా, మరొక మాటలో,దేవుని యొక్క రక్షణ మర్మమును మనకు స్పష్టముగా బయలుపరిచాడు.గుడారము యొక్క ఆవరణ ద్వారమునకు ఉపయోగించిన వస్తువుల దగ్గరకు మరల ఒకసారి వెళ్ళివద్దాము: నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార. ఈ నాలుగు దారములు కష్టతరమైనను యేసు నందు విశ్వాసముంచుట ద్వారా మనం రక్షించబడుటకు ప్రాముఖ్యమైనది. ఈ వస్తువులు ప్రాముఖ్యం కాకపోతే, బైబిల్ వాటి గురించి మరింత వివరముగా పొందపరిచేది కాదు.
 గుడార ఆవరణ ద్వారమునకు ఉపయోగించని అన్ని వస్తువులు నిన్ను మరియు నన్ను రక్షించుటకు సంపూర్ణముగా అవసరమైనవి. ఏదేమైనను,వాస్తవానికి ద్వారము నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార ద్వారా అపజయము లేకుండా పాపులను రక్షించుట దేవునికి అతి ముఖ్యమైనది. ఈ నాలుగు దారాలు దేవుని యొక్క సంపూర్ణ రక్షణ యొక్క ప్రత్యక్షత. దేవుడు దీనిని ఈ విధంగా నిర్ణయించాడు. అందుకనే దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద గుడారము యొక్క నమూనాను చూపించి,గుడారము యొక్క ఆవరణ ద్వారమును చూపబడిన కచ్చితమైన ప్రణాళిక ప్రకారము చేయమని చెప్పాడు.  


నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార దేనికి పోలికగా ఉన్నాయి

 పరిశుద్ధస్థలము ద్వారమునకు తెరగా నేసిన నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార తయారు చేయబడింది, మరియు పరిశుద్ధస్థలము మరియు అతి పరిశుద్ధస్థలము మధ్య యొక్క ముసుగు నేసిన ఈ నాలుగు దారాలతో తయారు చేయబడింది. అంతేకాక, ఏఫోదు మరియు ప్రధాన యాజకుని న్యాయపథకం కూడా నేసిన నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో చేయబడ్డాయి. నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార దేనిని సూచించును మరియు మనకేమి చెప్పుచున్నవి? నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార ఖచ్చితముగా ఏమైయున్నవి, మనలను రక్షించుటకు దేవునికి ఇవన్నీ సంపూర్ణముగా అవసరమైనవని, దేవుడు మనకు చెప్పాడా? మనం కచ్చితంగా ఈ విషయాలను దగ్గరగా పరిశీలించాలి.
 మొదటిగా,నీలిరంగు దారం యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మమును తెలియజేస్తుంది. బాప్తీస్మం యొక్క ప్రాముఖ్యత తెలియని వారికి నీలిరంగు దారం యేసుక్రీస్తు బాప్తిస్మమును సూచిస్తుందని తెలియదు. అటువలె, తిరిగి జన్మించని వారు సాధారణంగా నీలిరంగు దారం యొక్క అర్థాన్ని,``యేసుక్రీస్తు తానే దేవుడైయున్నాడు, మరియు మానవుని ఆకారంతో ఈ భూమ్మీదకు వచ్చాడని చెప్పుదురు``. మరికొందరు ఈ విధముగా చెప్పుదురు,``నీలిరంగు దారం అనగా వాక్యము.’’ ఏదేమైనను, నీలి రంగు దారము అనగా యేసు ఈ భూమ్మీదకు వచ్చినప్పుడు బాప్తీస్మం ద్వారా ఈ లోక పాపములన్నియు తన పైకి అంగీకరించాడు.``మనకు లేఖనాలు స్పష్టముగా నీలి రంగు దారము బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యేసు పొందిన బాప్తిస్మమును సూచిస్తుంది.గుడారమును గూర్చి వాక్యం చదువుచూ, నేను గ్రహించితిని,``ఆహా,యేసు బాప్తీస్మం పై మనం విశ్వాసముంచుట ఎంత ప్రాముఖ్యమో దేవుడు మనకు చూపించుటకు ఇష్టపడ్డాడు.``
 ప్రధాన యాజకుడు బలులు అర్పించునప్పుడు ధరించు వస్త్రము కూడా నీలం యొక్క దారంతో నేసినది. యాజకుడు తలపాగాపై ధరించు ఒక బంగారం యొక్క ఫలకం తలపాగకు పై కట్టినది కూడా నీలిరంగు దారమే. మరియు ఈ బంగారం యొక్క ఫలకం మీద,``దేవుడు పరిశుద్ధుడు``,అని చెక్కబడింది. యాజకుడు ధరించిన తలపాగాకు కట్టబడిన బంగారము యొక్క ఫలకం ప్రభువుకు యేసు బాప్తీస్మం ద్వారా పరిశుద్ధతను కలిగిస్తున్నదని మనము స్పష్టముగా చూడగలము.
 ఈ విధముగా, నీలిరంగు దారంతో ఈ బంగారు పలకను తలపాగాను కట్టటం అనేది దేవుడు మన నిజమైన రక్షణ గురించి మాట్లాడతాడు. మరొక మాటలో,మనకు పరిశుద్దతను ఇచ్చు ఈ ప్రధాన నీలం అనునది యేసు యొక్క బాప్తిస్మమైయున్నది. నీలి రంగు సాధారణంగా మనకు ఆకాశం యొక్క నీలిరంగును గుర్తు చేసినప్పటికీ, నీలం కేవలం దేవునికి మాత్రమే వర్తించదు. నీలం,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార,నీలి రంగు దారం ఖచ్చితముగా యేసుక్రీస్తు యొక్క బాప్తీస్మం యొక్క అర్థాన్ని ఇస్తుంది. దీనిని ప్రత్యేకంగా ఉంచినట్లయితే, నీలం యొక్క దారం యేసుక్రీస్తు ఈ లోకములోని సమస్త పాపుల యొక్క పాపములను తన బాప్తీస్మం ద్వారా తీసుకున్న దానిని మనకు చెప్పుచున్నది (మత్తయి3:15). యేసు బాప్తీస్మం తీసుకోవటం ద్వారా అందరి పాపములను తీసుకోలేదా, విశ్వాసులమైన మనము ``దేవునికి పరిశుద్దతను`` ఇవ్వలేము. యేసు పొందిన బాప్తీస్మం నుండి మనం బాప్తీస్మం పొందలేదు,దేవుని యెదుట మనం ఎన్నడూ పరిశుద్దతను ధరించలేము.
 దేవుడు మోషేకు చూపించి ఆజ్ఞాపించిన ప్రకారం ప్రత్యక్షపుగుడాపు ఆవరణం యొక్క ద్వారము నమూనాను నీలిరంగు దారంతో నేసిన దాని ఆధ్యాత్మిక అర్ధం మీకు తెలుసా?ఆవరణ ద్వారము నుండి ప్రత్యక్షపుగుడారము లోపలి దేవుడు నివసించు స్థలం యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యం ప్రవేశించలేడు. ఆవరణం యొక్క ద్వారం, యేసును సూచిస్తుంది, నీలం,ఊదా ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార, కారణంగా దేవుడు మనలను రక్షణలోకి నడిపించు స్పష్టముగా సత్యాన్ని బయలపరచాలని కోరుతున్నాడు. ఊదా దారం పరిశుద్ధాత్మను సూచిస్తుంది, అది మనకు, ``యేసు రాజుల రాజు`` అని చెప్పుచున్నది. ధూమ్ర రక్తవర్ణముగల దారం యేసు సిలువలో కార్చిన యేసు రక్తమును సూచిస్తుంది. నీలిరంగు దారం, ముందు ప్రస్తావించిన రీతిగా బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి పొందిన యేసు బాప్తిస్మమును సూచిస్తుంది,
 నీలం ,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం యేసు బాప్తిస్మమును, దేవుని అవతారము,మరియు సిలువపై ఆయన మరణమును మనకు చెప్పుచున్నవి. యేసు యొక్క పనులు ఈ మూడు దారాలలో వ్యక్తపరచబడి పరిశుద్దుడైన యోహావా యెదుటకు వెళ్ళుటకు మనకు విశ్వాస సామర్ధ్యమును కలిగించును.దేవుడు తానే యేసు,మానవుని రూపములో శరీరధారిగా వచ్చి, బాప్తిస్మo తీసుకొని పాపులయొక్క అతిక్రమములన్నియు ఆయన శరీరం పై భరించి, అనేక రకములైన పాపపు తీర్పు యొక్క శాపమును తన రక్తం చిందించుట ద్వారా భరించెను-ఇది నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం యొక్క ఆధ్యాత్మిక రహస్యమైనది.
 బహుశా నీవు ఇంతవరకు నీలిరంగు దారం కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే చూపిస్తుందని ఆలోచించవచ్చు.నీవు తప్పని సరిగా స్పష్టముగా తెలుసుకోవలసినది, నీలిరంగు దారం సహజంగా యేసు బాప్తిస్మమును సూచిస్తుంది. బాప్తీస్మం ద్వారా యేసు అంగీకరించిన మన పాపములు ఆయన మీదకు దాటి వెళ్లాయి. క్లుప్తంగా ఆయన కార్యములు; ప్రాముఖ్యమైనవి కావున వాటిని విడిచిపెట్టలేము. పాతనిబంధన యొక్క ప్రత్యక్షపుగుడారము నుండి, దేవుడు మనకు దాని ప్రాముఖ్యతను చెప్పుచున్నాడు.
 యేసు యొక్క బాప్తిస్మ క్రమం ద్వారా మన పాపములను భరించెగుడారముపు కంచె యొక్క స్తంభం తుమ్మకఱ్ఱతో చేయబడింది. ఈ స్తంభాల దిగువున వెండి రంధ్రాలు అమర్చి, మరియు వాటి పై మూతలు వెండితో తొడిగించబడ్డాయి. ఇది మనకు మొదట పాపులు వారి పాపముల కొరకై తప్పనిసరిగా తీర్పు తీర్చబడాలని చెప్పుచున్నది. వారి పాపముల నిమిత్తమై ఒకసారి తీర్పు తీర్చబడినప్పుడు వారు రక్షించబడుదురు. ఇంకా తీర్పుతీర్చబడని వారు రక్షించబడలేదు, వారు దేవుని సమీపించినప్పుడు వారి పాపముల నిమిత్తమై శాశ్వతమైన శిక్షను తప్పించుకొనుట వీలుకాదు.
 ఇది ఇలా వ్రాయబడెను,``పాపమువలన వచ్చు జీతము మరణము`` (రోమా 6:23). పాపులు ఖచ్చితముగా వారి పాపములను బట్టి దేవుని భయముతో కూడిన న్యాయ తీర్పునకు లోనగుదురు. పాపులందరు దేవుని చేత తప్పనిసరిగా వారి పాపములను బట్టి ఒక సారి తీర్పు తీర్చబడవలెను, మరియు అటు తరవాత ఆయన కృపను వస్త్రమువలె ధరించుచు మరల జీవించెదరు. ఇదియే తిరిగి జన్మించుటయైయున్నది. విశ్వాసం యొక్క నీలి రంగు దారం, యేసుక్రీస్తు బాప్తీస్మం ద్వారా మన పాపములన్నియు తనపై తీసుకొనెను, మరియు విశ్వాసం యొక్క ధూమ్రరక్తవర్ణముగల దారం,యేసు సిలువపై తీర్పు తీర్చబడుట ద్వారా పాపులందరని విడిపించెను-ఈ విశ్వాసమే మనలను పాపముల నిమిత్తము ఒకసారి మరణించి మరియు తిరిగి జన్మించేలా చేసినది. ఈ విశ్వాసం ద్వారా తీర్పు తీర్చబడని నమ్మని వారి కొరకు, శాశ్వతమైన తీర్పు ఎదురుచూచున్నది. ఇది కచ్చితంగా నీవు తెలుసుకోవాలి.
 యేసు బాప్తిస్మము యొక్క అర్ధమేదనగా మన పాపముల నుండి మనలను రక్షించుటకు క్రీస్తు మన పాపములను భరించెను. యేసు యోహాను నుండి పొందిన బాప్తీస్మం ద్వారా మన పాపములను ఆయన పైకి తీసుకొనెను.యేసు దేవుడైయుండి, మనలను రక్షించుటకు,ఆయన మానవుని శరీర ఆకారరముతో ఈ భూమ్మీదకు వచ్చి,మానవజాతికి మధ్యవర్తిగా ఉన్న బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి బాప్తీస్మం తీసుకొని పాపుల యొక్క అతిక్రమములన్నియు తన పైకి తీసుకొని,అనేక రకాలతో పాపముతో కూడిన తీర్పును మన నిమిత్తమై సిలువలో తన రక్తమును మరియు నీటిని చెందించాడు. ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణ ద్వారము మనకు యేసు రక్షకుడిగా నెరవేర్చిన కార్యములను గూర్చి వివరముగా వివరించు దానిని తెలియజేస్తుంది.ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణ ద్వారము ద్వారా దేవుడు మనకు చెప్పుచున్నది = యేసు స్పష్టముగా పాపుల యొక్క రక్షకుడిగా మారెను.
 సన్నని పేనిన నార పాత మరియు క్రొత్త నిబంధనల యొక్క వాక్యమును సూచిస్తుంది, ఇది ఒకదానికొకటి సరిపోయిన పూర్తి వివరణ, ఈ సన్నని పేనిన నారను పోగుచేసి ఒక దానికొకటి కుట్టటం ఎంత కష్టమైనది?ఈ సన్నని పేనిన నార ద్వారా దేవుడు ఎలా రక్షించాడో మనకు వివరంగా తెలియజేస్తున్నాడు.
 మనం ఈ మందపాటి వస్త్రాన్ని చూచినప్పుడు,అవి అనేక రకాల దారాలతో కలిపి అల్లిక చేయబడి కుట్టబడిందని మనం చూడగలము. ఈ విధముగా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణ ద్వారమును నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార ద్వారా అల్లిక చేయమని దేవుడు చెప్పాడు. యేసు నీటి (బాప్తీస్మం ) రక్తం (సిలువ రక్తం),మరియు పరిశుద్దాత్మ ద్వారా మన దగ్గరకు వచ్చాడని ఇది మనకు చెప్పుచున్నది, (యేసు దేవుడైయున్నాడు), వాక్యంలో దాచబడియున్నది ఏదనగా, అది రక్షణ యొక్క ద్వారము. యేసుక్రీస్తులో సరియైన విశ్వాసము కలిగి ఉండుట ద్వారా దేవుని వాక్యంలో వ్యక్తీకరించబడింది. మరియు ఆయన ప్రేమను ధరించుచు,మనం సంపూర్తిగా విశ్వాససం ద్వారా రక్షించబడితిమి.
 యేసు మనలను ఆకస్మికముగా రక్షించలేదు. ప్రత్యక్షపుగుడారము వైపు మనం చూచినప్పుడు దీనిని చూడగలము. యేసు పాపులను పరిస్కారముతో నిజముగా రక్షించాడు, కంచె యొక్క స్తంభాలను చూచినప్పుడు,మనలను ఎంత చక్కగా రక్షించింది మనం గ్రహించవచ్చు కంచె యొక్క స్తంభాల సంఖ్య 60 గా ఉన్నది,ఎందుకని? ఇది 6 సంఖ్య అనునది మనిషిని సూచిస్తుంది.3వ సంఖ్య దేవునిని సూచిస్తున్నది. ప్రకటన 13 అద్యాయములో,666 గుర్తు కనిపిస్తుంది,మరియు ఈ సంఖ్య మృగము యొక్క సంఖ్యని దేవుడు మనకు చెప్పుచున్నాడు,మరియు జ్ఞాని ఈ సంఖ్య యొక్క మర్మమును తెలుసుకొనును. కాబ్బట్టి, 666 సంఖ్య అనునది దేవుని వలె ప్రవర్తించును.మానవజాతి యొక్క కోరిక ఏమైయున్నది? ఇది పరిపూర్ణ దైవత్వముగా మారలేదా ?మనం నిజంగా దైవికమైన వ్యక్తులుగా మారాలంటే,యేసు నందు విశ్వాసముంచి మనము తిరిగి జన్మించిన యెడల దేవుని పిల్లలమగుదుము. ఈ 60 స్తంభాలు చక్కగా దీని భావమును సూచించుచున్నది.
 ఏదేమైనను, విశ్వాసానికి బదులుగా, ప్రజలు అతిశయించుచు దుష్ట క్రియలు చేయుచు, వారి స్వంత క్రియలు ద్వారా దైవ సంబంధమైన వాటిలో పాలి వారుగా ఉండుటకు ప్రయత్నించెదరు. ఈ కారణం తప్ప మరొకటి కాదు వారు వాక్యమును మనుష్యుని తుచ్ఛమైన మరియు వారి స్వంత చెడు ఆలోచన ప్రవర్తనకు అనుగుణంగా తిరిగి వాఖ్యానించిరి,వారికి విశ్వాసము లేదు కేవలం తుచ్ఛమైన అలవాటులతో దేవునికి వ్యతిరేకంగా నిలవబడతారు. వారి శారీరిక కామేచ్ఛల ద్వారా వారు బలవంతం చేయబడి శరీరమందు పరిపూర్ణులై, వారు దేవుని వాక్యం నుండి దూరం చేయబడి చివరకి వారి జీవితాలను చాలించెదరు.


ప్రత్యక్షపుగుడారము యొక్క అన్ని భాగాలలో రక్షణ యొక్క వాక్కు బయలుపరచబడింది

 యేసు క్రీస్తు పాపులను రక్షించుటయు మరియు వారిని పరిశుద్ధస్తలములోకి లాగుట కొరకు, ప్రత్యక్షపుగుడారము యొక్క వస్తులు మరియు పాత్రలన్నియు అవసరమైనవి. దహనబలిపీఠం యొక్క అర్పణ అవసరమైనదే, గంగాళమును అవసరమైనదే మరియు స్తంభములు, వెండి రంధ్రములు, వెండి మూతలు, మేకులు మరియు వెండి త్రాడులు కూడా అవసరమైనవి. ఈ వస్తులన్నీ పాత్రలుగా ఉన్నవి, ఇవన్నీ పరిశుద్ధస్థలము వెలుపల ఉంచబడినవి. ఈ వస్తువలన్నియు పాపులను నీతిమంతులుగా మార్చుటకు అవసరమైనవి.
 పాపులు దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఇవన్నియు అవసరమైనవి, వాటన్నిటిలో ప్రాముఖ్యమైనది నీలిరంగు దారం (యేసు` బాప్తీస్మం).నీలం,ఊదా ధూమ్రరక్తవర్ణముగల దారం ప్రత్యక్షపుగుడార ఆవరణం యొక్క ద్వారమును తయారుచేయుటకు ఉపయోగించిరి. ఈ దారములు యేసు యొక్క మూడు కార్యాలు సూచిస్తున్నాయి దేవుణ్ణి విశ్వసించినప్పుడు మనకు అవి అవసరమైనవి. మొదటిగా,యేసు ఈ లోకమునకు వచ్చి బాప్తీస్మం తీసుకొని మన పాపములన్నియు తన పై మోసుకొనినది; రెండవదిగా, యేసు దేవుడైయున్నాడు అనునది (ఆత్మ); మూడవదిగా యేసు ఈ భూమ్మీదకు వచ్చి మన పాపములను అంగీకరించి యొర్దాను నది వద్ద బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం తీసుకొని సిలువపై మన శిక్షను భరించి మరణించెను. పాపుల రక్షణ పొందుటకు మరియు నీతిమంతులగుటకు ఇది సరియైన విశ్వాసపు నియమం.
 మనము బైబిల్ చదివినప్పుడు, మన ప్రభువు ఎంత మంచివాడో మనం గ్రహించవచ్చు. ఒకటి మనం స్పష్టముగా చూడవచ్చు, మనలను రక్షించినవాడు ఈ సన్నని పేనిన నారను ఇష్టపడుచున్నాడు,అది స్వయాన దేవుడే.అదియుగాక, దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యక్షపుగుడార ఆవరణం యొక్క ద్వారమును నేసిన నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార అది తొమ్మిది మీటర్లు వెడల్పుగా చేయమన్నాడు. అటువలె, ఎవరైనా ప్రత్యక్షపు గుడారము వైపు చూచినప్పుడు,దూరం నుండి చూచినప్పటికీ సులభంగా గుడార ఆవరణం యొక్క ద్వారమును నిశ్చయముగా గ్రహించగలిగిన విధంగా దేవుడు చేశాడు.
 ప్రత్యక్షపుగుడార ఆవరణం యొక్క స్తంభాలు మీదుగా సన్నని పేనిన నార వ్రేలాడదీయబడింది ఇది దేవుని పరిశుద్దతను వ్యక్తం చేస్తుంది. అటువలె, పాపులు దైర్యంగా ప్రత్యక్షపు గుడారమును సమీపించలేరని మనం గ్రహించగలము,మరియు వారు ప్రత్యక్షపుగుడార యొక్క ఆవరణ ద్వారం లోని నీలం,ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో ప్రత్యక్షపర్చబడిన యేసు పరిచర్య నందు విశ్వాసముంచినప్పుడు వారు నిజముగా రక్షించబడుదురు మరియు ఆవరణములోకి ప్రవేశించగలరు. ఈ విధముగా,దేవుడు పాపులకుఅవకాశమిచ్చాడు యేసు క్రీస్తు వారి పాపాలను తుడిచివేసి వారిని నీరు, రక్తం, మరియు పరిశుద్దాత్మ ద్వారా రక్షించాడు.
 ఇదే కాదు, అన్ని రకాల వస్తువుల ద్వారా ప్రత్యక్షపుగుడారము చేయబడింది, ఆవరణం యొక్క ద్వారముతో కలిపి,దేవుడు పాపులను నీతిమంతులుగా మార్చుటకు కఠినమైన వాక్కులు అవసరమైనవి.
 ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణ ద్వారము మనలను దేవుడు సంపూర్తిగా రక్షించాడని చెప్పుచున్నది, తుమ్మకఱ్ఱను ఎవరు ఇష్టపడతారు, పాపముల నుండి నీలిరంగు దారం (యేసు` బాప్తీస్మం), ధూమ్రరక్తవర్ణముగల దారం (సిలువ రక్తము), మరియు ఊదా దారం(యేసు దేవుడైయున్నాడు). దేవుడు నిశ్చయించిన దానిని స్పష్టముగా విశ్వసించిన వారు మాత్రమే దేవుని ఇంటిలోకి, పరిశుద్ధస్థలములోకి ప్రవేశించగలరు.


యేసు క్రీస్తు ఈ భావము ద్వారా తెలియపరుస్తున్నాడు

 యేసు బాప్తీస్మం ద్వారా మన పాపముల నుండి తప్పనిసరిగా శుద్దిచేయబడాలని దేవుడు మనకు చెప్పుచున్నాడు, ప్రకాశవంతమైన విశ్వాస జీవితమును జీవించుట కొరకు. అందుకోసమే దేవుడు తానే మోషేకు ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను చూపించాడు, తరువాత అది మోసే ద్వారా నిర్మించబడింది,మరియు ఇశ్రాయేలీ ప్రజలు ప్రత్యక్షపు గుడారం యొక్క వ్యవస్థ ద్వారా వారి పాపముల నుండి విడుదల పొందుట కొరకు నిర్మించబడింది. ప్రత్యక్షపు గుడారము నుండి పరిశుద్ధస్థలములోకి మనం స్వీకరించిన విశ్వాసమును మరొక సారి పున:పరిశీలించుకుందాము.ఆవరణ గుడారము ద్వారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు.మన యొక్క విశ్వాసము ద్వారా సత్యమైయున్న నీరు, రక్తం, మరియు పరిశుద్దాత్మ ద్వారా యేసు మనలను రక్షించాడు.
 ఆవరణ ద్వారము నందు విశ్వాసము,నేసిన నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం,రక్తం చిందించబడిన ఈ బలి అర్పణ గొర్రె మీద ప్రధాన యాజకుడు చేతులు వేయుటలో, మరియు యాజకుడు గంగాళము వద్ద తన కాళ్ళు చేతులు కడిగిన దాని విశ్వాసముతో-ఇవన్నీ కూడా మనలను నీరు మరియు ఆత్మ సువార్తను తెలుసుకొనుటకు అనుమతించును. ఈ స్వచ్ఛమైన విశ్వాసమే మనలను పరిశుద్ధస్థలములోకి అనుమతించి మహిమలో జీవించుటకు సామర్ధ్యము కలుగజేయును.
 గుడారం ద్వారా, ఆయన ఆశీర్వాదమును మరియు కృప రక్షణను పొందటానికి దేవుడి అనుమతించాడు. గుడారం ద్వారా, దేవుడు ఆశీర్వాదాలను మన పై కుమ్మరించుయున్నాడని మనం తెలుసుకోగలం. మనము గ్రహించి ఆయన కృపా రక్షణ యందు విశ్వాసముంచట వలన మనలను దేవుని కృపా సింహాసనం యొద్దకు నడిపించి ఒకే సారి రక్షించబడుటకు సామర్థ్యము కలుగజేసెను. దీనిని నీవు గ్రహించగలవా? గుడారము ద్వారా,నిన్ను మరియు నన్ను ప్రభువు ఎంత చక్కగా రక్షించాడో మనం చూడగలము,మన రక్షణ ఎంత కష్టదాయకమైనను దానిని ప్రణాళిక చేసాడు, మరియు ఆయన ప్రణాళిక ప్రకారం కచ్చితంగా నెరవేర్చి, పాపులను నీతిమంతులుగా మార్చకలిగెను.
 నీవు,ఎప్పుడైనా ఈ సమయములో అస్పష్టముగా యేసు నందు విశ్వాసముంచియున్నావా ?నీవు నీలి రంగును ఆకాశపు రంగు మాత్రమే అని విశ్వసించితివా? ఊదా యొక్క విశ్వాసము మరియు ధూమ్ర రక్త వర్ణముగల రంగుల గురించి మాత్రమే అవగాహనా కలిగి యున్నవా,యేసుక్రీస్తు,రాజుల రాజు,ఈ లోకానికి వచ్చి సిలువపై మనలను రక్షించాడు,ఆ విధంగా నీవు నమ్ముతున్నావా? అలా అయితే,నిజమైన విశ్వాసాన్ని కనుగొనుటకు ఇదే సమయం. మీరంతా స్పష్టముగా యేసు బాప్తీస్మం గురించి తెలుసుకొనియున్నారని నేను గ్రహించియున్నాను,నీలిరంగు విశ్వాసము,మరియు దేవుడిచ్చిన అవధులు లేని కృపా రక్షణలో ఇకమీదట విశ్వాసముంచి గ్రహించగలరని నేను నిరీక్షిస్తున్నాను.
 దేవుడు పరిశుద్దాత్మమరియు రక్తం ద్వారా మాత్రమే మనలను రక్షించలేదు. ఎందుకని? దేవుడు స్పష్టముగా నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల రంగులు కలిగిన ఈ దారముల ద్వారా మనలను ఎంత నిశ్చయముగా మనలను రక్షించాడో స్పష్టముగా మాట్లాడుచున్నడు.ఈ ప్రత్యక్షపుగుడారము ద్వారా, దేవుడు యేసు యొక్క రక్షణ కార్యాలను పూర్తిగా మనకు తెలియపరిచియున్నాడు. గుడారమును నిర్మించమని మోషేకు ఆజ్ఞాపించిన తరువాత, ఈ గుడారము ద్వారా, ఈ విధమైన క్రమము ద్వారా మనలను రక్షిస్తాని దేవుడు వాగ్దానం చేసాడు. వాగ్దానం చేసినట్లే, యేసుక్రీస్తు శరీరధారిగా మానవుని ఆకారములో వచ్చి యొర్దాను నది వద్ద బాప్తీస్మం (నీలం ) ద్వారా మన పాపములన్నియు తనకు తానే తీసుకొనియున్నాడు. ఆయన బాప్తీస్మం ద్వారా, యేసు పాపలందరి పాపముల నుండి సహజంగా రక్షించాడు. ఎంత సున్నితమైనది, సరైనది,మరియు మన రక్షణ ఎంత నిశ్చయమైనది ! 
 మనము పరిశుద్ధస్థలములోకి ప్రవేశించినప్పుడు, మనము దీపవృక్షమును, సన్నిధి రొట్టెలు బల్ల, మరియు ధూపవేదిక యొక్క బలిపీఠం చూడగలమ.అతి పరిశుద్ధస్థలములోకి ప్రవేశించినప్పుడు, బంగారముతో మెరియుచున్న పరిశుద్ధస్థలములో కొంతవరకు మనం నివసించవచ్చు,వాక్యమును జీవ ఆహారముతో మన హృదయాలు తృప్తితో పోషించబడును. ఇది ఎంత ఆశీర్వాదకరమైనది ? దేవుని రాజ్యములో ప్రవేశించేముందు, ఒకే సారి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా తిరిగి జన్మించి సంపూర్తిగా రక్షించబడిన మనము ఆయన సంఘములో నివసించెదము. దేవుని సంఘము మనకు జీవాహారమునిచ్చు స్థలము పరిశుద్ధస్థలము. 
 పరిశుద్ధస్థలములో-అనగా -దేవుని సంఘములో -దీపవృక్షము,సన్నిధి రొట్టెల బల్ల,మరియు ధూపవేదిక యొక్క బలిపీఠం ఉన్నవి.దీపవృక్షము, వాటి యొక్క రెక్కలు ,కొమ్మలు, గిన్నెలు ,అలంకార గుబ్బలు,మరియు పూతలు,నైపుణ్యముతో కూడిన సుత్తితో స్వచ్ఛమైన బంగారముతో కూడిన ఒకే ముక్క ద్వారా తయారు చేయబడింది. ఈ విధమైన కలయిక ద్వారా నీతిమంతులు దేవుని సంఘములో కలసికట్టుగా తప్పని సరిగా ఉండవలెనని ఇది మనకు చెప్పుచున్నది.
 సన్నది రొట్టెల బల్ల మీద,పులియని రొట్టె ఉంచబడెను,రొట్టె లోకములో ఉన్న హీనమైన మురికి బోధలు మరియు దుష్టత్వము నుండి దేవుని యొక్క వాక్యము పూర్తిగా స్వచ్ఛమైన దానికి సాదృష్యంగా ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధత- అది, దేవుని సంఘమైయున్నది-పులిసిపోని దేవుని స్వచ్ఛమైన వాక్యమును ప్రకటించును. మరియు స్వచ్ఛమైన విశ్వాసముతో దేవుని యెదుట చెడు చేయక జీవించును.
 అతిపరిశుద్ధస్థలముకు యొక్క ముందు భాగములో,ధూపవేదిక యొక్క బలిపీఠం ఉంచబడియున్నది. దూపవేదిక యొక్క బలిపీఠం అనునది దేవునికి ప్రార్థనలు చెల్లించుట. పరిశుద్ధస్థలము లోపల ఉన్న పాత్రల ద్వారా, మనము ఆయన యెదుటకు వెళ్ళినప్పుడు,మనం తప్పని సరిగా ఐక్యత, నిర్మలమైన వాక్యం యొక్క విశ్వాసమును,మరియు ప్రార్థనలు కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు.నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు,నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన ఆలకించును(యెషయా 59:1-2, యాకోబు 5:16).ఆయన యెదుట అతి ఉత్సాహముతో ప్రార్థన చేసే వారందరు ఆయనను కలుసుకోలేరు.
 ఈ విధంగా, మనం దేవుని సంఘములో రక్షించబడుట ఎంత మహిమాన్నితమైనదో ఈ పరిశుద్ధస్థలము తెలియజేస్తున్నది.ప్రత్యక్షపుగుడారానికి ఉపయోగించబడిన మూల పదార్థాలు-నీల రంగు దారము(యేసు యొక్క బాప్తీస్మం), ధూమ్రరక్తవర్ణముగల దారం(ఆయన బాప్తీస్మం ద్వారా మన పాపములన్నియు తనకు తానుగా తనపైకి తీసుకొని,మన పాపముల నిమిత్తమై శిక్షను భరించి సిలువపై మరణించెను),మరియు ఊదా యొక్క దారం అనునది (యేసు దేవుడైయున్నాడు)-అపజయములేని సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండుటకు సూచనగా ఉన్నది. ఈ మూడు సమానంగా మన విశ్వాసాన్ని సంపూర్ణం చేయును. మనము ఎప్పుడైతే యేసు దేవుని కుమారుడని మరియు తనకు తాను ప్రధానమని,మరియు మనలను రక్షించాడని,నమ్ముతామో అప్పుడు మాత్రమే దేవుడు నివసించుచున్న బంగారముతో మెరియుచున్న ఆయన పరిశుద్ధస్థలములోకి మనముప్రవేశించగలము. ఈ మూడు దారాలలో వ్యక్తపరచబడిన యేసు కార్యాలను మనము నమ్మనట్లైతే,మనము పరిశుద్ధస్థలములోకిఎన్నడునూ ప్రవేశించలేము,మనము ఎంత ఉత్సాహంగా యేసుని నమ్ముతామని కాదు ఇక్కడ, క్రైస్తవులందరూ అతిపరిశుద్ధస్థలములోకి ప్రవేశించలేరు.


ప్రత్యక్షపుగుడారములోనికి ప్రవేశించాలనే వారు పొరపాటుతో కూడిన విశ్వాసముతో ప్రయత్నించుదురు

 ఈ రోజు, అనేకమంది క్రైస్తవులు వారు నమ్మిన విశ్వాసాన్ని బట్టి దేవుని పరిశుద్ధస్థలములోకి ప్రవేశించలేక పోతున్నారు.మరొక మాటలో చెప్పాలంటే, ప్రజలు వారి గ్రుడ్డి విశ్వాసముతో రక్షించబడాలని ప్రయత్నించెదరు.యేసుక్రీస్తు రక్తము యందు,మరియు ఆయన తానంతట తాను దేవుడను మరియు రాజుల రాజు యందు విశ్వాసముంచుట ద్వారా రక్షించబడుదమని ఆలోచించు ప్రజలు ఎవరును ఖచ్చితముగా రక్షించబడలేరు. వారు తేలికపాటి విశ్వాసముతో నమ్ముదురు. యేసు రక్తనందు మాత్రమే విశ్వాసముంచి,దహన బలిపీఠం యెదుట నిలువబడి మరియు గ్రుడ్డిగా ప్రార్దించెదరు,‘’ప్రభువా ఈ రోజుకు నేను పాపనే, క్షమించండి ప్రభు, నా స్థానములో శిక్షించబడి మరణించినందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. ఓ, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను!``
 ఈ ఉదయకాలమున ఇది చేసిన తరువాత,వారు వారి యధావిధి జీవితాల్లోకి వెళ్లి, మరల సాయంకాలమున దహన బలిపీఠము వద్దకు తిరిగి వెళ్లి యధావిధి ప్రార్థన చేయుదురు. అటువంటి ప్రజలు ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి నెల అర్పించబడుతున్న అర్పణల వలన తిరిగి జన్మించలేరు,వారి స్వంత ఆలోచన తప్పుడు నడిపింపుతో కూడిన విశ్వాసములో పడిపోదురు.
 వారు బలి అర్పణను దహించు బలి అర్పణ మీద ఉంచి ఎర్రని మంటలతో మరియు అగ్నితో నైవేద్యమును అర్పించెదరు. కారణము మాంసము మంటలతో అక్కడ కాలిపోవును, కాలిపోయిన మాంసము యొక్క వాసన వ్యాపించి, నల్లటి మరియు తెల్లని పొగ పైకి వస్తూనే ఉంటుంది. దహించు బలిపీఠం యొక్క నైవేద్యం అనునది మన పాపములను తుడిచి వేయమని అడిగే స్థలము కాదు.కానీ అది,నిజానికి మనకు గుర్తుచేయుచు భయానకమైన నరకం యొక్క అగ్ని గుండమను స్థలము.
 ఏదేమైనను,ప్రజలు ఉదయం మరియు సాయంత్రం ఈ ప్రదేశానికి వెళ్లి,``ప్రభువా, నేను పాపం చేసియున్నాను అని చెప్పుదురు. దయతో నా పాపములన్నియు క్షమించండి``. అప్పుడు వారు వారి గృహాలకు తిరిగి వెళ్లి,వారి కోరిన విధంగా వారి పాపములు క్షమించబడినప్పుడు వారి స్వయం తృప్తిపరచబడును. బహుశా వారు పాటలు పాడుటకు బహుగా సంతోషించెదరు,``♫నేను క్షమించబడియున్నాను, ♫ నీవు క్షమించబడియున్నావు, ♫మనమందరము క్షమించబడియున్నాము.``కానీ ఇలాంటి బావాలు క్షణకాలం మాత్రమే. అతి త్వరలో,వారు మరల పాపము చేసి దహించు బలిపీఠం యెదుట నిలువబడి మరొక సారి వారి ``ప్రభువా నేను పాపినని ఒప్పుకొనుచు ఉందురు.``దహనబలి యొక్క బలిపీఠం నుండి మరియు ప్రతిరోజూ ప్రయాణించే వారు, యేసుపై విశ్వాసం ఉన్నప్పటికీ, ఇప్పటికీ పాపులే. అలాంటి వారు దేవుని పవిత్ర రాజ్యంలో ఎప్పటికీ ప్రవేశించలేరు.
 అప్పుడు ఎవరు,పాపముల నుండి విడుదల పొంది మరియు దేవుని యొక్క పవిత్ర రాజ్యములో ప్రవేశించెదరు? దేవునిచేత ఉంచబడియున్న మర్మమైయున్న నీలం,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారమును గ్రహించిన వారు మరియు విశ్వసించిన వారు మాత్రమే దహన బలిపీఠం యొక్క అర్పణ మీదుగా యేసు యొక్క మరణ నందు విశ్వాసముంచి వారి పాపాలు యేసు పైకి వెళ్లాయని అంగీకరించిన వారు,గంగాళము వద్ద వారి చేతులు కాళ్ళు కడుక్కొనుట అనునది యేసు బాప్తీస్మం ద్వారా వారి పాపములు ఆయన పైకి వెళ్లాయని వారికి గుర్తుచేయును, మరియు అప్పుడు మాత్రమే వారు దేవుని పరిశుద్ధస్థలములో ప్రవేశించెదరు. నీరు మరియు ఆత్మ సువార్త నందు విశ్వాసముంచు వారు వారి పాపముల నుండి విడుదల పొంది వారి విశ్వాసం ద్వారా పరలోకరాజ్యములో ప్రవేశించెదరు,వారి విశ్వాసం దేవుని చేత అంగీకరించబడుతుంది.
 నీలి రంగు దారం యొక్క బైబిల్ అర్ధం యేసు యొక్క బాప్తిస్మమని దానిని మీ అందరు గ్రహించి మరియు నమ్ముదరని నేను ఆశిస్తున్నాను. 
యేసును నమ్మటానికి ఈ రోజుల్లో అనేక నమ్మకాలు ఉన్నాయి,కానీ కొంతమంది అలాగే నీటి నందు విశ్వాసముంచెదరు (నీలి దారం),అనగా యేసు యొక్క బాప్తీస్మం నందు.ఇది పూర్తిగా విచారకరమైన సంఘటన. ఇది బహు నాశనాన్ని కలిగించి అనేకమందిని ప్రధానమైన బాప్తీస్మపు క్రైస్తవ విశ్వాసము నుండి తొలగిపోయారు,యేసు ఈ భూమ్మీదకు దేవుడిగా మాత్రమే వచ్చి సిలువపై మరణించలేదు.మీరందరు తప్పని సరిగా విశ్వాసము యొక్క నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం నందు విశ్వాసముంచి ఇకమీదట పరలోక రాజ్యములో ప్రవేశించే వ్యక్తిగా మారగలరని ఇప్పటికి నేను నిరీక్షించి మరియు ప్రార్థన చేయుదును.


ప్రభువు కనపరచిన ప్రత్యక్షపుగుడారం యొక్క నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం నందు మనము తప్పనిసరిగా విశ్వాసముంచవలెను.

 మన ప్రభువు నిన్ను మరియు నన్ను సంపూర్తిగా రక్షించాడ. మనం ప్రత్యక్షపుగుడారము వైపు చూసినప్పుడు,ఎంత అందముగా ప్రభువు వాస్తవంగా మనలను తన క్రమం చొప్పున రక్షించాడు. ఇందును బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పలేనివి. నీలం,ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం ద్వారా మనలను రక్షించుట ఎంత మహత్తరమైనది,మరియు అదియుకాక ఆయన నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం నందు నమ్మిక యుంచు విశ్వాసమును అనుగ్రహించెను!
 పాపులు వారి పాపములను బట్టి భయముతో కూడిన తీర్పు ద్వారా దేవుని కృపను ధరించకుండ ఎంతమాత్రమును పరిశుద్ధస్థలములోకి ప్రవేశించలేరు. ఏ విధముగా ఒకరి పాపములు ఎప్పుడైనను తీర్పు తీర్చబడక గుడారపు ద్వారం తెరువబడి మరియు పరిశుద్ధస్థలములో ప్రవేశించగలరు? ప్రవేశించలేరు. ఆ విధమైన ప్రజలు పరిశుద్ధస్థలములోకి ప్రవేశించినప్పుడు,వారు శపించబడి చూడలేని గ్రుడ్డివారిగా మారుదురు.``ఆహా,అయితే ఇక్కడ ఇది వెలుతురుగా ఉన్నది! ఊ -ఆహా, నేనేమి చూడలేకపోతున్నాను అది ఎలా వచ్చింది? నేను బయట ఉన్నప్పుడు,నేను పరిశుద్ధస్థలములో ఉన్న అన్నిటిని చూడగలనని నేను ఆలోచించాను. నేను ఆ స్థలంలోకి వెళ్ళినట్లైతే, ఎందుకు నేనేమి చూడలేకపోతున్నాను, మరియు ఇక్కడ ఎందుకు ఇంత చీకటిగా ఉన్నది?నేను పరిశుద్ధస్థలము వెలుపల ఉన్నప్పుడు మాత్రము నేను చక్కగా చూడగలను.... పరిశుద్ధస్థలము ప్రకాశించునదని నాకు చెప్పబడింది;కానీ ఇక్కడికి చీకటి ఎలా వచ్చింది?``వారు ఆత్మీయతలో గ్రుడ్డివారు గనుక చూడలేరు,నీలం,ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం నందు విశ్వాసముంచలేదు గనుక,వారు ఈ విధమైన ధోరణితో పరిశుద్ధస్థలములో ప్రవేశించలేరు.
 మన ప్రభవు పరిశుద్ధస్థలములో మనలను అంధులుగా ఉండుటకు శక్తినిచ్చు వాడు కాదు, కానీ పరిశుద్ధస్థలములో జీవించుచు శాశ్వతముగా ఆయన ఆశీర్వాదమును పొందుట కొరకు. నీలం ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం ప్రత్యక్షపుగుడారం యొక్క ముప్పావు భాగమంతటిలో పేనిన సన్నని నార కనుగొనబడింది. దేవుడు మన రక్షణ క్రమము గురుంచి ఖచ్చితముగా తన వాక్యం మరియు ప్రవచనం ప్రకారం తెలియజేశాడు. నిజముగా ఆయన మన సమస్త పాపముల నుండి విడిపించాడు. 
 మన ప్రభువు మనలను నీరు,రక్తం, మరియు పరిశుద్దాత్మ ద్వారా రక్షించెను1 (యోహాను 5:4-8). కావున గ్రుడ్డివారిగా కాక ఆయన శాశ్వత కృపలో ప్రకాశించు జీవితమును జీవించవలెయును. ఆయన నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార ద్వారా మనలను రక్షించాడు. మన ప్రభువు ఈ మృదువైన దేవుని వాక్యం ద్వారా వాగ్దానం చేసాడు,మరియు ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేర్చుట ద్వారా మనలను ఆయన రక్షించియున్నాడన్న సంగతి మనకు తెలియజేసెను.
 నీవు మరియు నేను నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార ద్వారా యేసు ప్రత్యక్షపరిచిన సున్నితమైన ఆయన కార్యములయందు రక్షించబడ్డామని నీవు నమ్ముతున్నావా? అవును! గ్రుడ్డిగా మనం రక్షించబడ్డామా?లేదు!మనం నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార యందు విశ్వాసముంచకుండ రక్షించబడలేము.
 నీలి రంగు దారం దేవునిని సూచించదు. ఇది యొర్దాను నదిలో యేసు యొక్క బాప్తిస్మము ద్వారా ప్రపంచములోని ప్రతి ఒక్కరి పాపములను తీసుకొనుటకు సూచించును.
 యేసు బాప్తీస్మం నీలి రంగు దారం,నందు విశ్వాసముంచకుండా దహన బలిపీఠం యొక్క అర్పణ వద్ద నిలుచుట అసాధ్యమైనది. ప్రజలు ఏదొక విధముగా గంగాళము వద్దకు చేరుకున్నప్పటికీ, మరొక మెట్టుగా దహన బలిపీఠం వద్దకు చేరుకున్నప్పటికీ దేవుడు నివసించు పరిశుద్ధస్థలములోకి వారి ప్రవేశించలేరు. ప్రత్యక్షపుగుడారం యొక్క తలుపులు తెరచి పరిశుద్ధస్థలములో ప్రవేశించు వారు నీరు మరియు ఆత్మ సువార్త నందు సంపూర్తిగా విశ్వాసముంచుట ద్వారా వారి పాపముల నుండి విడుదల పొంది దేవుని పిల్లలుగా చేయబడినవారు. పాపముతో ఉన్న వారు,వారు ఎవరైనను సరే, ఎన్నడును పరిశుద్ధస్థలములో ప్రవేశించలేరు. మనము రక్షణలోకి ప్రవేశించుటకు ఎంతకాలము పడుతుంది? ప్రత్యక్షపుగుడారములోనికి ప్రవేశించినంత మాత్రాన మనము రక్షించబడలేము,కానీ దేవుడు నివసించు పరిశుద్ధస్థలములోకి ప్రవేశించినప్పుడే రక్షించబడగలము.
 

ప్రత్యక్షపుగుడారము లోపల ఉన్న విశ్వాసము మరియు వెలుపల ఉండు విశ్వాసము మధ్య వ్యత్యాసము
 
ప్రత్యక్షపుగుడారము వెలుపల ఉన్న గంగాళము మరియు దహనబలిపీఠం ఇత్తడితో చేయబడినవి,మరియు వాటి అంచులు చెక్కతోను, వెండితోను,ఇత్తడితోను చేయబడినవి. కానీ మనము గుడారములోనికి ప్రవేశించినప్పుడు,వస్తువలన్నియు పూర్తిగా వ్యత్యాసంగా ఉంటాయి. గుడారము యొక్క ఒక ప్రాథమిక లక్షణం ``బంగారం యొక్క ఇల్లు`` వలె ఉన్నది. మూడు ప్రక్కల గోడలు 48 తుమ్మ చెక్క పలకలతో నిర్మించబడ్డాయి, వాటన్నిటి పైన బంగారము పూయబడినది. సన్నిధి రొట్టెల బల్ల మరియు ధూపవేదిక యొక్క బలిపీఠం తుమ్మ కర్రతో చేయబడినవి,పైన బంగారముతో పూయబడినవి,మరియు దీపవృక్షము ఒక బంగారము వంటి నైపుణ్యముతో కూడిన సుత్తితో చెక్కటం ద్వారా చేయబడింది. అదే విధంగా, పరిశుద్ధస్థలములో ఉన్న అన్ని పాత్రలు పూర్తిగా బంగారముతో పోదగబడినవి.
 మరొక విధంగా, పలకల దిగువున ఉన్న రంధ్రాలు వేటితో చేయబడినవి? అవి వెండితో చేయబడినవి. ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణపు ప్రహారి గోడల యొక్క స్తంభములు ఇత్తడితో చేయబడినవి,గుడారము యొక్క పలకలు రంధ్రాలు వెండితో చేయబడినవి. మరియు ఆవరణము యొక్క ప్రహరీ గోడల స్తంభములు చెక్కతో చేయబడినవి,గుడారము యొక్క పలకలు తుమ్మ కర్రతో చేయబడి బంగారముతో పొది గించబడినవి. కానీ అయిదు స్తంభములు యొక్క గుడారము యొక్క తలుపులు ఇత్తడితో చేయబడినవి.
 గుడారము యొక్క పలక రంధ్రాలు వెండితో చేయబడినప్పటికీ,గుడారము యొక్క ద్వారపు స్తంభముల రంధ్రాలు ఇత్తడితో చేయబడినవి. దీని అర్ధం ఏమిటి? దీని అర్ధం దేవుని సన్నిధికి వచ్చు ప్రతి వాడు వారి పాపముల నిమిత్తము తీర్పు తీర్చబడాలి. అలాగే అయితే తీర్పు తీర్చబడి మరణానికి అప్పగించబడితే దేవుని యెదుటకు ఎవరు రాగలరు?మనకు మనమే చనిపోయినట్లైతే, మనము దేవుని యెదుట నిలవబడలేము.
 అయిదు స్తంభముల యొక్క ప్రత్యక్షపుగుడారపు ద్వారము యొక్క రంధ్రములకు వెండి ఉపయోగించబడింది, అందుకనే దేవుడు మన పాపముల నిమిత్తము తీర్పు తీర్చబడినప్పటికీ;ఆయన బాప్తీస్మం ద్వారా మన స్థానములో మన పాపములను ఆయన పై మోసుకొని మన కొరకు శిక్షించబడెను.మన సమస్త పాపముల నిమిత్తమై మనము శిక్షించబడవలసిన వారము. అయితే మన స్థానములో మరొకరు మన పాపముల కొరకై శిక్షను భరించెను. మనకు బదులుగా,మరొకరు మనకొరకు చనిపోయెను. ఒకరు మన స్థానములో శిక్షించబడి మరియు చనిపోయాడు ఆయన ఎవరో కాదు యేసు క్రీస్తే.
 నీలిరంగు దారం ద్వారా చూపించబడిన విశ్వాసమనునది అయన బాప్తీస్మం ద్వారా మన పాపమములను అంగీకరించి ఆయన పైకి మోపబడి మన పాపములు క్షమించునని విశ్వసించునదియే. అటువలె దేవుడు యేసుక్రీస్తు యొక్క జీవితమును మన పాపముల నిమిత్తము శిక్షించెను ఏవైతే మన పాపములు ఆయన బాప్తీస్మం ద్వారా ఆయన మీదకు వెళ్ళినవో ఆ పాములన్నయు ఇక మీదట పరిష్కరించబడి దూరపరచబడినవి, ఇక మీదట మన పాపముల నిమిత్తమై తీర్పు పొందనేరము. ధూమ్రరక్తవర్ణముగల దారం ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము యేసు సిలువలో కార్చిన రక్తం నందు విశ్వాసమైయున్నది. ఈ విశ్వాసము యేసు క్రీస్తు అనుభావపూర్వకముగా మనము భరించవలసి మన పాపముల యొక్క శిక్షను భరించెనని నమ్మునది.
 వారి పాపములు బాప్తీస్మం ద్వారా యేసు పైకి వెళ్లాయని మరియు వారి పాపములను బట్టి యేసు తీర్పు తీర్చబడి,ఆయన శరీరం ద్వారా ఈ పాపముల నిమిత్తమై సిలువ పై రక్తం చిందించి మరణించాడని నమ్ముతూ,పరిశుద్ధస్థలములోకి ప్రవేశించగలము.ఈ కారణమూ చేతనే గుడార ద్వారము యొక్క రంధ్రములు ఇత్తడితో చేయబడినవి.కావున,ఆయన బాప్తీస్మం ద్వారా మన పాపములను తనకు తానె స్వీకరించి తీర్పు తీర్చబడి మన స్థానములో శిక్షించబడి రక్తం చిందించిన క్రీస్తు నందు విశ్వాసముంచవలెను.
 దేవుడు నిర్ణయించుకున్నాడుయేసుక్రీస్తు తానె దేవుడై వారిని రక్షించాడని(ఊదా దారం),ఆయన బాప్తీస్మం(నీలిరంగు దారం),మరియు సత్యమేదనగా వారి స్థానములో వారి పాపముల కొరకు (ధూమ్ర రక్తవర్ణముగల దారం)శిక్షించబడెనని ఎవరైతే నిజాన్ని ఒప్పుకుందురో వారు మాత్రమే పరిశుద్ధస్థలములోకి ప్రవేశించగలరు.యేసు నందు విశ్వముంచి ఒక సారి వారి సమస్త పాపముల కొరకు తీర్పు తీర్చబడిన వారిని మాత్రమే దేవుడు అనుమతించాడు, మరియు యేసు వారిని వారి అన్ని పాపముల నుండి రక్షించాడని నమ్ము వారు మాత్రమే,పరిశుద్ధస్థలములోకి ప్రవేశించగలరు.
 గుడారం యొక్క ద్వారం యొక్క స్తంభముల రంధ్రములు ఇత్తడివి. ఇత్తడి రంధ్రములు ఆధ్యాత్మిక అర్ధం కలిగియున్నవి అది ఆదాము వారసత్వము నుండి జన్మించిన పాపులను వారి ఎలాంటి వారైనను నీలిరంగు దారం(యేసు బాప్తీస్మం) నందు విశ్వాసమును,ధూమ్రరక్తవర్ణముగల దారం(పాపుల స్థానములో యేసు యొక్క న్యాయ తీర్పు),మరియు ఊదా దారం(యేసు తనకు తానె దేవుడైనవాడు).అయిదు రంధ్రములతో కూడిన స్తంభం యొక్క ద్వారమంతయు ఇత్తడితో చేయబడింది,ఇది దేవుని సువార్తను తెలియజేస్తుంది, రోమాపత్రిక 6:23 లో వ్రాయబడిన విధంగా,’’ ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.’’ యేసు మన పాపములను నీరు, మరియు రక్తం మరియు ఆత్మ ద్వారా క్షమించాడు.
 

మనము అజ్ఞానులం కాక దేవుని మరియు వాక్యం నందు విశ్వాసముంచవలెను
 
యేసు నందు విశ్వాసముంచినంత మాత్రాన రక్షించబడినట్టి కాదు.సంఘానికి వెళ్లినంత మాత్రాన నీవు తిరిగి జన్మించినట్లు కాదు. యోహాను సువార్త మూడవ అద్యాయములో చెప్పినట్లుగా నీటిలోను మరియు ఆత్మలోను తిరిగి జన్మించిన వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించగలరు.యేసు నిశ్చయంగా యూదుల నాయకుడు మరియు దేవుని విశ్వాసపాత్రుడైన నీకొదేముతో చెప్పాడు,``యూదుల బోధకుడవైన నీవు, తిరిగి జన్మించుట ఎలాగో తెలియదా? ఒకడు నీటి మూలముగా మరియు ఆత్మలోను తిరిగి జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించగలడు`` యేసును నమ్మిన వారు నీలి రంగు దారం నందు విశ్వాసముంచినప్పుడు మాత్రమే తిరిగి జన్మించగలరు( ఆయన బాప్తీస్మం తీసుకున్నప్పుడు ఒకే సారి మన పాపములన్నిటిని ఆయన పైకి తీసుకున్నాడు), ధూమ్రరక్తవర్ణముగల దారం(యేసు మన పాపముల కొరకై చనిపోయెను), మరియు ఊదా దారం(యేసు రక్షకుడు, తానె దేవుడు,మరియు మనుష్యకుమారుడు).అలాగే,నీలం,ఊదా,మరియుధూమ్రరక్తవర్ణముగల దారం గుడారం యొక్క ప్రతి మూలన చూడగలము,పాపులందురు తప్పనిసరిగా యేసు పాపుల రక్షకుడని నమ్మవలెను.
 ఈ సత్యాన్ని నమ్మక అనేకమంది ప్రజలు యేసును నమ్ముదురు కావున వారు తిరిగి జన్మించను లేరు మరియు వాక్యము ద్వారా తిరిగి జన్మించుట తెలుసుకొనలేరు. మన ప్రభువు మనకు స్పష్టముగా చెప్పాడు,మనము యేసు నందు విశ్వాసముంచి, తిరిగి జన్మించకపోతే, మనము పరిశుద్ధస్థలములో ప్రవేశించలేము,తండ్రియైన దేవుని రాజ్యములోను,మంచి విశ్వాస జీవితమును జీవించలేము.
 మనిషి చేసే ఆలోచన వలన, ఎలా విశ్వసించామో అనే దానితో పనిలేకుండా క్రైస్తవులందరూ తిరిగి జన్మించుటకు ఆమోదించబడినట్లైతే మనకు ఎంత ఆశ్చర్యము అనిపించును.అది అలా కాకపోవునా? ఆయన నామమును మాత్రమే పిలువటం ద్వారా మనము రక్షించబడినట్లైతే మరియు ఆయన మానవజాతికి ఏమి చేసాడో తెలియకుండా ఆయన వాక్యం మీద విశ్వాసముంచినట్లైతే,సులభంగా ప్రజలు ఆశ్చర్యముతో ఆయనను విశ్వసించెదరు. మేము నూతన వ్యక్తులను కలిసినప్పుడెల్ల ఆయనకు కృతజ్ఞతలు చెప్పుదుము, పాడుతూ ``♫ నేను క్షమించబడియున్నాను;♪ మీరు క్షమించబడియున్నారు;♫మనము క్షమించబడియున్నాము`` ``అనేకమంది విశ్వాసులు ఉన్నప్పటికీ,సాక్షమివ్వడములో ఏమున్నది?వారి వలె విషయాలు చక్కగా ఉన్నాయి. ఇది అద్భుతమైనదా? ``నిజానికి పరిస్థితి ఇలా అయినట్లైతే, ప్రజలు రక్షణ అనునది చాలా సులువు అని ఆలోచించెదరు,ఇప్పటికి ఆయన నామమును పిలిచే ప్రతి ఒక్కరు రక్షించబడుదురు,వారి రక్షణ అనునది వారు కోరుకున్నట్టుగా జీవించినను వచ్చునని ఆశ కలిగి ఉందురు.కానీ దేవుడు మనకు చెప్పినది ఏదనగా అలాంటి గ్రుడ్డి విశ్వాసముతో తిరిగి జన్మించుట ఎన్నడును జరుగనేరదు. దేశము మీద,నీరు మరియు ఆత్మ సువార్తను తెలుసుకోకుండా మేము రక్షించబడ్డాము అని చెప్పుకునే వారు అక్రమమును అభ్యసము చేయుచున్నారని ప్రభువు మనకు చెప్పాడు.
 

తిరిగి జన్మించుట అనునది ఆత్మయున్నది,శరీరం కాదు
 
యేసు మనిషిగా మారి,ఈ లోకానికి వచ్చాడు, నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా మనలను రక్షించాడు. యేసేపు యేసుకు శరీరం ప్రకారం తండ్రియైన ఒక వడ్రంగి(మత్తయి 13:55), యేసు వడ్రంగి కుమారుడిగా ఆయన కుటుంబానికి సేవచేసాడు,ఆయన మొదటి 29 సంవత్సారాల జీవితములో ఒక వడ్రంగిగా పనిచేశాడు.ఆయనకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు,ఆయన దైవికమైన కార్యాలను ప్రారంభించవలసి వచ్చింది,అది, ప్రజలలోకి ఆయన సేవను తీసుకెళ్లటం జరిగింది.
 యేసు దైవికమైన మరియు మానవ సంబంధమైన రెండు స్వభావాలను కలిగి ఉన్నాడు,నీతిమంతులుగా తిరిగి జన్మించిన వారిలో కూడా ఈ రెండు స్వభావాలు సహజ సిద్ధంగా ఉంటాయి. మనకు శరీరం మరియు ఆత్మయును ఉన్నవి. ఏదేమైనను,ఎప్పుడైనా ఒకరు యేసును నమ్మినామని చెప్పి ఆత్మలో జన్మించక పోతే,ఆ వ్యక్తి తిరిగి జన్మించిన వ్యక్తి కాదు-అందుకనే,వారికి తిరిగి జన్మించిన ఆత్మ అనుభవం లేదు. ఆత్మలో తిరిగి జన్మించకుండా ఒకరు యేసును విశ్వసించుటకు ప్రయత్నించినప్పుడు,ఈ వ్యక్తి నీకొదేము వలె శరీరములో జన్మించుటకు ప్రయత్నించు వ్యక్తి వలె ఉన్నాడు, మరియు ఆ వ్యక్తి ఎవరైనను నిజముగా తిరిగి జన్మించలేరు. యేసు ఆయన ఉనికిలో దేవుడైయున్నాడు,అయినను ఆయన ఒక మనుషుని ఆకారములో అనేక బలహీనతలతో ఉన్నాడు. అటువలె,మనము తిరిగి జన్మించామని ఎప్పుడైతే చెప్పుకుంటామో,మన యొక్క ఆత్మ తిరిగి జన్మించందని దాని అర్ధం,శరీరం కాదు.
 యేసును అనేకమంది విశ్వాసము ద్వారా నమ్మినప్పుడు కొంతమేరకు నిజానికి వారు తిరిగి జన్మించినట్టే, నేను ఒక మేలు పొందిన పాస్టర్ గా తెలియాలని ఆశిస్తున్నాను.ఎందుకని?సత్యమును విశ్వసించని వారియందు నేను మరి కోపాచిత్తుడనై పోకుండ ఉండుటకు ప్రయత్నించుచున్నాను,కావున నేను నా ప్రసంగాలలో మెండిగా ఉండక వారు సత్యమును తెలుసుకొనవచ్చునని వారి కొరకు నేను ఎదురుచూస్తాను. నేను చక్కగా వ్యవహరించె ఒక వ్యక్తిగా తెలియబడియున్నాను, తెలివి కలిగిన,ఉదార స్వభావం కలిగిన, జాలిగలిగిన, మరియు నవ్వించే సేవకునిగా, ప్రజలకు వారి శరీర స్వభావము నుండి పరిశుద్దులుగా ఎలా మారుదురో వివరించేవాడిని, సంకోచం లేకుండా, ఇలా నేను నా స్వభావమును తీర్చుదిద్దుకొనువాడను, కానీ నేను ఎప్పటికి అలా చేయలేను. నీ మనస్సులో నాటు కొనునట్లు చేయుట నాలో సామర్థ్యం లేక కాదు, `దైవసేవకుడు నిజముగా యేసు యొక్క స్వరూప్యమైన కరుణ మరియు పరిశుద్దతను వెంబడించెదరు.``ఇది శరీరానుసారమైన ఒక వ్యక్తి కారణము చేత మార్పు చేయబడదు,మరియు కొంచం దయతో,ఉదారముతో,కరుణతో శరీరం ఉన్నంత మాత్రాన ఈ వ్యక్తి తిరిగి జన్మించిన నీతిమంతుడు కాలేడు. శరీరముతో ఎవరు తిరిగి జన్మించలేరు.కానీ వాక్యము నందు విశ్వాసముంచుట చేత తిరిగి జన్మించునది ఖచ్చితముగా ఆత్మయై యున్నది.
 నీవు యేసును విశ్వసించినప్పుడు, నీవు తప్పని సరిగా సత్యమును తెలుసుకోవాలి.`` అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా`` (యోహాను8:32). దేవుని యొక్క సత్యం మాత్రమే మనలను తిరిగి జన్మింపచేయగలదు, పాపము బంధకముల నుండి మన ఆత్మను స్వతంత్రులుగా చేయును, మరియు నీతిమంతులుగా తిరిగి జన్మింపచేయగలదు.మనము తెలుసుకున్నప్పుడు, నమ్మినప్పుడు, మరియు బైబిల్ ను చక్కగా బోధించినప్పుడు మనం పరిశుద్ధస్థలములో ప్రవేశించగలము మరియు నిజమైన విశ్వాస జీవితమును జీవించగలము, అటువలె అతిపరిశుద్ధస్థలములో ఉన్న కరుణాపీఠమును సమీపించగలము. నీరు మరియు ఆత్మ సువార్త మన ఆత్మలను తిరిగి జన్మింపచేయగల సత్యమునైయున్నది, మరియు మన విశ్వాసమును బట్టి మన పాపములన్నియు క్షమించబడి దేవుని విశ్వాసతలో జీవించుటకు అనుమతించబడును. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త దేవుని పిల్లలుగా జీవించుటకు మన హృదయాలలోతిరిగి జన్మించుటకు శక్తినిచ్చును అది ఆత్మ సంబంధముగాను మరియు ప్రభువులో ప్రకాశించే ఆనందమును కలుగజేయును.
 యేసును గ్రుడ్డిగా నమ్మడం సరియైన విశ్వాసం కాదు. మానవుని దృష్టితో చూస్తే, నాలో అనేకమైన పొరపాట్లు ఉన్నవి.ఇది నా పెదవులతో చెప్పడం కాదు,నేను ఏదైనా చేసినప్పుడు,నాలో అనేక లోపాలు ఉన్నాయని గ్రహించగలుగుతాను. ఉదాహరణకు, నేను ఎప్పుడైతే బైబిల్ సమావేశాలలకు సిద్దపడతానో పరిశుద్ధులు మరియు నూతన వ్యక్తులు చక్కగా వాక్యము విందురు,దేవుని కృపతో వారి హృదయాలు కదిలించబడినప్పుడు,తిరిగి జన్మించు ఆశీర్వాదమును పొందుదురు,వారి హృదయాలు మరియు శరీరము రెండు సేదతీరిన తరువాత తిరిగి వెళ్లదరు, ఇలా అనేక సార్లు నన్ను నేను గమనించినప్పుడు అనేక విషయాలలో ఆలోచించి ముందుగా సిద్దపడుటలో నేను విఫలమయ్యాను. ఇలాంటివి చాలా తేలికగా చేసుకోగలిగినవి సమావేశానికి ముందుగా ఎల్లప్పుడు కొంత సమయాన్ని శ్రద్దగా హెచ్చించటం ద్వారా సిద్ధపడిన వెంటనే సమావేశాన్ని ప్రారంభించుటకు వీలు కలుగును. ఆ విధమైనటువంటి ముందుగా సిద్ధపాటు ఆలోచన ఎందుకు చేయలేదనే భావనతో నాకు నేనుగా ఆశ్చర్యపోతున్నాను, బైబిల్ సమావేశం యొక్క సిద్ధపాటులో నేను కొంత జాగ్రత్త మరియు శ్రద్ద వహించినట్లైతే, పరిశుద్ధులు మరియు నూతన ఆత్మలు వాక్యమును చక్కగా వినే వారు, రక్షించబడేవారు, మరియు మంచి సమయాన్ని గడిపేవారు.నేను పూర్తిగా ఆ రోజంతా కష్టపడినను,నాలో చురుకైన విధానము లేనందు వలన అనేక సందర్భాలలో నా ప్రయత్నాలకు తగినట్లుగా ఫలితాలు సరితూగలేదు. నాకు నేనుగా వాస్తవికతను గ్రహించాను నాలో అనేకమైన లోపాలు మరెక్కువుగా ఉన్నాయని.
 ఇది నేనెoదుకు చేయలేకపోతున్నాను?నేను దీని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాను? మొత్తానికి నేను చేయవలసినది మరింత శ్రద్ధను కనపరచటం, మరియు నేను ఇంకా ఇది ఎందుకు చేయలేకపోతున్నాను?``సహజంగా నేను సువార్త సేవ చేస్తున్నప్పుడు,నా లోపాలు గురించి తరచుగా గ్రహించితిని. కావున నన్ను నేను గుర్తెరిగి మరియు ఒప్పుకున్నాను, ``నేను ఇలాంటి వాడను. నేను ఇలాంటి కొరతలు కలిగిఉన్నాను``. ఇది నేను నా పెదవులతో చెప్పేది కాదు,మరియు నేను మంచిగా ఉండుటకు నటించను లేను, కానీ నేను, వాస్తవంగా, ఎవరైనను ఊడిపోయిన చివరలను కట్టలేనప్పటికీ చిన్న వ్యవహారాలలో కూడా సరిగ్గా ఉండనప్పటికీ అస్పష్టముగా ముందుకు వెళ్ళెదరు. నన్ను నేను చూసుకున్నప్పుడు, వాస్తవంగా నాలో అనేక లోపాలు ఉన్నవని భావించాను.


నీలి రంగు దారము నందు విశ్వాసముంచుట చేత మనము పరిశుద్దతను పొందెదము
 
ప్రజలు ఎప్పుడైతే వారికి వారు ఆలోచించెదరో,వారు ప్రతిదీ ఎలాంటి పొరపాటు లేకుండా చక్కగా చేయగలమని భావన కలిగి ఉందురు.కానీ వారు ఎప్పుడైతే ఒక పనిని పరిష్కరిస్తారో,వారి వాస్తవిక సామర్ధ్యము మరియు లోపాలు స్పష్టముగా బయటపడును. అప్పుడు వారు నిజముగా సరిపోయియిన వారు కాదని మరియు సహాయము చేయక పాపము చేయుచు అనేకమైన పొరపాట్లు చేయుదురు. అదేకాకుండా,ప్రజలు ఎప్పుడైతే వారు చేయునది సరియైనది అని ఆలోచించినప్పుడు, దేవుని యొక్క పరలోకరాజ్యములో ప్రవేశించగలమని వారని వారే అలోచించి మోసం చేసుకొనుచున్నారు కారణము వారి విశ్వాసము అంత మంచిదైయున్నదని వారి అర్ధం.
 శరీరము ఎప్పుడు మారదు.లోపములు లేకుండా శరీరం ఉండనేరదు,మరియు అది ఎల్లప్పుడూ తప్పుడు పనులు చేయుచు దాని లోపాలను వెల్లడిచేయును. ఒకవేళ,ఏ అవకాశమున్నను,ఏ కారణము చేతనైనను నీ శరీరం ద్వారా చేసిన మంచి వలన ప్రభువు రాజ్యములో ప్రవేశించగలవని నీవు ఆలోచించు వచ్చు, నీవు ఒకటి గ్రహించాలి నీ శరీరం ద్వారా ఎంత మంచి పని చేసిన ఉపయోగం లేదు,దేవుని యెదుట అది ఉపయోగం లేనిది. విషయమేదనగా ప్రభువు రాజ్యములో ప్రవేశించాలంటే మన విశ్వాసమునునది సత్యవాక్యమునైన నీలం,ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం వలన ప్రభువు మనలను రక్షించిన దాని యందు విశ్వాసముంచవలెను. అప్పుడు మాత్రమే ఆయన పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించగలము.
 నీలం ,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణము గలదారం ద్వారా మనలను రక్షించ లేదా,మన అందరము ఎన్నడూ పరిశుద్ధస్థలములోకి ప్రవేశించలేము. మన విశ్వాసం ఎంత న బలమైనది అయినను, మనము ప్రవేశించలేము. ఎందుకని? మన శరీరమనునది ప్రతి రోజు ఖచ్చితముగా మంచిగా ఉండినప్పుడే మనం ప్రవేశించగలము. కావున ఇలాంటి పరిస్ధితి యైనప్పుడు,ప్రతి రోజు మన విశ్వాసము చాలినంత ఉంటేనే దేవుని రాజ్యములో ప్రవేశించుటయైతే,మనము ఎలా ప్రవేశించగలము,అలాంటి బలహీనమైన శరీరము ఎవరికీ ఉన్నది,ప్రతిరోజు మన విశ్వాసము మంచిగా ఉండుటకు పరలోకములో ప్రవేశించుటకు ఎప్పుడు ప్రయత్నిం చేయలేదా?ఎప్పుడైతే మన ద్వారా పాపముల నుండి విడుదల పొందుట మార్గము లేనప్పుడు,మరియు మనలో విశ్వాసము లేనప్పుడు పాపము చేసిన ప్రతి రోజు చుట్టూతా తిరుగుదము,దేవుని రాజ్యములో ప్రవేశించుటకు చాలినంత విశ్వాసమును ఎలా మనము సిద్దము చేసుకోగలము ? ఈ విధంగా ప్రారభించుటకు మన శరీరాలు పాపము చేయని పరిశుద్ధ అవయువాలుగా ఉండవలెను,లేదా మనము పశ్చాతాపముతో కూడిన ఉపవాస ప్రార్థనలు ప్రతి రోజు చేయవలసి ఉంటుంది,అయితే కొందరి శరీరాలు ఎప్పుడు పరిశుద్ధముగా ఉండినప్పుడు మరియు ఇది ఎవరు చేయగలరు?
 దేవుడు నీలం,ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మనలను రక్షించ లేదా, అలా అయితే మనలో ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యం ప్రవేశించలేరు. మన విశ్వాసము కాసేపు బాగానే ఉంటుంది మరికాసేపటికి మాయమైపోవును మనము అలాంటి విశ్వాసముతో ఉన్నాము.మన విశ్వాసము మంచిగా మారినప్పుడు తరచుగా పదే పదే అది మాయమైపోతుంది,అప్పుడు మనము నిజముగా విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేదా అనే సందేహం కలుగుతుంది, మరియు మనము మొదట కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టెదము.చివరకి, యేసును నమ్మిన మొదటి రోజులు కంటే ఇప్పుడు మరింత పాపులుగా మారుదము.కానీ యేసు సరితూగని పాపులుగా ఉన్న మనలను, సంపూర్తిగా రక్షించాడు, ఆయన నీలం,ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారలో చూపించిన రక్షణ ప్రణాళిక ప్రకారము మన పాపములకు విమోచన కలుగజేసాడు.
 మనకు ఇలాంటి ఆధారము ఉన్నప్పుడు మాత్రమే మనము బంగార పలకను పెట్టగలము,``యెహోవా పరిశుద్ధుడు`` అని ప్రధానయాజకుని తలపాగాకు పెట్టినట్లుగా మనకు పెట్టబడును (నిర్గమ28:36-38). మనము ఆ యాజకత్వమును మోయగలము. ఎవరైతే ``యెహోవా పరిశుద్ధుడు`` అని ప్రజలకు సాక్షమిస్తారో వారు ఆయనకు యాజకులుగా సేవచేయుదురు వారు వారి హృదయాలలో సాక్షాన్ని కలిగి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా వారి పాపముల నుండి విడుదల పొందియున్నారు.
 బంగారు పలక ప్రధానయాజకుని తలపాగాకు ఉంచబడియున్నది,మరియు తలపాగాకు కట్టుబడిన ఈ బంగారపు ఫలకం కూడా నీలిరంగు త్రాడుతోనే కట్టబడింది. దేవుడు ఎందుకు తలపాగ నీలి రంగు త్రాడుతో కట్టవలెనని చెప్పుచున్నాడు? మనలను నీలి రంగు దారంతో రక్షించుట మన ప్రభువుకు ఎంత ముఖ్యమైనదో అలాగే నీలి రంగు దారం యేసు మన పాపముల బాప్తీస్మం ద్వారా తన పై తీసుకున్న దానిని సూచిస్తుంది. నూతన నిబంధనలో ఆయన బాప్తీస్మం ద్వారా మన పాపములను తనపైకి తీసుకొని మన పాపములను తుడిచివేయలేదా,అలాగే పాతనిబంధనలో చేతులు వేయు పద్దతిలో జరిగింది;మనము యేసును ఎలా నమ్మిన యెహోవా నుండి పరిశుద్దతను పొందలేము. అందుకనే బంగారపు పలకము నీలి త్రాడుతో తలపాగాకు కట్టబడియున్నది. మరియు ప్రధాన యాజకుని తలపాగాకు ఉన్న బంగారు పలకమును ``యెహోవా పరిశుద్ధుడు`` అని చెక్కబడుటయు ప్రతి ఒక్కరు చూచినప్పుడు వారి పాపముల నుండి విడుదల పొందిన తరువాత దేవుని యెదుట వారి పరిశుద్దతను కలిగి ఉండుటను గుర్తుచేస్తుంది. మరియు అది ప్రజలను దేవుని యెదుట ఏ విధముగా పరిశుద్దులుగా ఉండవలేయునో ఆలోచింప చేయును.
 మనము నీతిమంతులుగా ఎలా మారేమో తప్పని సరిగా గుర్తుచేసుకోవాలి. మనమునీతిమంతులముగామారామా? మత్తయి3:15 చదువుదాము.``యేసుఇప్పటికి కానిమ్ము;నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.``యేసు బాప్తీస్మం తీసుకోవటం ద్వారా మన పాపముల నుండి మనలను రక్షించాడు. ఆయన బాప్తీస్మం ద్వారా తానె మన పాపములను తనపై తీసుకొనెను,దీనిని నమ్ము వారు పాపము లేని వారు.యేసు బాప్తీస్మం తీసుకోలేదా, అప్పుడు మనము ఎన్నటికీ పాపము లేనివారమని ధైర్యముగా ఎలా చెప్పగలము? సిలువ మీద మరణించిన యేసులో నీ కళ్ళలో నుండి యధార్ధముగా కార్చిన కన్నీటి విశ్వాసపు ఒప్పుకోలు ద్వారా పాపముల నుండి విడుదల పొందితివా? అనేకమంది ప్రజలు యేసు మరణమును బట్టి ఏడ్చుట కష్టమేనని తెలుసుకున్నారు,నీకు సంబంధము లేని వారి తాత గారు చనిపోతే దానిని తలచుకొని కన్నీరు కార్చుటకు ప్రయత్నించదవు,వారు జబ్బున పడినప్పుడు వారు కష్టాలను కలిగి ఉంటారు,లేదా గడిచిన కాలములో వారి కష్టాలను మరియు బాధలను గుర్తు చేసుకుందురు.ఈ విధంగా ఏడ్చుటకు నటించదవొ, లేదా నిజముగా యేసు యొక్క శ్రమలను బట్టి ఏడ్చదవో అది ఏదైనను,ఈ విధమైన క్రమముతో నీ పాపములు కొట్టివేయబడవు.
 చెక్కబడిన బంగారు పలకము వలె ``ప్రభువు పరిశుద్ధుడు``అనునది నీలి త్రాడుతో ప్రధానయాజకుని తలపాగాకు కట్టుట అనేది,ఏవిధంగా మన పాపములను తుడిచి వేసి మనలను పరిశుద్ధపరచును అది యేసు యొక్క బాప్తీస్మం వలననే జరుగును.యేసు ఆయన బాప్తీస్మం ద్వారా మన పాపములను ఆయన పై తీసుకొనుట ద్వారా మన హృదయాలలో పాపము నుండి విడిపించబడితిమి.కారణము యెహోవా మన పాపములన్నిటిని ఆయన మీద మోపి యున్నాడు,అందుచేత లోకములో ఉన్న సమస్త పాపములు ఆయన బాప్తీస్మం ద్వారా ఆయన పైకి పంపించబడెను.మన హృదయాలు శూన్యత కలిగిన భావాలు కలిగి ఉన్నప్పటికీ,మరియు అలాగే మనం చేయు పనులలో సరిపోయిన వారిమీ కాకపోయినను, బైబిల్ లో వ్రాయబడిన విధంగా మనము నీలి రంగు దారమైన వాక్యము వలన సంపూర్తిగా రక్షించబడి నీతిమంతులుగా చేయబడితిమి.మనము మన శరీరమును చూసుకున్నప్పుడు గౌరవంగా ఉండకపోవచ్చు,కానీ నీలం యొక్క విశ్వాసముతో, కూడిన ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మం హృదయాలలో ఉన్నది- అది,మనము కలిగి ఉన్న పరిపూర్ణమైన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మనకు చెప్పుచున్నది యేసు మన పాపములను తన బాప్తీస్మం ద్వారా తన పైకి తీసుకొని సిలువపై మన శిక్షను ఆయన భరించెను-కావున మనము పిరికి వారిమీ కాకుండా ధైర్యముగా సువార్తను చెప్పగలము. ఇదంతా దేనికి అనగా మనము నీరు మరియు ఆత్మ సువార్తను కలిగి ఉన్నాము గనుక నీతితో కూడిన విశ్వాస జీవితమును జీవించగలము,మరియు అదియే కాక ప్రజలకు ఈ విశ్వాసపు నీతిని బోధించాలి. 
 మన ప్రభువు కృపను బట్టి కృతజ్ఞలు చెప్పలేనివి. రక్షణ అనునది మనకు అస్పష్టముగా వచ్చినది కాదు, అందును బట్టి మనమందరము కృతజ్ఞలం. మనము పొందిన ఈ రక్షణ ఎవరైనను సరిగా విశ్వాసముంచినా ఉంచకపోయినా పొందే అల్పమైనది కాదు. వారి స్వంత సణుగులతో ``ప్రభువా, ప్రభువా,``ఆయనను పిలిచినప్పుడు, వారు రక్షించబడతారని కాదు. మన హృదయాలలో నిశ్చయత ఉంది అది నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మన పాపములు తొలగిపోయెను, మన ప్రభువు నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారతో, సూక్షమంగా మనలను రక్షించాడు,ఈ గొప్ప రక్షణనుకై మనము కృతజ్ఞలమైయున్నాము.
 మనకు బైబిల్ చెప్పుచున్నది యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ము ప్రతి వ్యక్తి హృదయములో సాక్ష్యమును కలిగి ఉందురు(1 యోహాను 5:10).మన హృదయాలలో సాక్షం లేనప్పుడు, మనము దేవుని అబద్ధికుని చేయుచున్నాము, కావున మన హృదయాలలో నిశ్చయతతో కూడిన సాక్షమును కలిగి ఉండాలి. అటువలె, మనలను అడిగిన వారికి మరియు సవాలు చేసిన వారికి మనము వెనుకకు వెళ్లి పరిస్థితులను చెప్పవలసిన అవసరం లేదు,``నీవు రక్షించబడినట్లు ఆధారాలు చూపించు. అప్పుడు నీవు చెప్పవలసినది ప్రజలు పాపము నుండి విడుదల పొందినప్పుడు, పరిశుద్ధాత్మను వరంగా పొందుదురు,మరియు మరొక చోట రక్షణ యొక్క స్పష్టమైన ఆధారము ఉన్నది. ఆ ఆధారము చూపించు. ``నీవు ధైర్యముగా ఆ ఆదారమును క్రింద అనుసరిస్తున్న వాటిని బట్టి చెప్పవచ్చు: ‘’నన్ను సంపూర్తిగా రక్షించిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నాలో ఉన్నది.ఎందుకనగా ఆయన వలన నేను పరిపూర్ణoగా రక్షించబడియున్నాను,నాలో పాపమేమియు లేదు.’’
 నీ రక్షణను గూర్చి నీవు సరియైన ఆధారము నీ హృదయములో లేనప్పుడు, నీవు రక్షించబడలేదు. ప్రజలు యేసును ఎంత ఆసక్తిగా నమ్ముచున్నారనేది కాదు,ఇది వారి రక్షణకు సరిపోయినది కాదు. ఇది అవసరము లేని ప్రేమ మాత్రమే. ఇది ఒక ప్రేమ ఎదుట వ్యక్తి ఏమనుకొనుచున్నాడో అనేది పరిగణిలోకి తీసుకోకుండా ఉండునది. మనము ఎవరినైన ప్రేమించలేనప్పుడు తడబడుతున్న హృదయం కలిగి ఉందుము, మన నుండి కోరుతున్నవి, ప్రేమించే భావన, మరియు మన వైపు మనం చూసుకున్నప్పుడు ఈ వ్యక్తి ప్రేమించిన దాని కొరకు చనిపోతున్నట్లైతే,తిరిగి మనము అతన్ని ప్రేమించ అవసరము లేదు. అదే విధంగా, ఆయన కొరకు వారి హృదయములో బాదపడినంత మాత్రాన వారి పాపముల నుండి విడుదల పొందని వారిని దేవుడు తన చేతులతో కౌగిలించుకొనడు. దేవుని కొరకు పాపుల యొక్క ప్రేమ అనవసరమైనది.
 మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు, మనము కఖచ్చితంగా ఆయన వాక్యము సత్యమని నమ్మవలెయును. మన ప్రేమ ఆయన యందు ఒక వైపు ఉండ కూడదు.మన ప్రేమను తప్పని సరిగా ఆయనకు వ్యక్తపరచాలి,మరియు మనము ఆయనను ప్రేమించే ముందు ఆయన మనలను నిజముగా ప్రేమిచుచున్నాడా లేదా అని తెలుసుకోవాలి. వాస్తవంగా మనలను ప్రేమించిన వారిని మనము ప్రేమించినట్లైతే, మనకు ఎదురై ఫలితము విరిగిన హృదయము. 
 మన ప్రభువు మనలను మన పాపమును బట్టి శిక్షించక ఆయన రక్షణ కృపతో ధరించెను. దేవునితో నివసించుటకు ఆయన మనలను పరలోకరాజ్యములో ప్రవేశించుటకు అనుమతించెను,మరియు ఆయన మనకు ఇచ్చిన వరము బట్టి పాపముల నుండి విడుదల దేవుని కృప ద్వారా పొందితిమి. దేవుని యొక్క రక్షణ మనకు పరలోకం నుండి అనేక ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలను తీసుకొచ్చింది. ఈ ఒక్క రక్షణను దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు,మరొక మాటలో,ఆయన నుండి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవటానికి మనకు సామర్థ్యం కలుగజేసాడు. 
 

యేసు తనకు తానె ఈ రక్షణను మనకు తెచ్చియున్నాడు
 
 మన ప్రభువు నీలం, ఊదా ,మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం ద్వారా మనలను రక్షించాడు. మూడు రకాల వ్యత్యాసమైన దారాలతో ఆయన మనకు రక్షణ అనుగ్రహించెను. ఈ రక్షణ నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం అనునది దేవుని చేత అనుగ్రహించబడిన రక్షణ యొక్క వరము. ఇది రక్షణ యొక్క వరము పరిశుద్ధస్థలములోకి ప్రేవేశించుటకు మనకు సామర్ధ్యము కలుగజేయును.
 నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నిన్ను మరియు నన్ను నీతిమంతులుగా మార్చియున్నది. ఇది మనలను దేవుని సంఘములోకి అనుమతించును పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు. మరియు ఈ సత్యసువార్త దేవుని వాక్యం చేత పోషించబడుటకు మరియు ఆయన కృపను పొందుటకు మనకు సామర్థ్యం కలుగజేయబడెను.ఇది మనలను ఆయన కృపాసింహాసనం యొద్దకు ప్రార్దించుటకు నడిపించును,మరియు ఆ విధముగా దేవుని చేత అనుగ్రహించబడిన సమృద్ధియైన కృపను పొందుకొనుటకు మనకు స్వతగా విశ్వాసము అనుగ్రహించబడెను.మన రక్షణ వలననే, దేవుడు మనకు ఈ గొప్ప ఆశీర్వాదమును మనదిగా చేసియున్నాడు. అందుకనే రక్షణ చాల విలువైనది.
 మన విశ్వాసం యొక్క గృహమును బండ మీద నిర్మించమని యేసు చెప్పాడు (మత్తయి 7:24). ఈ బండ అనునది నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా వచ్చిన మన యొక్క రక్షణై యున్నది. అదే విధంగా, రక్షించబడుచున్న మనము తప్పనిసరిగా విశ్వాసముతో జీవించవలెను-రక్షించబడుచూ నీతిమంతులుగా మారుదము, రక్షించబడుచూ శాశ్వత జీవితమును ఆనందించెదము, మరియు రక్షించబడుచు పరలోకం వెళ్ళెదము.
 యుగసమాప్తి మనకు సమీపంగా ఉంది. ఈ యుగములో, ప్రజలు వాక్యం ద్వారా రక్షించబడుటకు ఖచ్చితమైన అనేక కారణాలు కలిగి ఉన్నారు. కాంతమంది ప్రజలు ఇలా దురుసుగా చెప్పుదురు ఒక వ్యక్తి నీలం, మరియు ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం, నందు విశ్వాస ముంచుట తెలియకపోయినప్పటికీ, యేసు నందు విశ్వాసముంచుట ద్వారా రక్షించబడవచ్చును, విశ్వాసపు జీవితం గురించి మాట్లాడవలసిన అవసరం లేదు,ఈ విధంగా రక్షించబడుటకు ఇది సరిపోవును.
 ఏదైనను,నేనెందుకు పదే పదే చెప్పుచున్నానంటే ఎవరైతే వారి హృదయాలలో పాప విమోచన పొందియున్నారో దేవుడు ఆమోదించినట్లుగా విశ్వాసపు జీవితాలను జీవించగలరు.పాపము నుండి విడుదల పొందిన ప్రతి పరిశుద్ధుని హృదయం పరిశుద్దాత్మ నివసించే పరిశుద్ధ ఆలయం,తిరిగి జన్మించిన పరిశుద్ధుడు తప్పనిసరిగా పరిశుద్ధత అపవిత్రం కాకుండ విశ్వాసపు జీవితం జీవించును.
 పాపులు జీవించే జీవిత పరిధి నుండి నీతిమంతులు జీవించే జీవిత విధానము పూర్తిగా బిన్నంగా ఉంటుంది. దేవుని కోణం నుండి, పాపులు ఎలా ఆయన పరిధిలకు పూర్తిగా తక్కువ వారిగా జీవించెదరు. వారి హృదయాలు వేషధారణతో నింపబడి యున్నవి. న్యాయం ప్రకారం నడుచుటకు ప్రయత్నించుట వారికి చాలా కష్టం. వారు స్వతగా ఎలా నడుచుకోవాలో, వారి జీవితాలను ఎలా జీవించాలో,ఎలా మాట్లాడవలెనో, ఎలా నవ్వాలో, వారికి వారు కొన్ని పరిధులు ఏర్పరుచుకొందురు.
 అయితే నీతిమంతుల విశ్వాసపు జీవితము నుండి ఇది మరింత దూరముగా తొలగించబడియున్నది.దేవుడునీతిమంతులకు క్లుప్తంగా చెప్పుచున్నాడు,``నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ శక్తితో ప్రేమించుము మరియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము``.దేవుడు నీతిమంతులకు ఇచ్చిన జీవిత విధానం ఇదే.ఇది నీతిమంతులకు సరియైనది మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుటయు, మరియు పూర్ణ శక్తితో ఆయన చిత్తాన్ని అనుసరించుటయో.మన పొరుగు వారిని రక్షించుటకు, ఆయన పని యందు తప్పని సరిగా మరింత వ్యయమును ఖర్చుచేయవలసి ఉన్నది. ఇదియే కైస్తవుల యొక్క జీవన విధానం.
 మనము ఒక స్థాయిలో నిలబడి అన్ని సమస్యలకు కారణము అది అని ఆలోచించినప్పుడు మనకు మనముగా పాపము చేయము,అప్పుడు తిరిగి జన్మించిన -క్రైస్తవ విశ్వాసుల జీవితాలను మనము అనుసరించలేము. నేను తిరిగి పుట్టక ముందు, నేను ఒక ఆచారపరమైన ప్రెస్బిటేరియన్ సంస్థలో చట్ట పరమైన విశ్వాసి జీవితమును గడిపితిని, మరియు ఇప్పటి వరకు న్యాయపరమైన జీవితము పరిగణలోకి తీసుకోబడింది, నేను కూడా పాటించడానికి ప్రయత్నించాను. ఇప్పటి రోజులలో, ప్రజలు ఇలా చేయుట మానివేశారు, కావున నేను చాలా కాలం నుండి ఆధ్యాత్మికమైన జీవితములో నడిపించబడుచున్నాను, నా అనుదిన జీవితములో ధర్మశాస్త్రాన్ని పాటించటంలో నేను మరింత శ్రద్ధను కలిగిఉన్నాను. నేను ధర్మశాస్త్రమునకు పూర్తి విధేయుడను ప్రభువు దినము రోజు నేను ఎన్నడు పనిచేయను, ధర్మశాస్త్రం ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకొనవలెను మరియు పరిశుద్ధముగా ఆచరించవలెయును నేను దానిని కొంచం పొడిగించుచు ఆదివారాలలో కారులో వెళ్లడం కూడా మానుకున్నాను. నేను చేసినట్లుగా మీరు చేయాలని కోరినట్లైతే,ఎవరు కూడా ఆ విధమైన న్యాయపరమైన జీవితమును జీవించలేరు. నేను తిరిగి జన్మించకముందు నా జీవితము ఇలా న్యాయపరంగా ఉండేది. ఏదేమైనను,ఆ రోజుల్లో నా భక్తి జీవితాన్ని నేనెంతో భక్తితో గడిపాను అనేది కాదు,అటువంటి జీవితము దేవుని చిత్తమును జరిగించలేదు మరియు పూర్తిగా ఉపయోగం లేనిది.
 చదవరులారా, నీవు నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం యొక్క విశ్వాసాన్ని కలిగిఉన్నావా? కారణము యేసు యొక్క రక్షణ అనునది ఈ మూడు దారాలను కలిగియున్నది, మన విశ్వాసము ద్వారా పరిశుద్ధస్థలములో ప్రవేశించగలము. మన యొక్క రక్షణ 2,000 సంవత్సరాల క్రితమే నెరవేర్చబడింది. యేసుక్రీస్తును,మనము యెరుగక మునుపే, ఆయన బాప్తీస్మం ద్వారా మన పాపములను ముందుగానే ఆయన పైకి తీసుకొని సిలువలో మరణించుట ద్వారా మన పాపములన్నిటికై శిక్షను భరించెను.
 

పాపము నుండి రక్షణ యేసుక్రీస్తులో ఏర్పాటు చేయబడింది 
 
తిరిగి జన్మించని వారు ప్రత్యక్షగుడారములో ప్రవేశించెదరు,కానీ దాని ఆవరణ ద్వారం గుండా ప్రవేశించలేరు,కానీ అసంబద్దకంగా వారు గోడ ఎక్కుదురు. వారు చెప్పుదురు,``సన్నని పేనిన నార యొక్క గోడ ఎందుకు అంత తెల్లగా ఉంటుంది? ఇది చాలా భారమైనది.వారు తప్పని సరిగా నీలం,మరియు ఎరుపు రంగు వేయుదురు. కానీ ఈ నాటి రోజుల్లో ఇది ఎంత చక్కగా అలకరించబడుతుంది. అయితే ఈ ప్రహరీ గోడ చాలా తెల్లగా ఉంటుంది!ఇది మరింతగా అంటుకుంటుంది. ఇది 2.25 మీటర్ల పైగా ఉండును.ఎందుకని ఇది మరింత ఎత్తుగా ఉంది? నా యెత్తు రెండు మీటర్లు కంటే లేదు;ప్రహరీ అంత ఎత్తుగా ఉన్నప్పుడు నేను ఎలా లోపలికి వెళ్ళగలను? బాగుంది,నేను పైగా నిచ్చెన ఉపయోగించి ఎక్కగలను.
 అలాంటి ప్రజలు వారి మంచి పనుల ద్వారా ప్రవేశించుటకు ప్రయత్నించెదరు. వారి నైవేద్యములైన,ధర్మకార్యములు,మరియు సహనం, ద్వారా వారు అక్కడ నుండి ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణం పైగా ఎక్కుదురు, వారు ఎక్కుచు ఇలా చెప్పుదురు, నేను తప్పనిసరిగా ఇలా 2.25 మీటర్లు క్రిందికి ఎలాగైనా దూకుదును.`` ప్రత్యక్షపుగుడారములోపలకి ప్రవేశించిన తరువాత, వెనుదిరిగి దహన బలిపీఠమును చూచెదరు. బలిపీఠం నుండి వారి దృష్టి పరిశుద్ధస్థలము వైపు చూచెదరు,మొదటగా వారు చూచునది వారు ముందున్న గంగాళమును.
 గుడారము యొక్క ప్రహరీ గోడ యొక్క స్తంభముల ఎత్తు 2.25 మీటర్లు,కానీ స్తంభముల యొక్క ఎత్తు మరియు పరిశుద్ధస్థలము యొక్క ద్వారపు తెర అనగా దేవుడు నివసించు స్థలము 4.5 మీటర్లు. ప్రజలు సరియైన నిశ్చయత చిత్తముతో గుడారము యొక్క ఆవరణములోకి ప్రవేశించగలరు. అయినను వారు దేవుడు నివసించు 2. 25 మీటర్ల ఎత్తుగల గోడను గుడారములోనికి ప్రవేశించటానికి దూకినను,వారు 4.5 మీటర్ల ఎత్తుగల స్తంభములను మరియు పరిశుద్ధస్థలము యొక్క ద్వారపు తెరను ఎదుర్కొందురు. ప్రజలు వారి స్వంత ప్రయత్నలతో 2.5 మీటర్లు దూకగలరు. కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన 4.5 మీటర్ల వారు దూకలేరు.ఇదే వారి సరిహద్దు.
 దీని అర్ధం మనము మొదట యేసును నమ్మినప్పుడు, మతముగా మాత్రమే నమ్మితిమి. అలాగే కొంతమంది యేసును వారి స్వంత ఇష్టం చొప్పున వారి రక్షకుడని నమ్ముదురు,మరియు అలాగే నలుగురి ఋషులలో ఈయన ఒక రక్షకుడు మాత్రమే అని నమ్ముదురు. ప్రజల నమ్మకాలు లెక్కలేనివి, వారు ఏ మార్గము ఎన్నుకున్నను వారు తమ స్వంత విశ్వాసమును కలిగిఉందురు,అయితే వారు వారి విశ్వాసము ద్వారా నిజముగా తిరిగి జన్మించలేరు.
 నిజముగా తిరిగి జన్మించుటకు, వారు నీలం, ఊదా,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార యొక్క ద్వారము గుండా వారి విశ్వాసం తప్పనిసరిగా దాటవలెయును.మనము దేవుని యెదుట యేసు మన యొక్క రక్షకుడిగా మరియు సత్యమార్గముగా, నమ్మి తిరిగి జన్మించితిమి మరియు ఆయన మనలను నీరు, రక్తం మరియు ఆత్మ ద్వారా రక్షించెను. విశ్వాసము అనునది యేసు యొక్క కార్యాలు మూడు దారాలలో వ్యక్తపరచబడిన దానిని నమ్ముటయో అది నీరు, రక్తం మరియు ఆత్మ నందు విశ్వాసమే. ప్రజలు స్వేచ్ఛాపరులు మరిదేనినైను నమ్ముటకు,ఈ విధంగా నమ్ముట వలన ఆశీర్వదించబడుటయు మరియు రక్షించబడుటకు సానుకూల ఏ ఆధారము లేదు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు ఉంచు విశ్వాసముతో మాత్రమే మనము దేవుని యొక్క రక్షణ మరియు అధిక కృపయు ఆమోదమును పొందగలము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో ఉన్న విశ్వాసం యొక్క ఉద్దేశం దేవుని కృపను వస్త్రము వలె మనలను ధరింపచేయుటకు.
 ప్రత్యక్షపుగుడారము ఆవరణాన్ని నీవు ఒక దీర్ఘచత్రుస్రాకార ఆకారం మాత్రమే అని అనుకున్నావా అందులో ఒక ఇల్లు నిలవబడినట్టుగా? ఇది నీ విశ్వాసానికి ఎలాంటి ఉపయోగం తీసుకురాలేదు.గుడారం మనకు చెప్పుచున్నది ఒక సంపూర్ణ విశ్వాసం గురించి,కావున ఖచ్చితంగా ఈ విశ్వాసం ఏమైయున్నదో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి.
 ప్రత్యక్షపుగుడారమును నీవు సరిగా తెలుసుకోలేదు, బహుశా గుడారపు గోడ యొక్క ఎత్తు 2.25 మీటర్లు అని నీవు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు.మనము ఆవరణములోకి వెళ్లలేకపోతే గుడారమును గోడ బయట నుండి చూడవచ్చు,గోడ ఎత్తుగా ఉన్నప్పటికీ గుడారమును రెండు సార్లు చూడగలము. గుడారము యొక్క అడుగు భాగమును మనము చూడలేక పోయినప్పటికీ,మనము వాటి ద్వారమును స్పష్టముగా చూడగలము,గుడారము ఆవరణ యొక్క గోడ కంటే ఎత్తుగా నిలిచుయున్నదని మనకు తెలియజేస్తుంది.
 యేసునందు సరిగా విశ్వాసముంచుట ద్వారా విడుదల పొందిన వారు ప్రతక్షపుగుడారము ఆవరణము యొక్క ద్వారం గుండా ప్రవేశించెదరు అక్కడ వారు గంగాళము మరియు దహన బలిపీఠం వద్ద వారి సరైన విశ్వాసమును తప్పనిసరిగా దృఢపరచుకొనవలెను,అప్పుడు మాత్రమే పరిశుద్ధస్థలములో ప్రవేశించగలరు. పరిశుద్ధస్థలములో ప్రవేశించుటకు, తప్పిపోకుండ తమ స్వయమును వదులుకోవాలి. పరిశుద్ధస్థలము లోపల ఉన్న పాత్రలు మరియు పరిశుద్ధస్థలము వెలుపల ఉన్న పాత్రలకు తప్పనిసరిగా వ్యత్యాసముండవలెను.
 సాతాను ఎక్కువగా దేనిని ద్వేషించును? పరిశుద్ధస్థలము లోపల మరియు బయట సరిహద్దు రేఖను ద్వేషిస్తాడు.కారణము పరిశుద్ధస్థలమును వెలుపల మరియు బయటి విభజించు వారి మధ్య దేవుడు పనిచేయును, సాతాను ఆ విధమైన సరిహద్దు రేఖను గీయుటను అసహ్యయించుకొనును మరియు ప్రజలను ఈ రేఖను గీయకుండా ఆపుటకు ప్రయత్నించెను. కానీ దీనిని గుర్తుచేసుకో:ఎవరైతే ఈ సరిహద్దు రేఖను గీయుదురో దేవుడు వారి ద్వారా స్పష్టముగా పనిచేయును. దేవుడు అలా స్పష్టముగా విభజన రేఖను గీయు ప్రజల యందు సంతోషించును,మరియు వారి పై ఆయన సమృద్ధియైన ఆశీర్వాదమును కుమ్మరించును తద్వారా వారి తెలివైన విశ్వాసం ద్వారా పరిశుద్ధస్థలములో నివసించెదరు.
 ప్రత్యక్షపుగుడారము వెలుపల ఆవరణములో ఉన్న అన్ని పాత్రల యందు విశ్వాసముంచవలెను మరియు వారి కొరకు ఉపయోగించి అన్ని పాత్రలు దేవుని చేత ముందుగా సిద్ధపరచబడినవి. కావున ప్రజలు వారి పాపము నుండి విడుదల పొందుదురు. మరియు దీనిని ఈ విధంగా నమ్మి పరిశుద్ధస్థలములోకి ప్రవేశించినప్పుడు, దేవుడు నీ పై అత్యధిక కృపయు మరియు ఆశీర్వాదమును అనుగ్రహించెను.


కరుణాపీఠము నుండి మనము రక్షణ పొందుదుము
 
అతిపరిశుద్ధస్థలములో,రెండు కెరూబులు వాటి రెక్కలు పై నుండి మూతతో మూసివేయబడిన సాక్షపు మందసము క్రిందికి చాపబడియున్నది. రెండు కెరూబుల మధ్య స్థలమును కరుణాపీఠము అని పిలిచెదరు. కరుణాపీఠము నుండియో దేవుడు తన కృపను మనపై అనుగ్రహించేది.మూసివున్న సాక్షపు మందసము రక్తంతో తడిసిపోయెను, ఇశ్రేయేలు ప్రజలు కొరకు అర్పించబడిన బలి రక్తమును యాజకుడు కరుణా పీఠముపై ఏడుమార్లు చిలకరించును.అలా దేవుడు కరుణాపీఠము పై దిగివచ్చు ఇశ్రేయేలు ప్రజల పై ఆయన కరుణను అనుగ్రహించెను.దీనిని నమ్మినవారికి,దేవుని ఆశీర్వాదం,కాపుదల,మరియు దేవుని నడిపింపు ప్రారంభమగును.అప్పటి నుండి,వారు దేవుని నిజమైన ప్రజలుగా మరియు పరిశుద్ధస్థలములోకి ప్రవేశించుటకు అర్హులు. 
 ఈ లోకము యొక్క క్రైస్తవులలో అనేకలు పరిశుద్ధస్థలములో ప్రవేశించుటకు అనుమతించబడే విశ్వాసాన్ని కలిగివున్నారు,మరికొంతమంది పరిశుద్ధస్థలములోకి ప్రవేశించే విశ్వాసమును కలిగిఉండరు.నీవు ఏ రకమైన విశ్వాసమును కలిగి ఉన్నావు?రక్షణకు స్పష్టమైన రేఖను గీయు విశ్వాసము మనకు అవసరమైనది మరియు దేవుని పరిశుద్ధస్థలములోకి ప్రవేశించగలము,మనము ఇలా చేయటం వలన మాత్రమే దేవుని చేతి గొప్పగా ఆశీర్వదించబడుదుము.
 కానీ ఇలాంటి రకమైన విశ్వాసం కలిగి ఉండుట సులభం కాదు.కారణం ఎప్పుడైతే ప్రజలు స్పష్టమైన రక్షణ యొక్క రేఖను గీయుదురో సాతాను అసహ్యయించుకొనును, అతను ఈ రేఖను అస్పష్టముగా చేయుటకు ప్రయత్నించును.``ఈ విధంగా నీవు నమ్మవలసిన అవసరం లేదు. అందరు ఈ విధంగా నమ్మవలసిన అవసరం లేదు, కావున దీనిపై నీవు ఎందుకు అంత ప్రాముఖ్యతను ఇస్తున్నావు అలాగే పదే పదే జాగ్రాత్త కలిగిఉన్నావు? తేలికగా తీసుకోండి; ముందుకు దూసుకెళ్ళు,``ఈ లాంటివి చెప్పుచూ, స్పష్టమైన రక్షణ యొక్క రేఖను అర్ధం కాకుండా చేయును.అంతే కాక,సాతాను మన యొక్క శారీరక బలహీనతలను తెలియజేయుచూ వాటిని సమస్యగా మార్చుటకు ప్రయత్నించును. దేవుని నుండి వేరు చేయుటకు ప్రయత్నించు సాతాను యొక్క మాయమాటలను నమ్మే వ్యక్తిగా నీవు వున్నావా? లేదా ప్రతి రోజు నీవు నీ రక్షణను గుర్తు చేసుకొనుచూ జీవించెదవా,సంఘముతో ఐక్యమై, దేవుని వాక్యము అనుసరించుచు, ప్రార్థనా జీవితముతో నడిపించబడుచూ, మరియు దేవుడు అనుగ్రహించు కృపను పొందుకొనెదవా?
 సహజంగా, పాపముల నుండి విడుదల పొందిన వారు వారి రక్షణను గూర్చి ధ్యానం చేసుకొనుటకు ఇష్టమైతే తరచుగా వారు చేసుకోవచ్చు. వారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త పై పదే పదే ఆలోచించెదరు. సువార్తను ధ్యానించటం అనేది మీకు చాల ముఖ్యమైనది. నీవు ఇలా లేనట్లేనా?``అయ్యో, మరలా అదే కథనే, మనము ఎప్పుడు రక్షించబడ్డాము? కథ భౌతికమైనను మరియు ప్రణాళిక వ్యత్యాసము కావచ్చు,కానీ ఇప్పటికి అది పాత కథే. ఆ కథను బట్టి నేను అలసిపోయాను!``
 ఇలా చెప్పువారు ఎవరైనా ఉన్నారా ?నేను మీ దృష్టిలో ప్రతి రోజు అదే కథను చెబితే నన్ను క్షమించండి, అయితే బైబిల్ చెప్పినట్లుగా మనము ప్రతిరోజు మన యొక్క రక్షణ గురించి నెమరు వేయాలి, నేనేమి చేయగలను? పాత మరియు క్రొత్త నిబంధనలు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గూర్చి మనతో మాట్లాడినప్పుడు, ప్రజలకు ఇది కాకుండా మరొకటి ప్రకటించుట వలన దేవుని యెదుట దుష్టత్వము ఏమైయున్నది. బైబిల్ వాక్యమంతయు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి మాట్లాడుతుంది.``రక్షణ, విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితము, సాతానుకు వ్యతిరేకముగా యుద్ధము, పరలోకము, మహిమ,కృప,ఆశీర్వాదము,పునరుద్దానము, శాశ్వతజీవము,నిరీక్షణ,మరియు పరిశుద్దాత్మ``ఈ ప్రధాన ముఖ్యమైన పరిశుద్దల యొక్క భావాలన్నియు సత్య సువార్తకు సంబందించినవి. వీటి కంటే వేరొక విషయాలు మాటాడటం అనునది భిన్నమైన బోధ మరియు అబద్దపు బోదయో. చూచుటకు ఏ పోలికయైయున్నను అబద్ద బోద కంటే వ్యత్యాసమైన విషయాన్ని కలిగి ఉన్నది. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నుండి బయటి సువార్తలు చూచుటకు దగ్గర పోలికగా కనబడును కానీ అవి వ్యత్యాసమైన అసత్యమైన-తప్పుడు యొక్క మతతత్వ సువార్తలు.
 దేవుని సంఘము ప్రతి రోజు దేవుని యొక్క వాక్యమును అబద్ద మతాల మాయమాటలతో కాక, సత్యముతో వ్యాపింప చేయుట ఎంత అద్భుతం? దేవుని సంఘముతో ఐక్యమై నిర్మలమైన దేవుని వాక్యమును వినుట మరియు నమ్ముట అనునది ఆశీర్వాదమైనది. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా ఎల్లప్పుడూ ప్రకటించుట చేత, దేవుని సంఘము ప్రతి రోజు పరిశుద్దులను ఆలోచింప చేయు సామర్ధ్యమును కలిగించును, ఆయనకు ప్రార్దించుటలోను, మహిమ పరుచుటలోను, మరియు దుష్ట నడవడిక కాక మంచి జీవితమును జీవించుటకు నీకు సంతోషము లేదా మరొక సారి నీవు విన్న మరియు నమ్మిన సత్యవాక్యములో పాపముల నుండి విడుదల పొందుట నీకు లభించియున్నదా ? నేనైతే అందును బట్టి చాలా సంతోషిస్తున్నాను.
 ఈ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త కాక మరేదైనను ప్రకటించుటకు నేను సరిచేయబడితే, నేను ఎక్కువగా శ్రమ పొందుదును. రక్షణ యొక్క వాక్యము వ్యాపింప చేయుట కాక మనిషి చేత నిర్మించిన బోధలు చేయుటకు నేను సరిచేయబడితే,నేను తప్పుకుంటాను.అయినను,దాని గురించి మాట్లాడుటకు ఏమి లేదు.నేను ప్రస్తావించవలసిన మానవుని యొక్క సమస్యలు విస్తారంగా ఉన్నాయి, కానీ అవన్నియు అవసరము లేనివి మరియు తిరిగి జన్మించిన మనకు పాడైపోయిన పులిసిన బోధలు మాత్రమే.
 కేవలం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మాత్రమే యేసు,దేవుడే ప్రశస్తమైన వాక్యం ద్వారా మనలను రక్షించాడు మనము పదే పదే నెమరు వేసే కొలది మధురమైన తీపిదనాన్ని ఇచ్చును. నేను నీకు చెప్పవలసిన ఇతర కథలు అనేకం కలవు,మనలను రక్షించు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి నేను మాట్లాడినప్పుడు నేను ఎక్కువగా దీనిని ఇష్టపడుదును.అప్పుడు నేను చాలా ఉప్పొంగి పోయాను.నేను ఈ రక్షణ గురించి మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషిస్తాను,నేను ఈ గత అనుభవాలు గుర్తు చేసుకున్నప్పుడు,ప్రభువు నన్ను ఎలా రక్షించాడో నన్ను నేను స్మరణకు తెచ్చుకొందును,మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు,మరియు రక్షణ యొక్క ఆహారమును మరల తినిపించును.
 రక్షణ సువార్తను విన్నప్పుడు నీవు కూడా దీనిని ఎక్కువగా ఇష్టపడుదువు. బహుశా ప్రతి రోజు ఇదే కథని నీవి పిర్యాదు చేయవచ్చు,అయితే మరింత లోతుగా, నీవు ఆలోచించు,``ఇప్పుడు నేను మరల విన్నాను,ఇది మంచిదే. మొదట,ఇది గొప్పది కాదు,కానీ నేను వినుట కొనసాగించినప్పుడు,వినుటకు యోగ్యమైన ఈ కథ కాక మరొకటి ఏది లేదని నేను చూడగలిగాను.ఈ రోజు కథ కొంత వరకు ప్రత్యేకమని నేను భావించాను,కానీ ముగింపు చెప్పుచున్నది మరల అదే కథని. అయినప్పటికీ,నేను సంతోషంగా ఉన్నాను, ``ఈ విధంగా నీ హృదయం ఆలోచించునని నేను ఖచ్చితంగా చెప్పగలను.
 సహోదర మరియు సహోదరి, నేను ఇక్కడ యేసు యొక్క వాక్యమును ప్రకటిస్తున్నాను. ప్రసంగికుడు ఎప్పుడు తప్పని సరిగా యేసు యొక్క వాక్యమునే ప్రకటించాలి. ప్రకటించవలసినది ఏదనగా వ్రాయబడిన నీటి యొక్క వాక్యము మరియు ఆత్మ ద్వారా యేసు చేసినవి అనగా దేవుని సంఘము చేయవలసినవి. మన జీవితాలను సంఘములో విశ్వాసముతో నడిపించుకొనుచున్నాము. పరిశుద్ధస్థలములోకి ప్రవేశించుటకు, సుత్తితో బంగారము యొక్క నైపుణ్యతతో ఏడూ కొమ్మలతో చేయబడి దీపస్తంభం క్రింద వెలుతురును, బంగారము యొక్క గృహములో తిను రొట్టెయు, ధూపార్తి బలిపీఠం యొద్ద ప్రార్థనయు, దేవుని ఆలయమునకు వెళ్లుటయు, ఆయనను ఆరాధించుటయు, మరియు ఈ బంగారము యొక్క గృహములో నివసించుటయు, ఈ వన్నియు మన జీవితము యొక్క విశ్వాసమే.
 నీవు మరియు నేను ఇప్పుడు దేవుని చేత ఇవ్వబడిన విశ్వాస జీవితమును జీవించుచున్నాము.పాపము నుండి విడుదల పొందుట మరియు సరైన విశ్వాస జీవితమును జీవించుట దేవుని బంగార గృహమైన లోపల జీవించుటయున్నది." ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము``(2 కొరింథీ 4:16). ప్రత్యక్షపుగుడారములో చూపించబడిన నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారలో మన యొక్క విశ్వాసంతో, మన యొక్క ఆత్మలు దేవుని గృహములో బంగారము వలె ప్రకాశించును.
 మన పాపముల నుండి మరియు శిక్ష నుండి మనలను శాశ్వతంగా రక్షించిన మన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను!