(నిర్గమకాండము 38: 1-7)
“మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను.దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటె లను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.ఆ బలి పీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.”
ప్రతిపాపి దహన బలిపీఠం యొద్దకు బలి అర్పణను తీసుకురావలసి వచ్చింది
ఇశ్రాయేలు ప్రజలలో ఏ పాపి అయినా తన పాపముల నుండి రక్షణ పొందాలంటే, ఒక బలి జంతువును ప్రత్యక్షపుగుడారానికి తీసుకురావాల్సి ఉంటుంది, దాని తలపై చేతులు వేయుటు ద్వారా అతని పాపములు దాని మీదుకు పంపించబడును, దాని రక్తమును తీసి,యాజకుని చేతికి ఇవ్వవలెను. అప్పుడు ఆయన యాజక క్రమములో ఉన్న యాజకుడు బలి నైవేద్యం యొక్క బలిపీఠం కొమ్ములపై బలి జంతువు యొక్క ఈ రక్తాన్ని ఉంచి, దాని కొవ్వు మరియు మాంసాన్ని బలిపీఠం మీద ఉంచి, వాటిని ప్రభువైన దేవునికి తియ్యనైన పరిమళ సువాసనగా కాల్చబడును. ప్రధాన యాజకుడు కూడా తన పాప విమోచన పొందటానికి దహన జంతువుపై చేతులు వేసి దహనబలి బలిపీఠం ముందు తన పాపాలను జంతువుపైకి పంపవలసి వచ్చింది. ఇది తుమ్మ చెక్కతో తయారు చేయబడి ఇత్తడితో కప్పబడిన దహనబలి బలిపీఠం వద్ద సమర్పించబడిన ప్రాయశ్చిత్తం యొక్క బలి, మరియు ఈ పాప విమోచన యొక్క బలి చేతులు వేయు రూపములోను మరియు రక్తం చిందించడం ద్వారా మాత్రమే అందించబడుతుంది.
లోకము పుట్టకు మునుపే, దేవుడు తన పాపాల నుండి ప్రతి ఒక్కరినీ చేతులు వేయడం ద్వారా మరియు రక్తం చిందించడం ద్వారా రక్షణకు మార్గం సిద్ధం చేశాడు. మన రక్షణకు ప్రణాళిక చేసిన తరువాత, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ భూమ్మీదకు పంపవలసి వచ్చింది, బాప్తీస్మం మిచ్చు యోహాను యోహాను చేత బాప్తిస్మం తీసుకొని, ఆయన రక్తాన్ని సిలువపై చిందించాడు. అందువల్ల యేసుక్రీస్తు ప్రతి పాపి యొక్క సమస్త పాపాలను తన బాప్తీస్మం ద్వారా అంగీకరించాడు, పాతనిబంధనలో చేతులు వేయు పద్దతిలో ఉన్న విధంగా. మరియు లోకపాపముల యొక్క శిక్షణ భరించుటకు,యేసు ఆ పాపములన్నిటిని తన భుజాన వేసుకొని మన స్థానములో సిలువపై తన రక్తమును చిందించాడు.
ప్రతి మానవుని హృదయమనే ఫలకం మీద వ్రాయబడిన ప్రతి పాపాన్ని దేవుడు తప్పుగా శిక్షించునని ఇత్తడితో కప్పబడిన దహనబలి పీఠం మనకు బోధిస్తుంది. అందువల్ల ప్రతి పాపి తమ చేతులు బలిజంతువుపై చేతులు వేసి తన పాపాలను ఆ బలి జంతువుపైకి పంపవలసి వచ్చింది. దాని గొంతును కోసి, దాని ఆ రక్తాన్ని తీసుకొనుట ద్వారా యాజకుడు జంతువు యొక్క రక్తాన్ని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై చిలకరించవలెను. ఈ విధంగా, ఇత్తడితో కప్పబడిన దహనబలి యొక్క బలిపీఠం యేసు మన పాపాలన్నిటినీ భరించాడని మరియు మన స్థానంలో ఈ పాపాలన్నిటికీ ఆయన సిలువపై మన అందరి కొరకు శిక్షించబడ్డాడని తెలుస్తుంది.
దహన బలిపీఠం యొక్క ప్రాముఖ్యత
ఒక బలి జంతువును దేవునికి అర్పించినప్పుడల్లా, దాని మాంసాన్ని ముక్కలుగా చేసి, దహనం చేసే బలిపీఠం మీద నిప్పుతో కాల్చివేసి, దేవునికి తియ్యనైన పరిమళ సువాసనగా అర్పించబడును. యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకొనుట దేవుడు చూచి చాలా సంతోషించాడు, మన పాపాలన్నిటి కొరకై మన స్థానంలో సిలువ వేయబడి. ఏ మచ్చలేని యేసు పాపులందరికీ నిత్య ప్రాయశ్చిత్తంగా తనను తాను త్యాగం చేసినందుకు తండ్రియైన దేవుడు సంతోషించాడు.
దహన బలిపీఠం మీద అర్పించబడే బలులు,దేవుడు ప్రతి పాపిని తన పాపాల నుండి ఎలా రక్షించాడో చూపిస్తుంది, అదే సమయంలో, దేవుడు ప్రతి పాపాన్ని ఎలా ఖండిస్తున్నాడో కూడా చూపిస్తున్నాడు. భిన్నంగా చెప్పాలంటే, దహనబలి యొక్క బలిపీఠం మానవ జాతి యొక్క సమస్త పాపాల నుండి మరియు శిక్ష నుండి రక్షించబడిన విమోచనను తెలుపుతుంది. ప్రతి పాపి అగ్నిగుండములోను మరియు మండుచున్న గంధముల యొక్క నరకములోనికి విసిరివేయబడుదురని ఇది మనకు చూపిస్తుంది: మరియు ప్రతి పాపి తన పాపాల నుండి ఎలా విముక్తి పొందవచ్చో కూడా ఇది చూపిస్తుంది. ఈ విధంగా, ఎవరైతే పాపం చేస్తారో వారిని నరకపు అగ్నిలో పడవేయాలి, అందువల్ల ప్రతి పాపి తప్పకుండా దేవుని దయను కనుగొనాలి.
దహనబలి బలిపీఠం మీద ఉంచబడిన ప్రతి బలి జంతువు ఒక పాపి యొక్క అన్యాయాలను బరించి వారి కొరకు శిక్షించబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, బలి జంతువు ఒకరి యొక్క పాపాలను చేతుల మీద వేయపద్దతిలో అంగీకరించబడింది మరియు దాని స్థానంలో దాని రక్తo చిందించబడును.పాపి ఎదుర్కోవాల్సిన పాప శిక్షను అది భరించింది. గుడారంలో బలి అర్పించబడిన ఈ దహనబలి యేసు తన బాప్తీస్మం ద్వారా ఈ లోకంలోని సమస్త పాపాలను అంగీకరించి మన స్థానములో ఆయన రక్తాన్ని చిందించాడని ఇది మనకు బోధిస్తుంది.
ప్రత్యక్షపుగుడారంలోని ప్రతి పాత్ర దేవుడు మన పాప క్షమాపణను ఎలా నెరవేర్చాడో చూపిస్తుంది. అందువల్ల, మీ రక్షణ యొక్క స్పష్టమైన రేఖను గీయడానికి, గుడారం యొక్క పాత్రలలో వెల్లడైన సత్యంపై మీకు సరైన విశ్వాసం ఉండాలి. మీ రక్షణకు సంబందించిన రేఖను మీరు ఎలా గీయాలి? నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారలో దాగి ఉన్న రక్షణ యొక్క సత్యాన్ని విశ్వసించడం ద్వారా మీరు స్పష్టమైన రక్షణ రేఖను గీయాలి. అలాంటి విశ్వాసం కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క రక్షణలోకి రాగలరు సరైన విశ్వాస జీవితమును జీవించగలరు.
దేవుడు పాపుల పాపమునకై ప్రాయచిత్తపు బలి అర్పణను సిద్దీము చేసాడు, తద్వారా వారు పరిశుద్ధస్థలములోకి రాగలరు.మరియు ప్రధానయాజకుడు వారి పాపాలన్నిటి నుండి వారిని కాపాడేందుకు పాపులందరి తరపున ప్రాయశ్చిత్త బలిని అర్పించాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా రక్షణ యొక్క తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యంలో మన విశ్వాస జీవితమును కొనసాగించవలెయును. మీ విశ్వాసం ఇప్పుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై ఉంచబడిందా? మీరు మీ సమస్త పాపాల నుండి రక్షించబడాలంటే, మీరు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను హృదయపూర్వకంగా విశ్వసించాలి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యం ద్వారా సాక్షమివ్వబడిన ఆత్మపై మీకు విశ్వాసం ఉంటేనే నిజమైన పాప క్షమాపణ దొరుకుతుంది.నిజమే, పాత నిబంధన గుడారంలో చూపబడిన నీలం, ఊదా, మరియు ధూమ్రరక్త వర్ణముగల దారంలో వెల్లడి చేయబడిన రక్షణ యొక్క సత్యం నీటి సువార్తలోను ఆత్మ కొత్త నిబంధనలో వెల్లడి చేయబడింది. మీరు నీటి సువార్త కోసం నిలబడతారా? లేదా సిలువ రక్తాన్ని మాత్రమే నొక్కిచెప్పే సువార్తను మీరు సమర్థిస్తున్నారా? యేసుక్రీస్తు బాప్తీస్మం పొందాడని మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడని ప్రకటించే సువార్తను మీరు నమ్ముతున్నారా? పాత నిబంధన కాలములో, ప్రత్యక్షపుగుడారం యొక్క బలి వ్యవస్థ ప్రపంచంలోని పాపాల నుండి మనలను రక్షిస్తుందని దేవుడు వాగ్దానం చేస్తున్న రక్షణ యొక్క నిబంధనను. దేవుడు నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార ద్వారా తన రక్షణ యొక్క ప్రణాళికను వెల్లడించాడు. ఎవరైతే ఈ ద్వారం గుండా ప్రవేశించాలనుకుంటున్నారో వారు ఈ పదార్థాలలో వెల్లడించిన సత్యాన్ని విశ్వసించాలి. అలాగే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వారు తీసుకొచ్చిన బలి జంతువుపై చేతులు వేసి ప్రత్యక్షపుగుడార బలి ద్వారా వారి పాపాల నుండి రక్షింపబడటానికి అనుమతించాడు. అందువలన వారి పాపాలను విశ్వాసం ద్వారా మరియు దాని రక్తాన్ని దేవునికి అర్పించడం ద్వారా. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త పాప విమోచన ప్రమాణంగా ఉన్నది, అందుచేత ఈ సువార్తను సరిగ్గా అర్థం చేసుకుని నమ్మే వారు మాత్రమే దేవుని స్వంత ప్రజలుగా ఉందురు, అయితే మిగతావారందరూ ఇంకా దేవుని ప్రజలలో ఒకరిగా మారలేదు. ఎందుకంటే నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు గుడారం యొక్క ద్వారంలో ఉపయోగించిన పేనిన సన్నని నార కొత్త సత్య సువార్త యొక్క నీరు మరియు ఆత్మయునైయున్నది.
యోహాను 3 వ అధ్యాయంలో నీకొదేముతో మన ప్రభువు ఇలా అన్నాడు, “ఒకడు నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు అందుకున్న బాప్తీస్మాన్ని ఇక్కడ నీరు సూచిస్తుందని మనమందరం గ్రహించడం చాలా ముఖ్యం. మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం విశ్వాసం ద్వారా దేవుని చేతుల్లోకి రాగలము.
ప్రతి ఒక్కరు వారి పాపములను బట్టి తప్పించుకోలేని శిక్షను పొందుదురని తప్పని సరిగా తెలుసుకొనవలెను
మార్కు 7:21 ఈ విధంగా వివరించబడినట్లుగా, ప్రతి ఒక్కరి హృదయంలో అదే పన్నెండు రకాల పాపాలు అతని హృదయం నుండు ఉద్బవించును. అన్నింటిలో మొదటిది, ఒకరి చెడు ఆలోచనలు దేవుని ముందు పాపమైయున్నది. మరియు హత్య, వ్యభిచారం, దొంగతనం, దురాశ, దుర్మార్గం, అహంకారం మరియు మూర్ఖత్వం అన్నియు పాపములే. ప్రజల హృదయాలలో ఉన్న చెడు ఆలోచనలు దేవుని పరిశుద్దతను కించపరిచే నిజమైన పాపపు వనరులు. దేవుడు ఆదామును శాశ్వత జీవిగా తన ప్రతిరూపం వలె చేసినప్పటికీ, ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాడు మరియు దీని ఫలితంగా, ఆదాము వారుసులైన మన మందరము కూడా పాపాత్ములుగా జన్మించాము, మరియు దేవుని శిక్ష నుండి తప్పించుకోలేకపోయారు. మనమందరం మొదటి మనిషి అయినా ఆదాము వారసులుగా జన్మించినందున, మన ఆలోచనలు మరియు క్రియలలో పాపం చేయడం మరియు దేవుని పరిశుద్దతను కించపరచడం తప్ప మరేమీ చేయకపోవడం మన స్వాభావిక స్వభావం; అందువల్ల మనం చనిపోయే రోజు వరకు మనం పాపం చేయలేము. నిజానికి, మనుషులందరూ స్వభావంతో వారి ఆలోచనలలో ప్రాథమికంగా చెడ్డవారు, మరియు వారు కూడా దేవుని పరిశుద్దతను నిరంతరం సవాలు చేసే సాతాను ద్వారా సులభంగా మోసగించబడే సున్నితమైన జీవులం.
మానవ హృదయం నుండి చెడు ఆలోచనలు తప్ప మరేమీ జరగవని దేవుడు చెప్పాడు. ప్రతి మనిషి వాస్తవానికి హత్య నుండి వ్యభిచారం, దొంగతనం, దురాశ, వ్యభిచారాలు, మూర్ఖత్వం మరియు మార్కు 7 వ అధ్యాయంలో పొందుపరచబడిన పన్నెండు రకాల పాపాలతో నింపబడిన పాపిగా బహిర్గతమవుతాడు. కాబట్టి ప్రతిఒక్కరి ప్రాథమిక మానవ స్వభావం చెడు ఆలోచనలతో నిండి ఉంది.మరియు అనేకమంది ప్రజలు తమ స్వంత మత భక్తితో దేవుని పరిశుద్దతను సవాలు చేస్తున్నారు.అందువల్ల మనమందరం మన పాపాలను బట్టి దేవుని చేత మనం శిక్షించబడవలెను.అందుకే బలి జంతువులను గుడారంలో రోజు రోజుకు దహన బలిపీఠం మీద దహనం చేస్తారు. గుడారం యొక్క ఆవరణo వాస్తవానికి మాంసాన్ని కాల్చే వాసన మరియు కట్టెల పొగతో నిండి ఉంది.
మన మురికిని నీటితోను మరియు గంగాళముతోను శుద్దిచేసుకొనవలెను
పాత నిబంధన యొక్క ప్రధాన యాజకులు ప్రతి రోజూ తమను తాము కరిగించే మాంసం మరియు నల్ల పొగ యొక్క అసహ్యకరమైన వాసనతో చుట్టుముట్టవలసి ఉంటుంది. అందువల్ల వారు శుభ్రంగా ఉండటం అసాధ్యం, ఎందుకంటే వారి ముఖాలు పొగతో నల్లబడి మరియు వారి శరీరాలు ధూళితో కప్పబడి ఉన్నాయి. అందుకే వారు ప్రత్యక్షపుగుడారం యొక్క ఆవరణలో ఇత్తడి గంగాళము అవసరం, తద్వారా వారు తమను తాము కడుక్కోవచ్చు. యాజకులు ప్రతిరోజూ ఇత్తడి గంగాళముతో నీటితో తమ మురికిని కడుక్కోవాలి.
ప్రత్యక్షపుగుడారంలోని ఈ ఇత్తడి గంగాళము కొత్త నిబంధన రోజులలో బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యేసు బాప్తీస్మం పొందడం ద్వారా ఈ ప్రపంచంలోని సమస్త పాపాలను కడిగివేయుటను సూచిస్తుంది. పాత నిబంధనలోని యాజకులు వారి శరీరాలను నీటితో కడుగుదురు, ప్రత్యక్షపుగుడారంలోని ఇత్తడి గంగాళము యేసుక్రీస్తు బాప్తిస్మమును సూచిస్తుంది, ఇది ఆయన శిలువపై చిందించిన రక్తం వలె ఆయన రక్షణకు చాలా ముఖ్యమైనది. బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు అందుకున్న బాప్తీస్మం మన పాపాలన్నింటినీ కడగడానికి ఒక అనివార్యమైన దశ, అది లేకుండా ఎవరూ శుద్దిచేయబడలేరు.నిజానికి, యాజకులు తమ పరిశుద్దతను కాపాడుకోవచ్చు ఎందుకంటే వారు ప్రత్యక్షపుగుడారం యొక్క ఇత్తడి గంగాళము యొద్దకు వెళ్లి కడుగుదురు ప్రత్యక్షపుగుడారంలో పరిచర్య చేస్తున్న సమయంలో సమస్త దూళి పేరుకుపోతుంది కావున.
యాజకులు ఇత్తడి గంగాళము వద్ద వారి మురికిని కడిగివేయడం అనగా, ఎవరైనా తన పాపపు స్వభావాన్ని ఒప్పుకోవాలి మరియు ప్రతి ఒక్కరూ తన పాపాలకు దేవుడు ద్వారా శిక్షించబడ మరియు నాశనం చేయబడతారని గుర్తించాలి. మీరు దేవుని అంగీకరించినప్పుడు మీ పాపాలను బట్టి శాశ్వతంగా బాధపడటానికి నరకం అనే అగ్నిలో వేయబడుటకు మీరు ఇష్టపడినప్పుడు, రక్షణ మార్గం మీకు తెరవబడుతుంది మీరు దేవుని సన్నిధికి రావడానికి ఏకైక మార్గం మీ పాపాలను ఒప్పుకోవడం మరియు యేసు మీ కోసం నెరవేర్చిన నిజమైన రక్షణ యొక్క సత్యాన్ని విశ్వసించడం. ప్రపంచంలోని సమస్త పాపాల నుండి నిన్ను మరియు నన్ను రక్షించడానికి మెసయ్య నిజానికి ఈ భూమ్మీదకు వచ్చాడు; బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా ఆయన నిజంగా మన పాపాలన్నింటినీ భరించాడు;వాస్తవానికి ఆయన మన స్థానంలో సిలువపై శిక్షించబడ్డాడు. ఇది నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం, మరియు ఇది రక్షణకు ఖచ్చితంగా ప్రాముఖ్యమైన సత్యమని మనం నమ్మాలి.
ప్రతి మానవుడు చెడు ఆలోచనలను కలిగి ఉంటాడు, అందువల్ల ప్రతి ఒక్కరూ ఇతరులను బాధపెట్టాలని, వారికి బాధ కలిగించాలని మరియు వారిని చంపాలని కూడా దుష్ట కోరికలు కలిగి ఉంటారు. మనుషులు ఎంత చెడ్డవారు మరియు నీచులో మీరు గుర్తించాలి. అయితే మనుషులు ఎందుకు అంత చెడ్డవారుగా ఉన్నారు? ఎందుకంటే ప్రకృతి ద్వారా వారు దుష్ట సంతానముగా ఉన్నారు,ఎల్లప్పుడూ చెడు ఆలోచనలను ఆశ్రయించడం మరియు ఎల్లప్పుడూ పాపం చేయడమే వారి యొక్క పని. మనుషులు ఈ సమస్త పన్నెండు రకాల పాపాలను అన్ని సమయాలలో చేస్తుంటారు, వారు ఎప్పుడును బాంబు పేల్చువారుగా ఉందురు. నిజానికి, వారు ఎల్లప్పుడు దుర్మార్గాన్ని పాటిస్తూ, ఒకరితో ఒకరు అబద్ధం చెబుతూ, ఒకరి నుండి మరొకరు దొంగిలించుచు, వ్యభిచారం చేస్తూ, దేవుని మహిమను దూషిస్తూ, మూర్ఖత్వంతో పిచ్చి చేష్టలను ప్రేమించెదరు. ప్రకృతి ద్వారా వారు దుర్మార్గుల సంతానం గా,మనుషులు ఎల్లప్పుడూ చెడు ఆలోచనలు కలిగి వారి జీవితాంతం దేవుని పరిశుద్దతను సవాలు చేయుదురు.
దేవుని దృష్టిలో మనం ఎంత చెడ్డగా ఉన్నాము?
స్వార్థపూరితంగా ఉండడం ప్రతి ఒక్కరి సహజ స్వభావం. శాస్త్రవేత్తలు ఒక మానవుడికి వెయ్యి లక్షల కణాలు ఉన్నాయని, ఈ లెక్కలేనన్ని కణాలు చాలా స్వార్థపూరితమైనవని, అది మరొక కణానికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వదని చెప్పారు. పూర్తిగా ఈ కణాలు స్వార్థపరమైనవి. ప్రతిఒక్కరూ ఇలా స్వార్ధపరులుగా జన్యుపరంగా చేయబడ్డారు కాబట్టి, ఒకరి ప్రవర్తనను నియంత్రించే సామాజిక నిబంధనలు మరియు నియమాలు లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరూ మనుగడ సాగించలేరు. అలాంటి నిబంధనలు లేకుండా వారు ఒకరినొకరు చంపుకునేంతగా మనుషులు స్వార్థపరులు. ఇది పరస్పర మనుగడ కోసం వారు సహజీవనం యొక్క నియమాలను స్థాపించారు.
సామాజిక నిబంధనలు మరియు నియమాలు ఎలా ఉనికిలోకి వచ్చాయి. మనిషి యొక్క విధ్వంసక ధోరణిని నిరోధించడానికి మరియు మరింత సహకార వాతావరణాన్ని పెంపొందించడానికి సామాజిక నిబంధనలు చేయబడ్డాయి, సంక్షిప్తంగా, మనుషులు చాలా చెడ్డవారు మరియు దుర్మార్గులు కాబట్టి, వాటిని నియంత్రించడానికి సామాజిక నిబంధనలు మరియు ప్రవర్తన మరియు వారి చెడు ధోరణులను నియత్రించుటకు చట్టాలను ఏర్పాటు చేయడం అవసరం. ప్రపంచంలో ఎంత ఎక్కువ చెడు జరుగుతుందో, సామాజిక నిబంధనలు మరియు చట్టాలతో ముందుకు రావడం చాలా అవసరం.
మీరు నిజంగా యేసుక్రీస్తును మీ రక్షకునిగా విశ్వసించి, తండ్రి అయిన దేవుని సన్నిధికి రావాలనుకుంటే, మీరు మీ స్వభావం ద్వారా ప్రాథమికంగా చెడ్డవారని, మీరు పూర్తిగా పాపిష్టి నరకానికి కట్టుబడి ఉన్నారని ముందుగా గ్రహించాలి, ఆపై నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మండి. మీరు యేసుక్రీస్తు యొక్క నీతిని విశ్వసించాలి మరియు తద్వారా మీ పాపాలన్నింటికీ విడుదల పొందుదురు. దేవుడు పరిశుద్ధుడు అయినప్పటికీ, మనుషులు పూర్తిగా చెడ్డవారు, అందుచే వారు పాపం చేయకుండా ఉండలేరు. వారు దేవుని స్వరూపంలో చేయబడినప్పటికీ, వారు ఆయన పరిశుద్దతను దూషిస్తారు. అందుకే మనుషులు నీటి సువార్త మరియు యేసుక్రీస్తు ఇచ్చిన ఆత్మను హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు వారు రక్షించబడతారు. మీరు యేసుక్రీస్తు యొక్క నీతిని వెతికి, దానిని అర్థం చేసుకుని, దానిని విశ్వసించినప్పుడు మాత్రమే మీరు రక్షణకు చేరుకోగలుగుతారు. మీరు దేవుని నీతిని వెతకాలి మరియు ఆయన దయను విశ్వసించాలి, ఆయనతో ఇలా అన్నారు, “ప్రభూ, నేను ఎప్పుడూ చెడ్డవాడిని అని ఒప్పుకుంటాను.నేను అన్ని సమయాలలో లోపాలతో నిండిపోయాను.నేను నిరంతరం పాపం చేస్తాను, అందుచేత నేను నరకంలో శిక్ష అనుభవించటానికి అర్హుడిని. అందుకే అందించే నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా నాకు రక్షణ పూర్తిగా అవసరమైనది. నన్ను రక్షించునది నీరు మరియు ఆత్మ యొక్క సువార్త.”తమ బలహీనతలను మరియు దుష్టత్వాన్ని ఒప్పుకునే వారు మాత్రమే యేసుక్రీస్తు నీతిని విశ్వసించగలరు.
సోక్రటీస్ బాతు రూమ్ గోడ పై పొరపాటున రాసిన దానితో స్ఫూర్తి పొందారని చెప్పబడింది, ఇది " మీకు మీరే తెలుసుకోండి!" ఈ సరళమైన మాట సోక్రటీస్‌పై తన మనసులో ఉన్నదాన్ని బహిర్గతం చేసినందున చెరగని ముద్ర వేసింది. స్వీయ-నీతిమంతులు సద్గుణవంతులు మరియు జ్ఞానవంతులుగా నటిస్తూ,"ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి!" అని చెప్పి ఆ వ్యక్తికి ఉపదేశించారు. ఈ రోజు వరకు కూడా సోక్రటీస్‌ని గొప్ప తత్వవేత్తగా గుర్తుంచుకోవడానికి ఈ సాధారణ ప్రకటన మాత్రమే సరిపోతుంది.
మీ పాపపు స్వభావాన్ని మీరు గ్రహించడం ఎంత ముఖ్యమో నేను నొక్కి చెప్పలేను,ఈ పాపపు క్రయధనం వలన మీరు నరకంలో పడతారని తెలుసుకోండి మరియు దీన్ని మీ హృదయంతో ఒప్పుకోండి. దేవుని ముందు మీరు ఎంత నీచమైన పాపియో తెలుసుకొని మీరు ఎంతగా నరకానికి వెళ్లుచున్నారో మీరు ముందుగా గ్రహించకపోతే మీరు నిజంగా దేవుని నీతిని గ్రహించలేరు. ఇలా, ప్రతి ఒక్కరూ తన సొంత పాపాల యొక్క పరిణామాలను ముందుగా ఒప్పుకోవాలి. దహనబలి బలిపీఠం అనునది తుమ్మ చెక్కతో తయారు చేయబడింది, మరియు దాని వెలుపల ఇత్తడితో కప్పబడి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి పాపాల శిక్షను సూచిస్తుంది మరియు ప్రతి పాపి నరకం నుండి తప్పించుకోవడానికి నిస్సహాయంగా ఉంటాడు. కానీ తాము ఎంత నిస్సహాయంగా ఉన్నామో తెలిసిన వారు యేసు నీతిని గౌరవించవచ్చు మరియు ఆయన ప్రేమను విశ్వసిస్తారు.
ఇక్కడ లూకా 18:10-14 వైపు చూద్దాం: “ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడిదేవా,నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను,ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను.తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును’’
యేసు కాలంలో పరిసయ్యులు బయటికి చూచుటకు చాలా భక్తిపూర్వకంగా ఉండేవారు, ప్రతి ఒక్కరిని నీతిగా జీవించమని బోధిస్తారు. అయితే వారు ఎన్నడూ ఎలాంటి దొంగతనం లేదా వ్యభిచారం చేయలేదా? లేదు, వాస్తవానికి అలా కాదు! పరిసయ్యులు బయట దైవభక్తితో నటిస్తున్నప్పటికీ, ఎవరూ తమ వైపు చూడనప్పుడు, వారు మరెన్నో ఘోరమైన పాపాలు చేశారు. అయినప్పటికీ, వారు తమను తాము పాపము లేనివారిగా ఆకర్శించుకొనుచున్నారు, మరియు వారు తమ చుట్టూ ఉన్నవారికి కూడా దైవభక్తి ఉన్నట్లు నటించారు. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు దేవుని పవిత్రతను సవాలు చేసే అత్యంత నీచమైన పాపులు.
పన్ను వసూలు చేసే వ్యక్తి ప్రార్థన పరిసయ్యుడి ప్రార్థనకు భిన్నంగా ఉంది. పన్ను వసూలు చేసే వ్యక్తి పాపి అని అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి, అతను దేవుని వద్దకు వచ్చినప్పుడు, అతను తల ఎత్తి ఆకాశం వైపు కూడా చూడలేకపోయాడు, కానీ అతను తన రొమ్ము కొట్టు కొనుచు, "దేవుడా, నాపై దయ చూపండి, ఎందుకంటే నేను పాపిని!" పన్ను వసూలు చేసేవారి విన్నపాన్ని దేవుడు కరుణతో ఆలకించాడు, మరియు అతను నీరు మరియు ఆత్మ యొక్క సత్యాన్ని విశ్వసించినందున అతన్ని అతని పాపాల నుండి రక్షించాడు. దీనికి విరుద్ధంగా, పరిసయ్యుడు దేవుని దృష్టిలో దుర్మార్గుడిగా కనిపించాడు. పరిసయ్యుడని కాక పన్ను వసూలు చేసే వ్యక్తిని దేవుడు తన నీతితో అతన్ని ఆమోదించాడు.
మన హృదయాలతో దేవుని నీతిని విశ్వసించడం ద్వారా మాత్రమే మనం పాపాల నుండి విడుదల పొందాము, మన స్వంత పనులపై ఆధారపడటం ద్వారా కాదు. మన క్రియలు ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధతకు తగవు కాబట్టి, మనం ఎల్లప్పుడూ పాపం చేయకుండా ఉండలేము, అందువల్ల మనమందరం మన పాపాలకు అగ్నితో శిక్షించబడవలసి ఉన్నది, బలి జంతువులను నిరంతరం చంపి, దహనబలిపీఠం మీద కాల్చివేసినట్లు ఇశ్రాయేలు పాముల కోసం అర్పించబడినట్టు. మనం ఎంత పాపాత్ములమో దేవుని యెదుట ఒప్పుకోవాలి మరియు యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మాత్రమే మన పాపాల నుండి శిక్షించబడకుండా కాపాడబడుదుము .
ఇత్తడితో కప్పబడిన దహనబలి బలిపీఠం నుండి పైకి లేచిన అగ్ని మరియు పొగను చూసినప్పుడు, దేవుని దృష్టిలో,మన పాపములను బట్టి మనము నరకమునకు పాత్రులము.మీలో ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాన్ని గ్రహించాలి. అప్పుడే మీరు యేసుక్రీస్తు బాప్తీస్మం మరియు ఆయన బలి యొక్క రక్తాన్ని విశ్వసించడం ద్వారా మీ సమస్త పాపముల నుండి పాపాల శిక్ష నుండి పూర్తిగా విముక్తి పొందగలరు. యేసుక్రీస్తు మీ పాపాలన్నింటి నుండి మీకు మోక్షాన్ని అందిస్తున్నాడు, కానీ మీరు పూర్తిగా చెడ్డవారని, మీ పాపాలకు మీరు శిక్షించబడకుండా ఉండలేరని మొదట మీరు దేవుడితో ఒప్పుకుంటే తప్ప మీరు వాస్తవంగా ఈ మోక్షాన్ని నిజాయితీగా మరియు ఆసక్తిగా చూడలేరు. మరియు ఈ రక్షణ యొక్క సత్యాన్ని మీ హృదయంతో విశ్వసించినప్పుడు మాత్రమే మీరు మీ మోక్షాన్ని చేరుకోగలరు, మీ సమస్త పాపాల నుండి వాటి శిక్ష నుండి విడుదల పొందవచ్చు మరియు దేవుని ప్రేమను అంగీకరించవచ్చు. కానీ చెప్పబడినట్లుగా, మీరు మోక్ష సత్యాన్ని విశ్వసించే ముందు, మీరు మొదట మీ నిజస్వరూపాన్ని గ్రహించాలి మరియు మీ పాప స్వభావ లోపాలను దేవుని ముందు నిజాయితీగా అంగీకరించాలి. తన పాపపు స్వభావాన్ని ఒప్పుకున్న వ్యక్తి మాత్రమే నిజంగా దేవుని పరిశుద్దతను మరియు ఆయన నీతిని గుర్తించగలడు. మరో మాటలో చెప్పాలంటే,దేవుడు పూర్తిగా న్యాయంగా, నిజాయితీగా మరియు సత్యవంతుడిగా ఉన్నప్పుడు, మీరు ఆయన దృష్టిలో పూర్తిగా అన్యాయంగా, మురికిగా మరియు చెడుగా ఉన్నారని మీరు మొదట అంగీకరించి.యేసు రక్తం యొక్క బాప్తిస్మము పై విశ్వాసం ఉంచడం ద్వారా మీ పాపాల నుండి మీరు విడుదల పొందవచ్చు
బదులుగా మీరు దేవుడి ముందు తనను తాను గొప్పగా భావించే పరిసయ్యుడిలాగా స్వయాన మీకు మీరు -నీతిమంతులైతే, మీరు చాలా తేలికైన మంచు మీద నిలబడ్డారని ఇక్కడ మీరు గ్రహించాలి. దేవుని కరుణను కనుగొనడానికి దూరంగా, మీరు దేవునిచే విడిచిపెట్టబడతారు.దీనికి విరుద్ధంగా, మీరు పన్ను వసూలు చేసే వ్యక్తిలా ఉన్నట్లయితే, మీరు మీ పాపాలను బట్టి నరక శిక్షకు గురి అయ్యే పాపి అని మీరు ఒప్పుకోవచ్చు మరియు ఈ వినయపూర్వకమైన ప్రవేశం కారణంగా దేవుని నుండి దయ పొందవచ్చు. నిజానికి, పన్ను వసూలు చేసేవారిలా వినయంగా ఉండే వారందరికీ, దేవుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో వారి పాపాలన్నింటినీ తొలగించి, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును పంపించి వారిని రక్షించాడు.
ఈ ప్రపంచంలో లెక్కలేనన్ని వ్యక్తులు ఉన్నప్పటికీ, వారందరినీ రెండు నిర్దిష్ట రకాలుగా విభజించవచ్చు: పాప విముక్తి పొందిన వారు మరియు ఇంకా దాన్ని అందుకోని వారు. మునుపటి వారు పూర్తిగా దుర్మార్గులమని నరకానికి సంబంధించిన విధిని ఒప్పుకున్నవారు మరియు దాని ఫలితంగా, దేవుని కృప కొరకు ఆరాటపడ్డ వ్యక్తులు యేసుక్రీస్తు రక్షణను విశ్వసించడం ద్వారా వారి పాపాల నుండి విడుదల పొందారు.వారు దేవుణ్ణి నిజాయితీగా అంగీకరిస్తారు మరియు ఆయన పరిశుద్ధత, నీతిని మరియు విశ్వాసాన్ని విశ్వసిస్తారు. దీనికి విరుద్ధంగా, తరువాతి వారు తమ పాపా క్షమాపణను స్వీకరించడానికి నిరాకరించడమే కాకుండా వారు దేవునికి వ్యతిరేకంగా నిలబడుదురు,ఎందుకంటే వారు యేసుక్రీస్తు తమ రక్షకుడని నమ్మరు లేదా తాము పాపులమని ఒప్పుకోరు. నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం యొక్క సత్యంతో దేవుడు మీ పాపాలన్నింటినీ పూర్తిగా కడిగివేసాడు అని మీరు నమ్మాలి. ఈ అచంచలమైన విశ్వాసం ఉన్నవారు మాత్రమే వాస్తవంగా వారి రక్షణకు చేరుకొందురు.
ఇత్తడితో కప్పబడిన దహనబలిపీఠం అనునది మన పాపాల కొరకు దేవుని చేత శిక్షించబడుతుందని భావించినప్పటికీ, మన ప్రభువు యొక్క బాప్తీస్మం మరియు ఆయన సిలువ వేయడాన్ని విశ్వసించడం ద్వారా మన పాపాలన్నింటి నుండి శుద్ధిచేయుటను చూపిస్తుంది. కానీ మీరు యేసును మీ రక్షకునిగా విశ్వసించి, మీ విశ్వాసాన్ని ఒప్పుకునే ముందు, మీరు బలిపీఠం మీద అర్పించబడిన బలి జంతువుల వలె మీరు చేసిన లెక్కలేనన్ని పాపాలకు దేవుడు మిమ్మల్ని శిక్షంచటానికి యోగ్యుడని అని మీరు ముందుగా ఒప్పుకొనవలెను.మీరు మొదట మీ పాపపు స్వభావాన్ని ఒప్పుకున్నట్లయితే మీరు యేసు క్రీస్తు బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తాన్ని మీ మోక్షంగా అర్థం చేసుకుని, విశ్వసించినప్పుడే, మీరు దేవుని ప్రజలలో ఒకరిగా మారగలరు.
యేసు రక్తంలో విశ్వాసం ఒక్కటే సరిపోదు
మీలో కొందరు ఆలోచిస్తూ ఉండవచ్చు, “నేను ఇప్పటికే యేసు రక్తాన్ని నమ్ముతున్నప్పుడు, నా స్వయం అపరాధమును నేను ఒప్పుకోవాలని రెవ. జాంగ్ ఎందుకు చెప్పుచున్నాడు? నాలో కొన్ని పాపాలు ఉన్నాయనేది వాస్తవమే, కానీ నా పాపాలకు దేవుడు నన్ను శిక్షించేంత పాపములు నాలో లేవు. నా ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం మరియు ప్రతి క్రియ చాలా పాపమని అని నేను అనుకోను, ఒక వేళా నేను పాపినైతే నేను శిక్షించబడుదును."మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నది ఇదే అయితే, ఆ పరిసయ్యుడిలా మీరు తీవ్రంగా పొరపాటు కలిగిఉన్నారని మీరు గ్రహించాలి. మీరు ఇంత ఉదారంగా అంచనా వేయడం ద్వారా మీలో మీరే చాలా పెద్ద తప్పు చేస్తున్నారు.
పాపం యొక్క జీతం మరణమని బైబిల్ స్పష్టంగా పేర్కొంది. దేవుని దృష్టిలో, ప్రతి పాపం చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా ఒకటే.అది అన్ని పాపాలలో చిన్నది అయినప్పటికీ, ఈ పాపానికి శిక్షించబడి నరకం యొక్క అగ్నిలో పడవేయబడతారు. మీ పాపాలు ఎంత పెద్దవైనా, చిన్నవైనా సరే; పాపాలు ఉన్నంత వరకు, పరిశుద్ధతకు నిలయమైన దేవుని దృష్టిలో మీరు ఇతర పాపిలాగే ఉంటారు.
ఎందుకని ఇలా? దేవుడు స్వయంగా పరిశుద్ధుడు కాబట్టి, మీ పాపాలు ఎంత పెద్దవైన మరియు చిన్నవిగా మీరు భావించినప్పటికీ ఆయన ఏ పాపమును సహించలేడు.ఎందుకంటే దేవుడు ప్రతి పాపాన్ని మినహాయింపు లేకుండా శిక్షించాలి.
నిజాయితీగా మన జీవితాలన్నింటినీ దేవుని ముందు బహిర్గతం చేసినప్పుడు, మనలో ఎవరూ కూడా నేను కేవలం కొన్ని పాపాలు చేసినట్లు చెప్పుకోలేరు. మీరు కొన్ని పాపాలను మాత్రమే చేశారని మీరు చెబితే, కనీసం ప్రపంచ కొలమాన ప్రకారం. బహుశా మీకు మీరే నీతిమంతులుగా భావించెదరు, కానీ మీరు దేవుని తీర్పును మరియు శిక్షించటం గురించి మీ అవగాహన పూర్తిగా తప్పుగా ఉన్నది కావున మీరు ఇలా చెప్తున్నారు, ఎందుకంటే దేవుడు ఎంత కఠినంగా ఉంటాడో మీకు తెలియదు. మరో మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క కొలమానం పై కాకుండా మీ స్వంత కొలమానం మరియు స్వంత ఆలోచన ఆధారంగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటున్నారు, అందుకే మీరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాబట్టి మీరు దేవుని చట్టం ముందు నిష్పాక్షికంగా మిమ్మల్ని మీరు మరల పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి, “నేను దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తున్నాను? దేవుడు నన్ను చూచినప్పుడు, నేను శిక్షకు అర్హుడిగా కనిపించలేదా? నేను కాలానుగుణంగా నరకానికి వెళ్లే అనేకమైన పాపములు చేయలేదా?" ఇలా, మీరు దేవుని ముందు నిష్పాక్షికంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మరియు మీ పాపపు జీతమును బట్టి మీరు నరకం యొక్క మంటల్లో పడవేయబడే పాపి అని మీరు స్పష్టంగా గ్రహించాలి.
విశ్వాసం ద్వారా చేయనిది ఏదైనా దేవుని యెదుట పాపం అని మీరు గుర్తించడం ఖచ్చితంగా అవసరం (రోమా14:23), మీరు ప్రతి రోజు అలాంటి పాపాలు చేయటం వలన మీ పాపాలకు శిక్షించబడుదురు. అటుతరువాత మాత్రమే మీరు గ్రహించగలరు నీలిరంగు,మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార ద్వారా నీలాంటి నీచమైన పాపాత్ముడిని ప్రభువు రక్షించాడని రక్షణ యొక్క సత్యాన్ని మీరు గ్రహించిన క్షణంలోనే మీరు మీ పాపాల నుండి విడుదల పొందుదురు.
ప్రత్యక్షపుగుడారాన్ని వివరంగా వివరిస్తున్న దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, మనం సహాయం చేయలేము కాని ఈ క్రింది వాటిని ఒప్పుకోకుండా ఉండలేము:“ ప్రభువా, మేము మా పాపాలమును బట్టి శిక్షకు అర్హులమని ఎంచబడిన వారిమి, ఎందుకంటే మనం అన్ని సమయాలలో పాపం చేయకుండా ఉండలేము. అయినప్పటికీ, మమ్మల్ని రక్షించడానికి మీరు బాప్తీస్మం తీసుకొని నీ రక్తం చిందించడం ద్వారా మా పాపాల నుండి మరియు శిక్ష నుండి మమ్మల్ని మీరు పూర్తిగా విడిపించారు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని విశ్వసించడం ద్వారా, మేము మా సమస్త పాపముల శిక్ష నుండి నుండి రక్షించబడ్డాము. వాస్తవంగా మేమందరం నరకములో పడవలసిన వారము కానీ మమ్మల్ని రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు, మీరు స్థాపించిన బలి వ్యవస్థను నమ్ముట ద్వారా మేము మా సమస్త పాపముల నుండి రక్షించబడ్డాము. ఇది మీరు మాకు ఇచ్చిన రక్షణ యొక్క బహుమతి అని మేము నమ్ముతున్నాము. అటువంటి అద్భుతమైన కృప యెదుట మనం చేయగలిగేది కేవలం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం మరియు కృతజ్ఞతలు చెప్పటం.
ఈ ప్రపంచంలో ఇంకా క్రీస్తు యొక్క నీతిలోకి రాని వారు అనేకమంది ఉన్నారు. నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం ద్వారా ప్రపంచంలోని సమస్త పాపము నుండి ప్రభువు ప్రతి పాపిని రక్షించాడని గ్రహించిన అనేక మందికి ఇప్పటికీ రక్షణ యొక్క సత్యం గూర్చి తెలియదు.ఈ వ్యక్తుల ఎంత చెడ్డవారో మరియు వారి పాపాలకు వారు ఎలా శిక్షించబడుదురో వారికి తెలియదు. వారు అన్ని సమయాలలో లెక్కలేనన్ని పాపాలు చేసినప్పటికీ, వారి పాపాలకు వారు శిక్షించబడుతున్నప్పటికీ, తమను తాము అలాంటి పాపిష్టులని వారు గుర్తించరు, వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు. అంతేకాక, వారు వాస్తవంగా దేవుని యెదుట మంచి పనులు చేస్తున్నారని వారు తప్పుగా భావిస్తున్నారు,మరియు వారు తమ సొంత నీతిని ప్రదర్శించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. వారు దేవుడిని సంప్రదించినప్పుడు, వారు దేవుని నీతి కంటే తమ స్వంత నీతిని బయటకు తీసుకురావడానికి వెనుకాడరు. తమ స్వయంకృతాపరాధంతో, వారు పాపం చేసినప్పటికీ వారు నరకానికి వెళ్లరని వారు ఖచ్చితంగా నమ్ముతారు, వారు కొన్ని పాపములు మాత్రమే చేసినందున, వారు ఈ పాపాల నుండి విడుదల పొందవలసి ఉంటుందని తమలో తాము అనుకుంటున్నారు.
ప్రపంచములో చాలా మంది క్రైస్తవులున్నారు, వారు యేసును విశ్వసించినప్పటికీ, వారిలో ఇంకా కొన్ని పాపాలు మిగిలి ఉన్నాయని, అవి కేవలం పశ్చాత్తాపంతో ప్రార్థనలు చేయడం ద్వారా సులభంగా కడిగివేయబడతాయని;చివరికి వారు ఏదో విధంగా పవిత్రం చేయబడుదురని; అంతిమంగా వారందరూ పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారని. చాలా మంది క్రైస్తవులు పాపాత్ములుగా ఉన్నప్పటికీ, వారు యేసును విశ్వసించినందున దేవుడు వారికి తీర్పు తీర్చలేడని ఖచ్చితంగా అనుకొనుచున్నారు. అయితే ఎంతమందైతే దీనిని నమ్ముచున్నారో, వారందరూ నరకం యొక్క మంటలకు ఆహుతి అవుదురు. ప్రత్యక్షపుగుడారం నీలం, ఊదా రంగులో వెల్లడి చేయబడిన రక్షణ యొక్క రహస్యం మీకు నిజంగా తెలియకపోయినా మీరు నరకానికి వెళ్లరని మీరు అనుకుంటే ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార, లేదా యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మముపై నమ్మకం లేకుండా కేవలం సిలువ వేయబడ్డాడని మాత్రమే మీరు విశ్వసిస్తే, మీ విశ్వాసం లోపభూయిష్టంగా మరియు అసంపూర్ణంగా ఉంటుంది. ఇలాగే, మీ హృదయం పాపముతో ఉన్నప్పటికీ మీరు నరకానికి వెళ్లరని మీరు అనుకుంటే, మీరు యేసు క్రీస్తును మీ రక్షకునిగా విశ్వసిస్తారు కావున, మీరు వాస్తవంగా దేవుని పరిశుద్దతను సవాలు చేస్తున్నారు. నరకము అనునది అటువంటి అహంకార వ్యక్తుల కొరకు తయారు చేయబడిన ప్రదేశం, కావున వారు దేవుని చేత శిక్షించబడుదురని నమ్మరు.
ఇది చాలా విషాదం, చాలా మంది పాపులు చాలా మూర్ఖులుగా ఉంటారు, వారు నేరుగా నరకానికి వెళ్లుదురని కూడా వారు గ్రహించలేరు. కానీ బైబిల్ చెప్పినట్లుగా, “ఏభేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమా 3:23). వాస్తవంగా ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళవలసి ఉన్నది, ఎందుకంటే అందరూ పాపులే కావున. దేవుని మహిమ మరెవరో కాదు గాని, నీళ్లు మరియు ఆత్మ ద్వారా వచ్చిన యేసుక్రీస్తే. యేసును విశ్వసిస్తున్నామని అనేకమంది క్రైస్తవులు ప్రకటించినప్పటికీ, యేసు నీరు, రక్తం మరియు ఆత్మ ద్వారా వచ్చాడని వారు నిజంగా అర్థం చేసుకోనందున వారిలో చాలామంది ఇప్పటికీ రక్షించబడలేదు. నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం ద్వారా వచ్చిన ఈ యేసుక్రీస్తును మీరు తెలుసుకోకపోయినను లేదా నమ్మకపోతే, మీ పాపాలన్నింటి నుండి మీరు ఇంకా శుద్దిచేయబడలేదు, కాబట్టి మీరు ఆ అద్భుతమైన దేవుని ఆలయములో ప్రవేశించలేరు. ఒకవేళ మీరు దేవుని మందిరంలోకి రాలేకపోతే, దేవుని రాజ్యంలో పాలుపంచుకోవడమే కాకుండా, చివరికి మీరు నరకంలో పడిపోదురు.
కాబట్టి, యేసుక్రీస్తును మీ రక్షకునిగా విశ్వసిస్తున్నట్లు విశ్వసించే వారు క్రైస్తవుడా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మీరు వాస్తవంగా మరల జన్మించకపోతే, మీ పాపాలకు మీరు నరకానికి కట్టుబడి ఉంటారని ఒప్పుకోవాలి మరియు యేసుక్రీస్తును సరిగ్గా విశ్వసించాలి అనే ఈ మాట మీద. పాపం యొక్క జీతం మరణమని దేవుని చట్టం స్పష్టంగా చెబుతుంది, కావున మీరు ఈ దైవిక చట్టాన్ని అంగీకరించాలి మరియు ఎటువంటి ప్రతిఘటన లేకుండా దానిని విశ్వసించాలి. మీరు మీ పాపాల కోసం నేరుగా నరకానికి వెళ్తున్నారని ఒప్పుకుంటేనే, దేవుడు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మీరు విశ్వసించవచ్చు. రక్షణ యొక్క దేవుని బహుమతి పాప క్షమాపణ, మరియు ఈ బహుమతి యేసుక్రీస్తు బాప్తీస్మం, సిలువపై ఆయన మరణం మరియు ఆయన పునరుత్థానాన్ని విశ్వసించే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది.
రక్షణ అనునది మన పాపములను బట్టి మన నుండి వచ్చినది కాదు, కానీ అది దేవుడిచ్చిన బహుమానం మాత్రమే. మనలో ఎవరూ మన స్వంత కోరికతో ఈ ప్రపంచంలో జన్మించలేదు, కానీ మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఈ భూమిపై జన్మించడానికి అనుమతించాడు. యేసు బాప్తీస్మం, సిలువపై ఆయన మరణం మరియు పునరుత్థానమును మనం నమ్మిన యెడలపై దేవుడు మన యొక్క రక్షణను చేరుకోగలమని దేవుడు గ్రహించియున్నాడు, కావున మనలో ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని విశ్వసించాలి.
పాపపు జీతము మరణమని ప్రకటించే తన చట్టాన్ని స్థాపించిన తరువాత, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తులో మనకు నిత్యజీవము ఇవ్వాలని కూడా యోచించాడు. దేవుడు దహన బలిపీఠాన్ని తుమ్మచెక్కతో తయారు చేయాలని ఆదేశించాడు, అది ఇత్తడితో పొదిగించబడి దాని పై అగ్నిని వెలిగించాడు. ఇది పాపం యొక్క జీతము మరణం అని సూచిస్తుంది మరియు ప్రతిపాపం శాశ్వతంగా శిక్షించబడాలి.దేవుడు స్థాపించిన అటువంటి చట్టాన్ని మనలో ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు లేదా మార్చలేరు. అందుకే మనం నిస్సహాయంగా పాపులమని ఒప్పుకోవాలి మరియు విశ్వాసం ద్వారా మన హృదయంలోకి రక్షణ యొక్క సత్యాన్ని అంగీకరించాలి. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన మరియు నెరవేర్చిన ప్రతి చట్టాన్ని మనమందరం అంగీకరించడం మరియు విశ్వసించడం ఖచ్చితంగా అవసరం.
మీకు నిజంగా ప్రత్యక్షపుగుడారం మరియు సరైన విశ్వాసం గురించి స్పష్టమైన అవగాహన ఉంటే, దేవుడు మీ సమస్త పాపాల నుండి మరియు ఈ పాపాల యొక్క శిక్ష నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా, ఆయన తన ఆశీర్వాదాలన్నింటినీ మీకు ప్రసాదిస్తాడు. ఒకవేళ, మీరు మీ పాపాలను ఒక్కసారి కూడా తీవ్రంగా పరిగణించడానికి నిరాకరిస్తే, దానికి బదులుగా మాకు ఏ పాపం లేదని, మీరు ఎన్నటికీ మరణ కరమైన పాపాలు చేయలేదని, లేదా మీరు చేసిన కొన్ని పాపాలు మంచి పనులతో పోలిస్తే ఏమి కాదులే అని మొండిగా భావిస్తే. మీరు చేసినట్లు, మీ ఆత్మ దేవుని ఆగ్రహానికి లోనవుతుంది.
యేసు క్రీస్తు దేవుడే, మరియు మీరు క్రీస్తును మీ రక్షకునిగా విశ్వసిస్తే ప్రభువు ద్వారా నెరవేరిన దేవుని నీతిని విశ్వసిస్తే మీరు మీ సమస్త పాపముల నుండి విడుదల పొందవచ్చు; నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మీరు మీ సమస్త పాపముల నుండి విడుదల పొందిన తర్వాత, మీరు నిశ్చయంగా దేవునితో శాశ్వతంగా జీవిస్తారు.
ప్రత్యక్షపుగుడారంలోని బలి వ్యవస్థలో దాగి ఉన్న రక్షణ యొక్క సత్యం ద్వారా మన పాపాల నుండి మరియు మరణం నుండి మనల్ని కాపాడినందుకు నేను యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.