• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 11: ప్రత్యక్ష గుడారం

[11-26] ధూపవేదిక యొక్క బలిపీఠం నుండి దేవుడు తన కృపావాత్సల్యతను చూపువాడు (నిర్గమకాండము 30: 1-10)

(నిర్గమకాండము 30: 1-10)
“మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర.అది చచ్చౌకముగా నుండవలెను.దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను. దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను.అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీ యమునైనను దానిమీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సర మునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.’’
 
 
మనము పరిశుద్ధస్థలము యొక్క, దేవుని మందిరం లోపలికి అడుగుపెడితే,        మొదట మనము దీపస్తంభం, సన్నిధి రొట్టెల బల్ల మరియు ధూపవేదిక యొక్క బలిపీఠమును చూస్తాము. దీపస్తంభం, మరియు సన్నిధి రొట్టెలబల్ల దాటి, కరుణాపీఠము ప్రక్కన ఉన్న అతి పరిశుద్ధస్థలము ప్రవేశద్వారం ముందు దూప వేదిక యొక్క బలిపీఠం పెట్టబడింది. ఈ దూప వేదిక యొక్క బలిపీఠం పొడవు మరియు వెడల్పు రెండూ ఒక మూర, దాని ఎత్తు రెండు మూరలు.నేటి బైబిల్‌ కొలతల ప్రకారం ఒక మూర సుమారు 45-50 సెం.మీ. కాబట్టి దూప వేదిక యొక్క బలిపీఠం ఒక చిన్న చతురస్రం, పొడవు మరియు వెడల్పు 50 సెం.మీ మరియు ఎత్తు 100 సెం.మీ. మరియు దహన బలిపీఠం వలె, దూప వేదిక యొక్క బలిపీఠం కూడా దాని నాలుగు ఎగువ మూలల్లో కొమ్ములను కలిగి ఉంది. తుమ్మ చెక్కతో తయారు చేయబడిన దూప వేదిక యొక్క బలిపీఠం పూర్తిగా బంగారంతో కప్పబడి ఉంది.


పరిశుద్ధస్థలములో ఉన్న ధూపవేదిక యొక్క బలిపీఠానికి నాలుగు కొమ్ములు కలవు 

ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరం ఒకసారి ప్రాయశ్చిత్తపు దిన బలిని అర్పించినప్పుడు, అతను ఇశ్రాయేలు ప్రజల వార్షిక పాపాలను భరించే బలి జంతువు యొక్క స్థానంలో ప్రత్యక్షపుగుడారములో ఉన్న దహన బలిపీఠం యొక్క కొమ్ములపై రక్తం ఉంచవలసి వచ్చింది.. అదే విధంగా, ప్రధానయాజకుడు కూడా దూప వేదిక యొక్క బలిపీఠం యొక్క కొమ్ములపై ఈ రక్తాన్ని ఉంచవలసి వచ్చింది. ఈ రక్తం దేవునికి అర్పించబడినందున, అది ఇశ్రాయేలు ప్రజలను దేవుని ఉగ్రత నుండి పాప సమస్యను పరిష్కరించింది. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మనమందరం పాపాల నుండి విడుదల పొందాము, మరియు కొత్త నిబంధన యొక్క ప్రస్తుత యుగంలో, మన యొక్క ఈ విశ్వాసం మనం సమక్షంలోకి వచ్చినప్పుడు అన్ని అడ్డంకులను తొలగించడానికి వీలు కలుగును. ప్రార్ధించడానికి దేవుడు ఉన్నట్లే. నీతిమంతులు కూడా ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు పాపం చేయుదురు. ఏదేమైనా, మనము యేసు బాప్తీస్మం  మరియు పాత నిబంధన యొక్క బలి వ్యవస్థ ద్వారా సూచించబడిన ఆయన బలి యొక్క రక్తాన్ని విశ్వసిస్తున్నందున, మనము ఇంకా ధైర్యంగా దేవుని యెదుటకు వచ్చి ప్రార్దించగలము
ఈ ప్రపంచంలో చేసే పాపాల కారణంగా నీతిమంతులు కూడా దేవుని సన్నిధికి రావడానికి సంకోచించగలరు, కానీ ఇలాంటి సమయాల్లో, వారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై నమ్మకం ఉంచడం ద్వారా ధైర్యంగా దేవుని వద్దకు రావచ్చు. మనం యేసు క్రీస్తు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తున్నందున, మన శరీరాలు మరియు మనస్సులు ఇంకా బలహీనంగా ఉన్నప్పటికీ మనం ధైర్యంగా దేవుని వద్దకు రావచ్చును. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై మన యొక్క విశ్వాసం ద్వారా మనం ఇప్పటికే నీతిమంతులం అయ్యాము, మరియు నీలం, ఊదా, మరియు నీలం రంగులలో వ్యక్తమయ్యే రక్షణ యొక్క సత్యము ద్వారా మనందరి అతిక్రమక్రియల నుండి ప్రభువు ఇప్పటికే మనలను ఒకసారి విడిపించాడు. ఆలయము యొక్క తలుపు ఈ ధూమ్రరక్తవర్ణముగల దారం. కాబట్టి మనం ఎల్లప్పుడూ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై నెమరువేయాలి. బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి మరియు శిలువపై ఆయన చిందించిన రక్తం నుండి యేసు అందుకున్న బాప్తీస్మం ద్వారా పరిపూర్ణమైన మోక్షాన్ని ఒక్కసారి మన కొరకు సాధించాడు మరియు ఈ రక్షణను విశ్వసించేవారికి మరియు నమ్మని వారి విశ్వాసానికి మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉంది. నీతిమంతులు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తారు. అందుకే వారు ఎలాంటి సంకోచం లేకుండా దేవుడిని ప్రార్థించవచ్చు యేసు బాప్తీస్మం ద్వారా వారి పాపాలన్నింటినీ ఒకేసారి అంగీకరించాడని మరియు వారి కోసం తన రక్తాన్ని చిందించాడని నమ్ముతున్నారు కావున. బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి బాప్తీస్మం ద్వారా యేసు వారి పాపాలన్నింటినీ భరించాడని మరియు సిలువపై ఆయన తన రక్తం చిందించడం ద్వారా వారి పాపాలన్నిటికీ ఆయన శిక్షించబడ్డాడని కూడా అందరూ నమ్మాలి.అప్పుడే ఒకరు దేవుని యెదుట విశ్వాస ప్రధానయాజకుడిగా మారవచ్చు మరియు తనకు కొరకు మరియు పాపులైన ఇతరుల కొరకు ప్రార్థన చేయవచ్చు. ఈ ప్రపంచంలోని సమస్త పాపాల నుండి దేవుడు మనలను రక్షించాడని నమ్మడం అనగా నిజమైన క్రైస్తవ విశ్వాసం, మరియు ఈ విశ్వాసానికి ఆధారం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా, మనమందరం నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవరణముగల దారం మరియు ప్రత్యక్షపుగుడారం తలుపు యొక్క రేఖలో వ్యక్తమయ్యే సన్నని పేనిన నార రక్షణ యొక్క సత్యాన్ని కనుగొనవచ్చు. మరియు ఈ సువార్త సత్యాన్ని విశ్వసించడం ద్వారా మనమందరం దేవుని రాజ్యంలోకి ప్రవేశించవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన నీతియో రక్షణగా, మీ పాపాలన్నింటినీ భరించాడని మరియు సిలువపై మీ పాపాలన్నిటికీ ఆయన శిక్షించబడ్డాడని మీరు నమ్మవలెనని మిమ్మును అడుగుతున్నాను. అప్పుడు మీరు మీ సమస్త పాపాల నుండి శాశ్వతంగా విడుదల పొందుతారు. దేవుని నిబంధన యొక్క సువార్తను, అనగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యమును విశ్వసించడం ద్వారా మాత్రమే మీరు దాన్ని పొందగలరు. పాపముల నుండి క్షమించబడి, పరిశుద్ధులైన నీతిమంతులుగా మారండి మరియు సరైన విశ్వాసం కోసం దేవుని ఆమోదం పొందండి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మీరు మీ రక్షణకు చేరుకున్న తర్వాత, చేయవలసిన మొదటి పని ఏదనగా, ఆయన రక్షణ యొక్క కార్యం కోసం దేవుణ్ణి ప్రార్థించడం, అనగా ప్రపంచమంతటా నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వ్యాప్తి కోసం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో నీతిమంతులైన విశ్వాసులు దేవుని పరిశుద్ధస్థలము యొక్క దీపస్తంభమైన దేవుని సంఘము ద్వారా ఈ ప్రపంచమంతటి మీద సువార్త యొక్క ప్రకాశవంతమైన కాంతిని ప్రకాశింపజేయడానికి దేవుడిని ఇలా ప్రార్ధించవలెను. దేవుని యొక్క సంఘ పరిచర్యకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా సువార్తను పూర్తిగా వికసించేలా చేయడానికి విశ్వాసం చాలా అవసరం. తన సేవకులు బోధించిన విలువైన దేవుని వాక్యాన్ని వినడం మరియు విశ్వసించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాపాల నుండి విడుదల పొందవచ్చు మరియు విశ్వాసం పెంపొందించబడును.
మీ రక్షకుడైన యేసుపై మీ విశ్వాసం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యందు ఉండాలి. మరియు నీ పాపాలన్నిటి నుండి రక్షించబడిన పరిశుద్ధుడవైన నీతిమంతుడివిగా,దూపవేదిక యొక్క బలిపీఠం యొద్దకు రావాలి మరియు పరిశుద్ధస్థలములో ఉన్న కరుణాపీఠము యెదుట నిలబడాలి. ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? ఎందుకంటే మీకు నిరంతరం దేవుని కృప అవసరం కావున.దూప వేదిక యొక్క బలిపీఠం మనం దేవునికి ప్రార్థనలు చేసే స్థలము, ఎందుకంటే ఇక్కడ ధూపం అనునది పరిశుద్ధుల ప్రార్థనలను సూచిస్తుంది (ప్రకటన 5: 8). మనము దూప వేదిక బలిపీఠము నుండి బయటకు వచ్చి దేవుడిని ప్రార్థించినప్పుడల్లా మనము దేవుని కృపను ధరించుదుము. పరిశుద్ధస్థలములో దూపవేదిక యొక్క బలిపీఠ విశ్వాసం ద్వారా దేవుడిని ప్రార్థించడం మరియు దేవుని కృపను కనుగొనడానికి మార్గం అని ఇది మనకు చూపిస్తుంది. అందుకే మనం నీరు యొక్క సువార్తలో విశ్వాసులం అలాగే ఆత్మ అనునది ధూపవేదిక యొక్క బలిపీఠం యొద్దకు వస్తూనే ఉండాలి మరియు విశ్వాసంతో నిరంతరం దేవుడిని ప్రార్థించాలి, తద్వారా మనం దేవుని కృపను కాలానుగుణంగా కాపాడుకోగలము.


ధూపవేదిక యొక్క బలిపీఠం దేవుని నుండి సహాయం అడిగే ప్రదేశమైయున్నది

మన విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందినప్పటికీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో,మన జీవితాంతం వరకు దేవుని సహాయం మనకు అవసరం. మనం దేవుని సంఘంతో మమేకమై, ఈ ప్రపంచానికి వెలుగుగా ఆధ్యాత్మిక ఫలాలను పొందాలంటే, దేవుని దయ ఎల్లప్పుడూ పొందవలసిన వారము. కాబట్టి మనమందరం దేవుడిని నిరంతరం ప్రార్థించడం చాలా ముఖ్యం, దేవుడిని, “ప్రభువా, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నన్ను స్థిరంగా పట్టుకోండి. నాకు విశ్వాసం దయచేయండి. శరీరం మరియు ఆత్మ రెండింటిలోనూ నన్ను బలోపేతం చేయండి. నా విశ్వాసాన్ని బలోపేతం చేయండి, తద్వారా అది ఎన్నటికీ క్షీణించదు. లోకాన్ని అనుసరించే నా హృదయ కోరికలన్నింటినీ కత్తిరించండి. నా భక్తిహీనమైన కోరికలన్నింటినీ తీసివేయండి.” నీతిమంతులు ధూపవేదిక యొక్క బలిపీఠం యొద్దకు రావాలని దాని యెదుట మోకరిల్లి, మరియు ఆయన యెదుట ఇలా ప్రార్ధించాలని,దేవుడు కోరుకుంటాడు,  తద్వారా మనం అన్ని విషయాలలో ఆయన కృపను పొందుతాము. భౌతికంగా మరియు ఆత్మీయంగా రెండు విధాలుగా ఆయన ఆశీర్వాదాలు పొందుతాము. అందుకే పాప క్షమాపణ పొందిన ప్రతి పరిశుద్ధుడు ధూపవేదిక యొక్క బలిపీఠం వద్ద ప్రార్థనాపూర్వక జీవితాన్ని కొనసాగించడం చాలా అవసరం.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మన పాపాలన్నింటి నుండి రక్షించబడి నీతిమంతులుగా తిరిగి జన్మించనను, మన దైనందిన జీవితంలో మనపై తన కృపను అనుగ్రహించమని దేవుడిని ప్రార్థించడం ఇంకా అవసరం. ఎందుకనగా, నీతిమంతులమైన మనం పాపాల నుండి విడుదల పొందినప్పటికీ, మనం దేవుని కృపను ధరించుకోకపోతే, మనమందరం అనుసరించాలని ప్రభువు కోరుకునే ఇరుకైన జీవన విధానంలో మనం నడవలేము. నీతిమంతులు దేవుడిని ప్రార్థించినప్పుడు ఆయన వారిపై తన కృపను చూపును. మరియు మనం దేవుని సంఘములో ఉండి, ఆయన వాక్యాన్ని పాటించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మరొక విధంగా చెప్పాలంటే, నీతిమంతులు ఆయన సంఘములో ఐక్యతతో మంచి పనిని ప్రారంభించినప్పుడు అతను దేవుని దయను పొందును. ఆయన సంఘముతో చెప్పినట్లుగా, ప్రధానయాజకుడు సంవత్సరానికి ఒకసారి ధూపమును బలిపీఠం కొమ్ములపై బలి జంతువు యొక్క రక్తమును చల్లును. నీతిమంతులైన మనం దేవుని యెదుటకు వచ్చినప్పుడు, మన విశ్వాసాన్ని అంగీకరించి, “ప్రభువా, నీవే నా రక్షకుడవు” అని చెప్పాలని ఇది సూచిస్తుంది. మీరు మీ దైవత్వం యొక్క ఐశ్వర్యమును విడచి, మానవవునిగా శరీరధారిగా ఈ భూమ్మీదకు వచ్చారు. మీరు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా నా యొక్క పాములన్నిటిని భరించారు;నన్ను కాపాడటానికి మీరు నా స్థానంలో మీ స్వంత రక్తాన్ని చిందించారు.”దేవుడు మన స్వంత రక్షకుడు అని ఈ రకమైన విశ్వాసం మనకు ఉన్నప్పుడే మనం ఆయన అపారమైన కృపను పొందగలుగుతాము. మన జీవిత పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, యేసు క్రీస్తు మన దేవుడు మరియు మన రక్షకుడు. మన పాపాలన్నిటి నుండి మరియు మన శిక్షలన్నిటి నుండి మనల్ని రక్షించిన దేవుడు ఆయనే. ఈ స్థిరమైన విశ్వాసం ద్వారా మనం దేవుడిని ప్రార్థించినప్పుడే మనం దేవుని కృపను ధరించదము.


మన ప్రతి ప్రార్థనలో మన యొక్క రక్షణను ధృవీకరించగలము  

దేవుడు మన స్వంతo అని మరోసారి మనము ధృవీకరించవచ్చు. మరియు ఈ విశ్వాసం మనకు దేవుని ఆశీర్వాదాలను తెస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే, దేవుడు తప్పని సరిగా మనల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకం ఉన్నందున దేవుని కృపా సింహాసనం యెదుట మోకరిల్లవలసి ఉంటుంది.నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై మన విశ్వాసం మనం దేవుడిని ప్రార్థించినప్పుడల్లా దేవుడు మన ప్రతి ప్రార్థనకు తప్పనిసరిగా సమాధానం ఇస్తాడని హామీ ఇస్తుంది. దేవుడు నీతిమంతుల ప్రతి ప్రార్థనను వింటాడు మరియు వారందరినీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి, మనం దేవుడిని ప్రార్థించినప్పుడల్లా, మనం మొదట ఆయన కృపను ఈ విధంగా చెప్పాలి: “ప్రభూ, నేను నీ నీతిని విశ్వసిస్తున్నాను. నా జీవితం లోపాలతో నిండి ఉందని నాకు తెలుసు. నేను మీ ఇష్టానికి అనుగుణంగా జీవించాలనుకున్నప్పటికీ, నాకు చాలా లోటుపాట్లు ఉన్నాయి. అయినను, మీరు ఈ భూమ్మీదకు మానవ శరీరాకారముతో అవతరించి వచ్చావని నాకు తెలుసు ప్రభువా,బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా నీవు నా పాపాలన్నింటినీ భరించావు, మీరు నా స్థానంలో సిలువ వేయబడ్డారు, తద్వారా మీరు నా రక్షకుడు అయ్యారు. మీరు నా మెస్సయ్యయు మరియు రక్షణ కర్తయైన దేవుడవు. కాబట్టి మీరు మీ కృపను అనుగ్రహిస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, ఎందుకంటే మీరు నా ప్రభువు కావున."
ఇలాగే, ఆయన కృపను అనుగ్రహించమని దేవుని ప్రార్ధించినప్పుడల్లా, మనం మొదటగా ఈ దేవుని కృప కొరకు మొరపెట్టుకోవాలి మరియు ఆయన  నమ్మకాన్ని ఉంచాలి. అప్పుడు మనo దేవుణ్ణి అవసరాలన్నింటినీ అడగడానికి ధైర్యంగా ఉండగలుగుతాము, మరియు ఆయన మనతో ఇలా అంటాడు, “అవును, మీరు నిజముగానే నా స్వంత కుమారుడివి. మీ విశ్వాసం అంతగా  స్థిరంగా లేకపోయినను, నేను నిజంగా మీ దేవుడిని మరియు మీరు నిజంగా నా స్వంత వ్యక్తులలో ఒకరైయున్నారు. కాబట్టి నేను నేను మిమ్మును కరుణాపీఠము యొద్ద కలసి మీ ప్రార్థనకు సమాధానం ఇచ్చెదను మరియు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించెదను. నాపై మీ విశ్వాసం స్థిరంగా లేదని, మీరు నా యందు మాత్రమే విశ్వాసం ఉంచారని నేను మీ దేవుడిని అని మీరు హృదయపూర్వకంగా నమ్ముతున్నారని నేను మీ ప్రార్థన ద్వారా చూడగలను. కాబట్టి ఈ ప్రపంచంలోని ప్రజలందరూ నేను నిజంగా మీ దేవుడిని అని తెలుసుకోవడానికి మీ ప్రార్థనకు నేను సమాధానం ఇచ్చెదను. ”
ఇలా, మన ప్రభువు రక్షణ యొక్క సత్యాన్ని విశ్వసించినప్పుడు దేవుడు మనలను తన కృపతో ధరించును మరియు ఆయన ఆశీర్వాద వర్షమును మనపై కురిపించును. మన పాపాలన్నిటి నుండి మనం రక్షించబడునది అనేది పూర్తిగా కథ యొక్క ముగింపు కాదు; దీనికి విరుద్ధంగా, మన పాపాలన్నింటి నుండి మనం నిజంగా విముక్తి పొందినట్లయితే, దేవుని ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయని మనం నమ్మాలి. కాబట్టి దేవుని నీతిని విశ్వసించడం ద్వారా మనం ప్రతిరోజూ ఆయన కృపను ధరిస్తాము. అప్పుడే మనం దైవికమైన జీవితాన్ని గడపగలుగుతాము. అందుకే మన మనసులో ఏదైనా ఆందోళన కలిగించినప్పుడు మనం దేవుడిని ప్రార్థిస్తాము. అతనితో, “ప్రభూ, దయచేసి మాకు సహాయం చేయండి. దయచేసి మా సంఘానికి సహాయం చేయండి. ప్రస్తుతం మీ పనిని నిర్వహించడానికి మా సంఘమునకు మీ సహాయం ఎంతో అవసరము.” లోకసంబంధమైన వ్యవహారాల విషయానికి వస్తే, ఏదైనా దిగులు లేదా ప్రార్థన విషయాలు మన మనస్సులోకి వస్తే, మనం ధూపవేదిక యొక్క బలిపీఠం వద్దకు వచ్చి విశ్వాసంతో కృపా సింహాసనం యెదుట ప్రార్థించాలి. అప్పుడు సమస్త విషయాలలో ప్రభువు తన కృపతో మనలను ధరించడాన్ని మనం చూస్తాము.
ధూపవేదిక యొక్క బలిపీఠం అనగా  మనం దేవుడి నుండి కృపను పొందే ప్రదేశం అని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. పరిశుద్ధులమైన మనం దేవుడిని ప్రార్థించాలి, మరే ఇతర కారణం లేకుండా ఆయన కృపను ధరించడం తప్ప మరొక మార్గం లేదు. మరో మాటలో చెప్పాలంటే, మనం దేవుని ప్రార్ధించి దేవుని దీవెనలు పొందడం. అపుడే మనం విశ్వాసం ద్వారా రక్షించినబడిన వ్యక్తులం అవుదుము,దేవుని వాగ్దాన వాక్యాన్ని విశ్వసించడం ఆయన ఆశీర్వాదాలను పొందడం ద్వారా మనం నిజంగా జీవితాంతం జీవించాలనుకుంటే మనమందరం నిరంతరం దేవుడిని ప్రార్థించడం చాలా అవసరం. ఇలా, దేవుని కృపను ధరించడానికి దూప వేదిక యొక్క బలిపీఠం ఉన్నది.
మనo దేవుణ్ణి ప్రార్దిస్తున్నప్పుడు మనకు ఎదురుగా వచ్చు అతి పెద్ద సమస్య పాపం. ఈ ప్రపంచంలో పాపపు జీవితం లేకుండా గడుపుతున్న వారు ఎవరూ లేరు. కాబట్టి, మనం దేవుని వద్దకు వెళ్లి ప్రార్థించడానికి ప్రయత్నించినప్పుడు, సంకోచించటానికి మొదటి మూలం పాపo మన పాపాలే. అందుకే మనం రక్షణ యొక్క సత్యాన్ని మరల అర్థం చేసుకోవడం వలనను ప్రత్యక్షపుగుడారము యొక్క ద్వారమైన నీలం, ఊదా మరియు ధూమ్రరక్త వర్ణముగల దారంతో మన ప్రభువు ఇప్పటికే మన పాపాలన్నింటినీ తొలగించాడని మన నమ్మకాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యం. మరో మాటలో చెప్పాలంటే, దేవుడైన యేసుక్రీస్తు మన రక్షకునిగా ఈ భూమ్మీదకు వచ్చి,బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన పాపాలన్నింటినీ భరించి ఈ పాపాలన్నింటికీ శిక్షించబడ్డాడని  మనం స్థిరంగా విశ్వసించాలి; మరియు మన దేవునికి మరియు రక్షకునికి కృతజ్ఞతలు తెలియజేయాలి, మనం ఇప్పటికే మన పాపాలన్నింటి నుండి విడుదల పొందాము. మనకు ఈ విశ్వాసం ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఆయన కృపా దీవెనల కోసం అడగగలం. అప్పుడే మనల్ని ఆశీర్వదించమని కూడా దేవుడిని ప్రార్థించవచ్చు. ఇది మనకు ఈ పాఠాన్ని నేర్పడానికి, ప్రభువు యొక్క రక్షణ పనిని గుర్తు చేయడానికి, బలి జంతువు యొక్క రక్తం సంవత్సరానికి ఒకసారి ధూపవేదిక యొక్క బలిపీఠం కొ మ్ముల పై చల్లబడుతుంది.


కొద్దిమంది మాత్రమే  అనగా ఎవరైతే అతని సమస్త పాపముల యొక్క విమోచనను  గూర్చి నిశ్చయత కలిగి ఉందురో వారే దేవునికి ధైర్యముగా ప్రార్దించెదరు

మనం దేవుణ్ణి ప్రార్ధించినప్పుడెల్ల, తండ్రి లేదా మన రక్షకుడని అని పిలుస్తూ, ఎలాంటి సంకోచం లేకుండా మన అవసరాలన్నింటినీ అడగవచ్చు.దేవుణ్ణి ఈ విధముగా పిలవడానికి మనకు స్వేచ్ఛ ఉంది, ఎందుకంటే దేవుడు మన తండ్రి, మన ప్రభువు మరియు మన రక్షకుడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి వివిధ బిరుదులతో పిలవడానికి మరియు ఆయనను ప్రార్థించడానికి మనకు ఎలాంటి సంకోచం లేదు ఎందుకంటే ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు గాని, ఆయన మన రక్షకుడు కూడా.
మనమందరం దేవుణ్ణి ఇలా ప్రార్థించాలి: “ప్రభూ, నా పాపాల నుండి నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. నాకు నిజంగా మీ ఆశీర్వాదాలు మరియు మీ సహాయం కావాలి. కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయండి మరియు నా ప్రతి అడుగులో నన్ను జాగ్రత్తగా కాపాడండి. నేను కొంత మంచి పనులను బాగానే చేసినను చాలా తప్పులు కూడా చేసాను, ఇంకా నాకు కొన్ని బాధలు ఉన్నాయి.నేను వాటన్నింటినీ నీకు అప్పగిస్తున్నాను, ప్రభూ. నాకు సహాయం చేసి మీ మార్గమున నన్ను నడిపించమని నేను మిమ్మును అడుగుతున్నాను. నశించు ఆత్మల దిశగా నన్ను నడిపించండి, తద్వారా నేను వారికి మీ సువార్తను ప్రకటిస్తాను మరియు మీ కోసం సమృద్ధిగా ఆధ్యాత్మిక ఫలాలను పలించగలను. నేను వారి హృదయాలలో సువార్త యొక్క విత్తనములు నాటడానికి వారి హృదయాలు తెరవండి మరియు వారి హృదయాలను చదును చేయండి. మీ సంఘాన్ని అంటిపెట్టుకొని మీ సేవకులను జాగ్రత్తగా చూసుకోవాలని నేను మిమ్మును కోరుతున్నాను. వారిని ఆశీర్వదించటం ద్వారా, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ఫలవంతంగా బోధించబడుతుంది. ఈ సువార్త భూమి అంతటా వ్యాపించబడును గాక. మీ సేవకులకు మీ రక్షణ అవసరం, కాబట్టి వారిని మీ కంటి క్రింద కనురెప్పల కాపాడమని మిమ్మల్ని అడుగుతున్నాను.నన్ను ఆశీర్వదించండి మరియు నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. నా పిల్లలను ఆశీర్వదించండి.పరిశుద్దులను కూడా ఆశీర్వదించండి. క్రీస్తులో నా తోటి సోదరులందరినీ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం సమృద్ధిగా ఉండును గాక, తద్వారా మీ సంఘం బయట నిలబడి ఉన్న అవిశ్వాసులు కూడా రక్షింపబడతారు.’’మనం ప్రార్ధించినప్పుడు మన యొక్క ఆశలు మరియు దర్శనాలు దేవునికి ఆపాదించినప్పుడు, ఆయన తప్పని సరిగా మన ప్రార్థనలకు సమాధానమిస్తాడు మరియు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆవిధంగా మనమందరం ప్రార్థన ద్వారా దేవుని సమృద్ధి ఆశీర్వాదాలను పొందవచ్చు. మరియు మనం ప్రతిరోజూ కృప వెంబడి కృపను పొందవచ్చును.
దేవుడు తన నీతిని విశ్వసించే వారందరికీ ఆయన దేవుడే. ఆయన నీటి సువార్తను మరియు ఆత్మను స్థిరముగా విశ్వసించు వారికి ఆయన దేవుడు. కాబట్టి దేవుడు తన విశ్వాసులందరికీ తన అనుగ్రహాన్ని ప్రసాదించడంలో ఎన్నడూ విఫలం కానేరడు, కావున వారు ధైర్యంగా వారి అచంచలమైన విశ్వాసం ద్వారా దేవుని కృపా సింహాసనము యెదుటకు సమీపించెదరు మరియు వారు ఆయన కృపా మరియు దీవెనలు కోసం ఇలా అడిగెదరు, “ప్రభూ, నీవు నా దేవుడవని అని నేను నమ్ముతున్నాను. నువ్వు నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను. నాకు సహాయం చెయ్యండి, ప్రభూ!”
నా తోటి విశ్వాసులారా, ప్రపంచంలోని పాపాల నుండి మన యొక్క రక్షణ కథ ముగింపు కాదని మనమందరం గ్రహించడం ఎంత ముఖ్యమో నేను నొక్కి చెప్పలేను, కాని మనం దేవుణ్ణి నిరంతరం ప్రార్థించాలి. ఒకవేళ మీ ప్రార్ధనకు ప్రభువు సమాధానం ఇవ్వకపోతే లేదా మీకు ఎలా ప్రార్థించాలో కూడా తెలియకపోతే, మీరు మీ విశ్వాసాన్ని దశలవారీగా పరిశీలించి, వాస్తవంగా ప్రభువు నీ యెడల ఆయన ఏమైయున్నడో తెలుసుకొనవలెయును.ప్రభువుతో మీ సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. మరో మాటలో చెప్పాలంటే, మీ విశ్వాసం దృఢమైన స్థితిలో ఉండేలా చూసుకోవాలి, ప్రభువు పరలోకమును మరియు భూమిని సృష్టించినట్లు గ్రహించి, హృదయపూర్వకంగా విశ్వసించాలి; ఆయన మిమ్మును రక్షించడానికి మానవుని ఆకారములో శరీరధారిగా ఈ భూమ్మీదకు వచ్చి; బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయన మీ సమస్త పాపాలను భరించాడు; ఆయన మీ స్థానంలో సిలువపై శిక్షించబడి; మరల ఆయన మూడవ రోజు మృతులలోనుండి లేచాడు; మరియు ఆయన ఇప్పటికిని మీ సజీవ రక్షకునిగా సజీవంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు రక్షించబడిన వారు, ప్రభువు మీ కాపరి అయ్యారు మరియు మీరు ఆయన గొర్రెలు. మీరు ఆయన సహాయం కోసం అడిగిన ప్రతి సారీ ప్రభువు మీకు సమాధానం ఇవ్వడములో మీకు ఎలాంటి సందేహం లేదు.


మనము పగలు మరియు రాత్రి ప్రార్ధించవలెయును

మన యొక్క విశ్వాసం ద్వారా దేవుణ్ణి తమ రక్షకునిగా అంగీకరించి, పగలు అనక మరియు రాత్రి అనక విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించిన వారు ఈ ప్రపంచంలో వారి జీవితమంతయు ఆయన కృపను మరియు ఆశీర్వాదాలను పొందుతారు.దీనికి వ్యతిరేకంగా,మనలో ఏ కారణం చేతనైనా శ్రద్ధగా ప్రార్థన చేయని వారు, ప్రార్దించిన ప్రార్దించకపోయిన, దేవుడు తమ అవసరాలన్నింటినీ సమకూర్చుకుంటారని వారు భీకరంగా గొప్పగా ఆలోచించినను, లేదా దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం చూపకపోతే వారు దేవుని దీవెనెలు పొందలేరు,ఎందుకంటే వారి విశ్వాసంలో ధూపవేదిక యొక్క బలిపీఠం లేదు కాబట్టి.దేవుడు మీ దేవుడు అని మీరు విశ్వసించినందున మీరు ప్రార్థించకపోయినా మీకు కావలసినవన్నీ దేవుడు మీకు ఇస్తాడని మీరు అనుకుంటే, మీ విశ్వాసం తప్పుతుంది. ఒక వేళ ఇది వాస్తవమైతే, పరిశుద్దస్థలములో ధూపవేదిక యొక్క బలిపీఠం ఉండకూడదు. దేవుడు కేవలం విసుకు చెంది ధూపవేదిక యొక్క బలిపీఠం చేశాడని మీరు అనుకుంటున్నారా? లేదు, వాస్తవానికి కాదు! ప్రధానయాజకుడు అహరోను ప్రతి ఉదయం మరియు ప్రతి సాయంత్రం నాలుగు రకాల ధూపాలతో బలిపీఠాన్ని వెలిగించాడు. ఆ తర్వాత పరిశుద్దస్థలములో ఆహ్లాదకరమైన వాసన వెదజల్లుతుంది. ఇది నిజంగా అద్భుతమైన వాసన, ఇది ధైర్యంగా దేవుని వద్దకు రావడానికి వీలు కల్పిస్తుంది. ఈ ధూపం దేవుని ముందు మన లోపాలను సరిచేయు ప్రభావాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు, ప్రధానయాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రవేశించే ముందు అతిపరిశుద్ధస్థలమును ధూపంతో నింపాలి, ధూపం యొక్క మేఘం సాక్ష్యపు మందసము పై ఉన్న కరుణా పీఠము పై కప్పి ఉండేలా చేస్తుంది, లేకపోతే అతను మరణమునకు పాత్రుడగును (లేవీయకాండము 16: 12-13).
నా తోటి విశ్వాసులారా, మనం దేవుణ్ణి సంప్రదించినప్పుడల్లా, మనం పాపాల నుండి విడదల పొందుదుము, ఇప్పుడు దేవుడు మన దేవుడు, కావున మనం ఆయనను ప్రార్థించినప్పుడల్లా ఆయన తన కృపను మనకు ప్రసాదిస్తాడు. మనము ఈ స్తిరమైన విశ్వాసం ద్వారా దేవుని సన్నిధికి వచ్చి ఆయన కృపా సింహాసనం యెదుట ధైర్యంగా నిలబడినప్పుడు, మనకు ఎలాంటి శిక్ష ఉండదు, కానీ దేవుని కృపను ధరించెదము.దేవుడు కృపగల దేవుడు,కనుక మనందరికీ అపారమైన కృప  దొరుకును.


ధూపవేదిక యొక్క బలిపీఠానికి బంగారముతో అమర్చబడిన వలయాలు కూడా ఉన్నవి

దేవుని పరిశుద్ధస్థలములో ధూపవేదిక యొక్క బలిపీఠం దీర్ఘచతురస్రాకార సమతాంతర చతుర్భుజాలను కలిగిన ఘనరూపము (ఆరు ముఖాలు కలిగిన ఘనరూపము) పొడవు మరియు వెడల్పు 50 సెం.మీ. మరియు ఎత్తు 100 సెం.మీ., మరియు రెండు జతల బంగారు ఉంగరాలు కూడా బలిపీఠానికి ఇరువైపులా జతచేయబడ్డాయి. ఈ బంగారు ఉంగరాల ద్వారా రెండు స్తంభాలు చేర్చబడ్డాయి. ఈ స్తంభాలు కూడా తుమ్మ చెక్కతో తయారు చేయబడి బంగారంతో పొడదిగించబడినవి. ధూపవేదిక యొక్క బలిపీఠం సాపేక్షంగా చిన్నది అయినప్పటికీ, దానిని ఇద్దరు వ్యక్తులు ఎత్తవలసి వచ్చింది. దాని పొడవు మరియు వెడల్పు కేవలం 50 సెంటీమీటర్లు మరియు ఎత్తు 100 సెం.మీ మాత్రమే కాబట్టి, దీనిని కేవలం ఒక వ్యక్తి ద్వారా సులభంగా ఎత్తవచ్చు మరియు తీసుకెళ్లవచ్చు, కానీ ప్రత్యక్షపుగుడారంలోని అన్ని ఇతర పాత్రల మాదిరిగా, అది ఎన్నడూ అనుమతించబడదు. యేసు ప్రభువు చెప్పినట్లుగా నీతిమంతులుగా మనం దేవుని ప్రార్ధించాలని ఇది సూచిస్తుంది, “మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నా తండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను"(మత్తయి 18:19).
ధూపవేదిక యొక్క బలిపీఠం యొక్క ఈ స్తంభాలు కూడా మనం తిరిగి జన్మించిన మన ప్రార్ధనలతో దేవునికి సేవ చేయాల్సి ఉంటుందని చూపిస్తున్నాయి. మన విశ్వాస ప్రార్థనలు కూడా దేవుని సేవ చేయడానికి ఒక మార్గం. ఇప్పుడు మనం మన పాపాలన్నింటి నుండి మరల జన్మించాము, మనం దేవునికి మరియు ఆయన సంఘమునకు అనేక విధాలుగా సేవ చేయవచ్చు, అది ప్రార్థించడం ద్వారా గాని లేదా స్వచ్ఛందంగా చేయడం ద్వారా కావచ్చు. మనం దేవుడిని ప్రార్థించినప్పుడు, మనకోసం మనం ప్రార్థించము, కానీ దేవుని పని కొరకు, ఆయన సంఘము, సంఘ సభ్యులు మరియు ముఖ్యంగా సువార్త వ్యాప్తి కోసం ప్రార్థిస్తాము. మరో మాటలో చెప్పాలంటే, మన ప్రార్ధనలు దేవుని కృపాసింహాసనం యెదుట నిలబడటానికి మరియు ఆయన కృపను కనుగొనడానికి మాత్రమే కాదు కానీ,అవి దేవుని నీతి పరిచర్యను జరిగించుటకు.ఐక్యతతో ప్రార్థించడం ద్వారా మనం దేవుని రాజ్యానికి సేవ చేయవచ్చు. మన తోటి సోదరులు మరియు సోదరీమణుల కోసం, సంఘము కోసం, కోల్పోయిన ఆత్మల కోసం, దేవుని రాజ్యం విస్తరణ కోసం మరియు దేవుని నీతి పరిచర్య కోసం మనం ప్రార్థించినప్పుడు, అలా చేయటం ద్వారా దేవునికి సేవ చేయు వారగుదుము. అందుకే పరిశుద్ధస్థలములో ధూపవేదిక యొక్క బలిపీఠం వద్ద ప్రధానయాజకులు దేవునికి సేవ చేయడం యొక్క చిక్కులను మనం గ్రహించడం చాలా ముఖ్యం. ఈ విశ్వాసం ద్వారా మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించాలి. దేవునికి మరియు ఆయన ప్రజలకు సేవ చేయడానికి మనం దేవుని వాక్యాన్ని బోధించినట్లే, దేవునికి మరియు ఆయన ప్రజలకు సేవ చేయుటకు దేవుణ్ణి కూడా ప్రార్థిస్తాము.దేవునికి సాధ్యమైన అన్ని విధాలుగా సేవ చేయడం మనందరి బాధ్యత.
దైవభక్తిగల క్రైస్తవ జీవితాన్ని గడపడానికి మరియు దేవుని చిత్తానికి సేవ చేయడానికి మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం దేవుడిపై విశ్వాసం మరియు ఆయన నీతిని కలిగి ఉండుట. విశ్వాసం ద్వారా మాత్రమే మీరు దేవుని వాక్యాన్ని బోధించవచ్చు, ఆయనకు ప్రార్థించవచ్చు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయవచ్చు మరియు దేవునికి మరియు ఆయన నీతికి సేవ చేయవచ్చు. దేవునికి సేవ చేయడానికి మనం చేసే ప్రతి పని విశ్వాసం ద్వారా జరుగుతుంది. మీరు దేవుని చిత్తాన్ని అంగీకరించకపోతే మీరు ఎప్పటికీ విశ్వాసంతో కూడిన దైవిక జీవితాన్ని గడపలేరు. మనం దేవునికి సేవ చేయుటకు ప్రార్థించడం ఎంత ముఖ్యమో నేను నొక్కి చెప్పలేను. పరిశుద్ధులు తమ తమ సంఘములలో, మన సోదరుల నుండి మన సోదరీమణులు మరియు ఆదివారం పాఠశాలలో మన పిల్లలు కూడా సమావేశమైనప్పుడు, వారందరూ ముందుగా దేవునికి సేవ చేయాలి. దేవుని వాక్యపు రొట్టెను పంచుకోవడానికి మనం కలిసి ఉండాలి. మరియు మనం దేవుని నీతికి కూడా సేవ చేయాలి. ప్రపంచమంతటా సంఘములో మీ సంఘాన్ని, మీ సేవకులను మరియు మీ పరిశుద్దులను విడిచిపెట్టక ఆశీర్వదించండి. వారి ఆత్మలను మరియు హృదయాలను ఆశీర్వదించండి మరియు వారికి ఆశీర్వాదమైన విశ్వాసాన్ని ఇవ్వండి. నశించిపోవుచున్న ఆత్మలను రక్షించండి.”ప్రార్థన యొక్క ఈ మధురమైన తీపి వాసనను ఆస్వాదిస్తూ, దేవుడు మనకు సమాధానమిస్తాడు మరియు ఆశీర్వదిస్తాడు. మన ప్రార్ధనలలో మనం అడిగే ప్రతిదానికీ ఆయన సమాధానమిస్తాడు. ప్రార్థనతో దేవునికి సేవ చేయడం అంటే ఇదే, మరియు మీ అవసరాల కోసం ప్రార్థించడం కంటే మీ ప్రార్థనలలో దేవుని పనిని గుర్తుంచుకోవాలని నేను మీ అందరికీ సూచిస్తున్నాను.
సంఘములో ప్రతి పరిశుద్దుడు ప్రార్థన చేయాల్సి ఉండగా, మీరు విరమించబడిన వారైనా లేదా అనారోగ్యంతో ఉన్నా, ఏ కారణం చేతనైనా అందరికంటే ఎక్కువ సమయం కేటాయించగలిగితే, మీరు దేవుని సంఘములో, ఆయన సేవకులు మరియు ఆయన పరిశుద్ధులు కోసం మరింత ఎక్కువగా ప్రార్థించాలి.గృహిణులకు ఇది చాలా ముఖ్యం. మనం దేవుణ్ణి సేవించలేకపోవడానికి డబ్బు లేకపోవడం వల్ల కాదు. మీరు డబ్బు లేకుండానే దేవునికి సేవ చేయవచ్చు. నీ విశ్వాసంతో నీవు కోరుకున్నంతగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను అందించగలవు. ధూపవేదిక యొక్క బలిపీఠం యొక్క ఉంగరాలతో రెండు స్తంభాలను ఇద్దరు పురుషులు తమ భుజాలపై మోసుకెళ్లినట్లుగా, పేదవారు కూడా దేవుని సంఘములో ఐక్యంగా ఉంటే వారి విశ్వాస యొక్క ప్రార్థనలతో ప్రభువుకు సేవ చేయవచ్చు. ధనవంతులు అయిన వారు కూడా తమ భౌతిక వస్తువులతో దేవునికి సేవ చేయవచ్చు.“నేను దేవుని పని చేయటానికి సమయం హెచ్చించలేనంత పనిలో చాలా బిజీగా ఉన్నానని అనవద్దు." ప్రతి నీతిమంతుడైన పరిశుద్ధుడు తన సమర్పణలు, ప్రార్ధనలు లేదా సువార్త యొక్క ప్రచార విశ్వాసం ద్వారా ప్రభువుకు మరియు ఆయన చిత్తానికి సేవ చేయవచ్చు. మనమందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే కోరిక ఉన్నప్పుడే మాత్రమే సేవ చేయగలము. తిరిగి జన్మించిన మనమందరము మనం వారి కోసం ఆరాటపడితేనే మనం దేవుని ఆశీర్వాదాలను పొందగలము.


నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసముంచు మన అందరని దేవుడు దీవించును

ప్రభువు మన కాపరిగా ఉన్నాడు. దేవునితో మన సంబంధం చాలా దగ్గరగా ఉంటుంది కావున ఆయన నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు.
ఇక్కడ మత్తయి 26:26-28 వైపు తిరుగుదాం:“వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము . ”
"యేసు"అనే పేరునకు అర్ధం రక్షకుడు లేదా మెస్సయ్య, మరియు ఆయన మన దేవుడు మరియు మన యజమాని అని సూచించడానికి మనము ఆయనను మన ప్రభువు అని పిలుస్తాము.మనందరినీ రక్షించడానికి మన ప్రభువైన యేసు మన స్వంత రక్షకునిగా దేవుడే ఈ భూమ్మీదకు వచ్చారు, మరియు మానవ శరీరాకారములో శరీరధారిగా అవతరించాడు. శిలువపై చనిపోయే ముందు, మన ప్రభువు చివరి విందును సిద్ధం చేసి, తన శిష్యులను ఒకచోట కూర్చుండబెట్టి, రొట్టె ద్రాక్ష రసమును ఇచ్చి “ఈ రొట్టెను తీసుకొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ” దీని అర్థం దేవుడే ఈ భూమ్మీదకు మన స్వంత రక్షకునిగా వచ్చి, పాత నిబంధనలో ప్రవచించిన విధంగా నీరు మరియు ఆత్మ ద్వారా తన వాగ్దాన వాక్యాన్ని వ్యక్తిగతంగా నెరవేర్చడం ద్వారా మనలను రక్షించాడు. ఈ విధంగా మన రక్షకునిగా ఈ భూమిపైకి వచ్చిన తరువాత, మన ప్రభువు యొర్దాను నదిలో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకొని ఈ ప్రపంచంలోని సమస్త పాపాలను అంగీకరించాడు. అప్పుడు ఆయన శరీరమును సిలువకు అప్పగించుకున్నాడు, తద్వారా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి యొక్క సమస్త శిక్షణ భరించాడు.మరియు ఆయన తిరిగి మృతులలో నుండి లేవడం ద్వారా మనకు కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు.
బలి పశువు యొక్క రక్తాన్ని ధూపవేదిక యొక్క బలిపీఠం మీద పెట్టడం అనేది యేసు క్రీస్తు భౌతిక మరణాన్ని సూచిస్తుంది. అదే విధంగా, బాప్తీస్మం ద్వారా మన పాపాలన్నింటినీ భరించిన తరువాత, యేసుక్రీస్తు తనను తాను బలిగా మారి, సిలువపై తన సొంత రక్తాన్ని మనకోసం చిందించాడు. ఈ త్యాగానికి కృతజ్ఞతగా మనం రక్షించబడ్డాము. నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తపై మన విశ్వాసం యొక్క కారణంగా మనం మన మోక్షానికి చేరుకున్నాము. మన పాపాలన్నిటి నుండి మనం రక్షించబడినది ఏక పక్ష విశ్వాసం ద్వారానో లేదా గ్రుడ్డి గానో కాదు, కానీ యేసు మాత్రమే దేవుడిగా ఈ భూమ్మీదకు మన రక్షకునిగా వచ్చాడు, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన పాపాలన్నింటినీ తన శరీరంపై భరించి మన అందరి కొరకు ఆయన విలువైన రక్తాన్ని కార్చాడు.
దేవుడు అలా మన రక్షణను సాధించాడు, ఇది నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు ప్రత్యక్షపు గుడారం యొక్క తలుపు యొక్క తెర సన్నని పేనిన నారతో సూచించబడింది. ఇక్కడ ఊదా రంగు రాజుల రాజు మనిషిగా మారడాన్ని సూచిస్తుంది. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకోవడమనేది యేసు మన పాపాలన్నింటినీ అంగీకరించాడని మరియు మన స్థానంలో ఆయన రక్తం చిందించడం ద్వారా మన పాపాల యొక్క సమస్త జీతం చెల్లించాడని ఇది మనకు బోధిస్తుంది. ప్రభువు మన స్వంత రక్షకుడు ఎలా అయ్యాడు. నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తపై విశ్వాసం పరిశుద్ధల సహవాసములో పాల్గొనడానికి మనకు సహాయపడే విశ్వాసమైయున్నది. యేసు చివరి విందు కోసం సిద్ధమైనప్పుడు, ఆయన కేవలం రొట్టెను మాత్రమే కాకుండా ద్రాక్షారసాన్ని కూడా సిద్ధం చేసాడు; మరియు ఆయన తన శిష్యులకు రెండింటినీ తిని త్రాగమని చెప్పాడు. ఇక్కడ ఉన్న రొట్టె యేసు శరీరాన్ని సూచిస్తుంది, పాపులైన మనల్ని రక్షించడానికి దేవుడు స్వయంగా మనిషి అయ్యాడని సూచిస్తుంది. యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, యేసు మన పాపాలన్నింటినీ తన శరీరంపై భరించాడని కూడా ఈ రొట్టె సూచిస్తుంది. మరోవైపు, ద్రాక్ష రసం, మన స్థానంలో సిలువపై యేసు చిందించిన జీవపు రక్తమును మరియు రక్షణను సూచిస్తుంది.
అందువల్ల, మనం పరిశుద్ధుల యొక్క బల్లాలో పాల్గొన్నప్పుడల్లా, మనల్ని రక్షించడానికి దేవుడు శరీరధారిగా అవతరించి ఈ భూమిపైకి వచ్చాడనే అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం మనందరికీ ఎంతో అవసరం.ఆయన బాప్తీస్మం తీసుకొని, మన స్థానంలో సిలువపై ఆయన శిక్షించబడ్డాడు, తద్వారా ఆయన మనలను రక్షించాడు మరియు మన వ్యక్తిగత రక్షకుడిగా మారాడు. అయితే,విచారకరమైన విషయం ఏమిటనగా, చాలా మంది క్రైస్తవులకు యేసుక్రీస్తు పరిశుద్ధ ఆరాధన బల్ల యొక్క ఈ ఆచారాన్ని ఎందుకు స్థాపించాడో మరియు ఆయన తిరిగి వచ్చే వరకు దానిని అనుసరించమని ఆదేశించినందుకు ఖచ్చితమైన కారణం తెలియదు.మీరు మీ విశ్వాస జీవితాన్ని ఎన్నడూ తేలికగా తీసుకోకూడదు. యేసు మీ రక్షకుడు అని మీకు ఇంకా తెలియకపోతే, పరిశుద్ధ ఆరాధన బల్లలో యేసు రొట్టె మరియు ద్రాక్ష రసం  తీసుకునే ముందు మీరు మీ విశ్వాసం గురించి దీర్ఘంగా ఆలోచించాలి. అందరూ భావోద్వేగానికి లోనయ్యే బదులు, జాగ్రత్తగా ఆలోచించి నిజంగా ప్రభువు మీకు ప్రభువా కాదా అని  మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి
దేవుడు మీ దేవుడు మరియు నా దేవుడు అయన మీ పూర్వీకులను మరియు నన్ను సృష్టించిన వాడు. మరియు ఆయన మనలను ఈ భూమిపై జన్మించడానికి అనుమతించాడు. ఈ దేవుడు మరెవరో కాదు గాని యేసే. ఈ యేసు దేవుడే, మన స్వంత రక్షకునిగా ఈ భూమిపైకి వచ్చాడు. మనలను రక్షించడానికి మన రక్షకునిగా ఈ భూమిపైకి వచ్చిన తరువాత, అయన బాప్తీస్మం ద్వారా మన పాపాలన్నింటినీ తన శరీరంపై మోసుకున్నాడు. అప్పుడు అయన మనలోని ప్రతి పాపాలను విశ్వాసంతో శిలువపైకి తీసుకువెళ్లాడు, వాటిలో దేని నుండి కూడా తనను తాను విరమించుకోలేదు మరియు మన పాపాలకు మనం శిక్షించబడకుండా ఉండటానికి, శాపగ్రస్తుడు మాత్రమే భరించాల్సిన శిలువ శిక్షను భరించాడు. మన శిక్షలన్నిటి  నుండి ప్రభువు మనలను ఇలా రక్షించాడు.
తండ్రియైన దేవుడు తన ఏకైక కుమారుడిని అనుగ్రహించనంతగా లోకాన్ని ప్రేమించాడు. ప్రతి మనిషిని రక్షించడానికి దేవుడే ఈ భూమిపైకి వచ్చాడు. మరియు ఆయన నిన్ను మరియు నన్ను మన సమస్త పాపాల నుండి కాపాడాడు, మరియు ఆయన మీ రక్షకునిగా ఉన్నట్లు నాకును రక్షణ కర్తయైన దేవుడు అయ్యాడు. మన రక్షణను చేరుకోవడానికి మనం చేయాల్సిందల్లా యేసుక్రీస్తు దేవుడే అని విశ్వసించడం మరియు ఆయన మనకోసం చేసిన రక్షణ యొక్క పనిని మన హృదయాలలో అంగీకరించడం. తమ స్వంత శక్తితో పూర్తిగా అలసిపోయిన వారు, వారి నిష్ప్రయోజతను గ్రహించి తమ స్వంత ప్రయత్నాలను విరమించుకున్నవారు మరియు వారి యొక్క పాప క్షమాపణను మరియు వారి రక్షణను పూర్తిగా దేవునికి అప్పగించిన వారు మాత్రమే - దేవుని నుండి దయ పొందగలరు. మీ ఆలోచనలలో ఇది మీకు అర్థంకానిదిగా అనిపించినప్పటికీ, మనందరినీ విమోచించటానికి దేవుడే స్వయంగా మన రక్షణను సంపూర్ణంగా నెరవేర్చాడు. కావున దేవుని యొక్క రక్షణ కార్యమును నమ్మటం తప్ప మనం చేయాల్సింది మరొకటి లేదు.


మిమ్మల్ని మీరు పూర్తిగా దేవునికి అప్పగించుకొనుడి 

దేవుడు మీ కోసం ఏమి చేశాడో ఆలోచించి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవడం తప్పని సరి. దేవుడే మనిషిగా మారడం అనునది. దేవుడు నిన్ను మరియు నన్ను రక్షించడానికే ఇలా చేసాడు. అంతేకాకుండా, దేవుడైన యేసు, మన పాపాలన్నింటినీ భరించడానికి వాటి అన్నింటినీ తుడిచివేయడానికి మన కోసం బాప్తిస్మం తీసుకున్నాడు. సిలువపై సిలువ వేయబడ్డాడు, సిలువపై మనకోసం తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆయన మన స్థానంలో శిక్షించబడ్డాడు,మన పాపాలన్నింటినీ తీర్చడానికి, మన శిక్ష నుండి మమ్మల్ని విడిపించడానికి మరియు తీర్పు నుండి తప్పించుకునే అవకాశం కల్పించడానికి. మనల్ని నూతన వ్యక్తులుగా మరియు నిత్యజీవానికి తిరిగి తీసుకురావడానికి ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. 
ఇప్పుడు, ఆయన తండ్రి అయిన దేవుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని మనందరినీ చూస్తున్నాడు. ఆయనను రక్షకునిగా ఎవరైతే  తమని తాము ఆయనకు అప్పగించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో మరియు ఎవరైతే ఆయనను హృదయపూర్వకంగా విశ్వసిస్తారో ఆయన వారి కొరకు చూస్తున్నాడు. యేసును స్వీకరించిన వారు తమ సర్వస్వం దేవునికి అప్పగించుకొందురు. ప్రభువు వారిని సంపూర్ణంగా రక్షించాడని వారు నమ్ముతారు. రక్షణ కొరకు సొంతంగా వారేమి చెయ్యవలసిన అవసరంలేదని వారికి తెలుసు. ప్రత్యక్షపుగుడారం యొక్క తలుపు నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారంలో వెల్లడించిన రక్షణ యొక్క సత్యము ద్వారా దేవుడు వారిని రక్షించాడని ఆయన ప్రేమ నుండి మాత్రమే వారు పూర్తిగా రక్షించబడ్డారు. తమను తాము పూర్తిగా దేవునికి అప్పగించుకొని దేవుణ్ణి మరియు ఆయన వాక్యాన్ని వారి హృదయాలలో అంగీకరించిన వ్యక్తులందరికీ, దేవుడు తన సొంత పిల్లలు అయ్యే హక్కును అనుగ్రహించాడు.
కాబట్టి మీరు ప్రభువు పరిశుద్ధ బల్ల ఆరాధనలో పాల్గొనే ముందు ఈ రక్షణ యొక్క సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. యేసు అందుకున్న బాప్తీస్మం మన పాపాలన్నింటినీ భరించి వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయబడింది. యేసు అనుభవించిన భౌతిక మరణం, మిమ్మల్ని మరియు నన్ను మన సమస్త పాపాల నుండి రక్షించినది. యేసు మన పాపాలన్నింటినీ భరించి, మరణానికి సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తాన్ని మన స్థానంలో చిందించాడు మరియు పాపం యొక్క తీర్పు నుండి మనల్ని విడుదల చేయడానికి మరియు మిమ్మును నీతిమంతులుగా చేయడానికి ఇలా శిక్షించబడ్డాడు.
పరిశుద్ధస్థలములో ఉండి, ప్రార్థిస్తున్న మనందరికీ, దేవుడు తన కృపను ధరించడానికి ధూపవేదిక యొక్క బలిపీఠమును ఇచ్చాడు. ఇక్కడే మనం దేవుని కృపను పొందగలం. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలని నేను మిమ్మును హెచ్చరిస్తున్నాను.
హల్లెలూయా!