(నిర్గమకాండము 26: 15-30)
“మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను. ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను.అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను. ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున, ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒక దానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును. పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మ లుండవలెను. తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను; ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి యుండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.”
దేవుడు నివసించే ప్రత్యక్షపుగుడారము యొక్క ఆ పలకలన్నీ బంగారంతో పొదిగించబడి ఉన్నవి. ప్రత్యక్షపుగుడారం యొక్క ప్రతి పలక నిటారుగా నిలబడటానికి, దేవుడు మోషేకు రెండు వెండి కుసులను తయారు చేయమని చెప్పాడు. ప్రతి పలక క్రింద రెండు వెండి కుసులను ఉంచడం యొక్క ఆధ్యాత్మిక అర్ధం క్రింది విధంగా ఉంది. బైబిల్‌లో, బంగారం అనునది విశ్వాసాన్ని సూచిస్తుంది, అది సమయాన్ని బట్టి మారేది కాదు. ఈ బంగారంతో పొదిగించబడిన పలకల క్రింద ఈ వెండి కుసులు ఉంచబడ్డాయి అనగా దేవుడు మన రక్షణను గూర్చి నిశ్చయమైన వాగ్దాన సంబంధమైన రెండు బహుమతులను అనుగ్రహించాడు. మరో మాటలో చెప్పాలంటే, యేసు బాప్తిస్మం తీసుకొని ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా పాపం నుండి మన రక్షణను పూర్తి చేసాడు.
మనకు సంపూర్ణనంగా ఆవరమైనది విలువైన బంగారము వంటి విశ్వాసము అది మనలను ఆయన ప్రజలుగా చేయును మరియు ఆయన రాజ్యములో భాగస్థులను చేయును అది యేసు యొక్క బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తమును నమ్ము విశ్వాసమైయున్నది. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మన సమస్త పాపములను తుడిచి వేయటానికి మనకు విశ్వాసమును బహుమతిని సంపూర్ణముగా అవసరమైనదిగా మనకు అనుగ్రహించెను.మనము సహాయము చేయలేనప్పటికీ నరకమునకు బందించబడుటకు ప్రతిరోజు పాపము చేయుదుము, మన స్వచిత్తా ప్రయత్నాల ద్వారా లేదా మన బలము వలన మన పాపములు తుడిచివేయబడవు.
మన సమస్త పాపములను తుడిచివేయుటకు, మన సొంత బలముపై ఆధారపడుటకు బదులుగా,మనము నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తప్పని సరిగా విశ్వసించవలెను, అప్పుడు మాత్రమే మన సమస్త పాపముల నుండి రక్షించబడుదుము. సత్య సువార్త ద్వారా ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణ బహుమానమును నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను కృతజ్ఞతతో నమ్మవలెను. మనము రక్షణ యొక్క రెండు విధములైన బహుమానమును నమ్మినప్పుడు,మన యొక్క విశ్వాసాన్ని మనo చూచినప్పుడు, దేవుడు మనలను ఆయన సంపూర్ణ ప్రజలుగా చేయును. అందువల్ల, ఇప్పటికి నీ హృదయములో ఏదైనా పాపమున్నట్లయితే, నీవు పూర్తిగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసముంచి రక్షించబడి దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన బహుమానము ద్వారా మనము రక్షించబడవలెనని.
లోకములో జీవించే అనేకమంది ప్రజలు దేవుని యొక్క స్వంతo కావాలని ఆశించుదురు. దేవుని స్వంత ప్రజలు కావాలంటే, మనము తప్పనిసరిగా దేవుని వాక్యపు వెలుగులో మనలను మనము పరిశీలించి పరివర్తన చెందవలెను. అప్పుడు, మన మనమందరము పాపులమని ఒకవేళ మన పాపములను బట్టి మనం శిక్షకు లోనగు వారిమీ అయినను దానికి వ్యతిరేకముగా అంగీకారంతో ఏమిచేయలేని వారమని గుర్తించివలెయును. ప్రతి రోజు ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా పాపము చేయువారము మనమే. మన యొక్క నిజ స్వరూపము ఆ విధమైన సహాయంచేయలేని స్థితి కలిగి ఉన్నది కానీ మన జీవితాలు పాపముమునకు మరియు అన్యాయానికి అనుమతించబడి, మన యొక్క తీర్పు కొరకు ఎదురుచూచెదము. ఈ విధముగా ఉన్న మనము దేవుని యొక్క స్వంత ప్రజలము ఎలా కాగలము? అటువలె మనము గ్రహించినది ఏదనగా ఆయన స్వంత ప్రజలు కావటానికి ఆయన అనుగ్రహించిన రక్షణ యొక్క ఆ రెండు బహుమానములు స్వీయకరించుట అవసరమైయున్నది.
మనకు, నీలం,ఊదా,మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార ద్వారా మన సమస్త పాపములన్నియు తుడిచివేసిన ఆయన మనకు ప్రభువును రక్షుకుడై యున్నాడు.యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి పొందిన బాప్తీస్మం మరియు సిలువపై ఆయన చిందించిన రక్తం ద్వారా మన సమస్త పాపముల నుండి పూర్తిగా మనలను రక్షించాడు. ఈ రెండు అంశాలు మన యొక్క రక్షణకు అవసరమైనవి. అందువల్ల, ఈ సత్యమును నమ్మలేని ఏ ఒక్కరు దేవుని ప్రజలు కాలేరు.
ఈ రెండు రక్షణ యొక్క బహుమానములు ద్వారా దేవుడు అది మనకు అనుగ్రహించాడు, దేవుని పిల్లలం అగుటకు మన స్వంత మంచి పనులు ద్వారా చేయుటకు సంపూర్తిగా ఏమిలేదు.మనము సమస్త పాపముల నుండి విడిపించబడి శిక్ష నుండి రక్షించబడి యున్నామంటే ఇది పూర్తిగా యేసు యొక్క బాప్తీస్మం మరియు ఆయన చిందించిన రక్తం వలన మాత్రమే సాధ్యమైంది.మరొక మాటలో చెప్పాలంటే,మనము నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసముంచుట ద్వారా దేవుని పిల్లలం కాగలము. మన యొక్క విశ్వాసము దేవుని నుండి స్వీకరించిన స్వచ్ఛమైన బంగారము వలె నిర్మించబడినది.
ప్రత్యక్షపుగుడారమును చేయుటలో, దేవుడు రెండు వెండి కుసులను ప్రతి పలక యొక్క అడుగుభాగమును ఉంచును. ఈ సత్యము మనకు చెప్పుచున్నది యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యొర్దాను నదిలో బాప్తీస్మం తీసుకొని,పాపము యొక్క శిక్షను భరించి ఈ పాపములను సిలువకు తీసుకెళ్లి దాని పై మరణించెను . యేసు పొందిన బాప్తీస్మం మరియు ఆయన సిలువ పై కార్చిన రక్తం నిశ్చయముగా పాపము యొక్క విమోచన బహుమానములైయున్నవి.
నీవు మరియు నేను నివసిస్తున్న ఈ కాలములో మన యొక్క పాప స్థితిని తప్పనిసరిగా తెలుసు కొనవలెయును. దేవుని యెదుట వారే మైయున్నారో తెలుసుకొని గ్రహించవలెను ఎందుకనగా దేవుడు వాస్తవంగా ఈ లోకానికి వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకొని, సిలువపై మరణించటం ద్వారా,వారి సమస్త పాపముల నుండి మరియు శిక్ష నుండి ఆయన వారిని రక్షించెను. మనము రక్షణ యొక్క బహుమానమునందు విశ్వాసముంచినప్పుడు మనము ఈ విధమైన పాప విమోచన పొందెదము, అప్పుడు మనము ఆయన యెదుట దేవుని యొక్క స్వంత పిల్లలమగుదుము.ఇదంతయు ఆయన బాప్తీస్మం మరియు సిలువపై రక్తం ద్వారా ప్రభువు మనలను రక్షించాడు. ఆ విధంగా పాపము నుండి మనము విడుదల పొందియున్నాము;ఆయన ఆ విధంగా చేయకపోతే,మనము ఎన్నడూ మన యొక్క పాపముల నుండి మన స్వంత ప్రయత్నాల ద్వారా రక్షించబడే వారిమీ కాదు. అందువల్ల, ఇది మనవలన కాదు కానీ కేవలం నూటికి నూరు శాతం దేవుని కృప వలన నీవు మరియు నేను దేవుని ప్రజలుగాను మరియు నీతిమంతులుగా చేయబడితిమి.
ప్రత్యక్షపుగుడారము యొక్క వెండి పలకల యొక్క కుసులు మనకు చూపించునది నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం సంపూర్తిగా దేవుడు నెరవేర్చిన మన పాపముల యొక్క విడుదలైయున్నది. ఇది నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం ద్వారా దేవుడు మనపై అనుగ్రహించిన కృపా రక్షణ కావున మనము విశ్వాసం ద్వారా పూర్తిగా రక్షించబడితిమి.ఆత్మలో దీనులైన వారు మాత్రమే,వారి పాపములను బట్టి వారు నరకమునకు బందించబడిన వారమీ కాదనక అంగీకరించి ఒప్పుకుందురు,నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం ద్వారా రక్షణ పొందుటకు వారు అర్హులే. వారిపై వారే దుఃఖించుచు మరియు ఏడ్చు వారు,నరకమునకు నిర్ణయించబడినవారు, వారు కూడా దేవుడు అనుగ్రహించిన కృపారక్షణను స్వీకరించుటకు అర్హులే. నమ్మువారికి సత్యం నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారలో చూపబడింది, తండ్రియైన దేవుడు కుమారుడైన యేసు ద్వారా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను యిచ్చియున్నాడు, వారి పాపములన్నిటి నుండి రక్షించబడుటకు మరియు ఆయన పిల్లలగుటకు. ప్రభువు యొక్క కృపా రక్షణను పొందిన వారు మాత్రమే దేవుని యొక్క సమస్త ఆశీర్వాదములను అనుభవించగలరు. ఈ అర్హత కేవలం వారి పాపములను బట్టి వారు నరకమునకు బంధింపబడిన వారని తెలుసుకొని దేవుని కరుణ కొరకు అడగువారికి మాత్రమే ఉంటుంది.ఇదే నిజమైన స్థితి.
దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ బహుమానమును బట్టి మన మందరము మన సమస్త పాపముల నుండి రక్షించబడితిమి. అందుకనే ఎఫెసీ 2:8 చెప్పుచున్నది``మీరు కృప ద్వారా రక్షించబడ్డారు``.మనము రక్షణ యొక్క బహుమానము నందు విశ్వాసముంచుయున్నాము గనుక మనము కూడా దేవుని పిల్లలమైతిమి. ఇలా ఇవ్వడం ద్వారా, మనము దేనిని బట్టి అతిశయించగలము? అతిశయానికి దూరంగా, మనము ఏమి చేయలేము కానీ దేవుని స్తుతించగలము, మనము ఆ విధంగా ఒప్పుకోక పోయినను దేవుడు మనలను రక్షించాడు.
క్లుప్తంగా చెప్పాలంటే, మన సమస్త పాపముల నుండి ఎన్నడూ రక్షించబడలేము, నీలం, ఊదా , మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార ద్వారా దేవుడు మనలను రక్షించలేదా? నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార సత్యమును కలిగి ఉండి ఇది నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా చేయబడింది. ఇది రక్షణ యొక్క సత్యమును బయలుపరచును అది యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి,యొర్దాను నదిలో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత ఒకేసారి మానవ జాతి అందరి కొరకు బాప్తీస్మం తీసుకొని మన సమస్త పాపములు ఆయన పైకి తీసుకొని సిలువపై మరణించి,మృతుల్లో నుండి తిరిగి లేచెను(మత్తయి 3:13-17). దేవుడు తన కృప ద్వారా మనలను రక్షించిన విధానము చాలా పరిపూర్ణమైనది, పాపములో మరియు శరీరములో అసంపూర్ణులుగా ఉన్న మనలను విశ్వాసము ద్వారా పరిపూర్ణులుగా చేయుటకు,దేవుని రాజ్యములో ఒక స్తంభం వలె ఎదుగుటకును,మరియు ఆయన ప్రజలు యొక్క రాజ్యములోకి మనలను నడిపించుటకు.
నీవు యేసును నమ్మినప్పటకి నిజంగా నీవు ఎవరివో నీకు తెలియదా?
ప్రస్తుత కాలములో శాటిలైట్స్ మరియు కేబుల్ నుండి చూటకు వందల సంఖ్యలో దూరదర్శన్ ప్రసారాలు ద్వారా 24 గంటలు ప్రసారాలు జరుగుచున్నవి. ఈ ప్రసార కేంద్రాలన్నీ ప్రేక్షకులకు ఆసక్తికరమైన వారి యొక్క సొంత కార్యక్రమాలు ప్రసారం చేయుట కొనసాగించెదరు. ఈ ప్రసారాలన్నిటిలో కంటే, ఎక్కవ విజయవంతమైన వాణిజ్యపరమైన ప్రసారాలు ప్రత్యేకమైనవి, వీటి కంటే ఎక్కువగా మాధ్యమిక ప్రసారాలు ఎక్కువ ప్రత్యేకతను సంతరించుకొనును.ఆ విధమైన మాధ్యమిక ప్రసార కేంద్రాలు అన్నిరకములైన అశ్లీల కార్యక్రమాలు వస్తు సామాగ్రి సాదారణముగా ఈ ప్రసారాలు ద్వారా చూచుటకు అందుబాటులో ఉండును. ఫలితంగా,ఈ కాలం నాటి అనేక మంది ప్రజలు వారికి వారే ఆ విధమైన అశ్లీల చిత్రాలలో మునిగి తేలుదురు. దారుణమైన విషయం ఏమిటంటే, అలాంటి వ్యక్తులు తమ అసభ్యతను అత్యధిక పాపముగా పరిగణించరు.
ఏదేమైనను, ప్రతి మనిషి నుండి వచ్చే జారత్వము, వ్యభిచారాలు మరియు అనైతిక పాపాలను స్పష్టంగా బైబిల్ ఎత్తి చూపుతుంది(మార్కు 7:21-23). మనము పాపముతో నింపబడ లేదా? దేవుడు పదే పదే చెప్పాడు మన యొక్క సహజ స్వభావం పాప స్వభావమైనది,పాపము యొక్క జీతము మరణం,మరియు పాపము పూర్తిగా పరిపక్వత చెందినప్పుడు మరణము సంభవించును.దీనిని నిజముగా మనము అంగీకరిస్తున్నామా? ఇది ఏమై ఉండును? మనము పాపపు స్వభావము నుండి తప్పించుకోగలమా అది మన యొక్క కళ్ళను మరియు మన చెవులను సహజంగా మూసుకొనున్నట్లు చేయగలుగునా?మనము సహాయము చేయలేము కానీ మన యొక్క ఆలోచనతోను మరియు ఊహలతోను అన్ని రకముల పాపములు చేయగలము.అలాంటి పాపముల నుండి దూరంగా ఉండుటకు మనకై మనము ఎంత చెప్పుకున్నను పట్టింపు లేదు. మనము అలా చేయుట అంత కష్టమైనది కాదు,అవన్నీ వ్యర్థమైనవి. నిజానికి,మన యొక్క శరీరము అలాంటిది మాత్రమే కాక,పాపపు వ్యామోహముతో పాపము చేయని పరిపూర్ణమైన పరిశుద్ధులము ఎన్నడు కాలేము, కానీ మనము సహజ సిద్ధముగా పాపము చేయుటకు దూరముగా ఉండుటకు ఇష్టం లేక పాపముతో అనుబంధాన్ని కలిగిఉన్నాము. మానవుని యొక్క హృదయము మరియు శరీరము ఎల్లప్పుడు పరిశుద్దమైన విషయాలు నుండి దూరం చేయబడ్డాయి,మరియు ఇది సత్యమైనది అది వారు పాపమునకు దగ్గరవ్వటం మాత్రమే కాక,వారు అధిక పాపము చేయుటకు ఇష్టపడుదురు.
మనలో ఉన్న ప్రతి ఒక్కరం అన్యాయస్థులం మరియు పాపపు జీవులం.కావున మనము మన యొక్క ప్రాథమిక మూల సిద్ధాంతాలలో దిగజారిపోతున్నాము.మన యొక్క అనైతికతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవన్నియు మన జ్ఞాపకాలలో ఎక్కువ కాలం కాల్చబడ్డాయి,మరియు మిగిలి ఉన్న శేషము మన మనసులను కలచివేయును. దీనంతటికి కారణం ప్రతి ఒక్కరి మానవుని హృదయం పాపము యొక్క ముద్ద కంటే ఎక్కువేమీ కాదు వాటి యొక్క ప్రాథమిక మూల సిద్ధాంతాలలో. అందువల్ల, మనము తప్పనిసరిగా నిజాయితీగా మనలను మనమే అలాంటి పాపపు సమూహపు స్వభావమును దేవుని యెదుట ఒప్పుకోవాలి. మరియు దేవుని యొక్క నీతితో కూడిన తీర్పు ద్వారా మనము నరకమునకు బందించబడిన వారిమిగా మనలను మనమే గుర్తించుట మరియు మన యొక్క రక్షణను గూర్చి ఆయనను అడుగుట మనకు ఇది జ్ఞానమైయున్నది. నెపోలియన్ బోనపార్టే,"మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం అసాధ్యం" అని చెప్పలేదా? చాలా మంది క్రైస్తవులు తమ కోసం తాము పాపం చేయకుండా ఉండగలిగినట్లుగా, తమ స్వంత నీతిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది దేవునికి వ్యతిరేకంగా ఒక పెద్ద సవాలు వంటిది. అలాంటి ధిక్కార విశ్వాసం దేవుని నీతిని స్వీకరించడానికి మరియు ఆయన మనకు ఇచ్చిన రక్షణ యొక్క ప్రేమను తిరస్కరించే వారు దుష్టులుగా ఉందురు.
మిమ్మల్ని మీరు మంచివారిగా భావిస్తున్నారా? ఎటువంటి పరిస్థితులలో ఏ రూపంలోనైనా ఎలాంటి అన్యాయాన్ని సహించలేని బలమైన న్యాయ భావన మీకు ఉందని మీరే అనుకుంటున్నారా? మీరు దేవుని ఆజ్ఞలను ప్రతిరోజూ మీ హృదయంలో ఉంచుకుని,మీ జీవితంలో వాటిని పాటించడానికి మరియు వాటిని అమలు చేయడానికి ప్రయత్నించినందున, మీరు దేవుని ముందు ఏదో ఒకవిధంగా నీతిమంతుడుగా మీరు భావిస్తున్నారా? దేవుడిచ్చిన రక్షణ శక్తి యొక్క బహుమతి మరియు కృప ఎవరికైనా తెలియకపోతే అతని హృదయం ఇకను పాపములోనే ఉండిపోయినప్పటికీ కూడా నీతిగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే, అతను చేస్తున్నదంతా మనుషుల యొక్క మురికి నీతితో నీతిమంతుడిగా నటింపచేయటయో. అలాంటి వ్యక్తుల మంచితనం దేవుని మందిరానికి మూలస్తంభాలుగా మార్చలేకపోతుంది మరియు వారు ఉపయోగం లేని పాపము ముద్దగా ఉన్నారు.
తూర్పు ఆసియా దేశాలలో, చాలామంది కన్ఫ్యూషియస్ బోధలను పుట్టుక నుండి నేర్చుకుంటారు, కాబట్టి వారు ఈ బోధనలను ఆచరణలో పెట్టడానికి చాలా ప్రయత్నిస్తారు. మరోవైపు, పశ్చిమంలో, కాథలిక్కులు లేదా ప్రొటెస్టెంట్లు దాని మతపరమైన భూభాగంలో ఆధిపత్యం చెలాయించాయి మరియు చాలా మంది పాశ్చాత్యులు దేవుని చట్టాన్ని పాటించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారు తమను తాము దేవుని చట్టాన్ని పాటించటానికి ముందుకొచ్చినప్పుడు వారు తూర్పు లేదా పడమర నుండి ఎక్కడి నుండి పుట్టుకొచ్చారో సంబంధం లేకుండా దేవుని యెదుట వారి నిజమైన ప్రాథమిక స్వభావాలు తీసివేయబడ్డాయి, కన్ఫ్యూషియస్ బోధనల ప్రకారం జీవించడానికి ప్రయత్నించువారును మరియు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ప్రయత్నించే ఇద్దరును పాపం మరియు దుష్టుల యొక్క సంతానమునకు చెందిన వారే. మానవులు యొక్క అన్యాయo, పాపపు మరకలతో నిండి ఉన్న దుమ్ము ధూళితో చేయబడిన పాపపు సమూహాలు.మంచి పనులు చేసిన మంచి వ్యక్తులు కూడా గుర్తింపు కోసం కాకుండా వారి నిజాయితీ హృదయాల నుండి, మరియు వారి మంచి పనుల కోసం ప్రశంసలు అందుకునే అసౌకర్యానికి గురైన వారు కూడా, దేవుని యెదుట వారి ప్రాథమిక సారాంశం వెలికితీసినప్పుడు, వారు తప్పించుకోలేరు. మానవులందర దుష్టులను పాపపు సంతానమైయున్నారు. దేవుని నీతి ముందు మానవ నీతి బహు చెడ్డది కాబట్టి, ప్రజలు తమ శిక్షను గుర్తించి, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను అంగీకరించకపోతే పాపం యొక్క శిక్ష నుండి తప్పించుకోలేరు,దేవుని ప్రేమ ముందు, మానవ ప్రయత్నాలన్నీ ఏ మంచితనంలోకి అనువదించబడవు, మరియు మానవజాతి యొక్క ఉద్దేశం ఆయన యెదుట మురికిగా ఉంటుంది. మానవజాతి యొక్క ప్రాథమిక స్వభావం ధూళి, చెక్క మరియు ఇత్తడి. మనుషులు ఒక రకమైన చెక్క, వారు మొదట బంగారుతో కప్పబడితే తప్ప దేవుని మందిరం ప్రవేశద్వారం వద్ద పెరగలేరు.మరియు దేవుడు ఇచ్చిన రక్షణ యొక్క కృప లేకుండా, వారు అగ్ని యొక్క తీర్పును ఎదుర్కోవడం తప్ప మరొకటి లేదు. రక్షణ యొక్క బహుమతిని మనం విశ్వసించకపోతే, యేసు క్రీస్తు అను మెస్సయ్య చేతులు వేయు రూపములో బాప్తీస్మం పొంది రక్తం చిందించాడు, ఇవి జరగని యెడల మనం ఇంకను పాపులుగానే ఉండెదము. అందుకే వారు, దేవుని ముందు చెడ్డ జీవులు అని తెలియనివారు మరియు రక్షించబడటానికి దేవుని బహుమతిని అందుకోని వారి యెడల జాలి చూపతగిన వారము.
దేవుని నీతిని తెలుసుకోవడానికి ముందు, మన స్వంత నీతే మన జీవన ప్రమాణం. నేను కూడా, దేవుని రక్షణ యొక్క బహుమతిని ఎరుగనప్పుడు నిజమైన విశ్వాసం లేనప్పుడు నేను ఇలా ఉన్నాను. నిజానికి, నాకు నా స్వంత నీతి లేదు, కానీ నేను ఇప్పటికీ నన్ను మంచివాడిగా భావించాను. కాబట్టి నా బాల్యం నుండి, నేను అన్యాయాన్ని సహించలేక చాలాసార్లు సరిపోలని వ్యక్తులతో గొడవ పడ్డాను. నా జీవితంలో తత్వశాస్త్రం న్యాయంగా మరియు నీతిగా జీవించడమే, ఎందుకంటే నేను ఒక్కసారి మాత్రమే పుట్టాను మరియు ఒక్కసారి మాత్రమే చనిపోతాను. నా ఆలోచనలు ఇలా ఉన్నాయి,“ఇలాంటి విలువలేని జీవితాన్ని గడపడం కంటే నేను చనిపోవడం ఇష్టం, తినడం తప్ప మరేమీ చేయలేదు. జీవితం అంటే ఇదే అయితే, నేను ఇప్పుడు చనిపోయినా లేదా మరో 50 సంవత్సరాలు నేను జీవించినా తేడా లేదు. ఇలా జీవించడం విసుగు మరియు అసహ్యకరమైనది. ఏ ఉద్దేశ్యమూ లేకుండా ఎలాంటి అర్ధం లేకుండా జీవించడం మరియు జీవితంలో గొప్ప కారణం లేకుండా నీతిమంతునిగా ఏమీ చేయలేకపోవడం నరకం. నరకం అనగానేమి? మనిషి పందిలా జీవించాలంటే, అతను చనిపోయే వరకు ప్రతిరోజూ తన కడుపుని మాత్రమే నింపుకోవడం నరకం. " ఇలా, నేను దేవుని ముందు నన్ను చూడలేకపోయాను కాబట్టి, నేను నా స్వనీతితో నింపబడ్డాను. కాబట్టి ఇతరులకన్నా నన్ను నేను బాగా ఆలోచించాను మరియు నీతిగా జీవించడానికి తీవ్రంగా ప్రయత్నించాను.
కానీ వాస్తవంగా నేను దేవుని యొక్క నీతి యెదుట కేవలం పాపిని మాత్రమే కాదు గాని. నేను ధర్మశాస్త్రంలోని 613 చట్టాలలో ఈ పది ఆజ్ఞలను పేర్కొనకుండా పాటించగల వ్యక్తిని కాదు. నేను వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, అది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అవినీతి పక్రియ,"మీరు దేవునికి వ్యతిరేకంగా నిలిచినను పాపం చేయలేని దుష్టులు." మానవజాతి నీతిఅంతయు దేవుని యెదుట అనీతిగా మారును. వాస్తవం ఏదనగా మనుషులు ఎన్నడు నీతిమంతులు కాలేరు. వాస్తవానికి, ఈ ప్రస్తుత యుగం చివరి యుగం, దీని ప్రవాహం క్షీణత మరియు అధోకరణ సంస్కృతి ద్వారా విస్తరించబడింది మరియు పాపం ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనర్థం మన శరీరాన్ని నిరంతరం అటువంటి చెడ్డ మరియు అసభ్యకరమైన పాపాలు పట్టుకుంటాయి, మరియు మనము నిజంగా మన జీవితంలో ఈ పాపాలను చేస్తాము. వాస్తవానికి, మన యొక్క శరీరము ఈ వర్ణించలేని మురికి పాపాలు ఎల్లప్పుడూ మనలను లాగుతూ ఉంటాయి, మరియు దానిలో ఎటువంటి మంచితనం కనిపించదు.
మన అనీతిమంతులుగా మరియు పాపముతో నింపబడిన వారము,కానీ ప్రభువు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మన సమస్త పాపముల నుండి రక్షించి ఆయన స్వంత ప్రజలుగా చేసుకొనెను
మనము అనీతిమంతులము, కానీ దేవుని రక్షణ యొక్క వరం ద్వారా, అటువంటి సమస్త పాపముల నుండి మనలను రక్షించాడు. పరిశుద్ధస్థలము యొక్క పలకలు, దేవుని ఇల్లు ప్రతి కొలత 4.5 మీటర్లు ఎత్తు మరియు 675 మీటర్లు వెడల్పు,పరిశుద్ధస్థలము యొక్క గోడలన్నియు బంగారముతో పొడిగించబడింది. ప్రతి పలక క్రింద,రెండు వెండి కుసులు ఉంచబడ్డవి. ఈ వెండి కుసులు నిన్ను మరియు నన్ను సంపూర్తిగా ఆయన ద్వారా రక్షించబడుటను ఇక్కడ చూపించును.
సత్యం అనునది దేవుడు మనలను ఆయన ప్రేమ నుండి సమస్త పాపము నుండి రక్షించాడు. ఈ ప్రేమతో యేసు క్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చి మన పాపముల నిమిత్తమై బాప్తీస్మం పొంది,సిలువ మీద మరణించటం ద్వారా మన పాప శిక్షను భరించెను, ఇక మీదట మన సమస్త లోక పాపము నుండి మరియు సమస్త శిక్ష నుండి రక్షించాడు. ఆయన మనకిచ్చిన కృపా రక్షణ వరము నందు విశ్వాసముంచుట చేత,మనము తిరిగి జన్మించాము. మన ప్రభువు అనుగ్రహించిన ఈ కృపా రక్షణ బహుమానము బంగారము వలె ఎన్నటికీ పాడైపోవునటువంటిది,మరియు అలాగే మార్పు లేనిది.
మన ప్రభువు అనుగ్రహించిన రక్షణ యేసు యొక్క రక్తం మరియు బాప్తీస్మం ద్వారా సిద్ధపరచబడెను,మరియు ఇది మన యొక్క సమస్త పాపములను సంపూర్తిగా తుడిచివేసెను.ఇది కేవలం మన ప్రభువు మన సమస్త పాపము నుండి రక్షించాడు అందుకనే నీవు మరియు నేను మనం చేసే సహజ సిద్దమైన పాపములు మరియు మన ఆలోచనల ద్వారా చేసే పాపములు,మన మనస్సులలో చేయు పాపములన్నిటి నుండి విడిపించబడితిమి. మన హృదయాలకు దేవుడు అనుగ్రహించిన రక్షణ యొక్క బహుమతి యందు విశ్వాసముంచుట చేత, మనము ఆయన ప్రశస్తమైన పరిశుద్దులుముగా చేయబడితిమి. ప్రత్యక్షపుగుడారము యొక్క పలకల గుండా, స్తంభములు మరియు గోడల రెండింటిలోనూ, దేవుడు మనకు చెప్పుచున్నది రక్షణ యొక్క నీరు ఆత్మను గూర్చి. మరియు వెండి కుసులు యొక్క పలకల ద్వారా,దేవుడు మనకు చెప్పుచున్నది మనము నూరు శాతం ఆయన కృప మరియు బహుమానము ద్వారా మనము పిల్లలమైతిమి.
మన యొక్క విశ్వాసమును యేసు యొక్క రక్తం మరియు బాప్తీస్మం నుండి వేరుగా ఉన్నట్లయితే, మనలో మిగిలినది ఏది లేదు. మన అందరము మన పాపములను బట్టి శిక్షకు బందించబడిన వారము. మన మందరము దేవుని ధర్మశాస్త్రం చెప్పు ప్రకారం పాపము వలన వచ్చు జీతము మరణము అను వాక్య ప్రకారం భౌతిక మరణ యెదుట భయముతో వణికిపోవుచున్నాము;మరియు మనము నీతిమంతులను గూర్చి గ్రహింపు కలిగి మన కొరకు ఎదురుచూడు దహించు అగ్ని యొక్క తీర్పు కొరకు దుఃఖపడవలెను.మనము నీరు మరియు ఆత్మ యొక్క సువార్త విశ్వాసమును విడిచిన యెడల మనము శూన్యముగా ఉన్నవారము. మనము ఇప్పుడు పాపముతో నిండిన కాలములో జీవిస్తున్నాము మన యొక్క విది, కేవలం అగ్ని తీర్పు కొరకు వేచి ఉండడమే అని మర్చిపోకూడదు. వాస్తవంగా మనము ఇలానే ఉన్నాము, పూర్తిగా కృప మనపై అనుగ్రహించబడింది. ఎందుకనగా దేవుడు నీరు మరియు ఆత్మ యొక్క రక్షణను మనకు అనుగ్రహించియున్నాడు. మెస్సయ్య ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొంది,సిలువపై రక్తం కార్చి మరణించి,మరల మరణము నుండి తిరిగి లేచేను,మరియు సమస్త పాపముల నుండి ,మన సమస్త అనీతి మరియు శిక్ష నుండియు మనలను రక్షించెను.మనము పరిపూర్ణమైన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసముంచుట ద్వారా మన సమస్త పాపముల నుండి ఇప్పుడు మనము రక్షించబడియున్నాము,అందుకు మనము మన విశ్వాసముతో కృతజ్ఞతలు మాత్రమే చెప్పగలము.
మన యొక్క శరీరములో మనము తగిన వారిమీ కాకపోయినను,మా యొక్క పని వారు మరియు జత పనివారు, సేవకులు, మరియు నేను పాడైపోయిన ఈ యొక్క యుగములో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రపంచమంతయు ప్రకటించుచున్నాము, ఎందుకనగా మేము నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్ముచున్నాము, మనము ప్రభువును పరిశుద్ధముగా ఎలాంటి దుష్టత్వము లేకుండా సేవించగలము. ఈ రకమైన మనస్సు కలిగి ఉండటానికి గల కారణం మన స్వంత ఉద్దేశం కాదు, కానీ మన ప్రభువు మనలను తన రక్షణ యొక్క కృప ద్వారా మనలను ధరించుట ద్వారా అనుగ్రహించబడెను. ఎందుకనగా ప్రభువు మనలను పరిపూర్ణనంగా మన యొక్క సమస్త పాపము నుండి తీర్పు నుండి రక్షించెను అందువలననే మనము ఈ రక్షణ యొక్క శక్తిని ధరించుకొనియున్నాము,మరియు ఇది పూర్తిగా మనము మన ప్రభువును పరిశుద్ధముగా సేవించుటకు. కారణం ప్రభువు నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా మనలను సమస్త పాపముల నుండి రక్షించెను,నేను నమ్ముతున్నాను మన బలహీనతలలో కూడా ఆయనను సేవించగలము, ఇకమీదట శిక్షయు మరియు పొరపాట్లతోను ఎటువంటి పాపముచే బందించబడవలసిన అవసరము లేదు.
వాస్తవంగా మనము ప్రపంచమంతయు సువార్తను ప్రకటించలేము,ఇది ప్రభువు యొక్క కృప వలన జరగదా. నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తను పరిశుద్ధముగా ప్రపంచమంతయు సేవించుట అసాధ్యమైనది కానీ దేవుని కృప ద్వారా సాధ్యమే.ఇది నూరు శాతం దేవుని యొక్క కృప రక్షణ వలన నీవు మరియు నేను సత్య సువార్తపై ఆధారపడుచు మన యొక్క విశ్వాస జీవితమును జీవించవచ్చు. విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క రాజ్య స్తంభములుగా చేయబడితిమి. ఎందుకనగా ప్రభువు బంగారమును పోలిన విశ్వాసమును అనుగ్రహించెను, కావునా నీవు దేవుని ఇంటిలో జీవించగలవా. ప్రపంచమంతయు పాపముతో నింపబడిన ఈ కాలములో, పాపము వలన ప్రజలు కన్నీరు కార్చిన ఈ యుగములో, మరచిన వారు, లేదా దేవుని దూషించువారు ఉన్నారు, మనము శుద్దిచేయబడిన నీటితో కడుగబడితిమి, మరియు దాని ఫలితంగా మనము శుద్దిచేయబడిన నీటిని త్రాగి ప్రభువును శుద్ధహృదయముతో సేవించవలెను. కాబట్టి,ఇది ఎంత గొప్పదో తెలియజేయుటకు మాటలు సరిపోవు నేను ఈ ఆశీర్వాదముల కొరకే ఎదురుచూస్తున్నాను.
మనము నిజముగా ఈవిధముగా విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యాము. మనము ఎలా నీతిమంతులము కాగలిగితిమి? మనలో ఏ మంచి లేనప్పుడు మనలను మనము నీతిమంతులుముగా ఎలా పిలువబడుదుము? అలాంటి పాపులమైన నీవు మరియు నేను ఎలా పాపం లేకుండా ఉంటిమి? శరీరము యొక్క నీతి ద్వారా పాపము లేనివానిగా మరియు నీతిమంతుడిగా చేయబడ్డవా? శరీరం యొక్క ఆలోచనలు, నీ స్వంత ప్రయ్నతాలు, స్వంత క్రియలు--ఇవన్నియు ఎన్నడు పాపం చేయని వ్యక్తిగా నీతిమంతునిగా చేశాయా?లేదా కేవలం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మాత్రమే నీతిమంతుడిగా మార్పుచెందవా? నీలం,ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల పేనిన సన్నని నారలో చూపబడిన దేవుని యొక్క రక్షణలో విశ్వాసముంచుట చేత నీతిమంతుడిగా మార్చబడితివా? దేవుని యొక్క వాక్యంలో ప్రత్యక్షమైనవి మెస్సయ్య ద్వారా నెరవేర్చబడినవి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసముంచకుండ నీవు నీతిమంతుడిగా మార్పు పొందగలవా?నీవు ఎన్నటికీ ఈ విధముగా మార్పు చెందలేవు!కొంచములో,అనగా కేవలం ధూమ్రరక్తవర్ణముగల దారం నందు విశ్వాసముంచుట ద్వారా,మనము ఎన్నడూ నీతిమంతులము కాలేము.
ఎందుకనగా, మన రక్షకుడైన యేసు క్రీస్తు మరియు మెస్సయ్య సమస్త లోకపాపములన్నియు, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందుట చేత మన యొక్క జీవితకాల సమస్త పాపములను మన వైపు నుండి పూర్తిగా తుడిచివేయబడ్డాయి,కావున మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాము.పాతనిబంధన కాలములో పాపము నిమిత్తము బలి పశువు అంగీకరించబడినట్లుగా పాపియు లేదా ప్రధాన యాజకుడు దాని తల మీద చేతులుంచినట్లుగా, నూతన నిబంధన కాలములో, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం పొందుట ద్వారా సమస్త లోకపాపములన్నియు ఆయన పైకి మోపబడెను. యేసు మన యొక్క సమస్త పాపములన్నియు ఆయన బాప్తీస్మం ద్వారా ఆయన పైకి తీసుకొనెను (మత్తయి 3:15).మరియు బాప్తీస్మం మిచ్చు యోహాను ఈ ప్రాముఖ్యమైన సంఘటనలు కేకలు వేయుచు సాక్షమిచ్చియున్నాడు, “ఇదిగో! లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల” (యోహాను 1:29). ఆయన బాప్తీస్మం పొంది, మిగిలిన మూడున్నర సంవత్సరాలు ఆయన మన రక్షణ కొరకు జీవించెను, మన సమస్త పాపములు మరియు తీర్పు కొరకై సిలువకు వెళ్లి గొర్రె తన కసాయి యెదుట మౌనంగా ఉన్నట్లు, దేవునికి ఆయన తన శరీరమును అప్పగించుకొనెను, మరియు మనకు నూతన జీవమునిచ్చెను.
ఇది యేసు మన సమస్త పాపములను బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి పొందిన బాప్తీస్మం ద్వారా తన పైకి తీసుకొనెను, ఎందుకనగా ఆయన తనంతట తానె మౌనముగా రోమా సైనికుల చేత ఆయన చేతుల్లోను మరియు పాదములలోను మేకులతో కొట్టబడి సిలువపై శిక్షించబడ్డాడు. సిలువ పై వ్రేలాడుచూ,యేసు తన రక్తమంతటిని అనగా హృదయములో ఉన్న రక్తమును కూడా చివరకి చిందించాడు. మరియు ఆయన తన చివరి పరిచర్య సేవను మన యొక్క రక్షణ కొరకు, స్వీకరించి, ”ఇది సమాప్తమైనది” అని కేక వేసెను (యోహాను 19:30) అటువలె చనిపోయి, మూడవ రోజున ఆయన తిరిగి లేచి, పరలోకానికి ఆరోహణమాయెను, మరియు అటువలె ఆయన శాశ్వత జీవమునిచ్చి మన రక్షకుడాయెను.బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తీస్మం పొంది లోకపాపములను తన భుజాన మోసుకొనెను,మరియు ఆయన యొక్క సిలువ, మరియు పునరుత్థానం ద్వారాను యేసు మన పరిపూర్ణ రక్షకుడాయెను.
సిలువ రక్తం నందు విశ్వాసం మరియు పెరుగుతున్న పవిత్రీకరణ సిద్ధాంతం మాత్రమే మీ సమస్త పాపముల నుండి రక్షించ లేవు
క్రైస్తవులు సిలువ పై యేసు రక్తం నందు మాత్రమే విశ్వాసముంచుట ద్వారా పరిపూర్ణులుగా రక్షించబడలేరు. ఎందుకనంగా ప్రజలు ప్రతి రోజు వారి చూపు ద్వారా మరియు క్రియలు ద్వారా పాపము చేయుదురు, సిలువ రక్తం నందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే వారి పాపములు శుద్దిచేయబడవు. ప్రజల జీవితాలలో ఎక్కువగా ప్రబలుతున్న అక్రమము ఏదనగా దుర్మార్గమైన కామత్వం. స్పష్టమైన మరియు అసభ్యకరమైన లైంగికత యొక్క సంస్కృతి ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నందున, ఈ ప్రత్యేకమైన పాపం మన శరీరములో పాతుకుపోయింది. వ్యభిచారం చేయవద్దని బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తోంది, కానీ నేటి వాస్తవం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా, చాలా మంది ప్రజలు తాము కోరుకోనప్పటికీ ఈ పాపానికి పాల్పడతారు. మోహపు చూపుతో ఆలోచించుట అనునది కేవలం వ్యభిచారం చేయుటతో సమానమైనది దేవుడు ప్రకటించాడు, ఇంకా మన కళ్ళు ప్రతిరోజూ చూసేవి అన్నీ అసభ్యకరమైనవి. కావున ప్రజలు అలాంటి నీచమైన పాపములు ప్రతి నిమిషానికి ప్రతిసెకనుకు ఒకసారి చేయుదురు.ఈ లాంటి పరిస్థితి అయినట్లయితే,వారు పశ్చాత్తాప ప్రార్థనలు చేయటం ద్వారా ఎలా పరిశుద్ధపరచబడి పరలోకములోకి ప్రవేశించుదురు?వారు నీతిమంతులు ఎలా కాగలరు?వారు మరింత సమయం తీసుకొని వృద్దులు అయ్యేంత వరకు వారికి వారు క్రమ శిక్షణ పొందినప్పుడు వారి హృదయాలు నీతిగా మారునా? వారి ప్రవర్తన సాత్వికంగా మారునా?వారు మరింత సహనం కలిగిన వ్యక్తులు అగుదురా?కాలేరు! పూర్తిగా బిన్నమైనది జరుగను.
ప్రజలు వృద్ధులైనప్పుడు, వారు కోపానికి మరియు అసహనానికి గురవుతారు. వృద్ధాప్యంతో హార్మోన్ల మార్పులు వస్తాయి, మరియు అంతకు ముందు చాలా ఓపికగా ఉన్నవారు కూడా తమ కోపాన్ని మరియు చిరాకులను తగ్గించడం కష్టం. మరియు ఇతరుల గురించి ఆలోచించే ముందు వారు తమ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారి శరీర విధులు క్షీణించినప్పుడు, స్వీయ-సంరక్షణ కోసం వారి స్వభావం బలంగా మారుతుంది. కాబట్టి మనం పెద్దయ్యాక, మనం చిన్నపిల్లాడిలా మారతాము. ఒక సామెత ప్రకారం, శిశువుగా ఉన్నప్పుడు నాలుగు పాదాలతో ప్రాకడం చేయుదుము, చిన్నతనంలో రెండు పాదాల మీద నిలబడడం మరియు వృద్ధాప్యంలో మూడు అడుగుల మీద నడవడం మనుషులు తప్పమరోవరో కాదు, ప్రతి ఒక్కరి ఇలానే ఉందురు.
క్రైస్తవ సిద్ధాంతాల మధ్యలో, పెరుగుతున్న “పవిత్రీకరణ సిద్ధాంతం అనే పిలవబడే సిద్ధాంతం ఉన్నది”.ఈ సిద్ధాంతం ఎక్కవ కాలం నుండి యేసు సిలువ మీద మరణించిన విశ్వాసమును క్రైస్తవులు నమ్ముచున్నారు, ప్రతి రోజు పశ్చాత్తాప ప్రార్థనలు చేయడం మరియు ప్రభువును ప్రతిరోజు సేవించడం, క్రమంగా వారు పరిశుద్దులుగా మార్పుపొందడం. మనము యేసును విశ్వసించుట ప్రారంభించిన నాటి నుండి ఎక్కువ సమయం గడిచిపోవునని ఇది తెలియజేస్తుంది, పాపముతో ఏ మాత్రము సంబంధములేని మరియు మంచి క్రియలు కలిగిన వ్యక్తిలోనికి మనము నిర్మాణం చేయబడినప్పుడు,మరణము సమీపించినప్పటికీ, మనము పూర్తిగా పరిశుద్ధపర్చబడుదుము. కావున మనము పాపములేని వారిగా ఉందుమని ఇది మనకు బోధిస్తుంది ప్రతిరోజు పశ్చాత్తాప ప్రార్థనలు చేయటం వలననే మనము ప్రతి రోజు మన పాపములను శుద్దిచేసుకొనవలెను, అలా మన వస్త్రములను శుద్దిచేసుకొని. మన ముగింపులో మనం చనిపోయినప్పుడు, మనము దేవుని యొద్దకు పరిపూర్ణ నీతిమంతులుగా చేరెదము. ఈ విధంగా అనేక మంది క్రైస్తవులు నమ్ముదురు. కానీ ఇది మానవ నిర్మిత ఆలోచనల ద్వారా ఊహించబడిన ఊహాజనిత ఊహాగానం మాత్రమే.
రోమా 5:19 ఇలా చెబుతోంది, “ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగుచేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగాచేయబడుదురు.” ఒక వ్యక్తి విధేయత ద్వారా మనమందరం పాప రహితులుగా చేయబడ్డామని ఈ భాగం చెబుతుంది. యేసుక్రీస్తు స్వయాన తానే ఈ భూమిపైకి వచ్చినప్పుడు మీరు మరియు నేను చేయలేనిది చేసి సాధించారు. మీరు మరియు నేను పాపం నుండి మనల్ని మనం ఎన్నడూ విడిపించుకోలేమని బాగా తెలుసు, యేసు మన తరపు నుండి మన పాపాలన్నింటినీ క్షమించాడు, యేసు ఈ భూమ్మీదకు రావడం, బాప్తిస్మం తీసుకోవడం, శిలువ వేయబడటం మరియు మృతులలో నుండి లేవడం ద్వారా,ఆయన మిమ్మల్ని మరియు నన్ను రక్షించాడు మరియు మన పాపాలన్నింటి నుండి మనల్ని ఒకసారి శుద్దీకరించాడు.
తండ్రియైన దేవుని యొక్క చిత్తానికి విదేయుత చూపటం ద్వారా,యేసు క్రీస్తు మన యొక్క రక్షణను పూర్తిగా నెరవేర్చాడు,దీనిని మన యొక్క పాప విమోచన అని కూడా పిలువబడినది. యేసు క్రీస్తు మెస్సయ్యగా తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపుతూ ఆయన బాప్తీస్మం,మరణం, పునరుత్తానం ద్వారా ఆయన రక్షణ యొక్క కృపను మనపై అనుగ్రహించెను. ఆ విధంగా మనకు రక్షణ యొక్క బహుమానమును ఇవ్వడం ద్వారా యేసు పూర్తిగా పాప విమోచనను నెరవేర్చాడు. ఇప్పుడు మన యొక్క విశ్వాసం ద్వారా ఈ రక్షణ కృపను ధరించియున్నాము,ప్రభువు సంపూర్ణoగా పాపము నుండి మన రక్షణను నెరవేర్చాడు ఇది మన సొంత క్రియలు లేదా అర్హత ద్వారా ఎన్నడును సాదించబడదు.
యేసు స్వీకరించిన బాప్తిస్మమునందు అనేకమంది ప్రజలు విశ్వాసముంచరు, కానీ దానికి బదులుగా సిలువపై ఆయన చిందించిన రక్తమును మాత్రమే నమ్ముచు వారి స్వంత క్రియలు వలన పరిశుద్దులగుటకు ప్రయత్నించెదరు. మరొక మాటలో, యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందినప్పుడు మానవ జాతి యొక్క సమస్త పాపాలను తన పైకి తీసుకొనెను, ప్రజలు ఈ సత్యమును ఇప్పటికి నమ్ముటలేదు. మత్తయి మూడవఅధ్యాయము చెప్పుచున్నది ఏదనగా
యేసు బహిరంగముగా బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందుటయే. ఇది ఎవరు కాదనలేని సత్యం నాలుగు సువార్తలచే ద్రువీకరించబడినది.
యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకొని మన సమస్త పాపములను ఆయన పైకి తీసుకొనెను, మానవజాతి యొక్క ప్రతినిధిగా మరియు స్త్రీలకు జన్మించిన వారందరి కంటెను గొప్పవాడు అయినను ఈ సత్యాన్ని అనేకమంది ప్రజలకు తెలియక దీని యందు విశ్వాసముంచురు. అలాంటి ప్రజలు యేసు నందు విశ్వాసముంచుదురు కానీ ఆయన బాప్తీస్మం నందు విశ్వాసముంచరు, మరెక్కువగా సిలువపై చిందించబడిన ప్రశస్తమైన ఆయన రక్తమును మాత్రమే స్తుతించెదరు. సిలువపై మరణించిన యేసు నందు మరింత జాలి చూపుదురు, వారు బావద్రేకాలతో అన్ని రకాల పెద్ద శబ్దాలతో పాడుతూ స్తుతిస్తూ వారి స్వరాన్ని మరింత ఎక్కువగా చేయుదురు,
“♫ శక్తి ఉన్నది, శక్తి,
గొర్రె పిల్ల రక్తములో పనిచేయు అద్భుతమైన శక్తి ఉన్నది;
♫ శక్తి ఉన్నది,శక్తి, గొర్రె పిల్ల ప్రశస్తమైన రక్తములో పనిచేయు అద్భుతమైన శక్తి ఉన్నది”. వారు దేవుని వద్దకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, మరో మాటలో చెప్పాలంటే, వారి స్వంత భావోద్వేగాలు, మరియు బలము, శక్తితో పైకి లేచెదరు.కానీ నీవు తప్పనిసరిగా గ్రహించవలసినది ఏదనగా వారు ఎంత ఎక్కువగా ఇది చేయుదురో అంత ఎక్కువ పాపములతో మరింత వేషాదారులుగా మారి వారి జీవితమును ముగించెదరు.
యేసు క్రీస్తును విశ్వసించే విషయానికి వస్తే, యేసు యొక్క రెండు కృపా పరిచర్యలు ఖచ్చితంగా అవసరం. ఏమిటి అవి? వాటిలో ఒకటి, యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన పాపాలన్నింటినీ స్వీకరించుట, మరొకటి, ప్రపంచంలోని పాపాలను సిలువకు తీసుకెళ్లడం మరియు సిలువ వేయబడుట ద్వారా మన పాపపు క్రయధనమును ఆయన చెల్లించాడు. యేసు యొక్క ఈ రెండవ కృపా పరిచర్యలను పూర్తిగా విశ్వసించేవారు ఖచ్చితంగా నీతిమంతులుగా చేయబడవచ్చు. యేసు బాప్తీస్మం మరియు సిలువ రక్తం పై మన విశ్వాసమను ఈ రెండు, ఆయన రక్షణ బహుమతి యొక్క రెండు ఇరుసులు, ఇవి దేవుని మందిరంలో దేవుని కృప చేత, స్థిరంగా నిలబడేలా చేస్తాయి. మనము ఆయన నిజమైన మచ్చలేని ప్రజలుగా చేయబడ్డాము. యేసు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా, మనం ఎన్నటికీ మార్చలేని . ప్రశస్తమైన బంగారమును పోలిన విశ్వాసాన్ని నీలం మరియు ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో వ్యక్తీకరించబడిన నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తను విశ్వసించడం ద్వారా, మనం పాపం యొక్క పరిపూర్ణమైన విడుదల పొందిన రక్షణ యొక్క పరిశుద్దులం అవుతాము.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యుగానికి వ్యతిరేకంగా వేదాంత యుగం
క్రీస్తు శకం 313 లో రోమా యొక్క మిలాన్ శాసనం ప్రకటించినప్పటి నుండి, క్రైస్తవ మతం యేసు బాప్తిస్మమును విడిచిపెట్టిన సిలువ సువార్తను మాత్రమే వ్యాప్తి చేస్తుంది. ప్రారంభ సంఘ కాలం నుండి 313 శకం వరకు, క్రైస్తవ మతం కేవలం మతం వలె దిగజారకముందే, ఇది నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తీవ్రంగా బోధించింది, కానీ తరువాత రోమన్ కాథలిక్ సంఘం పాశ్చాత్య ప్రపంచంలోని మతపరమైన రాజ్యంపై ఆధిపత్యం చెలాయించింది.14 వ శతాబ్దం ప్రారంభం నుండి, మానవ నిర్మిత ఆలోచనలపై కేంద్రీకృతమై,మానవత్వాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చిన సంస్కృతి ఇటలీ నుండి ఉద్భవించడం ప్రారంభమైంది.దీనిని పునరుజ్జీవనం అని పిలుస్తారు.
16 వ శతాబ్దం నాటికి, ఇటలీలో ప్రారంభమైన ఈ మానవతా సంస్కృతి అంతర్గతంగా పాశ్చాత్య ప్రపంచమంతటా వ్యాపించడం ప్రారంభమైంది, మరియు మానవతావాద, మానవ నిర్మిత తత్వశాస్త్రం అధ్యయనం చేసిన పండితులు వేదాంతశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. బైబిలును వారి స్వంత వాదనలతోను మరియు దృక్పథాలతో వివరించడం ద్వారా,వారు వివిధ క్రైస్తవ సిద్ధాంతాలను నిర్మించడం ప్రారంభించారు. కానీ వారికి సత్యం తెలియదు కాబట్టి, వారు బైబిల్‌ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. బైబిల్‌లో చాలా కష్టమైన భాగాలు ఉన్నాయి, ఫలితంగా వారి లౌకిక జ్ఞానాన్ని తమ తాత్విక దృక్పథాలతో కలుపుకుని తమ సొంత క్రైస్తవ సిద్ధాంతాలను రూపొందించడానికి వారిని ప్రేరేపించింది. కాల్వినిజం, ఆర్మినియనిజం, ఫండమెంటలిజం,లిబరలిజం,న్యూథియాలజీ,కన్జర్వేటిజం, హేతువాదం, ఉన్నత విమర్శ, ఆధ్యాత్మిక వేదాంతం,మతపరమైన బహువచనం, లిబరేషన్ థియాలజీ మరియు దేవుని వేదాంతశాస్త్రం కూడా ఈ విధంగా ఉద్భవించాయి.
క్రైస్తవ మతం యొక్క చరిత్ర చూచుటకు చాలా పెద్దదిగా అనిపించవచ్చు, కానీ నిజానికి అది అంత పెద్దది కాదు. ప్రారంభ సంఘ కాలం నుండి 300 సంవత్సరాల వరకు, ప్రజలు బైబిల్ గురించి నేర్చుకోగలిగారు, అయితే అతి త్వరలోనే మధ్య కాల యుగ0, క్రైస్తవ మతం యొక్క చీకటి యుగం ప్రారంబమయ్యాయి. ఈ కాలంలో, బైబిల్ చదవడం నేరాన్ని శిరచ్ఛేదం చేయడం ద్వారా మరణశిక్ష విధించబడుతుంది. 1700 ల వరకు వేదాంతశాస్త్రం యొక్క గాలి వీచడం ప్రారంభమైంది, ఆపై 1800 మరియు 1900 లలో వేదాంతశాస్త్రం శక్తివంతంగా మరియు చురుకుగా పెరగడంతో క్రైస్తవ మతం వికసించినట్లు అనిపించింది, కానీ ఇప్పుడు చాలా మంది దేవుని నమ్మి వారి ప్రజలు తమ స్వంత వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఆధ్యాత్మిక విశ్వాస భావనలలో పడిపోయారు.
అయితే ఇది సత్యమా? మీరు ఈ విధంగా నమ్మినప్పుడు, మీ పాపాలు నిజంగా మాయమగునా ? మీరు రోజూ పాపం చేస్తున్నారు. మీరు ప్రతిరోజూ మీ ఆలోచనలు, క్రియలు మరియు పొరపాటులతో పాపం చేస్తారు. యేసు సిలువపై చిందించిన రక్తాన్ని మాత్రమే విశ్వసించడం ద్వారా మీరు ఈ పాపాల నుండి క్షమించబడుదురా ? యేసు బాప్తిస్మం తీసుకొని సిలువపై మరణించడం ద్వారా మన పాపాలన్నింటినీ తన భుజాన మోసుకొనెను.ఇంకను చాలా మంది ప్రజలు సిలువ రక్తాన్ని మాత్రమే విశ్వసించడం ద్వారా వారి పశ్చాత్తాప ప్రార్థనలను చేయడం ద్వారా తమ పాపాలు క్షమించబడ్డాయని చెప్పుదురు. అలాంటి పశ్చాత్తాప ప్రార్థనలు చేయడం ద్వారా మీ మనస్సాక్షిలోను మీ హృదయములోను మీ పాపాలు శుద్దిచేయబడ్డాయా ? ఇది అసాధ్యమైనది.
మీరు క్రైస్తవులు అయినట్లయితే, యేసు క్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చాడని బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యేసు బాప్తీస్మం పొందడం ద్వారా ప్రపంచంలోని సమస్త పాపాలను స్వీకరించాడని ఈ సత్యం యొక్క రక్షణను ఇప్పుడు మీరు తెలుసుకోవాలి మరియు విశ్వసించాలి. మీ యెదుట ఈ సాక్షం యొక్క ఆధారాలు ఉన్నప్పటికీ, ఇంకను మీరు ఈ సత్యాన్ని విస్మరించారా, అది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదా, లేదా నమ్మడానికి కూడా ప్రయత్నించలేదా? అలా అయితే, మీరు యేసును మీ రక్షకునిగా నిజంగా విశ్వసిస్తారని మీరు చెప్పలేరు. మీ పరిస్థితి ఇలా ఉన్నట్లయితే, మీరు యేసును ఎగతాళి చేయడం, ఆయన పేరును తక్కువ చేయడం తృణీకరించడం వంటి పాపం చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు యేసు నామాన్ని దూషించడం మరియు మీ ఇష్టానుసారంగా దేవుని అపహాస్యం చేయడం వంటి పాపం చేస్తున్నారు.మన పాపాలను పోగొట్టడానికి యేసు ఈ భూమ్మీదకు వచ్చాడని, మరియు ఆయన రాక యొక్క ఈ ఉద్దేశ్యానికి అనుగుణంగా, మన పాపాలన్నింటినీ ఆయన స్వీకరించడానికి బాప్తిస్మం తీసుకున్నాడు మరియు ప్రపంచంలోని సమస్త పాపాలను మోసుకొని సిలువ వేయబడ్డాడు, ఆయన అందరి యొక్క పాపముల కొరకై శిక్షను బరించియున్నాడు.
ఈ పరలోక సత్యం ఇప్పటికి ఉన్నను,చాలా మంది ప్రజలు ఇప్పటికీ యేసు క్రీస్తు యొక్క రక్షణను విశ్వసించలేదు మరియు దాని ఫలితంగా దేవునికి వ్యతిరేకంగా క్షమించరాని పాపం చేయుచున్నారు. యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడిన ఈ రక్షణ యొక్కప్రణాళిక నుండి యేసు బాప్తిస్మమును వదిలివేయడం వలనను మరియు ఆయనను వారు కోరుకున్న విధంగా విశ్వసించడం వలన, వారు ఎన్నటికీ రక్షణను ధరించలేరు. ఇంకను ఈ సత్యాలన్నీ ఉన్నప్పటికీ, చాలామంది క్రైస్తవులు ఈ సత్యాన్ని విశ్వసించరు, అనగా, యేసు వారి పాపాలన్నింటినీ తొలగించాడు, అయినను వారి స్వంత ఆలోచనలను అనుసరించి, వారు విశ్వసించదలిచిన ఎలాంటి వంకర సత్యములైనను వారు వాటిని విశ్వసిస్తారు. ఈ రోజుల్లో, సిలువ రక్తాన్ని మాత్రమే విశ్వసించడం ద్వారా వారి పాపాలు నశించవచ్చని నమ్ముతూ వారి తప్పుడు విశ్వాస సిద్ధాంతాల ద్వారా ప్రజల హృదయాలు కఠినం చేయబడ్డాయి.
కానీ దేవుని చేత ప్రణాళిక చేయబడిన రక్షణ యొక్క సమాధానం ఈ విధంగా ఉంది: యేసు, సిలువ మరియు ఆయన పునరుత్థానం యొక్క బాప్తీస్మం పై విశ్వాసం ఉంచడం ద్వారా పాపం యొక్క శాశ్వతమైన విడుదల దొరుకుతుంది. లెక్కించ లేని అనేకమంది ప్రజలు యేసును నమ్ముచు ఆయన రక్షణ యొక్క సత్యము నుండి పొందిన బాప్తిస్మమును తీసుకొని దానిని అపార్థము చేసుకొనుచు అపనమ్మకంతో అనుసరిస్తున్నక్రింద సమీకరణాన్ని సత్యమని చెప్పుదురు: "యేసు (సిలువ మరియు ఆయన పునరుత్థానం) నందు విశ్వాసం + పశ్చాత్తాపం యొక్క ప్రార్థనలు + నీతియుక్తమైన క్రియలు= పరిశుద్ధత ద్వారా సాధించిన ర్తక్షణ." ఈ విధంగా విశ్వసించే వారు తమ పాపాల నుండి విడుదల పొందారని వారి మాటలతో మాత్రమే చెప్పుదురు, కానీ వాస్తవం ఏమిటనగా వారి హృదయాలు పాపపు కుప్పలతో నిండిపోయాయి, అవి యిప్పటికి పరిష్కరించబడలేదు.
యేసు సిలువను మాత్రమే విశ్వసించు వారు నిజానికి అధిక పాపములతో చాలించెదరు. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకోవడం ద్వారా యేసు మీ పాపాలన్నింటినీ తొలగించాడని చెప్పినట్లుగా మీరు ఈ సత్యాన్ని ఎందుకు నమ్మరు; అయితే మీరు యేసును విశ్వసిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, మానవ నిర్మితమైన తప్పుడు సిద్ధాంతాలను మీరు విశ్వసిస్తున్నారా? తుమ్మ చెక్కతో చేసిన ప్రత్యక్షపుగుడారము యొక్క ప్రతి పలక రెండు ముక్కలు ద్వారా బయటకు వస్తాయనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి మరియు వాటి క్రింద రెండు కుసులు వెండితో ఉంచబడి ఉంటాయి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త (యేసు అందుకున్న బాప్తీస్మం మరియు సిలువ రక్తం) సంపూర్ణ సత్యమైయున్నది.
మనము ప్రత్యక్షపుగుడారం యొక్క ఆవరణ ద్వారం తెరిచి ఆవరణములోకి వెళ్లినప్పుడు మొదటగా మనo దహన బలిపీఠం మరియు తరువాత ఇత్తడి గంగాళమును చూడగలము. దహన బలిపీఠం అనునది ఎలాంటి ప్రదేశం? ఇది దహన బలులు అర్పించు ప్రదేశం. ఇశ్రాయేలీయుల పాపాలను శిక్షించిన ప్రదేశం. ఇత్తడి గంగాళము అనునది ఎలాంటి ప్రదేశం? ఇది శరీరాలను కడిగి శుద్దిచేసుకోను ప్రదేశం. మరో మాటలో చెప్పాలంటే, పాపం ద్వారా అపవిత్రమైన హృదయాలు శుద్దిచేయబడతాయి.మనము విశ్వాసంతో ఈ ప్రక్రియ గుండా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ప్రత్యక్షపుగుడారము యొక్క తెర తెరిచి దేవుని ఇంటి లోపలికి ప్రవేశించవచ్చు అంతక మునుపు అలా జరగలేదు.
ప్రత్యక్షపు గుడారం యొక్క తలుపు తెర అంతయు నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో తయారు చేయబడింది. సన్నని పేనిన నార మరియు నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం అల్లిక చేయడం ద్వారా ఇది నేయబడింది. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి, మనం ఈ సత్యాన్ని విశ్వసించాలి. నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారంలో వ్యక్తమయ్యే యేసు పరిచర్య మీద విశ్వాసం ఉన్నప్పుడే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము. యేసు ఈ భూమ్మీదకు వచ్చి నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారంతో నెరవేర్చాడు. నీలిరంగు దారం యేసు స్వీకరించిన బాప్తిస్మమును సూచిస్తుంది, మరియు ఊదా దారం యేసుక్రీస్తు దేవుడే అని చెబుతుంది. ధూమ్రరక్తవర్ణముగల దారం యేసు సిలువపై చిందించిన రక్తంతో మన పాపాలన్నిటికి తీర్పు తీర్చబడిందని చెబుతుంది.
మీ హృదయంలో అంటిపెట్టుకొనియున్న పాపం ఏదైనా మీలో ఇంకా ఉన్నదా? మరో మాటలో చెప్పాలంటే, హృదయ కేంద్రీకృతమైయున్న పాపం ఏదైనా గలదా? ఇప్పుడు మీరు యేసును నమ్మినప్పటికీ కూడా మీ హృదయంలో పాపం ఉన్నట్లైతే, స్పష్టంగా, మీ విశ్వాసములో మరింతైనా సమస్య ఉన్నట్లే. మీరు యేసును కేవలం మతానికి సంబంధించినదిగా వ్యక్తిగా విశ్వసించినందువల్లనే మీ మనస్సాక్షి శుద్దిచేయబడలేదు మరియు ఇంకా పాపం మీలో ఉన్నది. కానీ నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో వ్యక్తమగు సత్యం యొక్క దేవుని విశ్వసించడం ద్వారా, మీరు మీ మనస్సాక్షిని కూడా శుద్దిచేసుకోవచ్చు.
వాస్తవానికి మీరు ఇప్పుడు మీకు మీరు పాపులని గ్రహించగలరు యేసును గూర్చిన జ్ఞాన విషయములో దారి తప్పుట మీకు శుభపరిమాణముగా ఉన్నది. ఎందుకు? ఎందుకంటే వారికి ఇంకా పాపం ఉన్నదని నిజంగా గ్రహించిన వారు ఈ పాపానికి వారు తప్పించుకోలేమని నరకానికి కట్టుబడి ఉన్నారని వారు గుర్తించెదరు, మరియు అలా చేయటం ద్వారా చివరకు వారు ఆత్మలో దీనులుగా మారగలరు తద్వారా నిజమైన రక్షణ అనే మాటను వినగలుగుతారు.
మీరు ఇప్పటికి వాస్తవంగా దేవుని నుండి పాపపు విడుదల పొందాలనుకుంటే, మీ హృదయాలు తప్పని సరిగా సిద్ధంగా ఉండాలి. దేవుని యెదుట వారి హృదయాలు సిద్ధంగా ఉన్నవారు ఇలా ఒప్పుకుంటారు: “నేను చాలా కాలంగా యేసును నమ్ముతున్నాను, కానీ ఇప్పటికీ నా హృదయంలో పాపం ఉంది. పాపం యొక్క జీతం మరణం కాబట్టి , నేను నరకంలో పడలేను. కావునా దేవుడా, నేను పాప క్షమాపణ పొందాలనుకుంటున్నాను.” ఇలా,వారు దేవుని ముందు తమను తాము పూర్తిగా పాపాత్ములుగా గుర్తించెదరు.దేవుని వాక్యాన్ని గుర్తించిన వారు,దేవుని వాక్యం చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్పు జరుగునని నమ్మువారు -ఇలాంటి వారి హృదయాలు తప్ప మరెవరూ హృదయాలు సిద్ధం చేసుకోలేరు. అలాంటి వ్యక్తులే ఈ వాక్యాన్ని విందురు , వారి కళ్ళతో ఆ వాక్యాన్ని చూసి దానిని దృఢపరచుకొందురు, వారు ఇలా చేయడం ద్వారా వారు ఇది గ్రహించగలరు, “ఆహా , నేను ఈ సమయంలో తప్పుగా నమ్మటం ద్వారా అనేక మంది ప్రజలు అదే తప్పు చేస్తున్నారు.” మరియు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా, ఇతరులు ఏమి చెప్పినా ఏమి చేసినా, వారు తమ పాపాలన్నింటినీ విడుదల పొందగలరు.
ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వారి విశ్వాసములో పొరబడుచున్నారు మరియు ఎంతమంది తప్పుడు మార్గంలో నడుస్తున్నది నేను ఆలోచించినప్పుడు నా హృదయం చాలా బాధపడుతుంది. సోదరులారా, మన పాపాల నుండి ప్రభువు మనలను రక్షించిన సువార్త యేసు పొందిన బాప్తీస్మం మరియు సిలువపై
మన పాపముల కొరకై ఆయన శిక్షించబడి ఆయన చిందించిన రక్తం ద్వారా నెరవేరింది. యేసు తన బాప్తీస్మం ద్వారా పాపాలన్నింటినీ స్వీకరించాడు, తద్వారా మనలను రక్షించాడు. అందువల్ల, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో కనిపించే సత్యాన్ని విశ్వసించే విశ్వాసం కలిగి ఉండటం ద్వారా దేవుడు మనలను రక్షించాడని ఎటువంటి సందేహము లేకుండా నమ్మాలి.యేసు క్రీస్తు మిమ్మల్ని మరియు నన్ను ఈ విధంగా వ్యక్తిగతంగా కాపాడినందుకు నేను చాలా కృతజ్ఞుడను. నీవు మరియు నేను నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించువారము,కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండగలం, మరియు మన హృదయాలు ఎన్నటికీ చలించవు.
పాపముల నుండి రక్షించబడిన వారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యందు విశ్వాసము ద్వారా ఆధారపడవలెను
ఈ ప్రపంచం చెడు సిద్ధాంతాలతో పూర్తిగా నిండి ఉంది, జన్మించిన వారి హృదయాలు కూడా శోదించబడి అపవిత్రం చేయబడును. అందుకే యేసుక్రీస్తు ఇలా అన్నాడు, "జాగ్రత్త వహించండి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించెను " (మార్కు 8:15). ఇలాంటి దిగజారి పోయిన బోధనలు ఎన్ని ఉన్నాయో కూడా మనం లెక్కించలేము, ఒక్కసారి వింటే చాలు ప్రజల హృదయాలను అపవిత్రం చేయబడును . ఈ ప్రపంచం లైంగిక అనైతికతతో ఎలా నిండిపోయిందో మనం గ్రహించాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం ఇప్పుడు ఏ వయస్సులో జీవిస్తున్నామో నమ్ముతున్నమో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకను మనం ఇలాంటి పాపపు ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ, దేవుడు మన హృదయాలలో ఉన్న పాపాలన్నిటి నుండి విమోచించాడనేది సత్యం. మార్పులేని రక్షణకు సాక్ష్యమిచ్చే వాక్యం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త. ప్రపంచం ద్వారా కదిలించబడని లేదా దానితో పాటు లాగబడని సత్యంపై మనకు స్థిరమైన నమ్మకం తప్పనిసరిగా ఉండాలి.
ఇది సత్యం యొక్క ప్రపంచం కాదు. ఇది పూర్తిగా సాతాను యొక్క అబిద్ధికులతో నిండియున్నది. ఏదేమైనను,నీతిమంతులు ప్రపంచాన్ని జయించగలరని దేవుడు మనకు చెప్పాడు. ఈ మార్పులేని సత్యం యొక్క సువార్త నందు విశ్వాసం ద్వారానే నీతిమంతుడు సాతానును అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించగలడు. మనం తగినవారిమి కానప్పటికీ, మన హృదయాలు, మన ఆలోచనలు మరియు మన శరీరాలు ఇప్పటికీ దేవుని మందిరంలో ఉన్నాయి మరియు విశ్వాసం యొక్క రక్షణ సువార్తలో స్థిరంగా నిలబడి ఉన్నాయి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై స్థిరంగా నిలబడి ఉండుటను బట్టే మన ప్రభువు మనలను సంపూర్ణంగా రక్షించాడు.
ప్రత్యక్షపుగుడారం యొక్క స్తంబాలు మరియు గోడల యొక్క భాగాలు రెండు మరియు తుమ్మ చెక్క పలకలు బంగారంతో కప్పబడి ఉన్నాయి. మరియు పలకలు వెండి ఇరుసుల పై నిలబడి ఉన్నందున, అవి దృఢంగా స్థిరంగా ఉన్నాయి మరియు ఊగిసలాడలేదు. అదేవిధంగా, నీరు మరియు ఆత్మతో మరల జన్మించిన మన విశ్వాసం కూడా ఎప్పటికీ మారదు. తుమ్మ చెక్క యొక్క పలకలపై ఉన్న బంగారు పోత మారనట్లే, స్వచ్ఛమైన బంగారం వంటి మన విశ్వాసం కూడా మారదు, తుమ్మ చెక్క అగ్ని ద్వారా కాలిపోకుండా ఉన్నట్లే, మిమ్మును మరియు నన్ను సంపూర్ణoగా ఈ విధంగా రక్షించాడు.
ఈ కారణాన, మనము దేవునికి చాలా కృతజ్ఞులమైయున్నాము. ఈ ప్రపంచంలో పాపం ఎంత విశాలంగా ఉన్నాను, కనీసం నీతిమంతులమైన మనం నిజంగా పాపపు మరకలు లేని మనస్సాక్షిని మరియు మన హృదయములో బంగారము వలె ప్రకాశించు విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. నీతిమంతులమైన మనమందరం ఈ విశ్వాసం ద్వారా ప్రపంచాన్ని జయించే జీవితాన్ని గడుపుతాము. ప్రభువు తిరిగి వచ్చే రోజు వరకు, మరియు మనం ఆయన రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత కూడా, మనమందరం ఈ విశ్వాసాన్ని స్తుతించగలము. మనలను రక్షించి ఈ విశ్వాసాన్ని అనుగ్రహించిన మన దేవునిని శాశ్వతకాలంగా స్తుతించగలము.
మన విశ్వాసం యొక్క సత్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించబడదు ఎందుకంటే ఇది రాతిపై నిర్మించబడింది కావున. ఇకనుండి, మనం ప్రభువు ముందు నిలబడే రోజు వరకు ఈ భూమిపై జీవిస్తున్నందున మనకు ఏమైనా జరిగితే, విశ్వాసంతో మన హృదయాలను సమర్ధించుకొందుము. ఈ ప్రపంచంలోని ప్రతిదీ నాశనమైనప్పటికీ, ఈ ప్రపంచం పాపంలో మునిగిపోతున్నప్పటికీ, మరియు ఈ ప్రపంచం పాతకాలపు సొదొమ మరియు గొమొర్రా కంటే అధ్వాన్నంగా మారినప్పటికీ, మనం ఈ ప్రపంచాన్ని అనుసరించము, కానీ మనం స్థిరంగా దేవుడిని విశ్వసించెదము, మనము ఆయన నీతిని అనుసరించెదము, మరియు మేము యేసు యొక్క రెండు పరిచర్యలను (యేసు యొక్క బాప్తీస్మం మరియు సిలువపై ఆయన మరణమును) రక్షణ యొక్క దేవుని నిజమైన కృపలను వ్యాప్తి చేస్తూనే ఉంటాము.
నేను పూర్తిగా దేవుని కృపను బట్టి ఆశ్చర్యపోయాను,నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తను మనం ఎలా విశ్వసించాము. ఈ సువార్తను మనం ఎలా తెలుసుకున్నాము మరియు విశ్వసించాము మరియు దేవుని మంచి పనులు చేయడానికి మనము ఎలా నమ్మ వచ్చితిమో అందునుబట్టి నేనుకృతజ్ఞత కలిగి ఉన్నాను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించినది కేవలం దేవుని కృపను బట్టియే, మన ప్రభువుకు మనం ఇవ్వగలిగేది మన విశ్వాసంతో ఆయనకు కృతజ్ఞతలు మరియు ఆయన తిరిగి వచ్చే రోజు వరకు ఈ సువార్త సత్యాన్ని వ్యాప్తి చేయడం .
ఈ సత్యాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.