(నిర్గమకాండము 25: 10-22)
“వారు తుమ్మకఱ్ఱతో నొకమందసమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర, దాని వెడల్పు మూరెడు నర, దానియెత్తు మూరెడునర దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్ట వలెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను. ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్దనుండి తీయకూడదు; ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర. మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీద నుండియు, శాసనములు గల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పుదను’’
ప్రత్యక్షపుగుడారము యొక్క లోపల రెండు విభాగాలుగా విభజించబడింది. పరిశుద్ధస్థలము మరియు అతి పరిశుద్ధస్థలము. వాటి మధ్య తెర వ్రేలాడదీయబడి విభాగించును,మరియు సాక్షపు మందసము అతిపరిశుద్ధస్తలము లోపలి ముసుగు లోపలి ఉంచబడియున్నది. మందసము యొక్క పైభాగము కూడా కరుణాపీఠముగా పిలుచుదురు.
కరుణాపీఠము 2.5 మూరల పొడవు గలది
పరిశుద్దగ్రందములో,ఒక మూర అనునది చేతి కొన నుండి మోచేయి వరకు ఉన్న పొడవు. కాబట్టి, పాత నిబంధనలోని ఒక మూరను నేటి కొలత విభాగములో సాధారణంగా 500 మిల్లి మీటర్లుగా పరిగణిస్తారు. అప్పుడు, రెండున్నర మూరల వద్ద, కరుణాపీఠము యొక్క పొడవు నేటి కొలతలో దాదాపు 1.0 మీటర్లు; దాని వెడల్పు మరియు పొడవు, ఒక్కో మూర మరియు ఒకటిన్నర వద్ద, సుమారు 750 మిల్లి.మీటర్లు. ఈ కరుణాపీఠము క్రింద సాక్ష్యపు మందసము ఉన్నది, మరియు ఈ మందసము కూడా తుమ్మ చెక్కతో తయారు చేయబడింది మరియు విలువైన బంగారంతో పొదగబడింది. కరుణాపీఠము యొక్క రెండు చివర్లలో, రెండు కెరూబులు తమ రెక్కలను చాపి, కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుకుని, వారి ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నకరుణాపీఠము వైపుగా ఉండును. కరుణాపీఠము,దాని కున్న పేరు ప్రకారం, దేవుడు ఆయన కృపను ప్రసాదించెను.
దేవుడు కరుణపీఠము వద్ద మనల్ని కలుస్తాడని చెప్పాడు. సాక్ష్యపు మందసము లోపల, చిగురించబడిన అహరోను కఱ్ఱ, మన్నా గల బంగారపు కుండ, మరియు పది ఆజ్ఞలతో చెక్కబడిన రెండు రాతి పలకలు ఉన్నాయి. కరుణపీఠము యొక్క నాలుగు మూలలో,నాలుగు వలయాలు పెట్టబడ్డాయి, తద్వారా సాక్ష్యపు మందసాన్నిసులువుగా తీసుకెళ్ళటానికి. రెండు స్తంభాలు అనునవి తుమ్మ చెక్కతో తయారు చేయబడ్డాయి మరియు బంగారంతో పొదిగించబడినవి మరియు ఈ స్తంభాలను మందసాన్ని తీసుకెళ్లడానికి వలయాల ద్వారా తొడిగించబడ్డాయి.
సంవత్సరానికి ఒక్కసారి, ప్రధానయాజకుడు ఒక బలి పశువు రక్తాన్ని అతి పరిశుద్ధస్థలములోకి తీసుకువచ్చి, దానిని కరుణ పీఠంపై చల్లును. ఎందుకని అతను ఇలా చేసాడంటే అతని చేతులు మీద వేయడం ద్వారా, ఇశ్రాయేలీయుల సంవత్సరంలోని సమస్త పాపాలు బలి పశువుపైకి పంపబడును. అందుకే మన ప్రభువు ఇలా అన్నాడు, ”అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠము మీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను” (నిర్గమకాండము 25:22). ఇది మానవులందరికీ పాప క్షమాపణను తెస్తుందని ప్రభువు యొక్క వాగ్దానం. కాబట్టి, మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తున్నట్లు ప్రకటించినప్పుడు, పాత నిబంధన యొక్క బలి వ్యవస్థ గురించి వివరణాత్మక జ్ఞానం కలిగి ఉండటం మనకు చాలా ముఖ్యం.
సాక్ష్యపు మందసాన్నియాజకులు మోయునప్పుడు, వారు మందసానికి ఇరువైపులా ఉన్న స్తంభాల ద్వారా దానిని పైకి ఎత్తాలని దేవుడు ఆదేశించాడు. దీని యొక్క అర్థం ఏమైయున్నది? దేవుడు మనల్ని మన శరీరము ద్వారాను మనస్సు ద్వారాను ఆయన రక్షణకు సంబంధించిన సత్యాన్ని సేవించాలని మరియు బోధించాలని దేవుడు కోరుకుంటున్నట్లు ఇది సూచిస్తుంది. మనం వ్యక్తిగతంగా కాకుండా ఐక్యతతో దేవుణ్ణి సేవించాలని దేవుడు కోరుకుంటున్నట్లు కూడా ఇది సూచిస్తుంది. అందుకే దేవుడు కరుణపీఠము మాత్రమే కాదు గాని, సన్నిధి రొట్టెల బల్ల మరియు దూపవేదిక యొక్క బలిపీఠాన్ని కూడా ఈ స్తంభాల ద్వారా రెండు వైపులా వలయాలు ద్వారా జోడించాలని దేవుడు ఆదేశించాడు. దేవుని సువార్త వ్యాప్తి కొరకు మన శరీరాలు మరియు హృదయాలన్నింటినీ అంకితం చేయాలని దీని అర్థం. మరో మాటలో చెప్పాలంటే, రక్షణ యొక్క సత్యాన్ని వ్యాప్తి చేయడానికి మన శరీరాలను మరియు హృదయాలను అంకితం చేయమని దేవుడు ఇక్కడ మనకు ఆజ్ఞాపించాడు, మన ప్రభువు మన పాపాలన్నిటినీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో తొలగించి మనల్ని పూర్తిగా నీతిమంతులుగా చేసాడు. అందుకే దేవుడు ఈ స్తంభముల ద్వారా సాక్ష్యపు మందసాన్ని తీసుకెళ్లమని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మన హృదయాలలో పాప క్షమాపణ పొందాము. సాక్ష్యపు మందసము లోపల మన్నాగల బంగారపు కుండ గలదు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, ఈ మన్నా అనునది దేవుని యొక్క వాక్యం. మందసములో చిగురించిన అహరోను కఱ్ఱ కూడా ఉన్నది. అహరోను యొక్క ఈ కఱ్ఱ ప్రభువైన యేసు యొక్క జీవిత పునరుత్థానాన్ని సూచిస్తుంది. చివరగా, మందసము దేవుని పది ఆజ్ఞలతో లిఖించబడిన నిబంధన యొక్క రెండు రాతి పలకలను కలిగి ఉంది. మన హృదయాలతో ఆయన వాక్యాన్ని విశ్వసించడం ద్వారా మనం దేవునికి హృదయపూర్వకంగా సేవ చేయాలని ఇది మనకు చూపిస్తుంది.
ఆయన కరుణాపీఠము వద్ద మనల్ని కలుస్తానని ప్రభువు చెప్పాడు
ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, కరుణాపీఠము నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను సూచిస్తుంది, ఇక్కడే మన ప్రభువు మనల్ని కలిసే స్థలము. కరుణపీఠంపై కెరూబుల మధ్య మన వైపు చూస్తూ, ప్రభువు మనతో నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి మాట్లాడుతున్నాడు. ఈ కరుణపీఠం ఆధ్యాత్మికంగా పాప క్షమాపణ గూర్చి తెలియజేస్తుంది. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం మరియు ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మన పాపాల నుండి మన ప్రభువు మనలను రక్షించాడు.అందుకే మన దేవుడు మన యొక్క రక్షణను అనుగ్రహించు ప్రదేశంగా కరుణపీఠమును మనం పిలవవచ్చు.మరో మాటలో చెప్పాలంటే, కరుణపీఠము మన ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది, మన ప్రభువు మన పాపాలన్నింటినీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో ఒకసారి తొలగించినట్లు చూపిస్తుంది.
అలాంటప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి ? ప్రభువు వారి పాపాలను ఎలా తొలగించాడు? ఇశ్రాయేలు ప్రజల యొక్క వార్షిక పాపాలన్నింటినీ భరించిన బలి పశువు ద్వారా చిందించబడిన రక్తాన్ని ఆయన కరుణపీఠముపై ప్రోక్షించటం ద్వారా అలా చేసాడు ప్రాయశ్చిత్తం రోజున, ప్రధానయాజకుడు ఇశ్రాయేలీయుల వార్షిక పాపాలన్నింటినీ దాటించటానికి బలి పశువు తలపై చేతులు వేయును, ఆపై దాని రక్తం తీయడానికి అతను దాని గొంతు కోసి . ఇశ్రాయేలీయులందరి సంవత్సరం పాటు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ రక్తం కరుణపీఠంపై ప్రోక్షించబడును. పాత నిబంధన యుగంలో ఆచరించబడిన ఈ బలి వ్యవస్థ నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా దేవుని నీతిని అలాగే కొత్త నిబంధన యుగంలో ఆత్మ యొక్క సువార్తను నెరవేరుస్తుంది.పరలోక ప్రధాన యాజకునిగా, యేసుక్రీస్తు మనందరి పాపాల నుండి మనలను రక్షించాడు, ఆయన తన స్వంత శరీరాన్ని మానవాళి కొరకు ప్రాయశ్చిత్తంగా అర్పించుకున్నాడు.
ప్రత్యక్షపుగుడారం ద్వారం యొక్క తెర కూడా నీలిరంగు, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో తయారు చేయబడింది, ప్రత్యక్షపుగుడారం ఆవరణ యొక్క ద్వారం వలె. ఇక్కడ ఉపయోగించిన నీలిరంగు దారం యొక్క ఆధ్యాత్మిక అర్ధం ఏమిటనగా, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు మీ పాపాలను మరియు నా యొక్క పాపాలన్నిటిని భరించాడు. మరో మాటలో చెప్పాలంటే, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా యేసు లోకములోని సమస్త పాపాలను ఒకసారి తీసుకున్నట్లు నీలిరంగు దారం సూచిస్తుంది. యేసుక్రీస్తు తన బాప్తీస్మం ద్వారా ఈ లోకములోని సమస్త పాపాలను అంగీకరించినందున, ఆయన మానవ జాతి యొక్క సమస్త పాపాల కోసం సిలువ వేయబడి శిక్షించబడ్డాడు. ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో దాగి ఉన్న మర్మమైయున్నసత్యం ఇదియె. మన ప్రభువు బాప్తీస్మం ద్వారా మన పాపాలన్నింటినీ స్వీకరించాడు మరియు సిలువపై వారి శిక్షను భరించాడు. అందువలన, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా లోకములోని సమస్త పాపాలను తీసివేసిన ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన సొంత ప్రజలుగా మారిన పరిశుద్ధులందరను నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను లోకానికి అందించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని గ్రహించి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇప్పుడు మనం నీతిమంతులం అయ్యాము గనుక,దేవుడు మనందరి నుండి ఏమి కోరుకుంటున్నారో మనం గ్రహించాలి.
ప్రత్యక్షపుగుడారానికి ఉపయోగించిన ఊదా దారం యేసు రాజరికం యొక్క వారసత్వమును సూచించును
యేసుక్రీస్తు తానే దేవుడై శాశ్వత జీవానికి ప్రభువైయున్నాడు (1 యోహాను 5: 20). మరో మాటలో చెప్పాలంటే, లోకములో ఉన్నసమస్త పాపాల నుండి మనల్ని విడిపించడానికి దేవుడే స్వయంగా మనిషిగా జన్మించాడు. దేవుడు దీనిని ప్రవక్త యెషయా ద్వారా మనకు వాగ్దానం చేసాడు, "`ఇదిగో, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.బాశాంతరమునకు దేవుడు మనకుతోడని అర్ధం (మత్తయి 1 : 23, యెషయా 7:14). మన యొక్క పాపముల నుండి మనందరినీ రక్షించడానికి, యేసుక్రీస్తు పరలోక మహిమ యొక్క సింహాసనమును విడిచిపెట్టి, కన్యకయైన మరియ శరీరం ద్వారా ఈ భూమ్మీదకు వచ్చునని , ప్రభువు కంటే 700 సంవత్సరాల ముందుగానే దేవుడు యెషయా ప్రవక్తకు వాగ్దానం చేసినట్లుగా వాస్తవానికి ఈ భూమ్మీద జన్మించారు. దేవుడు ఇలా మనిషిగా మారి, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ప్రతి పాపి యొక్క సమస్త పాపాలను భరించాడు, ఈ సత్యాన్ని విశ్వసించే మన అందరని ఆయన నీతితో ధరించాడు.
ప్రత్యక్షపుగుడారం యొక్క ద్వారం కొరకు పయోగించబడిన రక్తవర్ణము గల దారం యేసు బలియాగం ద్వారా మనకు తీసుకురాబడిన నూతన జీవితమును సూచిస్తుంది
బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా మానవజాతి యొక్క సమస్త పాపాలను ఒకసారి భరించిన తరువాత, యేసు మన కొరకు సిలువ వేయబడి.ఆయన రెండు చేతులు మరియు కాళ్ళపై వ్రేలాడదీయబడ్డాడు, ప్రభువు అనుభవించిన ఈ శిక్ష మీరు మరియు నేను ప్రతి పాపి అనుభవించాల్సిన శిక్ష. మరో మాటలో చెప్పాలంటే, మనకు బదులుగా ప్రభువు స్వయంగా తానే సిలువ వేయబడి శిక్షించబడ్డాడు. ప్రత్యక్షపుగుడారం ద్వారం యొక్క నీలం,ఊదా మరియు ధూమ్రరక్తవరణముగల దారం ద్వారా సూచించబడిన ఈ మూడు రక్షణ పరిచర్య శాఖల ద్వారా,రక్షణ యొక్క సత్యమైన పనిని మనమందరం చక్కగా అర్థం చేసుకోగలము. ఆయన రక్షణ పనిగా, యేసు మానవ జాతి పాపాలన్నింటినీ ఒకేసారి భరించాడని మరియు ఈ పాపాలన్నింటి కొరకై ఆయన శిక్షించబడ్డాడని మనం స్పష్టంగా చూడవచ్చు.అందుకే లోకములోని ప్రతిఒక్కరికీ నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తను ప్రకటించమని ప్రభువు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ సువార్తను ప్రకటించమని మనల్ని అడుగుతున్నాడు.
ప్రత్యక్షపు గుడారంలోని సాక్ష్యపు మందసము అనునది కరుణపీఠముతో కప్పబడి ఉంది. సాక్ష్యపు మందసాన్ని కప్పి ఉంచే ఈ కరుణపీఠము పై దేవుడు ఎవరిని కలుస్తాడు? వారి పాపాలన్నీ దేవుని గొఱ్ఱె పిల్ల అయిన యేసు మీదకు పంపబడి వారి కొరకై ఆయన శిక్షించబడ్డాడనే విశ్వాసమున్నవారిని మాత్రమే ఆయన కలియును. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, దేవుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వసించువారిని మాత్రమే కలుస్తాడు. ప్రాయశ్చిత్త దినం సమీపించినప్పుడు, ప్రధానయాజకుడు ఇశ్రాయేలు మొత్తం జనాభా యొక్క వార్షిక పాపాలను పరిశుద్ధమైన రెండు మేకలలో మొదటి దాని తలపై చేతులు వేసి, ఇశ్రాయేలీయుల తరపున వారి పాపాలను దాని పై ఒప్పుకొందురు. ప్రతి ఒక్కరి ఇశ్రాయేలీయుల వార్షిక పాపాలన్నింటినీ ఈ బలి మేక తలపై చేతులు వేసి,ప్రధాన యాజకుడు దాని రక్తం తీసి, ఈ రక్తాన్ని అతి పరిశుద్ధస్థలములోకి తీసుకొని, దేవుని సాక్ష్యపు మందసంలో ఏడుసార్లు చిలకరించును.
పాత నిబంధన కాలములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా కలుసుకున్నాడు. దేవుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా ఈ రోజు విశ్వాసులను కలుస్తున్నాడు, కావున ఇది ఇలా ప్రకటించబడినది బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం పొందటం ద్వారా యేసు మన పాపాలన్నింటినీ తొలగించాడని. కాబట్టి నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో విశ్వాసులతో ప్రభువు ఇలా అంటాడు, “మీకు పాపం లేదు. నేను మీ పాపాలన్నింటినీ తొలగించాను. మీ ప్రతి పాపం నుండి నేను నిన్ను మిమ్ములను రక్షించాను. " మరొక విధంగా చెప్పాలంటే, దేవుని నీతిని విశ్వసించే వారికి ప్రభువు తన కృపను అనుగ్రహించును. దేవుని యొక్క కృప ఆయన బహుమతిని సూచిస్తుంది. ఈ లోకములోని ప్రతి ఒక్కరి పాపాలను తన సొంత కుమారుని పైకి పంపడం ద్వారా తండ్రి అయిన దేవుడు తన నీతిని నెరవేర్చాడనే వాస్తవాన్ని ఇది సూచిస్తుంది. ఈ లోకములోని సమస్త పాపాలను తన భుజాన వేసికొని శిక్షించబడ్డాడని దీని యొక్క అర్ధం.మన స్థానంలో మన సమస్త పాపముల కొరకై ఆయన శిక్షణను భరించాడు. ఇది కరుణపీఠంలో వెల్లడైన దేవుని అత్యంత ప్రేమ.
మన ప్రభువుగా, దేవుని కుమారుడుగా, ఈ భూమ్మీదకు వచ్చి, మానవ శరీరంలో ఉద్బవించి, తన బాప్తీస్మం ద్వారా ఈ లోకములోని సమస్త పాపాలను అంగీకరించి, మన స్థానంలో సిలువపై మరణించి, మూడవ దినమున మరల మృతులలో నుండి లేచి, పరలోకానికి ఆరోహణమై తండ్రి అయిన దేవుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చోవడానికి వెళ్లెను. దేవుని నీతి ఏమిటంటే, లోకములోని సమస్త పాపాల నుండి ఆయన మనలను రక్షించాడు, మరియు దేవుని యొక్క ఈ నీతిని విశ్వసించే వారికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడును. మన దేవుడు తన నీతిని విశ్వసించే మనందరితో ఇలా అంటాడు, “మీరు నా ప్రజలైయున్నారు. ఇక మీదట మీరు ఎన్నటికీ పాపులు కానేరరు. నేను మీ అందరినీ రక్షించాను. నీ యెడల నా ప్రేమ చాలా గొప్పదైయున్నది, నేను నిన్ను ఎలాంటి షరతులు లేకుండా నా స్వంత ఉద్దేశం ద్వారా కాపాడాను. నేను నిన్ను ప్రేమించడమే కాదు, మీ పాపాలన్నింటినీ భరించడం ద్వారా మరియు నీ కోసం నా ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా నా ప్రేమను నిరూపించాను. ఇది నా ప్రేమకు రుజువైయున్నది, ఇది నేను మీ అందరికీ ప్రత్యక్షపరచాను."
ఆయన వాక్యం ద్వారా దేవుడు మనకు ఏమి చూపించాడు?
మనం దేవుని వాక్యం వైపు తిరిగి నప్పుడు,దేవుడు మన పాపాల గురించి మనతో మాట్లాడుతున్నప్పటికీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా లోకములోని సమస్త పాపాల నుండి ఆయన మనలను ఎలా రక్షించాడనే దాని గురించి కూడా ఆయన ఎక్కువగా మాట్లాడగలరని మనం చూడవచ్చు. మన రక్షణ గూర్చి వాగ్దానం చేసిన తరువాత, దేవుడు వాగ్దానం చేసినట్లుగా మన పాపాలన్నింటినీ ఒక్కసారిగా తుడిచివేశాడు ఈ నెరవేర్పు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ఫలితం ఇది తప్ప మరొకటి కానేరదు. నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్త పరిశుద్ధగ్రంథములో రక్షణ యొక్క రుజువుగా మన కొరకు వ్రాయబడియున్నది. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యందు మన విశ్వాసం దేవుని వాక్యంలో నమోదు చేయబడిన పాపాల నుండి మన రక్షించబడవచ్చు. అందువల్ల, మనం పరిశుద్దుడైన ప్రభువు సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా, నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు ప్రత్యక్షపుగుడార ద్వారం యొక్క సన్నని పేనిన నారతో ఆయన రక్షణను విశ్వసించడం ద్వారా మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా ఆయనను కలుసుకోవచ్చు.
మనకు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త అనునది ప్రభువు యొక్క బహుమానమే,అలాగే ఈ సత్య సువార్తను మనం విశ్వసించినంత కాలం, మన ప్రభువు మనలను కలియును. ఈ లోకములోని సమస్త పాపాల నుండి వారిని రక్షించడానికి ఆయన ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకోవడం ద్వారా వారి పాపాలన్నింటినీ భరించి ,వారి స్థానములో సిలువపై శిక్షను భరించాడని విశ్వసించే వారితో మాత్రమే ప్రభువు కలువును. మరియు వారికి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి ఆయన మరల మృతులలో నుండి లేచాడు. కాబట్టి దేవుడు తన నీతిని విశ్వసించే వారిపై మాత్రమే తన కృపను అనుగ్రహించును.దేవుడు మనతో ఇలా అంటాడు, “మీరు కేవలం నిమిత్త ప్రాణులు అయినప్పటికీ, నేను మీ అందరినీ నా కుమారులుగాను మరియు కుమార్తెలుగాను స్వీకరించాను. ఇప్పుడు మీరు నా స్వంత పిల్లలు. మీరు ఇకపై దెయ్యం పిల్లలు కానేరరు,మీరు ఇకపై కేవలం నిమిత్త ప్రాణులు మాత్రమే కాదు. మీరు నా స్వంత ప్రజలైయున్నారు.నా కుమారుడైన యేసు యొక్క నీతి ద్వారా నేను మీ పాపాలన్నిటి నుండి విడిపించాను. అందువల్ల నేను నిన్ను నా స్వంత కుటుంబంలోకి దత్తత తీసుకున్నాను, నాపై మీకున్న విశ్వాసం కారణంగా, మీరందరూ ఇప్పుడు నా స్వంత పిల్లలు అయ్యారు. ”ఇలా, దేవుడు మనందరికీ తన రక్షణ యొక్క కృపను అనుగ్రహించాడు.
కరుణాపీఠము యొక్క ఉంగరముల గుండా తొడిగించబడిన మోతకఱ్ఱలు బయటకీ తీసుకెళ్లుటకు కాదు
కరుణపీఠమును తీసుకువెళ్లడానికి దాని రెండు వైపులా రెండు మోతకఱ్ఱలు ఉన్నాయని గుర్తుంచుకోవడం మనకు చాలా ముఖ్యం. మరియు వాటిని ఎల్లప్పుడూ మందసము నుండి తీసివేయకూడదు. ప్రతి విశ్వాసి తన శరీరం మరియు హృదయంతో సేవ చేస్తున్నప్పుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై తన విశ్వాసాన్ని కొనసాగించాలని ఇది సూచిస్తుంది. అయితే, సమస్య ఏమిటంటే, నేడు చాలామంది క్రైస్తవులు తమ శరీరాలు మరియు హృదయాలతో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను అందించడానికి నిరాకరించటమే కాక, ఈ సత్య సువార్తను కూడా నమ్మలేకయున్నారు. అనేకమంది క్రైస్తవులు యేసును విశ్వసిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, వారిలో చాలామంది తిరిగి జన్మించారని చెప్పుకున్నప్పటికీ, వారు తమను తాము చాలా తెలివిగా భావించెదరు, అలాంటి వారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మడానికి ఇష్టపడరు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తప్పుగా భావించి నమ్మని క్రైస్తవులందరినీ దేవుడుహెచ్చరిస్తున్నాడు.
నిర్గమకాండము 25:15 ఇలా చెబుతోంది,“ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు,"ఈ వచనం మనకు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ఉన్నది ఉన్నట్లు ప్రకటించాలని బోధిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, లోకములోని సమస్త పాపాల నుండి మనల్ని రక్షించిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో కనిపించే ప్రత్యక్షపు గుడారం యొక్క నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం యొక్క మర్మమును మనం ప్రతి పాపికి బోధించాలి. మోషేకు ఏ విధంగానైతే గుడారమును నిర్మించమని దేవుడు మోషేకు ఆఙ్ఞాపించాడో, మానము కూడా దేవుని వాక్యంలో చూపబడిన విధంగా మనం తప్పని సరిగా యేసును విశ్వసించాలని ఇది సూచిస్తుంది. అయినప్పటికీ, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు యేసు యొక్క బాప్తిస్మమును వారి విశ్వాసం నుండి విడిచిపెట్టి తమదైన రీతిలో విశ్వసించమని ప్రకటిస్తున్నారు.
ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో తయారు చేయబడింది. ఈ ద్వారం ప్రభువు చేత తయారు చేయబడిన రక్షణ యొక్క ద్వారమును సూచిస్తుంది, మరియు మనమందరం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మాత్రమే ప్రవేశించగలము. ఇక్కడ సన్నని పేనిన నార దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. దేవుని యొక్క వాక్యం దాదాపుగా నలభై మంది దేవుని దాసులతో మాట్లాడటం జరిగింది. దేవుడు తన సేవకులకు 1,500 సంవత్సరాలకు పైగా తన ప్రవచన వాక్యాన్ని అందించాడు,మరియు ఆయన కాలంలోనే తన యొక్క శరీరం ద్వారా ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చాడు. మరో మాటలో చెప్పాలంటే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా ప్రభువు మన యొక్క రక్షణను ఒకసారి నెరవేర్చాడు.
ఏదేమైనా,బాధాకరమైనది,ఈ లోకములో చాలా మంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించను లేదు దానిని సరిగ్గా బోధించను లేరు. అయితే మీరు ఎలా ఉన్నారు? నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మీరు పాప క్షమాపణ పొందియున్నారా ? నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మీరు నిజంగా పాపాల నుండి విడుదల పొందినట్లయితే, దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా మీరు ఈ సువార్తను ప్రకటించాలి.
మన ప్రభువు మనకిచ్చిన కృపా రక్షణ మన అతిక్రమములు కంటే గొప్పదైయున్నది.
ఒకని అపరాధం వల్ల ఎంతమంది పాపులు అయ్యారో, అదేవిధంగా, మన ప్రభువైన యేసుక్రీస్తు అనే ఒకే వ్యక్తి యొక్క నీతి మూలాన అనేక మంది నీతిమంతులుగా మారారని పరిశుద్ధగ్రంధము చెబుతోంది. ఆదాము అనే ఒక వ్యక్తి చేసిన అపరాధ కారణంగా మీరు కూడా పాపి అయ్యారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఆదాము వారసుడిగా జన్మించినందున వారసత్వముగా మీరు పాపి అయ్యారు. ఆదాము మరియు అవ్వ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసారు కాబట్టి, మనమందరం స్వభావంతో పాపులం అయ్యాము.
ఏదేమైనా, మన సమస్త అతిక్రమములు ఒకే చోటే కూర్చబడినను దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడిన యేసుక్రీస్తు వాటన్నిటి కంటెను గొప్పవాడిగా ఉన్నాడు. మనం ఈ భూమిపై అనేక పాపములు చేసినప్పటికీ, మనం చనిపోయే రోజు వరకు అలాగే చేస్తూనే ఉన్నప్పటికీ, దేవుడు ఈ పాపాలన్నింటిని కూడా దేవుని యొక్క నీతి ద్వారా పూర్తిగా నెరవేర్చి తొలగించాడు. పరలోకములో మహిమ యొక్క సింహాసనమును విడిచి, మన ప్రభువు ఈ భూమ్మీదకు వచ్చాడు, మానవ శరీరధారిగా అవతరించి;బాప్తీస్మం మిచ్చి యోహాను ద్వారా ఆయన పొందిన బాప్తీస్మం ద్వారా ఈ లోకములోని సమస్త పాపములను ఒకసారి భరించి ;మన యొక్క ఈ రక్షణ కార్యం ద్వారా, మన ప్రభువు మనం చేసిన పాపం మరియు చేయబోయే సమస్త పాపాలను తొలగించాడు.ఊహించదగిన ప్రతి పాపమును,ఇప్పటికి లోకములో పుట్టని వారి పాపములను ఇంకా చేయబడిన అనేక పాపములను ఆయన తుడిచివేశాడు ఈ భూమిపైకి రావడం ద్వారా, మన ప్రభువు ప్రత్యక్షపు గుడారం ద్వారం యొక్క నీలం,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం ద్వారా వ్యక్తమయ్యే తన రక్షణతో మన పాపాలన్నింటినీ కడగడం ద్వారా మనల్ని పరిపూర్ణులుగా చేశాడు. అందువల్ల, ఈ భూమిపై మన పాపాలన్నింటినీ నిర్మూలించడం ద్వారా యేసుక్రీస్తు మనకు తెచ్చిన ఈ రక్షణ మన పాపాలు మరియు అతిక్రమణల కంటే మరింత గొప్పది మరియు ఒక వ్యక్తి చేసిన అపరాధం కారణంగా మనం కూడా పాపం చేయుదుము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులుగా మారాము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వసించుట ద్వారా మనం పూర్తిగా పాప లేనివారిగా మారిపోయాము.
దేవుడు కరుణా పీఠం మీద కలుస్తానని వాగ్దానం చేసాడు
సాక్షపు మందసము అతి పరిశుద్ధస్థలములో లోపల ఉంచబడి రెక్కలు చాపబడిన రెండు కెరూబులు కరుణపీఠముకు ఎదురెదురుగా ఉంచబడి యున్నారు. మనం అక్కడ ఏమి చూడగలం? మనం రక్తమును చూడగలము.ఇది ఎవరి రక్తం? పాత నిబంధన యుగంలో, ఇది బలి పశువు యొక్క ప్రాయశ్చిత్త రక్తం. క్రొత్త నిబంధన యుగంలో, ఇది యేసు క్రీస్తు రక్తం. మరో మాటలో చెప్పాలంటే, కరుణ పీఠముపై మనం చూసే రక్తం తండ్రియైన దేవుని కుమారుని యొక్క రక్తం. ఇది యేసు బాప్తీస్మం ద్వారా మన పాపాలన్నింటినీ భరించిన తర్వాత సిలువపై చిందించబడిన త్యాగపూరితమైన రక్తం. మరియు ఈ బలి అర్పణ కారణంగా, ఎవరైతే దేవుని కుమారుని మరియు ఆయన రక్తం యొక్క బాప్తీస్మం పై విశ్వాసం ఉంచుతారో వారు పాపాల నుండి విడుదల పొందగలరు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను అర్థం చేసుకుని విశ్వసించే వారందరికీ పాపం లేదని దేవుడు ప్రకటించగలడు. ఆయన వారిని తన సొంత ప్రజలుగా కూడా చేయగలడు.ఇదతంతయు కరుణపీఠములో వెల్లడైన సత్యం.
మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించిన ప్రతిసారి, అది పరిశుద్ధగ్రంథములో వ్రాయబడినట్లుగా మనం ఖచ్చితంగా బోధించాలి. మనలో ఎవ్వరూ దేవుని యొక్క నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను దిగజారిన విధంగా బోధించకూడదు లేదా సేవించకూడదు. మనం బోధించినఈ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త విని వారి హృదయాలతో విశ్వాసముంచుతే ప్రతి ఒక్కరూ రక్షించబడుదురు.అయినప్పటికీ, కొంతమంది క్రైస్తవులు మనల్ని ఎగతాళి చేయుదురు, యేసును విశ్వసించే వారు ఎవరైనా ఎలా విశ్వసించినా పాపం లేని వారు అని చెప్పారు. కాబట్టి, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తెలుసుకోవడం మరియు నమ్మడం నిజంగా అవసరం లేదని వారు పేర్కొన్నారు.
అయితే యేసు నామంలో ఏదో ఒకవిధంగా నమ్మడం ద్వారా ఎవరైనా నిజంగా పాపము లేనివారిగా చేయబడుదురా?మీ స్థానంలో యేసు సిలువ వేయబడి మరియు మరణశిక్ష విధించబడుటయు గుడ్డిగా నమ్మడం ద్వారా మీ పాపాలు వాస్తవంగా అదృశ్యమవుతాయా? లేదు, కానీ కాదు! చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో కూడా ఇంకను యేసును గుడ్డిగా విశ్వసిస్తున్నారు, ఎందుకంటే ఇది వాస్తవం కానప్పటికీ వారు పాపము చేయలేదని విన్నందుకు సంతోషంగాఉండును . చాలా మంది క్రైస్తవులు ఈ తప్పుడు భద్రతా భావానికి ఎందుకు ఆకర్షితులవుతున్నారో అర్థం చేసుకోవచ్చు; అన్నింటికంటే, మీరు జైలులో ఉన్నప్పుడు, ప్రభుత్వం మీకు క్షమాపణ ఇచ్చినట్లైతే , మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.వాస్తవానికి, సమస్య ఏమిటంటే ఈ క్షమాపణ నిజమైనది కాదు.
పరిశుద్ధగ్రంధము స్పష్టంగా చెప్పుచున్నది, “మరియు మీరు సత్యమును గ్రహించెదరు;అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా” (యోహాను 8:32). మానవజాతి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి మార్గం ఏమిటి? వారు నిత్యజీవాన్ని ఎలా పొందగలరు? ప్రత్యక్షపు గుడారం ద్వారం యొక్క నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారంలో, అనగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో వ్యక్తీకరించబడిన రక్షణ యొక్క సత్యాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే వారు పాపాల నుండి విడుదల పొంది నిత్యజీవాన్ని పొందగలరు. ఈ నిజమైన సువార్తను విశ్వసించే వారు మాత్రమే దేవుని పిల్లలగుదురు.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త దేవుని యొక్క సువార్త,మరియు విశ్వాసం ద్వారా ఈ నిజమైన సువార్తను ప్రకటించడం మరియు వ్యాప్తి చేయడం మనందరి బాధ్యత. ఇప్పుడు మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మడం ద్వారా ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులం అయ్యాము. నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్త కనీసం ఇద్దరు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మందితో పరిపూర్ణ ఐక్యతతో సేవ చేయాలి. మనము నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించబడిన ప్రతి సారి, ప్రత్యక్షపుగుడారo ద్వారా నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారములో తెలియజేయబడిన సత్యాన్ని మనం బోధించాలి. దేవుడు మనకు వాగ్దానం చేసినట్లే దేవుని యొక్క నీతిని నెరవేర్చాడు.
వాస్తవానికి ఈ నీతి ఏమిటనగా, యేసు మన పాపాలన్నింటినీ తుడిచివేసి ఈ భూమ్మీదకు రావడం ద్వారా, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొంది, సిలువపై మరణించి, మృతులలో నుండి లేచి పరలోకానికి వెళ్లడం ద్వారా విశ్వాసులైన మనల్ని రక్షించాడు. మనం తప్పనిసరిగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించాలి, మరియు ఈ సువార్తను వినే వారు వారి యొక్క రక్షణను చేరుకోవడానికి అటువలె విశ్వాసముంచాలి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించడం మనందరికీ ఎంత ముఖ్యమో నేను నొక్కి చెప్పలేను. మనం ఈ సత్యమైన సువార్తను ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ మన శ్రోతలకు రక్షణను కలిగించడానికి ఎంతో దోహద పడును.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త అనునది మన యొక్క రక్షణ. ఇది మన యొక్క ప్రాయశ్చిత్తం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో దేవుడు మన పాపాలన్నింటినీ ఒకేసారి తొలగించాడు. బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి ఆయన స్వీకరించిన బాప్తీస్మం ద్వారా మన ప్రతి పాపం యేసుపైకి పంపబడింది మరియు అలాగే మన పాపాలన్నింటి కొరకు ప్రాయశ్చిత్తం ఈ విధంగా చేయబడింది. అంతేగాక, మన ప్రభువు మన పాపాలన్నింటినీ భరించడమే కాకుండా, మన స్థానంలో సిలువ వేయబడి ,ఆయన రక్తం చిందించి, మనము భరించాల్సిన శాపాన్ని భరించి. యేసు మనలో ప్రతి ఒక్కరిని మన పాపములు మరియు శాపముల నుండి రక్షించాడు. దేవుడు మనకు తెచ్చిన రక్షణ ఇదియే, మరియు ఇది ఆయన ప్రేమ. కాబట్టి మీరు ఈ రక్షణ యొక్క సత్యాన్ని యథాతథంగా విశ్వసించాలి మరియు విశ్వాసం ద్వారా బోధించాలి.
మన ప్రభువు తన నీతిని విశ్వసించే వారందరికీ రక్షకుడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై మన విశ్వాసం ద్వారా మనం దేవుని సన్నిధికి రావాలి. మనము కరుణ పీఠము యెదుట నిలబడి, మన ప్రభువు యొక్క బలి రక్తాన్ని దేవునికి అర్పించినప్పుడు, “దేవుడా, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం నా పాపాలన్నిటి నుండి నన్ను కాపాడింది” అని చెప్పే, విశ్వాసంతో ఆయనను సమీపించాలి. అప్పుడే దేవుడు ఇలా అంటాడు, “అవును, నేను నిన్ను నిజంగా రక్షించాను. మీ పట్ల నా ప్రేమ చాలా గొప్పది, నేను మిమ్మల్ని రక్షించాను."ప్రభువు మన రక్షకుడైయున్నాడు. దేవుని యొక్క నీతిలో విశ్వాసముంచి ఆయన మాట వినుటకు సమీపించు వారందరికీ ఆయన అనుమతిచ్చియున్నాడు.మరియు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వారి హృదయాలలోకి అంగీకరించే వారందరికీ దేవుని స్వంత బిడ్డలుగా అయ్యే హక్కును ఆయన అనుగ్రహించాడు. దేవుడు మన శాపాల నుండి, శిక్ష నుండి మరియు వినాశనం నుండి మనలను విడిపించాడు. ఆయన మనలను తన విశ్వాసులుగా పూర్తిగా పాపం లేనివారిగా చేసాడు. ఆయన మనకు శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహించియున్నాడు.ఇది కరుణాపీఠములో వెల్లడైన దేవుని యొక్క కృప.
కరుణపీఠము నుండి దేవుడు మనపై రక్షణ యొక్క కృపను అనుగ్రహించాడు. కాబట్టి మనమందరం దేవుని నీతిని విశ్వసించడం ద్వారా కృపా సింహాసనంపైకి రావలెయును.మీరు ఎంత పాపుత్ములైన మరియు నీచమైనవారైనా, ప్రత్యక్షపు గుడారం ద్వారం యొక్క నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారములో- అనగా బాప్తిస్మములో వెల్లడి చేయబడిన రక్షణ యొక్క సత్యాన్ని విశ్వసించడం ద్వారా మీ పాపాలన్నింటినీ నుండి మీరు విడుదల పొందవచ్చును. అవి యేసు యొక్క బాప్తీస్మం, ఆయన రక్తం మరియు ఆయన పునరుత్థానం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో దేవుడు స్థాపించిన రక్షణ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం, మీరు తప్పనిసరిగా విశ్వాసం ద్వారా దేవుని సన్నిధికి రావాలి. మీరు ఆయన నీతిని విశ్వసించడం ద్వారా దేవుని వద్దకు రావాలి. పాపులందరిని రక్షించడానికి ప్రభువు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా ఆయన మానవ జాతి యొక్క పాపాలన్నింటినీ ఒకేసారి భరించి మరణించినప్పుడు మీ పాపాలన్నిటి కొరకై ఆయన మీ స్థానములో శిక్షించబడ్డాడని మీరు నమ్మవలెను. బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యేసు పొందిన బాప్తీస్మం మీద నమ్మకం ఉంచడం ద్వారా ప్రభువు మీ పాపాలన్నింటినీ ఒకసారి తీసివేసినట్లు మీరు విశ్వసించాలి, ప్రభువుతో ఇలా చెప్పండి ,“ప్రభువా, నా పాపాలన్నిటి నుండి నన్ను కాపాడటానికి నీవు నా కోసం చేసిన ప్రతిదాన్ని నేను నమ్ముతున్నాను"ఈ విశ్వాసం ద్వారా మీరు దేవుని వద్దకు వచ్చినప్పుడు మాత్రమే మీరు మీ రక్షణకు చేరుకోగలరు.
మీరు ప్రభువు యొక్క నీతిని విశ్వసించి, పాపాల నుండి విడుదల పొందాలనుకుంటే, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు ప్రత్యక్షపు గుడారం ద్వారం యొక్క సన్నని పేనిన నారలో వ్యక్తమయ్యే రక్షణ యొక్క సత్యాన్ని మీరు విశ్వసించాలి. ఎందుకంటే నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను సరిగ్గా తెలుసుకుని, విశ్వసించినప్పుడు మాత్రమే పాప క్షమాపణ లభిస్తుంది. మీరు దేవుణ్ణి కలసి ఆయన ఆశీర్వాదాలు నిజంగా పొందాలని, మీరు సంతోషంగా ఉండాలనుకుంటే, మీరు దేవుని వద్దకు తిరిగి వెళ్లి ఆయన కోరుకున్న జీవిగా జీవించాలనుకుంటే, లోకములో ఉన్న సమస్త పాపాల నుండి ఆయన మిమ్మును కాపాడగలడని మీరు నమ్మాలి. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం పొందడం ద్వారా మానవజాతి యొక్క ప్రతి పాపాన్ని ప్రభువు అంగీకరించాడు, లోకములోని ఈ పాపాలన్నింటినీ తన భుజాన వేసుకొని మరణానికి సిలువ వేయబడెను, తద్వారా ఆయన మీ యొక్క సమస్త పాపాల నుండి మిమ్మల్ని విడిపించాడు.నీవు ఈ రక్షణ యొక్క సత్యం నందు విశ్వాసం ఉంచి, దేవుని యొక్క రక్షణను అంగీకరిస్తే, మీరు తప్పకుండా విడుదల చేయబడతారు. మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించిన ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
పరిశుద్ధగ్రంథములో వ్రాయబడిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యమైన ఏకైక సువార్త అని దేవుడు మనకు చెబుతున్నాడు.ప్రత్యక్షపు గుడారంలోని సన్నది రొట్టెల బల్ల వైపు ఒక సారి చూద్దాము. సన్నది రొట్టెల బల్ల దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ఈ విధంగా, నీ హృదయం దేవుని వాక్యంలో వ్రాయబడిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త పై విశ్వాసం కలిగి ఉన్నప్పుడే, మీరు పాప క్షమాపణ పొందగలరు.
ఏదేమైనా, నేటి "ప్రసిద్ధి చెందిన బోధకులు" అని పిలవబడే వారు రక్షణ గురించి ఎలా బోధిస్తున్నారు? యేసును రక్షకునిగా ఎలా విశ్వసించిన పర్వాలేదు ఎవరైనా రక్షించబడతారని వారు ప్రస్తావిస్తున్నారు. అలాగే సిలువపై యేసు రక్తాన్ని విశ్వసించే వారందరూ రక్షించబడుదురని వారు చెప్పుదురు. ఏదేమైనా, మీరు యేసును గుడ్డిగా విశ్వసిస్తే, మీ జీవితంలో మీరు చేసిన పాపాలు ఏవీ కూడా వాస్తవంగా అదృశ్యం కానేరవు. నేటి క్రైస్తవులలో అనేకమంది తమ పాపాలన్నింటినీ ఇప్పటికీ వారి హృదయాలలో అలాగే ఉంచుకొనుచున్నారు. ఈ పొరపాట్లతో క్రైస్తవులు బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు స్వీకరించిన బాప్తిస్మమును విడిచిపెట్టి కేవలం యేసును గుడ్డిగా విశ్వసిస్తారు కాబట్టి, వారి హృదయాలు పూర్తిగా పాప లేకుండ ఉండటం అసాధ్యం. ఎందుకంటే వారి పాపాలను యేసుక్రీస్తుకు అప్పగించలేదు గనుక. వారు యేసును ఎంతగా విశ్వసించినా, వారి హృదయములో పాపములను తొలగించుకోలేరు. సిలువపై యేసు రక్తాన్ని మాత్రమే విశ్వసించినట్లు వారందరూ ప్రకటించినప్పటికీ,వారి ఆధ్యాత్మిక పరిస్థితి మునుపటిలాగే ఉంటుంది,ఎందుకంటే ప్రత్యక్షపుగుడార ద్వారం యొక్క నీలిరంగు దారం వలన బయటపడిన రక్షణ యొక్క సత్యం వారికి తెలియదు. మరో మాటలో చెప్పాలంటే, ఈ దారి తప్పిన క్రైస్తవులు బాప్తీస్మం మిచ్చు యోహానునుండి యేసు అందుకున్న బాప్తీస్మం యొక్క అర్ధాన్ని విస్మరించారు కావున, వారి పాపాలు ఇప్పటికీ వారి హృదయాలలోనే ఉన్నాయి, మరియు వారు ఇప్పటికీ పాపులుగానే కొనసాగుతున్నారు.
దేవుడు మన పాపాలన్నింటినీ నీరు, రక్తం మరియు ఆత్మతో స్పష్టంగా తొలగించాడు (1 యోహాను 5: 6-8). దేవుడు తన పరిశుద్ధమైన సత్య వాక్యంతో వాగ్దానం యొక్క వాక్యాన్ని నెరవేర్చడం ద్వారా,యేసు మనల్ని నిస్సందేహంగా మరియు నిరాకరించలేని విధంగా రక్షించాడు. ఒక విధంగా చెప్పాలంటే, యేసు నీరు, మరియు ఆయన రక్తం మరియు ఆత్మ ద్వారా మన పాపాలన్నింటి నుండి ఒక్కసారి మనల్నిరక్షించాడు,ప్రత్యక్షపుగుడార ద్వారం యొక్క నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణము గల దారం ద్వారా ఇది వ్యక్తమవుతుంది.పరిశుద్ధాత్మ మన దేవుడు. పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చేదేమిటంటే, నిజమైన దేవుడు యేసు ఒక మనిషిగా మారాడు,బాప్తీస్మం మిచ్చు యోహానునుండి ఆయన బాప్తీస్మం తీసుకొన్నాడు మరియు మన స్థానంలో మన పాపాల కొరకై శిక్షించబడి తన సొంత రక్తాన్ని సిలువపై చిందించాడు. ఆయన మనందరినీ ఈ విధంగానే రక్షించాడు.అయినప్పటికీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా యేసు మన పాపాలన్నిటి నుండి మనలను రక్షించినప్పటికీ, అనేకమంది క్రైస్తవులు యేసును ఇప్పటికీ తమ రక్షకుడిగా వారు ఎంతగా విశ్వసించినా వారందరు పాపులుగానే ఉన్నారు, ఎందుకంటే వారు బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు పొందిన ఆయన బాప్తిస్మమును విడిచి పెట్టి ప్రభువును గుడ్డిగా విశ్వసించారు.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ప్రకారం యేసుక్రీస్తును విశ్వసించడమే కాకుండా,అపోస్తులుడైనపౌలు చేసినట్లుగా, విశ్వాసంతో ప్రతి ఒక్కరికి లేఖనాలలో వ్రాయబడినట్లుగా మనమందరం బోధించడం కూడా చాలా అవసరం. 1 కొరింథీయులు 15: 3-4లో అపోస్తులుడైన పౌలు ఇలా చెప్పాడు: "నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను."లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మరణించాడు" అని పౌలు ప్రస్తావించినప్పుడు,ఇక్కడ చెప్పబడిన "లేఖనాలు"అనే వాక్యాలు పాత నిబంధనను సూచిస్తాయి ఎందుకంటే ఆ సమయంలో కొత్త నిబంధన ఇంకా పూర్తిగా ఇవ్వబడలేదు. అప్పుడు, పాత నిబంధనలోని బలి వ్యవస్థ యొక్క ఆచారం ప్రకారం లోకములోని సమస్త పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడని పౌలు చెప్పుచున్నాడు.యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నందున,ఆయన సిలువపై తన రక్తం చిందించాడు.
దేవుడు ఆయన బాప్తీస్మం ద్వారా మన పాపాలన్నింటినీ భరించాడు కావున ఆయన మరణానికి సిలువ వేయబడ్డాడు, మరియు సిలువపై ఈ మరణం మన యొక్క శిక్షను భరించుట కొరకు. ఈ విధంగా యేసు క్రీస్తు ఈ భూమ్మీదకు రావడం ద్వారా మన రక్షకుడిగా మారారు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారి పాపాలను దేవుడు క్షమించగలడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారందరిలోకి ఈ శాశ్వతమైన రక్షణ ఇప్పటికే వచ్చియో ఉన్నది. హల్లెలూయా!