(నిర్గమకాండము 25: 31-40)
మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను.దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయ వలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై యుండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడుకొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు,రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు;అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను, దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.
ఈ భాగము ప్రత్యక్షపుగుడారం యొక్క దీపవృక్షము వివరిస్తుంది. ఈ రోజు, నేను దాని అలంకార గుబ్బలు, పువ్వులు మరియు దీపవృక్షము యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని వివరించాలనుకుంటున్నాను. దేవుడు మొదటగా మోషేకు ఆజ్ఞాపించాడు, మేలిమి బంగారుతో నీవు దీపవృక్షమును చేయవలెను. కాబట్టి ప్రకాండము మొదట నకీషు పనిగా చేయవలెను, ఆపై ఈ ప్రకాండము నుండి కొమ్మలు కొట్టబడ్డాయి. దీపవృక్షము యొక్క ప్రతి వైపు నుండి మూడు కొమ్మలు బయటకు వచ్చాయి, మరియు ప్రతి కొమ్మపై బాదం పువ్వుల వంటి మూడు కలశములు తయారు చేయబడ్డాయి, ఆపై అలంకార మొగ్గలు మరియు పువ్వులు తయారు చేయబడ్డాయి. ఇలా, కొమ్మల పైన ఏడు దీపాలను ఉంచారు. ఈ ఏడు దీపాలను వెలిగించడానికి నూనెను పోశారు. అదే విదంగా దీపవృక్షము పరిశుద్ధస్థలము లోపల మరియు దాని పాత్రలన్నింటినీ ప్రకాశవంతంగా ప్రకాశింపచేస్తుంది.
నీ కొరకు మరియు నా కొరకు, మన ప్రభువు, పరలోకరాజ్యానికి రాజు, సాత్వికుడుగా తగ్గించుకున్నవాడై మానవుని రూపంతో ఈ భూమ్మీదకు వచ్చాడు. మరియు యేసు ఈ భూమిపై నీలం మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంలో వ్యక్తమయ్యే రక్షణ కార్యాలను నిర్వర్తించాడు . ఈ రక్షణకు సంబంధించిన కార్యాలు ఈ భూమిపై జన్మించిన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి మరియు యొర్దాను నదిలో తన 30 సంవత్సరాల వయస్సులో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొంది, ఆ తురువాత సిలువపై శిక్షించబడ్డాడు. "ఈ విధంగా" చేతులు వేసి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, యేసు మానవజాతి యొక్క సమస్త పాపాలను తీసుకొనియున్నాడు(మత్తయి 3:15). ఒక వ్యక్తిగా మారిన యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మానవజాతి పాపాలన్నింటినీ స్వీకరించాడు, మరియు సిలువ వేయబడి ఆయన రక్తాన్ని చిందించాడు,తద్వారా నీలం మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో వ్యక్తమయ్యే రక్షణకు సంబంధించిన విధులను నిర్వర్తించాడు. ఇది సత్యమైయున్నది దేవుని సంఘము దీని పైనే పునాది వేయబడినది.
మన ప్రభువుసంఘము యొక్క అలంకారమగు మొగ్గగా మారారు. పాప పరిహారం పొందిన మీకు మరియు నాకు దేవుని యొక్క రక్షణకు పునాది అయ్యాడు. అందువల్ల, నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారంలో వ్యక్తమయ్యే ఆయన రక్షణ కార్యములతో ప్రభువు మన పాపాలన్నిటి నుండి మనలను రక్షించాడని విశ్వసించడం ద్వారా మీరు మరియు నేను దేవుని సంఘములో భాగమైపోయాము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా, దేవుని ధరించాము.అందుకే "సంఘము"అనే పదాన్ని గ్రీకులో"έκκλησία"(ఎక్లెసియా)అని పిలుస్తారు,అనగా "లోకపాపము నుండి పిలవడం".
ఈ లోకంలోని ప్రజలను వారి పాపాల నుండి తప్పించుకునేలా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు తప్ప మరెవరో కాదు. ఆయన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా వచ్చి పాపులందరి దోషాలను కడిగిన ప్రభువు. ప్రభువు యొక్క బాప్తీస్మం మరియు రక్తమును విశ్వసించడం ద్వారా, మనం పాపం నుండి రక్షించబడ్డాము మరియు సంపూర్ణ నీతిమంతులం కాగలిగితిమి. ప్రభువు మనల్ని నీతిమంతులను చేసాడు అనే సత్యం పట్ల విశ్వాసం ద్వారా ఆయన ఈ భూమ్మీదకు వచ్చి నీలం మరియు ఊదా రంగులో కనిపించే రక్షణకు సంబంధించిన కార్యాలన్నీ నెరవేర్చాడు. నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారములో వెల్లడైన విశ్వాసం ఇది.
యేసు ఈ భూమ్మీదకు వచ్చినప్పుడు యోహాను చేత యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, ఆయన మన పాపాలన్నింటినీ స్వీకరించాడు (మత్తయి 3: 13-17). నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారంలో ఈ సత్యం మరియు విశ్వాసం వ్యక్తమైనవి. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు సిలువపై లోకములోని పాపముల కొరకు శిక్షించబడ్డాడు, ఆయన మన పాపాలను ఒక్కసారిగా తుడిచివేసెను. మరోమాటలో చెప్పాలంటే,మన పాపాలన్నింటినీ భుజాన వేసుకున్న యేసు, సమస్త పాపాల నుండి మనల్ని విడిపించాడు. ఈ విధంగా, నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణము గల దారములో ఆయన రక్షణకు సంబంధించిన కార్యాలతో,దేవుడు మనల్ని లోకములోని సమస్త పాపాల నుండి రక్షించాడు. నిజమైన రక్షణ యొక్క విశ్వాసం అనగా వాస్తవంగా ఈ సత్యాన్ని మనం సరిగ్గా తెలుసుకోవడం మరియు నమ్మడం.
మనం విశ్వాసం ద్వారా మన పాపాలన్నిటి నుండి రక్షించబడ్డాము, పాపం నుండి రక్షణ అనునది దేవుని యొక్క బహుమతి. ఇలానే , లోకం స్థాపించబడక మునుపే, ఆయన పొందిన బాప్తీస్మం మరియు సిలువ రక్తంలో కూడా మన యొక్క రక్షణ యేసుక్రీస్తులో రూపొందించబడింది. ఈ గ్రహం ఏర్పడకముందే, మానవజాతి యొక్క సాధారణ పూర్వీకులు ఆదాము మరియు అవ్వ సృష్టించబడకముందే, దేవుడు యేసుక్రీస్తులో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో, పాపాత్ములను వారి దోషముల నుండి రక్షించాలనుకున్నాడు; మరియు సమయం వచ్చినప్పుడు, ఆయన బాప్తిస్మం తీసుకొని తన రక్తాన్ని చిందించడం ద్వారా దానిని నెరవేర్చడానికి ఈ భూమ్మీదకు వచ్చాడు మానవాళిని సృష్టించిన మన దేవుడు వారికి వాగ్దానం చేసినట్లుగా మొత్తం యావత్తు మానవజాతి యొక్క పాప క్షమాపణను నెరవేర్చాడు. దేవుని వాగ్దానాల యొక్క ఈ నెరవేర్పు అంతా యేసు క్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకొని ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా సాధించబడింది. మరియు దీనిని విశ్వసించే వారందరికీ,దేవుడు లోకములో సమస్త పాపాల నుండి వారిని విడిపించే రక్షణను బహుమతిగా అనుగ్రహించాడు అలాగే వారి పాపముల నుండి శాశ్వత జీవిత విమోచన పొందడానికి అనుమతించాడు. ఈ సత్యాన్ని విశ్వసించేవారు దేవుడు తన స్వంత ప్రజలుగా సంపూర్ణంగా రక్షించాడు.ఈ సత్యం నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణము గల దారంలో వెల్లడించిన రక్షణ యొక్క సత్యం .
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త అనునది దీపవృక్షము యొక్క ప్రకాండము
యేసు రక్షణకు మూలస్తంభమై, సమస్త మానవాళి రక్షకు అనివార్యమైన మూలస్తంభంగా ఉన్నాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో, యేసు పూర్తి చేసి మన యొక్క రక్షణకు పునాదిగా మారాడు.
దేవుని యొక్క దీప వృక్షములో బాదం పువ్వులు, అలంకార మొగ్గలు మరియు పువ్వులు వంటి కలశములు ఉన్నవి. మరియు దానికి ప్రకాండము కూడా ఉన్నది. యేసుక్రీస్తు కూడా రక్షణ యొక్క పుష్పముగా మారెను. యేసు క్రీస్తు నిజరక్షకుడైన పువ్వు అయినచో, అలంకార మొగ్గలు ఎవరు కావచ్చు? వాస్తవానికి, వారు దేవుని సేవకులు మరియు పాప క్షమాపణ పొందిన వారందరు. మరో మాటలో చెప్పాలంటే, పువ్వు యేసుక్రీస్తు మరియు పూలు పూర్తిగా వికసించడానికి సహాయపడే అలంకార మొగ్గలo మనం.
మన పాపము నుండి మనల్ని రక్షించిన తరువాత, మన ప్రభువు మనందరినీ సువార్త యొక్క అలంకార మొగ్గలుగా చేశాడు. ఈ వాస్తవం మీకు తెలుసా మరియు నమ్ముతారా? మన యొక్క సేవకులు, పెద్దలు, సోదరులు మరియు సోదరీమణులు అందరూ అలంకార మొగ్గలు. పాప క్షమాపణ పొందిన ఎవరైనా ఒక అలంకార మొగ్గలైయున్నారు. నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణము గల దారంతో దేవుడు మొదటిగా రక్షణ యొక్క ప్రకాండము వేసెను. తదుపరి నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో మనలను రక్షించాడు అటువలె సువార్త పువ్వులు వికసించేలా సహాయకులుగా ఉండు అలంకార మొగ్గలుగా మనల్ని చేశాడు. మనమందరం అలంకార మొగ్గలుగా మారినప్పుడే పాపులు వారి పాపాల నుండి రక్షించబడతారు. పరిమాణంలో మాత్రమే తేడా ఉంటుంది, ఎందుకంటే కొన్ని అలంకార మొగ్గలు పెద్దవిగా ఉండవచ్చు, మరికొన్ని చిన్నవిగా ఉంటాయి, అయితే మనమందరం సువార్త కోసం అలంకార మొగ్గలు అనే వాస్తవం మారదు.
సాతాను ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకంగా ఉంటాడు కావున, మనమందరం మన పాపముల నుండి విడుదల పొందకుండా ఉండటానికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించకుండా నిరోధించడానికి అతను ప్రయత్నిస్తాడు. కానీ తుఫాను దాటిపోయినప్పుడు పాడైపోయిన పొలంలో కూడా పువ్వులు వికసించినప్పుడు, ప్రతి పాపాత్ముడు కూడా రక్షణ యొక్క సువార్తను వినడం ద్వారా పాపం నుండి విడుదల పొందవచ్చు, అది నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను గూర్చి. తప్పిపోయిన ఆత్మలను పాపం నుండి రక్షించాలని ప్రభువు ఆశిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, అతను ఈ లోకమంతయు నీరు మరియు ఆత్మ యొక్క సత్యాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాడు. అందుకనే, దేవుని సంఘము కూడా అదే ప్రయోజనం కోసం పనిచేస్తుంది.
సేవకులు వారి సంఘము యొక్క అలంకార మొగ్గలుగా తమను తాము విశ్వసించడం ద్వారా వారి సంఘమునకు సేవ చేయనప్పుడు, అలాంటి సంఘములు ఎలాంటి రక్షణ ఫలాలను పొందలేవు. అందువల్ల, ఏ సేవకుడైన తన సమాజం ద్వారా సేవ చేయబడాలని కోరుకుంటే, అతను సువార్తకు సహాయకుడిగా కాకుండా సువార్త కు అడ్డుబండగా ఉండకూడదు.
మొదటిగా సాతాను మన దగ్గర రావడానికి గల కారణం మన జీవితాన్ని దొంగిలించడానికి మరియు చంపడానికి. కానీ మన ప్రభువు తన గొర్రెలకు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు (యోహాను10:10), మరియు ఆయన తన సమస్తమును విడిచి మనలను రక్షించాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వ్యాప్తికి ఏదైనా ప్రయోజనకరంగా ఉంటే, అది ఎంత కష్టంగా అనిపించినా మనం దానిని చేయడానికి వెనుకాడకూడదు. అలాంటి మనస్తత్వం మనల్ని సువార్త యొక్క అలంకార రూపమగు మొగ్గలుగా మార్చును. సువార్తను అందించడానికి సేవకుడు నీచమైన పని చేయుట సేవకునికి తగినదేనా, అందుకే మన సేవకులు మండుతున్న సూర్యుని క్రింద పని చేస్తున్నారు. మండే సూర్యుని కింద మొగ్గల పాత్రను పోషించి నెరవేర్చడం ద్వారా ఒక్క ఆత్మయు కూడా రక్షించబడితే, వారు తమ జీవితాంతం దీన్ని చేయుదురు. దేవుని సువార్త యొక్క పువ్వును వికసింపచేసేలా చేయడానికి సిద్ధపడే విశ్వాసం ఉన్నవారే సేవకులు.నీటి సువార్త అనునది ఒక పువ్వు మరియు ఆత్మ వికసింపచేయటానికి ఎంత ప్రయత్నం మరియు త్యాగం అవసరమో మీరు గ్రహించాలి. మీరు మరియు నేను మన యొక్క పాపముల నుండి విడుదల పొందగలిగాము. పరిశుద్ధ గ్రంథాన్ని కాపాడటానికి హతసాక్షులైన విశ్వాసం యొక్క పూర్వీకులు మనకు ఉన్నారు.
ప్రత్యక్షపుగుడారములోని ఏడు దీపాలలో దేవుని ప్రశస్తమైన నూనె పోయుదురు.నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యందు మన విశ్వాసం ద్వారా, ఈ విలువైన నూనెను స్వీకరించి మనము ఆనందించగలిగాము మరియు దేవుని కృప ద్వారా, సువార్త యొక్క అలంకార మొగ్గలగా కూడా మారగలము. మనం సువార్తను అందించినప్పుడు, చేయవలసిన పనులు చాలా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఒక విషయం నుండి మరొకదానికి, ఏమి చేయాలో ముగింపు లేదు. మేము సువార్త పుస్తకాలను ప్రచురించడం, సేవకులకు వాక్యాన్ని బోధించడానికి, ప్రార్థించడానికి, మరియు వారి సోదరులు సోదరీమణులకు నాయకత్వం వహించడానికి, మరియు సోదరులు మరియు సోదరీమణులు ప్రభువుకు సేవ చేయడానికి తగిన నిధులను సమకూర్చడం-ఇవన్నీ తప్పనిసరిగా సువార్తను అందించే అలంకార మొగ్గలు యొక్క పాత్రను నెరవేర్చడానికి నిర్వహించబడాలి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త పువ్వుగాను మరియు వికసింపచేసే ఆత్మ యొక్క ఈ అలంకార మొగ్గలు యొక్క సువార్త పనిగా దేవుడు మనల్ని నీతిమంతులనుగా ఉపయోగిస్తున్నాడనే వాస్తవాన్ని మీరు ఎప్పటికీ మరచిపోరని నేను ఆశిస్తున్నాను.
నూతన విశ్వాసులను జాగ్రత్తచేయుటయు కూడా దేవుని యొక్క పని చేయుటయే
దేవుని సంఘములో అందమైన వారుగా ఉన్నను అదే సమయంలో అత్యంత భయానకంగా ఉండేవారు ఇటీవలే పాప విముక్తి పొందిన యువ సోదరులు మరియు సోదరీమణులు. వారి ముందు, సేవకులు కూడా వినయంగా ఉండాలి మరియు వారి ఆధ్యాత్మిక అవగాహన స్థాయిలో వారిని నిమగ్నం చేయాలి. ఎందుకు? ఎందుకంటే వారు పాప క్షమాపణ పొందినప్పటికీ, వారి తీర్పు యొక్క స్థితి ఇప్పటికీ వారి శరీరాన్ని బట్టి ఉంటుంది.కావునా,ముందుగా విశ్వసించిన పూర్వీకుల యొక్క విశ్వాసపు అడుగుజాడల్లో నడుస్తున్న యువ విశ్వాసులకు సేవ చేసే అలంకార మొగ్గలుగా మారాలి. వారు నూతన విశ్వాసులకు సేవ చేయాలి, తద్వారా ఈ నూతన విశ్వాసులు వారి విశ్వాసంలో పెరిగినప్పుడు, వారు విశ్వాసపు యవ్వనంలో ఉన్నప్పుడే వారిని వారు జాగ్రత్తచేసుకోగలరు. వ్యక్తిగతంగా వారిపై కరుణ చూపితే వారు కృతజ్ఞతతో ఉందురు, అలాగే వారి విశ్వాసంతో వారు సంఘములోకి వచ్చే నూతన పరిశుద్దులుగా కూడా ఈ కృపను తిరిగి ఇవ్వగలరు.
అయితే, మీరు షరతులు లేకుండా వారి పట్ల జాలితో వ్యవహరించకూడదు. కేవలం దేహంలో ఎలాంటి షరతులు లేకుండా ఎవరితోనైనా జాలి చూపడం అంటే ఈ వ్యక్తి యొక్క ఆత్మ వృద్ధి చెందుతుందని దాని అర్థం కాదు. ప్రజలను ఆధ్యాత్మిక శ్రేయస్సు వైపు నడిపించే విశ్వాస మార్గం ద్వారా దేవుని చిత్తం ప్రకారం జీవించడానికి మార్గనిర్దేశం చేయడం. మనం గుడ్డిగా ఉండి శరీరంలో మంచిగా ఉంటే, వారికి సహాయం చేయకుండా దూరంగా ఉంటే, అది నిజంగా వారిని భ్రష్టు పట్టిస్తుంది. కొంతమంది సోదరులు మరియు సోదరీమణులు సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టారో మీకు తెలుసా? వారు ఆధ్యాత్మిక దిశలో విశ్వాసం ద్వారా నడిపించబడనందున వారు వెళ్లిపోతారు. శుద్దిచేయబడిన బంగారు ముద్దను కొట్టడం ద్వారా దీపవృక్షమును తయారు చేసినట్లే, దీపవృక్షము మరియు అలంకార మొగ్గలుగా మారిన వారి శరీరాన్ని వారి స్వంత నీతిని గూర్చిన వారి ఆలోచనలను తిరస్కరించాలి, మరియు వారు వారి హృదయాలను సుత్తితో సరి చేసి దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. వారు దేవునికి తగిన విధంగా సమర్పించడానికి తమను తాము సరిచేసుకోవడం ద్వారా దేవుని సంఘము యొక్క పనివారిగా మారాలి.
సామాజిక కార్యకర్తలు వారు ప్రజలకు ఉత్తమంగా ఎలా సహాయపడగలరో తరచుగా ఆలోచిస్తారు. తగిన కార్యాచరణ ఏమిటి? భిక్షగాళ్లకు డబ్బులు ఇస్తున్నారా, లేదా స్వతంత్రంగా మారడానికి వారికి సహాయపడుతున్నారా? తరచుగా, చాలామంది వ్యక్తులు డబ్బు మరియు ఆహారాన్ని వారికి అందజేస్తారు. కానీ సామాజిక పనులపై కొంత పరిజ్ఞానం ఉన్నవారు ఎప్పుడూ డబ్బును అందజేయరు. బదులుగా వారు తమ జీవితాలను స్వతంత్రంగా గడపడానికి వీలుగా అవసరమైనవారిలో ప్రేరణ మరియు స్వతంత్రయాన్ని పెంపొందించే సహాయాన్ని వారు అందిస్తారు. ఇది వారికి నిజంగా సహాయపడేది. కాబట్టి ఇతరులకు సహాయం చేయడానికి కూడా కొన్ని అత్యంత సాంకేతిక నైపుణ్యాలు అవసరం.
అదేవిధంగా, సువార్త-బోధన పరిచర్య అని పిలువబడే ఈ విషయం కూడా దేవుని యొక్క వరమే, ఎందుకనగా ఇది దేవుని వాక్యంతో ఆత్మలకు నీరు పెట్టడం వంటిది వారి శరీరం మరియు ఆత్మలు సామరస్యంగా ఎదుగునట్లుగా వారికి సేవ చేయడం చాల అవసరం.సేవకులు, మరో మాటలో చెప్పాలంటే, ఆత్మలను నడిపించాలి మరియు వారిని ప్రభువుకు మార్గనిర్దేశం చేయాలి, మరియు వారు తమ విశ్వాస జీవితంలో విజయం సాధించడానికి వారు శరీర సంబంధమైన వ్యవహారాల్లో కూడా వారిని నడిపించాలి. సేవకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పుట్టుకతోనే మన విశ్వాస జీవితాలు ప్రతిరోజూ అనేక రంగాలలో మరియు సందర్భాలలో అలంకారమగు మొగ్గల యొక్క పాత్రను నెరవేర్చడం. ప్రభువు వద్దకు వెళ్లే ముందు మన జీవితమంతా సువార్త యొక్క అలంకార మొగ్గలుగా విశ్వసనీయంగా గడపడం మన యొక్క కర్తవ్యం.
మనల్ని రక్షించిన తరువాత, మనలను దేవుడు అలంకార మొగ్గలుగా తయారు చేసి, తగిన బాధ్యతలను అప్పగించాడు, తద్వారా సువార్త పుష్పము పూర్తిగా వికసించేలా సేవ చేయవచ్చు. తిరిగి జన్మించని ఈ లోకములో ప్రజలు నిరంకుశులు, ఆడంబరాలు, అహంకారాలు మరియు ఎల్లప్పుడూ ఇతర విశ్వాసులచే సేవ చేయబడటానికి ప్రయత్నిస్తారు. కానీ పునర్జన్మ పొందిన సంఘములో దేవుని సేవకులుగా నియమించబడిన సేవకులుగా ఆయన చిత్తం గురించి బాగా ఎరిగిన వారై వారికి అప్పగించబడిన సువార్త యొక్క అలంకార మొగ్గలుగా పనిచేయటానికి వారు నమ్మకంగా ఉందురు. సేవకులు ఈ అలంకార మొగ్గులు యొక్క పాత్రను బాగా నెరవేర్చడం చాలా ముఖ్యం. మన ప్రభువు చెప్పాడు, "పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము" (అపోస్తులు 20:35). ఇది కేవలం ఊహాత్మక భావన మాత్రమే కాదు, విశ్వాసం మరియు వాస్తవ జీవితానికి మార్గదర్శక సూత్రం. స్వీకరించేవారి కంటే ఇచ్చేవారు నిజంగా ఆశీర్వదించబడ్డారు. దీనిని మీకు మీరుగా అనుభవించారా?
మీకు ఒక కథ చెబుతాను. ఒక జంట తమ వయస్సులో ఆలస్యంగా బిడ్డను కలిగి ఉన్నారు, ఈ బిడ్డ ప్రేమగా ఎదగాలని ప్రార్థించారు. వారు ప్రార్ధించినట్లుగా, పిల్లవాడు ఎల్లప్పుడూ ప్రేమించబడుతూ పెరిగాడు. కానీ సమయం గడిచేకొద్దీ, తమ బిడ్డ మాత్రమే ప్రేమించబడుతుందని వారు భావించారు, బదులుగా తనను తప్ప మరెవరినీ పట్టించుకోని స్వార్థపరుడిగా ఎదుగుతున్నారని వారు కనుగొన్నారు. వారు ఇప్పటివరకు చేసినది పిల్లలకి ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు. అతను నిరంతరం స్వీకరిస్తూనే ఉన్నాడు, అతను ఎలా స్వీకరించాలో మాత్రమే తెలుసుకున్నాడు, ఇవ్వడం కాదు, మరియు అతన్ని అత్యాశ మరియు స్వార్థంతో నిండిన పిల్లవానిగా మార్చాయి.వృద్ధ దంపతులు తమ బిడ్డను ఇతరులను ఎలా ప్రేమించాలో తెలిసిన వ్యక్తిగా మార్చాలని మరల ప్రార్థించారు. పుచ్చుకొనుట కంటే ఇవ్వడం చాలా అందంగా ఉంది. దేవుని సేవించడం ఎంత సరదాగా ఉంటుంది? ఇది ఎంత సంతోషకరమైనది? నేను విశ్వాసం ద్వారా సువార్తను అందించినప్పుడల్లా ఒక ఆత్మ పాప క్షమాపణను స్వీకరిస్తుందని భావించినప్పుడు, నేను ఎంతో సంతోషంగా సంతృప్తి చెందగలను. నీతిమంతులైన విశ్వాసులు సువార్తను అనేకమంది ఆత్మలకు వ్యాప్తి చేయాలని కోరుకుంటారు. దేవుని సంఘములో, సువార్త యొక్క అలంకార మొగ్గల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. దేవుడు ఏ స్థానాల్లో అలంకార మొగ్గలుగా ఉంచారో మీరు మరియు నేను గ్రహించాలి. మరియు అలంకార మొగ్గలు యొక్క ఈ స్థానాలపై, మనం విశ్వాసంతో మన యొక్క పాత్రలను నెరవేర్చవలెను. మనం సువార్తను మన శరీర సామర్థ్యాలు మరియు గర్వముతో కాకుండా దేవునిపై మన యొక్క విశ్వాసం ద్వారా సేవ చేసినప్పుడు, ఆయన రక్షణ యొక్క పువ్వును పూర్తిగా వికసించేలా చేస్తాడని నేను నమ్ముతున్నాను. మనం సువార్త యొక్క అలంకార మొగ్గలుగా మారినప్పుడే సువార్త పువ్వులు వికసిస్తాయి మరియు ఈ పువ్వుల ద్వారానే చాలామంది ఆశీర్వదించబడ్డారు.
సంఘము దీపవృక్షమై సువార్త వెలుగును ఈ లోకానికి ప్రకాశింపచేయును
కలిసి సేకరించడం ద్వారా, నీతిమంతులు సువార్త యొక్క దీపవృక్షములుగా మారతారు మరియు ఈ లోకాన్ని ప్రకాశింపచేస్తారు. నీతిమంతులు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త కాంతిని ప్రకాశింపచేస్తారు. దీపవృక్షము వలె జీవితం వాస్తవంగా చీకటి లోకము నుండి ప్రకాశవంతమైన సత్యపు వెలుగుతో ప్రకాశిస్తుంది -ఇలాంటివే మన జీవితాలు. పాప క్షమాపణ పొందిన నీతిమంతులు సువార్త యొక్క అలంకార మొగ్గలుగా మారినప్పుడు, విశ్వం యొక్క పువ్వులు ఈ లోకములో పూర్తిగా వికసిస్తాయి, మరియు ఇది జరిగినప్పుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త పూర్తిగా ప్రపంచ వ్యాప్తంగా సాక్ష్యమిస్తుంది. ఈ అలంకారమగు మొగ్గలు లేకుండా, పువ్వులు లేదా దీపం ఉండదు. దీపవృక్షము యొక్క ప్రకాండములో బాదం పువ్వుల వంటి నాలుగు కలశములు ఉన్నవి, ఒక్కొక్కటి అలంకార మొగ్గ మరియు పువ్వుతో ఉంటాయి. మనం అలాంటి అలంకారమైన మొగ్గలుగా మారినప్పుడు మనలో ప్రతి ఒక్కరికి కేటాయించిన పాత్రను నెరవేర్చినప్పుడు, దేవుని సంఘము ప్రతిచోటా వృద్ధిచెందును మరియు అనేక ఆత్మలు వారి పాపముల నుండి రక్షించబడతారు. మనము దీపవృక్షము వైపు చూసినప్పుడు, ఒక అలంకారమొగ్గ పైన మరొక అలంకార మొగ్గ ఉందని, మరియు ఈ మొగ్గ పైన ప్రకాండము వెంట మరొక మొగ్గ ఉందని మనము చూడగలము. ఇలా, మీరు సువార్తను అందించడం ద్వారా, సువార్త పువ్వులు ఇప్పటివరకు వికసించాయి, మరియు ఈ లోకమంతట సువార్త ప్రకటించబడుతుంది. మీరు మరియు నేను ఈ అలంకార మొగ్గలం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వినడం నుండి ఈ సువార్తను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం వరకు ఈ రోజు వరకు, మనము అలంకార మొగ్గలుగా అనేకమైన పనులు చేశాము. ఈ విధంగా మీరు మీ పాప క్షమాపణను పొందవచ్చు మరియు దానిని ఇతరులకు కూడా వ్యాప్తి చేయవచ్చు.
ఈ అలంకార మొగ్గలు వలె మన యొక్క పాత్రలను నిర్వహించడానికి మనము వివిధ పనులు చేశాము. ఉదాహరణకు, శిష్య శిక్షణ మరియు ఆధ్యాత్మిక పరిపక్వత కోసం మేము రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రార్థనా మందిరాన్ని నిర్మించాము. ఈ శాండ్‌విచ్ ప్యానెల్ భవనాన్ని నిర్మించడానికి మాకు ఒక నెల పట్టింది. మేము విశ్వాసంతో ఈ భవనాన్ని నిర్మించినప్పుడు, “మా సోదరులు మరియు సోదరీమణులు ఆధ్యాత్మిక పరిపక్వత కోసం ఈ ప్రదేశానికి వస్తారు, మరియు నశించుచున్న అనేక ఆత్మలు మన సువార్త తరగతులకు వస్తారు, వాక్యాన్ని వింటారు మరియు పాప విమోచన పొందుతారు.” ఈ భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు మేము అనేక కష్టాలను ఎదుర్కొన్నా, మేము ఎల్లప్పుడూ ఈ ఆలోచనను మన మనస్సులో ఉంచుకుంటూ, అలాంటి ఇబ్బందులను తట్టుకుని, నమ్మకంగా విశ్వాసంతో పని చేస్తున్నాము. ఈ శిష్యత్వ శిక్షణ కేంద్రం ఎలా నిర్మించబడింది మరియు ఈ వెచ్చగా మరియు సౌకర్యవంతమైన ప్రదేశంలో మేము ఎలా ఆరాదించగలిగాము. ప్రతి అలంకార మొగ్గ పాత్రను నెరవేర్చిన వారి కారణంగా ఇది కూడా సాధ్యమైంది. మీరు మరియు నేను అలంకార మొగ్గగా మారినందున, ఈ చల్లని వాతావరణంలో కూడా మనము ఇప్పుడు వెచ్చగా ఆరాదించవచ్చు. అలంకార మొగ్గ లేకుంటే, ఈ సులభమైన పరిస్థితులు ఎన్నటికీ రాకపోవచ్చు. ఈ ప్రార్థనా మందిరం నిర్మించడానికి ముందు, ఈ ప్రదేశం కేవలం నిర్జనమైన అరణ్యముగా ఉండేది. దేవుని వాక్యాన్ని వినడానికి మేము ఇలాంటి కష్టమైన ప్రదేశంలో సమావేశమైతే, మీరు రావాలనుకుంటున్నారా? ఆరాధన చేయటానికి చలిగా ఉన్నందున,బహుశా మీరు ఇంటికి తిరిగి వెళ్లి ఉండవచ్చు.
అలంకార మొగ్గలు వాటి స్థానంలో ఉన్నందున, మనము సువార్త పువ్వును ఈ రోజు వరకు మాత్రమే వికసింప చేయలేక పోవుట కాదు గాని, భవిష్యత్తులో కూడా మనము దానిని కొనసాగించగలము.ఒక ప్రసిద్ధిగాంచిన ఒక కొరియా పద్యం పేరునకు “ప్రక్కన ఒక చామంతి``ఉన్నది మరియు అది ఇలా వెళ్తుంది,
ఒక చామంతి వికసించడానికి,
నైటింగేల్ వసంతకాలం నుండి అలా ఏడుస్తూ ఉండాలి.
ఒక చామంతి వికసించడానికి,
ఊరుములు తప్పనిసరిగా మేఘాలలో కదులుతాయి ... “
నిజానికి, చాలా మంది దేవుని సేవకులు మరియు చాలా మంది పరిశుద్ధులు అలంకార మొగ్గల యొక్క సువార్త వృక్షానికి జోడించబడ్డారు.నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వికసించటానికి, అటువంటి అలంకార మొగ్గల పాత్రను నిర్వర్తించు పనివారు ప్రతిరోజూ కష్టపడి పనిచేయుదురు. మరియు ఈ అలంకార మొగ్గలు క్రింద, దేవుడు ఈ బాదం పువ్వుల వంటి ఎక్కువ కలశములను ఉంచాడు, తద్వారా మనము అలంకార మొగ్గల పాత్రను మరింత మెరుగ్గా నిర్వర్తించగలము.మరియు దేవుడు తన కాలంలో మనపై తన కృపను అనుగ్రహించియున్నాడు, అలాగే ఏడు దీపాలకు నూనెను యిచ్చియున్నాడు. మన స్వంత శక్తితో మనం ఏమీ చేయలేమని తెలిసినా, మన ప్రభువు సంఘము ద్వారా తన కృపను మనకు ధరింపచేసాడు, తద్వారా సువార్తను అందించే అలంకార మొగ్గల పాత్రను మనం పూర్తి చేయగలము. కాబట్టి మీరు ఈ అలంకార మొగ్గలుగా మారడం అనగా మన స్వంత బలం ద్వారా ఈ సువార్తను ఒంటరిగా వ్యాప్తి చేయవచ్చని కాదు గాని. బదులుగా, దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనమందరం ఈ అలంకార మొగ్గలుగా మారడానికి కీర్తించబడుచున్నాము.
ఇప్పుడు పాపం నుండి విడుదల పొందిన వారు మరియు కొంతకాలం క్రితం దాన్ని పొందిన వారు అందరూ సువార్తను అందించే ఒకే అలంకారమొగ్గలు. వారి ఆధ్యాత్మిక స్థితిలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వారందరూ ఒకేలా ఉండటానికి కారణం మనలో ప్రతి ఒక్కరూ ఎలాంటి మినహాయింపు లేకుండా అలంకార మొగ్గలుగా పిలవబడుదురు. ఇతర పనులలో వేలు ఎత్తకుండా కేవలం ఆధ్యాత్మికంగా వాక్యాన్ని బోధించడం సరైన ఆధ్యాత్మిక జీవితం కానేరదు.నిజమైన ఆధ్యాత్మికత ఉన్నవారు సువార్తకు ప్రయోజనకరంగా ఉంటే ఏదైనా చేయగలరు. “ఇది నా యొక్క సంఘ హోదా, కాబట్టి నేను ఈ పనులు మాత్రమే చేస్తాను. మీరు ఇప్పుడు పాప క్షమాపణ పొందినందున, నేను నా పని చేసుకొన్నప్పుడు మీరు ఏ ఇతర పనులు చేయలేదా?” ఇది సరికాదు, సువార్తను అందించే విషయానికి వస్తే, ఇతరులకన్నాఎక్కువ తక్కువ అనువారు ఎవరు కాలేరు. మనమందరం ఐక్యముగా సువార్త వికసించే ఎరువుగా మారాలి.
తిరిగి జన్మించిన-పరిశుద్ధులు శరీరానుసారముగా ఎలా అనుసరించగలరు?
నా పాపములు క్షమించబడ్డాయి కావున నేను పాపము లేనివానిగా మారినందుకు నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నేను ధనవంతుడైతే మరింత సంతోషంగా ఉంటాను. నేను చివరకు సంపున్నునిగా జీవించగలిగితే మంచిది కాదా?"ఇప్పుడు అతని యొక్క ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కరించబడినందున శరీరంలో విజయం సాధించాలనుకునే వారు ఎవరైనా ఉన్నారా? నేను మొదట ప్రభువును కలిసినప్పుడు, నేను సువార్త కోసం ఒక ఖచ్చితమైన అలంకార మొగ్గగా మారడానికి ఆయన నన్ను కాపాడారని గ్రహించకుండా, వ్యాపారంలోకి వెళ్లి కొంత డబ్బు సంపాదించడం ద్వారా నేను ఈ పాత్రను నిర్వర్తిస్తానని అనుకున్నాను. నేను ప్రతిరోజూ సంఘానికి వెళ్తాను, సండే స్కూల్‌లో బోధిస్తాను, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను పిల్లలకు వ్యాప్తి చేసాను , చిన్న వ్యాపారాన్ని కూడా నిర్వహించాను మరియు రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తాను, నా రోజువారీ సంపాదనను నా సమర్పణగా సంఘముకు ఇచ్చేవాడను , మరియు ఈ విధంగా భౌతికంగా సేవ చేయడం ద్వారా సంఘం కట్టబడటానికి సహాయం చేయండి. వాస్తవానికి, నేను నా వ్యాపారంతో గడిపిన మిగితా కొన్ని గంటలు సమయాన్ని ప్రభువు కోసం పనిచేయాలని అనుకున్నాను.కానీ నా ఆలోచనలు ఎలా ఉన్నను, అలంకార మొగ్గగా నేను ఏ పాత్రను నిర్వర్తించాలి అని ప్రభువును అడిగినప్పుడు, డబ్బు సంపాదించడం ద్వారా నేను దానిని నెరవేర్చాలని ఆయన కోరుకోలేదు.
ఆ సమయంలో నా ఆలోచనలు తప్పు.దీన్ని చేయడానికి ప్రభువు నన్ను అనుమతించలేదు. కాబట్టి ఈ క్షణమే నేను నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వ్యాప్తి కోసం నన్ను నేను పరిచర్యకు పూర్తిగా అంకితం చేయడం ద్వారా సరైన అలంకార మొగ్గగా నా పాత్రను నెరవేరుస్తున్నాను. దేవునికి ఏది ప్రీతికరమో, మనం వాటన్నిటిని చేయాలి. ఒక పర్వతాన్ని తీసివేయమని ఆయన మనకు చెబితే, మనం దానిని తొలగించాలి. ఈ పర్వతాన్ని తీసివేయడం ద్వారా అనేక మంది ప్రజలు రక్షింపబడితే, మనము అలా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైనా పని నిస్సహాయంగా అసాధ్యంగా మరియు నిర్లక్ష్యంగా అనిపించినప్పటికీ, విశ్వాసం ద్వారా చేయమని దేవుడు మనకు చెబితే, అది ఆధ్యాత్మికంగా ప్రయోజనకరంగా ఉంటే, అది ఖచ్చితంగా సాధించబడుతుందని మనము నమ్ముతాము. మనము పర్వతాన్ని డైనమైట్స్ అను పేలుడు పదార్దముతో పేల్చివేయవచ్చును మరియు బుల్డోజర్‌లతో చెత్తను తొలగించెదము. అప్పుడు పర్వతం అదృశ్యమగును. ఎందుకంటే మన మానవ నిర్మిత ఆలోచనలను అనుసరించము కానీ ప్రభువు చిత్త ప్రకారము మాత్రమే, మరో మాటలో చెప్పాలంటే, దేవుని సువార్త కోసం విశ్వాసంతో అలంకార మొగ్గల యొక్క పాత్రను మనం ఎల్లప్పుడూ నెరేవేర్చుదుము. ఆయన అలంకార మొగ్గలుగా మనము మన పాత్రలను ఈ విధంగా నిర్వర్తిస్తాము.
సువార్త వ్యాప్తికి కొరకు మనం అలంకారమగు మొగ్గలుగా మారడానికి ప్రభువు మనల్ని తన సంఘం లోపల ఉంచాడు. మనం అలంకార మొగ్గలుగా ఉంచబడిన స్థలమొక్కటే వ్యత్యాసం, మరియు సువార్త వ్యాప్తి విషయానికి వస్తే, ఖచ్చితంగా మరొకదాని కంటే ఎక్కువ లేదా తక్కువ అనే ముఖ్యమైన ప్రదేశం ఉండదు. ఒకవేళ మనం ఆదేశాన్ని క్రమబద్ధీకరించవలసి వస్తే, మొదటి వారు చివరివారికి సేవ చేయుదుదురు, ప్రభువైన యేసు చెప్పినట్లుగా, “ఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెను" (మార్కు 9:35). అలంకారమైన మొగ్గల యొక్క పాత్రను నెరవేర్చమని ప్రభువు మనల్ని పిలిచినప్పుడు, మనం తడుముకోకుండా మనల్ని మనం చూచుకోకుండ ఉండునది ఆయన ఆశిస్తున్నది వాస్తవం కాదా? మనము అలంకార మొగ్గల యొక్క పాత్రను చక్కగా నెరవేర్చినప్పుడు, దీపవృక్షం మీద ఉన్న ఏడు దీపాల యొక్క కాంతి పరిశుద్ధ స్థలాన్ని ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది అటువలె ప్రభువు యొక్క కార్యములు అద్భుతంగా జరుగుతాయి.
నేటి వాక్యభాగములో ఇది ఇలా వ్రాయబడింది, “దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము." (నిర్గమకాండము 25: 38-40). దీపవృక్షము యొక్క పాత్రలలో సరిచేయబడిన దాని యొక్క ఒత్తులు ఉంచబడెను.వాటిలో నూనె పోయబడి ఆ ఒత్తులు వెలుతురుగా ఉండుటకై దీపవృక్షముపైన ఉంచబడెను. ఈ ఒత్తులు కాలిపోతున్నప్పుడు,మంటలు ఎగసిపడును,మరియు కత్తెరించబడిన ఒత్తులు మంటలు ఎగిసిపడుటకు ఉపయోగించెదరు. ఈ కత్తరించబడిన ఒత్తులు బంగారముతో చేయబడినవి. యాజకులు మండుతున్న ఈ ఒత్తులను కత్తెరించబడిన ఒత్తులతో సరిచేయబడును మరియు అవి పళ్ళెములో ఉంచబడెను.ఈ లాంటి పాత్రలు పరిశుద్ధస్థలములో తరచుగా ఉపయోగించబడును.
మన యొక్క పాపముల నుండి విడుదల పొందిన తర్వాత మనము అలంకార మొగ్గలగా ఉన్న పాత్రను నెరవేర్చినప్పుడు,కేవలం ఒక పనితో మనల్ని మనం ఎక్కువగా తీరిక లేక మన హృదయాలు మొద్దుబారిన సందర్భాలు ఉండవచ్చు. కాబట్టి మనం అప్పగించిన పనులను చాలా అలవాటుగా లేదా అర్ధహృదయంతో చేసే సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో, దేవుని సేవకులు దీపవృక్షము యొక్క ఒత్తుగా మారాలి. కాలిపోయిన ఒత్తి కత్తిరించబడినట్లుగా, దేవుని సేవకులు మనకు కేటాయించిన విధులను ప్రత్యామ్నాయంగా మార్చడం ద్వారా మన హృదయాలను పునరుద్ధరిస్తారు.మన ప్రభువు మన హృదయాలలో పనికిరాని చెత్తని తీసివేయును , తద్వారా మనము నూతన పరచబడిన హృదయాలతో సువార్త సేవను కొనసాగించ గలమని, వ్రాయబడింది, “ కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;”(2 కొరింథీయులు 5:17). దీని ద్వారా, సేవకులు తమ హృదయాలతో మరోసారి సువార్తను అందించడానికి ముందుకు వచ్చెదరు.
పరిశుద్ధస్థలం లోపల పరిశుద్ధమైన బంగారం కాక మరేమీ లేదని మీకు గుర్తుందా? విశ్వాసం ద్వారా నమ్మకమైన అలంకార మొగ్గగా మారడానికి, మీరు నిరంతరం ప్రభువు యొక్క కొత్త కార్యాల కోసం వెతకాలి. అప్పుడే మనం ఎల్లప్పుడూ విశ్వాసంతో జీవించగలం. ఈ రోజు మనం విశ్వాసం ద్వారా జీవించాలి, రేపు కూడా విశ్వాసం ద్వారా జీవించాలి. విశ్వాసం ద్వారా, మనము ప్రతిరోజూ అలంకార మొగ్గలు యొక్క నూతన బాధ్యతలను నెరవేర్చుదము. దేవుని సువార్త పనివారిమైన మనము కత్తెరించబడిన ఒత్తుల నుండి సమస్త పనికిమాలిన చెత్త తీసివేసి, దీపాలను కాయుచూ వాటిని ప్రకాశవంతంగా ప్రకాశింపజేయాలి మరియు వాటి వెలుగు ఎప్పుడూ ఆరిపోకుండా చేయాలి.
లోపల ఉన్న పరిశుద్ధ స్థలం మహిమాన్వితమైనది. ప్రభువు నీతిమంతులను దేవుని సంఘమునకు పిలిచి, వారిని పాప క్షమాపణ యొక్క సువార్తను వ్యాప్తి చేసే దీపవృక్షముగా మార్చును. దీనిలో, దేవుడు నాయకులను ఉంచాడు, నీతిమంతులందరికీ సువార్తను అందించేలా ఆయన వరములను అనుగ్రహించాడు మరియు సువార్త పువ్వులను తీసుకువచ్చే అలంకార మొగ్గలుగా మారడం ద్వారా ప్రభువుకు సేవచేసేలా ఆయన మనల్ని పిలిచారు. మనలో ప్రతి ఒక్కరికి అప్పగించబడిన ప్రదేశం నుండి వికసించవలెను. లోకమంతట పాపులందరికీ సువార్తను వ్యాప్తి చేయడానికి దేవుడు మనలను అనుమతించాడు. ఇది చాలా ఎక్కువ "ఎక్లెసియా", అనగా దేవుని సంఘము. మరో మాటలో చెప్పాలంటే, పిలువబడినవారు మరియు రక్షించబడినవారు కలిసి దేవుని సంఘమైన ప్రజలు. మన దేవుడు మన పాపములు మరియు అక్రమాలు నుండి మనల్ని విడిపించడం ద్వారా లోకము నుండి మనల్ని పిలవడం ద్వారా పాపం నుండి మనలను రక్షించాడు. మన ప్రభువు యొక్క రక్షణ ద్వారా, యేసుపై నమ్మకం ఉంచడం ద్వారా దేవుడు మనలను కాపాడాడు, మరియు మనం కలిసి సంఘటితమై సువార్తను అందించడానికి ఆయన ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సత్యమే పరిశుద్ధుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సంఘము ఎందుకు ఉనికిలో ఉందనగా నీరు మరియు ఆత్మ సువార్త యొక్క వెలుగును ప్రకాశింపచేయుటకై యున్నది
బంగారమును నైపుణ్యతతో ముద్దగా చేసి దీపవృక్షం ఏర్పడటానికి కారణం దేవుని సంఘము ఏకం చేయడం మరియు సువార్త పువ్వులు వికసించడం కొరకు. ఈ దీపవృక్షము దేవుని సంఘమును సూచిస్తుంది మరియు ఇది సమస్త చీకటిని వెలుగుగా చేయడానికి ఉనికిలో ఉంది. సంఘము ఉనికిలో ఉండటానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఇదే. మరల జన్మించడానికి మనకు సేవ చేయడానికి సంఘము మొదట అలంకారమొగ్గగా మారింది. ఇప్పుడు మన వంతుగా. మీరు మరియు నేను, మనపాపముల నుండి విడుదల పొందిన మనమందరం ఈ అలంకార మొగ్గలుగా మారాలి మరియు సువార్త పువ్వులు పూర్తిగా వికసించేలా మనమందరం అలంకార మొగ్గలుగాను మరియు ఎరువులుగా మన బాధ్యతలను నిర్వర్తించాలి. మనమందరం నీతిమంతులం మరియు దేవుని యొక్క సంఘమంత దీపవృక్షము యొక్క బాధ్యతను నిర్వహించాలి, ఇది ప్రపంచవ్యాప్తంగా సువార్త వెలుగును వ్యాప్తి చేస్తుంది మరియు ప్రభువును సేవించాలి.
మనము నూతన సంస్థను స్థాపించడానికి ప్రయత్నించడం లేదు. ఒకవేళ మనం మన సంస్థను తప్పనిసరిగా వర్ణించవలసి వస్తే, అప్పుడు అది యేసు యొక్క సంస్థయై ఉటుంది. మనము ప్రభువు సేవ చేయడానికి పిలువబడిన నీతిమంతులం. మనము దీపవృక్షం యొక్క అలంకార మొగ్గలుగా మారి ప్రభువుకు సేవ చేసినప్పుడు, ఆయన మన అవసరాలన్నింటినీ అలంకార మొగ్గలుగా నింపుతాడని మనం గ్రహించాము.మన అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యేకంగా మనం ఏదైనా ప్రయత్నించనప్పటికీ, దేవుడే మన అవసరాలన్నింటినీ సమృద్ధిగా సరఫరా చేయును. దేవుడు చెప్పినట్లుగా ప్రతిదీ సమయానికి సరఫరా చేయబడుతుంది, “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును‘’ (మత్తయి 6:33). ప్రభువు వారికి అవసరమైనవన్నీ సువార్తను అందించు నీతిమంతులకు సరఫరాచేయును. అలంకార మొగ్గల యొక్క బాధ్యతను నిర్వహిస్తున్న సేవకులు కష్ట సమయాలను ఎదుర్కొన్నప్పుడు, ప్రభువు వారికి శక్తిని ఇచ్చును, “ధైర్యంగా ఉండండి! నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను." అలంకార మొగ్గలకు విశ్వాసం లేనప్పుడు, ఆయన వారికి విశ్వాసం అనుగ్రహించును, “బలమైన విశ్వాసం కలిగి ఉండండి! నిన్ను బలపరిచే వానియందు నీవు సమస్తమును నా ద్వారా చేయగలవు." అటువలె ప్రభువు కృపను వారిపై సమృద్ధిగా కుమ్మరించును . దేవుడు ఆ సమస్యను తీర్చును, “నా అలంకార రూపమగు మొగ్గ, ఇది మీకు వాస్తవంగా అవసరమైనది. మీ కోసం నేను ఈ సమస్యను పరిష్కరించెదను.”ఆయన నీతి తివంతమైన కార్యాలకు మనల్ని అలంకార మొగ్గలుగా ఉపయోగించడానికి, దేవుడు అలంకార మొగ్గలుగా మారిన నీతిమంతులను ఆశీర్వదించును.
నీతిమంతులుగా మనం ఏమి చేసినా, సువార్త వికసించే అలంకార మొగ్గలుగా మనం తప్పని సరిగా పని చేయాలి. మన యొక్క విద్యార్థులు కూడా తమ పాఠశాల జీవితాన్ని సువార్త యొక్క అలంకార మొగ్గులుగా విశ్వసనీయంగా నడిపించబడాలి. మన సామాన్య విశ్వాసులు వారి యొక్క పని ప్రదేశాలలో తమ జీవనాన్ని సంపాదించుకోవడానికి, వారు కూడా సువార్త యొక్క అలంకార మొగ్గలుగా పని చేయాలి. మనం ఏది చేసినా, మనమందరం ప్రభువు యొక్క అలంకార సువార్త మొగ్గలుగా మారాలి. సువార్త యొక్క అలంకార మొగ్గల బాధ్యతను నిర్వర్తించడానికి నీతిమంతులమైన మనమందరం ఉనికిలో ఉంటూ బయటికి మన వాస్తవిక విశ్వాస జీవితాన్ని ఎలా జీవించాలో తప్పనిసరిగా చూపించవలెను. సువార్త యొక్క పువ్వులు వికసించడానికి అలంకార మొగ్గలు చాలా ముఖ్యమైనవి.
మనము పువ్వులం కాదని మీరు ఖచ్చితంగ గుర్తుంచుకోవాలి. సువార్త యొక్క పుష్పము యేసే.నిజమైన వెలుగు కూడా యేసే మనం చేయునదంతయు యేసుక్రీస్తు పై విశ్వాసం ద్వారా నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణము గల దారం మరియు సన్నని పేనిన నారలో వ్యక్తమయ్యే రక్షణ యొక్క ఈ సత్యాన్ని విశ్వసించడం ద్వారా ప్రపంచమంతటా సువార్తను బోధించడం మాత్రమే. ఇది 1 కొరింథీయులకు 10:31 లో వ్రాయబడింది, "కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి." అలంకార మొగ్గల యొక్క బాధ్యతను విశ్వాసముతో నెరవేర్చడం ద్వారా మన జీవితాలు ఈ సువార్త వ్యాప్తిని గురిగా పెట్టుకొనియున్నాము.
ప్రజలు తమ యవ్వనంలో ఎక్కువగా ఆందోళన చెందుతున్నది వారి భవిష్యత్తు గురించి. వారు ఆశ్చర్యపోతారు, “నా భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుంది? నా ప్రియమైన వ్యక్తి ఎక్కడ ఉన్నారు మరియు నా కాబోయే జీవిత భాగస్వామి ఏమి చేస్తున్నారు? నా భవిష్యత్తు జీవిత భాగస్వామి ఎక్కడ ఉన్నారు? ఆయన దేవుని సంఘములో ఉన్నవాడు, మరియు ఆయన యేసు క్రీస్తు తప్ప మరెవరో కాదు. అప్పుడు ఆయన ఏమి చేయును ? ఆయన వెలుగును ప్రకాశింప చేయును .ఆయన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వెలుగు. ఆయన ప్రభువైయున్నాడు, మరియు మీరందరూ క్రీస్తు వధువులు. ప్రభువు మిమ్మల్ని తన సంఘములోకి రమ్మని చెప్పుచున్నాడు, వాక్యం ద్వారా మిమ్మల్ని ఇక్కడ తన సంఘములో కలుసుకుంటానని చెప్పాడు. నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణము గల దారం మరియు సన్నని పేనిన నారతో వ్యక్తమయ్యే సత్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించడం ద్వారా మరియు దేవునికి మీరు ప్రార్థించినప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలువునని ప్రభువు చెప్పుచున్నాడు.
నీతిమంతులు తమ ఆలోచనలలో ఎల్లప్పుడూ మేల్కొని ఉండవలెను.నీ హృదయాన్ని నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో నింపినప్పుడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రతిరోజూ మేల్కొలుపుతుంది.నీతిమంతులు చేయాల్సిందల్లా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయడానికి పరిశుద్దాత్మ నడిపింపు ప్రకారం వారి జీవితాలను గడపడం. మనము అలా చేసినప్పుడు, ఆధ్యాత్మిక ఆలోచనల నుండి శరీర యొక్క ఆలోచనలను గ్రహించవచ్చు మరియు గుర్తించగలము.
బహుశా మీరు ఇంతకు ముందు ఉల్లిపాయను ఒలిచి ఉండవచ్చు, పొరల వారీగా. మొదట బయటి చర్మం ఉటుంది,మరియు మీరు దానిని తీసివేసినప్పుడు, మరొక పొర కనిపిస్తుంది, కొంత పచ్చగా కనిపిస్తుంది. మీరు ఈ పచ్చటి చర్మాన్ని తీసివేసినప్పుడు, తెల్లటి లోపలి పొర కనిపిస్తుంది. మీరు దీనిని ఒలిచినప్పుడు, మునుపటి చర్మం వలెనే మరొక తెల్లటి లోపలి చర్మం ఉంటుంది. మొత్తం ఉల్లిపాయ ఒకదాని తర్వాత ఒకటి తెల్లటి పొరలతో తయారు చేయబడింది. అది ఒలిచినప్పుడు మరియు దాని తెల్లటి లోపలి చర్మం బహిర్గతమైనప్పుడు, కాలక్రమేణా ఈ బహిర్గత పొర పసుపురంగు చర్మంగా మారుతుంది. కానీ ఈ చర్మం ఒలిచినప్పుడు, తెల్లటి లోపలి చర్మం మరోసారి కనిపిస్తుంది . కొంత సమయం తరువాత, ఈ లోపలి చర్మం మరోసారి బయటి చర్మంగా మారుతుంది, కనుక పెళుసైన పొరను పొందడానికి మీరు దాన్ని మరల తీసివేయాలి.
మన యొక్క శరీరమనునది ఒక ఉల్లిపాయ పొరల వంటిది, కాబట్టి మనం ప్రతి రోజూ మన శరీరానికి సంబంధించిన ఆలోచనలను తొలగించుకోవాలి. ఇప్పుడు మీరు ఇలా అనుకోవచ్చు, “నేను రక్షింపబడినప్పుడు నన్ను నేను ఉపేక్షించుకొనియున్నను, కానీ మరల పాప క్షమాపణ పొందిన తర్వాత కూడా నన్ను నేను మరల ఉపేక్షించుకోవాలా? గతసంవత్సరం నేను ఎన్నిసార్లు నన్ను నేను ఉపేక్షించుకొనుచున్నానో మీకు ఏదైనా అవగాహనా ఉన్నదా ? ఇప్పుడు నా హృదయాన్ని లోపరచటం చాలా కష్టంగా ఉంది,ఇప్పుడు నేను మరల అలా చేయాలా? ఇది చాలా కష్టం!" కానీ, సోదరీ సోదరీమణులారా, మీరు మీ శరీరము యొక్క ఆలోచనలను ఇలా తొలగించడం సరైన విషయమే.మనము ఉల్లిపాయ తొక్కలను తొలగించునట్లుగా శరీరపు ఆలోచనలను తొలగించడానికి ఇది సూత్రం మరియు సరైన మార్గం అని ప్రభువు మనకు చెబుతున్నాడు.
మన ప్రభువు వ్రాతపూర్వక వాక్యం ద్వారా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఆయన సన్నిధి రొట్టెల బల్ల వద్ద, దీప వృక్షము వద్ద, ధూపవేదిక బలిపీఠం వద్ద మరియు కరుణపీఠం యెదుట మమ్మల్ని కలవాలనుకుంటున్నాడు.నేను ఇక్కడ చెప్తున్నది ఏదనగా నిజానికి మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవటానికి బలవంతం చేయబడుట కాదు అలాగే విశ్వాసమున్నట్లు నటించుట కాదు, కానీ విశ్వాసం ద్వారా మిమ్మల్ని మీరు స్వతగా హృదయపూర్వకంగా ఉపేక్షించుకోవాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడం మంచిదని ప్రభువు సూచించడమే కాదు,మీరు తప్పక అలా చేయాలని ఆయన చెప్పుచున్నాడు. మీరు మీ హృదయాలలో మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ మనస్సులను మలచుకున్నప్పుడు, స్వీయ-తిరస్కరణ దానికదే సాధించబడుతుంది. మీకు తెలియకుండానే అది స్వయంగా చేరుకుంది,"ఆహా, కాబట్టి నన్నునేను ఎలా కాదనగలను. "అయితే ప్రాథమిక సూత్రాలు బోధించక ప్రజలు వారి ఇష్టాన్ని వంచడానికి బలవంతం చేయబడితే, అది సాధించడం అసాధ్యం మాత్రమే కాదు గాని , వారు తమ విశ్వాసాన్ని కూడా కోల్పోతారు.
మనం మన హృదయాలను సరిచేసుకొని ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఆనందిస్తాడు. మనం ప్రభువును సంతోషపరిచినట్లైతే, అప్పుడు మన శరీర ఆలోచనలను తప్పని సరిగా అదుపులో ఉంచుకొందుము. వాస్తవానికి, మనకు అందుబాటులో లేని కొన్ని విషయాలు ఉన్నాయి,కానీ వాటిని సాధించడానికి మనము తీవ్రంగా ప్రయత్నిస్తాము. పరిస్థితి ఇది కాదా? ప్రభువు మనలను రక్షించి, మనల్ని తన పనివారిగా చేసుకున్నందున, మనం చేయలేనిది ఏదీ లేదు, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా,"నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్పీయులు 4:13). అంతేకాక, సువార్త యొక్క పువ్వులు వికసించేటప్పుడు, మనం అన్నిటికన్నా చిన్న అలంకార మొగ్గగా మారినప్పటికీ, ఆ వికసించడం అనునది అద్భుతంగా ఉంది. అప్పుడు మనం చేయగలిగింది ఏమి లేదు? ప్రభువు యొక్క సువార్త పువ్వులు వికసించేటప్పుడు లేదా ఆత్మలను రక్షించేటప్పుడు, మనం అన్ని అలంకార మొగ్గలలో కూడా చిన్నవాడిగా మారితే, మనం ఆయన అలంకార మొగ్గలుగా మారలేమా? వాస్తవానికి మనం చేయగలం.
మనం కచ్చితంగా మన హృదయాలలో మన యొక్క విశ్వాసాన్ని మనం వెంటనే అంగీకరించాలి. మనం చేయాల్సిందల్లా సరైనది ఏదో గుర్తించి, "అవును, అది సరైనది"అని చెప్పడం మరియు తప్పును తప్పుగా ఒప్పుకోవడం, "లేదు, నా ఆలోచనలు తప్పు. నాదే పొరపాటు." ఇది తప్ప మరెవరూ ప్రభువును అనుసరించడం లేదు, స్వయమును ఉపేక్షించుకోవడం మన స్వంత ఇష్టాన్ని అణచుకోవడం. మన స్వంత శరీర కోరికలను తగ్గించుకున్నప్పుడే, మన ప్రభువు మనల్ని మారుస్తాడు. ఏదేమైనను, మనల్ని మనం మార్చుకోలేము. ఆధ్యాత్మిక వ్యక్తిగా మారడం అనేది మన స్వంత ప్రయత్నాల ద్వారా సాధించేది కాదు. మనం చేయవలసింది దేవుని వాక్యం ముందు మనల్ని మనం సరిచేసుకోవడం లేదా తప్పును గమించడం, ఒకవేళ మనం తప్పు చేస్తే, మనం చేయాల్సిందల్లా మనల్ని మనం ఒప్పుకోవడం, అవును, ప్రభూ! మీరు మాత్రమే తగినవారు , నేను తప్పిదములు కలిగిన వాడను."మనము దీనిని చేసిన వెంటనే, మన హృదయాలలోని చీకటి తొలగిపోతుంది. అప్పుడు ప్రభువు మనతో ఇలా అంటాడు,“మీరు నేను అలాంటి జీవులం కావున, నేను మీ పాపాలన్నింటినీ తొలగించాను.నేను నిన్ను వెలుగులోకి నడిపించితిని."మన ప్రభువు మనకుచెప్పుచున్నాడు,"సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా ``(ఎఫెసీయులు 5:13).
మన స్వంత ఉద్దేశముతో మనం ఏమీ చేయలేము.మనం చేయాల్సిందల్లా పరిశుద్ద స్థలంలో విశ్వాసం ద్వారా జీవించడం. విశ్వాసంతో మనం పరిశుద్ద స్థలంలో నివసిస్తున్నప్పుడు, ప్రభువు మనలో పనిచేయును.మనల్ని మరింత విలువైన అలంకార మొగ్గలుగా చేయడానికి, దేవుడు మనకు మరింత కృప మరియు సమృద్ధి ఆశీర్వాదాలనుఅనుగ్రహించును. దేవుడు మన ద్వారా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయాలని నిజంగా కోరుకుంటున్నందున, ఆయన మనకు మరిన్ని ఆశీర్వాదాలు ఇవ్వలేడు. మీరందరూ ఈ సత్యాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నాను. మీరు దేవుని యొక్క అన్ని వాక్యాలను నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. నీవు నమ్ముతున్నావా ? ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా మీరు "అవును" అని సమాధానం ఇస్తే, మీ విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం యొక్క సామర్ధ్యం ఏమిటనగా, స్వయంగా, ఎవరూ ఏమీ నేర్చుకోలేరు.
సేవకులు అలంకార మొగ్గలుగా ఉన్నారు,అలాగే మన సోదర సోదరీమణులందరూ. "మీరు ఒక వికారమైన అలంకారమగు మొగ్గ. కానీ నేను ఒక అందమైన మొగ్గ. ” మీలో ఎవరూ వాస్తవంగా ఈ విధంగా ఆలోచించరని నాకు తెలుసు, కానీ అలాంటి ఆలోచనలు మీపైకి వచ్చినప్పుడు, మీరు తప్పని సరిగా తిరిగి దేవుని యొక్క మనస్సు నుండి వ్యతిరేక దిశలో కదులుతున్నారని గ్రహించి, బహుమతి కోసం అర్ధంలేని అందాల పోటీలో అలంకార మొగ్గులుగా ఇతర పరిశుద్దలుతో పోటీపడడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? కొన్ని అలంకారమగు మొగ్గలు ఎంత మంచివిగా అనిపించినా, వాటిలో ఏదైనా పువ్వు కంటే నిజంగా అందంగా ఉండగలవా? అలంకార మొగ్గలు పువ్వు కంటే ఎక్కువగా కనిపిస్తే, పువ్వు పనికిరానిదిగా మరియు అందహీనమైన పువ్వుగా మారును. ఒక గోడను నిర్మించడానికి చిన్న మరియు పెద్ద ఇటుకలు రెండూ ఎంత అవసరమో, దేవుని యొక్క సువార్త పువ్వులు వికసించే అలంకార మొగ్గలు మంచివో లేదా చెడ్డవో మనందరికీ అవసరమైనవి.
కావునా, మనం గర్వముతో ఒకరికొకరు అజ్ఞానులుగా ఉండకూడదు. మనమందరం విలువైనవారమని గ్రహించి, ఒకరినొకరు శ్రద్దకలిగి ఉందాము. ప్రతి ఒక్కరూ విలువైనవారే. ప్రతి ఒక్కరూ అవసరమైనవారే. దేవుడు మోషేకు ఆజ్ఞాపించునట్లుగా మేలిమి బంగార యొక్క నైపుణ్యత కలిగిన సుత్తితో దీపవృక్షము చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, రక్షణ నియమంతో మనలను నీతిమంతులుగా మార్చాడు మరియు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను అందించే అలంకార మొగ్గలుగా చేశాడు. కాబట్టి దేవుడు మన ద్వారా తన సువార్తను వ్యాప్తి చేయడానికి సంతోషిస్తాడు. ఇప్పుడు కూడా, దేవుడు తన సంఘం ద్వారా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మానవాళికి వ్యాపిస్తున్నాడు. మరియు ఈ సువార్త యొక్క దాని అలంకార మొగ్గలను వ్యాప్తి చేయడం ద్వారా, దేవుడు తన యొక్క సత్య ప్రేమతో ప్రపంచమంతటికి ప్రకాశింపచేయాలని కోరుకొంటున్నాడు.
హల్లెలూయా!