• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 11: ప్రత్యక్ష గుడారం

[11-30] ప్రధానయాజకుని యొక్క వస్త్రములలో దాగియున్నఆధ్యాత్మిక అర్థాలు (నిర్గమకాండము 28: 1-43)

(నిర్గమకాండము 28: 1-43)
“మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈ తామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము. పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారను తీసికొని బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను. రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజ ఖండములు దాని కుండవలెను; అట్లు అది సమ కూర్పబడియుండును. మరియు ఏఫోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్న నారతోను కుట్టవలెను. మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజముల మీద యెహోవా మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము చేయవలెను. ఏఫోదుపని వలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను. దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది; పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది;రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరుల చొప్పున పండ్రెండుండవలెను. ముద్ర మీద చెక్కిన వాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలెను.
మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు రెండు బంగారు ఉంగర ములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజ భాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లు నప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెన మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును. మరియు ఏఫోదు నిలువు టంగీని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను.అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రమువలె దాని రంధ్రము చుట్టు నేత పనియైన గోటు ఉండవలెను. దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగీ చుట్టు తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువు టంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను. సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను.అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచలెను. మరియు వారి మానమును కప్పు కొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించు నప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.”


ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ

ఈ రోజు మనం ప్రధాన యాజకుని వస్త్రధారణలో దాగి ఉన్న ఆధ్యాత్మిక అర్థాలను చూద్దాము. ఈ వస్త్రాలు అహరోను మరియు అతని కుమారులకు మాత్రమే ధరింపచేయాలి. ప్రధానయాజకుని వస్త్రధారణ ద్వారా మనలను పాపం నుండి రక్షించిన దేవుని యొక్క ప్రణాళికను విశ్వాసం ద్వారా గుర్తించగలము.
దేవుడు తన సోదరుడు అహరోను మరియు అహరోను యొక్క కుమారులను దేవుని సేవచేసే యాజకులుగా పవిత్రం చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. మరియు దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం వారికి వస్త్రాలను తయారు చేయమని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు.
4వ వచనంలో, దేవుడు ఇలా అన్నాడు,"పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు.అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.”
మొదటిగా, ప్రధాన యాజకుడు తన దిబింగరతను కనపడకుండా ఉండటానికి అంగీయు మరియు పొడవాటి నిలువుటంగీ ధరించవలసి వచ్చింది. ఈ వస్త్రాలు సన్నని నార దారంతో తయారు చేయబడ్డాయి, తద్వారా గాలి బాగా ప్రసరించబడుతుంది మరియు అందువల్ల అతనికి ఎక్కువ చెమట పట్టకుండా ఉంటుంది. దీని యొక్క ఆధ్యాత్మిక అర్ధం ఏమిటంటే, ప్రధాన యాజకుడు తన యొక్క శరీర ప్రయత్నాలను విడిచి, దేవుడు అనుగ్రహించిన విశ్వాసం మరియు కృపను అనుసరించి సేవ చేయాలి. మరో మాటలో చెప్పాలంటే, ప్రధాన యాజకుడు తన స్వంత ఆలోచనలను మరియు శరీరము యొక్క భక్తిని పక్కనపెట్టి, విశ్వాసంతో దేవుడు స్థాపించిన బలివ్యవస్థ ప్రకారం ప్రాయశ్చిత్తాన్ని అందించినప్పుడు మాత్రమే దేవుని ఉద్దేశం నెరవేరుతుంది.ఈ ఉద్దేశ్యంతోనే దేవుడు ప్రధానయాజకుని యొక్క అంగీయు మరియు పొడవాటి నిలువుటంగీ ద్వారా అతను ధరింపచేయబడ్డాడు.
ఈ వస్త్రాల పైన దేవుడు ప్రధానయాజకునికి నీలిరంగు వస్త్రాన్ని ధరింపచేసెను. మరియు నీలిరంగు వస్త్రం మీద, అతను తన ఏఫోదును ధరించెను, తరువాత న్యాయపతకము ఉంచబడియున్నది.ప్రధాన యాజకుని రొమ్ముపైన ఉంచబడిన న్యాయ విధాన పతకము రెండేసి మడతలతో తయారు చేయబడింది మరియు బంగారం, నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో నైపున్యంగా పేనబడింది మరియు దాని పరిమాణం దాని పొడవు మరియు వెడల్పు రెండింటిలోనూ అలానే ఉంటుంది. ఈ న్యాయవిధాన పతకము మీద పన్నెండు విలువైన రాళ్ల ఉంచబడును, ఈ విలువైన రాళ్లలో ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాల పేర్లు చెక్కబడ్డాయి.
ఆ తర్వాత అతను నేసిన నారతో చేసిన తలపాగాను ధరించును.మరియు స్వచ్ఛమైన బంగారు పలకపై, "ప్రభువు పరిశుద్దుడు"అనే పదాలు చెక్కబడ్డాయి, తలపాగా ముందు భాగంలో జతచేయబడిన నీలిరంగు త్రాడుపై ఉంచబడింది. ఇవి ప్రధాన యాజకులు ధరించిన వస్త్రాలు, తలపాగా మరియు బంగారు పలక యొక్క సంక్షిప్త వివరణలు.
ప్రధానయాజకుడు యొక్క వస్త్రాలు ఎక్కువగా బంగారం, నీలం, ఊదా, మరియు రక్తవర్ణపు దారం మరియు సన్నని పేనిన నారతో తయారు చేయబడ్డాయి. మరియు ప్రధాన యాజకుని న్యాయ విధానపతకము కూడా అలాగే చేయబడింది. ఈ పతకము మీద, పన్నెండు విలువైన రాళ్లు అమర్చారు, మరియు ఈ రాళ్లలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పన్నెండు గోత్రికుల పేర్లు చెక్కబడ్డాయి.
ప్రధానయాజకుడు యొక్క బాధ్యత ఈ క్రింది వాటిని అనుసరించవలసి యున్నది:అతను ఇశ్రాయేలీయుల సమాజపు ప్రజల నుండి వారి త్యాగపూర్వకమైన సమర్పణలను తీసుకొని,వారిప్రతినిధిగా వారి యొక్క పాపములను వారి తలలు పై చేతులుంచి వారి పాపాలను ఈ ప్రాయచిత్తపు బలిపశువు పై పంపించవలెయును,దానిని చంపి, దాని రక్తమును పాప పరిహారార్థ బలిగా దేవునికి అర్పించవలెను. మరో మాటలో చెప్పాలంటే,ప్రధాన యాజకుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నైవేద్యం అర్పించడం ద్వారా తన ప్రజల యొక్క పాపములను పరిహరించేందుకు సేవకునిగా పని చేయును. ఇశ్రాయేలు ప్రజల తరఫున, ప్రధాన యాజకుడు దేవుని యెదుట బలి అర్పణ తలపై చేతులు వేసి, దాని గొంతు కోసి, దాని రక్తం తీసి, ఈ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములపై ప్రోక్షించును. తర్వాత అతను దాని రక్తమును అతిపరిశుద్ధస్థలములోనికి తీసుకొని, కరుణపీఠముయెదుట చిలకరించును.
 అప్పుడు చనిపోయిన వాటి యొక్క నైవేద్యపు మాంసాన్ని పూర్తిగా కాల్చివేయడానికి శిబిరం వెలుపల తీసుకువెళ్లాలి (లేవీయకాండము16: 3-28). ప్రధానయాజకుడు ఈ విధంగా అర్పణ అర్పించును. ఈ విధంగా, దేవునికి ఇష్టమైన నైవేద్యం అర్పించటం ద్వారా, ప్రధాన యాజకుడు దేవుని యొక్క కోపాన్ని శాంతింపజేయడానికి తన యొక్క బాధ్యతను నెరవేర్చును, మరో మాటలో చెప్పాలంటే, ప్రధాన యాజకుడు తన యొక్క ప్రజలకు మరియు దేవునికి మధ్య మధ్యవర్తి బాధ్యతను నెరవేర్చును.
ఈ విధంగా, మెస్సయ్యయైన యేసు పరలోక రాజ్యానికి ప్రధాన యాజకుడిగా ఉండి, దేవునికి మరియు మానవజాతికి మధ్యవర్తిగా బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి ఆయన బాప్తీస్మం స్వీకరించడం ద్వారా అయన మానవజాతి యొక్క పాపములను తన శరీరంపై తీసుకున్నాడు.మరియు సిలువపై తన శరీరాన్ని అర్పించుకొని, బలిగా అర్పించటం ద్వారా, మెస్సయ్యగా మానవజాతి యొక్క సమస్త పాపం మరియు మరణం నుండి విడిపించాడు. పాత నిబంధన కాలములో , ప్రధాన యాజకుడు తన ప్రజల పాపములను క్షమించే అర్పణ అర్పించాడు, కానీ కొత్త నిబంధన కాలములో, మెస్సయ్య యేసు నామముతో వచ్చి పరిచర్యను నెరవేర్చి శాశ్వత ప్రధాన యాజకుడిగా మానవజాతి యొక్క సమస్త పాపములను తొలగించాడు (హెబ్రీయులు, అధ్యాయాలు 7-9).
మరియు క్రొత్తనిబంధన యొక్క ఈ కాలములో, నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారంలో దాగి ఉన్న సత్యంతో వారి పాపాలన్నీ కడిగివేయబడిన నీతిమంతులకు మాత్రమే దేవుడు ప్రధాన యాజకుని యొక్క పరిచర్య విధానమును అప్పగించియున్నాడు. అందుకే ప్రధాన యాజకుడు తన తలపాగాపై ఉన్న బంగారు పలకపై "ప్రభువు పరిశుద్దుడు"అను గుర్తు ముద్రించబడింది. ఇలా, ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ మానవజాతి యొక్క పాపాలన్నింటినీ శుద్ధిచేసిన సువార్తను స్పష్టంగా చూపిస్తున్నది.
ప్రధాన యాజకుని వస్త్రము నీలిరంగు దారంతో అల్లినది. అన్నిటిని మించి, ఈ నీలిరంగు వస్త్రం యేసు అందుకున్న బాప్తిస్మమునకు సంబంధించినది. ప్రధాన యాజకుడు నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, అలాగే బంగారు దారంతో పేనిన వస్త్రాలు ధరించినందున,అతని వస్త్రాలు అద్భుతంగా ఉన్నాయి మరియు నాలుగు రంగులు స్పష్టంగా కనిపించేలా చేయబడ్డాయి.నీలిరంగు వస్త్రం యొక్క అంచు వద్ద, దానిమ్మలు అల్లికచేయబడినవి,వాటి వైపు బంగారు గంటలు జోడించబడ్డాయి.33వ వచనం యొక్క ముఖ్యభాగము ఇలా చెప్పుచున్నది, "మరియు దాని అంచు మీద నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దానిమ్మపండులను, వాటి చుట్టూతా మరియు మధ్యను బంగారు ఘంటలను తయారు చేయాలి." కావున ప్రధాన యాజకుడు ప్రత్యక్షపు గుడారంలోకి ప్రవేశించి, తన ప్రజల కొరకు అర్పణ అర్పించునప్పుడు, బయట నిలబడి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు గంట శబ్దం వినిపిస్తూ ఉండగా అతను ఆ అర్పణ అర్పిస్తున్నట్లు తెలుసుకుందురు.
కొత్త నిబంధనలోని నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యానికి సంబంధించిన వన్నీ ఒకదానితో ఒకటి సరిపోలును. ప్రధాన యాజకుడు చేయు పని ఏదనగా ప్రజల యొక్క పాపములను శుద్దిచేయడం, మరియు అటువంటి దుస్తులను ధరించడం దేవుని యొక్క చిత్తాన్ని అతను తెలుసుకొనిఈ బాధ్యతను నెరవేర్చడానికి. క్రొత్త నిబంధన కాలములో, నేటి యాజకులుగా ఉన్న దేవుని యొక్క ప్రజలు ఇతరుల పాపాలను శుద్దిచేయడానికి చేయడానికి ఏమి చేయుదురు? వారు ఈ పనిని నిర్వర్తించాలంటే, వారు ముందుగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా నీలి,ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారములో తెలియజేయబడిన ప్రత్యక్షత యందు వారి పాప క్షమాపణను స్వీకరించాలి. ఇలా, ప్రధానయాజకుని యొక్క వస్త్రాలు మన పాపములన్నిటిని శుద్ధిచేయు సువార్తను స్పష్టంగా చూపును.
మరియు రెండవది, ఈ ప్రస్తుత కాలములో, ప్రజల యొక్క మనస్సాక్షిని వారి పాపములను శుద్ధిచేసి వారికి పరిశుద్దతను ఇవ్వడానికి నీతిమంతులమైన మనం మన యొక్క యాజకుని బాధ్యతలు నిర్వర్తించాలి. అందుకే ప్రధాన యాజకుని యొక్క అంగీ కోసం బంగారు పలకను తయారు చేశారు మరియు "ప్రభువు పరిశుద్దుడు" అనే గుర్తు పలకపై చెక్కబడింది.
ప్రధానయాజకుని తలపై ధరించిన తలపాగాకు నీలి త్రాడుతో "ప్రభువు పరిశుద్ధుడు" అని చెక్కబడిన ఈ బంగారు పలకను జత చేయుదురు. ప్రజలు మొదటి చూడగానే ప్రధానయాజకుని గుర్తించగలరు; అతని యొక్క తలను చూసి, నీలం, ఊదా,రక్తవర్ణముగల, బంగారు దారము మరియు సన్నని పేనిన నారతో చేసిన అందమైన బాహ్య వస్త్రాలతో పాటు బంగారు పలక మరియు నీలిరంగు త్రాడు స్పష్టంగా కనిపించును. ప్రధాన యాజకుడు ఎల్లప్పుడూ నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారంతో పాపమును శుద్ధిచేసి పనిని చేయుట ఇది మనకు చూపుతుంది.


నీవు తప్పని సరిగా దేవుని సేవకులు యొక్క న్యాయ తీర్పుకు లోబడాలి

ప్రధానయాజకుడు పరిశుద్ద స్థలంలోకి ప్రవేశించినప్పుడు అతని హృదయంపై నున్న తీర్పు యొక్క న్యాయ విధాన పతకం మీద ఇశ్రాయేలు కుమారుల యొక్క పేర్లను ధరించవలసి వచ్చింది. అదే విధంగా దేవుణ్ణి తమ హృదయములో స్వీకరించాలని ఆశించే లోకములోని పాపుల యొక్క ఆత్మలను కూడా మన హృదయాలలో, వారి కోసం మనం ప్రార్థించాలి. ప్రధానయాజకుడు ధరించిన న్యాయ విధాన పతకంలో ఊరీము మరియు తుమ్మీము అని పిలువబడే రెండు విలువైన రాళ్లను ఉంచమని దేవుడు మోషేకు చెప్పాడు. ఈ రోజు చదవబడుచున్న లేఖన భాగము 30 వ వచనం ఇలా చెబుతోంది,“మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము మరియు తుమ్మీము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును. ”
ఊరీము మరియు తుమ్మీము యొక్క విలువైన ఈ రాళ్ళు అక్షరాలా "వెలుతురును మరియు పరిపూర్ణత" అనియు అర్ధం. మరో మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలకు నీతిగా మరియు సరియైన పద్దతితిలో తీర్పు చెప్పడానికి దేవుడు ప్రధాన యాజకునికి జ్ఞాన హృదయాన్ని యిచ్చియున్నాడు. దేవుడు ప్రధాన యాజకుడికి అధికారంతో పాటు వివేకమును అనుగ్రహించియున్నాడు, దీని ద్వారా అతను తన ప్రజల యొక్క జీవితాలలో సరైన తప్పు ఏమిటో గ్రహించగలడు.మరియు ప్రధానయాజకుడు ఇశ్రాయేలీయుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో ఏది సరైనది ఏది తప్పు అని నిర్ణయించే బాధ్యతను కలిగి ఉన్నాడు.
ఈ యుగంలో కూడా దేవుడు ఏది మంచి ఏది చెడో తెలుసుకొని నిర్ధారించడానికి అటువలె పాపముల నుండి విడుదల పొందియున్నాడో లేదో తెలుసుకోవడానికి ప్రతి సేవకునికి దేవుడు ఒక నిర్దిష్టమైన సామర్థ్యాన్ని యిచ్చియున్నాడు. దేవుడు ఇచ్చిన ఈ సామర్ధ్యం, ఆయన యొక్క సేవకులుగా సత్య సువార్త అంటే ఏమిటి, పాపం యొక్క నిజమైన విడుదల ఏమిటో, దేవుని పిల్లలుగా జీవించవలసిన ధర్మబద్ధమైన మార్గం ఏమిటో, తిరిగి జన్మించిన వారు ఎవరైనా ఉన్నారా లేదా అనే దానిపై సరైన తీర్పునిచ్చెదరు. అందువల్ల, దేవుని యొక్క ప్రజలందరూ ఆయన తీర్పులను మరియు నాయకత్వాన్ని పాటించవలసి ఉంటుంది. దేవుని యొక్క సేవకుల సరైన తీర్పును అంగీకరించడానికి నిరాకరించడం దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించడాన్నినిరాకరించినట్లే అని వారు గ్రహించాలి. కావున ఇశ్రాయేలు ప్రజలు నేటి ప్రధాన యాజకులైన దేవుని సేవకుల యొక్క తీర్పుకు లోబడవలసి వచ్చింది.
అదే విధంగా, ఈ ప్రస్తుత యుగంలో, దేవుడు తన సేవకులకు "తప్పు ఒప్పును" నిర్ధారించే బాధ్యతను అప్పగించాడు. అందుకని, ఆయన యొక్క సంఘ నాయకులు ఏమి చేసినను అది మనం గౌరవించాలి మరియు వారి పనులతో మన యొక్క హృదయాలను ఏకం చేయబడాలి.మన హృదయ లోతుల నుండి విశ్వాసం ద్వారా వారి సరైన తీర్పులు మరియు నాయకత్వాన్ని అనుసరించడం మాత్రమే సరైనదని మనం గ్రహించాలి. మనం కేవలం "ప్రధానయాజకులుగా నియమించబడినందున అతను అలా చేస్తున్నాడు,కానీ చివరికి అతను మనలాగే ఉంటాడు"అని మనం అనుకోకూడదు. కొంతమంది అనుకోవచ్చు, “నా పాస్టర్ గారి పాత్ర నాకు నచ్చలేదు! అతని వ్యక్తిత్వం చాలా అత్యాశకలిగినది; అతని నిర్ణయం కూడా కఠినంగా ఉంటుంది. కావునా అతను బోధించే సువార్తను నేను విశ్వసిస్తున్నప్పటికీ, అతని ఆలోచనా విధానాలలో అతను తీసుకునే నిర్ణయాలతో నేను ఏకీభవించలేను. నేను అతనికి వేరుగా నేను మరొక ఉద్దేశ్యాన్ని కూడా కలిగి ఉండెదను.” ప్రధానయాజకులను వారి యొక్క శారీరక దృష్టితో చూడటం ద్వారా ప్రజలు తప్పుడు నిర్ణయాలకు రావచ్చు. కానీ అలాంటి తప్పుడు తీర్పును నుండి తప్పించబడాలి.
మనం దేవునికి విధేయత చూపుతున్నట్లుగా నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారాన్ని రక్షణగా విశ్వసించే దేవుని యొక్క సేవకులకు మనం లోబడాలి. ఎందుకు? ఎందుకంటే వారి యొక్క తీర్పు వారి స్వంత ఆలోచనల నుండి తీసుకరాబడింది కాదు గాని, అది దేవుని సంతోషపెట్టే వారి యొక్క విశ్వాసం ప్రకారం చేయబడుతుంది. మరొక విదంగా చెప్పుకున్నట్లైతే, నేటి ప్రధానయాజకులు యొక్క తీర్పు దేవుని యొక్క వెలుగులో మరియు సత్యంలో జరుగుతుంది, అది దేవుని యొక్క తీర్పు మరియు ఆయన నిర్ణయమైయున్నది. వారి స్వంత మితిమించిన కొద్దో గొప్ప ఆలోచనల ద్వారని నుండి కాక, అవి కేవలం దేవుని యొక్క వాక్యంపై ఆధారపడి ఉండును అటువలె నీరు మరియు ఆత్మ యొక్క సువార్త విశ్వాసం ప్రకారం, వారు చేరుకున్న తీర్పు సరైనది. ఒకవేళ అలాంటి నిర్ణయాలు దేవుని యొక్క వాక్యం మరియు ఆయన చిత్తం నుండి వైదొలగకపోతే,వారి నిర్ణయాలు దేవుని నిర్ణయాలు అని మనం నమ్మాలి.
ఈ విధంగా,ప్రధాన యాజకుల యొక్క విధులు ప్రజలకు చాలా ముఖ్యమైనవి. పాత నిబంధన కాలములోను ఈ ప్రస్తుత కాలంలోను, దేవుని యొక్క ప్రజలను నడిపించేవాడు ప్రధాన యాజకుడే. ఇశ్రాయేలీయలలో,ప్రధానయాజకుని కాకుండా దేశాన్ని నడిపించగల రాజు మరొకరు లేరు. ఇశ్రాయేలీయల యొక్క రాజకీయ వ్యవస్థ నిజానికి దైవికమైన పరిపాలన కావున, పూర్తి జనాభా ప్రధానయాజకులు తీసుకోను నిర్ణయాలను అనుసరిస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యవహారాలలో,దేవుని యొక్క ప్రజలు ఆయన సంఘములో దేవుని వాక్యం కొరకు నియమించబడిన సేవకుల యొక్క మార్గదర్శకత్వాన్ని కూడా మనం విశ్వసించాలి మరియు అనుసరించాలి.మరియు ప్రధాన యాజకులు ప్రతిదాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా సమస్తమును ఆయన వాక్యం మరియు ఆయన అనుగ్రహించు వాటీ యొక్క ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ మనకు నిజముగా చాలా పాఠాలను నేర్పించును. నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన బంగారు దారం యొక్క ఆధ్యాత్మిక అర్థాలను మనం ముందుగా తెలుసుకోవాలి. నీలం,ఊదా మరియు రక్తవర్ణముగల దారం యొక్క సత్యాన్నిమనము ఇప్పటికే నేర్చుకున్నాము. ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ ద్వారా కూడా, నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారంలో దాగి ఉన్న సత్యం ఎంత అవసరమో ఎంత ముఖ్యమైనదో దానిని నమ్ము యొక్క విశ్వాసాన్ని దేవుడు మనకు చెప్పియున్నాడు. ఈ ప్రజల యొక్క పాపపు నడతలు క్షమాపణను చూపించే ముఖ్యమైన ముడి పదార్థాలు. దేవుడు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తిస్మం, తీసుకొని ఆయన రక్తం చిందించునది తెలియపరుచునది ఏమనగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మాత్రమే ప్రతిఒక్కరి పాపములను ప్రపంచవ్యాప్తంగా క్షమించగలదు. నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం అనునది మనకు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యమును అది మనకు పరిపూర్ణమైన ప్రాయచిత్తాన్ని అనుగ్రహించును, మనము తప్పనిసరిగా దాని యొక్క సరియైన అర్థాన్ని గ్రహించవలెయును.మనము నిజముగా దానిని తెలుసుకొని విశ్వసించినట్లైతే .మన యొక్క పాపములు పూర్తిగా తొలగిపోయి శాశ్వత జీవితాన్ని పొందుతాము. కాబట్టి, నీరు, రక్తం మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా నెరవేరిన ఈ స్పష్టమైన సత్యాన్ని విశ్వసించే విశ్వాసం మనలో ఉండాలి.


మన యొక్క విశ్వాసము తప్పనిసరిగా నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం నందు ఆధారపడవలెను

నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం పై మనకు ఖచ్చితమైన జ్ఞానం మరియు స్థిరమైన విశ్వాసం లేకపోతే, మనం నిజమైన సువార్తను కాపాడుకోలేము, మరియు అధ్వాన్నంగా,ఈ సువార్త కూడా పాడైపోవచ్చు. కాలం గడిచే కొద్దీఈ ప్రపంచంలోని మతాలు తమను తాము మార్చుకోగలవు.కానీ ప్రధానయాజకుని యొక్క వస్త్రధారణ యొక్క రంగుల ద్వారా, నీలం, ఊదా మరియు రక్తవర్ణము గల దారం యొక్క సంపూర్ణ మార్పులేని సత్యాన్ని దేవుడు మనకు చూపించాడు. ప్రధాన యాజకుని యొక్క వస్త్రముల ద్వారా, ప్రత్యక్షపు గుడారం లోపల కనిపించే అన్ని పాత్రల ద్వారా, మరియు గుడారంలో ఇవ్వబడిన అర్పణల యొక్క నమూనా ద్వారా, దేవుడు దానిని తయారు చేసి మన కొరకు ఆయన పరిపూర్ణ మైన ప్రేమ మరియు ప్రణాళిక యొక్క ప్రత్యక్షతను సిద్ధం చేసాడు.
అదేవిధంగా,నీలం,ఊదా మరియు ధూమ్రరక్తవర్ణము గల దారం యొక్క సువార్తగా మనకు వచ్చిన ఈ శాశ్వతమైన సత్యంపై మన యొక్క విశ్వాసాన్ని మనం నిశ్చయముగా కాపాడుకోవాలి. కాలం మారినప్పటికీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై మన యొక్క విశ్వాసం ఎన్నటికీ మారకూడదు. ఈ విశ్వాసం నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారములో వ్యక్తమయ్యే శాశ్వతమైన రక్షణను విశ్వసిస్తుంది.
మనం విశ్వసించే నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం యొక్క ఈ సువార్తను మనం ఎప్పటికైనను ఎలా మరచిపోగలము? నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం యొక్క ఈ సువార్తతో మనలను దేవుడు పాపం నుండి రక్షించాడని చెప్పినట్లైతే , ఇది సత్యమైనదే. పాత నిబంధనలో, దేవుడు చేతులు మీద వేయడం మరియు రక్తప్రోక్షణ అను ఈ రెండిటి ద్వారా పాపుల యొక్క దోషాలను నిర్మూలించాడు, మరియు ఈ నాటి కాలములో కూడా, బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు పొందిన బాప్తీస్మం అను ఈ రెండింటితోనూ ఆయన సిలువపై ఆయన మరణం ద్వారా మన కొరకు పరిపూర్ణమైన పాపపరిహారాన్ని నెరవేర్చియున్నాడు (మత్తయి 3:15). మరియు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో, దేవుడు యావత్తు ప్రపంచంలోని పాపులందరి దోషాలను తొలగించాడు.
ఇది ఎంత భరోసా! పరిశుద్ధగ్రంథములో బంగారము అనునది `విశ్వాసమును` సూచిస్తుంది. అందువల్ల, ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ కోసం నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో పాటు బంగారు దారమును నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై మన విశ్వాసం యొక్క అనివార్యతను సూచిస్తుంది. దేవుడు మన పాపాలన్నింటినీ తుడిచిపెట్టే పద్ధతిని స్థాపించాడు మరియు దానిని మార్చడానికి అనుమతించలేదు, కొన్నిసార్లు మనంo క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, మనం ఇంకా ప్రశాంతంగానే ఉన్నాము. దేవుడు మనకు చూపించిన నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో వ్యక్తమయ్యే సత్యం కూడా దీనికి కారణం.


ప్రధాన యాజకుని యొక్క నడికట్టు

ప్రధాన యాజకుని వస్త్రధారణలో నడికట్టు ఉంది. ప్రధానయాజకుడు తన ఏఫోదులో ధరించే ఈ నడి కట్టు బంగారం, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో కూడా తయారు చేయబడింది. ఏఫోదు నడి కట్టు యొక్క శక్తికి గుర్తుగా ఉన్నది. పరిశుద్ధగ్రంధము చెప్పినట్లుగా, "ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని నిలువబడుడి,"(ఎఫెసీయులు 6:14) ప్రధాన యాజకుడు యొక్క నడి 
కట్టు సత్య సువార్త యొక్క విశ్వాసం నుండి వచ్చిన శక్తిని సూచిస్తుంది. ఇతర మాటలలో చెప్పాలంటే, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నిని పేనిన నార యొక్క సత్యాన్ని విశ్వసించే విశ్వాసముఅది మన పాపములన్నిటి నుండి రక్షించుబడినట్లు చేస్తుంది. అందువల్ల, నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నిని పేనిన నారతో ఇక్కడ వ్యక్తీకరించబడినవి కాకుండా ఇతర తప్పుడు సువార్తలను నమ్మడం వ్యర్థం.
శరీరంలోని కొరతలు ఉన్నవారు మన ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ను విశ్వసించడం ద్వారా వారి పాపములన్నిటి నుండి కడిగివేయబడవచ్చు,ఎందుకంటే లోకములోని సమస్త పాపములన్నియు నెరవేర్చబడియున్న సత్య విమోచనైయున్న దేవుని ద్వారా యేసుక్రీస్తు పైకి పంపబడ్డాయి (మత్తయి 3:15; లేవీయకాండము 16: 1-22). కావున, నీలిరంగు, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో యేసు యొక్క కార్యములు వ్యక్తమయ్యాయని విశ్వసించే వారి యొక్క శరీరము మరియు ఉద్దేశము బలహీనంగా ఉన్నను భరోసా ఇవ్వగలము. పరలోక ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనకు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో మనం నివసించినప్పుడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? నీలం, ఊదా మరియు రక్తవర్ణము గల దారం మరియు సన్నని పేనిన నారలో వెల్లడి చేయబడిన సత్యాన్ని విశ్వసించినప్పుడే ఆయన పరిపూర్ణమైన రక్షణ మనదౌతుంది.
యాజకులు తమ యాజకత్వపు విధులను నిర్వర్తించాలంటే, వారు ప్రత్యక్షపు గుడారంలో చూపిన బలి వ్యవస్థ కాకుండా ఇతర మానవ నిర్మిత సిద్ధాంతాలను పాటించకూడదు. అదేవిధంగా, నేటి దేవుని సేవకులు నిజమైన సువార్త నుండి వైదొలగే విభిన్న సువార్తలు వైపు తిరిగి నశించిపోవుచున్న ఆత్మల వైపు వెళ్ళుటకు అనుమతించకూడదు (గలతీయులు 1: 6, 9). అటువంటి తప్పుడు -సువార్తలను బోధించే వారు, ఎంత బాగా తమ ప్రసంగాలు చేసిన, నశించిన ఆత్మలకు ఎటువంటి సహాయం అందించలేరు ఎందుకంటే వారు దేవుని యొక్క సువార్త మరియు ప్రత్యక్షపు గుడారంలో వ్యక్తమయ్యే ఆత్మకు సరైన సాక్ష్యం ఇవ్వలేరు.వారు మోసగాళ్లు మరియు తప్పుడు ఉపాధ్యాయులు. పరలోక ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును మన రక్షకునిగా విశ్వసించే విషయానికి వస్తే, చేతులు వేయడం మరియు గుడార వ్యవస్థలో కనిపించే రక్తప్రోక్షణ యొక్క బలి వ్యవస్థను మనం గుర్తించలేము.
ఈ నాటి క్రైస్తవ మతానికి చాలా సమస్యలు ఉండటానికి ఒకే ఒక కారణం ఏమిటనగా, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త తెలియకపోయినా చాలా మంది ఆధ్యాత్మిక మోసగాళ్లు తమ యాజక విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పుకొనుచున్నారు. దేవుని యెదుట నిజమైన యాజకులు కావడానికి మొదటి అడుగు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మడం. ఈ విశ్వాసం ఉన్నవారు మాత్రమే దేవునికి సరైన సమర్పణలు ఇవ్వగలరు. ఈ విధంగా, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తెలుసుకొని విశ్వసించువారే ప్రతి ఒక్కరినీ నిజంగా ప్రేమించగలరు. దేవుని యొక్క సంఘం దేని కోసం ఉందని మీరు అనుకుంటున్నారు? దేవుని యొక్క నీరు మరియు ఆత్మ సువార్తను పాపులకు వ్యాప్తి చేయడానికి మాత్రమే మనుగడలో ఉందని నేను మీకు చెప్పగలను.
పరిశుద్ధగ్రంథములో తెలియజేయబడిన నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారమును మనము హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు, మనం మన పాపం నుండి రక్షించబడుదుము మరియు పాపము లేకుండా ఉండెదము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా, మన హృదయంలో నిజమైన సమాధానం కనిపించును, కావున మనం ఈ సమాధానంతో జీవిస్తున్నందున, మనం దేవుని నుండి ఎన్నటికీ వేరు చేయబడలేము. మనము పరిపూర్ణ సువార్తను నమ్ముదుము, విశ్వాసంతో జీవించుదము,ఆపై మనం ప్రభువు రాజ్యంలోకి ప్రవేశించెదము మరియు దానిలో జీవించెదము. మన ప్రభువు మనల్ని సమాధానమునకు నడిపించును, అలాగే లోకములోని ప్రజలందరినీ దేవుని వైపు నడిపించడం ద్వారా, ప్రధాన యాజకుని యొక్క తలపాగా ముందు భాగంలో బంగారు పలక పై "ప్రభువు పరిశుద్ధుడు"అని చెక్కబడినట్లుగా, ఆయన వారిపై తన నిజమైన పాప విమోచన వెలుగుతో ప్రకాశించును. కాబట్టి దేవుడు వారి యొక్క పాప విమోచనను పొందగలిగే పనులను కూడా దేవుడు మనకు అప్పగించాడు. నీలం , ఊదా మరియు రక్తవర్ణము గల దారం యొక్క సువార్తను విశ్వసించే మనకు దేవుడు పాత నిబంధనలోని యాజకుల యొక్క అదే విధులను అప్పగించియున్నాడు.
దేవుని యొక్క పరిపూర్ణమైన వెలుగులో అలాంటి విలువైన పనులను చేయడానికి అనుమతించినందుకు మేము దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దేవుని నుండి ఈ సువార్త వాక్యాన్ని నేను మొదట విన్నప్పుడు నేను సంతోషంతో ఉప్పొంగిపోయాను. నేను పరిశుద్ధగ్రంధము చదువుతున్నప్పుడు, ఈ సువార్త చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత నా ఆధ్యాత్మిక కళ్ళు తెరవబడ్డాయి, మరియు నాలో ఉన్న పరిశుద్దాత్మడు నాకు దేవుని యొక్క వాక్యాన్ని వివరంగా బోధించాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త అనునది దేవుడు మనకు ఇచ్చిన ఏకైక నిజమైన సువార్త అని పరిశుద్ధగ్రంధములోని అన్ని వచనాలు స్పష్టంగా సాక్ష్యమిస్తాయని నేను తెలుసుకున్నాను. పాత నిబంధన కాలములో,ఈ సువార్త నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం వలె వ్యక్తీకరించబడింది. క్రొత్త నిబంధన కాలములో కూడా, అపొస్తలులు మరియు పరిశుద్ధగ్రంధ రచయితలందరూ యేసు బాప్తీస్మం పొంది మనల్నిపాపం నుండి సంపూర్ణంగా రక్షించడానికి ఆయన యొక్క రక్తాన్ని చిందించబడిందని చెప్పియున్నారు.అయితే మనం రక్షణ యొక్క వస్త్రము ధరించాలంటే, మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించాలి; మనము పశ్చాత్తాపం యొక్క ప్రార్థనలను చేయటం ద్వారా మాత్రమే మనం ప్రభువు నుండి పాప క్షమాపణను పొందలేము.నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మాత్రమే పరిపూర్ణమైన సత్య సువార్త.
దేవుడు ఆదేశించినట్లు ఉద్దేశపూర్వకంగా తయారు చేయబడిన వస్త్రములను ప్రధానయాజకుడు ధరించవలసి వచ్చింది. చలి గాలికి ఇబ్బంది పడిన ప్రధానయాజకుడు, దేవుడు తన కోసం తయారు చేసిన అంగీని ధరించాల్సిన అవసరం లేదని భావించి,దానికి బదులుగా మరొక మందపాటి అంగీని ఏకపక్షంగా ధరించినట్లయితే, అతను వెంటనే చంపబడును.ఒకవేళ ప్రధాన యాజకుడు కేవలం అతి పరిశుద్ధమైనస్థలంలోకి ప్రవేశించి కేవలం పేనిన నారతో చేసిన అంగీని మాత్రమే ధరించి ఉంటే, అప్పుడు కూడా అతను చంపబడును. అందుకనే అతను నీలిరంగు వస్త్రాన్ని మరియు నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణము గల దారంతో పేనిన బంగారము యొక్క ఏఫోదును ధరించవలసి వచ్చింది.
దేవుడు యొక్క ప్రణాళిక విధానాన్ని మనం ఖచ్చితంగా అనుసరించినప్పుడు, ప్రభువు మన ముందు నడువను, మనల్ని నడిపించును మరియు మన జీవితములో మనం చేయు ప్రతిదానిలో పని చేయును.దేవుడు మన కొరకు మెస్సయ్యను పంపాలని అనుకున్నాడు మరియు ఆయన ఈ ప్రణాళికను కూడా మనకు తెలియజేసెను.మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించి దేవుని యొక్క ప్రణాళికను అనుసరిస్తే, ఆయన మన జీవితాల్లో పని చేయును. కావుననే మనలో ఉన్న కొన్ని స్వంత పనుల ద్వారా మనం పాపం నుండి విడదల పొందలేము, కానీ ప్రధాన యాజకుని వస్త్రములకు ఉపయోగించే బంగారం, నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారములో వ్యక్తమయ్యే దేవుని యొక్క ప్రణాళికను విశ్వసించడం ద్వారా మనము తప్పక పాప క్షమాపణను పొందుకోగలము.
దేవుని యాజకులుగా మనం తప్పని సరిగా చేయవలనది ఏమిటనగా దేవుడు మన కోసం సిద్ధం చేసిన వాటిని నమ్మడం మరియు అనుసరించడం. ఇదియో నిజమైన విశ్వాసం అంటే. అన్ని రకాల చిన్నచిన్న ప్రణాళికలను రూపొందించుకుని దేవునికి సేవ చేయడం సరైన విశ్వాసం కాదు. విదేశాలలో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయడానికి మా యొక్క ప్రయత్నాల విషయానికి వస్తే, మన స్వంత మానవ నిర్మిత ప్రణాళికలు మరియు ప్రత్యేకమైన పరికరాల ద్వారా ఏదైనా చేయడం ద్వారా సాధించబడదు, కానీ అది ఆయన అనుగ్రహించిన సహాయం ద్వారా మరియు ప్రజలు చూపించు వారి విశ్వాసం ద్వారా ఇది సాధించబడింది. ఇది దేవుని యొక్క చిత్తం. మనం విశ్వాసంతో ఏదైనా చేసినప్పుడు, మిగిలినవి దేవుడు చూసుకుంటాడు. కావున మేము దేవుని చిత్తాన్ని తెలుసుకుని, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేసినప్పుడు, మా యొక్క పుస్తకములను చదివిన వారి హృదయాలను దేవుడు తాకి,వారిని అవగాహనలోనికి తీసుకొని వచ్చి, ఈ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మునట్లు చేయును అలాగే వారు నమ్మునట్లు వారి ఆలోచనలను మరియు తప్పిదములను సరిదిద్దుతాడు. అప్పుడు వారు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయడానికి కూడా రాగలరు.


నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయుటకు, ముందుగా మనము పూర్ణ హృదయముతో నమ్మవలెను

సత్యసువార్త యొక్క వ్యాప్తిని ఏదో ఒకవిధంగా మనం చేయడం ద్వారా సాధించలేమని నేను చెప్పాను, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారమైన విశ్వాసంతో మనం సేవ చేయునప్పుడే అది సాధించబడుతుంది. మన స్వంత ప్రయత్నాలు మరియు భక్తి ద్వారా ఆత్మలు మార్పుచెందవు, కానీ మనం దేవుని యొక్క కార్యములను అనగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించు దేవుని యొక్క చిత్తాన్ని కోరినప్పుడే దేవుని యొక్క కార్యము నెరవేరుతుంది.విశ్వాసం ద్వారా మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను అందించాలి.పాత నిబంధన కాలం యొక్క విశ్వాసము ఈ ప్రస్తుత కాలమందును అవసరమే. ఇప్పుడు ఈ కాలములో, మునుపటిలాగే, దేవుని పిల్లలు నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం యొక్క విశ్వాసాన్ని వ్యాప్తి చేయాలి.
మనం ధూమ్ర రక్తవర్ణముగల దారంతో పాటు ఊదా దారమును విశ్వసించాలి మరియు వ్యాప్తి చేయాలి,అయితే ముందుగా నీలిరంగు దారములో ఏమి కనబడుతుందో అది మనం మొదట తెలుసుకోవాలి - అనగా మెస్సయ్య యైన యేసు పొందిన బాప్తీస్మం మనకు కనపడుతుంది. మనము నీలిరంగు యొక్క సత్యాన్ని పోగొట్టుకున్నవారికి సువార్తను వ్యాప్తి చేసినప్పుడు, వారు సత్యం యొక్క పూర్తి చిత్రాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోగలరని మరియు నమ్మకంగా ఉండగలరని మనము కనుగొంటిమి. ఎందుకు? ఎందుకంటే యేసు మెస్సయ్యగా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యావత్తు మానవజాతి పాపములను తన శరీరంలోకి స్వీకరించాడు. యేసు బాప్తీస్మం పై విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రజలు వారి పాపములు శుద్దిచేయబడవని వారు తెలుసుకున్నప్పుడు, వారి పాపాలన్నింటినీ తీసివేయడానికి ఆయన కూడా సిలువపై మరణించియున్నాడని వారు అనివార్యంగా అంగీకరించారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రజలు ఊదా మరియు రక్తవర్ణముగల దారము నందు విశ్వాసముంచుటకు వచ్చినప్పుడు మాత్రమే వారు మరుగైయున్న బాప్తీస్మం యొక్క యేసు మెస్సయ్యను,బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి పొందిన నిజమైన నీలి రంగు దారమును తెలుసుకొనెదరు. వారు సత్యమును గ్రహించెదరు, ఆహా,ఆయన బాప్తీస్మం పొందుట ద్వారా మన పాపములన్నియు ఆయన పైకి తీసుకొనెను. యేసుక్రీస్తు నిజమైన దేవుడు మరియు సమస్త మానవజాతి యొక్క రక్షకుడు. ఇది మరింత సత్యమైయున్నది.
ఊదా దారం యొక్క విశ్వాసము,మరియు యేసు తానే దేవుడైయున్నది అనేకులకు, తర్వాత గ్రహింపు కలిగింది. యేసును రక్షకునిగా విశ్వసించడం మొదలుపెట్టిన క్షణం నుండి, మనము "యేసుని సంపూర్ణ దేవుడని" చెప్పుకున్నాము, కానీ ఇది కేవలం ఒక వియుక్త భావన మాత్రమే. అయినను అటుతరువాత మన యొక్క హృదయములో యేసు నందు మరింత విశ్వాసం కలిగింది. యేసు యొక్క బాప్తీస్మం మరియు ఆయన రక్తాన్ని విశ్వసించడం ద్వారా మనం పాపం నుండి విడుదల పొందినప్పుడు, యేసు దేవుడే అని మనకు విశ్వాసం కలిగింది, మనకు సహాయం చేయు మరియు మన జీవితంలో పనిచేయు జీవాధి పతియైన యేసుపై మన విశ్వాసం క్రమంగా పెరుగుతుంది. కావున, ప్రజలు పాపం నుండి విడుదల పొందాలంటే, దేవుడు ఏర్పాటు చేసిన నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం యొక్క సువార్తను వారు విశ్వసించాలి.


ఈ నాటి యాజకులు దేనిని సేవించుదురు

ప్రత్యక్షపు గుడారములో ప్రధాన యాజకులు ఏమి చేయుదురు ?వారు బలి వ్యవస్థ ద్వారా ఏమి వెల్లడిచేయుదురు? మెస్సయ్య నీలం,ఊదామరియు రక్తవర్ణముగల దారంతో మన పాపాలన్నింటినీ తొలగిస్తాడనే సత్యాన్ని వారు వ్యక్తపరిచారు.ఈ కాలములో దేవుని యొక్క సేవకులు కూడా అలాంటి విధులు ద్వారా పరిచర్యలో విజయం సాధించాలి.వారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో ప్రజల పాపములను తొలగిస్తున్నారు.
ఎక్కువమంది వ్యక్తులు తమ స్వంత సువార్త సంస్కరణను రూపొందించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి సువార్త పరిశుద్ధగ్రంధం ప్రకారం మంచిది కాదు, మరి ఎవరినీ రక్షించనేరదు. వారు ఇచ్చట మరియు అచ్చట నుండి మానవ నిర్మిత సిద్ధాంతాలను అప్పుగా తీసుకొని వాటిని ఒకచోట అమర్చడంలో నిపుణులు. కానీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వివిధ క్రైస్తవ సిద్ధాంతాలను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా సృష్టించబడినది కాదు.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా ప్రజలు పాప విమోచనను తప్పకుండా పొందవచ్చు. ఈ వాక్యమును, మరో మాటలో చెప్పాలంటే, రక్షణకు ఏకైక ప్రామాణికం. ప్రజల యొక్క పాపములను శుద్దిచేయటం అనేది దేవుడు నిర్దేశించిన ప్రమాణం ప్రకారం మాత్రమే సాధించబడుతుంది. ఈ ప్రమాణం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త. రక్షణ యొక్క సత్య సువార్త వెలుపల ఎవరూ తన పాపములను క్షమించలేరు మరియు పవిత్రతను పొందలేరు. దేవుని యెదుట సమస్త పాపములను శుద్దిచేయడం మరియు పరిశుద్దతను పొందడం అనేది యొర్దాను నదిలో బాప్తీస్మం మరియు సిలువ రక్తం అనునది రక్షకునిగా వచ్చిన యేసును విశ్వసించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజలు తమ పాపములన్నిటి నుండి విడుదల పొందాలంటే, నీలిరంగు, ఊదా మరియు రక్తవర్ణముగల దారం ద్వారా వచ్చిన యేసుక్రీస్తును వారు ఖచ్చితంగా రక్షకునిగా విశ్వసించాలి. వారు పాప పరిహారం పొందడానికి ఇక వేరే మార్గం లేదు.
ఆయన యాజకులుగా మారిన దేవుని యొక్క సేవకులు బంగారం, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో తయారుచేయబడి యాజకుని యొక్క వస్త్రముగా ఉపయోగించబడిన సత్య సువార్తను నమ్మవలెను. వారు ఈ సత్యాన్ని విశ్వసించకపోతే, వారు ఆయన సేవకులుగా అర్హత పొందలేరు. అలాంటి వారు కేవలం లోకములోని మతవాదులు. ప్రపంచంలోని అనేక మతాలలో, వారు కేవలం యేసు నామమును మాత్రమే అప్పుగా తీసుకుని తమ సొంత మతాలకు మాత్రమే సేవ చేస్తున్నారు. దేవుని యొక్క నిజసేవకులు నీరు, రక్తం మరియు ఆత్మ ద్వారా రక్షకునిగా వచ్చిన యేసుక్రీస్తును విశ్వసించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి.అప్పుడే , వారు స్పష్టమైన సరైన విశ్వాసాన్ని వ్యక్తీకరించడానికి మరియు దేవుని సత్యాన్ని స్పష్టంగా ప్రకాశింపజేయడానికి ఆయన యొక్క బాప్తీస్మం గురించి వారు సాక్ష్యమివ్వాలి. అలా చేయు వారు మాత్రమే దేవుని సేవకులు మరియు ఆయన యెదుట రక్షింపబడిన వారు.
యేసు బాప్తీస్మం, ఆయన సిలువ , అలాగే ఆయన దేవుడే అనే వాస్తవాన్ని విడిచిపెట్టిన వారు, అదే విధంగా ఎటువంటి విశ్వాసం లేకుండా సిద్ధాంతానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధించేవారు, దేవుని సేవకు పనికి రాని దెయ్యం యొక్క సేవకులు.
ఈ రోజు, ప్రపంచంలో “సువార్తికులు” అని పిలవబడే వారు కోకొల్లలుగా ఉన్నారు. యేసును విశ్వసించే వారి విశ్వాసం ద్వారా వారి పాపాలన్నిటి నుండి శుద్దిచేయబడుదురు.అలాగే వారు పాపం లేకుండా ఉందురని వారు ప్రస్తావిస్తున్నారు. మొదట, వారు నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం యొక్క సత్యాలను కూడా వారు బోధిస్తున్నారని నేను అనుకున్నాను,కానీ కాలక్రమేణా అలా కాదని నేను గ్రహించాను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వారు అలా బోధించరు, వారి స్వంత ఆలోచనల నుండి తయారు చేయబడిన సిద్ధాంతాలను నిజమైన సువార్త అని ఆలోచిస్తూ విశ్వసిస్తున్నారు. వారు తమను తాము"సువార్తికులు" అని పిలువబడినప్పటికీ, వారు తమ స్వార్థ మరియు భూసంబంధమైన సంక్షేమాన్ని మాత్రమే కొనసాగిస్తారు, వారి యొక్క ఏకైక లక్ష్యం వారి స్వంత కోరికలను తీర్చకోవడం.
ఈ భూమిపై యాజకులు అని పిలువబడే వారు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వారిని పరిశుద్దులుగా మార్చడానికి వీలు కల్పించే సత్య సువార్తను అంగీకరించడానికి ఎందుకు వారు నిరాకరిస్తున్నారు?సాంప్రదాయ వాదులు వాక్యముపై వారికున్న విశ్వాసమును బట్టి వారు అతిశయపడుదురు.కానీ వాస్తవం ఏమిటంటే అలాంటి వ్యక్తులు సంప్రదాయవాదులు కాదు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యమును వారు స్పష్టంగా వ్యక్తం చేసినప్పుడు, వారు వారి విశ్వాసం నుండి యేసు యొక్క బాప్తిస్మమును ఎందుకు విడిచిపెట్టుదురు? నాదాబు మరియు అబిహు దేవుని యెదుట అపవిత్రమైన అగ్నిని అందించినప్పుడు మరణించారని గుర్తుంచుకోండి.ఈ యాజకులు దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన మార్గం ప్రకారం అర్పణ అర్పించబడునప్పుడు,దేవుని నుండి అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది (సంఖ్యా 26:61).
ప్రధానయాజకుడు దేవుడు నిర్ణయించిన అంగీని ధరించకపోతే మరణశిక్ష విధించబడుతుంది (43 వ వచనం). పాపులు తమ బలి అర్పణల యొక్క రక్తాన్ని ప్రత్యక్షపు గుడారంలోకి ఎంత శ్రద్ధగా తీసుకువచ్చినా, వారు మొదట పశువు తలలపై చేతులు వేస్తే తప్ప మరేమి అర్థం కాదు.కావున ఈ విశ్వాసం లేకుండా, వారు తమ దోషాలను ఒప్పుకుని, వాటిని తమ సమర్పణలకు అప్పగించబడిన ఈ చేతుల మీద నమ్మకం లేకుండా, వారు దాని రక్తాన్ని ఎంతగా విశ్వసించినా వారి విశ్వాసం నిష్ఫలమైనది. ప్రధాన యాజకులు ఎంత తరచుగా రక్తం తీసుకువచ్చి, తెర తొలగించి, అతి పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించి, దానికరుణాపీఠము పై రక్తాన్ని ప్రోక్షించి, దేవుడు నిర్ణయించిన "నీలిరంగు" అంగీని ధరించుటకు వారు రాకపోతే, వారికి మరణశిక్ష విధించబడుతుంది. అందువల్ల, సమస్త మతతత్వవాదులూ తమ పాత విశ్వాస మార్గాలను విసర్జించాలి మరియు సత్యమైన సువార్తకు తిరిగి రావాలి, అది వారిని "వెలుగులోనికి మరియు పరిపూర్ణతకు" దారి తీయును, అనగా ఆది “ఊరీము మరియు తుమ్మీము” అయ్యిఉన్నది (నిర్గమ 28:30).
వారు తగిన వారుగా లేకపోయినను, ఆయన వాక్యమును మరియు ఆయన చిత్తాన్ని విశ్వసించి, అనుసరించే వారి పట్ల దేవుడు సంతోషిస్తాడు. అందుకే నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారిగా దేవుడు మనలను పిలిచాడు. అలాగే దేవుడు మనకు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను అప్పగించాడు. మనం కలిసి ఐక్యంగా ఉండి, విశ్వాసం ద్వారా సువార్తను వ్యాప్తి చేసినప్పుడు, దేవుడు నిరంతరం అద్భుతమైన కార్యాలను నిర్వహించడానికి అనుమతిస్తాడు.
దేవుని యొక్క ప్రణాళిక త్వరలో పూర్తిగా నెరవేరుతుందని మనము నమ్ముతున్నాము. వాస్తవంగా, మనము దేవుని యెదుట నిజముగా సంతోషంగా ఉన్నాము. మన యొక్క శరీరంలో, మనకు అనేక లోపాలు ఉన్నాయి. నేను అయితే అందరికంటే చెడ్డవాడనని అనుకుంటున్నాను. నేను మీ యెదుట స్పష్టంగా ఒప్పుకున్నప్పటికీ, సహజ సిద్ధంగా మానవ పక్షంగా నాలో అనేకమైన లోపాల కారణంగా నా ముఖం పూర్తిగా ఎర్రబడుతుంది. నా లోపాలు తాత్కాలికమైనవి కావు. సమయం గడిచే కొద్దీ, నేను సువార్తను ఎంత ఎక్కువగా ప్రకటిస్తానో, అలాగే దేవుని యెదుట ఎంత అసంపూర్తిగా ఉన్నానో నాకు అర్థమవుతుంది. మరియు మా యొక్క సహోద్యోగులను చూస్తుంటే, వారు కూడా నాలాగే సరితూగలేరని భావించాను, కాని దేవుని కృపతో మనమందరం ఇప్పటికీను సువార్తను అందిస్తున్నాము. దేవుడు మనలో పనిచేస్తాడని దేవుడు మనకు నమ్మకం కలిగించాడు, తద్వారా మనం దేవుని యొక్క సువార్త మరియు ఆయన ప్రణాళికలను విశ్వసించడం ద్వారా ఆయనను సేవించి అనుసరించవచ్చు.
ఎన్నికలేని మన ద్వారానే మన ప్రభువు మహిమపరచబడ్డాడు. మనం ఎంతగా ఎన్నికలేని వారిమీ అయినను, అంత ఎక్కువ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మన హృదయాలలో ప్రకాశించును-దీని మూలంగానే దేవుడు మహిమపరచబడ్డాడు. మనల్ని మనం నిర్దోషులుగా గుర్తించినప్పుడు అలాగే మరింత గొప్పలు పలికినప్పుడు, దేవుడు అసౌకర్యంగా భావించడం ప్రారంభిస్తాడు. ఇలా మన ద్వారా స్తుతులు అందుకొనుటయె దేవుని యొక్క చిత్తం, సరిపోనిది.
నీవు మరియు నేను తగిన వారిమీ కాము. మనం ఎంత బలహీనులము? అన్నిటిని మించి ! ఏదేమైనను, తన మరియు ఆమె ప్రతి ఒక్కరి యొక్క లోపాలను భిన్నంగా భావించుదురు, ఎందుకంటే సముద్రం లేదా నది యొక్క లోతు మన కడుక్కునే గిన్నె కంటే వేరుగా ఉంటుంది. తాము పూర్తిగా తగినవారమని వాస్తవంగా తెలుసుకున్న వారు దేవునిని ఎక్కువగా ప్రేమిoచెదరు, ఎందుకంటే వారుదేవునికి ఎంతో రుణపడి ఉండగలరని వారికి తెలుసు. వారి యొక్క లోపాల గురించి బాగా తెలుసుకున్న వారు మరియు అధికమైన రుణ మాఫీ చేయబడిందని నమ్మువారు వారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే వారు ప్రభువు యొక్క సువార్తను మరింతగా గౌరవిస్తారు, అందులో ఉన్న గొప్ప అతిశయముతో మరింత ఎక్కువగా సువార్తను అనుసరిస్తారు. కానీ వారి స్వంత లోపాలు తెలియని వారు దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తారు, ఎందుకంటే వారు చెల్లించిన రుణాలు చిన్నవి మాత్రమే అని అలాంటి చిన్న అప్పులను మాఫీ చేయడం కోసం దేవుడు వారి నుండి ఎక్కువగా ఆశిస్తాడని వారు భావించెదరు.
ఈ ప్రజలు యొక్క తప్పిదములు చాలా తక్కువని యెరిగి వారి యొక్క లోపాలు ఎంత గొప్పవో ఎలా గ్రహించెదరు ? ఇది వారిపై ఒత్తిడి చేయబడదు. అయినను వారు సువార్తకు తగిన వారు కాకపోయినను, దానిని ప్రకటించడం దేవుని యొక్క చిత్తమని నమ్ముతూ, వారు ఈ సువార్తను ప్రకటించెదరు. ఆ సమయం వచ్చినప్పుడు వారి లోపాలు మరింతగా బయటపడును, అవి ఎంత ఎక్కువగా బయటపడునో, దేవుని పట్ల వారి యొక్క ప్రేమ అంత లోతుగా మారుతుంది.
మన లోపాలను సైద్ధాంతికంగా మాత్రమే తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాస్తవానికి సువార్తను అందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం కష్టమైన సమయాలను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మన లోపాలను గుర్తించగలం. అందుకే మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా ఆరాధిస్తామో, అంతగా మనకు ఆయన విలువైనవాడుగా ఉండును. మనం ధైర్యంగా ఉండగలిగేది ప్రభువు వలెనే, మరియు ఆయన వలెనే మనం కీర్తించబడ్డాము. మన ప్రభువును బట్టి మనం విశ్వాసముతో జీవించగలము మరియు ఆశీర్వదించబడిన ఆయన పనికి భక్తితో జీవించగలము. అది ప్రభువు కోసం కాకపోతే, నీవు మరియు నేను ఏమియు లేనివారిమి. 
బాప్తీస్మం మిచ్చు యోహాను చెప్పెను ``ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది`` (యోహాను 3:30) దేవుడు మనకు పాప పరిహారాన్ని మరియు ఈ సువార్తను అందించే ఆశీర్వాదము యొక్క అవకాశమును అనుగ్రహించాడు.కావున మన యొక్క మనుగడ సువార్తను వ్యాప్తి చేయడానికి సాధనంగా మాత్రమే ఉపయోగించబడుతుంది మహిమను పొందువాడు ప్రభువు ఒక్కడే. వాస్తవం ఏమిటంటే ప్రభువు మనల్ని అలాంటి సాధనములుగా ఉపయోగిస్తున్నాడనే సత్యం చాలా కృతజ్ఞతతో ఉంటుంది.
ప్రధానయాజకుని యొక్క విధులను నిర్వర్తించే ఈ దీవెనను అందించినందుకు దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. యేసు మనకు గొప్ప కాపరి మరియు పరలోకపు ప్రధాన యాజకుడు. ఆయన సేవకులు చిన్న కాపరులు. నీవు మరియు నేను మన గొప్ప కాపరి చేసిన దానిని అనుసరిస్తూ చిన్న కాపరులం కాగలిగితిమి. మీరు మరియు నేను దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా విశ్వసించాలి, వాక్యానికి అనుగుణంగా వ్యవహరించాలి మరియు వ్రాయబడినట్లుగా అనుసరించవలెను. ప్రభువు చేసినట్లే మనం కూడా సేవ చేయవలెను.
ప్రభువు చేసినట్లే మనం ఖచ్చితంగా అనుకరించాలి, విశ్వసించాలి మరియు తదనుగుణంగా ఆయనను అనుసరించాలి. మనం చేయవలసింది ఏమిటంటే, ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా మన కోసం ప్రణాళిక వేసినట్లుగా నమ్మడం మరియు అనుసరించడం అలాగే నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయడం. దేవుని యెదుట ఉన్న సరైన విశ్వాసం ఏమిటంటే, ఆయన యొక్క వాక్యాన్ని పరిశుద్ధతతో అంగీకరించడం మరియు దానిని విశ్వసించడం ద్వారా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించడం.
మన స్వంత ప్రధాన యాజకునిగా మారిన మన ప్రభువుకు మనము హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుదము.