(నిర్గమకాండము 28: 36-43)
“మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను.అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీక రింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరు డైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచ వలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోను మీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.”
నిర్గమకాండము 28:36 ఇలా చెబుతోంది,"మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను." ఈ పలక యొక్క తలపాగా నుండి రాని విధంగా నీలిరంగు త్రాడుతో స్థిరపరచబడింది.
ప్రధాన యాజకుడు యొక్క తలపాగాతో దేవుడు మనకు ఏమి చూపిస్తున్నాడు? తలపాగా దాని యొక్క ఆభరణం యేసు క్రీస్తు బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి స్వీకరించిన బాప్తీస్మం ద్వారా మన పాపాలన్నింటినీ స్వీకరించి తద్వారా మన పాపములన్నిటి నుండి శుద్దిచేసాడని సూచిస్తుంది.
దేవుని యెదుట మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే, మనం మొదట, ఆయనపై నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరియు సత్యంపై కూడా విశ్వాసం కలిగి ఉండాలి, మొదట మనం సత్యం గురించి సరైన జ్ఞానం కలిగి ఉండాలి. మన ప్రభువు మనందరితో ఇలా అన్నాడు, "సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును" (యోహాను8:32). దేవుణ్ణి నమ్మడం అనేది కేవలం భావోద్వేగాలతో కూడినది కాదు. అందుకే మన యొక్క విశ్వాసం సత్యమును గూర్చిన ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆపై ఇది మన భావాలను మన యొక్క ఉద్దేశాలను అనుసరిస్తుంది, అలా చేయడానికి, ప్రధాన యాజకుడు వస్త్రాలకు ఉపయోగించే పదార్థాలలో మనకు స్పష్టంగా కనిపించే విశ్వసించే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి.
ప్రధాన యాజకుడు ధరించిన తలపాగాపై, ఒక బంగారు పలక వేలాడదీయబడింది మరియు అది నీలిరంగు త్రాడుతో స్థిరంగా ఉంటుంది. యేసు ఈ భూమ్మీదకు వచ్చి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ప్రభువు మన పాపాలన్నింటినీ స్వీకరించాడనే సత్యాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. అందుకే పైన లేఖన వచనం ఇలా చెబుతోంది, “తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీక రింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.” (నిర్గమ 28:38). ఇశ్రాయేలీయుల యొక్క పాపపు సమస్యను పరిష్కరించగల విశ్వాసం ప్రధానయాజకుని యొక్క తలపాగా ముందు భాగంలో ఉంచిన బంగారు పలకలో మరియు పలకను భద్రపరిచిన నీలిరంగు తాడులో కనిపించింది.
యేసు యొక్క బాప్తీస్మం సమస్త మానవ జాతి యొక్క రక్షణకు చాల ముఖ్యమైనది
ప్రధానయాజకులు యొక్క నుదుటిపై నీలిరంగు త్రాడుతో కట్టిన బంగారు పలకతో జతచేయబడిన తలపాగాకు ధరించినట్లుగా, మీరు కూడా ఈనాటికి నిజమైన ఆధ్యాత్మిక యాజకులైతే, ప్రభువు ఈభూమ్మీదకు వచ్చియున్నాడని మీరు తెలుసుకోవాలి మరియునమ్మాలి, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం పొంది పాత నిబంధన యొక్కబలి వ్యవస్థకు అనుగుణమైన చేతులు వేయు పద్ధతి ద్వారా మీ పాపములన్నిటిని ఇప్పటికి శుద్దిచేయబడెను. పాత నిబంధన కాలములో, ప్రధాన యాజకుడు బలి అర్పించుట ద్వారా ప్రతి పాపం తొలగించబడిందని తెలుసుకోవాలి. మరోవైపు, క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న మీరు మరియు నేను తప్పక తెలుసుకోవాలి, ఆయన ఈ భూమ్మీదకు వచ్చినప్పుడు బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా ప్రభువు బాప్తీస్మం పొందాడు, ఆయన మన అందరి పాపాలను ఒకసారి తీసుకున్నాడు. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నందున, మన పాపాలన్నీ ఆయన పైకి పంపబడ్డాయి మరియు ఆయన లోకములోని సమస్త పాపములను ఒకేసారి తీసుకొనియున్నాడు.
ఈ బాప్తీస్మం ద్వారా,ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపములు మినహాయింపు లేకుండా యేసుపైకి పంపబడ్డాయి. చివరి ప్రధాన యాజకుడు మానవజాతి అంతటికి ప్రతినిధి అయిన బాప్తీస్మం మిచ్చు యోహాను యొక్క పాపములు కూడా లోక ప్రజల యొక్క పాపముల వలె యేసుపైకి పంపబడెను.
దేవుని యెదుట మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలి? యేసుక్రీస్తు బాప్తీస్మం స్వీకరించాడని తద్వారా ప్రజలందరి యొక్క పాపములు నిజంగా స్వీకరించాడని నమ్మే నిజమైన విశ్వాసం మనలో ఉండాలి. సత్యం యొక్క జ్ఞానంతో పాటు, ఈ సత్యాన్ని విశ్వసించే ఈ విశ్వాసం కూడా మన హృదయాలలో ఉండాలి. ఈ సత్యాన్ని విశ్వసించే విశ్వాసంతో మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త పని చేసినప్పుడు, ప్రజలు దానిని వింటారు మరియు వారి హృదయాలతో విశ్వసిస్తారు, తద్వారా వారి పాపాలన్నీ మంచువలె తెల్లగా కడుగబడతాయి.ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించే వారందరికీ యేసుక్రీస్తు నిజమైన పాప విమోచనను ప్రసాదించాడు.
అన్నింటికీ మించి, నేటి ఆధ్యాత్మిక యాజకులు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే స్పష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి.ఈ సత్యమును గూర్చి జ్ఞానం మరియు విశ్వాసం లేకుండా, మనము ఆధ్యాత్మిక యాజకుల యొక్క విధులను మనం నెరవేర్చలేము.మరో మాటలో చెప్పాలంటే, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం-అనగా పాపముల యొక్క నిజమైన విమోచన యొక్క సత్యాన్ని విశ్వసించే ఈ విశ్వాసం ఉన్నవారు మాత్రమే తమ ఆధ్యాత్మిక యాజకుల విధులను నిర్వర్తించగలరు. మరో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు యొక్క బాప్తీస్మం మరియు సిలువ రక్తము అను ఈ రెండింటినీ విశ్వసించడం వలన పొందిన పాప క్షమాపణ ద్వారా మాత్రమే ఈ సువార్త వ్యాప్తి యొక్క విధులను నెరవేర్చగలరు. ఈ విధంగా,ప్రతి ఆధ్యాత్మిక యాజకునికి సత్యంపై సరైన జ్ఞానం ఉండటం చాలా అవసరం. అందుకే పరిశుద్ధగ్రంధం స్పష్టంగా చెప్పింది,“ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు."(హోషేయా 4: 6).
ప్రాయశ్చిత్తం రోజున ప్రధాన యాజకుడు దేవుని యెదుటకు వచ్చినప్పుడు, అతను తన తలపాగాను ధరించకుండా అతి పరిశుద్ధస్థలములోనికి వెళ్ళలేడు. ప్రధాన యాజకుడు సన్నని పేనిన నార యొక్క తలపాగాను ధరించాలి మరియు దాని ముందుర భాగంలో నీలిరంగు త్రాడుతో జత చేసి ఉంచిన బంగారు పలకను దేవుడు నిర్దేశించిన విధంగా ఉంచవలెను. మీరు ఇప్పటికే నిర్ధారించినట్లుగా, నీలిరంగు దారం బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు అందుకున్న బాప్తీస్మం గురించి సాక్ష్యమిస్తుంది (మత్తయి 3:15; 1 పేతురు 3:21).
అందరును ప్రతిరోజూ పాపం చేయలేరు. కావున శిక్ష నుండి ఏ ఒక్కరును తప్పించుకోలేరు,వారి పాపములను బట్టి శాశ్వతమైన నాశనమునకు మరియు మరణమునకు అప్పగించబడుదురు . కానీ ప్రభువు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి పొందిన బాప్తీస్మం ద్వారా మానవజాతి పాపములను తన శరీరంపైకి తీసుకొనెను. మత్తయి 3:15 లో యేసు చెప్పినట్లుగా,"నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను." ఈ బాప్తీస్మం ద్వారా తండ్రి యైన దేవుడు మానవజాతి పాపములన్నిటిని తన కుమారుడైన యేసు పైకి పంపించవలెనని ఉద్దేశించాడు. మరియు ఇది ఇలా జరగవలెనని అనుమతించబడింది. యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తీస్మం పొందెను అనగా , బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా ఆయన లోకములోని పాపములను ఒకసారి తనపైకి స్వీకరించాడు. అందువల్ల, మీ మరియు నా యొక్క పాపములు కూడా ఆ సమయంలో యేసుపైకి పంపబడ్డాయి.
అందరూ పాపం చేసారు కావున, అందరూ దేవుని యొక్క మహిమకు దూరమయ్యారు (రోమా 3:23). పరిశుద్ధగ్రంధము ఇలా చెబుతోంది, "ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు." (రోమా 5:19). పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారా? లేరు, ఖచ్చితంగా లేరు! అప్పుడు మన గమ్యం ఎలా ఉంటుంది? ఏ విధమైన పాపం కలిగి ఉన్నా, అది ఎలా చేసినను , మన క్రియలు, మరియు హృదయ ఆలోచనల ద్వారా, మనమందరం నాశనం అవుతాము అని దేవుడు చెప్పాడు. "పాపము వలన వచ్చు జీతము మరణము" అనిదేవుడు చెప్పినందున (రోమా 6:23), మన దగ్గర ఆవాలు గింజంత చిన్న పాపం ఉన్నను, మనం ఈ పాపమును తప్పని సరిగా శుద్దిచేసుకోవాలి. మానవజాతి అంతయు దేవుని యెదుట పాపం చేసింది, దీని ఫలితంగా వారందరూ తప్పించుకోలేరు కానీ వారి పాపముల బట్టి వారు శిక్షించబడుదురు. అయితే, దేవుడు "పాపము వలన వచ్చు జీతము మరణం" అని చెప్పినట్లుగా, ఆయన తన కుమారుని బాప్తిస్మం తీసుకునేలా చేసి, ఆయనను శిక్షకు అనుమతించాడు.పాపము యొక్క వెల మరణము. మరణము యొక్క అర్థమేమిటి ఇక్కడ? నరకమే మరణము యొక్క అర్ధం.
హెబ్రీయులు 9:27 చెప్పుచున్నది, "మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను; ఆతరువాత తీర్పు జరుగును.” మనం చనిపోయినప్పుడు తీర్పు మనకు కొరకు ఎదురుచూస్తుందని దేవుడు చెప్పాడు. నీతిమంతుడు లేదా పాపాత్ముడు, పాపం నుండి విడుదల పొందిన వారు లేదా పొందని వారును భౌతిక మరణానికి మించి శాశ్వతంగా జీవించెదరు. మానవులు దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడియున్నారు, దేవుడు శాశ్వతంగా జీవించును కావున, ప్రతి ఒక్కరూ తన కోరికలతో సంబంధం లేకుండా శాశ్వతంగా జీవించాలని ఇది మనకు చెబుతుంది.కానీ రెండు రకాల నిత్యజీవాలు ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాలి: ఒకటి ఆశీర్వదించబడిన శాశ్వతమైన పరలోక రాజ్యం జీవితం, మరొకటి శపించబడిన నరకం.
యేసు క్రీస్తు పరలోకానికి శాశ్వతమైన ప్రధానయాజకుడు . ఆయన పరలోక రాజ్యానికి ప్రధాన యాజకునిగా ఈ భూమ్మీదకు వచ్చి, ఆయన భూమ్మీద తన్ను తాను బలి అర్పణ చేయడమే కాకుండా, తన స్వంత శరీరాన్ని వదులుకోవడం ద్వారా మానవజాతి పాపములన్నిటిని తుడిచివేశాడు (హెబ్రీయులు 7:21, 8:11 -12, 10:10). దేవుడే ఈ భూమ్మీదకు వచ్చి బాప్తీస్మం పొందడం ద్వారా మన పాపములన్నిటిని తీసుకినెను, నీవును మరియు నన్ను లోకములోని ప్రతో ఒక్కరిని పాపముల నుండి రక్షించడానికి. యేసుక్రీస్తు, పరలోక రాజ్యానికి ప్రధాన యాజకుడిగా ఈ భూమ్మీదకు వచ్చి, మానవ ఆకారాములో అవతరించి, మానవజాతి పాపములను బాప్తీస్మం ద్వారా ఆయన శరీరంపై మోశాడు. దీని ద్వారా, మీ పాపములన్ని ఒక్కసారిగా యేసుక్రీస్తుపైకి పంపబడ్డాయి. మరియు యేసుక్రీస్తు తన బాప్తీస్మం ద్వారా మన శరీరంలోని పాపములను అంగీకరించినందున, ఆయన సిలువకు వెళ్లగలడు, సిలువను భరించగలడు, ఆయన మరణమునకు రక్తమును చిందించి గలడు.
అందునే దేవుడు ప్రధాన యాజకుని తన తలపాగా ముందు భాగంలో "ప్రభువు పరిశుద్ధుడు" అని చెక్కిన బంగారు పలక ఉంచబడి అది నీలిరంగు త్రాడుతో జారిపోకుండా జత చేయబడింది. ఇది యేసు తన బాప్తీస్మం ద్వారా సమస్త మానవజాతి యొక్క పాపములను కడిగివేసినందున, విశ్వసించే వారు తమ హృదయములలో పరిశుద్దతను పొందగలరు మరియు దేవుని యెదుటకు రాగలరని ఇది మనకు చెబుతుంది.
బంగారు పలకము తలపాగ ముందు ఉంచబడెను
నిర్గమకాండము 28:37 ఇలా చెబుతోంది, “అది తలపాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను." ఈ భాగం యొక్క ఆర్డమేదనగా మనం ఆయన బాప్తీస్మం నందు విశ్వాసం కలిగి ఉండాలి. లోకములోని పాపములు యేసుక్రీస్తు పైకి పంపబడినవని యెరిగి విశ్వసించడం ద్వారా, మనం తప్పనిసరిగా పాప విమోచన పొందుదుదము. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపములన్నిటిని స్వీకరించాడని అని చెప్పడంలో తప్పుందా? ప్రజలు సాధారణంగా ఎందుకు నాశనం అవుతారు? మీరు మరియు నేను చేసిన పాపం వల్ల కాదు,మనం నాశనం చేయబడేది మరియు దేవుడిచేత విడిచిపెట్టబడినది. ఈ స్పష్టమైన సత్యాన్ని వారు వివారు ఇంకను పాపమును కలిగి ఉన్నారు. యేసు క్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తీస్మం పొందడం ద్వారా మన పాపములన్నిటిని ఒకేసారి తీసివేశాడు, అలా మన పాపములు ఆయన పైకి పంపబడినందున, మన స్థానంలో మన ప్రభువు తీవ్రంగా శిక్షించబడ్డాడు. మనము దీనిని మన మనస్సుతో తెలుసుకొని మన హృదయములో కూడా నమ్మవలెను. అప్పుడే యేసు యొక్క బాప్తీస్మం మన హృదయాలలో మన యొక్క విశ్వాసముగా నాటబడును. పరిశుద్ధగ్రంథములోని బంగారము విశ్వాసమును సూచించును. సత్య సువార్తను విశ్వసించడం ద్వారా మనం పరలోకములో ప్రవేశించగము.
ఈ లోకములోని అన్ని మతాలు సర్వ సాధారణంగా తమ మేల్కొలుపును చేరుకోవడానికి తమ అనుచరులకు బోధిస్తూ ఉంటారు. ఉదాహరణకు, బౌద్ధమతం వారి విశ్వాసులకు నిర్వాణంలోకి ప్రవేశించడానికి సన్యాసి వ్యాయామాల ద్వారా వారి హృదయాలను శుద్దిచేసుకోవాలని బోధిస్తుంది. బౌద్ధమతం యొక్క లక్ష్యం, మరో మాటలో చెప్పాలంటే, ధ్యానంలో మునిగిపోవడం మరియు చివరికి సొంతంగా దేవుడిగా మారడం ద్వారా అన్ని భ్రమ కలిగించే, లౌకిక ఆలోచనలను పక్కన పెట్టడం. కానీ దీనిని సాధించగలిగే వారు ఎవరూ లేరు. కొంతమంది మతవాదులు తమను తాము పర్వతాలలో ఒంటరిగా గడపడం ద్వారా దేవుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు, ప్రారంభ సంఘం తర్వాత కూడా క్రైస్తవ మతంలో,స్వయం పరిశుద్దతను కోరుకునే అనేక గ్రూపులు బయలుదేరాయి.కానీ పర్వతంలో తనను తాను ఒంటరిగా ఉండటం అనగా ఈ వ్యక్తి ఇకపై క్షీణింప చేసే ఆలోచనల ద్వారా శోధించబడడు. మనల్ని మనం ప్రపంచం నుండి వేరు చేయబడి, ఇతర మనుషులతో సంబంధాలు లేకుండా ఉండగలిగితే, మన యొక్క కామ కోరికల నుండి మరియు భావోద్వేగాల నుండి విడుదల పొందగలమని అనుకోవడం చాలా పెద్ద తప్పు. దీనికి విరుద్ధంగా, మన ఎంత ఎక్కువగా ఒంటరిగా ఉంటామో అంతగా, ఈ లౌకిక ప్రపంచం యొక్క కాంక్షతో కూడిన కామ కోరిక మరియు ఆనందం మనల్ని ఎక్కువగా వెంటాడుతాయి. మన హృదయంలో అలాంటి పాపాలు ఉన్నందున, మనం ఎంత చేయాలనుకున్నా మన పాపముల నుండి తప్పించుకోవడం అసాధ్యం. అందుకే యేసు చెప్పాడు, "నేనే మార్గం, సత్యం మరియు జీవం." పరలోక రాజ్యానికి మార్గం మన ప్రభువు మాత్రమే. ఆయనే సత్యం.జీవం.యేసే జీవాధిపతియైన దేవుడు.
ప్రజలు తెలుసుకోవాలనుకునేది పరలోకానికి వెళ్ళే మార్గం.దేవుని రాజ్యానికి నడిపించే ఈ మార్గాన్ని వారు గ్రహించడానికి, సత్యాన్ని వారు పూర్తిగా తెలుసుకోవాలి మరియు విశ్వసించాలి. సత్యం ఏమిటంటే, దేవుడే ఈ భూమ్మీదకు వచ్చి ఒక మానవుని శరీరములో అవతరించి బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా; ఆయన మానవజాతి యొక్క సమస్త పాపములను తీసివేసెను. ఈ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా మన పాపములన్నియు యేసుపైకి పంపబడ్డాయని నమ్మడం ద్వారా మనమందరం దేవుని రాజ్యంలోకి ప్రేవేశించగలము.
దీనికి వేరుగా, మన స్వంత అర్హతల వలన పరలోకములోకి ప్రవేశించడం అసాధ్యం, మరో మాటలో చెప్పాలంటే, అనేక మంచి పనులు చేయడం ద్వారా. ఎందుకని అలా ? ఎందుకంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా, మనం దేవుని ధర్మశాస్త్రము యొక్క ఒక శాసనాన్ని కూడా ఉల్లంఘించినట్లయితే, దీని అర్థం మనం దేవుని వాక్యాన్ని పాటించడంలో విఫలమయ్యాము. దేవుని చట్టం యొక్క ఒక శాసనాన్ని కూడా ఉల్లంఘించడం అంటే ఒకరు దేవుని ముందు పాపి అని అర్థం, అలాంటి వ్యక్తి తన క్రియలు ద్వారా పరలోకానికి వెళ్లడం అసాధ్యం.కావున మనము ఈ సత్యాన్ని విశ్వసించాలి,తద్వారా బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి పొందిన ఆయన బాప్తీస్మం ద్వారా మన యొక్క పాపములను యేసుక్రీస్తు పైకి పంపించవలెయును. యేసు మానవత్వం యొక్క సమస్త పాపములను మీతో పాటు తన శరీరంపైకి తీసుకున్నాడు. కాబట్టి మీ పాపములను యేసుపైకి పంపడం ద్వారా మీ పాపములన్నియు శుద్దిచేయబడును.
దీనిని సాధించడానికి, మీ హృదయంలో ఏదైనా పాపం ఉందో లేదో తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు మొదట పరీక్షించుకోవాలి, పాపం ఉందని మీరు గ్రహించినప్పుడు, నీలం, ఊదా రక్తవర్ణము గల దారం ద్వారా వ్యక్తమయ్యే పాప క్షమాపణను మీరు విశ్వసించాలి. తద్వారా దేవుడు మీ విశ్వాసాన్నిఆమోదించాడు. క్రీస్తు శరీరం యొక్క త్యాగపూర్వకమైన సమర్పణను విశ్వసించడం ద్వారా మనం పాపం నుండి ఒకే సారి రక్షించబడిన తర్వాత పరలోకానికి వెళ్లగలము.ప్రజలు పాపం చేసినందున వారు పరలోకములోకి ప్రవేశించలేకపోయారు, కానీ వారు నిజమైన సత్యాన్ని తెలుసుకోకపోవడం మరియు సువార్త యొక్క నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో వ్యక్తమైన దానిని విశ్వసించలేకపోవడం వలెనే, వారు పరలోక రాజ్యం ప్రేవేశించలేరు, మన అజ్ఞాన కారణాన మనం దేవుని వాక్యానికి దూరమవడం కావడం వలన మనకు సువార్త పొరపాటుగా తెలియజేయబడిందని చెప్పకూడదు, కానీ మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విని విశ్వసించడం ద్వారా తప్పక రక్షింపబడాలి.
ప్రధానయాజకుడు తన ప్రజలను పవిత్రపరచడానికి విశ్వాసంతో కూడిన త్యాగ అర్పణ ద్వారా దేవునికి పరిచర్య చేస్తున్నందున, ఈనాటి రాజులైన ప్రధాన యాజకులైన,మనం కూడా మన మనస్సుతో స్పష్టమైన సత్యాన్ని తెలుసుకోవాలి అలాగే దేవుని యొక్క పరిశుద్దతను మన హృదయాలలోకి స్వీకరించాలి. ఎప్పుడు, ఎక్కడ, అనేది లేకుండా ఏ ఆత్మలు తమ కోసం విశ్వాసపు సమర్పణను కోరినా, మనం ముందుగా దేవుని పరిశుద్ధతను ధరించాలి.`దేవుడు పరిశుద్ధుడు` అనే వాక్య బంధంతో చెక్కబడిన బంగారు పలక, నేటి ప్రధాన యాజకులైన మన నుదుటిపై ఎప్పటికీ ఉంటుంది.
పాపం యొక్క నిజమైన మరియు స్పష్టమైన విడుదల యొక్క సత్యం నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో వ్యక్తమయ్యే సువార్త. ఈ సువార్త మన పాపములన్నిటిని శుద్ధిచేసి , మనల్ని పాపము లేనివారిగా, పరిశుద్దులుగా మరియు పవిత్రం చేసింది. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపములు ఆయన పై మోపబడ్డాయని స్పష్టమైంది. యేసుక్రీస్తు బాప్తీస్మం పొందడం ద్వారా మన పాపములను ఒకసారి శుద్దిచేసాడు కావున, ఆయనను విశ్వసించే వారు పాప విమోచనను పొంది వారి యొక్క విశ్వాసముతో జీవించవచ్చు. అంతేకాక, మన పాపములు క్షమించిన తర్వాత మనము విశ్వాసపు జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు, ఈ సువార్త ఎంత ముఖ్యమైనదో మరియు అవసరమైనదో, మరియు బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు అందుకున్న బాప్తీస్మం యొక్క సువార్త ఎంత ఎక్కువగా ఆశించడమైనదో కూడా మనం ధ్యానం చేయాలి మరియు లోతుగా విశ్వసించాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు కూడా అదే ఆశించడమైనది.
నీరు మరియు ఆత్మ యొక్క సువర్త వాక్యం అవసరం మన హృదయాలలో ఉండాలి. ఎందుకని?మనం అలా చేయాలి,ఎందుకంటే మనం నిత్యం మరియు ప్రతిరోజూ పాపం చేస్తాము.నా పుస్తకాలను చదివే వారిలో,బాప్తిస్మం తీసుకోవడం మరియు సిలువ వేయబడుట ద్వారా యేసు మన పాపములన్నిటి కొరకు శిక్షించబడ్డాడని ఎవరికీ తెలియదు.అయితే, మనం ఈ సత్యాన్ని కేవలం జ్ఞానంగా లెక్కించడానికి ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు.మనం ప్రతిరోజూ పాపములతో తడిసిపోతున్నందున, మనం వీలైనంత సమయంలో ఆయన బాప్తీస్మం మీద ఆధారపడాలి. ఈ విశ్వాసం కలిగి ఉండటం ఒక పాత్రలో నిల్వ చేసిన ధాన్యాలను తీసుకువచ్చి వాటిని మన ఆహారంగా తీసుకోవడం లాంటిది.మరో మాటలో చెప్పాలంటే, నీరు మరియు రక్తం యొక్క నిజమైన సువార్త గురించి మాట్లాడటం మన ఆత్మలకు ఆధ్యాత్మిక ఆహారం.అందుకే యేసు ఇలా అన్నాడు,"మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ, మీలో మీరు జీవము గలవారు కారు."నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును." (యోహాను 6: 53-54).
ప్రతిరోజూ యేసు యొక్క బాప్తీస్మంపై మన విశ్వాసాన్ని మనం నిశ్చయించుకోవాలి.యాజకులందరికి, ఈ విశ్వాసం మరింత దృఢంగా స్థిరపడాలి. వారు ఈ స్పష్టమైన మరియు నిశ్చయమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే వారు తమ రక్షణను కాపాడుకోగలుగుతారు, అలాగే ఇతర పాపాత్ములకు కూడా వారు రక్షింపబడేలా బోధించవచ్చు.ఇక్కడ పరిస్థితి ఇది కాదా? వాస్తవానికి ఇదియే! ప్రతిరోజూ మనకు కావలసింది యేసు బాప్తీస్మం పై నమ్మకం మరియు మన పాపముల కొరకై శిక్షించబడిన యేసును విశ్వసించే విశ్వాసం.
ప్రధాన యాజకుడు ధరించిన తలపాగా ఈ లోకములో కనిపించదు. ఈ లోకములో ఏదైనా తలపాగా ఉన్నదా, దాని మీద బంగారు పలక వ్రేలాడుతూ నీలిరంగు త్రాడుతో కట్టి ఉన్నదా ? అలాంటి తలపాగా ఒకటి మాత్రమే ఉన్నది, అది ప్రధాన యాజకుని యొక్క తలపాగా. నేడు మనకు ఇది ఒక లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది: రాజులైన యాజకులు యేసు బాప్తీస్మం యొక్క విశ్వాసము నందు స్థిరముగా నిలబడాలి. మరియు ఈ సత్యంపై మనకు బలమైన విశ్వాసం ఉన్నప్పుడే మీరు మరియు నేను మన యొక్క యాజక విధులను నెరవేర్చగలమని కూడా ఇది మనకు చూపిస్తుంది.
యేసు బాప్తీస్మం యొక్క విశ్వాసంతో మనo ప్రతిరోజూ స్పష్టంగా మరియు పదునుగా మారాలి. యేసు మన పాపములను తనపై వేసుకున్నాడు కాబట్టి యేసు మరణమునకు సిలువ వేయబడెను. ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపములను తనపైకి మోసుకొనెను కాబట్టి, ఆయన సిలువపై చనిపోయే ముందు, “ఇది సమాప్తమైనది” అని చెప్పియున్నాడు (యోహాను 19:30). మరల ఆయన మృతులలో నుండి తిరిగి సజీవునిగా లేచెను. ఈ నీతియుక్తమైన క్రియలు చేయడం ద్వారా, యేసు మన పాపములన్నిటిని పూర్తిగా తొలగించి తనను విశ్వసించే వారందరికీ శాశ్వతమైన రక్షకునిగా మారెను.
మనం ప్రతిరోజూ యేసు బాప్తిస్మమును గుర్తుంచుకోవాలి. ఎందుకు? ఎందుకనగా మన జీవితాలు తప్పుడు మరియు పాపపు మరకలతో నిండి ఉండెను. మీరు లోపాలతో ఉన్నారా లేదా? ఎక్కువ సమయం గడిచే కొద్దీ, మనలో తగినంత బలము లేకపోవటమే కాక మనలో మనమే ఎక్కువ బలహీనులుముగా కనిపించెదము. మీరు ఇంకా యేసు యొక్క బాప్తీస్మం మరియు సిలువ యొక్క రక్తాన్ని విశ్వసించ లేదా ?
బంగారము యొక్క పలకము పై``ప్రభువు పరిశుద్ధుడు`` అని చెక్కబడింది
ఎటువంటి విశ్వాసం మనల్ని పాపం రహితులుగా మరియు పరిశుద్దులుగా మార్పుపొందడానికి వీలు కల్పిస్తుంది? బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు అందుకున్న బాప్తీస్మం పై నమ్మకమే నీలిరంగు దారం యొక్క విశ్వాసం. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు మానవజాతి యొక్క సమస్త పాపములను అంగీకరించినందున,మన పాపములన్ని ఆయన పైకి పంపబడెను.మన యొక్క పాపములన్నిటిని తన శరీరం మీదకు తీసుకువెళ్లేందుకు బాప్తిస్మం తీసుకున్న యేసుపై మన నమ్మకాన్ని చూపినప్పుడు ఆ విశ్వాసం మన పాపములన్నిటి నుండి విడుదల పొంది అద్భుతమైన అనుభూతి అందిస్తుంది. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మానవజాతి యొక్క పాపములు ఆయన పైకి పంపబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరి పాపములు యేసుపైకి పంపబడినందున, ఈ సత్యాన్ని విశ్వసించే వారు తమ పాపములన్నిటి నుండి ఒకే సారిగా శుద్దిచేయబడుదురు. వారి యొక్క పాపములు విశ్వాసం ద్వారా శుద్ధి చేయబడ్డాయి. పాపములను శుద్దిచేయడం అనునది ప్రత్యక్షపుగుడారము యొక్క వ్యవస్థ యొక్క నీలపు రంగులో సూచించబడింది. మరో మాటలో చెప్పాలంటే, ఆయన బాప్తిస్మమును మీరు నమ్మి మీరు అంగీకరించినప్పుడు మీ హృదయములో ఉన్న పాపములు విశ్వాసం ద్వారా తొలగిపోవును, “ఆహా , నా మరియు మీ పాపములు, అన్నియు లోకములోని ప్రజలందరి పాపములు యేసుక్రీస్తు పైకి పంపబడ్డాయి” మీకును ఈ విశ్వాసం ఉన్నట్లయితే మీ పాపములు కూడా పూర్తిగా కడిగివేయబడతాయి.
బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు అందుకున్న ఈ బాప్తీస్మం గురించి మీరు తెలుసుకునే ముందు, మీ హృదయాలలో పాపం స్పష్టంగా ఉన్నది. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఈ ఒక్కరు ఈ భూమ్మీద పాపం లేనివారుగా ఈ గ్రహం మీద ఆమోదించబడలేదు. ప్రతి ఒక్కరిలో పాపం ఉన్నది, అందువలననే నరకం నిర్ణయించబడింది. కానీ మన పాపములన్నిటిని పోగొట్టడానికి, యేసు ఈ భూమ్మీదకు వచ్చి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన పాపములన్నిటిని స్వీకరించాడు. యేసు స్వీకరించిన బాప్తీస్మం పాత నిబంధన బలి వ్యవస్థ యొక్క చేతులు వేయు పద్ధతి వలె ఉంటుంది; ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు వారి చేతులు వేయపద్ధతి ద్వారా బలి పశువు తలపైకి పంపబడెను. ఈ విధంగా, పాత నిబంధనలో, ముఖ్యంగా లేవీయకాండములో ‘అతని (లేదా వారి) యొక్క చేతులు వేయుట’ అనే అనేక పదబంధాలను మనం కనుగొనవచ్చు.
యేసుబాప్తిస్మం తీసుకున్నప్పుడు మీ పాపములు ఆయన పైకి పంపబడ్డాయా? యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఆయన ఇలా అన్నాడు, "యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను."(మత్తయి 3:15).ఇక్కడ "ఈ విధంగా" అనే పదం గ్రీకులో "హ్యూటోస్", అంటే `ఈ విధంగా`,``చాలా సరి అయినది, `లేదా` ఇది తప్పవేరే మార్గం లేదని. `ఈ పదం యేసు మానవజాతి యొక్క సమస్త పాపములను తిరిగి పొందలేనంతగా బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యేసు పొందిన దానిని చూపిస్తుంది. ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు మన యొక్క పాపములన్నిటిని తీసుకున్నసమయం నిర్ణయాత్మక సమయం, ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు వచనంలో కూడా స్పష్టంగా వ్రాయబడిన ఈ వాక్యాన్ని మీరు మీ మనస్సుతో గుర్తుచేసుకోవాలి. అలాగే నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తను ప్రతిరోజూ ధ్యానించడం ద్వారా, మీరు మీ హృదయాలలో తప్పని సరిగా విశ్వసించాలి.
యేసు మన పాపములన్నిటిని అంగీకరించి ఆయన యొక్క బాప్తీస్మం ద్వారా వాటిని శుద్ధిచేసినది మన హృదయంలో విశ్వసించడం ద్వారా మనం పాప రహితంగా మార్పు పొంది పరలోక రాజ్యంలోకి ప్రవేశించవచ్చు. మనం ఇతర మార్గాల ద్వారా పరలోకములో ప్రవేశించగలమా? మీరు వృద్ధులైనప్పుడు మీరు సున్నితంగా మరియు క్రమ శిక్షణతో ఉంటారని మీరు అనుకోవచ్చు, కానీ మీరు వయస్సు పెరిగే కొద్దీ, మీరు మరింత ముదిరిపోతారు. కాలక్రమేణా మీరు దయతో మరియు మరింత స్వయం -క్రమశిక్షణతో మారగలరని మీరు అనుకుంటే, మీరు ఇలా మారడానికి అసమర్థులని త్వరలో మీరు గురించగలరు. వాస్తవం ఏమిటనగా, మనం పెద్దయ్యాక, మనం మరింత అసహనానికి గురవుతాము మరియు మన యొక్క కోపాన్ని అణుచుకోలేము. మనము దీన్ని చేయగల సామర్థ్యాన్ని మనము కలిగి ఉంటే, బహుశా మన క్రియలతో చట్టాన్ని పాటించడం ద్వారా మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించవచ్చును. కానీ మనకు అలాంటి సామర్ధ్యాలు లేనందున,వలన పాపం, దుష్టత్వం మరియు కోపం మాత్రమే మన నుండి ఉత్పన్నమవుతాయి.
నేను ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది రక్షణ అనునది క్రియలు ద్వారా పొందలేము, కానీ విశ్వాసం ద్వారా మాత్రమే. హెబ్రీయులు 11: 1 ఇలా చెబుతోంది, "విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది." ఆయనను మనం చూడనప్పటికీ, దేవుడు ఇప్పటికి ఉన్నవాడు, ఈ దేవుడు సజీవంగా ఉన్నందున, ఆయన మన జీవితాలలో క్రియ చేయును. దేవుడు మనకు కనిపించని ఈ విశ్వాన్ని సృష్టించాడు, మరియు తన వాక్యం ద్వారా ఆయన రక్షణ యొక్క సత్యాన్ని చూపించాడు. మన హృదయాలలో రక్షణ యొక్క ఈ సత్యాన్ని విశ్వసించడం ద్వారా, మనం పాపం నుండి రక్షించబడి మన హృదయాలలోని సమస్త పాపములను శుద్దిచేసుకోగలము.ఇది ఇప్పటికి కూడా ప్రభావవంతంగా ఉన్నది. అందువల్ల, పాపులు తమ హృదయాలలో ఈ సత్యాన్ని విశ్వసించడం ద్వారా రక్షించబడాలి, వారి పాపముల నుండివారి స్వంత పుణ్యకార్యాల ద్వారా రక్షించడానికి ప్రయత్నించకూడదు.
ప్రధానయాజకుడు యొక్క తలపాగా ముందరి భాగంలో బంగారు పలక ఉంచబడి నీలిరంగు త్రాడుతో కట్టడం అంటే ఏమిటి? దీని యొక్క అర్థం మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తెలుసుకోవాలి మరియు దానిని విశ్వసించాలి. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, మీ మరియు నా అందరితో సహా అందరి పాపములను యేసు తీసుకొనెను. సర్వశక్తిమంతుడైన యేసు ఈ విధంగా మన పాపములన్నిటిని తీసుకున్నది మనం దీనిని తెలుసుకోవాలి మరియు నమ్మాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని మన చెవులతో విన్నప్పుడు, దానిని మన మనస్సుతో తెలుసుకుని, మన హృదయాలతో విశ్వసించినప్పుడే మన హృదయాలు శుద్ధి చేయబడతాయి. మనము ఇంతకు మునుపే పాపం చేసాము అలాగే ఇప్పుడు మరియు భవిష్యత్తులో కూడా మరిన్ని పాపములు చేయకుండా ఉండలేము, మన పాపములన్నిటి నుండి మమ్మల్ని రక్షించడానికి, ప్రభువు ఈ భూమ్మీదకు వచ్చి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన యొక్క పాపములను స్వీకరించాడు.
యేసు మానవజాతి యొక్క పాపములను అంగీకరించి, వాటన్నింటినీ శుద్దిచేసినప్పుడు, మీ పాపములు కూడా ఆయన పైకి వెళ్లాయి. ఈ సత్యాన్ని విశ్వసించడం ద్వారా, మీరు మీ సమస్త పాపముల నుండి విడుదల పొందవచ్చు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా వచ్చిన యేసుక్రీస్తు పొందినబాప్తిస్మమును మనము విశ్వసించినప్పుడు, మీరు మరియు నేను మన హృదయాలలోని సమస్త పాపముల నుండి శుద్దిచేయబడుదుము,అటువలె యేసుక్రీస్తు కూడా మన పాపములన్నిటి కొరకు శిక్షించబడ్డాడని నమ్మడం ద్వారా, మనము దేవుని యొక్క స్వంత పిల్లలుగా మారగలము. అందువల్ల, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే విశ్వాసం ద్వారానే మనం తిరిగి జన్మించి దేవుని యొక్క పిళ్ళం కాగలము. మన ప్రభువు మనకు ఈ విధమైన విశ్వాసాన్ని అనుగ్రహించాడు.
యాజకుని నార దుస్తులు
ప్రధాన యాజకునికి నార దుస్తులను తయారు చేసి వారికి ధరింప చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. వారు నడుము నుండి తొడల వరకు చేరుకొని వారి దిసమొలను కప్పిపుచ్చుకోవలసి ఉంటుంది. మరియు దేవుడు మరణాన్ని నివారించడానికి, అహరోను మరియు అతని కుమారులు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు లేదా ఆవరణలో సేవ చేయడానికి బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు యాజకులు వాటిని ధరించవలెనని చెప్పెను, అలాగే ఇది ఎప్పటికీ అహరోను అతని తరువాత అతని వారసులకు ఒక శాసనం అని కూడా తెలియజేశాడు.
అవి యాజకుల యొక్క దిసమొల కనిపించకుండా ధరించే లోదుస్తులు. దేవుని యెదుట వారి దిసమొలను బహిర్గతం చేయడం ఆయన యెదుట అపవిత్రతను వెల్లడి చేయును, కావున ఎవరి పాపములు దేవుని యెదుట బయలుపడునో వారికి మరణశిక్ష విధించబడుతుంది. అందుకే దేవుడు యాజకులు యొక్క వారి దిసమొలను కప్పుకోవాలని ఆదేశించాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు తన నీతియుక్తమైన ఈ పరిపూర్ణ సువార్తను విశ్వసించే విశ్వాసంతో మన పాపములను మరియు మన అపవిత్రతను కప్పుకోవాలని దేవుడు చెప్పాడు.
అయితే, ప్రధాన యాజకుని యొక్క తెల్లని నారతో కూడిన నిలువుటంగీ ఏమైయున్నది?అవి దేవుని నీతిని విశ్వసించే విశ్వాసమైయున్నది. దేవుడు మనలను పాపము లేని వారిగా చేసిన పరిపూర్ణమైన రక్షణకు సంబంధించిన సత్యం అవి.యేసుక్రీస్తు తానే దేవుడై (ఊదా దారం) గా ఈ భూమ్మీదకు వచ్చి, (నీలిరంగు దారం) గా బాప్తీస్మం పొందాడు, ఆయన(ధూమ్ర రక్తవర్ణముగల దారం)తన రక్తం చిందించి సిలువపై మరణించాడు, మరల మృతులలో నుండి తిరిగి లేచాడు తద్వారా మన రక్షణను సంపూర్ణంగా ముగించాడు. దేవుడు తన బాప్తీస్మంతో మన పాపములన్నిటిని తొలగించుటయు అలాగే మన తరపున ఆ పాపములన్నిటికి వెల చెల్లించి శిక్షించబడటను విశ్వసించడం మన హృదయాలలో రక్షణకు సంబంధించిన నార యొక్క నిలువుటంగీ ధరించవలసి ఉంటుంది. మన హృదయాలను నమ్మడం ద్వారా మనం పూర్తిగా పాపం నుండి రక్షించబడుదుము అటువలె మనం దేవుని బిడ్డలుగా మారి ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలము.
మన హృదయాలలోని సమస్త అపవిత్రతను తొలగించడానికి ఏకైక మార్గం యేసు పొందిన బాప్తీస్మం మరియు ఆయన సిలువపైన ఆయన రక్తాన్ని నమ్మడం. ప్రత్యేకించి, నీలిరంగు దారం యొక్క విశ్వాసం, యేసు తన బాప్తీస్మం ద్వారా సమస్త పాపములను అంగీకరించాడు, మన రక్షణకు ప్రధానమైన సత్యం మన పాపములన్నిటిని శుద్ధిచేయును, మరియు దీనిని విశ్వసించడం ద్వారా మన యొక్క అపవిత్రత పూర్తిగా మాపిచేయబడును. మనలో ఉన్న లోపాలు మరియు అన్యాయాలతో సంబంధం లేకుండా మనలో ఎటువంటి సంకోచం లేకుండా దేవుని యెదుటకు ఎలా రాగలము ? మన అపవిత్రతను పరిపూర్ణంగా కప్పి ఉంచే దేవుని నీతిని మనం విశ్వసించినప్పుడే అది సాధ్యమవుతుంది. నీరు మరియు రక్తం, అనగా నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణము గల దారంతో దేవుడు మనలను రక్షించాడనే విశ్వాసంతో, మన అపవిత్రతను పూర్తిగా మనం తొలగించుకోవచ్చును. యేసు ఈ భూమ్మీదకు వచ్చి, తన నీతిమంతమైన కార్యాలతో మనల్ని సంపూర్ణంగా నీతిమంతులుగా చేసాడు, తద్వారా మన యొక్క నిత్య రక్షణకు ప్రభువు అయ్యాడు. దీనిని నమ్మడం ద్వారా మనం పాప రహిత స్థితికి చేరుకోగలం. దేవుని నీతి గల కార్యాలను విశ్వసించడం ద్వారా, ఆయన మనలను ప్రేమించి మనల్ని పాప రహితంగా మార్చాడు, మనం పాపం యొక్క శిక్ష నుండి తప్పించుకోవచ్చు. మన హృదయాలలో దేవుని ఈ నీతివంతమైన రక్షణను విశ్వసించడం ద్వారా, మనం శాశ్వత జీవాన్ని పొందగలము.
మనం రోజూ పాపం చేయుదుము. కావున మనము, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో మన పాపములన్నిటిని తుడిచిపెట్టిన దేవుని యొక్క రక్షణను తెల్లని నార వంటి ప్యాంటు ధరించకుండా దేవుని వద్దకు వచ్చే ఎవరైనా మరణిస్తారని మనం గ్రహించాలి. మనం దేవుని యెదుటకు వచ్చినప్పుడు చనిపోకుండా నిరోధించే విశ్వాసం ఆయన నీతిని విశ్వసించే విశ్వాసం తప్ప మరొకటి కాదు. దేవుని యొక్క నీతిని విశ్వసించే ఈ విశ్వాసం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే విశ్వాసం. అటువంటి తెల్లని నార యొక్క నిలువుటంగీ ధరించమని దేవుడు మనకు చెప్పినందున, మనం దీనిని ధరించాలి మరియు మన హృదయాలలో విశ్వాసం ద్వారా పాపం యొక్క నిజమైన విమోచన యొక్క నిలువుటంగీ ధరించాలి.
ఈ విశ్వాసంతో మనం దేవుని యెదుటకు వచ్చినప్పుడు, మనం మరణానికి గురికాకూడదు. అందుకని, ప్రధాన యాజకుని యొక్క ఈ వస్త్రాలలో కనిపించేది నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం గూర్చియే. ప్రధాన యాజకుల యొక్క వస్త్రాలలో ఎదో ఒక ఆధ్యాత్మిక అర్థం లేనిది కాదు. మనల్ని దేవుడు ధరించమని ప్రశంసించిన ఏ వస్త్రాలను నేటి ప్రధాన యాజకులైన మనము వదిలిపెట్టలేము. ప్రధాన యాజకులు నార వంటి నిలువుటంగీ లేకుండా ఇతర వస్త్రాలను ధరిస్తే ఏమి జరుగుతుంది? అతను ఖచ్చితంగా మరణశిక్షకు గురవుతాడు. సాధారణ ప్రజలు ఈ నార యొక్క నిలువుటంగీ ధరించాలా వద్దా అనేది మీ ఇష్టం, కానీ ప్రధాన యాజకులు వాటిని ధరించకపోతే, వారిని సిగ్గుపరచే దిసమొలను బట్టి వారు చంపబడుదురు - అనగా వారి పాపములు లేదా అపవిత్రతను బట్టి వారు పూర్తిగా చంపబడరు.
దేవుని యెదుట మనకు అటువంటి పరిపూర్ణమైన రక్షణను విశ్వసించే విశ్వాసం మన హృదయమునకు లేకపోతే ఏమవుతుంది? మన హృదయంలో రక్షణ యొక్క దుస్తులు ధరించకుండా, మనల్ని పాప రహితంగా చేశాడని మన హృదయాలలో నమ్మకం లేకుండా దేవుని యెదుటకు వస్తే ఏమి జరుగును ? మనం పాపులుగానే ఉందుము. `పాపం యొక్క జీతం మరణం` కావున, వారి పాపములను బట్టి వారికి శిక్ష విధించబడును, అలాగే మరణ శిక్షయు కలిగి మరియు నిత్య నరక అగ్నిలో పడవేయబడుదురు.అందుకే దేవుడు మీ కోసం చేసిన రక్షణ యొక్క దుస్తులను మీ హృదయాలలో తప్పనిసరిగా ధరించవలెను. నీలం,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంలో వ్యక్తమయ్యే సత్యాన్ని విశ్వసించడం ద్వారా మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము.
అందుకే పరిశుద్ధగ్రంధము చెప్పుచున్నది తుప్పు పట్టని మరియు అత్యంత విలువైన లోహం అయిన బంగారం ‘విశ్వాసమును ’ సూచిస్తుంది. పరిశుద్ధగ్రంథములో బంగారము విశ్వాసమును సూచిస్తుంది, ఇత్తడి శిక్షించడాన్ని సూచిస్తుంది. ప్రధాన యాజకుల యొక్క దుస్తులను బంగారముతో తయారు చేయడానికి బంగారము యొక్క దారంతరచుగా ఉపయోగించబడుతుందనే వాస్తవాన్ని మనం తెలుసుకోవచ్చు. పరిపూర్ణమైన రక్షణ యొక్క ఈ సువార్తపై మనం ఎల్లప్పుడూ బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఇది సూచిస్తుంది.నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో వ్యక్తమయ్యే సత్యాన్ని మనం నమ్మవలెను. దీనిని మనం శాశ్వతంగా పాటించవలసిన ప్రతి రూపంగా ఉండాలని దేవుడు చెప్పాడు.
మన మనస్సులోను మరియు హృదయాలోను, మీరు మరియు నేను ఈ సత్యాన్ని నిస్సందేహంగా విశ్వసించాలి. నిజమైన విశ్వాసం నిజమైన జ్ఞానం, భావాలు క్రియలతో కూడి ఉండాలి. మీకు ఈ విధమైన విశ్వాసం మరియు సత్యం మీలో ఉన్నదా? మీ హృదయములో నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవరణముగల దారములో వ్యక్తమయ్యే సత్యాన్ని మీరు నిజంగా విశ్వసిస్తున్నారా? దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని, అలాగే బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా, మీ పాపములన్నియు ఆయన తొలగించి, మృతులలో నుండి ఆయన మరల లేచాడని మీరు నమ్ముతున్నారా? మీరు నిజంగా ఈ సత్యాన్నివిశ్వసించటం ద్వారా, మీ హృదయములో మరియు ఆత్మలో రక్షణ దుస్తులు ధరించియున్నారని దీని అర్థం.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అపొస్తలుడైన పౌలు ద్వారా మందలించాడు, “ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు" (రోమా 10: 3). వారి మంచి పనులతో తమ స్వంత ధర్మాన్ని స్థాపించడానికి మరియు గొప్పలు పలికే వారిని దేవుడు ఇష్టపడడు. దేవుడు మనపై ప్రేమతో మనకోసం చేసిన మంచి పనులను నమ్మని వారందరూ నాశనం చేయబడుదురు. మీరు దేనిని నమ్ముతారు? మీరు మీ యొక్క స్వనీతిని విశ్వసిస్తున్నారా లేదా దేవుని యొక్క నీతిని విశ్వసిస్తున్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని యేసు బాప్తీస్మం మరియు సిలువ యొక్క రక్తం అను ఈ రెండింటితో ఆయన మీ పాపములన్నిటిని తొలగించాడని మీరు నిజంగా హృదయపూర్వకంగా నమ్ముతున్నారా? మీరు ఈ సత్యాన్ని విశ్వసిస్తున్నారా, మిమ్మల్ని మీరు అప్పగించుకొను ప్రదేశం ఇదేనా ? మీరు నిజంగా మీ హృదయంలో ఈ సత్యాన్ని స్థిరముగా నమ్ముదురా ? లేదా మీ జీవితాలను మీ స్వతగా ఇష్టపూర్వకంగా నడిపించడానికి ప్రయత్నించడం ద్వారా మీ యొక్క పాపముల నుండి క్షమాపణ పొందడానికి మీరు ఇంకా ప్రయత్నిస్తున్నారా?
వాస్తవానికి, మీరు ఉపయోగకరమైన వ్యక్తిగా జీవించాలి. తిరిగి జన్మించిన తర్వాత, మీరు మరింత కనికరముతో జీవించాలి.ఏదేమైనను,పరిశుద్ధాత్మలో, న్యాయమైన జీవితం ఏమిటో మీరు ముందుగా గుర్తించాలి. పరిశుద్ధగ్రంధము ఇలా చెప్పుచున్నది, “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” (1 పేతురు 2:9). నేటి దేవుని యాజకులకు, కనికరముతో జీవించడం అనగా సత్య సువార్తను అందించడం.
మన కొరకు దేవుని యొక్క ప్రేమను ఆయన సువార్త యందు విశ్వాసముంచని వారును,అలాగే యేసు యొక్క బాప్తీస్మం మరియు ఆయన యొక్క రక్తం అను ఈ రెండింటితో పరిపూర్ణoగా వారి పాపములు శుద్దిచేసాడని నమ్మని వారి స్థితి ఎంత దయనీయము.
ఒకప్పుడు విడిపోయిన మత్స్యకారుల యొక్క సమూహం పది రోజుల తర్వాత అపరిమితమైన సముద్రపు తుఫాను మరియు అలలతో పోరాడిన తర్వాత వారు అమెజాన్ నది ముఖద్వారం వద్దకు చేరుకున్నారు.పది రోజులపాటు వరకు నీళ్లు త్రాగక పోవడంతో వారంతా అలసిపోయారు. చివరకు, వారు మంచి నీరు ఉన్న భాగానికి వచ్చారు. ఏదేమైనా, నది యొక్క నోరు చాలా విస్తారంగా ఉన్నందున, వారు వాస్తవంగా త్రాగు నీటిపై తేలుతున్న ఈ అద్భుతమైన వాస్తవాన్ని ఎవరూ గుర్తించలేదు. ఫలితంగా, మరింత క్రొత్త నీరు ప్రవహించటం వలన వారంతా చివరికి అలసిపోయి మరణించారు.ఎంత విషాదకరమైన పరిస్థితి వారిది! దీనిని ఆధ్యాత్మిక కోణం నుండి చూస్తే, దాదాపు ఈ తరం ప్రజలందరూ వారి యొక్క పాపముల బట్టి వ్యతిరేకంగా పోరాడుతున్నను, ఆధ్యాత్మికంగా అలసిపోయి యున్నారు, అయితే యేసు యొక్క బాప్తీస్మం మరియు ఆయన సిలువ యొక్క రక్త అను ఈ రెండింటి ద్వారా వారి పాపములు అప్పటికే తుడిచి వేయబడినవని గ్రహించరు.
దేవుడు నిన్ను మరియు నన్ను ప్రేమిస్తున్నందున, ఆయన మన పాపములన్నిటిని తుడిచిపెట్టే నీతివంతమైన కార్యాలను పూర్తి చేశాడు. ఈ సత్యాన్ని విశ్వసించడం ద్వారా మనం యొక్క దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము. ఈ విశ్వాసం మనల్ని మరల పుట్టడానికి వీలు కల్పించును. మరల పుట్టడం అనగా మరోసారి దేవుని పిల్లలుగా జన్మించటం ; మనం ఒకప్పుడు పాపులుగా జన్మించినప్పటికీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తున్నట్లు ప్రకటించినప్పుడు మనం పరిశుద్ధాత్మ యొక్క క్రియ ద్వారా నీతిమంతులుగా మారుదుము. పాపము లేని వారిగా మరల జన్మించడం ద్వారా మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము.
మీరు మీ ఆత్మలకు దేవుని యొక్క మంచిని మరియు నీతివంతమైన రక్షణ వస్త్రాలను ధరింప చేశారా?ఈ సువార్తను మీ యొక్క ఆత్మలు వాస్తవంగా విశ్వసిస్తున్నాయా ? అన్నింటికన్నా ముఖ్యమైనది ఏదనగా, మీ హృదయాలలో ఈ నిజమైన సువార్తను మీరు విశ్వసిస్తారో లేదో అనునది. మీ స్వతాగా సత్యాన్ని గ్రహించడానికి బదులుగా లేదా ఈ లౌకిక ప్రపంచం యొక్క బోధనలను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించే బదులు, మీకు ముందుగా పాప విమోచన పొందిన వారు మీకు బోధించే దేవుని యొక్క వాక్యాన్ని మీరు విశ్వసించాలి. సత్య సువార్త అనునది మీ మనస్సులో మీకు తెలియని విషయమేమి కాదు, కానీ మీరు మీ యొక్క హృదయాలలో దీనిని నిజంగా విశ్వసించాలి. మీరు నిజంగా విశ్వసించడం ద్వారా పరలోకములో ప్రవేశించగలరు. సోదరులారా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఏ ఆశీర్వాదం అనుగ్రహించాడో ? తన ఏకైక కుమారుని యొక్క బలి యాగం ద్వారా మన పాపములన్నిటిని నిర్మూలించడం ద్వారా, దేవుడు మనల్ని తన సొంత పిల్లలుగా చేసుకున్నాడు.
ఈలోకము యొక్క ప్రజలు నీతిని చేయాలనుకుంటున్నారు మరియు సరైన పనులు చేసే వారిని కూడా వారు గౌరవిస్తారు. మానవజాతి అంతటి కోసం తనను తాను త్యాగం చేసిన యేసు యొక్క కార్యములు అత్యంత నీతివంతమైనవి కాదా? నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మానవజాతి వలన చేయబడలేదు. ముఖ్యంగా దేవుడు మన కోసం నెరవేర్చిన అత్యంత ధర్మబద్ధమైన మరియు నీతిమంతమైన పని ఇదియే . ఈ లోకములోని ప్రజలందరి కోసం యేసు బాప్తిస్మం తీసుకొని సిలువపై తనను తాను అర్పించుకొనియున్నాడు కావునా, మనము ఆయనను నిజమైన రక్షకునిగా గుర్తించితిమి. నీతిమంతుడు అను వాడు ఎక్కడైనను ఎప్పుడైనను ఒక్కరే ఉందురు మరియు ఆయన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు తప్ప ఈ గ్రహం మీద తాను లేదా ఆమె ద్వారా నీతిమంతుడైన మరొకరు ఎవరు లేరు.
మీరు నీతిమంతులు కావాలనుకుంటున్నారా? దేవుడు మీ కోసం చేసిన నీతిమంతమైన కార్యమును నమ్మడం ద్వారా, మీరందరూ నీతిమంతులుగా మారగలరు . దేవుని యొక్క నీతివంతమైన పని నీరు మరియు ఆత్మ యొక్క సువార్త తప్ప మరొకటి కాదు. ఈ ధర్మబద్ధమైన పని చేసిన యేసును నమ్మండి. దేవుడు మనలను ప్రేమించినందున మన పాపములన్నిటి నుండి తొలగించాడు. విశ్వాసం ద్వారా ఆయన యొక్క ఈ సత్యమును మరియు ఆయన ప్రేమను మనం అంగీకరించినప్పుడు, దేవుడు పరిశుద్దుడుగా ఉన్నట్లే మనం కూడా పరిశుద్ధులము కాగలము. దేవుడు చెప్పాడు, “నేను మీకు దేవుడనై యుండుటకు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.” (లేవీయకాండము 11:45). మన జీవితాలను విశ్వాసం నుండి విశ్వాసంతో జీవించవలెనని దేవుడు మనకు చెప్పాడు. మీ యొక్క సమస్త పాపముల నుండి మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించిన యేసు యొక్క ఈ న్యాయమైన పనిని మీరు హృదయపూర్వకంగా నమ్ముతున్నారా? లోకములోని అత్యంత నీతివంతమైన పని మన ప్రభువు యొక్క శాశ్వతమైన బలి యాగం ద్వారా ఇప్పటికే నెరవేరిందని నేను నమ్ముతున్నాను. యేసు స్వీకరించిన బాప్తీస్మం , ఆయన సిలువ రక్తం మరియు మరణం నుండి ఆయన పునరుత్థానం ద్వారా ఇవన్నీ నెరవేరాయని నేను నమ్ముతున్నాను.
ఆయన సత్య వాక్యము ద్వారా నాకు అనుగ్రహించిన విశ్వాసంతో నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.