(నిర్గమకాండము 28: 15-30)
"మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదు పని వలె దాని చేయవలెను; బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను. దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను.మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది; పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది; గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది; రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులు గలవై వారి పేరుల చొప్పున పండ్రెండుండవలెను. ముద్ర మీద చెక్కినవాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.మరియు నీవు రెండు బంగారు ఉంగర ములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగర ములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లు నప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయ విధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెన మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.
మనము ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రధాన యాజకుడు తీర్పు ఇచ్చిన న్యాయ విధానం పతకము వైపు ఇప్పుడు మన దృష్టిని మలుపుదుము. తీర్పు యొక్క న్యాయ విధానం పతకము యొక్క పొడవు మరియు వెడల్పు రెండింటిలోనూ ఒక చతురస్రాన్ని రెండింతలు చేసి ఒక వస్త్రముతో తయారు చేయబడిందని పై భాగం చెబుతుంది. ఈ వస్త్రము బంగారం, నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో కళాత్మకంగా నేయబడింది. ఈ వస్త్రము పై, పన్నెండు విలువైన రాళ్లు ఉంచబడ్డాయి,మొత్తం నాలుగు వరుసల కోసం ప్రతి వరుసలో మూడు ఉంచబడ్డాయి. ఊరీము మరియు తుమ్మీములను తీర్పు యొక్కన్యాయ విధానం పతకములో ఉంచమని దేవుడు మోషేకు చెప్పాడు. ఇక్కడ ఊరీము మరియు తుమ్మీము అనగా `వెలుగుయు మరియు పరిపూర్ణత`.అనియు అర్ధం."
ప్రధాన యాజకుని తీర్పు యొక్క ప్రామాణికం
మనము ఎరిగినట్లుగా, ప్రతి కేసును సంబంధిత ప్రమాణాలతో మరియు నియమాలు నిబంధనలతో చర్చించిన తర్వాతనే శిక్ష విధించబడును. అలాంటప్పుడు, ప్రధాన యాజకుడు తన యొక్క ప్రజల కోసం ఏ ప్రమాణాన్ని బట్టి తీర్పు తీర్చ గలడు? అతను తన ప్రజలను ఊరిమ్ మరియు తుమ్మీముతో తన యొక్క న్యాయ విధాన పతకము ద్వారా తీర్పు చెప్పవలెను, అనగా అది `వెలుగుయు మరియు పరిపూర్ణతై యున్నది.`సరిగ్గా తీర్పు చెప్పడానికి అతనిని అనుమతించిన ప్రాథమిక విశ్వాసం ఐదు దారములలో కనిపించే విశ్వాసం. మరో మాటలో చెప్పాలంటే, బంగారం, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో చేసిన విశ్వాసంపై ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రధానయాజకుడు తీర్పు చెప్పును.
మరొక విధంగా చెప్పాలంటే, ప్రధాన యాజకుని తీర్పు యొక్క ప్రమాణం నీలం, ఊదా,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు న్యాయ విధాన పతకము కొరకు ఉపయోగించిన సన్నని పేనిన నారలో కనిపించే ‘వెలుగు మరియు పరిపూర్ణత’ అనునది సత్యమైయున్నది. ఐదు దారములలో కనిపించే సత్యాన్ని విశ్వసించడం ద్వారా, ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు వారు ఆధ్యాత్మికంగా సరైనవారుగా ఉన్నారా లేదా పొరపాటులతో ఉన్నారో తన అధికారిక నిర్ణయాలను బట్టి నిర్ణయించగలడు.
ప్రతి ప్రధాన యాజకుని యొక్క హృదయం మీద న్యాయ విధాన పతకము ఉంచబడింది, మరియు దాని లోపల ఉరిము మరియు తుమ్మీము ఉంచబడ్డాయి. ఇది ఒక ప్రధాన యాజకుని హృదయంలో, వెలుగు మరియు పరిపూర్ణత యొక్క సత్యం ఎంత స్థిరముగా స్థాపించబడిందంటే, అతను ఇశ్రాయేలు ప్రజలను ఎల్లప్పుడూ నడిపించగలడు మరియు వారి విశ్వాసం సరైనదా కాదా అని తీర్పు ఇవ్వవలెయును, దేవుని బలి వ్యవస్త ప్రకారం వారు నైవేద్యాలు ఇచ్చారో లేదో, అలాగే ఆయన ఆజ్ఞలను పాటించారో లేదో.
ఈ రోజు, మనం, దేవుని యొక్క రాజులైన యాజకులుగా కూడా అదే ప్రమాణాన్ని కలిగి ఉండి ఈ కాలములోని ప్రజలకు తీర్పు తీర్చాలి. న్యాయ విధాన పతకము కొరకు ఉపయోగించే ఐదు దారాలలో వ్యక్తమయ్యే సత్యాన్ని ప్రజలు విశ్వసిస్తే, వారు దేవుని యెదుట లోకానికి వెలుగుగా మార్పు పొందవచ్చును, మరియు వారు నమ్మకపోతే, శిక్షించబడుదురు.
కొంతమంది పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉండవచ్చని వాదించే ఈ పదంతో కొందరు అంగీకరించనటువంటిది. పైకి ఎక్కువారు ఇలా అనుకొందురు, "మీరు గతసారి సులభమైన పద్దతని ఎన్నుకున్నారు, కానీ నేను ఈ పర్వతాన్ని జయించటానికి అత్యంత కష్టమైన శిఖరం అయిన తూర్పు మార్గమును ఎన్నుకొంటాను."ఖచ్చితంగా, పర్వతారోహణ విషయానికి వస్తే, అలాంటి ప్రత్యామ్నాయ మార్గం చాలా సాధ్యమే. అయితే, మన ఆధ్యాత్మిక సామ్రాజ్యం విషయానికి వస్తే, అది ఎటువంటి వివాదానికి రాజీకి అంగీకరించనటువంటిది.దేవుడు స్థాపించినది మాత్రమే ప్రామాణికమైనది. మనం దేవుని యెదుట లోకానికి వెలుగుగా ఉండాలంటే,మనకు ఎలాంటి పద్ధతులు లేవు, కానీ ఒకే ఒక మార్గం ఉన్నది : అది ఈ విధంగా బంగారం, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవరణముగల దారములో వ్యక్తమయ్యే రక్షణ యొక్క వెలుగు సత్యాన్ని తెలుసుకోవడం మరియు నమ్మడం. దారం మరియు సన్నీని పేనిన నార, ఇవి న్యాయ విధాన పతకము మరియు ఏఫోదు యొక్క వస్తువులు, కావున మనము పాప విమోచన పొందుదుము అలాగే దేవుని స్వంత పిల్లలం కాగలము.
లోకానికి వెలుగుగా మారడానికి వేరే మార్గం లేదు, కానీ దేవుడు నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో మన పాపములన్నిటిని తుడిచివేసి మనల్ని నీతిమంతులుగా చేశాడని నమ్మడం ద్వారా. ప్రధాన యాజకులు ధరించే వస్త్రములు ఉపయోగించే వస్తువుల యొక్క సత్యాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే పాపులు నీతిమంతులుగా మారగలరు అలాగే అసంపూర్ణులు పరిపూర్ణులుగా మారగలరు. అదేవిధంగా, మనం దేవుని యెదుట రక్షింపబడ్డామా లేదా అని మనలను మనము తీర్పుతీర్చుకున్న యెడల,నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యం పై ఆధారపడి తీరుపై తీర్చబడితే ప్రకాశించెడి సత్యపు వెలుగుగా ఉండెదము.
వాస్తవంగా మనం పరలోకానికి వెళ్ళేది లేదా నరకానికి వెళ్ళేది దేవుని యెదుట పొందు సరైన తీర్పును బట్టి జరుగును,అయితే తీర్పు చేయు న్యాయ విధాన పతకముకు ఉపయోగించే వస్తువుల సామాగ్రిని తెలుసుకొని విశ్వసించే ఈ విశ్వాసం మనకు ఉండాలి. మనం ఇతరులను అనగా వారు నీరు మరియు ఆత్మ యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తారో లేదో తెలుసుకోవడానికి, మనం ముందుగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించాలి. మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, బంగారం, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో సత్యం స్పష్టంగా కనబడుతుంది, మరియు పేనిన నార ఖచ్చితంగా పాపపు విమోచన గురించి సరైన తీర్పును పొందడానికి మనకు వీలు కల్పిస్తుంది మరియు ఈ సత్యమే సరైన తీర్పుకు సాక్ష్యమిస్తుంది. దీనిని మీరు ఇప్పుడు అర్థం చేసుకోగలరా?
ఈ రోజున పాపపు విమోచన గూర్చి సరైన తీర్పు ఇవ్వగల మొదటి వ్యక్తి ఎవరు? ఇది పరలోకం యొక్క శాశ్వతమైన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు. యేసుక్రీస్తు మన పాపములన్నిటిని తన బాప్తీస్మం ద్వారా తన పైకి తీసుకొని, సిలువపై మరణించి మరల మృతుల నుండి లేవడం ద్వారా, లోకములోని పాపముల నుండి మనల్ని శాశ్వతంగా విడిపించాడు. కాబట్టి, ఈ సత్యం ప్రకారం ఎవరు యేసుక్రీస్తును విశ్వసిస్తారో వారు రాజులైన యాజకులు కాగలరు అటువలె ప్రజలను సరిగ్గా తీర్పు చెప్పే అర్హతను కలిగి ఉందురు.ఇప్పుడు, తిరిగి జన్మించిన వారికి అనగా మనకు దేవుడు ఇచ్చిన ప్రామాణిక ప్రకారం, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ప్రకారం రక్షించబడని వారికి తీర్పు తీర్చాల్సిన బాధ్యత మన పై ఉన్నది. మరియు అత్యున్నత న్యాయమూర్తి అయిన యేసుక్రీస్తు యెదుట మనం ఈ కర్తవ్యాన్ని విశ్వసనీయంగా నిర్వర్తించాలి.
ఆధ్యాత్మికమైన యాజకులుగా మనము ఇచ్చు తీర్పును ఇష్టపడని వ్యక్తులు కొందరు ఉంటారు వారు మనకు వ్యతిరేకంగా నిలబడి, “ నీవు దేవుడవు కావు ! మీరు నా వంటి మనిషివే, నేను పాప విమోచన పొందినది లేదా అని మీరు ఎలా గుర్తించగలరు? పాపులకు సరైన తీర్పు దేవుడు మాత్రమే ఇవ్వగలడు ! మిమ్మల్ని మీరు ఎవరు అనుకుంటున్నారు? నేను రక్షించబడినది లేనిదీ నిర్ధారించడానికి మీకు ఎంత ధైర్యం ? ఇది దేవునికి మాత్రమే తెలుసు. నువ్వు దేవుడివా? మీరు అందరి కంటే ఉత్తములని మీరు అనుకుంటున్నారా?"
ఆధ్యాత్మిక యాజకుల యొక్క నిర్ణయాలు దోషరహితంగా ఉండటానికి కారణం, ప్రభువు నుండి వారికి అలాంటి హక్కు అప్పగించబడినందున. దేవుని యాజకులు ఏది సరైనది మరియు ఏది తప్పు అని నిర్ణయించినప్పుడు, మనం ఈ తీర్పును విశ్వసించాలి, ఎందుకంటే ఇది సరైన తీర్పు. వైద్యులు తమ రోగుల యొక్క అనారోగ్యాన్ని నిర్ధారించగలరు కాబట్టి, ఆధ్యాత్మిక యాజకులు ఆత్మలను పరీక్షించి, వారు ఇంకా పాపులుగా ఉన్నారా లేదా నీతిమంతులుగా ఉన్నారో లేదో నిర్ణయించాలి.
నీలం, ఊదా, మరియు ధూమ్రరక్త వర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారను విశ్వసించే విశ్వాసం ద్వారా మనం అలాంటి ఆధ్యాత్మిక మైన యాజకులుగా మారగలము. ఈ ఆధ్యాత్మికమైన యాజకులు తమ పాపముల నుండి విమోచించబడి సత్యం యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా దేవుని నుండి పరిశుద్ధాత్మను పొందియున్నారు . అలా యాజకులుగా మారిన వారు న్యాయంగా పాపులను గుర్తించగలరు. నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో వ్యక్తీకరించబడిన సువార్తను వినడం మరియు విశ్వసించడం ద్వారా మనము పాపముల నుండి విడుదల పొందాము,కాబట్టి మనము ఇప్పుడు పాపులకు స్వస్థత చేకూర్చగలము మరియు వారిని క్రీస్తు వైపుకు నడిపించగలుగుతున్నాము.
ప్రజలు నీ యొక్క యాజకత్వమును గూర్చి సవాలు చేసినప్పుడు దానిని నీవు ధైర్యముగా బహిర్గతం చేయాలి
పాపులు, వారి స్వంత ఆలోచనలతో, నీతిమంతులు చేయు న్యాయమైన తీర్పు యొక్క శక్తిని తగ్గించడానికి కూడా ప్రయత్నించుదురు.అయితే, ఇంకా దారుణమైన విషయం ఏమిటనగా, మనము అప్పటికి జన్మించినప్పటికీ మన స్వంత యాజకత్వం గురించి మనకు నమ్మకం లేకపోతే ఎంత చెడ్డగా ఉంటుంది. మనం తిరిగి జన్మించి ఇతరులకు తీర్పు తీర్చినప్పుడు,“నేనేమైన అహంకారంతో ఉన్నానా? నేను ఏదైనా ఇక్కడ తప్పు చేశానా? "అని మనం ఆలోచించుట సాధ్యమవుతుంది కానీ ఇక్కడ అలాంటి తప్పు ఏమీ లేదు, ఎందుకంటే ఆధ్యాత్మికంగా దేవుని యాజకులుగా మారిన వారు మాత్రమే ఈ ఆధ్యాత్మిక తీర్పును సరిగ్గా చేయగలరు. కాబట్టి, మనము తిరిగి జన్మించినప్పుడు పాపులకు తీర్పు తీర్చవలసి వచ్చినప్పుడు వారు మన అధికారాన్ని వారు సవాలు చేసినప్పుడు. యేసు తన శిష్యులకు అలాంటి అధికారాన్ని అనుగ్రహించాడు,“మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను."(యోహాను 20:23). ఆధ్యాత్మిక యాజకులుగా మారిన వారు సువార్తతో ఇతరులను నడిపించగలము, అది వారిని పాపపు విమోచన పొందేలా చేయును.
ప్రపంచవ్యాప్తంగా, మన క్రైస్తవ సాహిత్య మంత్రిత్వ శాఖ నుండి పాప క్షమాపణ పొందిన పరిశుద్ధులు అనేక మంది ఉన్నారు. ఈ పాప క్షమాపణతో పాటుగా, దేవుడు పరిశుద్దాత్మ యొక్క శక్తిని కూడా వారికి యిచ్చియున్నాడు, దీని ద్వారా ఇతరులు పాప క్షమాపణ పొందారా లేదా అనే విషయాన్ని వారు ఆధ్యాత్మికంగా గుర్తించగలరు. బంగారం, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్త వర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార ఏమి చెప్పుచున్నాయో తెలుసుకుని నమ్ము వారు ఇతరులను సరైన విశ్వాసం ద్వారా తీర్పు తీర్చగల శక్తి కలిగిన వారు. ఈ యాజకుల ద్వారా, దేవుడు ప్రజలను వారి పాపపు శిక్ష నుండి రక్షించాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలం కాగలము.
దేవుని పిల్లలం అయ్యాక, మనం ఆధ్యాత్మికమైన యాజకులు కాగలము, అందుచేత ఎవరికి పాప క్షమాపణ లభించిందో ఎవరు పొందలేదో తీర్పు చెప్పే హక్కు మనకు ఉంటుంది. పాపులు తమ పాపములను బట్టి వారు నరకానికి వెళుతున్నారు కావున నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా వారు తమ పాపముల నుండి విడుదల పొందుదురని సంకోచించకుండా చెప్పాలి. మనం కూడా మన తోటి విశ్వాసులను సరైన మార్గంలో నడిపించడానికి, మనము ఇది వరకే నీరు మరియు ఆత్మతో తిరిగి జన్మించాము.
ఆధ్యాత్మికమైన యాజకులుగా మారిన మనము, ఇప్పటికి పాప క్షమాపణ పొందని పాపులకు తీర్పు ఇవ్వడం తప్పు అని మీరు అనుకోకూడదు. మరో మాటలో చెప్పాలంటే, అలాంటి వ్యక్తులను పాపులుగా గుర్తించడం మీకు గర్వకారణమని మీరు అనుకోకూడదు. దీనికి వేరుగా,ఆధ్యాత్మికమైన యాజకులుగా మనము ఎల్లప్పుడూ తీర్పు చేయు న్యాయ విధాన పతకమును మన రొమ్మున మోస్తున్నందున, మన విధులను మరింత శక్తివంతంగా నెరవేర్చాలి. మిగతా ఇతర విషయాలను పక్కన పెడితే, మనం దేవుని తరపున, ఈ పాపులు నరకంలో నాశనముగునని ప్రకటించుడి . అప్పుడు పాపులు ఈ ఆధ్యాత్మికమైన యాజకులు యొక్క తీర్పును దేవుని తీర్పుగా గుర్తించెదరు, అలాగే ఈ తీర్పును అంగీకరించెదరు, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో వ్యక్తమయ్యే పాపమును శుద్దిచేసుకోవడం దేవుని యొక్క కృపగా విశ్వసిస్తారు, తద్వారా వారి సమస్త పాపముల నుండి రక్షించబడతారు.అందుకే విశ్వాసం ద్వారా తీర్పు ఇవ్వగలిగితే, అది సరైన తీర్పుగా ఉంటుంది.
అలాంటప్పుడు, ఇతరులు పాప క్షమాపణ పొందారా లేదా అని మనం ఏ ప్రమాణంతో నిర్ధారించవచ్చు? బంగారం, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార అనే ఐదు దారాలను నమ్మే విశ్వాసం ఆధారంగా మనం దీనిని నిర్ణయించవచ్చు. మరొక విదంగా చెప్పాలంటే, రాజులైన యాజకులుగా మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ఆధారంగా ఇతరులకు తీర్పు చెప్పగలం: బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన పాపుములన్నిటిని స్వీకరించి సిలువపై మరణించాడు,పాతి పెట్టబడ్డాడు తరువాత తిరిగి మృతులలో నుండి లేచాడు, తద్వారా మన పాపములన్ని శుద్ధిచేసి ఆ పాపములన్నిటి కొరకై శిక్షను అనుభవించాడు. ఈ సత్యాన్ని విశ్వసించిన వారు పాపవిమోచన పొందిన వారు, అలా నమ్మని వారు పాపులుగా శిక్షించబడుదురు.
నీతిమంతుల కొరకైనా తీర్పు ప్రామాణిక అనునది, ఆధ్యాత్మికంగా వారు విలువైన జీవితాలను గడిపినా, గడపకపోయిన-వారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ఎంత బాగా ప్రకటించారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే, సమస్త తీర్పులన్నియు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ఎవరైనా విశ్వసిస్తున్నారా లేదా అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. దేవుని యెదుట ఈ సత్య సువార్తను విశ్వసించని వారు ఎవరైనా పాపిగా ఉండెదరు.పాత నిబంధనలో చూపబడిన నాలుగు దారాలలో ఒక్కటైనను నమ్మను వారు ఎవరైనా ఉన్నటైతే - అనగా నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార-అతను మరియు ఆమె విశ్వాసం నుండి ఎన్నటికీ పాపం నుండి రక్షించబడలేరు, ఎందుకంటే దేవుని యొక్క ఆ రక్షణ ఈ నాలుగు దారముల యొక్క విశ్వాస అవసరతను కోరుచున్నది.
నేటి క్రైస్తవులలో, సిలువ రక్తాన్ని మాత్రమే నమ్మడం ద్వారా వారు తిరిగి జన్మించామని చెప్పే వారు చాలా మంది ఉన్నారు. సిలువ రక్తాన్ని మాత్రమే విశ్వసించే ఈ క్రైస్తవుల విశ్వాసాన్ని నిర్ధారించడం ద్వారా, వారి విశ్వాసం లోపించినదని మనము నిర్ధారించగలము, ఎందుకంటే నీలిరంగు దారం అనగా (యేసు యొక్క బాప్తీస్మం )ను విడిచిపెట్టినప్పుడు వారి విశ్వాసం లోపముతో కూడియున్నది. యేసు శిలువ మీద మరణించినప్పుడు మానవజాతి యొక్క పాపములను ఆయన తీసుకొనియున్నారా? యేసు సిలువ వేయబడడానికి, ఆయన రక్తాన్ని చిందించడానికి మరియు సిలువపై చనిపోవడానికి కారణం ఏదనగా,ఆయన యొర్దాను నదిలో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు ముందుగా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయన మన పాపములన్నిటిని తీసివేసియున్నాడు.యోహాను ద్వారా యేసు బాప్తిస్మం పొందకపోతే, ప్రపంచంలోని సమస్త పాపములు ఆయన మీదకు ఎలా వెళ్ళును? యేసుక్రీస్తు బాప్తీస్మం ద్వారా మన పాపములు ఆయన శరీరం మీదకు పంపబడినందున, క్రీస్తు ఈ లోకములోని సమస్త పాపములను తన భుజాన భరించి, సిలువ వేయబడి మరణించి ఆయన మన రక్షణను పూర్తి చేయడానికి ఆయన రక్తమును చిందించాడు.
యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మానవజాతి యొక్క పాపములను ఆయన అంగీకరించినందున యేసు సిలువ వేయబడ్డాడు. కానీ ఆయన బాప్తీస్మం ద్వారా,మన పాపములను ఆయన ఎలా స్వీకరించాడు? తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువపై ఎవరిని వ్రేలాడదీయగలడు ? యేసుక్రీస్తు అప్పటికే బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన యొక్క పాపములను స్వీకరించకపోతే, మరో మాటలో చెప్పాలంటే, ఆయన సిలువపై ఎలా చనిపోగలడు? ఇది సరైనదేనా ? బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోకపోతే, మీ పాపములన్ని మీ హృదయంలో అలాగే ఉండిపోతాయి. యేసుక్రీస్తు తన శరీరం మీదకు లోకములోని సమస్త పాపములను తీసుకోకపోతే, మన స్థానంలో ఆయన సిలువపై చనిపోవడానికి కారణం ఏమిటి?
నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను గూర్చిన అవగాహన లోపం వలన ప్రశ్నలు తలెత్తును
కొంతమంది ప్రజలు ఇలా అడుగుదురు, “బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు మన పాపములన్నిటిని పొందియున్నది వాస్తవమైతే, దీని యొక్క అర్థం యేసు శరీరంపై మన యొక్క పాపములు ఉన్నవి, అలా అయితే, ఈ పాపియైన యేసు ఎలా పాపుల రక్షకునిగా మారగలడు?"
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి పూర్తి అజ్ఞానం నుండి ఉత్పన్నమయ్యే నిరాశపరిచే ప్రశ్నఇది. యేసు బాప్తీస్మం పొందినప్పుడు మానవజాతి సమస్త పాపములను తీసివేసియున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆయన లోకములోని పాపములను తన ఆత్మపైకి తీసుకోలేదు. బాప్తీస్మం తీసుకున్న యేసు యొక్క స్వభావం సంపూర్ణ పవిత్రమైనది మరియు దైవికమైనది.ఆయన తన శరీరంతో మాత్రమే బాప్తిస్మం పొందియున్నాడు, అందువలన ఆయన లోకములోని పాపములను తన శరీరంపై మాత్రమే తీసుకున్నాడు. యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నందున, ఆయన సిలువను మోయగలడు అలాగే సమస్త పాపముల కొరకు శిక్షించబడవచ్చును, అందుకే ఆయన రక్తం చిందించి సిలువ పై మరణించాడు. యేసు స్వయంగా ఈ లోకములో ఏ పాపం చేయలేదు (2 కొరింథీయులు 5:21). కానీ యేసు క్రీస్తు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా లోకములోని సమస్త పాపములను స్వీకరించాడు, లోకములోని ఈ పాపములన్నియు ఆయన శరీరంపై మోపబడ్డాయి. పరిస్థితి ఇది కాకపోతే, యేసు క్రీస్తు మన రక్షకునిగా ఎన్నటికీ కాలేడు.
అటువంటి అజ్ఞానులకు నేను నిజంగా చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, యేసు సిలువ పై లోకపాపములను తీసుకోలేదు. నేను మరల మీకు చెప్పాలనుకుంటున్నాను:"యేసు శిలువపై మరణించాడు, ఎందుకంటే ఆయన యొర్దాను నదిలో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నప్పుడు లోకములోని పాపములన్నిటిని స్వీకరించాడు."ఇది వాస్తవం కాకపోతే, లోకములోని పాపములను స్వీకరించడానికి యేసుకి మరో అవకాశం ఉండేది కాదు. యేసు సమస్త పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లగా మారినప్పటికీ, ముఖ్యముగా చెప్పాలంటే, ఆయన హృదయంలో ఎటువంటి పాపం లేదు. యేసు జన్మించినది మొదలుకొని పాపం చేసిన సందర్భం కాదు ఇది , దానికి బదులుగా, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా, ఆయన శరీరం మీదకు పంపబడిన లోకములోని పాపములను అంగీకరించాడు.లోకములోని సమస్త పాపముల కొరకై యేసు న్యాయపరమైన బలి అర్పణగా చేయబడ్డాడు. మరో మాటలో చెప్పాలంటే, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు మానవజాతి యొక్క పాపములను స్వీకరించాడు, కావున ఆయన తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది, అలాగే సిలువపై చనిపోవలసి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యముగా ఆయన మరల మృతులలో నుండి లేచాడు, తద్వారా మనకు నిజమైన రక్షకుడయ్యాడు. ఆవిధంగా చేయడం ద్వారా, ఆయన పాపపు శిక్షను భరించాడు. అందువల్ల, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే విశ్వాసం ద్వారా, మీ హృదయంలో పాపమును కలిగి ఉంటే, మీరు మీ సమస్త పాపముల నుండి నుండి రక్షించబడాలి.
పాడైన క్రైస్తవ్యం యొక్క చరిత్ర
ప్రారంభ సంఘ కాలంలో, యేసు యొక్క బాప్తీస్మం మరియు సిలువ రక్తాన్ని నమ్మడం ద్వారానే అపోస్తలులైన పౌలు మరియు పేతురు అలాగే మొదటి పరిశుద్ధులు కూడా ఆధ్యాత్మికమైన యాజకులుగా మార్పుచెందిరి. చారిత్రాత్మకంగా చెప్పాలంటే, ప్రారంభ సంఘ కాలం మరియు ఫాదర్స్ యుగం గడిచిన తరువాత, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క సత్యం పాడైపోవటం ప్రారంభమైంది, మరియు 313 శకంలో మిలాన్ శాసనం అటువంటి క్షీణ దశ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ అవినీతి పక్రియ నుండి ఈ రోజు క్రైస్తవ పాపులు పుట్టుకొచ్చారని నేను నమ్ముతున్నాను. అప్పటి నుండి, నామమాత్రపు క్రైస్తవుల యొక్క పెద్దల సమూహం ఉద్భవించింది, ఆ విధంగా వారు సిలువ రక్తాన్ని మాత్రమే నమ్ముచూ పాప విమోచన పొందినట్లు వారు పేర్కొన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు, సువార్త అనునది నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారములో వ్యక్తీకరించబడింది, కానీ దాచబడలేదు. ఇది ఒక కలత చెందే వాస్తవం, క్రైస్తవ మతాన్ని కేవలం ఈ ప్రపంచంలోని ఒక మతంగా మాత్రమే భావించే క్రైస్తవ పాపులు అనేకమంది పుట్టుకొచ్చారు.
ఈ నాటి క్రైస్తవులను ఆధ్యాత్మికమైన యాజకులుగా మారడానికి వీలు కల్పించిన విశ్వాసం ఆధారంగా తీర్పు తీర్చినప్పుడు, వారిలో చాలామంది పాప క్షమాపణ పొందడానికి అనుమతించే రక్షణను తప్పుగా అర్థం చేసుకున్నారని మనం చూడవచ్చు.నేటి క్రైస్తవ మతంలోని అన్ని వర్గాల యొక్క విశ్వాసం ప్రమాణాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉండటం మనం చూడవచ్చు. వారి యొక్క సంస్థలు పేర్లలో మాత్రమే వ్యత్యాసముండును గాని; వారి విశ్వాసాల విషయానికి వస్తే, వారందరూ సిలువ రక్తాన్ని మాత్రమే నమ్మి పాపం నుండి విముక్తి పొందారని అనుకుందురు.కానీ వారి హృదయములు వాస్తవంగా పాపం నుండి విడుదల పొందలేదు. దేవుని యొక్క నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి వారికి తెలియకపోయినప్పటికీ, వారు తమను తాము మంచి క్రైస్తవులుగా భావిస్తారు. ఈ ప్రజలు యేసును వారి రక్షకునిగా సిలువ రక్తం నందు విశ్వసించినప్పటికీ, వారు తమ పశ్చాత్తాప ప్రార్థనతో మాత్రమే నిమగ్నమై ఉన్నారని మనం చూడవచ్చు, ఎందుకంటే వారి పాపములన్నిటిని శుద్దిచేయడానికి వీలు కల్పించే సత్యం వారికి ఇంకా తెలియదు.మరో మాటలో చెప్పాలంటే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క శక్తి పట్ల వారు ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నను, వారి పాపములను కడగడానికి ప్రయత్నించే వ్యక్తులు ఉన్నారు.
అందుకే మనం ఇప్పుడు ఈ సత్య సువార్త యొక్క నీరు మరియు ఆత్మను మరోసారి లోకములోని ప్రజలందరికీ వ్యాప్తి చేస్తున్నాము.బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు స్వీకరించిన బాప్తీస్మం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అజ్ఞానంలో ఉన్నందున, మేము వారికి నీటి సువార్తను ప్రకటించాలని అలాగే ప్రత్యక్షపు గుడారానికి ఉపయోగించిన నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో ఉన్న స్ఫూర్తిని వ్యక్తపరచాలని మేము గుర్తించాము.బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు లోక పాపములన్నిటిని భరించాడు కాబట్టి, సిలువ వేయబడటం మరియు చనిపోవడం ద్వారా పాపమునకు సంబంధించిన సమస్త శిక్షను భరించినది ఈ యావత్తు లోక ప్రజలకు మనము బోధిస్తున్నాము. నీటి సువార్త తెలియని ఈ వ్యక్తులకు ఈ సువార్తను వ్యాప్తి చేయడానికి మనము ఋణపడి ఉన్నాము. అందువలననే వారు విశ్వసించేలా ఈ సత్య సువార్తను వినే అవకాశాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరాన్ని మేము గ్రహించాము.
కొన్ని దేశాలలో, క్రైస్తవ విశ్వాసము యొక్క చరిత్ర 1,000 లేదా 2,000 సంవత్సరాలకు పైగా వెనక్కి వెళుతుంది. అయితే చాలా మంది క్రైస్తవులకు ఇప్పటికీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గూర్చి స్పష్టమైన అవగాహన లేదు. ప్రత్యక్షపు గుడారంలో వ్యక్తీకరించబడిన సువార్త సత్యం ఆధారంగా మనము వారికి తీర్పు తీర్చినప్పుడు, యేసును రక్షకునిగా తిరిగి విశ్వసించేవారు చాలా మంది ఉందురు. కానీ నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటనగా, వారు ఎంతకాలం యేసును విశ్వసించినప్పటికీ, వారు పాప క్షమాపణను అందుకోకపోతే, మనం యేసును సరిగ్గా విశ్వసించడానికి వారిని మరల నడిపించాలి. మనము వారికి నీటి సువార్తను మరియు ఆత్మను తక్షణమే బోధించాలి. అపొస్తలుడైన పౌలు కూడా మనలాంటి మనస్సునే కలిగి ఉన్నాడు, “నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింప వలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ! (1 కొరింథీయులు 9:16).
దేవుడైన యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు మానవ శరీరముతో వచ్చెను
కొంతమంది, యేసు దేవుని కుమారుడు మరియు వారి రక్షకుడు అని విశ్వసించినప్పటికీ, యేసు దేవుడు అని నమ్మరు. వారు ఊదా దారమైన యొక్క క్రీస్తు పరిచర్యను నమ్మరు. ఈ వ్యక్తులు వాస్తవంగా పాడైపోదురు , ఎందుకంటే నీలం, ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణము గల దారం మరియు సన్నని పేనిన నారలో చూపబడిన పూర్తి సత్యాన్ని విశ్వసించే విశ్వాసం వారి హృదయంలో లేదు అందుచేత వారు పాప విమోచన పొందలేదు. దేవుడు తమ పాపములన్నిటిని తొలగించాడననే విశ్వసించు హృదయం వాస్తవంగా వారికి లేనందున పరిశుద్ధాత్ముడు వారి హృదయాలలో లేడు ఎందుకంటే వారి పాపములు శుద్దిచేసుకోవటానికి సాక్ష్యమిచ్చే వాక్యం వారి వద్ద లేదు.
మనం యేసును "ప్రభువు" అని పిలిచినప్పుడు, ఇక్కడ "ప్రభువు" అనే పదం యొక్క అర్ధం గురువు అని, యేసు దేవుడే అని మనం నమ్ముతున్నామని సూచిస్తుంది. ఈ దేవుని కుమారుడు కూడా నిజమైన దేవుడు. దీనిని వివరించడానికి, నేను తరచుగా కింది అలంకారాన్ని ఉపయోగిస్తాను. మనుషులు గర్భం ధరించినప్పుడు, వారు మరొక మనిషికి జన్మనిస్తారు. కుక్కలు జన్మనిచ్చినప్పుడు, అవి కుక్క పిల్లలకు జన్మనిస్తాయి. పక్షులు పక్షులకు జన్మనిస్తాయి.మరో మాటలో చెప్పాలంటే, వివిధ రకాలు మరియు జాతులు ఉన్నట్లే, తండ్రి అయిన దేవుడు కూడా తన ఏకైక కుమారుడికి జన్మనిచ్చాడు, మరియు అప్పుడు అతను కూడా దేవుడే (కీర్తనలు 2: 7).ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని (ఫిలిప్పీయులు 2: 6), మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మనల్ని పాపం నుండి రక్షించడానికి, ఆయన ఈబూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం పొంది, సిలువపై మరణించాడు, తిరిగి మృతులలోనుండి లేచి, మన నిజ రక్షకునిగా, రక్షణకు నిజమైన విశ్వాసాన్ని అనుగ్రహించాడు.
అయితే, యేసు దేవుడు కాదని నిరాకరించేవారు చాలా మంది ఉన్నారు. పాఠశాలల్లో, ప్రాచీన కాలంలో కనిపించిన నలుగురు ఋషులలో యేసు ఒకరని అని వారు బహిరంగంగా బోధిస్తారు. చర్చి ఫాదర్స్ నుండి కూడా అలాంటి భావన ఉద్భవించింది. వారు పూర్వీకుల యొక్క విశ్వాసం నుండి సత్య సువార్తను విన్నప్పటికీ, వారిలో కొంతమందికి దృఢమైన విశ్వాసం కలిగిన వారు విశ్వాసము యొక్క ఒప్పుకోలు నిమిత్తం హతసాక్షులు అవుటకు ఇష్టపడెదరు, కాని కొంతమంది యేసు దైవత్వాన్ని తిరస్కరించారు. మరి కొందరు చర్చి ఫాదర్లు సాహిత్య పుస్తకాలు కూడా వ్రాశారు, యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదనిరి.
ఈ మధ్యన,చాలా మంది వేదాంతవేత్తలు మతపరమైన బహువచనానికి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. వారి వాదనలు ప్రజలు పాపం నుండి రక్షించబడతారని అది క్రైస్తవ మతం కాకుండా ఇతర మతాలను నమ్మినప్పటికీ కూడా పరలోకములో ప్రవేశించవచ్చని చెప్పుచున్నారు. కాథలిక్కులు అటువంటి సిద్ధాంత సూత్రమును మొదటిగా బహిరంగంగా ప్రకటించిన వారు. ఈ నామమాత్రపు క్రైస్తవులు అలాంటి దృక్పథానికి మద్దతు ఇవ్వడానికి కారణం, యేసు దేవుడును మరియు సృష్టికర్త అని వారే నమ్మరు. వాక్యం చెప్పినట్లు వారు ఆయనను విశ్వసించాలనుకుంటున్నారు, కానీ అలాంటి తప్పుడు బోధనపై వారు ఈ నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. వారు తమ ఇళ్లను ఇసుక మీద నిర్మించుకున్న మూర్ఖులు (మత్తయి 7:26). వారు ఇతర మతాల నుండి ప్రతిదీ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు, కొన్ని పాశ్చాత్య సంఘాలు వారానికి ఒకసారి బౌద్ధ ధ్యాన కార్యక్రమాలను అభ్యసిస్తున్నాయి. మానవీయ కోణం నుండి, అటువంటి కార్యక్రమం అందంగా మరియు మరింత ప్రగతిశీలమైనదిగా కనిపిస్తుంది. అయితే యేసు దేవుడని నమ్మని వారు ఎవరైనా పాపం నుండి రక్షించబడలేరు.
అయితే మీ సంగతి ఏమిటి ? మీరు ఎలా నమ్ముతారు? ఆదికాండము 1: 1-3 ఇలా చెప్పుచున్నది, “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.” ఆదిలో దేవుడు తన వాక్యం ద్వారా ఆకాశాలను మరియు భూమిని సృష్టించాడు. ఈ వాక్యం మొదటి నుండి ఉనికిలో ఉండెను, మరియు ఈ వాక్యమే దేవుడైయున్నాడు . అందువలన, ప్రపంచం వాక్య అవతారమైన యేసుక్రీస్తు ద్వారా సృష్టించబడింది. (1 యోహాను 1: 1, యోహాను 1:10). దీని అర్థం యేసుక్రీస్తు మరెవరో కాదు, దేవుడే, వాక్కు యైన దేవుడు. యేసుక్రీస్తు ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మరియు మనలను రక్షించడానికి ఈ భూమిపైకి వచ్చిన రక్షకుడు. పరలోక వైభవ సింహాసనాన్ని విడిచిపెట్టి, తనకు తానుగా ఈ భూమిపైకి వచ్చిన వ్యక్తిగా ఈ యేసుక్రీస్తును దేవుడని మనం విశ్వసించడం అనేది సరైనది.
తన సేవకుల ద్వారా, దేవుడు స్వయంగా మెస్సయ్య రాక గురించి ప్రవచించాడు, మరియు ఈ ప్రవచనాల ప్రకారం రక్షకుడు కన్యకయైన మరియ గర్భం దాల్చి,మానవ శరీర ఆకారములో అవతరించెను. అనగా, మానవ శరీరం ద్వారా గర్భం ధరించి జన్మించగల వ్యక్తి ఒక్క దేవుడు మాత్రమే. మరియు ఆయన ముప్పై ఏళ్ళ వయసులో, పరలోక ప్రధాన యాజకునిగా, బాప్తీస్మం పొందడం ద్వారా మన పాపములన్నిటిని అనగా మానవజాతి యొక్క సమస్త పాపములను బాప్తీస్మం ద్వారా తన శరీరంపైకి తీసుకొనెను. అప్పుడు ఆయన సిలువపై మరణించి,మరల మృతులలో నుండి లేచి మన పాపముల నుండి మనలను సంపూర్ణంగా రక్షించాడు. మరో మాటలో చెప్పాలంటే, యేసు మన నిజమైన మరియు శాశ్వతమైన రక్షకునిగా మారాడు.
ఆయన ప్రాథమిక ఉద్దేశము, యేసు తనకు తాను దేవుడై తండ్రియైన దేవునితో సమానుడిగా ఉన్నాడు.మనకైతే, ప్రాథమికంగా తండ్రి అయిన దేవుడితో సమానమైన ఈ యేసు ఆయన వలె దేవుడై యున్నాడు. యేసుక్రీస్తు తండ్రి కూడా మనకు దేవుడు,ఎందుకు?ఎందుకంటే లోకము ఆయన ద్వారా సృష్టించబడింది, మరియు ఆయన ద్వారా మనం కూడా మనుషులుగా సృష్టించబడ్డాము. ఆదికాండము 1:26 లో దేవుడు ఇలా చెప్పాడు,"దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము." అప్పుడు దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించినప్పుడు, యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు.ఆయనే మనలను సృష్టించాడు మరియు మనలను పాపం నుండి రక్షించాడు. మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు మనకు నిజమైన రక్షకుడు. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు రక్షణను అనుగ్రహించాడు, ఆయన కూడా దేవుడే కాబట్టి, ఆయన మన యొక్క రక్షణకు ప్రభువు అని మనము నమ్ముతున్నాము. కావున, మీరు మరియు నేను ఇకపై గందరగోళంలో ఉండకూడదు, అయితే మనము మన హృదయములో సువార్త ద్వారా వచ్చిన ప్రభువైన యేసును దేవునిగా రక్షకునిగా విశ్వసించాలి.
కొంతమంది హృదయాలలో ఇంకను పాపం ఉన్నప్పటికీ తమను తాము దేవుని పిల్లలమని నొక్కి చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటివారి హృదయములో వారు పాపము కలిగి ఉన్నప్పుడు వారు నిజంగా దేవుని ప్రజలు కాగలరా?ఇప్పటికి వారి హృదయములో పాపం ఉన్న వారు పరలోకానికి వెళ్లగలరా? వెళ్ళలేరు! వారు క్రైస్తవులా కాదా అనేది ముఖ్యం కాదు; కానీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి వారి అవగాహన లోపం కారణంగా వారు పాప క్షమాపణ పొందకపోతే, వారిలో ఎవరూ పరలోకం ప్రవేశించలేరు.ఇప్పటికి ఈ క్రైస్తవ సంఘాలలో, ఈ విధమైన విశ్వాసం ఉన్నవ్యక్తులు లోక వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు.
అటువంటి వ్యక్తులకు నీరు మరియు ఆత్మ యొక్క సత్య సువార్తను సరైన రీతిలో ఎవరు వ్యాప్తి చేయాలి? అది మనమే -అనగా మీరు మరియు నేను వారికి సరైన న్యాయముతోవారికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని ప్రకటించాలి. ప్రత్యక్షపు గుడారంలో వ్యక్తీకరించబడిన సువార్త కనీసం ఒకటి లేదా రెండుసార్లు అయినను బోధించబడాలి, ఆపై సంపూర్తిగా ప్రకటించగలము. ఇది నిజమైన రక్షణ యొక్క సత్యం, మన ప్రభువు తిరిగి వచ్చే రోజు వరకు సువార్త వ్యాప్తి చెందుతూనే ఉండాలి.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మిమ్మును పాప విమోచన పొందుటకు మీకు శక్తిని కలుగుజేయునని మీకు తెలుసా ? ప్రజలు పాపమును కలిగి ఉన్నట్లయితే, వారు దేవుని పిల్లలు కాలేరు. ప్రత్యక్షపు గుడారానికి వస్తువులుగా ఉపయోగించే నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంలో వ్యక్తమయ్యే రక్షణ యొక్క సువార్త సత్యాన్ని విశ్వసించే విశ్వాసం వారికి ఉండాలి. యుగసమాప్తి వరకు మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేస్తూ ఉండాలి.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించడానికి మనం చాలా ఇబ్బందిపడ్డామా? పాత రోజుల్లో, దేవుడు తన సేవకులకు,"బయటకువెళ్లి ప్రవచించడం కొనసాగించండి" అని చెప్పినప్పుడు, వారు అలా చేస్తూనే ఉన్నారు, మరియు దేవుడు యెషయాతో,"దిగంబరిగా ప్రవచించు" అని చెప్పినప్పుడు, అతను బయటకు వెళ్లి దిగంబరిగా ప్రవచించాడు (యెషయా 20: 2 -5). ప్రత్యక్షపుగుడారములో చూపబడిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మనం ప్రజలందరికీ బోధించినప్పుడు మాత్రమే, వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోగలరు. అందుకే మనం ఈ సువార్తను తప్పక వ్యాప్తి చేస్తూ ఉండాలి.
మీ సంగతి ఏమిటి మరి ? మీకు నిజమైన రక్షణ కలిగించే విశ్వాసపు వాక్యం మీ హృదయాలలో ఉందా? ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పాపములను నుండి విమోచించు వాక్యం లేనప్పుడు వారు ఇంకా సాతానుకు చెందిన వారీగా ఉన్నప్పుడు, మీరు ఏది చేయకుండా కూర్చుని ఎలా ఉండగలరు ? మీరు చుట్టూతా కూర్చుని ఉండలేరు. ప్రపంచవ్యాప్తంగా మా భాగస్వాములు చాలా మంది ఉన్నారు. వారు పాప విమోచన యొక్క , నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను స్పష్టంగా విశ్వసిస్తారు. వారిలో కొందరు తమ తోటి వారితో నీటి సువార్త మరియు ఆత్మ గురించి మాట్లాడినప్పుడు వారు హింసించబడ్డారని మాకు తెలియజేసారు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వ్యతిరేకులకు వారు ధైర్యంగా చెప్పుచూ,"మీ హృదయంలో ఇంకను పాపం ఉన్నందున మీరు దేవుని ప్రజలు కాదు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త పట్ల మీ అవిశ్వాసం కారణంగా మీ మురికి పాపముల కారణంగా మీరు నరకానికి వెళ్తున్నారు. ఇప్పుడు నేను నిన్ను ‘సోదరుడు’ అని పిలవలేను, మీరు నన్ను ‘నా సోదరుడు’ అని పిలిచినప్పటికీ, నేను ఇకపై మీలాంటి పాపిని కాదు.”
మనము ఎన్నడూ వారిని అలా నడిపించలేదు,కానీ వారిలో ఉన్న పరిశుద్దాత్మ ఏమి చేయాలో అలా వారిని నడిపించును.మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకనగా మీ హృదయాలలో నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ప్రమాణాన్ని కలిగి ఉన్నారు, దాని ఆధారంగా మీరు ఇతరులకు తీర్పు తీర్చగలరు. ఇతరుల పాపవిమోచనను సరిగ్గా గుర్తించగల ఈ సామర్ధ్యం మీకు అనుగ్రహించబడింది. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారంలో కనిపించే సత్య సువార్తను మీరు విశ్వసించారు. నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల రంగులు కలిగిన ఈ మూడు దారములు యొక్క విశ్వాస సత్యముతో మనం దేవుని ముందు నిలబడాలి.దేవుడు మన పాపములన్నిటి నుండి మనలను రక్షించి, నీతిమంతులుగా చేసాడు.
మనము సరైన రక్షణ యొక్క కొలబద్దను ఉపయోగిద్దాము
మనము దేవుని వాక్యాన్ని `కానన్` అని పిలుస్తాము.`కానన్` అనే పదం హీబ్రూ పదం కనే మరియు గ్రీకు పదం కానోన్ నుండి వచ్చింది, ఈ రెండూ కొలబద్దతను సూచిస్తాయి.మనం ఏదైనా కొలవాల్సిన అవసరం వచ్చినప్పుడు,దానిని సరిగ్గా కొలవడానికి మనం కొలమానం లేదా కొలబద్దను ఉపయోగించాలి.ఇలా,మనం ఒకరి ఆధ్యాత్మిక స్థితిని గుర్తించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి తిరిగి జన్మించాడో లేదో, తెలుసుకొనుటకు ఆ వ్యక్తిని నీలం,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో కొలబద్దతో పరిశీలించాలి. తన కస్టమర్ల యొక్క పరిమాణాన్ని కొలవడానికి తన కొలబద్దను ఉపయోగించే టైలర్ లాగా, ఆ వ్యక్తి నిజంగా పాపం నుండి రక్షించబడ్డాడా లేదా అని మనం పరిశోధించాలి. నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో కనిపించే సత్యంతో దీన్ని చేయడానికి మార్గం ఉంది. ఈ దేవుని యొక్క వాక్యం ఆధారంగా, మరో మాటలో చెప్పాలంటే, మనం వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రతి అంశాన్ని ఎన్నుకోవాలి మరియు దాని ప్రమాణానికి దిగువన ఉన్నదాన్ని మరియు దానిని మించిన వాటిని స్పష్టంగా వేరు చేయాలి.
ప్రత్యేకించి, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణము గల దారం యొక్క కొలబద్దత, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో మన విశ్వాసాన్ని క్లుప్తంగా పరిశీలించుకోవాలి. ఎవరైనా యేసును ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం అని మాత్రమే విశ్వసిస్తే, వారి రక్షణను ఆయన సంఘములో రాజులైన యాజకుల వలె దేవుడు వారని ఆమోదించలేడు. ఎవరైతే తన పాపముల నుండి విడుదల పొందాలనుకుంటున్నారో వారు నీలం,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో వ్యక్తమయ్యే రక్షణ యొక్క సంపూర్ణ సత్యాన్ని విశ్వసించాలి. పాపం నుండి మానవాళిని రక్షించడానికి యేసు ఈ భూమిపైకి వచ్చాడని, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయన మన పాపములన్నిటిని స్వీకరించాడు, సిలువపై మరణించాడు, తిరిగి మృతులలో నుండి లేచాడు తద్వారా మనకు నిజమైన రక్షకుడయ్యాడని మనమందరం నమ్మాలి. మనమందరం ఈ సరైన తీర్పు యొక్క ప్రామాణికాన్ని కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యంపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి ప్రజలు పాపులా లేక నీతిమంతులా అని మనం దీనిని బట్టి నిర్ణయించుకోవచ్చు.తాత్కాలిక పద్ధతిలో మన స్వంత జ్ఞానం మరియు భావోద్వేగాల ఆధారంగా దీనిని మనము చేయలేము. ఆధ్యాత్మికమైన యాజకులు వలె తమ ప్రజల పాప నైవేద్యం కోసం అందించే ఈ బాధ్యతను నిర్వర్తించడానికి ఈ పని ఎంతో అవసరం.
ఈ కాలములో, మీరు మరియు నేను లోకములోని ప్రజలందరినీ సరైన ప్రామాణిక తీర్పుతో నిర్ధారించాలి. అదే ప్రామాణికం అందరికీ సమానంగా వర్తిస్తుంది, మన పిల్లలు, భార్యలు, భర్తలు, తండ్రులు మరియు తల్లులు, అత్తమామలు మరియు మనవరాళ్లకు అదే వర్తిస్తుంది.మనం దేవుని వాక్యంతో ఇతరుల విశ్వాసాన్ని గుర్తించాలి. యాజకులుగా మారిన వారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి హృదయమును కూడా తీర్పు యొక్క కొలబద్దతో కొలవాలి. "నీలిరంగు, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార యేసుక్రీస్తు యొక్క సత్యమని మీకు తెలుసా మరియు దీనిని విశ్వసిస్తన్నారా?మీరు ఇలా విశ్వసిస్తే, మీరు రక్షింపబడతారు, విశ్వసించకపోతే, మీరు రక్షించబడరు.”ఇలాంటి స్పష్టమైన తీర్పునుఇవ్వవలెయును, మనం చేయాల్సిన పని కూడా ఇదే.
ఇంతక మునుపు ప్రధాన యాజకుడు ఇలా చేస్తే, ఈరోజు ఆధ్యాత్మిక యాజకులుగా మారిన మీరు మరియు నేను కూడా తప్పకుండా దీనిని చేయాలి. ఆయన యొక్క యాజకులుగా మనం చేయవలసిన పనులను మనం చేయకపోతే, మనం దేవుని చేత హెచ్చరించబడకుండా ఉండలేము.కొంతమంది ఇలా అంటారు, “ఒక వ్యక్తికి సువార్త చెప్పే మార్గం అది కాదు. మీరు ఈ విధంగా సువార్త చేయాలి ! మీలాంటి వ్యక్తులకు మేమందరం సువార్త ప్రకటిస్తే, యేసును ఎవరు నమ్ముతారు?
వేదాంతశాస్త్రంలో, `కళాత్మకమైన సువార్తీకరణ` అనే శిక్షణా కోర్సు ఉన్నది. ఇది సువార్తికరణకు ఎలా మార్గనిర్దేశం చేస్తుంది. ఒకసారి, `స్నేహపూర్వీక సువార్తీకారణ` అనే పదం ఈ పనిలో ప్రతి బోధకుడి పెదవులపై ఒక పదబంధం. దాని అనుచరులు ఇప్పటికీ మనం ప్రజలకు సువార్త ప్రకటించడానికి ప్రయత్నించినప్పుడు, మనం ముందుగా వారితో స్నేహం చేసి, క్రమంగా వారిని సంఘానికి నడిపించాలని బోధిస్తారు. వారు చెప్పింది నిజమే. వారి సువార్త యొక్క ప్రయత్నాల ద్వారా ఒక వ్యక్తి యేసును విశ్వసించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ వ్యక్తి యేసును స్వీకరించే ప్రార్థనను పునరావృతం చేసేలా చేస్తారని, తద్వారా క్రీస్తు ఆ వ్యక్తి హృదయంలోకి వస్తాడని అలాగే వచ్చినప్పుడు అతను లేదా ఆమె రక్షించబడతారని కూడా వారు చెప్పారు.
అయితే ఈ విధానం యొక్క తుది ఫలితం ఏమిటనగా ? కొత్తగా మారిన వారి హృదయాల నుండి పాపాలు అదృశ్యమవునా ?ఇక్కడ విషయం ఇది కాదు. వారు సంఘానికి వెళ్లినప్పటికీ, వారిలో ఇంకా పాపం ఉంటుంది - మరో మాటలో చెప్పాలంటే, ఈ నూతనముగా మారిన వీరు క్రైస్తవ మతం యొక్క మత అనుచరులు మారారు. అలాంటి వ్యక్తులు యేసును విశ్వసించేలా చేసిన తరువాత, వారు దశమభాగం లేదా కృతజ్ఞతా సమర్పణలు ఇచ్చేలా చేయుదురు.చివరికి,వారు క్రైస్తవులుగా మారినప్పటికీ, వారు దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు, ఎందుకంటే వారిలో ఇంకా పాపం ఉంది కావున.
కొంతమంది మా సువార్త యొక్క వ్యాప్తి విధానం తప్పు అని చెప్పారు, “మీరు వారిని కలిసినప్పుడు వారికి పాపం ఉందా లేదా అని మీరు ఎలా అడగవచ్చు? రక్షణకు సంబంధించిన సమస్యను మీరు ఇంత త్వరగా ఎలా లేవనెత్తగలరు, వారు రక్షించబడ్డారా లేదా అనే దానిపై మీ తీర్పును తెలియజేస్తూ, మీకు తెలియకపోయినా? "వాస్తవానికి, వారు చెప్పేదానికి మనం కొంత అర్ధం చేసుకోవాలి, ఎందుకంటే మనం రక్షించాలనుకునే ఆత్మ మన పెదవుల ద్వారా సులభంగా గాయపడ గల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ ముందుగానే లేదా తరువాత, మనం సన్నిహితంగా ఉన్న అవిశ్వాసులకు రక్షణ యొక్క సువార్తను ప్రకటించాలి. మనం వారితో ఎంత సన్నిహితంగా స్నేహం చేసినా, మనం ముందుగానే లేదా తరువాత వారికి సువార్త ప్రకటించాలి కాబట్టి, విశ్వాసం ద్వారా సువార్తను ప్రకటించే అవకాశాన్ని మనం కల్పించలేము.ఎందుకు? ఎందుకంటే ఈ సత్యం గురించి మనం చివరి వరకు వారికి చెప్పకపోతే, మనం సువార్తను సరిగ్గా వ్యాప్తి చేయలేము.
అందువల్ల,మన సంభాషణ ప్రారంభంలో లేదా ముగింపులో సువార్త ప్రచారం కోసం"మీ హృదయంలో పాపం ఉందా?"అని మనము ప్రజలందరినీ అడగాలి. సమాధానం అవును అయితే,మనం వారికి నీటి సువార్త మరియు ఆత్మను బోధించాలి. వాస్తవానికి, మన దూకుడును బట్టి మనం యాజకులం కాబట్టి, ప్రజలందరికీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త బాకా ఊదడం మన గంభీరమైన కర్తవ్యం అని మనం గుర్తుంచుకోవాలి.
దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, బాప్తీస్మం ఒక్కటే
మనము మన పాపములన్నిటి నుండి క్షమించబడ్డాము మరియు మన జీవిత లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా సువార్తను వ్యాప్తి చేయడం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించే సువార్తికుల యొక్క అదే విధులు మనకు ఇవ్వబడినందున, మనము కలిసి పని చేస్తాము. మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? మనము ఒకే దేవుడిని విశ్వసిస్తున్నందున, మనం ఒకే శాశ్వత జీవితాన్ని పొందాము మరియు అదే మహిమను ఆస్వాదిస్తాము. మనమందరం ఒకరికొకరు భిన్నంగా ఉంటాము, ప్రతి ఒక్కరికి మన స్వంత వ్యక్తిత్వాలు మరియు పాత్రలు ఉంటాయి, కానీ మనల్ని మనం పక్కన పెట్టడానికి మరియు ఒకరితో ఒకరు కలిసిపోవడానికి కారణం దేవుడి కోసం మాత్రమే మన జీవితాలను గడపడం.
నేటి యాజకులుగా మారిన వారి హృదయాలపై దేవుడు తీర్పు యొక్క న్యాయ విధానపతకమును ఉంచాడు. మరియు ఈ న్యాయ విధాన పతకమును గట్టిగా బిగించవలెను“అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగర ములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను ”(నిర్గమకాండము 28:28). ఈ వాక్యం మనం చేసే ప్రతి తీర్పులో యేసు బాప్తీస్మం ఎంత ముఖ్యమైందో మరోసారి నొక్కి చెబుతుంది. కాబట్టి, అపొస్తలుడైన పౌలు కూడా యేసు బాప్తీస్మం యొక్క ప్రాముఖ్యతను ప్రకటించాడు,“శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, ”(ఎఫెసీయులు 4: 4-5).
నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వారు నమ్ముతారా అనే దాని ఆధారంగా ప్రజల ఆత్మలు రక్షింపబడతాయా లేదా అని నిర్ధారించే బాధ్యత మనపై ఉన్నది. ఇప్పటికి పాప క్షమాపణను స్వీకరించని వారికి, మనం సువార్త ప్రకటించాలి, మరియు పాపవిమోచన పొందిన వారికి, మనము గమనించి వారి విశ్వాసంలో ఎదగడానికి సహాయపడాలి. మనం పాపం నుండి విడదల పొందినప్పుడు, ఆధ్యాత్మికంగా తీర్పు యొక్క న్యాయ విధాన పతకమును మనం ధరించడం సరైనదా కాదా?మరొక విధంగా చెప్పాలంటే, మనం ఒకరిపై రక్షణ యొక్క సరైన తీర్పును నివారించడం సరైనదేనా? ఇది సరికాదు. మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయాలి,ఇంకను రక్షించబడని ప్రతి ఒక్కరికీ ప్రకటించాలి.
అప్పుడు, మన శరీరము నందు మనము పరిపూర్ణులమా?
మనం పాపులను తీర్పు తీర్చినప్పుడు, వారి క్రియలను మనం తీర్పు తీర్చడం లేదు. దానికి బదులుగా, ఈ సత్య సువార్త యొక్క వెలుగుతో మరియు దేవుని యొక్క నీతితో మనం వాటిని గుర్తించగలం. వారికి నిజమైన వెలుగు ఏమిటి ? ఈ వెలుగు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మడం ద్వారా వారు దేవుని పిల్లలు కావడమే.దేవుని పిల్లలు ఈ లోకానికి వెలుగైయున్నారు. పాపం నుండి పూర్తిగా క్షమించబడిన వారు తమ క్రియలలో పరిపూర్ణులని దీని యొక్క అర్థం? వారి హృదయాలలో, వారు పరిపూర్ణులైనను శరీరంలో మాత్రం, లోపం కలిగిన వారు.
మన శరీరంలో, మనమందరం స్వార్థపరులం, చెడ్డవారము, లోపంతో ఉన్న బలహీనులం, కానీ దేవుని యెదుట మనం ఆయన పరిపూర్ణ ప్రజలం. వారి క్రియలు బలహీనమైనవే కానీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను దేవుని యొక్క బిడ్డగా నీవు నమ్మేవా లేదా? నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనం దేవుని పిల్లలం, దీని యొక్క ఆధ్యాత్మిక పరిరక్షణ పరిపూర్ణమైనది. మరో మాటలో చెప్పాలంటే, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారమును విశ్వసించడం ద్వారా పాప క్షమాపణ పొందిన వారి క్రియలు సరైనవి కావు, కానీ వారి యొక్క రక్షణ పరిపూర్ణమైనది. మనల్ని కాపాడిన మన యొక్క విశ్వాసం సంపూర్ణంగా ఉన్నందున, దేవుని దయతో మనం ఒకరితో ఒకరు సంబాషించుకోవచ్చు. మరియు నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం యొక్క ఖచ్చితమైన సత్యంతో మనము మన నిర్ణయాన్ని చేరుకున్నందున, మన యొక్క విశ్వాసం మరియు తీర్పు ఎన్నడును లోపభూయిష్టంగా ఉండవు.
ఈ తీర్పుయొక్క ప్రామాణికను యాజకుల హృదయాలలో ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు మనకు చెప్పాడు. ఈ లోకములోని ప్రజలందరినీ మన హృదయాలతో హత్తుకోవాలి. మనము వారి ఆత్మలను హత్తుకొని, వారి కోసం ప్రార్థించాలి. వాస్తవానికి మనము వారికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయాలి. అందుకే మన హృదయాలలో ఎల్లప్పుడూ తీర్పు యొక్క న్యాయ విధాన పతకము మనతో ఉండాలి. మరియు ఈ రోజు మరియు రేపు, అనేది లేకుండా పాపులందరికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను బోధించడానికి మనం ఎల్లప్పుడూ వారి పాపపు స్థితి గుర్తించాలి.
ఈ విశ్వాస యొక్క సత్యం మీ హృదయాలలో కనిపించాలని నా హృదయపూర్వక కోరిక. ఈసత్యం మీ హృదయాలలో ఉంటే, సమస్తమునకు తీర్పు చెప్పే హక్కు మీకు ఇవ్వబడిందని అర్థం. ఈ సత్య వాక్యాన్ని నమ్మండి. మీ తీర్పును ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యం ఆధారంగా ఈ విధంగా చేయండి, మరియు అన్ని సమయాలలో నీ హృదయంతో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మండి మరియు వ్యాప్తి చేయండి.
ప్రతిరోజూ, నేను నా హృదయంలో తీర్పు యొక్క ఈ న్యాయ విధాన పతకమును గుర్తుంచుకుంటాను,దేవుని యెదుట ప్రతిదాన్ని తీర్పు తీర్చుచూ సువార్తను వ్యాప్తి చేస్తూనే ఉన్నాను. వాస్తవానికి, పునరావృతం అనేది సువార్తను వ్యాప్తి చేయుటకు అత్యంత ప్రభావవంతమైన సాధనం. మనం మరచిపోవు వారము ! ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాతి బోధకులు విద్య అత్యంత సంప్రదాయబద్ధమైన మరియు ప్రభావవంతమైన విద్య అని నొక్కి చెప్పారు. ఒక భాషావేత్త ఒకసారి ఒక పదాన్ని వెయ్యి సార్లు పునరావృతం చేయడం ద్వారాఒక పదాన్ని సరిగ్గా ధ్వనించగలరని నొక్కిచెప్పారు. అదేవిధంగా, మనం నీరు మరియు ఆత్మ యొక్క సత్య వాక్యాన్ని నిరంతరం మరియు పదేపదే వ్యాప్తి చేసినప్పుడు, అది మన హృదయాలలో చెక్కబడుతుంది. నేను ఈ సువార్త సత్యాన్ని పదే పదే వ్రాసాను, తద్వారా ప్రజలు మన పుస్తకాలను చదివినప్పుడు వారు నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార యొక్క సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరియు దానిని నమ్మడానికి వస్తారు. అందుకే మేము ఈ సువార్త సత్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాము.
సోదరులు మరియు సోదరీమణులారా, మనము పరిశుద్ధులము, మన విశ్వాసాన్ని పరస్పరం ఒప్పుకోవాలి. మనము మన విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని దయను ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు, మన హృదయాలు నిజంగా ఒకరితో ఒకరు సంభాషించుకోగలవు, మరియు మన వద్ద ఉన్న ఏదైనా తప్పు జ్ఞానం లేదా అపార్థాలు సరిదిద్దబడతాయి మరియు సరిచేయబడతాయి.మరియు దీని ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు. మన విశ్వాసం పెరిగే కొద్దీ, మన విశ్వాస జీవితాలు కూడా ముందుకు సాగుతాయి. మనం ఎన్నిసార్లు తప్పుగా ఆలోచించాము? మన మునుపటి జ్ఞానం ఎంతవరకు లోపభూయిష్టంగా ఉంది? మరియు వాస్తవానికి ఎంతవరకు సిద్ధాంతపరమైనవి మాత్రమే ఉన్నాయి? నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తెలుసుకోవడానికి ముందు మనకు ఉన్న నమ్మకాలన్నీ కేవలం సిద్ధాంతపరమైనవి.
అపొస్తలుడైన పౌలు తన వద్ద ఉన్న సువార్త కాకుండా మరే ఇతర సువార్తను ప్రకటించిన వారు శపించబడతారని చెప్పారు (గలతీయులు 1: 9). దేవుని సత్యం కాకుండా తనకు తెలిసినవన్నీ తాను చెత్తగా లెక్కించానని పౌలు చెప్పాడు. ఏదేమైనా, నేటి క్రైస్తవ మతంలో, తమ స్వంత చెత్త మత పరిజ్ఞానం గురించి మాత్రమే ప్రగల్భాలు పలికే వారు శక్తివంతులు అవుతారు.
నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో ఒకదానితో ఒకటి సంరక్షించబడిన మనం మన హృదయాలతో కలిసిపోవచ్చు. నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్త గురించి మనము సిగ్గుపడము, ఎందుకంటే ఈ సత్యం నరకం యొక్క శాశ్వతమైన శిక్ష నుండి మనలను విడిపించింది. బదులుగా, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంలో దాగి ఉన్న సువార్త సత్యాన్ని మనం ప్రపంచం చివర వరకు సంశయం లేకుండా ప్రకటించకుండా ఉండలేము. ఈ పనిని మనం అత్యవసరంగా చేయాల్సి ఉంది.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మాత్రమే సత్యమని నేను మొదట గ్రహించినప్పుడు, నేను చాలా ఆశ్చర్యపోయాను. "ఆహ, ఇదేనా ! ఇదైతే ఇప్పటి వరకు నాకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఇది తెలుసా? వేదాంతవేత్తలు దాని గురించి మాట్లాడతారా?"ఈసత్యాన్ని తెలిసిన మరియు మాట్లాడే వేదాంతవేత్తలలో ఎవరైనా ఉన్నారని నేను కోరుకుంటున్నాను.కాబట్టి నేను నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో స్వల్ప జాడ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను క్రైస్తవ మతంలోని అన్ని వేదాంత సంస్థలను పరిశోధించాను, కానీ అదంతా వ్యర్థమైంది.
కాబట్టి ఈ సువార్త సత్యాన్ని గ్రహించిన తర్వాత నేను చేసిన మొదటి ప్రార్థన ఇదే: “ప్రభూ, నేను నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తున్నాను. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరు నా పాపములన్నిటిని స్వీకరించారని, సిలువపై మరణించారని, తిరిగి మృతులలో నుండి లేచారని ఇప్పుడు మీరు నన్ను రక్షించారని నేను నమ్ముతున్నాను. కానీ ప్రభువా, ఈ విశాల లోకములోని ప్రజలందరికీ ఈ సత్యం ఇంకా తెలియదు. నేను ఈ సత్యాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేస్తాను.మీ నిజ సువార్తను అలాగే ప్రకటించటానికి నన్ను అనుమతించండి.”
నా తోటి పనివారైనా మీతో నేను కలవడం అద్భుతమైన ఆశీర్వాదం. దేవుని కోసం వెతుకుచున్న కొంతమంది సత్యాన్వేషకులను కలవడం, నీలం, ఊదా, మరియు రక్తవర్ణము గల దారం మరియు సన్నని పేనిన నార యొక్క సత్యాన్ని బోధించడం మరియు ఆయనను విశ్వసించడం మరియు వారితో కలిసి సేవ చేయడం చాలా మంచిది.దేవుని వాక్యాన్ని వినని లేదా నమ్మని వెయ్యి మందిని కలవడం మరియు బోధించడం కంటే. మీరందరూ ఆయన వాక్యాన్ని విశ్వసించినందున నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను!
వాస్తవంగా, లోకములోని కొద్దిమంది అనగా మీరు మరియు నేను సంతోషంగా ఉన్నాము. ఈ లోకములో మనలాంటి నిజమైన సోదరులు మరియు సోదరీమణులు ఎవరు ఉన్నారు? ఈ విషయాలన్నీ నిజంగా సత్య దేవుడు నుండి వచ్చాయి. దేవుడు మనకు ఇంతటి విలువైన దీవెనలు ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఇంతటి అమూల్యమైన రక్షణ ఇచ్చినప్పుడు,దేవుడు మనకు అలాంటి విలువైన యాజకుని అప్పగించినప్పుడు, మనం ఆయన యొక్క సువార్త పని కోసం పని చేయలేకుండా ఎలా ఉండగలమూ, మనం పాపులను ఎలా తీర్పు తీర్చకుండా ఉండగలమూ, మనం ఎలా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయకుండా ఉండగలమూ ? మనము సువార్తను వ్యాప్తి చేస్తున్నప్పుడు, పాప క్షమాపణ పొందిన వారిని లేనివారి నుండి ఎలా వేరు చేయలేకపోతున్నాము ? దేవుడు ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడు చీకటి నుండి కాంతిని వేరు చేసినట్లుగా, మనం కూడా పాపులను నీతిమంతుల నుండి స్పష్టంగా వేరు చేస్తాము. మనం సత్యాన్ని అబద్ధంతో కలిపినప్పుడు దేవుడు సంతోషించడు. అందువలన ఆయన ఇలా అంటాడు, “నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్టితములు కాకుండునట్లు నీ ద్రాక్షతోటలో వివిధమైనవాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొన కూడదు.”(ద్వితీ 22: 9-11). అందుకే మనం పాపులను వేరు చేసి, వారికి స్పష్టంగా తీర్పు ఇవ్వాలి.
దేవుని యొక్క వాక్యాన్ని విన్న వారు తమ అభిరుచులకు సరిపడక పోయినా అది సత్యమని విశ్వసించాల్సిన సమయం వచ్చింది. దేవుని వాక్యాన్ని విశ్వసించేవారు ఆయన కృపతో లోకానికి వెలుగుగా మారుదరు , కాని నమ్మని వారు చీకటి నుండి తప్పించుకోలేరు.మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించినందువల్లనే మనము ఊరీము మరియు తుమ్మీము అయ్యాము, అంటే ‘వెలుగు మరియు పరిపూర్ణత.’ కావున ఇప్పుడు మనం దేవునిలో పూర్తిగా పాపం నుండి రక్షించబడిన వారిగా మారిపోయాము.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మీరు పూర్తిగా దేవుని పిల్లలు అయ్యారా? ఈ లోకానికి రాజుల రాజుగా మారిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు, మనము ఇప్పుడు రాజులైన యాజకుల యొక్క పనులు చేస్తూ మన జీవితాలను గడుపుతున్నాము. ఈ రక్షణ యొక్క సువార్తను మాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనము ఈ భూమిపై ఉంటూనే రాజులైన యాజకత్వపు విధులను విజయవంతంగా నిర్వహించడానికి దేవుడు అనుమతించాలని నేను ప్రార్థిస్తున్నాను.
హల్లెలూయా! మన దేవుడైన ఆయనను నేను శాశ్వతంగా స్తుతించెదను.