• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 11: ప్రత్యక్ష గుడారం

[11-33] ప్రధాన యాజకుకుడు పాపములను అర్పించుట కొరకై నిర్దేశించబడ్డాడు (నిర్గమకాండము 29: 1-14)

(నిర్గమకాండము 29: 1-14)
“వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు టకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసి కొనుము. గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేకతైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను;నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్టించవలెను మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపుటడుగున పోయ వలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను. ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.”


ఈ రోజు మనం ప్రధానయాజకుని యొక్క పరిశుద్ధతపై శ్రద్ధ వహిద్దాము. అహరోను మరియు అతని కుమారులను ఎలా పరిశుద్ధపరచాలో దేవుడు మోషేకు ఇక్కడ ఆజ్ఞాపించాడు. తొమ్మిదవ వచనంలో "శుద్దిచేసుకొనుట"అనే పదానికి అర్థం పవిత్రంగా ఉండటం, సిద్ధం చేయడం, అంకితం చేయడం, గౌరవించడం లేదా పవిత్రంగా భావించడం. మరో మాటలో చెప్పాలంటే, శుద్ధి చేయడం అంటే దేవుని కొరకు పరిశుద్ధపరచబడటం మరియు అంకితం చేయబడటం . కావున, "ప్రధాన యాజకునిగా పరిశుద్ధపర్చబడటం"అనగా "ప్రధాన యాజకుని యొక్క అధికారం మరియు విధులు వేరుచేయడం" అని అర్థం. దేవుడు అహరోను మరియు అతని కుమారులకు ప్రధాన యాజకుని యొక్క యాజకత్వపు హక్కును యిచ్చియున్నాడు, ఇది ఆయన ప్రజల యొక్క పాపములను క్షమించటానికి వీలు కల్పించింది.
దేవుడు మోషేకు ప్రధాన యాజకుని యొక్క వస్త్రములను ధరింపచేయాలని అతని తలపై తలపాగాను మరియు అతని కుమారులకు అంగీలను ధరింపచేయమని మోషేకు ఆజ్ఞాపించాడు.అప్పుడు అహరోను ప్రధాన యాజకునిగా మరియు అతని కుమారులు యాజకులుగా పవిత్రపరచబడటానికి, వారు తమ పవిత్రం కోసం ఒక ఎద్దు మరియు రెండు మచ్చలేని పొట్టేళ్లను తీసుకోవాలి. ప్రధాన యాజకుని యొక్క అతి ముఖ్యమైన కర్తవ్యం ప్రాయశ్చిత్తం రోజున ఇశ్రాయేలీయులందరు పాప విమోచన కొరకు పాప నైవేద్యాలను అర్పించడం. మరియు అలా చేయడానికి, అహరోను మరియు అతని కుమారులు మొదట వారి స్వంత పాపముల నుండి శుద్దిచేయబడవలెను, అందుకే అతని శుద్దిచేసుకొనురోజున వారు పాపపరిహారార్పణను మొదటగా అర్పించవలసి ఉంటుంది.
ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ప్రధాన యాజకుడు కూడా తమ రక్తాన్ని దేవునికి అర్పించడానికి వాటిని చంపడానికి ముందు బలి పశువు తలపైచేతులు పెట్టవలసి ఉంది, ప్రతిదీ ఆయన స్థాపించిన బలి వ్యవస్థ ప్రకారం. ఏడు రోజుల పాటు, ప్రధాన యాజకుడు పాప పరిహారార్పణతో పాటు దహన బలులు, అల్లాడించు సమర్పణలు అతని కోసం ఎక్కువ నైవేద్యములు ఇవ్వవలసి వచ్చింది.
ప్రధానయాజకునికి మరియు అతని కుటుంబానికి అందించే నైవేద్యాల మాదిరిగానే, అతను కూడా ఇశ్రాయేలీయుల పాపాలను వాటి మీదకు పంపడానికి ముందుగా వాటి రక్తం చిందించుటకు బలి పశువు తలలపై చేతులు వేయవలసి ఉంటింది. ప్రధాన యాజకునిగా దేవునికి సేవ చేయు బాధ్యత కోసం, తన ప్రజల యొక్క పాప విమోచన కోసం అర్పణలు ఎలా ఇవ్వాలో అతను వివరంగా నేర్చుకోవలసి ఉంటుంది . ప్రధాన యాజకుడు తన పాపములను శుద్దిచేసుకోవడానికి ముందుగా పాప నైవేద్యం అర్పించును అనగా, తన ప్రజల కోసం నైవేద్యాలను ఎలా అర్పించాలో శిక్షణ ఇస్తున్నాడని దీని యొక్క అర్థం – అనగా,నైవేద్యము యొక్క పశువు యొక్క తలలపై చేతులు వేసి, దాని రక్త చెందించటం దహనబలి బలిపీఠం మీద ఈ రక్తాన్ని ప్రోక్షించిన తరువాత , మిగిలిన వాటిని నేలపై పోయుదురు.
ఇక్కడ, ప్రధాన యాజకుడు నైవేద్యాల తలపై చేతులు వేయుట ద్వారా తన పాపములను మరియు ప్రజల యొక్క పాపములను దాటి పోవునని గుర్తుంచుకోవాలి; నిర్గమ 29: 10-12 చెప్పినట్లుగా, “మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగ ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయ వలెను”.
ప్రధాన యాజకుడు మరియు అతని కుమారులు తమ బలి సమర్పణ అయిన ఎద్దు తల మీద తమ చేతులను ఉంచాలని ఆదేశించబడ్డారు.ఎందుకంటే ప్రధాన యాజకుడు అహరోను మరియు అతని కుమారులు బలి పశువు తలపై చేతులు ఉంచినప్పుడు, వారి పాపములన్ని దాని మీదికి పోవును. ఈ బలి అర్పణ ప్రధానయాజకుడు మరియు అతని కుమారులు వారి చేతులు వేయడం ద్వారా ప్రజల పాపములను అంగీకరించినందున, అది రక్తం చిందించి మరణించవలసి ఉన్నది. దీని తరువాత, ప్రధాన యాజకుడు దాని రక్తాన్ని తీసి, దాని రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములపై చల్లి , మిగిలిన వాటిని నేలమీదపోయును. అతను లోపలి భాగాలను కప్పి ఉంచే కొవ్వు, ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును తీసుకొని , అటుతరువాత అతను వాటిని బలిపీఠం మీద కాల్చవలెను.
అనుకోకుండా పాపం చేసిన సామాన్య ప్రజల పాప పరిహారం కోసం పాపపరిహారార్థం విషయంలో, అతను చేసిన పాపానికి మచ్చలేని ఆడపిల్లను మేకపిల్లను బలిగా అర్పించును. “పాపపరిహారార్థ బలి పశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.మరియు సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజ కుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును" (లేవీయాకాండము 4: 29-31).
ఈ విధంగా చేతులు వేయడం మరియు నైవేద్యం యొక్క రక్త చిందించడం బలి వ్యవస్థలో ముఖ్యమైన అంశాలను గూర్చిన చట్టం దేవుని ద్వారా నిర్దేశించబడింది. జగత్తుపునాదికి ముందే, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో దాగి ఉన్న సత్యంతో మన పాపములన్నిటిని క్షమించాలని దేవుడు యేసుక్రీస్తులో ఈ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దహన బలిని అర్పించినప్పుడు వారిని కలుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నిర్గమకాండము 29:42 ఇలా చెబుతోంది, "ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి.నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును." ప్రతి ఉదయం మరియు సాయంత్రం యాజకులు ఇచ్చే దహన సమర్పణ అనేది తరతరాలుగా ఇవ్వాల్సిన నైవేద్యం, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా పాపం నుండి విడుదల పొందిన ఇశ్రాయేలు యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రజలను కలిసినట్టుగా దేవుడు ఈ అర్పణల ద్వారా మనల్ని కూడా కలుస్తానని చెప్పుచున్నాడు.


యాజకుడు ద్వారా ఇవ్వబడు దహనబలి నైవేద్యం యొక్క అర్థమేమిటి?

బలిపశువు యొక్క నైవేద్యం పై పాపము చేసిన వారి చేతులు దాని తలపై వేయుట ద్వారా సమస్త అతిక్రమణ పాపములను అది అంగీకరించినందున, అది వారి స్థానంలో చనిపోవాల్సి ఉంటుంది మరియు దానిని దహనం చేయడం ద్వారా అది శిక్షించబడుతుంది. ఈ బలి వ్యవస్థ యొక్క పాప పరిహారం ద్వారా దేవుడు మన నుండి కోరుకునేది ఏదనగా, "నేను దేవుని యెదుట అటువంటి పాపములను చేశాను కాబట్టి, నా పాపముకై నేను శిక్షించబడాలి." మన పాపములను శుద్దిచేసుకోవడానికి, దేవుని యొక్క రక్షణ నియమానికి అనుగుణంగా, బలి నైవేద్యము యొక్క తలపై మనం చేతులు వేయాలి, దాని రక్తం చిందించి, ఈ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములపై చమిరి,మిగిలిన వాటిని నేల అడుగున పోయవలెను, దాని మాంసాన్ని దహన బలిపీఠం మీద కాల్చవలెయును తద్వారా నీతిమంతులమైన మనము దేవుని కృప ద్వారా పాప విమోచన పొందుదుము. 
మొదటిగా, మన యొక్క హృదయాలతో మరియు క్రియలతో మనం చేసిన సమస్త పాపములను దేవుని యెదుట అంగీకరించాలి. మరియు ఈ పాపములను బట్టి మనం శిక్షించబడకుండా ఉండలేమని మనం గుర్తించాలి. కానీ ఆయన పరిపూర్ణమైన రక్షణకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పలేనిది. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు, ఆయన తన ఏకైక కుమారుడైన యేసును అనుగ్రహించాడు. యేసుక్రీస్తు తన బాప్తీస్మం ద్వారా మన పాపములన్నిటిని తీసుకున్నాడు మరియు సిలువ మరణంతో ఆ పాపములన్నిటికి ప్రాయశ్చిత్తం చేసి, ఆయనను విశ్వసించే వారు ఎవరు నశింపక, శాశ్వతమైన జీవాన్ని పొందగలరు. 
బలి వ్యవస్థ విధానం నైవేద్యాలు చేతులు వేయడం మరియు వాటి రక్తమును చిందించుట ద్వారా ఇవ్వబడును. ఇది మన పాపములన్నిటిని విమోచించే విశ్వాసం యొక్క రుజువును సూచిస్తుంది, కనుక మనం దానిని విశ్వసించాలి. ప్రతి పాపి నైవేద్యం యొక్క తలపై తన చేతులను ఉంచవలెను అనగా అతని యొక్క పాపములు దాని మీదకు పోవును. ప్రధాన యాజకుడు కూడా పాపపరిహారార్థ బలిని అర్పించినప్పుడు," దేవుని యెదుట నాలో అలాంటి పాపములు ఉన్నవి కావున అతను నేను మరణశిక్షకు పాత్రుడను అని దేవుని యెదుట ఒప్పుకొనవలెయును". అయితే పాపం నుండి మనలను విడిపించడానికి దేవుడే ప్రాయశ్చిత్తాన్ని జరిగించియున్నాడు ఈ సమర్పణను విశ్వసించడం ద్వారా పాపం నుండి విడుదల పొందడానికి దేవుడు మనకు సహాయం చేయునని మనం నమ్మడం ద్వారా, మనం రక్షించబడవచ్చు.
దేవుడు, "నేను మిమ్మును అక్కడ కలుస్తాను." చెప్పాడు. ఆయన దీనిని కేవలం ప్రధాన యాజకునికి మాత్రమే కాకుండా, ప్రతి సామాన్య ప్రజలకు కూడా చెప్పాడు, అంటే దేవుడు మనందరికీ పాప క్షమాపణను అనుగ్రహించి ఆయన మనల్ని తన సొంత ప్రజలుగా చేసుకొనును. అయితే దేవుడు మనల్ని ఎలా కలుస్తాడు? దేవుడు మన కొరకు రక్షణ యొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ద్వారా స్థాపించబడిన బలి వ్యవస్థ ప్రకారం వారి పాప సమర్పణలను అర్పించువారిని మాత్రమే ఆయన ఖచ్చితంగా కలుస్తాడు. మనుషులు పాపులుగా పుడతారని వారు పాపమునకు కట్టుబడి ఉంటారని దేవునికి బాగా తెలుసు కాబట్టి, ఆయన తన యొక్క బలి వ్యవస్థలో ఉత్పన్నమైన ఆయన కృప వలన మన పాపాలన్నింటినీ కడిగివేసి మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకోవాలనుకున్నాడు. అందుకే దేవుడు బలి వ్యవస్థను స్థాపించాడు, దీని ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అనేకులు తమ చేతులు వాటి తలపై ఉంచినప్పుడు వారి పాపములు బలి నైవేద్యం మీదకు పంపవచ్చును.
ఇశ్రాయేలు ప్రజలు తమ పాపములను బలి నైవేద్యం పై ఈ విధంగా ``చేతులు వేయు పద్దతి`` ద్వారా వారి పాపములను బలి నైవేద్యము మీదకు పంపుదురు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క చట్టాన్ని అనేక సార్లు ఉల్లంఘించారు మరియు అన్ని రకాల పాపములు చేసిరి. అయితే వారు తమ ``చేతులను బలి అర్పణ నైవేద్యం పై వేయడం`` ద్వారా వారి అతిక్రమ పాపములన్నియు ఈ పద్ధతి ద్వారా శుద్దిచేసుకోగలిగారు. దీని ద్వారా దేవుడు తనను విశ్వసించిన ఇశ్రాయేలీయులతో నివసించగలడు,మరియు వారికి దేవుడు కాగలడు, అలాగే వారిని తన సొంత ప్రజలుగా చేసుకోగలడు, మరియు వారిని నడిపించగలడు, మరియు వారికి పరలోకం యొక్క ఆశీర్వాదాలను అలాగే ఫలమిచ్చు ఈ భూమి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలరు. ప్రత్యక్షపు గుడారం యొక్క బలి వ్యవస్థపై వారికున్న విశ్వాసాన్ని బట్టి ఈ విషయాలన్నీ నిజముగా జరుగును.
ప్రత్యక్షపు గుడారం యొక్క బలి వ్యవస్థ యొక్క అన్ని విధానాలను దేవుడు ముందుగానే నిర్దేశించాడు, మరియు ఇశ్రాయేలు ప్రజలు బలి పశువు యొక్క తలపై చేతులు వేయడం ద్వారా వారి పాపములన్నిటి నుండి శుద్దిచేయబడవచ్చు అలాగే వారి పాపములను ఆ పద్ధతి ప్రకారం ఆ బలి పశువు పై దాటించవచ్చు. ఇది దేవునిచే నిర్ణయించబడింది. దేవుడు తన వద్దకు వచ్చిన వారందరికీ బలి పశువు పై చేతులు పెట్టే శక్తిని మరియు రక్తం చిందించుట వలన వారి పాపముల నుండి శుద్దిచేసుకోవటానికి ఆయన ఏర్పాటు చేసిన నిర్ణయముము ఇది, ఈ సత్యాన్ని విశ్వసించిన వారు పరిశుద్దుడైన దేవునితో నడవగలరు. చేతులు వేయడం మరియు రక్తం చిందించటం ఈ రెండింటితో అర్పించు అర్పణ కాక పోతే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నివసించలేడు. ఇశ్రాయేలీయులు ఎంత బలహీనులు మరియు ఎన్ని పాపములు చేశారో అనే దానితో సంబంధం లేకుండా, దేవుడు వారితో నివసించగలడు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ రక్షణ చట్టబద్దమైన బలి అర్పణ వలన -పాప పరిహారార్థ తల మీద చేతులు వేయడం మరియు దాని రక్తo చిందించుట ద్వారా ఏర్పాటైంది. అందువల్ల, దేవుడు మనకు అనుమతించిన పాప విమోచన అనేది బలి పశువు తలపై చేతులు వేయడం మరియు రక్తం చిందించుట అను ఈ రెండింటితో తయారు చేయబడిందని మనమందరం గ్రహించి మరియు నమ్మాలి.
యాజకులు ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం దహన బలులు అర్పించాలి. ఇది వారు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఉదయం వారి పాపముల కోసం దహన బలి ఇచ్చిన తరువాత, వారు పగటిపూట మరికొన్ని పాపములు చేస్తూనే ఉందురు, కాబట్టి వారి పాపములను దాటవేయడం మరియు మరొక బలి అర్పణను ఇవ్వడం ద్వారా వాటిని మరల కడగడం అవసరం ప్రతి సాయంత్రం. ప్రతిరోజూ ఇచ్చే దహన బలి యొక్క అర్పణలు ఇశ్రాయేలీయులకు విశ్వాసాన్ని గుర్తుచేస్తాయి అలాగే యేసు ఈ భూమ్మీదకు వచ్చి , బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తీస్మం పొంది లోకములోని పాపములను స్వీకరించడం, సిలువపై చనిపోవడం ద్వారా మన సమస్త పాపమును పాతిపెట్టడం వంటి విశ్వాసాన్ని గుర్తు చేసింది. అదేవిధంగా, మనమందరం ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం విశ్వాసంతో ప్రభువుకు సమర్పించుకోవాలి , ఎందుకంటే మనం రోజంతా నిరంతరం పాపం చేస్తూనే ఉంటాము. పాత నిబంధన కాలంలో ఇవ్వబడిన ఈ విశ్వాస సమర్పణ, కొత్త నిబంధన కాలంలో యేసు పొందిన బాప్తీస్మం మరియు రక్తం చిందించుట యందు విశ్వాసం ఉంచడం ద్వారా హృదయం యొక్క సమస్త అపవిత్రత శుద్దిచేయబడుతుంది.
మన రక్షకుడైన యేసు మన పాపములన్నిటిని తీర్చాడని విశ్వసించే మన హృదయంలో ఈ విశ్వాసాన్ని కనుగొన్నప్పుడు తండ్రియైన దేవుడు మనల్ని కలుస్తాడు.పాత నిబంధన యొక్క బలి వ్యవస్థకు అనుగుణంగా, యేసుక్రీస్తు తన కాలంలో ఈభూమ్మీదకు వచ్చాడు మరియు కొత్త నిబంధన శకం ప్రారంభంలో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన పాపములన్నిటిని అంగీకరించాడు (మత్తయి 3:15).అందుకే యేసు ఇలా అన్నాడు,"బాప్తిస్మమిచ్చు యోహానుదినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు." (మత్తయి 11:12). ఈ సువార్త యొక్క సత్యాన్ని విశ్వసించడం ద్వారా, మనం మన పాపములన్నిటి నుండి విడుదల పొందవచ్చు వాటి నుండి సంపూర్ణంగా శుద్ధి చేయబడవచ్చు.
యేసు క్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చాడు అనే దానితో సంబంధం లేకుండా, ప్రజలు అనేకమైన పాపములు చేస్తున్నారు, మరియు యేసుక్రీస్తును తెలుసుకున్న మనము ముందు మరియు తరువాత, మనము కూడా క్రైస్తవులుగా అనేకమైన పాపములు చేస్తున్నాము. కానీ యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి పొందిన బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తముతో,ఈ లోకములోని సమస్త పాపములను కడిగివేసాడు. అందువల్ల, దహనబలి ద్వారా తాను ఇశ్రాయేలు ప్రజలను కలుస్తానని దేవుడు చెప్పినప్పుడు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారిని దేవుడు కలుస్తాడని అర్థం. నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో ఆయన నిజంగా వారి పాపములన్నిటిని నిర్మూలించాడని నమ్మేవారిని దేవుడు ప్రేమిస్తాడు. అయితే ఈ సత్యాన్ని తిరస్కరించేవారు ఆయన ప్రేమకు నోచుకోలేరు.
క్రొత్త నిబంధన యొక్క ఈ కాలములో, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మనం దేవుణ్ణి కలుసుకోవచ్చు. పాత నిబంధన కాలంలో, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణము గల దారం మరియు సన్నని పేనిన నారలో కనిపించే సత్యాన్ని విశ్వసించడం ద్వారా ఒకరి పాపముల నుండి విడుదల పొందవచ్చును . చేతులు వేయడం మరియు రక్తచిందించడం - ఈ రెండు భావనల కలయిక ఒక ఖచ్చితమైన సువార్త. పాత నిబంధన దేవుని యొక్క పరిపూర్ణమైన రక్షణ గూర్చి ప్రవచించింది. క్రొత్త నిబంధన అనగా ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు మరియు వాగ్దానం చేయబడిన పరిపూర్ణమైన సువార్త. కావు, హెబ్రీయులు 1: 1-2 ఇలా చెప్పుచున్నది,“ పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములు గాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను."
యేసు రాజుల రాజు మరియు సర్వశక్తిమంతుడైన దేవుడు, అయితే ఈ దేవుడు ఈ భూమ్మీదకు వచ్చి, మానవ శరీర ఆకారముతో అవతరించి,బాప్తీస్మం పొంది , సిలువపై మరణించి,మృతులలో నుండి తిరిగి లేచాడు, కావున మన పాపములన్ని శుద్ధిచేసి పాపపు శిక్ష నుండి మనల్ని రక్షించాడు. మనము ఈ సువార్తను విశ్వసించడం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగాను సంపూర్ణులుగాను చేసి యున్నాడు. మనము ఎంతో శ్రద్ధగా ఆశించిన ఈ పాప విమోచన పొందడం ఇప్పుడు సాధ్యమైంది. మనము మన పాపములన్నిటి నుండి శుద్దిచేయబడాలని మరి ఎక్కువగా ఆశిస్తున్నాము,దేవుడు వాటిని బలి వ్యవస్థ ద్వారా చేతులు వేయు పద్ధతిలోనూ మరియు రక్తం చిందించుట ద్వారా అనగా యేసు బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్త ప్రోక్షణ ద్వారా వారిని ఒకసారి విడిపించాడు. ఇది నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క వాస్తవ పదార్ధం (1 యోహాను 5: 6-8). దేవుడు మన పాపములన్నిటిని సంపూర్ణంగా క్షమించాడని మనం విశ్వసించినప్పుడు, ఆయన మనల్ని తన సొంత ప్రజలుగా చేసుకుని, మనల్ని కలుస్తాడు.


చేతులు వేయుట యొక్క ప్రాముఖ్యత

లేవీయకాండము 1: 1-4, "యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడార ములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రా యేలీయులతో ఇట్లనుముమీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను. అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను;అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్ష ముగా అంగీకరింపబడును."
ఇక్కడ నాల్గవ వచనము పై శ్రద్ధ చూపదము, "అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను;అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్ష ముగా అంగీకరింపబడును." మరో మాటలో చెప్పాలంటే, పాపి బలి పశువు తలపై తన చేతులు ఉంచి ఆ తరువాత తన దహనబలిని అర్పించినప్పుడు దేవుడు దానిని సంతోషంగా స్వీకరించును. పాపి యొక్క చేతులు ఎవరి తలపై వేయవలెను ? ఇది బలి పశువు యొక్క తల మీద. ఈ పద్ధతి ద్వారా మాత్రమే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములను తొలగిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి పాత నిబంధనలో బలి పశువు తలపై చేతులు వేయబడ్డాయి,అయితే కొత్త నిబంధన గురించి ఏమిటి? కొత్త నిబంధన కాలంలో నిజమైన బలి పశువు ఎవరు? ఇది మరెవరో కాదు, మానవజాతి అంతటికి రక్షకుడైన యేసుక్రీస్తు. మానవజాతి యొక్క సమస్త పాపములను నిర్మూలించడానికి యేసుక్రీస్తు ఒక్కరే బలి అర్పణగా వధించబడెను.అందరూ పాపులుగా మారడానికి ఒక వ్యక్తి మూలంగానే, మానవులందరూ వారి పాపములన్నిటి నుండి శుద్ధి చేయబడటానికి మరియు శాశ్వత జీవాన్ని పొందడానికి యేసుక్రీస్తే కారణం.
విశ్వాసం ద్వారా, మనము యేసు తలపై చేతులు వేసి,మన పాపములన్నిటిని ఆయన పైకి పంపాలి. మరో మాటలో చెప్పాలంటే, ఈ అర్పణను దేవుడు ఆనందంతో స్వీకరించేలా మనం నిజమైన విశ్వాసంతో ఆయన తలపై చేతులు వేయాలి. మత్తయి 11:12 లో బలాత్కారులు మాత్రమే తన రాజ్యాన్ని బలవంతంగా తీసుకోగలరని యేసు చెప్పారు.చేతులు వేయడం వలన మన పాపములన్నిటిని బలి అర్పణ పై దాటించుటకు వీలుగలుగును, దేవుడు ఈ విశ్వాస అర్పణను ఆనందంగా అంగీకరిస్తాడు. బాప్తీస్మం మిచ్చు యోహాను యేసుక్రీస్తు తలపై చేతులు వేసి, మానవజాతి పాపములన్నిటిని తనపైకి పంపినందున, దేవుడు తన బాప్తీస్మం మరియు సిలువపై ఆయన మరణమును అను ఈ రెండింటినీ హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు ప్రతి ఒక్కరినీ పాపం నుండి శుద్ధి చేయబడి , పాపపు శిక్ష నుండి వారిని విడిపించును.యేసుక్రీస్తు స్వీకరించిన బాప్తీస్మం పై విశ్వాసం ఉంచడం ద్వారా మన యొక్క పాపములన్నిటిని ఆయనపైకి పంపవచ్చును.
దేవుడు ఇశ్రాయేలీయులకు బలి వ్యవస్థను అనుగ్రహించాడు, అది యేసుక్రీస్తు తన శరీరంతో అర్పించే శాశ్వత బలిని సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు తన బాప్తీస్మం మరియు సిలువ రక్తంతో ఈ బలి వ్యవస్థలో వాగ్దానం చేయబడిన రక్షణ యొక్క వ్యవస్థ చట్టాన్ని పూర్తి చేశాడు. మనపై ఆయనకున్న అంతులేని ప్రేమ నుండి, దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఇవ్వడం ద్వారా మనలను రక్షించాడు. యేసుక్రీస్తు యొక్క బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తాన్ని విశ్వసించడం ద్వారా ప్రతి ఒక్కరూ రక్షించబడవలసిన సమయం ఇది.
సర్వజ్ఞుడైన దేవుడు సృష్టికి ముందే పాపుల కోసం తన పరిపూర్ణమైన రక్షణ ప్రణాలికను సిద్ధం చేసాడు దానిని తన సమయాను కూలంగా నెరవేర్చాడు. ఈ రక్షణ యొక్క ప్రణాళిక ప్రకారం,బాప్తీస్మం మిచ్చు యోహాను యేసుకు ఆరు నెలల ముందు జన్మించాడు. బాప్తీస్మం మిచ్చు యోహాను మానవులందరిలో గొప్పవాడు. యేసు స్వయంగా చెప్పాడు , "స్త్రీలలో జన్మించిన వారిలో బాప్తీస్మం మిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు" (మత్తయి 11:11). మరో విధంగా చెప్పాలంటే, మానవజాతి అంతటికి ప్రతినిధి. బాప్తీస్మం మిచ్చు యోహాను దేవుని యొక్క సేవకుడు, అతను మోసే, ఏలీయా మరియు ప్రవక్త యెషయా కంటే గొప్పవాడు. చాలా మంది ప్రజలు బాప్తీస్మం మిచ్చు యోహానును అరణ్యంలో ఒంటరి జీవితం గడిపిన పరిశుద్ధునిగా మాత్రమే భావిస్తారు. కానీ అతను నిజానికి దేవుడి ద్వారా మొత్తం సమస్త మానవాళికి ప్రతినిధిగా పంపబడ్డాడు. బాప్తీస్మం మిచ్చు యోహాను నిజానికి ఈ లోకములోని ప్రజలందరిలో గొప్పవాడు. అతను ప్రధాన యాజకుడు అహరోను వంశానికి చెందిన వాడు (లూకా 1: 5-7).రాజులు రాజ కుటుంబం నుండి జన్మించినట్లుగా,బాప్తీస్మం మిచ్చు యోహాను, చివరి ప్రధాన యాజకుడు, మొదటి ప్రధాన యాజకుడు అహరోను ఇంటి నుండి కూడా జన్మించాడు, మరియు మానవజాతి ప్రతినిధిగా, అతను పాపములను దాటింప చేయుటకు యేసుకు యొర్దాను నదిలో బాప్తిస్మం యిచ్చియున్నాడు.ఇలా మానవజాతి యొక్క సమస్త పాపములను ఆయన పైకి పంపబడెను.బాప్తీస్మం మిచ్చు యోహాను ఈ భూమి మీద ఉన్న అందరికంటే గొప్పవాడు. కానీ కొంతమంది దీనిని ప్రశ్నిస్తున్నారు,ఇది వారు నమ్మకూడదని ముందుగా నిర్ణయించుకున్నట్లుగా, "బాప్తీస్మం మిచ్చు యోహాను ప్రధాన యాజకుడని పరిశుద్ధగ్రంథములో ఎక్కడ చెప్పబడింది ?"
వారికి జావాబు నన్ను చెప్పనివ్వండి వాస్తవంగా బాప్తీస్మం మిచ్చు యోహాను మానవాళికి ప్రతినిధిగాను మరియు ప్రధాన యాజకుడు అనునది స్పష్టంగా చూపించబడింది, ఎందుకనగా ఇవన్నీ దేవుని వాక్యంలో వ్రాయబడ్డాయి: “యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుం డెను.
ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే." (మత్తయి 11: 13-14). మలాకీ 4: 5 వచనంలో ఏలీయాను పంపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. రాబోయే ఈ ఏలీయా మరెవరో కాదు గాని బాప్తీస్మం మిచ్చు యోహాను అని యేసు స్వయంగా చెప్పాడు. బాప్తీస్మం మిచ్చు యోహాను అహరోను వారసుడిగా జన్మించినందున అతను ప్రధాన యాజకుని యొక్క పాత్రను నెరవేర్చాడు.
పాత నిబంధనలో, ఒక పాపి తన పాపములను బలిపశువు తలపై చేతులు ఉంచి, ఆ రక్తాన్ని చిందించడం ద్వారా దానిని చంపి , అగ్నితో కాల్చుదురు. ఎవరైనా తన పాపముల నుండి విమోచన పొందాలని కోరుకుంటే, తన పాపములను దాని మీదకు పంపుటకు వెనుతీయక బలిపశువు తలపై తన చేతులను ఉంచాలి.ప్రజలు బలిపశువు తలపై తమ చేతులు ఉంచినప్పుడు, వారి పాపములు దాని మీదకు వెళ్లాయని అర్థం. మరియు, ప్రాయశ్చిత్తం రోజున, ప్రధానయాజకుడైన ఇశ్రాయేలు ప్రజల వార్షిక పాపములన్నిటిని దాటించడానికి బలిపశువు యొక్క తలపై చేతులు వేయవలసి ఉంటుంది.ఇక్కడ కూడా, చేతులు వేయడం చాలా అవసరం, మరియు దీని యొక్క అర్థం, ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, పాపములను దాటించు విధానము. బాప్తీస్మం మిచ్చు యోహాను యేసుకు బాప్తీస్మం ఇవ్వడం ద్వారా మన పాపములన్నిటిని యేసుపైకి పంపించెను, మరియు ఈ బాప్తీస్మం ద్వారా యేసు లోకములోని సమస్త పాపములను అంగీకరించి, ఆపై సిలువపై తన రక్తాన్ని చిందించెను. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం పొందడం ద్వారా ఆయన మన పాపములన్నిటిని స్వీకరించడం ద్వారా, మరియు సిలువపైఆయన రక్తాన్ని చిందించడం మరియు మృతులలో నుండి తిరిగి లేవడం ద్వారా, యేసుక్రీస్తు మనకు పరిపూర్ణ రక్షకునిగా మారెను.
ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ విధంగా దాని తలపై చేతులు వేసి దేవునికి తమ సమర్పణను అర్పించారు . ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, పాపులుగా మారిన ప్రతి సారి, వారు దేవునికి తమ పాప పరిహారమును సరియైన రీతిగా అర్పించుట కొరకై బలిపశువు తలపై చేతులు వేసి వారి పాపములను పాప పరిహారము మీదకు పంపవలసి వచ్చింది. వారు తలపై చేతులు వేసి దానిని చంపిన తర్వాత అగ్నితో దహింతురు ఈ చట్టబద్ధమైన సమర్పణను దేవుడు ఆనందంతో అంగీకరించును.ఇశ్రాయేలు ప్రజలైన వారి పాపములను బలిపశువు యొక్క తలపై మోపడం ద్వారా ఈ చట్టబద్ధమైన బలిని ఆయనకు అర్పించుట ద్వారా దేవుడు వారిని కలుసుకొనును. ఈ బలి అర్పణపై వారి చేతులు వేయడం ద్వారా వారి పాపములను అంగీకరించి వారి పాపముల కొరకు మరి ఎక్కువ శిక్షను అనుభవించెను, ఈ సమర్పణలో దేవుని దయను విశ్వసించడం ద్వారా దేవుడు తన వద్దకు వచ్చిన వారిని కలుసుకొనును. అందుకే దేవుడు అలాంటి బలి పశువులను అంగీకరించుటకు సంతోషించును.ఆయన కరుణామయుడు, ఆయన ఏ ఒక్కరిని నరకానికి పోవుట భరించలేడు.
ఈ విధంగా, మన పాపములన్నిటి నుండి మనల్ని శుద్ధి చేయునది యేసుక్రీస్తు పొందిన బాప్తీస్మం మరియు ఆయన సిలువ రక్తం అను ఈ రెండును.లోకములోని పాపములను తీసివేయుటకు బాప్తీస్మం మిచ్చు యోహానుచేత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసుక్రీస్తు మన పాపములన్నిటిని స్వీకరించాడు, ఎందుకనగా ఆయన సిలువపై చనిపోయి మన పాపముల కొరకై న్యాయమైన శిక్షను భరించగలడు. యేసు మన పాపములన్నిటిని స్వీకరించడానికి బాప్తిస్మం తీసుకున్నందున సిలువ యొక్క న్యాయమైన శిక్షను భరించగలిగాడు. కాబట్టి ఆయన మనలను పాపం నుండి విడిపించగలడు. అందువల్ల, ఆయన బాప్తీస్మం మరియు ఆయన త్యాగం చేసిన రక్త ప్రోక్షణ పైన నమ్మకం ఉంచడం ద్వారా, మనం ఇప్పుడు తిరిగి నీతిమంతులుగా జన్మించి,యేసుక్రీస్తును కలుసుకోగలం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా, యేసు యొక్క నీతివంతమైన కార్యముల ద్వారా, సంక్షిప్తంగా, మనమందరం పరిశుద్దుడైన దేవుణ్ణి కలుసుకోవచ్చు.మనలో ఈ సత్యాన్ని విశ్వసించే వారికి నిత్య రక్షకునిగా యేసుక్రీస్తు ఉన్నారు.
మనం తప్పక పరిశుద్దుడైన దేవుణ్ణి కలవాలి. నీలం,ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం ద్వారా వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా, మనం దేవుడిని కలుసుకోవచ్చు. దేవుడిని కలవాలని కోరుకునే వారు తప్పనిసరిగా ఆయన మాట వినాలి మరియు దేవుడు ఇచ్చిన బలి వ్యవస్థను విశ్వసించాలి, ఇందులో చేతులు వేయడం మరియు రక్త ప్రోక్షణ అను ఈ రెండు ఉండును. వారు తమ స్వంత శరీర సంబంధమైన ఆలోచనలతో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే దీని గురించి చిన్న సందేహం కలిగి ఉన్నను, వారు దేవుని వాక్యాన్ని తెరిచి తమకు తాము ద్రువీకరించుకొని. దేవుని వాక్యం ఏది సరైనదో వారు దాని నమ్మవలెను.
మన స్వంత ఆలోచన విధానంతో మనం దేవుడిని నమ్మకూడదు. బదులుగా, మనం దేవుని వాక్యం యొక్క సత్యానికి కట్టుబడి ఉండాలి, మరియు ఈ వాక్యం ఆధారంగా, మనం ఈ సువార్త నుండి ఇతర సువార్తలను గుర్తించాలి. మన స్వంత అవగాహన మరియు అధ్యయనం పై ఆధారపడి, మన ఆలోచనలపై మాత్రమే మనం పట్టుబట్టకూడదు. మీ స్వంత ఆలోచనలు ఎన్నటికీ సరైనవి కావు. మానవులు చాలా బలహీనులు, మొండివారు, మరియు దేవుని ముందు చాలా కఠినంగా ఉంటారు, వారు మొదట తమ స్వంత నీతిని మరియు ఆలోచనలను ముందు ఉంచడానికి దేవుని యొక్క వాక్యాన్ని విడిచి పెట్టడానికి వారు మొగ్గు చూపుదురు. దేవుని యెదుట మన హృదయాలను తెరవడం మరియు ఆయన వాక్యాన్ని విశ్వసించడం జీవితానికి మరియు ఆశీర్వాదాలకు నిజమైన మార్గం. 
ప్రధాన యాజకుడు ఒక ఎద్దును శుద్దీకరించుటకు తన పాప సమర్పణగా ఇచ్చినప్పుడు, దేవుడు దాని లోపలి భాగంలో ఉండే ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును తీసుకొని కాల్చమని చెప్పాడు. వాటిని బలిపీఠం మీద, ఎద్దు యొక్క మాంసాన్ని, దాని చర్మం మరియు దాని పొట్టుతో, శిబిరం వెలుపల నిప్పుతో కాల్చాలి. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగానే ప్రధాన యాజకుడు బలి సమర్పణను అర్పించును. దహనబలి ఇచ్చినప్పుడు, ప్రధాన యాజకుడు కూడా బలి అర్పణగా మచ్చలేని ఒక పొట్టేలును తెచ్చి, దాని తలపై చేతులు పెట్టాడు.
అతనికి మరియు అతని కుటుంబానికి, ఉదయం మరియు సాయంత్రం ప్రధాన యాజకుడు మరియు అతని కుమారులు అలాంటి నైవేద్యం తల మీద చేతులు వేసి, దాని గొంతు కోసి దాని రక్తం తీసి, ఈ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములపై చిలకరించి. వారు దాని శుభ్రపరచని భాగాలన్నింటినీ దాని శిబిరం వెలుపల తగలబెట్టారు, కానీ ముక్కలుగా చేయబడిన మాంసం దహన బలిపీఠం మీద దహనం చేయబడ్డాయి. ప్రధాన యాజకుడు తనను తాను శుద్దీకరించుకునే సమయంలో ఇచ్చే దహనబలి కూడా ఈ విధంగానే అర్పించబడును.
ప్రత్యేకించి, ప్రధాన యాజకుడు శుద్దీకరణ సమయంలో, బలి అర్పణలోని కొవ్వు మొత్తం దేవుడికి దహనం చేయాల్సి ఉండును. ఆ దేవుడు బలి అర్పణ యొక్క కొవ్వు సువాసనతో సంతోషించును, అది ఖచ్చితంగా ఆయన వాక్య ఆధారంగా దేవుడు ఏర్పాటు చేసిన బలి వ్యవస్థ ప్రకారం దేవుడు మనల్ని తిరిగి జన్మించేలా చేయును.ఇక్కడ ఉన్న కొవ్వు, మరో మాటలో చెప్పాలంటే, పరిశుద్ధాత్మ దేవుడిని చూపిస్తుంది. దేవుడు మనకు బలి వ్యవస్థను ఇచ్చాడు, మరియు ఈ బలి వ్యవస్థకు అనుగుణంగా ఆయన మనలను చేసాడు; బలి పశువు తలపై మన చేతులను ఉంచడం ద్వారా, దానిని చంపి, దహనబలి బలిపీఠం మీద దాని మాంసాన్ని కాల్చి ఆయనకు దహనబలి అర్పించడం ద్వారా ఆయన సంతోషించును. ఈ విధంగా దేవుడు నిర్దేశించిన బలి వ్యవస్థ ప్రకారం ఆయన పై విశ్వాసంతో బలి అర్పణ అర్పించినప్పుడు మాత్రమే దేవుడు దానిని ఆనందంతో అంగీకరించును.
నిర్గమకాండము 29:10, "మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచిరి." ఇది దేవుని ఆజ్ఞ. అంతేకాక, ప్రధాన యాజకుడు తన శుద్దీకరణ సమయంలో ధరించిన వస్త్రాలలో, ఏఫోదును ఐదు దారాలతో పేన వలసి వచ్చింది -అనగా, అది బంగారం, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో పేనాలి.ఇక్కడ బంగారు దారం యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతుంది. నీలిరంగుదారం యేసుక్రీస్తు స్వీకరించిన బాప్తిస్మమును సూచిస్తుంది, ఇది పాత నిబంధనలో చేతులపైన వేయడం వలె ఉంటుంది; ఊదా దారము యేసు దేవుని కుమారుడిగా, తానే దేవుడను రక్షకుడని మనకు చెప్పుచున్నది ; మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం యేసు క్రీస్తు చేసిన త్యాగాన్ని సూచిస్తుంది; మరియు సన్నని పేనిన నార మనల్ని పాప రహితులుగా మార్చిన దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తుంది.దేవుడు మన పాపములన్నిటిని క్షమించి మన హృదయాన్ని మంచువలె తెల్లగా మార్చినట్లు విశ్వసించే విశ్వాసాన్ని బంగారుపు దారం తెలుపుతుంది. యేసు బాప్తీస్మంతో మరియు సిలువ రక్తంతో దేవుడు మన పాపములను తొలిగించియున్నాడని నమ్మి ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మనందరికీ చెప్పిన దాని ప్రకారం, మన పాపములన్నిటిని ఆయన ఎలా తీసివేసాడో దాని ప్రకారం మనం యేసుక్రీస్తును ఖచ్చితంగా నమ్మాలి. రక్షణ యొక్క బలి వ్యవస్థను దేవుడు ఎలా ఏర్పాటు చేసినది అలాగే బలి వ్యవస్థను పూర్తి చేసిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన పాపములన్నిటిని ఎలా తొలగించియున్నాడనే అనే దాని ప్రకారం మనం దేవుణ్ణి నమ్మవలెను.
అనేక మంది ఇలా అందురు, “మీరు ఆయనను ఎందుకు ఇలా నమ్మకుండా ఉన్నారు?మీరు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉన్నారు? బహుశా మీరు పూర్తి వివరణల యొక్క ఆధారాలతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉందురేమో అలాగే మీరు అన్ని సమయాలలో ఖచ్చితంగా ఉండే వ్య్తక్తిగా ఇష్టపడతారు, కానీ నా వ్యక్తిత్వం మాత్రం చుట్టూ పరిభ్రమిస్తుంది, కాబట్టి రెండు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఒకేసారి ఉండవచ్చని నేను నమ్ముతున్నాను.అయితే మీలాంటి వ్యక్తుల యొక్క విశ్వాసమును దేవుడు అంగీకరిస్తాడా? నేను ఏదో ఒకవిధంగా దేవుణ్ణి నమ్ముతానని చెబితే,ఈ విశ్వాసం చెప్పిన దానికి సరిపోవునా ? మీరు ఇలా విశ్వసిస్తే, దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. ఆయన సత్యస్వరూపియైన దేవుడు. దేవుడు మనలను అంత చంచలమైన మరియు అనిశ్చితమైన రీతిలో రక్షించలేదు. దేవుడు అత్యంత ప్రకాశించే వెలుగైయున్నాడు, ఎవరి మాటలైతే పదునైన,రెండంచుల ఖడ్గము కంటే పదునుగా ఉన్నట్లు. ఆయన ఊరీము మరియు తుమ్మీముతో తీర్పుతీర్చును, అనగా ఆయన మనల్ని తన వెలుగుతోను మరియు పరిపూర్ణతతో రక్షించాడు.
దేవుడు సమస్త అతి చిన్న కొలతలను ఒకదానికొకటి గుర్తించగలిగే అత్యంత అధునాతన సూక్ష్మదర్శిని కంటే చాలా స్పష్టముగా గుర్తించువాడు. ఆయన మనకు నచ్చిన విధంగా విశ్వసించినప్పుడు మన యొక్క రక్షణను అంగీకరించే వ్యక్తి కాదు. దేవుడు సత్యం కావున , మనలో దాగి ఉన్న ఆలోచనల నుండి మనం తాత్కాలిక భావాల వరకు, మన హృదయాలలో ఉన్న పాపముల నుండి మన క్రియల వరకు, మనం ఇంతకు ముందు చేసిన పాపముల నుండి ఇప్పుడు చేస్తున్న పాపములు అన్నియు ఆయనకు తెలుసు. మనము భవిష్యత్తులో చేయుబోవు పాపములు దాచబడినవి ఒకే సారి బహిర్గతమవుతాయి. అందుకే దేవుడు బలిపశువు తల పై చేతులు వేయుటలోను మరియు రక్తం చిందించు ఈ రెండింటి ద్వారా ఖచ్చితంగా అలాంటి పాపములన్నిటిని తొలగించునని దేవుడు నిర్ణయించుకున్నాడు అందుకే దేవుడు నిర్దేశించిన బలి వ్యవస్థ ప్రకారం మనం ఖచ్చితంగా దేవుని రక్షణను విశ్వసించాలి.
మనం పాప పరిహారము యొక్క తలపై మన చేతులు ఉంచాలని,అప్పుడు ఆయన దానిని ఆనందంతో స్వీకరిస్తాడని మన ప్రభువు చెప్పాడు.ఒక పాపి పాప పరిహారము యొక్క తలపై తన చేతులు ఉంచినప్పుడు, అతడు ఈ నైవేద్యాన్ని చంపి దాని రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములపై పోయాలి. ఇక్కడ, నైవేద్యపు రక్తాన్ని కొమ్ములపై చల్లడం వలన తీర్పు పుస్తకంలో నమోదు చేయబడిన పాపములు తొలగిపోవును (ప్రకటన 20: 12-15).దీని తరువాత,మిగిలిన రక్తం నేలమీద పోయుదురు . దీని అర్థం అతని హృదయం అనునది పాపం నుండి శుద్దిచేయబడింది.
యేసుక్రీస్తు, మీ కొరకు మరియు నా కొరకు బాప్తీస్మం పొంది, సిలువ పై మరణించ, మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా మనందరినీ రక్షించారు. ప్రధానయాజకుడు కూడా మన వంటి విశ్వాసం కలిగి ఉండును. ఈ ప్రస్తుతకాలములో మీరు మరియు నేను కలిగి ఉన్న ఈ విశ్వాసం ప్రధాన యాజకుడు కలిగి ఉన్న విశ్వాసానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. ప్రధానయాజకుడు కూడా, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంలో వ్యక్తీకరించబడిన సత్యం పట్ల విశ్వాసం ద్వారానే అతను తన యాజక విధులను నిర్వర్తించగలడు,అదే విశ్వాసంతోనే మీరు మరియు నేను నీతిమంతులం అయ్యాము. ఈ విశ్వాసం ద్వారా మనం పాప విమోచన పొందినందున, దేవుడు మనకు ఇచ్చిన రక్షణను విశ్వసిస్తున్నందున, మనం ఇప్పుడు ఆయనను కలుసుకోగలం, ఆయన సహాయం కోసం అడగవచ్చు, మన జీవితాలను తన సొంత ప్రజలుగా నడిపించును మరియు మనము ఏ రీతిగా యాజక విధులను నిర్వర్తిస్తున్నామో అదే విధంగా పాపులకు సువార్త ప్రకటించబడును. 


భూసంబంధమైన యాజకులు మరియు బలి వ్యవస్థ దేవుని యొక్క ఏర్పాటు

ప్రధాన యాజకుడు మరియు బలి వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందువల్ల, భూమ్మీద ఉన్న ప్రధాన యాజకుడు దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు చేశాడు మరియు అలా చేయడం ద్వారా ఆయన తన ప్రజల పాపములను పరిహరించడానికి తన యాజక విధులను నెరవేర్చాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరలోక ప్రధాన యాజకునిగా మన పాపములన్నిటిని ఎలా తొలగించాడు?భూసంబంధమైన బలి అర్పణను ఉపయోగించడానికి బదులుగా, ఆయన ఎటువంటి పాపము లేని తన స్వంత శరీరాన్ని బలిగా అర్పించి మన పాపములన్నిటిని ఆయన శరీరము మీదకు తీసుకొనెను.బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు మానవజాతి పాపములన్నిటిని స్వీకరించి,ఆయన రక్తాన్ని చిందించి సిలువపై మరణించాడు, తిరిగి మృతులలో నుండి లేచాడు. కావున లోకములోని సమస్త పాపముల నుండి మనల్ని రక్షించాడు. ఈ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంది, మరియు ఈ రక్షణ ఎంత అద్భుతంగా ఉంది!
దీనిని నీవు చేయగలవా? మరొకరి కొరకు, మీరు ఈ పాపములను స్వీకరించి అతని స్థానంలో సిలువ వేయబడతారా? అసాధ్యం! అంతేకాక, మీ శరీరం చట్టబద్ధమైన సమర్పణగా అర్హత సాధించబడదు, ఎందుకంటే అది మచ్చలేనిది కాదు. ఉదాహరణకు,తమ దేశo యొక్క గొప్ప తనం కోసం కొందరు వారని మించి నీతికార్యాలు చేయుదురు. అయినను దీన్ని చేయగలవారు కొందరు ఉన్నప్పటికీ, మనుషులు చేసే ప్రతి పని పనికిరాదు, ఎందుకంటే వారు తమ సొంత పాపపు సమస్యను పరిష్కరించలేని వారు, ఇతరుల యొక్క పాపపు సమస్య నుండి కాపాడడం చాలా తక్కువ. పరిశుద్దుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తప్ప మానవజాతిని పాపం నుండి రక్షించగలిగే వారు మరెవరూ లేరు. పరిశుద్ధగ్రంధము మనకు చెప్పుచున్నది, మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను (అపోస్తులు 4:12).
అలాగే, “నేను దీన్ని చేయగలను.నన్ను నేను మరొకరి కొరకు పూర్తిగా అప్పగించుకొందునని అలాగే మరొకరి కొరకు నన్ను నేను త్యాగం చేయుదునని ఆలోచించే ఆసక్తి గల వ్యక్తి మీలో ఎవరైనా ఉన్నారా ? అలాంటి త్యాగం మరియు అంకితభావం మనుషులలో ప్రశంసించబడవచ్చు, కానీ సమయం గడిచేకొద్దీ మరియు విషయాలు మెరుగుపడినప్పుడు,అలాంటి ధర్మబద్ధమైన పని చివరికి అన్నింటినీ మర్చిపోతుంది. హెబ్రీయులు 13:9 మనకు ఈ విధంగా చెప్పుచున్నది," భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది." దేవుని నుండి మన హృదయాలు ఏ ఐశ్వర్యం మరియు ప్రయోజనాలను పొందాయి? ఇది దేవుని యొక్క రక్షణ ప్రేమ, ఆయన కృపతో మన హృదయాలను నింపివేస్తుంది. మరొక మానవుడు భౌతికంగా సహాయం చేయడం మన నిత్య జీవితానికి శాశ్వతం ఏదీ కాదు. మనం మరోసారి సుఖంగా ఉన్నప్పుడు, మనమందరం అలాంటి సహాయాన్ని మరచిపోయే అవకాశం ఉంది.
సోక్రటీస్, కన్ఫ్యూషియస్ మరియు సిద్ధార్థలు ప్రపంచంలోని గొప్ప ఋషులుగా ప్రశంసించబడ్డారు. అయితే, ఈ ఋషులు శాశ్వతంగా మీ రక్షకుడిగా ఉండగలరా? సిద్ధార్థ అను ఈ వ్యక్తి మనల్ని పాపము నుండి శుద్ధి చేయగలడా? వారెవరూ చేయలేరు. ఏమానవుడు తన యొక్క పాపములలో ఒక్కదాన్ని కూడా పరిష్కరించలేనప్పుడు, మానవజాతికి ఎవరు రక్షకుడిగా ఉందురు? ప్రధాన యాజకుడు కూడా తన స్వంత పాపలతో తన ప్రజల యొక్క పాపములను తొలగించలేడు. దేవుడు ఇచ్చిన బలి వ్యవస్థపై విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు కడిగివేయబడతాయి మరియు ఈ బలి వ్యవస్థ ప్రకారం ఆయన అర్పణను ఇవ్వడం ద్వారా వారి పాపములు నుండి విడుదల పొందినప్పుడు-అనగా వారి పాపములను బలి పశువు తల పై చేతులు వేయడం ద్వారా,వారి పాపములు పాప పరిహార బలి పై దాటించబడును.ఈ బలి యొక్క రక్తం దహన బలిపీఠం యొక్క కొమ్ములపై చల్లి, శేషాలను నేలమీద పోసి, దాని కొవ్వును దహనబలి బలిపీఠం మీద కాల్చడం ద్వారా అర్పించవలెను.
ఒక సంవత్సరం విలువైన పాపములను పరిహరించడానికి, ఏడవ నెల పదవ వ తేదీన, ప్రధాన యాజకుడు దేవుని యెదుట బలి అర్పణ తలపై చేతులు వేసి, దాని ద్వారా పాపములను దాని మీదికి పంపి దాని యొక్క రక్తమును అతి పరిశుద్ద స్థలములోకి, తీసుకొని రుణాపీఠము యొక్క తూర్పు దిశగా ప్రవేశించి రక్తమును చిలకరించును. అతను ఏడుసార్లు రక్తాన్ని చిలకరించినప్పుడు, అతని నీలిరంగు వస్త్రం అంచున వేలాడుతున్న బంగారు గంటలు మోగును.(ఈ బంగారు గంటలు నీలం, ఊదా, మరియు రక్తవర్ణ దారంతో పేనిన దానిమ్మ పండుల మధ్య వ్రేలాడుతూ ఉండును.) అతను నడిచినప్పుడు లేదా రక్తం చిలకరించినప్పుడెల్ల ఈ బంగారు ఘంటలు ఇంపైన శబ్దం వినబడును. ఇది సువార్త తప్ప మరొకటి కాదు. ఈ శబ్దం మంచి సువార్తకు సాదృష్యంగా ఉన్నది, ఈ శక్తివంతమైన సువార్త మన పాపములన్నిటిని తుడిచివేసింది. ప్రధాన యాజకుడు తన ప్రజల కొరకు పాప విమోచనను తన ఇష్టానుసారంగా ఏ సమర్పణను ఇవ్వడం ద్వారా కాకుండా దేవుడు స్థాపించిన శాసనం ప్రకారం మాత్రమే ఇవ్వడం ద్వారా, క్రొత్త నిబంధన కాలములో, యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు రావడం, బాప్తిస్మం తీసుకొని, సిలువపై చనిపోయి మరియు తిరిగి మృతులలో నుండి లేవడం ద్వారా మన పాపములన్నిటి నుండి మనల్ని రక్షించాడు ఇదంతయు ఒకే శాసనం ప్రకారం జరిగింది. యేసుక్రీస్తు కూడా తాను నియమించిన రక్షణ యొక్క చట్టం ప్రకారం తన పనులను నెరవేర్చినప్పుడు మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేయగలడు.
ఎవరైతే నిజముగా తిరిగి జన్మించాలని ఆశిస్తున్నారో వారు తమ పాపముల నుండి విడుదల పొందగలరు, వారు అంగీకారయోగ్యంగా, సంతోషంగా దేవుని యొక్క వాక్యాన్ని విశాల మనస్సుతో వినడానికి ఇష్టపడటం, అనేది ‘బెరియన్’ స్ఫూర్తి విధానం కలిగి యున్నవారు.భిన్నాభిప్రాయాలు ఉన్నవారు ఈ సత్యాన్ని విశ్వసించలేరు మరియు దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఎన్నిసార్లు బోధించినా వారు పాపం నుండి విడుదల పొందలేరు; వారు అత్యంత మూర్ఖులు. దేవుడు చెప్పినట్లుగానే ఎవరైనా వాక్యాన్ని బోధించకుండా వారు ఎలా విశ్వసించగలరు? మానవ జ్ఞానం నిజంగా ఎంతవరకు చేరుకోగలదు? ఇది దేవుని వాక్య జ్ఞానానికి చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, వారు తమ సొంత విజయాలు గురించి గొప్పలు పలకడం మరియు దేవుని వాక్యాన్ని విశ్వసించడాన్ని నిరాకరిస్తున్నారు. ఈ ప్రజలు వలె మూర్ఖుడిని కనుగొనడం చాలా కష్టం.
సహోదరి సహోదరులారా, ప్రపంచం వేగంగా మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది, మానవని యొక్క జన్యు విధానం దాదాపు సాంకేతికంగా సాధ్యమేనని చెప్పబడింది. నాస్తికత్వం కూడా విస్తృతంగా విస్తరించింది, అలాగే మతం యొక్క శకం ఇప్పుడు గడిచిపోతోంది. ఏదేమైనా, ఈ ప్రపంచం మరింత గందరగోళంగా మరియు కష్టతరరంగా మారినప్పటికీ, తిరిగి జన్మించిన మనం ఆయన రాజులైన యాజకులుగా దేవునికి నమ్మకంగా సేవ చేయకుండా ఉండలేము. ఇప్పుడు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త భక్తిహీనత యొక్క ప్రవాహ తాకిడితో సంబంధం లేకుండా. ప్రపంచవ్యాప్తంగా మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుత కాలానికి వ్యతిరేకంగా మాత్రమే మనం వెళ్ళగలం.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త, దేవుడు అనుగ్రహించిన బలి వ్యవస్థ ప్రకారం రక్షణ అనునది వికసిస్తుంది మరింతగా వికసిస్తుంది,సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందని నేను నమ్ముతున్నాను.ఈనాటి యాజకులమైన మనము మన కోసం మరియు ప్రపంచంలోని అందరి ఆత్మల కొరకు ప్రార్థిస్తాము అలాగే ఈ సువార్తను గూర్చి సాక్ష్యమిస్తూ మన జీవితాలను కొనసాగించగలము.మనం విశ్వాసంతో జీవించినప్పుడు, మనం దేవునితో నడుచువారము మరియు సువార్త వ్యాప్తికి సంబంధించిన గొప్ప పనులను సాదించగలిగిన వ్యక్తులము అవుదుమని నేను నమ్ముతున్నాను. ఈ అంత్యదినాలలో దేవుణ్ణి సంతోషపరచు నెరవేర్చబడిన కార్యాలు కోసం మనం వెతుకుతున్నప్పుడు, ఈ సువార్త యొక్క కార్యాలు ఈ ప్రపంచం యొక్క ప్రతి మూలలోకి మరింత పురోగమిస్తాయని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే పువ్వులలో ఉన్న ఆ మకరందమైన తియ్యనైన సువాసన సున్నితమైన గాలితో పాటు వ్యాపించును.
నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన మనల్ని మతాచార్యులుగా పరిశుద్ధపరచినందుకు మరియు ఆయన పరి చర్యలో మనల్ని లెక్కించినందుకు.