• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 11: ప్రత్యక్ష గుడారం

[11-34] ప్రధాన యాజకులు ప్రాయచిత్తపు రోజున బలి అర్పణను అర్పించువారు (లేవియా కాండము 16:1-34)

(లేవియా కాండము 16:1-34)
“అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను నేను కరుణాపీఠము మీద మేఘ ములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.అతడు ప్రతిష్ఠిత మైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్ర ములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమా జము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను. అహరోను తన కొరకుపాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయ శ్చి త్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టు టకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచ వలెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవ లెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను.
అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధబలియగు మేకను వధించి అడ్డ తెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్త ముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవు నప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులుఉంచి,ఇశ్రాయేలీయుల పాపములన్నియు,అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దాని మీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్ట వలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి,తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహనబలిని ప్రజల కొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెనుపాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. పరిశుద్ధస్థలములో ప్రాయ శ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను.వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయ వలెను.వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెము లోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను.ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆదినమున మిమ్ము పవిత్రపరచు నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభి షేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవ స్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపుగుడార మునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్త మును ప్రాయశ్చిత్తము చేయవలెను.సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.”


ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రాయశ్చిత్త బలి దినోత్సవాన్ని ప్రధాన యాజకుడు జరిగించియున్నాడు. ఈ బలి సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు క్యాలెండర్‌లోని ఏడవ నెల పదవ రోజున ఇవ్వబడుతుంది. ఈ రోజున, ప్రధాన యాజకుడు అహరోను వారి కొరకు ఇశ్రాయేలు ప్రజల తరఫున నైవేద్యం ఇచ్చినప్పుడు, వారి దోషాలన్నీ వాస్తవానికి ఈ బలి అర్పణ మీదకు పంపబడి శుద్ధి చేయబడును. ప్రాయశ్చిత్త దినం ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప పండుగగా మారింది.
ఇతర సమర్పణల మాదిరిగానే, ప్రాయశ్చిత్త దినం యొక్క బలి కూడా మూడు స్థిరమైన ప్రమాణాలను కలిగి ఉండాలి, అవి, మచ్చలేని బలి పశువులు,చేతులు వేయుట మరియు రక్తం చిందించుట.దేవుడు ఇలా ప్రత్యేక విధానములో ఇవ్వబడిన బలిని ఆనందంతో స్వీకరించును. ఈ బలి మరియు ఇతర బలుల మధ్య వ్యత్యాసం ఏమిటనగా, ప్రధాన యాజకుడు బలి అర్పణ రక్తమును అతిపరిశుద్ధస్థలములోనికి తీసుకొనిపోవలసి ఉంటుంది. పాపపరిహారార్థ బలిగా ఎద్దును మరియు తనకు మరియు తన ఇంటికి దహనబలిగా ఒక పొట్టేలును ఇచ్చిన తరువాత, ప్రధాన యాజకుడుఅహరోను ఇశ్రాయేలు ప్రజల కోసం దేవునికి రెండు మేకలను అర్పించాడు. అతను మొదట ఎద్దుతో అర్పించిన పాపపరిహారార్థ బలి ప్రకారం వాటిలో ఒకదాన్ని ప్రభువుకు అర్పించాడు. ఆపై అతను రెండవ మేకను బలిపశువుగా ఇచ్చాడు. అతను ఇశ్రాయేలు ప్రజల యెదుట దాని తలపై చేతులు వేసి, ఇశ్రాయేలు ప్రజల పాపాలను బలిపశువుపైకి పంపాడు, మరియు వారి పాపములను అంగీకరించిన ఈ మేకను తగిన వ్యక్తి ద్వారా అరణ్యంలోకి పంపించబడును.


ప్రాయచ్చితపు దినము రోజున ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములన్నియు శుద్దిచేయబడును

ప్రాయశ్చిత్తం రోజున, ఇశ్రాయేలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన యాజకుడు వారి వార్షిక పాపములను బలి చేయు బలిపశువు తలపై తన చేతులు వేయడం ద్వారా పంపించబడెను. అతను రెండు సజీవ మేకలను తీసుకొని, మొదటిది దేవునికి అర్పించబడుటకు మరొకటి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్నుకోటానికి వాటి కోసం చీట్లు వేసిరి.
ఇక్కడ తలపై “చేతులు వేయడం” అనగా సమస్త పాపములను బలి అర్పణ పైకి పంపబడెనని అర్ధం. ఈ చేతులు వేయడం అనేది పాపమును శుద్దిచేయటానికి దేవుడు నిర్దేశించి ఉపయోగించే పద్ధతి; అలాగే క్రొత్త నిబంధన కాలంలో, మానవజాతి పాపములన్నిటిని శుద్దిచేయటానికి యేసు పై చేతులు వేయు ఇదే పద్ధతిని సమానంగా వర్తింపజేయవలసి వచ్చెను. ఇశ్రాయేలు ప్రజల యొక్క సంవత్సరాది యోగ్య పాపములను పరిహరించడానికి, ప్రధాన యాజకుడు అహరోను తన చేతులను మేక తలపై వేయుటకు బలవంతం చేయబడ్డాడు మరియు తద్వారా వారి పాపములన్నిటిని దానిపైకి పంపించెను. ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజల పాపములను తలపై తన చేతులు వేయడం ద్వారా బలి అర్పించబడును, ఆ విధంగా ఇశ్రాయేలీయుల యోగ్య పాపముల ఏడాది పాటు పూర్తిగా తొలగించబడెను. ఇలా, ప్రాయశ్చిత్తపు దినము చేయుట ద్వారా, గత సంవత్సరంలో చేసిన ఇశ్రాయేలు ప్రజలు యొక్క సమస్త పాపముల నుండి వారిని రక్షించినందుకు వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు.
పాపం కలిగిఉన్న ప్రతి ఒక్కరూ తప్పక శిక్షించబడుదురు. ఇశ్రాయేలీయులందరి పాపముల కొరకై బలి అర్పణ పరోక్షంగా శిక్షించబడుటకు, అది మొదట వారి పాపములన్నిటిని అంగీకరించ వలసి ఉంటుంది . ప్రధాన యాజకుడు దాని తలపై చేతులు పెట్టకుండా ఒకవేళ దేవునికి నైవేద్యం ఇచ్చినట్లయితే, ఈ నైవేద్యం దేవునికి దేవా దూషణగా ఉండును,కావున అతను ఎన్నడు పాపము చేయని వ్యక్తిగా ఉండవలెను.
పాపులుగా మారిన మానవజాతి అంతటిని రక్షించడానికి, దేవుడు తన రక్షణ యొక్క ప్రణాళికను చేతులు వేయు ఈ పద్ధతి ద్వారా నెరవేర్చవలసి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల పాపములను తీసివేయడానికి,దేవుడు ఒక ప్రధాన యాజకుని వారి ప్రతినిధిగా లేవనెత్తాడు మరియు ఆ సంవత్సరానికి తన ప్రజలందరి పాపములను బలిపశువు తలపై చేయి వేయు విధంగా చేసియున్నాడు.అందుకే,ప్రత్యక్షపు గుడారంలో దేవునికి అర్పించబడిన బలి పశువులన్ని ఇశ్రాయేలీయుల పాపములను చేతులు వేయుట ద్వారా అంగీకరించి, వారి తరపున పాపముల కొరకై శిక్షించబడి, వాటి రక్తం చిందించి మరణించెను.
దేవుని యొక్క నీతిని మరియు ప్రేమను పూర్తిగా నెరవేర్చడానికి, ఇశ్రాయేలు ప్రజలు ప్రాయశ్చిత్త దినోత్సవం రోజున బలి పశువు తలపై ప్రధాన యాజకుడు చేతులు వేసి, దాని గొంతు కోసి దాని రక్తం సంవత్సరానికి ఒకసారి తీసుకొని ఈ బలిని అర్పించవలసి ఉంటుంది. ఈ నైవేద్యం ద్వారా, మరో మాటలో చెప్పాలంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పాపములన్నిటిని ఒకేసారి శుద్ధిచేయాలకున్నాడు.ఇది దేవుని యొక్క ప్రేమచట్టం, ఇది ఆయన కృపను మరియు ఆయన నీతిని సంతృప్తిపరుస్తుంది. దేవుడు న్యాయవంతుడు కావున, తన న్యాయమైన ధర్మశాస్త్రానికి అనుగుణంగా తన ప్రజల పాపములను ఒకేసారి తొలగించడానికి, దేవుడు యేసు క్రీస్తును బలి గొర్రెపిల్లను సిద్ధం చేసాడు, చేతులు వేయడం ద్వారా మన పాపములన్నిటీని ఆయనే భరించి సిలువపై పై రక్తం చిందించాడు.
యేసు తనను తాను శాశ్వత బలిగా అర్పించుకున్న వాడు, ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరి పాపములను ఒకసారి తనపై మోసుకొని, తన రక్తాన్ని ఒకే సారి చిందించి మనందరి కొరకు పాపం నుండి రక్షణను పూర్తి చేశాడు. అందువల్ల, నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో వ్యక్తమయ్యే రక్షణ సత్యాన్ని విశ్వసించే ఈ విశ్వాసంతో మనం కూడా దేవుని యెదుటకు రావాలి. ఈ విశ్వాసం ద్వారా మాత్రమే మన పాపములన్నిటిని ఒకసారి విడుదల పొందగలము. కాబట్టి, ఎవరైతే పాప క్షమాపణను ఒకేసారి స్వీకరించాలనుకుంటున్నారో, వారు నిజంగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే విశ్వాసంతో దేవుని వద్దకు రావాలి.


చేతులు వేయుట యొక్క అర్ధము 

చేతులు వేయడం యొక్క అర్ధం దాటించటం,బదిలీ చేయడం లేదా పాతిపెట్టడం (లేవియా 1: 3-4). ఇశ్రాయేలీయులలోని సాధారణ ప్రజలలో ఎవరైనా అనుకోకుండా పాపం చేసి, దాని గురించి తెలుసుకున్నప్పుడు, వారు దేవునికి దహనబలి ఇవ్వవలసి ఉంటుంది(లేవియా 4:27-29).వారు మొదట ఒక బలి పశువును మచ్చ లేకుండా తీసుకురావాలి, ఆపై వారి చేతులను దాని తలపై ఉంచడం ద్వారా వారి పాపములను దాటింప వలసి వచ్చింది. ఆపై వారు దాని గొంతు కోసి, దాని రక్తాన్ని తీసుకొని, ఈ రక్తాన్ని యాజకులకు ఇవ్వవలసి ఉండును(లేవియా4:27-28).అప్పుడు యాజకుడు ఈ రక్తంలో కొంత భాగాన్ని తీసుకొని తన వేలితో దహన బలిపీఠం కొమ్ముల మీద చల్లి , మిగిలిన రక్తాన్ని అంతటిని బలిపీఠం దిగువన పోయాలి. అంతేకాకుండా అతను దాని కొవ్వును బలిపీఠం మీద కాల్చవలసి ఉండును,అప్పుడే దేవుడు ఈ నైవేద్యంలో అర్పించబడిన కాల్చబడుచున్న కొవ్వు యొక్క సువాసనను ఆస్వాదించును.
ఇశ్రాయేలు ప్రజల పాపములను తీసివేయుటకు, దేవుడు ప్రాయశ్చిత్తపు దినోత్సవం యొక్క బలిని సిద్ధం చేసాడు, బలి పశువుపై ప్రధాన యాజకుడు చేతులు వేసి, దాని రక్తమును ఒలికించును. ఈ సందర్భంలో బలి అర్పణ మీద చేతులు వేయకుండా దేవుడు ఇశ్రాయేలీయుల పాపములను శుద్దిచేయలేడు. ఇలా, పాత నిబంధనలో ఆర్ఫపించవలసిన ప్రాయశ్చిత్తపు దినం యొక్క బలి కొత్త నిబంధనలోని బాప్తిస్మమునకు యేసు రక్తమునకు దగ్గర సంబంధం కలిగి ఉంది.
పాత నిబంధన బలి అర్పణ యొక్క మచ్చలేని పశువు వలె, క్రొత్త నిబంధన కాలంలో కూడా,యేసు దేవుడు మచ్చలేని గొర్రెపిల్లగా వచ్చి బాప్తీస్మం తీసుకొని పాపుల యొక్క దోషములనుశుద్ధిచేయుటకు సిలువపై తన రక్తాన్ని చిందించాడు.పాత నిబంధనలో బలిపశువు పై చేతులు వేయడంతో పాపుల అనీతిని అంగీకరించినట్లుగా, యొర్దాను నదిలో లో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకోవటం అనగా యేసు తలపై చేతులు వేసినప్పుడు లోకములోని సమస్త పాపములు యేసుపై మోపబడెను(మత్తయి 3:15). పాత నిబంధన యొక్క మచ్చలేని బలి మరియు క్రొత్త నిబంధనలోనిందారహితుడైన యేసు దేవుని యొక్క గొర్రె పిల్లగా అదే మాదిరిగా చేతులు వేయుపద్దతిలో రక్తం చిందించి మరణించ వలసి వచ్చింది. అందువల్ల చేతులు వేయడం మరియు రక్తం చిందించటం అనునది పాత మరియు కొత్త నిబంధనల రెండింటిలోనూ పాపుల కోసం సిద్ధం చేయబడిన ఒకే విధమైన బలి విధానo.


మానవుని యొక్క పాపములు తప్పించుకోలేని దేవుని యొక్క ఉగ్రతను అనుసరించును

దేవుని యెదుట, మనము పాపులం, కానీ మన పాపముల కోసం మనం చనిపోలేము; పాపపు నైవేద్యం తీసుకున్న పాపముల కారణంగా అది చంపబడాలి. దహన బలిపీఠం మీద ఈ బలి పశువును ముక్కలుగా నరికి నిప్పుతో కాల్చినట్లు మనం చిత్రీకరించినప్పుడు, మనం దేవుని కరుణ గల రక్షణను మనం గ్రహించగలము అది మనం దేవుని యెదుట నాశనం చేయబడకుండా నిమిత్తము, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత ప్రభువు బాప్తీస్మం తీసుకొని ఆయన రక్తం చిందించటం ద్వారా ఆయన మనలను రక్షించాడు.అందువల్ల, నిజంగా తిరిగి జన్మించని వారు దేవుని యెదుట తమ పాపములకు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటున్న పాపులుగా తమను తాము అంగీకరించాలి అలాగే వారి రక్షణ కొరకై దేవుని యొక్క బాప్తిస్మమును మరియు రక్తాన్ని వేగంగా విశ్వసిస్తారు. మన పాపములన్నిటిని బట్టి మనలను శిక్షించుటకు బదులుగా మనలను రక్షించుటకు, దేవుడు సమస్త పాపముల నుండి రక్షించడానికి నిర్దోషమైన రక్షణ అర్పణను సిద్ధం చేసాడు,ఈనిత్య బలి ద్వారా మన పాపములన్నియు దాటించబడ్డాయి, ఆయన రక్తసిక్తుడుగా చేయబడ్డాడు, తద్వారా మన పాపములన్నియు ఒకసారి విడుదల చేయబడ్డాయి (లేవీయ 16: 1-34, రోమా 8: 3-4, హెబ్రీ 10: 10-12). మీ హృదయంలో ఇంకా పాపములు ఉన్నాయా? అలా అయితే, మీరు మొదట దేవుని యెదుట ఒప్పుకోవాలి, మీరు పాపం కోసంఆయన శిక్షను ఎదుర్కొంటున్న పాపి అని, యేసు క్రీస్తు ద్వారా,దేవుడు ప్రపంచ స్థాపనకు ముందే తాను రూపొందించిన రక్షణ ప్రణాళికను నెరవేర్చాడని మీరు నమ్మాలి.
పాపములకు తగిన విమోచన క్రయధనం చెల్లించకుండా ప్రాయశ్చిత్తం చేయలేము. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బలి వ్యవస్థను ఇచ్చాడు. ఈ బలి వ్యవస్థలో, చేతులు వేయడం మరియు దాని రక్తం చిందించటంతో కూడిన సమర్పణ మాత్రమే ఇశ్రాయేలీయుల పాపములను కడిగివేయగల నిజమైన విశ్వాస సమర్పణగా పరిగణించబడుతుంది.
లేఖనాలలో వ్రాయబడినట్లుగా బలి వ్యవస్థకు అనుగుణంగా, చేతులు వేసి రక్తం చిందించు ఈ బలిని విశ్వాసం ద్వారా, మనం దేవునికి అర్పించాలి. ప్రభువు తన రక్తాన్ని చిందించి,ఆయన బాప్తీస్మం ద్వారా మన పాపములన్నిటిని తనపైకి తీసుకొనెను,మన స్థానంలో పాపమునకై శిక్షించబడెను తద్వారా ఆయన మన పాపములన్నిటిని తొలగించాడు (మత్తయి 3:15; యోహాను 1:29; యెషయా 53: 1-7).మనం నీరు మరియు ఆత్మ యొక్క వాక్యాన్ని విశ్వసించినప్పుడు, మనకు బలి నైవేద్యమైన దేవుని పై మన చేతులు ఉంచటం ద్వారా మన పాపములన్ని ఆయన పైకి పంపి, దేవుని విశ్వసించడం ద్వారా మనం పాపం నుండి విడుదల పొందవచ్చు. మన పాపములన్నిటిని ఆయన తీసుకొని మన స్థానంలో పాపము కొరకై శిక్షించబడెను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా, మన బలి అర్పణగా మారిన ప్రభువుపై మన పాపములన్నిటిని ప్రభువుపై దాట వేయవచ్చును, ఆసత్యములో మనం ఆయనతో చనిపోయి ఆయనతో జీవించవచ్చును (రోమా 6: 1-11, గలతీ 3:27).
ప్రాయశ్చిత్త దినం యొక్క బలి నుండి మనం పూర్తిగా గుర్తించవలసిన ఆధ్యాత్మిక పాఠాలు క్రింది విధంగా ఉన్నాయి: ముందుగా, మన పాపములను మరియు మనం శిక్షించబడు మన పాపములను మనం తప్పకుండా గుర్తించాలి, ఆపై మన నుండి దేవుడు కోరుకునే విశ్వాసపు త్యాగమును చేయవలసి ఉంటుంది, అనగా, యేసుక్రీస్తుపై మనకు విశ్వాసం ఉండాలి, ఆయన బాప్తీస్మం మరియు సిలువపై రక్తం కార్చు ఈ రెండింటి ద్వారా మన రక్షణను నెరవేర్చాడు. యేసు బాప్తీస్మం మీద మనం నమ్మకం ఉంచడం ద్వారా మనం ఆయన తల మీద చేతులు వేయాలి. ఎందుకని ? ఎందుకంటే మనం విశ్వాసం ద్వారా మచ్చలేని బలిపశువుపై చేతులు వేసి దాని రక్తాన్ని ఒలికించినప్పుడు మాత్రమే మనం మన పాపములన్నిటి నుండి రక్షించబడతాము.
ఈ విదంగా, దేవుని యెదుట తమ పాపముల నుండి విమోచన పొందాలనుకునే వారు ఎవరైనా తమ జీవిత విమోచన క్రయధనాన్ని చెల్లించాలి, ఎందుకంటే పాపం యొక్క జీతం మరణం. ధనవంతుడు లేదా పేదవాడు అనే తేడా లేకుండా, ఆ వ్యక్తి యొక్క పాపాలను మరియు జీవిత ప్రాయశ్చిత్తం యొక్క ధరను చెల్లించే ఈ త్యాగంలో సమర్పణ ఉండాలి. మీరు దేవుని ఆజ్ఞలను ఇలా పాటించకపోతే, ఎవరూ కూడా విశ్వాసం ద్వారా పాపములను విమోచించలేరు.
ప్రాయచిత్తపు బలి అర్పణ దినము 
లేవీయ 16: 6-10 వైపు చూద్దాం: అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను. ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టు టకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచ వలెను. 
ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం ద్వారా తమ పాప విమోచనను పొందుటకు, ప్రధాన యాజకుడు, వారి తరపున, బలి అర్పించడంతో పాటు చేతులు వేయడం మరియు రక్తం చిందించడం వంటివి చేయును.నేటి క్రైస్తవుల విశ్వాసాన్ని మనం ఎలా వర్ణించాలి? ఇది వారి విశ్వాసం కాదు, వారి పాపములన్నిటిని ఎవరో బలి అర్పణగా మారిన దాని పై పంపడం ద్వారా వారు పాప విమోచన పొందాలని కోరుకోవటం కాదు.మీ విశ్వాసం మీ పాపములన్నిటిని యేసుక్రీస్తుపై చేతులు వేయడం ద్వారా దాటిపోయిన విశ్వాసం కాకపోతే, మీ వద్ద సమస్యఉన్నట్లే మీ విశ్వాసం అనునది యేసు బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తం అనే ఈ రెండింటినీ విశ్వసించే విశ్వాసం కాకపోతే, అది దేవుడి ఆమోదించే నిజమైన విశ్వాసం కాదు.
మనము దేవుని యెదుట ధర్మశాస్త్రాన్ని ఉంచడంలో ఘోరంగా విఫలమయ్యాము మరియు గత ఏడాది పొడవునా అన్ని రకాల పాపములు చేశాము. కనుక మనం పాత నిబంధన కాలంలో జీవించి ఉంటే, మన తరపున ప్రధాన యాజకుడు ఇచ్చే ఈ పాప నైవేద్యమును విశ్వసించడం ద్వారా మనము పాప విమోచన పొందవలసి ఉంటుంది. దేవునికి విశ్వాస అర్పణ చేయుటకు, మన పాపముల నిమిత్తమై మనం తప్పకుండా నాశనం చేయబడతామని మనం ముందుగా అంగీకరించాలి మరియు దేవుడు సిద్ధపరచిన బలికోసం మన పాపములన్నిటిని చేతులు వేయుట ద్వారా దాటించడాన్ని మరియు రక్తం చిందించు నైవేద్యమును మనం విశ్వసించాలి.
బలి పశువుపై చేతులు వేయడం మరియు దాని రక్తం రక్షణ యొక్క శక్తిని కలిగి ఉన్నందున, పాత నిబంధనలోని ప్రజలు దేవుడు నిర్దేశించిన బలి వ్యవస్థ ప్రకారం ప్రధాన యాజకుడు అర్పించిన ఈ బలి ద్వారా వారి పాప విమోచన పొందవచ్చు. బలి యొక్క నైవేద్యం మీద చేతులు పెట్టడం ద్వారా, ప్రధానయాజకుడు తన ప్రజల పాపములను సంవత్సరానికి పైగా దాటింపజేసి, దాని రక్తాన్ని ఒలికించి గొంతు కోసి, కరుణ పీఠము ముందు దాని తూర్పు వైపు ఏడుసార్లు ఈ రక్తాన్ని చిలకరించును. అలా చేయడం ద్వారా, అతను ప్రతి సంవత్సరం దేవునికి సరైన నైవేద్యం ఇవ్వడం మానేయలేదు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు తమ పాప పరిహారాన్ని ఎలా పొందగలరు.
ఈ విధముగా, ప్రధాన యాజకుడు అర్పించిన పాప పరిహారం ద్వారా, ఇశ్రాయేలు ప్రజలు యొక్క తమ పాపములన్నియు క్షమించబడ్డాయని వారి హృదయాలలో విశ్వసించారు మరియు ధృవీకరించారు. ప్రాయశ్చిత్త దినం యొక్క పాత నిబంధన బలి మనకు ఏమి చూపిస్తుందంటే, క్రొత్త నిబంధనలో, యేసు క్రీస్తు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకొని లోకములోని పాపములను స్వీకరించి సిలువపై తన రక్తాన్ని చిందించాడు మరియు మనం నమ్మాలి ఈ యేసుక్రీస్తు మన రక్షకునిగా మరియు విశ్వాసం ద్వారా మన పాపముల నుండి శాశ్వతమైన విడుదల పొందుదుమని మనం నమ్మవలెను. ఈ లోకములో ఆత్మలన్నీ తమ పాపములను బట్టి బాధపడుచున్నవారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా వారు శాశ్వతమైన పాప విమోచన పొందగలరని గ్రహించాలి అలాగే వారు ఈ సువార్తను తమ హృదయాలలో చెక్కబడాలి. ఈ విధంగా, సమస్త పాపముల యొక్క ప్రాయచిత్తపు బలి దేవుడిచే ముందుగానే నిర్ణయించబడింది మరియు ఆయన ద్వారా నెరవేరుతుందని వాగ్దానం చేయబడింది, రక్షణకు సంబంధించిన ఈ వాగ్దానం నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారలో చూపించబడెను,అలాగే ఇవన్నియు ప్రత్యక్షపు గుడారానికి వస్తువులుగా ఉపయోగించిరి.


ప్రాయచిత్తపు బలి దినోత్సవము ప్రత్యక్షపు గుడారములో జరుగును 

ప్రాయశ్చిత్తం దినమున ఇశ్రాయేలు ప్రజల పాపములన్నిటిని జాగ్రత్తగా చూసుకోవడానికి, ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు అందరి సమక్షంలో బలి పశువు తలపై చేతులు వేయును (లేవీయ 16: 20-23). అతను వారి వార్షిక పాపములను వారి తరఫున బలి పశువు తలపై చేతులు ఉంచి బలి అర్పణ మీదకు పంపడం చాలా అవసరం. ప్రధాన యాజకుడు అహరోను ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రత్యక్షపు గుడారం లోపల ప్రాయశ్చిత్త బలిదినోత్సవాన్ని జరించినప్పుడు, ఇంకెవరూ గుడారంలోకి ప్రవేశించకూడదు.ఇది ఒక అసాధారణ సంఘటన,ఎందుకంటే చాలా మంది యాజకులు తమ విధులను నిర్వర్తిస్తూ గుడారం ఆవరణములో ఉండేవారు, కానీ ఈ ప్రాయశ్చిత్త దినోత్సవం రోజున వారు దానిని విడిచిపెట్టవలసి వచ్చింది. 
ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజల పాపములను బలిపశువు తలపై తన చేతులు ఉంచడం ద్వారా దాటించబడెను, ఈ బలి యొక్క రక్తాన్ని అతి పరిశుద్ధస్థలములోనికి తీసుకొని, తన వ్రేలుతో తూర్పు వైపున ఉన్న కరుణాపీఠముపై చిలకరించును; కరుణపీఠము యెదుట అతను ఏడుసార్లు రక్తమును చిలకరించవలెను (లేవీయ 16:14). ఆ సమయంలో, ప్రధాన యాజకుని యొక్క అంగీ అంచుకు జతచేయబడిన బంగారు గంటలు మోగుతాయి, మరియు ప్రతిసారీ అతను రక్తం చిందించే ముందు కరుణాపీఠము మరియు దాని తూర్పు వైపున, ఈ గంటలు మోగుతాయి మరియు ప్రత్యక్షపు గుడారం వెలుపల నిలబడి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఈ గంట శబ్దాన్ని విందురు. ఇశ్రాయేలు ప్రజలకు బంగారు గంటలు వినిపించినప్పుడు, ప్రధాన యాజకుడు వారి తమ తరపున ఇప్పుడు దేవునికి బలి ఇస్తున్నాడని వారు గ్రహించుదురు. మరియు ఏడు సార్లు ఘంటల శబ్దం విన్న తరువాత, వారు విడుదల పొందిన వారిగా గ్రహించి శ్వాస తీసుకొందురు , ఎందుకంటే ప్రత్యక్షపు గుడారం లోపల ప్రాయశ్చిత్త దినం యొక్క బలి ఇప్పుడు దాదాపుగా పూర్తయిందని వారికి తెలుసు, వారి యొక్క ఒక సంవత్సరం యోగ్య పాపములు మన్నించే నైవేద్యం పూర్తయినట్లు నిర్దారించబడింది.
దీని తరువాత, ప్రధాన యాజకుడు అహరోను ప్రత్యక్షపుగుడారం నుండి బయటకు వచ్చి,మిగిలియున్న మేకను మరొక నైవేద్యంగా తీసుకొని, ప్రాయశ్చిత్త రోజున ఈ పశువును ఇశ్రాయేలు ప్రజల సమక్షంలో యిచ్చియున్నాడు. ప్రాయశ్చిత్తం రోజున ఏమీ చేయవద్దని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు (లేవీయా 16: 20-21, 29). ప్రత్యక్షపుగుడారం వెలుపల ఈ బలి ఇవ్వడాన్ని చూడటానికి ఇశ్రాయేలీయుల భారీ గుంపుగా చుట్టూ చేరడంతో, ప్రధానయాజకుడు తన విధులను నెరవేర్చడానికి బలి మేక తలపై చేతులు వేసి, తగిన వ్యక్తి ద్వారా అరణ్యంలోకి పంపించబడెను.
ప్రాయశ్చిత్తం రోజున, ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజల ముందు బలిపశువును తీసుకువచ్చి, దాని తలపై చేతులు వేసి, ఇశ్రాయేలు పిల్లల సమస్త దోషములను మరియు అతిక్రమణలను ఒప్పుకొని, వాటిని మేకపైకి పంపించెను. అతను ఇలా చెప్పి ఉండవచ్చు, “ప్రభూ, ఈ ఇశ్రాయేలు ప్రజలు గడచిన సంవత్సరంలో చేసిన సమస్త పాపములను నేను ఒప్పుకుంటున్నాను. మేము సమస్త ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించడంలో విఫలమయ్యాము, మేము ఒకరికొకరు వ్యతిరేకంగా అనేకమైన పాపములు మీకు విరోధంగా చేసాము, మీరు ఏవిధంగా జీవించాలని ఆదేశించేరో ఆ జీవితాన్ని గడపడంలో మేము విఫలమయ్యాము, మీరు చేయవద్దన్న ఆదేశించిన పనులు మేము చేసాము. గడిచిన సంవత్సరంలో మేము మీరు ఆజ్ఞాపించిన అనేక ఆజ్ఞలను తృణీకరించాము. మేము అబద్ధికులము. మేము హంతకులము. మేము వ్యభిచారానికి లోనైనవారము. మేము దొంగలించితిమి." ఈ విధంగా, ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజల పాపములన్నిటిని వారి యెదుట బలి పశువు తలపై చేతులు వేసి వారి పాపములను దాటింపచేసి, దానిని తగిన వ్యక్తి చేతితో అరణ్యంలోకి పంపబడును.
పాపం యొక్క జీతం మరణం కాబట్టి, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములను అంగీకరించిన తర్వాత దేవుడు బలి పశువును సజీవంగా పంపించలేదు. అరణ్యంలో విడిచిపెట్టబడిన బలిపశువు అరణ్యంలో బాధపడుతూ చనిపోవలసి వచ్చింది, ఎందుకంటే అది ఇశ్రాయేలు ప్రజల యొక్క సమస్త దుష్టత్వమును, పాపమును మరియు అతిక్రమణలను భరించెను. ఇప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రత్యక్షపు గుడారాల పండుగను ఆస్వాదించడం ప్రారంభించారు (లేవీయా 23:34) ఎందుకంటే ప్రాయశ్చిత్త దినోత్సవం యొక్క బలి ద్వారా, గడిచిన సంవత్సర కాలంగా వారు బందీలుగా ఉన్న పాపమును వారు విసర్జించారు.
చేతులు వేయడం అనేది ప్రజలందరి పాపములను బలి అర్పణపైకి పంపించు విధానం.ప్రధాన యాజకుడు బలి జంతువుపై చేతులు ఉంచినప్పుడు,ఇశ్రాయేలు ప్రజల పాపములు ఒక సంవత్సరం కాలం పాటు కూడబెట్టినవన్ని ఒక్కసారి దాని మీదకు పంపబడును.ప్రతి ఇశ్రాయేలీయుల యొక్క ప్రతి ఒక్కరి పాపం ఒకేసారి ప్రధాన యాజకుడు చేతులు వేయడం ద్వారా బలి అర్పణపైకి పంపబడింది.
పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క అతిక్రమణలు ప్రధాన యాజకుడు బలిపశువు తలపై చేతులు వేయబడినట్లుగా, నేటి ప్రజల పాపములన్ని కూడా చేతులు వేయు పద్ధతి ద్వారా బలి అర్పణపైకి వెళ్లగలవా? ఇది సాధ్యం కాకపోతే, నేటి ప్రజలు వారిపాప విమోచన పొందుటకు మార్గం ఎక్కడ ఉంది? తమ పాపములను ఎవరు పంపుదురు, ఎలా,ఎవరి మీదకు పంపుదురు ? పాత నిబంధన కాలములో దేవుడు స్థాపించినబలి వ్యవస్థకు అనుగుణంగా, యేసు క్రీస్తు క్రొత్త నిబంధన కాలంలో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా లోకములోని పాపములన్నిటిని స్వీకరించాడు. ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రధాన యాజకుడు అందించిన ప్రాయశ్చిత్త దినోత్సవం యొక్క బలి ద్వారా ఒక సంవత్సరం పాటు వారి యోగ్య పాపములు బలి మేకపై ఒకసారి దాటినట్లే, అలాగే మన యొక్క పాపములు కూడా బాప్తీస్మం మిచ్చు యోహాను చేత పొందిన బాప్తీస్మం ద్వారా యేసుక్రీస్తుపైకి వచ్చాయి. బాప్తీస్మం మిచ్చు యోహాను, చివరి ప్రధాన యాజకుడు. అయితే, నేటి ప్రజల యొక్క పాపములన్నియు ఎక్కడ ఉన్నాయి? అవన్నియు ఇప్పుడు యేసు క్రీస్తు తలపై ఉన్నవి.
ప్రధాన యాజకుడు ద్వారా ఇశ్రాయేలు ప్రజల పాపములన్నిటిని బలిపశువుపై తన చేతుల వేయుట ద్వారా అంగీకరించినట్లే, ఇప్పుడు ఈ కాలములో జీవిస్తున్న మనందరికీ యేసు నిరంతరం పాప విమోచన యొక్క నిష్కళంకమైన బలి అర్పణగా అర్పించబడ్డాడు. మన కొరకు స్వంత బలిపశువుగా మారిన యేసు మన పాపములకు బలి గొర్రెపిల్లగా దేవునికి తనను తాను బలి అర్పణ పశువుగా అర్పించుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు మరియు సిలువ వేయబడుటకు తనను తాను అప్పగించుకున్నాడు, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం బలి అర్పణను ఏర్పాటు చేసాడు వారి పాపములను ఈ బలి పశువపైకి పంపి వారికి బదులుగా దానిని శిక్షించెను.
అరణ్యంలోకి పంపబడిన బలిపశువు మనుగడ సాగించలేదు, ఎందుకంటే నీరులేని ప్రదేశం కానీ నిర్జనమైన ఎడారిలో ఎడతెగని ఎండ మాత్రమే ఉండును. అదేవిధంగా, యేసు కూడా తన బాప్తీస్మం ద్వారా లోకములోని పాపములను అప్పటికే తన పైకి తీసుకున్నందున, సిలువ వేయబడకుండా ఉండలేకపోయాడు. నిర్జీవమైన అరణ్యంలో బలిపశువును విడిచిపెట్టినందున, లోకములోని పాపములను స్వీకరించిన యేసును కూడా అనేకమంది ద్వేషించి తృణీకరించారు. బలి పశువును ఎడారిలోకి తీసుకెళ్లి, నిర్జీవమైన భూమిలో వదిలేసినప్పుడు, అది దాహంతో చివరికి చనిపోవడానికి మాత్రమే తిరుగునా ? అదే విధంగా, మన పాపములను అంగీకరించిన యేసు చాలా మంది చేత తిరస్కారము నొంది, మన పాపములన్నిటి కొరకై శిక్షించబడి సిలువ వేయబడి, ఆయన రక్తం చిందించి మరణించాడు. ఇది యేసు క్రీస్తు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మన కొరకు నెరవేర్చిన రక్షణ.
ఇశ్రాయేలు ప్రజలు తమ పాపము యొక్క ప్రాయశ్చిత్త ప్రక్రియను తమ కళ్లతో చూశారు మరియు దానిని తమ హృదయాలతో విశ్వసించారు. వారిలాగే, మనము కూడా యేసుక్రీస్తు యొక్కనీతి కార్యములను మన హృదయాలతో చూడడం, వినడం మరియు విశ్వసించడం ద్వారా మనం పాప విమోచన పొందవచ్చు. ఇది యేసుక్రీస్తు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొంది, లోకములోని సమస్త పాపములను మోసుకొని, సిలువ వేయబడి, ఆయన రక్తం చిందించి, చనిపోయి, తిరిగి మృతులలోనుండి లేవడం అనే ఈ విషయాలన్నింటినీ మనము ఆధ్యాత్మిక కళ్ళుతో చూడడం మరియు మన హృదయాలలో వాటిని నమ్మడం ద్వారా మనం రక్షించబడతామని ఇది చెబుతుంది. 
ప్రాయశ్చిత్త దినం యొక్క ఈ బలి ఇశ్రాయేలీయులు ఉనికిలో ఉన్నంత వరకు కొనసాగుతుంది. వారు ఇప్పటికీ వారి క్యాలెండర్‌లోని ఏడవ నెల పదవ తేదీన ప్రాయశ్చిత్త దినోత్సవాన్ని బలిని జరిగించెదరు,ఎందుకంటే అది దేవుడు వారికి ఆజ్ఞాపించాడు కావున, “సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.”(లేవియా 16:34). ఇశ్రాయేలు ప్రజలు ప్రాయశ్చిత్త దినాన్ని ఈ విధంగా చేయటం ద్వారా, దేవుడు వారికి దేవుని కృపను అనుగ్రహించును, తద్వారా వారి పాపములన్ని శుద్దిచేయబడి వారు ఈ పాప శిక్ష నుండి విమోచన పొందుదురు.
ఈ విధంగా, నేటి ప్రజలకు కూడా, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా యేసు తన శరీరంపై లోకములోని సమస్త పాపములను భరించి, సిలువ వేయబడెను తద్వారా శాశ్వతంగా పాపమును శుద్ధి చేయు పక్రియను దేవుడు పూర్తి చేసాడు. యేసుక్రీస్తు తన బాప్తీస్మం ద్వారా మానవాళి యొక్క సమస్త పాపములను భుజాన వేసుకొని పరలోకానికి శాశ్వతమైన ప్రధాన యాజకుడుగా ఉండెను. కావున, ఇప్పుడు మన స్వంతరక్షణ కోసం మనంచేయవలసింది ఏమీ లేదు కానీ ఈ సత్యాన్ని విశ్వసించడం మాత్రమే.


తండ్రియైన దేవునికి మెస్సయ్య తన సొంత శరీరమును గొప్ప ప్రాయచిత్తపు బలిగా అప్పగించుకొనెను

ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్తపుదినమును సమర్పించమని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు?తండ్రియైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు తన బాప్తీస్మం మరియు రక్తం చిందించుట వలన మానవులందరి పాపముల కొరకై గొప్ప ప్రాయశ్చిత్తాన్ని అందించే రోజు కోసం వారి విశ్వాసంతో ఎదురుచూసేలా ఆయన దీనిని చేశాడు. అందుకే దేవుని యొక్క ఏకైక కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు సమస్త మానవాళి కొరకు ఈ భూమ్మీదకు వచ్చి అందరి పాపములను తీసివేసాడు, దేవుని ప్రేమతో ప్రతిదీ నెరవేర్చి మానవజాతికి దేవుని యొక్క రక్షణను వెల్లడించాడు.బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకొని మానవజాతిగా మన పాపములన్నిటిని స్వీకరించి సిలువపై తన రక్తాన్ని చిందించడం ద్వారా, యేసు లోకములోని సమస్త పాపములను మరియు అసమానతలను తుడిచివేసి, వారి కోసం శిక్షించబడ్డాడు తద్వారా మనకు నిజమైన రక్షకునిగా మారాడు.
దేవుడు మోషేను పిలిచి అతనికి మొదట ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆపై ఆయన నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార వంటి వస్తువులతో గుడారాన్ని నిర్మించాలని ఆదేశించి అతనికి బలి వ్యవస్థను అనుగ్రహించాడు. ఈ విధంగా చేయడం ద్వారా, ఇశ్రాయేలు ప్రజలు బలిపశువు పై చేతులు వేయడం మరియు రక్తం చిందించుట యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి దేవుడు అనుమతించాడు. మరియు తిరిగి , ప్రత్యక్షపు గుడారంలో ప్రవచించబడిన రక్షణ యొక్క ద్వారం అయిన యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తిస్మం తీసుకొని, సిలువ వేయబడి ఆయన రక్తం చిందించడం ద్వారా లోకములోని పాపములను స్వీకరిస్తాడని అతను వారికి చూపించాడు. దేవుడు మనకు ఇచ్చిన పాపమును శుద్దిచేయ రక్షణ అనునది ప్రత్యక్షపు గుడారం ద్వారం కోసం ఉపయోగించిన పదార్థాలలో స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రత్యక్షపు గుడారం ద్వారం కోసం ఉపయోగించే పదార్థాలలో, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం పొందడం ద్వారా ఒకసారి యేసు లోకములోని సమస్త పాపములను తీసుకున్నట్లు నీలిరంగు దారం సూచిస్తుంది; యేసు రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభువు అని ఊదా దారం చూపిస్తుంది, ఎందుకంటే ఆయన విశ్వమును సృష్టించిన నిజమైన దేవుడు; రక్తవర్ణముగలదారం యేసు పొందిన బాప్తీస్మం, సిలువపై తన రక్తాన్ని చిందించడం ద్వారా పాపులందరి పాపముల కొరకై శిక్షించబడెను;నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారములో కనిపించే ఈ మూడు పరిచర్య సేవ గురించి పరిశుద్ధగ్రంధము విస్తృతంగా వివరిస్తుంది అలాగే దేవుడు తన వాక్యాన్ని నిజంగా విశ్వసించే వారికి పాప విమోచన అనుగ్రహించియున్నాడని సన్నని పేనిన నార మనకు చెప్పుచున్నది. 
ఇప్పుడు, విశ్వాసులందరూ తమను తాము మరోసారి గుర్తు చేసుకోవాలి మరియు ఈ సత్యాన్ని,అనగా యేసుక్రీస్తు వారి రక్షకుడని బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొంది ఆయన రక్తాన్ని సిలువపై చిందించడం ద్వారా ఆయన వారి పాపములన్నిటిని శుద్దిచేసాడు. నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారను ప్రత్యక్షపుగుడారము యొక్క పదార్థాలుగా ఉపయోగించిరి, తద్వారా వారు తమ పాపముల నుండి పాప విమోచన పొందాలి. మోసే ద్వారా, దేవుడు మానవాళి కొరకురక్షణ యొక్క నియమాన్ని, పాపములను క్షమించే చట్టాన్ని స్థాపించాడు,సమయం వచ్చినప్పుడు, ఆయన యేసు క్రీస్తును ఈ భూమ్మీదకు పంపి బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకొని సిలువపై ఆయన రక్తాన్ని చిందించెను, కాబట్టి లోకములోని పాపములను శుద్ధిచేయు బలి అర్పణగా యేసు మారెను. మరియు ఈ విధంగా చేయడం ద్వారా, దేవుడు వారి విశ్వాసం ద్వారా వారి పాపములన్నిటి నుండి శుద్దిచేయబడతారని నిజంగా విశ్వసించే వారందరికి సామర్ధ్యమును కలుగజేసెను. కాబట్టి, యేసుక్రీస్తును మన రక్షకునిగా విశ్వసిస్తున్నామని ప్రకటించినప్పుడు, యేసు అందుకున్న బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తం చిందించటం తెలుసుకోవడం ద్వారా మనం విశ్వసించాలి. పాత నిబంధన యొక్క బలిఅర్పణ పాపుల దోషాలను చేతులు వేయు పద్దతిలో అంగీకరించింది మరియు వారి స్థానంలో దాని రక్తం చిందించడం ద్వారా తీవ్రంగా శిక్షించబడినట్లుగా, యేసుక్రీస్తు ఈ భూమ్మీద నివసించే ప్రతి ఒక్కరికీ పాప పరిహారంగా వచ్చి, బాప్తీస్మం పొందడం ద్వారా లోక పాపములను స్వీకరించి, సిలువ వేయబడి ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు, కావున ఈ సత్యాన్ని విశ్వసించే వారి పాపములు ఒకేసారి తుడిచివేయబడెను.
వ్రాయబడిన వాక్య సత్యాన్ని మనం ఖచ్చితంగా విశ్వసించాలి. పరిశుద్ధగ్రంధము యొక్క సత్యం ఏమిటనగా, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు తన ప్రజల కోసం అర్పించిన బలి ప్రాయశ్చిత్త దినము వలె, యేసు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం పొంది సిలువ వేయబడ్డాడు మరియు మనందరినీ అనగా లోకములో ఉన్న పాపులను ఒకేసారి రక్షించడానికి ఆయన రక్తం చిందించాడు. కాబట్టి పరిశుద్ధగ్రంథములో వ్రాయబడినట్లుగా మనం దానిని విశ్వసించాలి.కానీ మన పాపముల నుండి మనం ఎన్నటికీ శిక్షను తప్పించుకోలేము, కానీ యేసు క్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చి ఆయన బాప్తీస్మం మరియు రక్తం అను ఈ రెండింటి ద్వారా మన పాపములన్నిటి నుండి మనల్ని రక్షించాడు.
దీన్ని నమ్మకపోవడం, దేవుడు మన పాపములన్నిటిని ఈ విధంగా క్షమించినప్పటికీ, దేవుడు ఎన్నటికీ క్షమించలేని పాపం ఒకటున్నది. ఆయన లోకములోని సమస్త పాపములను తుడిచివేశాడు ఒకే ఒక్క పాపం తప్ప, అనగా "పరిశుద్ధాత్మను దూషించిన పాపం" (మార్కు 3: 28-29). కాబట్టి, నిజంగా పాపముల నుండి విడుదల పొందాలనుకునే వారు యేసుక్రీస్తు బాప్తీస్మం పొంది, ఆయన రక్తం చిందించి , తిరిగి మృతులలోనుండి లేచాడు తద్వారా లోకములోని సమస్త పాపముల నుండి మనల్ని విడిపించిన సత్యాన్నిమనం విశ్వసించాలి. అలాంటి విశ్వాసం కాకుండా, మన యొక్క పాప విమోచన కోసం ఏ మంచి పనులు అవసరం? నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం ఏమిటో తెలుసుకోవడానికి మరియు ఈ సత్యాన్ని విశ్వసించే సమయం వచ్చింది . 
నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో ప్రత్యక్షపు గుడారం ద్వారంలో వ్యక్తమయ్యే సత్యం నిజమైన రక్షణ యొక్క సువార్త అనియు రాబోవు యేసు క్రీస్తు యొక్క నీడ అనియు మన అందరము గ్రహించాలి మరియు నమ్మాలి. యేసుక్రీస్తును విశ్వసించినంత వరకు, ఆయన పొందిన బాప్తీస్మం మరియు సిలువపై ఆయన చిందించిన రక్తం మన రక్షణకు అవసరం, అందుచేత మనం వాటిని విశ్వసించాలి. తిరస్కరించలేని నిజం ఏమిటనగా,యేసు తన బాప్తీస్మం,సిలువపై రక్తం చిందించటం మరణం నుండి ఆయన పునరుత్థానంలో విశ్వాసులకు రక్షణను అనుగ్రహించాడు మరియు లోకములోని పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఇవన్నీ పూర్తి చేయబడ్డాయి. 


కుమారుని యొక్క త్యాగమును ఆయన కోరియున్నాడు

మనం హెబ్రీయులు 10: 5-9 వైపుకు తిరుగుదాం: ‘’కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు. అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు.ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.’’
దేవుడు బలులు మరియు నైవేద్యములను కోరుకోలేదని లేదా వాటిలో ఆనందం పొందలేదని ఈ లేఖనాల యొక్క అర్థం ఏమిటి? ఈ భాగం కీర్తన 40: 6-7 నుండి తీసుకోబడింది. పాత నిబంధన యొక్క రోజువారీ నైవేద్యములతో లోకములోని సమస్త పాపములు పూర్తిగా తొలగించబడలేవని శాశ్వతమైన పాప పరిహారమును ఇవ్వడానికి, యేసు క్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తిస్మం తీసుకొని, ఆయన రక్తం చిందించి, మరణించి తిరిగి లేచాడు, తద్వారా మనందరికీ రక్షకునిగా మారారు. కీర్తన 40: 7 యొక్క అర్థం, ఇలా చెప్పుచున్నది, “అప్పుడు పుస్తకపు చుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.” అనగా,పాతనిబంధనలో వ్రాయబడినట్లుగా యేసు క్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చి, చేతులు వేయడం మరియు ఆయన రక్త, చిందించటం ద్వారా సమస్త పాపములను శుద్దిచేసాడు.
పాత నిబంధన కాలములో, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు ప్రాయశ్చిత్తం రోజున ప్రధాన యాజకుడు బలిపశువు పై చేతులు వేసి రక్తం చిందించు బలిని దేవునికి అర్పించటం ద్వారా వారు పాప విమోచన పొందియున్నారు.అదే విధంగా, మానవాళికి నిత్యమైన బలి అర్పణగా మారడానికి ఈ భూమ్మీదకు వచ్చిన యేసుక్రీస్తు, చేతులు వేయు రూపములో బాప్తీస్మం పొందడం ద్వారా లోకములోని సమస్త పాపములను స్వీకరించి ఆ పాపముల నిమిత్తమై శిక్షించబడి ప్రపంచంలోని మానవజాతి యొక్క ఈ పాపములను సిలువ పైకి తీసుకొని, సిలువ వేయబడటం మరియు ఆయన విలువైన రక్తాన్ని మరణానికి చించించెను.ఈ విధంగా చేయటం ద్వారా, యేసును విశ్వసించే వారందరికీ శాశ్వతమైన రక్షణను అనుగ్రహించాడు.
ప్రత్యక్షపు గుడార వ్యవస్థ ద్వారా దేవుడు వాగ్దానం చేసినట్లుగానే, క్రొత్త నిబంధనలో యేసు ఈ భూమ్మీదకు వచ్చి మన అందరికి రక్షణను ఒకసారి నెరవేర్చాడు. ఆయన రక్షణను విశ్వసించే వారు వారి పాపముల నుండి రక్షింపబడ్డారు. ప్రత్యక్షపు గుడారంలో దేవుడు వాగ్దానం చేసాడు,యేసు బాప్తిస్మం తీసుకొని ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా ప్రజలందరి పాపములను శాశ్వతంగా తొలగిస్తాడని. మరియు యేసు నిజంగా వచ్చి బాప్తీస్మం మరియు ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా వాగ్దానం చేయబడిన రక్షణ దేవుని వాక్యం ప్రకారము పరిపూర్ణoగా నెరవేర్చాడు, రక్షణకు సంబంధించిన దేవుని వాగ్దానాలన్నీ, మరో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తులో నిజంగా నెరవేరాయి.
పాత నిబంధనలోని ప్రవక్తల ప్రవచనాలను మరియు ధర్మశాస్త్రమును మాత్రమే దేవుని వాక్యమని ఇశ్రాయేలు ప్రజలు నమ్ముదురు. కానీ దేవుడు రక్షకునిగా కొత్త నిబంధన కాలములో మన దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తును వారు నమ్మలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలతో సహా ఈ లోకములోని ప్రజలందరూ ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడే అని గ్రహించి, రాబోయే మెస్సయ్య అని వారి హృదయాలలో అంగీకరించాలి.


యేసు దేని కొరకు వచ్చియున్నాడు?

తండ్రియైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు వచ్చాడు, ఆయన తమ పాపములన్నిటిని శాశ్వతంగా కడగడానికి ఈ లోకానికి వచ్చాడని విశ్వసించే వారందరికీ ఆయన రక్షకుడు. హెబ్రీయులు 10:10 చెప్పినట్లుగా, "యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము." ఈ భూమ్మీద యేసుక్రీస్తు జన్మించి, తండ్రి చిత్తానుసారంగా బాప్తిస్మం తీసుకొనెను, ఈ సంకల్పం ద్వారా ఆయన సిలువ వేయబడి, సిలువలో ఆయన రక్తాన్ని మరణమునకు చిందించి తిరిగి మృతులలో నుండి లేచాడు, తద్వారా ఆయనను విశ్వసించు వారికి ఆయన రక్షకుడాయను. ఇది తండ్రియైన దేవుని సంకల్పం ద్వారా జరిగెనని మనం స్పష్టంగా గ్రహించాలి మరియు నమ్మాలి. తండ్రియైన దేవుని చిత్తానికి అనుగుణంగా మన పాపములన్నిటిని తొలగించడానికి, యేసుక్రీస్తు తన బాప్తీస్మం మరియు రక్తం చిందించటం ద్వారా సమస్త పాపములను తుడిచివేయుట ద్వారా మానవజాతి యొక్క రక్షణను నెరవేర్చవలసి వచ్చింది. ఈ విధంగా, ఆయన తనను తాను అర్పించడానికి ఇష్టపడెను, తద్వారా మనకు పరిపూర్ణమైన రక్షణను ఇవ్వగలిగెను.
యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజల పాపములను మాత్రమే కాకుండా మొత్తం అన్యజనుల పాపములను కూడా తొలగించడానికి తనను తాను త్యాగం చేసినందున, మనలో ప్రతి ఒక్కరూ దీనిని మన హృదయంతో నమ్మితేనే మనం రక్షించబడతాము. తన ముప్పైమూడు సంవత్సరాల జీవితములో,యేసు ఒక్కసారి మాత్రమే బాప్తిస్మం తీసుకున్నాడు, ఒక్కసారి మాత్రమే త్యాగం చేయబడ్డాడు, కానీ మన రక్షకుని యొక్క ఈ నీతిమంతమైన కార్యాల ద్వారా లోకములోని పాపులు ఒకే సారిగా రక్షించబడ్డారు.ఇది ఏకైక మరియు పరిపూర్ణమైన రక్షణ. ప్రపంచం ప్రారంభం నుండి చివరి వరకు మానవజాతి చేసిన పాపములన్నిటిని యేసు ఒకేసారి తొలగించినట్లే, విశ్వాసం ద్వారా ఒకసారి మనల్ని రక్షించుటకు మనకు సామర్ధ్యము కలుగజేసెను. యేసుక్రీస్తు తన శరీరాన్ని ఒక్కసారి అర్పించడం ద్వారా, మనల్ని శాశ్వతంగా పరిపూర్ణులుగా చేసెను. బాప్తీస్మం మిచ్చు యోహాను చేత ఆయన బాప్తిస్మం తీసుకొని మరియు ఆయన రక్తం చిందించడం ద్వారా మన పాపములన్నిటికై శిక్షించబడెను కాబట్టి, మన హృదయాలలో ఈ నిజమైన సువార్తను మనం ఇప్పుడు సంతోషంగా విశ్వసించాలి మరియు మన పాపములన్నిటి నుండి రక్షించబడాలి. తండ్రియైన దేవుని చిత్తంతో, యేసుక్రీస్తు మన పాపములన్నిటిని భరించడానికి మరియు జీవిత క్రయధనము చెల్లించడానికి ఈ భూమ్మీదకు వచ్చి తండ్రి చిత్తానికి అనుగుణంగా దేవుని ప్రేమ ద్వారా తన నిజమైన రక్షణను విజయవంతంగా వెల్లడి చేసాడు.
ఈ వాక్యమును మనము ఖచ్చితంగా ఈ ఆధునిక ప్రపంచంలో నివసిస్తున్న మీరు మరియు నేను నమ్మవలసిన సత్యం.మనము యేసు బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తం చిందించిన ఆ రెండింటినీ ‘’’’’’సంపూర్ణంగా రక్షించే ఏకైక సత్యం మనo అని నమ్మాలి మరియు వాటితో తప్పక అనుసందానం చేయబడాలి. మనం అలా చేయడంలో విఫలమైతే, మనం ఖచ్చితంగా పాపముల యొక్క శాశ్వత విమోచనను కోల్పోతాము. అందువల్ల, మనం దేవుని వ్రాతపూర్వక వాక్యం ప్రకారం, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం ప్రకారం నమ్మాలి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త, రక్షణ యొక్క కాంతిని వెదజల్లుతుంది, కానీ మనం దేవుడిని విశ్వసించినప్పుడు దానికి ఏదైనా జోడించడం లేదా ఈ నిజమైన సువార్త నుండి కొన్ని ముఖ్యమైన వాటిని తొలగించినను లేదా మనం సత్యాన్ని విశ్వసించకపోయిన, అప్పుడు ఈ రక్షణ యొక్క ప్రకాశమైన ఈ సువార్త ఆరిపోతుంది,అటుతరువాత దానిని దాచడానికి అది అదృశ్యమగును.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం కూడా క్రైస్తవ పాపుల మాదిరిగానే ప్రపంచ సిద్ధాంతాలలో ఒకటి మాత్రమే అనే భ్రమలో మనం పడకూడదు. ప్రతిరోజూ ఒకరి పాపములను క్షమించమని దేవుడిని అడగడం ద్వారా పశ్చాత్తాపం యొక్క ప్రార్థనల ద్వారా ఎవరైనా పాప క్షమాపణను పొందవచ్చని వారు బోధిస్తారు. దేవుడు హెబ్రీయులు 10:11 లో స్పష్టంగా చెప్పాడు, "మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును." ఇక్కడ, దేవుడు ప్రతి రోజూ చేసే పాపములను శుద్దిచేయలేమని దేవుడు చెప్పాడు, ఎందుకంటే సిలువ రక్తం మీద విశ్వాసముతో మాత్రమే మనం రోజువారీ పాపములను క్షమించమని దేవుడిని కోరతాము.
బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా మరియు సిలువపై మరణించడం ద్వారా యేసుక్రీస్తు తండ్రియైన దేవునికి ఇచ్చిన త్యాగం రక్షణకు పరిపూర్ణమైన త్యాగం కాబట్టి, ఈ త్యాగాన్ని విశ్వసించడం ద్వారా మనం పూర్తిగా రక్షించబడ్డాము. ఎందుకంటే, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నప్పుడు లోకములోని పాపములు ఒకేసారి యేసుక్రీస్తుపైకి పంపబడ్డాయి మరియు ఈ కారణంగా,యేసు ఈ పాపములను సిలువపైకి తీసుకొని, వారి పాపమును సమాప్తి చేయుటకు శిక్షించబడి మరణించెను. మరియు ఆయన బాప్తీస్మం మరియు రక్తం చిందించటం అను ఈ రెండింటినీ విశ్వసించుట ద్వారా వారి పాపములు శుద్దిచేయబడును.
యేసుక్రీస్తు స్వీకరించిన బాప్తీస్మం మరియు ఆయన సిలువ రక్తాన్ని విశ్వసించడం ద్వారా, మనం కూడా యేసుక్రీస్తుతో మరణించాము మరియు విశ్వాసం ద్వారా ఆయనతో తిరిగి జీవం పొందాము. రోమా 6:23, "ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము." పాపం యొక్క జీతం మరణం, అవి ఏమైనప్పటికీ, జీవితపు పాపపు వెల చెల్లించాలి. అందుకే యేసుక్రీస్తు మానవుని అవతారంలో ఈ భూమిపైకి రావడం, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం మరియు ఆయన రక్తాన్ని సిలువపై చిందించడం అవసరమైనది. యేసు బాప్తీస్మం ద్వారా మీ పాపములను వాస్తవంగా దాటింప చేయటం జరిగింది, మరియు ఈ పాపములను తన భుజాన వేసుకొని చనిపోవడం ద్వారా, యేసు మీ పాపపు క్రయధనాన్ని చెల్లించి వాటిని ఒకేసారి పూర్తిగా తొలగించెను. అయినప్పటికీ, దేవుడు మనకు ఈ నిజమైన సువార్తను ఇచ్చినప్పటికీ, ప్రతిరోజూ తమ వ్యక్తిగత పాపములను క్షమించమని దేవుడిని వేడుకునేవారు చాలా మంది ఉన్నారు. వారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క సత్యాన్ని తెలుసుకోలేరు.
ప్రజల హృదయాల్లో పాపం ఉన్నప్పుడు, వారు తమ పాపముల బట్టీ దేవుని యెదుట వారు భయపడకుండా ఉండలేరు.నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి ఇంకా తెలియన వారు,ఇంకను వారి పాపముల నుండి శుద్దిచేయబడిన వారు, చాలా మంది అపరాధ భావం కారణంగా భయంతో మునిగిపోయారనేది వాస్తవం.ఏదేమైనా, వారి పాపములనుండి వారిని రక్షించడానికి యేసు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకొని,సిలువపై ఆయన రక్తాన్ని చిందించాడు తద్వారా వారిని సంపూర్ణంగా రక్షించాడు. అప్పుడు,నీరు మరియు ఆత్మ యొక్క సువార్త, దేవుని యొక్క రక్షణ సువార్త, మనల్ని పూర్తిగా రక్షించినప్పుడు మరియు పాపం కోసం మన శిక్షలన్నిటిని తీసివేసినప్పుడు మనం ఏ కారణంతో ఆందోళన చెందాలి? 
యేసు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మానవ జాతి పాపములన్నియు తుడిచివేసియున్నాడని నిజంగా తెలుసుకొన్నవారు విశ్వాసము ద్వారా పరిపూర్ణగా రక్షించబడుదురు, దేవుడు వాగ్దానం చేసినట్లుగా, ``యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱ బొచ్చువలె తెల్లనివగును.`` (యెషయా 1:18). మనమందరం విశ్వాసం ద్వారా రక్షించబడితిమి, ఎందుకంటే పాత నిబంధనలోని బలి వ్యవస్థ ప్రకారం ఈ లోకములోని పాపములను అంగీకరించిన విధంగా యేసు బాప్తీస్మం ఉంది, అది చేతులు వేయు రూపములో బలి అర్పణపై సమస్త పాపములు దాటించబడ్డాయి. యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తీస్మం పొందడం ద్వారా లోకములోని పాపములను స్వీకరించినందున, ఆయన సిలువపై చనిపోగలడు, మరియు పాత నిబంధనలో దేవుడు చెప్పిన రక్షణ నెరవేరినందున మనమందరము విశ్వాసం ద్వారా మనము సమస్త పాపముల నుండి రక్షించబడ్డాము.
పొరపాటులేని ఈ సత్యానికి బదులుగా, ప్రజలు యేసును కేవలం బావేద్రేకాలతోను మరియుసానుభూతితోను విశ్వసించు కొంతమందిని ఇప్పటికీ మనం చూచియున్నాము. వారు తమ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి రోజూ ఏడ్చేవారు ఎందుకంటే వారి విశ్వాసానికి ఆధారం యేసు సిలువపై ఆయన ఘోరమైన బాధతో సానుభూతి చెందడం. అలాంటి వ్యక్తుల హృదయాలు పూర్తిగా తప్పుదోవ పట్టించు దోషపూరితమైనవి, వారు ఇప్పుడు ఈ తప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. మన రక్షకుడైన యేసు తన బాప్తీస్మం మరియు రక్తం ద్వారా మనకు ఇవ్వగలిగే దేవుని యొక్క కృప మీకు మరియు నాకు అవసరం, మన సానుభూతి లేదా భక్తి యేసుకు అవసరం లేదు. సాదారణ సత్యం ఏమిటంటే, రక్షకుడైన యేసుక్రీస్తు మనకు చాలా అవసరం, కొంతమంది వారికి సొంత ప్రత్యేక కారణం లేకుండా దేవుడిని విశ్వసించు ప్రజలు చాలా మంది ఉన్నారు, ఏమీలేని వానిని దేవునిగా ఆలోచిస్తారు, అతను వేడుకుంటున్నట్లు వారు ఆయనను నమ్ముతారు.కానీ ఈవిధంగా విశ్వసించే విశ్వాసము యొక్క నమ్మకాన్ని దేవుడు పూర్తిగా తృణీకరిస్తాడు.
హృదయపూర్వకంగా యేసును విశ్వసించే వారి హృదయాలు, వారు ఆయనకు ఉపకారం చేస్తున్నట్లుగా, వారి స్థాయిని దేవుని కంటే ఎక్కువగా చేసుకొనెదరు, కాబట్టి వారి అహంకార హృదయముతో వారు పాపం నుండి వారిని సంపూర్ణంగా రక్షించే నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ఎప్పటికి అంగీకరించలేరు. వారు దేవుని వాక్యం పట్ల చాలా తక్కువ చూపు కలిగి ఉందురు, ఇరుగు పొరుగువారు చెప్పు ఏదైనను కొద్దిగా భిన్నంగా భావించి, దానిని పరిహసించి మరియు ఆదరిస్తారు, వారి సానుభూతి నుండి ఇది దేవునికి ఉపకారం చేస్తుందని విశ్వసించడం ద్వారా. చివరికి, వారు తమ పాప విమోచన కోసం యేసు బాప్తీస్మం మరియు రక్తం చిందించిన విధానం నమ్మరు మరియు వారు దేవునికి వ్యతిరేకంగా నిలబడుదురు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను కూడా విశ్వసించకుండా వారి పశ్చాత్తాపం యొక్క ప్రార్థనల ద్వారా వారి పాపములు కడిగివేయబడతాయని వారు నమ్ముతారు. వారు దేవుని పేరును వ్యర్థముగా పలుకుదురు కాబట్టి, రక్షకుడైన యేసుక్రీస్తు తమ పాపములన్నిటిని పూర్తిగా తొలగించియున్నది వారికి తెలియదు లేదా నమ్మరు, దీని ఫలితంగా వారు రక్షించబడరు.
దేవుడు ఇలా అన్నాడు, "అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడుఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును." (రోమా 9:15). దేవుడు తన కృపతో పాపాత్ములను రక్షణ నియమంతో రక్షించాలని నిర్ణయించుకుంటే, ఆయన నిర్ణయించిన విధంగానే చేస్తాడు. కాబట్టి మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించాలి మరియు తద్వారా మన నిజమైన రక్షణను పొందాలి. నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్త వాక్యాన్ని నమ్మని వారు పట్ల నిజంగా దేవుని యొక్క ఉగ్రత మరియు వారిపై ఆయన కోపం ఎంత గొప్పదో వారు వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. మరోవైపు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారిపై నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో మరియు దయగలదో చూస్తారు. ఎవరైతే దేవుని యెదుట తన పాపములను ఒప్పుకుంటారో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను గుర్తించి, విశ్వసిస్తే, దేవుని పరిపూర్ణ రక్షణ యొక్క సువార్త, వారి సమస్త పాపముల నుండి విడుదల పొందుదురు.
బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసుక్రీస్తు తమ పాపములన్నిటి స్వీకరించాడని విశ్వసించేవారు సమస్త పాపముల నుండి విడుదల పొందుతారు. ఈ సత్యాన్ని తృణీకరించువారు, అందుకు విరుద్ధంగా, తమ పాపములకు భయముతో కూడిన శిక్షను ఎదుర్కొంటారు. ఈ ప్రపంచంలోని ప్రజలందరూ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించాలి, ఇది రక్షణ యొక్క నిజమైన సత్యం. దేవుని తీర్పుకు భయపడని నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించని పాపులు ఖచ్చితంగా వారి పాపములను బట్టి శిక్షించబడుదురు. అయితే యేసు పాపమును శుద్దిచేయగలడని నమ్మే ఈ సత్యాన్ని విశ్వసించే వారు తమ పాపములన్నిటి నుండి రక్షింపబడతారు.
మనస్సాక్షిలో పాపం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో ఉన్నారు, కాబట్టి ప్రజలు నీరు మరియు ఆత్మ యొక్క ఈ నిజమైన సువార్త నుండి పూర్తిగా భిన్నమైన రక్షణకు సంబంధించిన ఆధారం లేని, నిరాధారమైన సిద్ధాంతాలతో ముందుకు వచ్చారు. వారు తమ బాధలో ఉన్న మనస్సాక్షిని ఇలాంటి దుర్మార్గపు సిద్ధాంతాలతో ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. "నేను యేసును నమ్ముతున్నాను కాబట్టి, నా హృదయంలో పాపం ఉండటం నాకు ఓకే" అని చెప్పే వారు కూడా ఉన్నారు. కానీ వారి హృదయాలలో పాపం ఉన్నవారందరూ తప్పనిసరిగా నరకంలో పడతారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు, ఎందుకంటే దేవుడు అలాంటి వ్యక్తులపై వారిపాపములను బట్టి ఖచ్చితంగా తన న్యాయమైన తీర్పును ఇచ్చును. వారు సాతాను పక్షం వహిస్తున్నందున, దేవుడు వారిని విడిచిపెట్టడు.
కానీ దేవుని న్యాయం గురించి ఎరిగిన వారు మరియు పాపమునకు ఆయన తప్పులేని తీర్పు ఉంటుందని తెలుసుకున్నవారు, ఆయన కృప గల ప్రేమ కోసం దేవుణ్ణి అడగండి, సమస్త పాపములనుండి మరింతగా రక్షించబడాలని ఆశించి, సత్యాన్ని వెతికి దేవుని వైపు నిలబడాలని కోరుకోండి.అలాంటి వ్యక్తుల కోసం, యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మానవజాతి పాపములన్నిటిని తన పైకి తీసుకున్న సత్యం ఇక్కడ ఉంది. ప్రతి పాపాత్ముడు దానిని విశ్వసించడం ద్వారా పాప విమోచన పొందాలి. తన బాప్తీస్మం ద్వారా, యేసుక్రీస్తు పూర్తిగా లోకములోని సమస్త పాపములను ఒకసారి అంగీకరించి, ఒకసారి సిలువపై మరణించాడు తద్వారా మన పాపములన్నిటి తొలగించి, మనల్ని నీతిమంతులుగా చేశాడు. 
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యం ద్వారా, మనమందరం ఇప్పుడు నిజమైన రక్షణ ఏమిటో మనం స్పష్టంగా గ్రహించాలి మరియు మనమందరం ఈ సువార్తను నిజంగా విశ్వసించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. తమ హృదయంలో ఈ సత్యాన్ని విశ్వసించే వారందరూ, ఎలాంటి పాపములు చేసినప్పటికీ, విశ్వాసం ద్వారా వారి పాపములన్నిటి నుండి శుద్దిచేయబదుదురు మరియు నిజమైన పాపములను మరియు శాశ్వత జీవితాన్ని పొందుదురు.మీ హృదయములో ఉన్న పాపములన్నియు అదృశమయ్యే ఈ సువార్త వాక్యాన్ని మీరు నమ్మకూడదనుకుంటున్నారా? దేవుని యెదుట నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తను విశ్వసించే వారు ఖచ్చితంగా పాప విమోచన పొందుతారు.


నీ యొక్క పశ్చాత్తాప ప్రార్థనలు నిన్ను రక్షించవు 

నేడు, చాలామంది క్రైస్తవులు తమ రోజువారీ పశ్చాత్తాప ప్రార్థనలను చేయుచు,తమ పాపములను క్షమించమని దేవుణ్ణి కోరుదురు.వారు పాత నిబంధన కాలం వలె ప్రతిరోజూ దేవునికి తమ త్యాగపూర్వక బలి అర్పణలు అర్పించటం ద్వారా వారు సరైన విశ్వాస జీవితాలను గడుపుదురు. అయితే మీరు జీవించాలనుకునే విశ్వాస జీవితం కాదు ఇది. మీరు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనలు చేసినప్పుడల్లా మీ పాపములను శుద్దిచేయడానికి యేసు తన రక్తాన్ని సిలువపై చిందించునా ? ఇది జరగనేరదు. సత్యం ఏమిటనగా, యేసుక్రీస్తు యొక్క బాప్తీస్మం మరియు రక్తం చిందించుట యొక్క శక్తి శాశ్వతంగా ఉంటుందని మీరు విశ్వసించడం ద్వారా మీ సమస్త పాపములను ఒకసారి శుద్దిచేయబడును. ప్రతిరోజూ పశ్చాత్తాపం యొక్క ప్రార్థనలు చేయడం ద్వారా వారి పాపముల నుండి శుద్దిచేసుకోవటానికి ప్రయత్నించే వారు శాశ్వతమైన పాప విమోచన పొందలేరు, లేదా వారికి నిజమైన రక్షణ అనుభవించు విశ్వాసం ఉండదు.
ప్రతి ఒక్కరి పాపములు పశ్చాత్తాపం యొక్క ప్రార్థనల ద్వారా లేదా మానవ నిర్మిత ఆచారాల ద్వారా క్షమించగలిగితే, పాపం యొక్క జీతం మరణం అని ప్రకటించే చట్టాన్ని దేవుడు ఏర్పాటు చేయడు.ప్రజలు యొక్క పాపములు క్షమిచబడాలంటే, వారు తమ పాపములను విశ్వాసం ద్వారా యేసు శరీరంపైకి పంపే నైవేద్యమును అర్పించాలి. మనం కలిగి ఉండవలసినది ప్రతి రోజూ పశ్చాత్తాపం యొక్క ప్రార్థనలు చేసే విశ్వాసం కాదు, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారముమనకు ఉపయోగించిరి. మరో మాటలో చెప్పాలంటే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే విశ్వాసం మాత్రమే మనకు నిజమైన పాపమును శుద్దిచేయగలదని మనం గ్రహించాలి, మరియు దానిని మన హృదయాలలో మనం నమ్మాలి.
పాత నిబంధనలోని పాపపరిహారము అర్పించునప్పుడు పాపపుల యొక్క చేతులు బలి పశువు యొక్క తలపై ఉంచి వారి పాపములు దాని పై దాటించినట్లు, ఆయన బాప్తిస్మము నందు మనము విశ్వాసముంచుట ద్వారా మన పాపములు ఆయన పైకి పంపించుచున్నాము, ఈ విశ్వాసం ద్వారా ఆయన బాప్తిస్మమును మరియు సిలువ మీద ఆయన కార్చిన రక్తమును రెండిటిని నమ్ముచున్నాము, కావున తప్పనిసరిగా మనము శ్వాశ్వతమైన పాప విమోచన పొందుటకు మనము ఆయన యొద్దకు రావలెయును, దేవుడు చెప్పాడు, "ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” మరియు "కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును" (రోమా 10:10,17).
యోహాను 1:29 ఇలా చెబుతోంది, “మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.’” ఈ భాగం యేసు బాప్తిస్మం తీసుకున్న మరుసటి రోజు బాప్తీస్మం మిచ్చు యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని వివరిస్తుంది. బాప్తీస్మం మిచ్చు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “ఇదిగో ప్రజలారా చూడుడి ! అక్కడ ఒక మనుష్యుడు వెళ్లుచున్నాడు!" అని చెప్పబడిన ఈ మాట బాప్తీస్మం మిచ్చు యోహాను చుట్టూ గుమికూడిన ప్రజలలో గందరగోళానికి కారణమైంది. యోహాను బిగ్గరగా అరచెను "ఇదిగో! ఇక్కడకి దేవుని గొర్రెపిల్ల వస్తుంది! ఆయన ఎవరో కాదు, దేవుని కుమారుడు, నా ద్వారా మానవజాతి పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన మన రక్షకుడైయున్నాడు. ఆయనే యేసు క్రీస్తు, దేవుని గొర్రెపిల్ల. ఇదిగో! లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల!” యేసు క్రీస్తుకు బాప్తీస్మం మిచ్చినది బాప్తీస్మం మిచ్చు యోహాను మరియు లోకములోని పాపములనుఆయన పైకి పంపినవాడు, ఎందుకంటే యోహానే స్వయంగా యేసు గురుంచి వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పగలడు. యోహాను ఈ విధంగా అత్యంత సముచితమైన రీతిలో బాప్తిస్మం ఇవ్వడం ద్వారా మన పాపములన్నిటిని యేసుపైకి పంపినందున,యేసుక్రీస్తు తండ్రియైన దేవుని చిత్తప్రకారము మన పాపములన్నిటిని తీసుకొని మచ్చలేని గొర్రెపిల్లగా మారాడు.
పాత నిబంధనలో, దేవునికి బలి అర్పణలు ఇవ్వడం ద్వారా పాపం నుండి విడుదల లభించింది, కానీ కొత్త నిబంధనలో, యేసు బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తాన్ని పూర్తిగా విశ్వసించే విశ్వాసం ద్వారా మాత్రమే మనం మన పాపముల నుండి విమోచించబడతాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పాపములను పోగొట్టడానికి ఎద్దులు, గొర్రెపిల్లలు మరియు మేకలను వంటి పశువులను బలి అర్పణలుగా తీసుకున్నందున, అనేక పశువులను చంపి రక్తం చిందించి, ముక్కలుగా నరికి, దహన బలిపీఠం మీద దహించుదురు.వాటియొక్క యజమానుల చేసిన పాపముల కారణంగా అనేకమైన బలి పశువులు మరణించెను.
కానీ క్రొత్తనిబంధన కాలములో, యేసు అలాంటి బలి పశువులను అర్పించలేదు, కానీ ఆయన మనకోసం తన స్వంత శరీరాన్ని అర్పించాడు. ఈ భూమిపైకి వచ్చిన యేసు దేవుని గొర్రెపిల్లగా,బాప్తీస్మం ద్వారా లోకములోని పాపములను తన శరీరంపై స్వీకరించి, సిలువపై తన రక్తాన్ని చిందించాడు, ఈ సత్యాన్ని విశ్వసించే వారి పాపములన్నిటి నుండి ఒకసారి మన అందరిని రక్షించేలా చేశాడు. యేసు నీరు, రక్తం మరియు ఆత్మతో మన పాపములన్నిటిని శాశ్వతంగా సమాప్తి చేయుటకు వచ్చెను.
దేవుడు మీకు మరియు నాకు నిజమైన రక్షణ యొక్క సత్యాన్ని విశ్వసించాలని ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మనకు ఇలా చెప్పుచున్నాడు, “నేను నిన్ను చాలా ప్రేమించాను కాబట్టి నేను మీ పాపములన్నిటిని తొలగించి. నేను నిన్ను ఇలా కాపాడితిని. కాబట్టి నమ్మండి! నా స్వంత కుమారుని నీకు పాపపరిహారార్థ బలిగా ఇవ్వడం ద్వారా నేను మీ పాపములన్నిటిని తొలగించాను. నేను నా కుమారుని తన జీవితంలో 33 సంవత్సరాలు ఈ భూమిపై జీవించడానికి అనుమతించాను, నేను అతనికి బాప్తిస్మం ఇచ్చియున్నాను, మీ కొరకు నేను అతనిని సిలువపై అతని రక్తాన్ని చిందింపచేసితిని, ఇవన్నీ చేయడం ద్వారా నేను మీ సమస్త పాపముల నుండియు మరియు శిక్ష నుండియు మిమ్మల్ని పూర్తిగా విడిపించాను.ఇప్పుడు ఈ సత్యాన్ని విశ్వసించడం ద్వారా, నేను ప్రేమించే మరియు నా చేతుల్లోకి కౌగిలించుకోగలిగే నా స్వంత పిల్లలుగా మీరు మారవచ్చు.” మీరు మీ హృదయాలలో ఈ సత్యాన్ని తెలుసుకోండి మరియు నమ్మండి! యేసుక్రీస్తు స్వీకరించిన బాప్తీస్మం మరియు ఆయన చిందించిన రక్తాన్ని విశ్వసించే వారు తమ నుండి రక్షించబడడమే కాకుండా,దేవుని స్వంత బిడ్డలుగా మారే హక్కును కూడా పొందుతారు. 


యేసు లోక పాపములన్నియు తీసివేసాడా ?

మనం హెబ్రీయులు 10: 14-18 వైపు తిరుగుదాం: ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.
ఈ భాగం యొక్క లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది: "వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు." యేసు పొందిన బాప్తీస్మం ద్వారా మన పాపములన్ని యేసుపైకి పంపబడ్డాయని ఈ ఆశీర్వాద సువార్తను వినుడి ! మన జీవిత కాలమంతటిలో మీరు మరియు నేను చేసిన ప్రతి పాపం మాత్రమే యేసుపైకి పంపబడుట కాదు కానీ, సమస్త మానవజాతి యొక్క పాపములన్ని ఆయన పైకి పంపబడెను. దేవుని యొక్క సమస్త నీతిని నెరవేర్చడానికి, యేసు చేతులు వేయు రూపంలో నీటిలోను మరియు నీటి వెలుపల బాప్తిస్మం తీసుకున్నాడు, తద్వారా ఆయన సమస్త పాపములను తనపైకి స్వీకరించాడు. మన పాపములన్నిటి ఇలా భరిస్తూ, ఆయన సిలువ వేయబడ్డాడు తద్వారా మానవజాతి పాపములన్నిటికి శిక్షించబడ్డాడు,అందువలన ఈ సత్యాన్ని విశ్వసించే వారు ఇప్పుడు వారి తీర్పు నుండి విమోచన పొందుదురు. ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములను బలి చేయు పశువు యొక్క తలపై చేతులు వేసినట్లుగా, బాప్తీస్మం మిచ్చు యోహాను యేసుకు బాప్తీస్మం ఇవ్వడం ద్వారా మనపాపములన్నిటిని యేసుపైకి పంపించాడు. మరియు యేసు, ఈ పాపములను తన భుజాన వేసుకొని మరియు సిలువ వేయబడ్డాడు, అందువలన తనను నమ్మిన ప్రతి ఒక్కరిని పాపం నుండి విడిపించాడు. కాబట్టి,ఈ పరలోక సత్యాన్ని విశ్వసించేవారు దేవుని స్వంత బిడ్డలుగా మారే హక్కును పొందగలరు.
రోమా 10:10 ఇలా చెబుతోంది, "ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును." మీలో ప్రతి ఒక్కరు, దేవుని యొక్క నీతిని మీ హృదయపూర్తిగా విశ్వసించడం ద్వారా, నీవు నీ పాప క్షమాపణను స్వీకరించి పరలోకములో ప్రవేశించగలవు. ప్రియమైన తోటి విశ్వాసులారా, మీరు మీ హృదయాలతో ఆయన బాప్తిస్మమును మరియు ఆయన కార్చిన రక్తమును ఒప్పుకోవటం "దేవుని నీతి యుక్తమైన ముఖ్య భాగములు", "రక్షణ యొక్క సత్యం" మరియు "పాప విమోచన యొక్క సువార్తయేనా "? పాత నిబంధన యొక్క బలి వ్యవస్థ ప్రకారం, ఇశ్రాయేలీయుల యొక్క పాపములు నైవేద్యం మీదకు చేతులు వేయు రూపములో వారి పాపములు దాటించబడటకు బలి పశువును వధించకుండా వారి పాపములు శుద్దిచేయబడవు.అదే విధంగా, మీరు సిలువ రక్తాన్ని మాత్రమే విశ్వసించి యేసు అందుకున్న బాప్తిస్మమును విడిచిపెడితే,మీ పాపములన్నియు శుద్దిచేయబడవు.
"వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు” (హెబ్రీ 10: 17-18). దేవుడు మన పాపములనుఇక మీదట గుర్తుచేసుకోనని ఇక్కడ ఎందుకు చెప్పాడు? మనం చనిపోయే రోజు వరకు మనం పాపం చేయకుండా ఉండలేము, ఎందుకంటే యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా లోకములోని సమస్త పాపములను ఒకసారి తీసుకొనియున్నాడు,కావున ఇప్పుడు మన రక్షణ నెరవేరింది మరియు అది శాశ్వతంగా ఉంటుంది, కావున దీనిని విశ్వసించే వారికి ఇక పాపం లేదు. అందుకే దేవుడు మన పాపములను ఇక గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 
దేవుని యొక్క నీతి అనగా ఆయన న్యాయం. దేవుని యొక్క న్యాయం తండ్రియైన ఆయన పరిశుద్దుడుగా ఉన్నట్లు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారు కూడా పరిశుద్ధులు మరియు పాపము లేనివారు అని సూచిస్తుంది. మొదటి నుండి, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు,మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆయన మనల్ని తన బిడ్డలుగా ఆయన అలా చేయలేకపోయాడు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి తండ్రియైన దేవుడు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు.
దేవుడు ఇశ్రాయేలీయుల తరపున నిర్దోషమైన బలి అర్పించు మచ్చలేని పశువులను పక్కన పెట్టి వారి పాపములన్నిటిని ఈ బలి నైవేద్యము మీద చేతులు వేయడం ద్వారా వారి పాపములను శుద్ధిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఆయన యొక్క నిజ రక్షణకు ముందస్తు సిద్ధాంతం కనుక, యేసు బాప్తిస్మం తీసుకోవడానికి,మన కొరకు ఆయన నైవేద్యము అర్పణగా మారెను, మన స్థానంలో మనకు బదులుగా శిక్షించబడటానికి మరియు తన శరీరంతో నిత్యమైన పాప నైవేద్యం అర్పించబడానికి వెనుకాడలేదు. ఈ పాప పరిహారము ద్వారా, దేవుడు ఆ నిజమైన విశ్వాసులను వారి పాపముల నుండి ప్రక్షాళన చేయడానికి వారిని తన సొంత బిడ్డలుగా చేసుకోవడానికి తన ప్రణాళికను నెరవేర్చాడు. ఇప్పుడు, ఈ సత్య సువార్తను విశ్వసించే వారు దేవుని ముందు తమ పాపములన్నిటి నుండి విడుదల పొందుదురు. యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారానే ఈ లోకములోని సమస్త పాపములను శుద్దిచేసాడు కాబట్టి, మానవజాతి పాపములను ప్రక్షాళన చేసిన ఈ యేసును మనం విశ్వసిస్తే, మనం ఇకపై మన పాపములకు ఎలాంటి సమర్పణ ఇవ్వవలసిన అవసరం లేదు. సహోదరి సోదరులారా, మన పాపములకు మనం ఇక బలులు అర్పించాల్సిన అవసరం ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు !
యేసుక్రీస్తు పాపము లేనివాడుగా పరిశుద్దుడుగా ఉన్న ఆయన సిలువ ఎందుకు వేయబడ్డాడో మీకు తెలుసా? యేసు సిలువ వేయబడినప్పటికీ, నిజానికి ఆయన ఏ తప్పు చేయలేదు. యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మానవాళి యొక్క సమస్త పాపములను అంగీకరించుట వలన మాత్రమే ఆయన మన స్థానంలో చనిపోవలసి వచ్చింది. ఆయన సిలువపై చనిపోవడానికి కారణం ఏమిటనగా, ఆయన తన బాప్తీస్మం ద్వారా ఇంతకు మునుపే లోకములోని సమస్త పాపములను అంగీకరించి సమస్త నీతిని నెరవేర్చడానికి సిద్ధపడిన వాడు. దేవుని కుమారుడు ఈ విధంగా నీతి యావత్తును నెరవేర్చడానికి బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలము?యేసు మన పాపములన్నిటిని స్వీకరించినందున, ఆయన, గొర్రె కత్తెరించు వాని యెదుట గొర్రె, నిశ్శబ్దంగా ఉండులాగున సిలువ శ్రమను భరించాడు. మనమందరం ఆయన బాప్తీస్మం మరియు సిలువ అను ఈ రెండింటినీ శాశ్వతంగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఆయన సిలువ వేయబడకపోయినా మరియు శిక్షించబడకపోయినా,మనం ఖచ్చితంగా శిక్షించబడేవారిమి.
 మన ప్రభువు మన పాపములన్నిటిని స్వీకరించడమే కాకుండా, మన పాపములన్నిటికై శిక్షించబడ్డాడు.మరొక విధంగా చెప్పాలంటే, మన పాపములన్నిటిని స్వీకరించిన రక్షకుడైన యేసు, మన యొక్క స్వంత పాప బలి అర్పణగా మారాడు మరియు నిశ్శబ్దంగా సిలువ శిక్షను భరించాడు, ఎందుకనగా మన యొక్క సమస్త పాపము నుండి రక్షించడానికి అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. అందుకే పరిశుద్ధగ్రంధము ఇలా చెబుతోంది, "వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధస్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది ,” (హెబ్రీయులు 10: 17-19).
యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడో ఇప్పుడు మీకు అర్థమైందా? యేసు యొక్క సిలువ రక్తాన్ని మాత్రమే మనం విశ్వసించుట కాదు గాని, ఆయన సిలువ పై చనిపోవడానికి గల కారణాన్ని మనం గ్రహించాలి మరియు ఈ కారణం ఆయన పొందిన బాప్తిస్మములో ఉందని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి మరియు నమ్మాలి. మన పాపములు ఎక్కడ మరియు ఎలా శుద్దిచేయబడ్డాయో మీరు మరియు నేను తెలుసుకోవాలని మరియు విశ్వసించాలనుకుంటే, యొర్దాను నదిలో బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపములన్ని యేసు పైకి పంపబడ్డాయని మనం గ్రహించాలి మరియు నమ్మాలి. విశ్వాసం ద్వారా మన పాపములన్నిటి నుండి శుద్దిచేయబడుతాము.


నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క సత్యాన్ని తెలుసుకోవడం మరియు నమ్మడం ద్వారా,మనం ఇప్పుడు మన పాపములన్నిటి నుండి రక్షించబడవచ్చు

నేను ఇంతవరకు మీకు చెప్పినది పరిశుద్ధగ్రంథములో చాలా విశాలంగా మాట్లాడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క సత్యం. మరియు ఈ సత్యం జగదుత్పత్తికి ముందే ప్రణాళిక చేయబడిన రక్షణ, ఈ రక్షణ నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంలో కూడా కనిపిస్తుంది, ఈ వస్తువలన్నియు ప్రత్యక్షపు గుడారం యొక్క తెర ద్వారం కోసం ఉపయోగించే పదార్దములు. నా తోటి సేవకులతో కలిసి, ఈ లోకములోని అనేకమంది ప్రజలకు నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారములో వ్యక్తమయ్యే ఈ సత్యాన్ని నేను బోధిస్తున్నాను. ఇప్పటికి కూడా , ఈ గంటలో కూడా , ఈ సువార్త మన క్రైస్తవ పుస్తకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించుచున్నది.
అయినను చాలా మంది ప్రజలు యేసును మరియు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి తెలియక పోయినా యేసును నమ్ముతున్నట్లు చెప్పుదురు. అలాంటి వ్యక్తులను మూర్ఖులు అని పిలవడానికి నేను ధైర్యం చేయగలను, ఎందుకంటే ఈ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త అనేది ప్రధాన సత్యం, ఇది యేసు క్రీస్తు ద్వారా నెరవేరిన నిజమైన బలి వ్యవస్థ గురించి చెబుతుంది, రక్షణ యొక్క నీడ వాస్తవ పదార్థమైన ప్రత్యక్షపు గుడారంలో వ్యక్తమవుతుంది. ఇప్పుడు, మీ వంతు. ఈ నిజమైన సత్యాన్నిమీరు తెలుసుకోకుండా విశ్వసించినట్లయితే, ఇప్పుడు మీరు కదలడానికి , నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించి, మీ పాపములన్నిటి నుండి విడుదల పొందడానికి ఇదే సమయం.
యేసు బాప్తీస్మం మరియు సిలువ పై ఆయన మరణం జగత్తుపునాదికి ముందే వాగ్దానం చేయబడ్డాయి, మరియు అవి నీలం, ఊదా మరియు ధూమ్ర రక్త వర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో కూడా వ్యక్తీకరించబడ్డాయి. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మిమ్మల్ని మరియు నన్ను మన సమస్త పాపముల నుండి రక్షించడానికి, యేసు బాప్తిస్మం తీసుకున్నాడు, సిలువ పై మరణించాడు, తిరిగి మృతులలో నుండి లేచి ఇప్పుడు తండ్రి అయిన దేవుని కుడి పార్శమున కూర్చున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా మీ స్వంత అనుభవాలు లేదా భావోద్వేగాలను అనుసరించడం ద్వారా మీరు ఇప్పటికీ యేసును విశ్వసించడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ లోకములో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, కానీ వారు ఇప్పుడు తప్పుదారి పట్టిన విశ్వాసం నుండి తిరగబడాలి మరియు నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క సత్యం ప్రత్యక్షపు గుడార ద్వారములో వ్యక్తమైంది. 
హెబ్రీయులు 10:19-20 ఇలా చెబుతోంది,"సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవే శించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుక." బాప్తీస్మం ద్వారా లోకపాపములను స్వీకరించిన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు, దేవాలయపు ముసుగు రెండుగా చీలిపోయింది, మరియు యేసు బాప్తీస్మం మరియు సిలువ యొక్క ఆయన రక్తంతో మానవజాతి పాపములు శుద్దిచేయబడ్డాయి. నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో దేవాలయపు ముసుగు చాలా బలంగా ఉంది, దాని నాలుగు వైపులా నాలుగు గుర్రాల ద్వారా వ్యతిరేక దిశల్లోకి లాగినప్పటికీ అది చిరిగిపోదు. ఆలయం యొక్క ఈ దృఢమైన ముసుగు పై నుండి క్రిందికి ఎవరు తాకకుండానే అది రెండుగా చినిగి పోయింది,యేసుక్రీస్తు తన పనిని పూర్తి చేసిన మరు క్షణంలోనే తెలియజేయబడింది; పరలోక ద్వారాలు విశాలంగా తెరవబడ్డాయి. దేవాలయపు ముసుగు పైనుంచి క్రిందికి చినిగిపోవడం అనగా, పాపపు గోడలన్నీ కూల్చివేయబడ్డాయి, అనగా అర్ధం యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ పాపపు గోడలను కూల్చివేసాడు.
పాపం యొక్క గోడలు కూల్చివేయబడుట యొక్క దీని అర్థం ఏమిటి? యేసుక్రీస్తు స్వీకరించిన బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తాన్ని విశ్వసించడం ద్వారా ఎవరైనా తన పాపములన్నిటి నుండి విడుదల పొందవచ్చు. దేవాలయం చిరిగిపోయిన ముసుగు ద్వారా దేవుడు ఏమి తెలియజేయడానికి ప్రయత్నించాడు, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో చూపిన యేసు పరిచర్య సేవ ద్వారా మానవజాతి యొక్క రక్షణ ఇప్పుడు ఒకసారి నెరవేరింది. మనందరికీ దేవుడు వాగ్దానం చేసిన మన శాశ్వత ప్రాయశ్చిత్తం నెరవేరింది కాబట్టి నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో, అతి పరిశుద్ధస్థలము యొక్క ముసుగు పైనుంచి కిందకు, రెండుగా చినిగిపోయెను ఇది మనుష్యుని చేతుల ద్వారా జరిగినది కాదు గాని, దేవుడి చేతనే జరిగియున్నది.
యేసు క్రీస్తు మానవజాతి పాపముల కొరకై శాశ్వత బలిపశువుగా మారిన యేసుక్రీస్తు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనలను సంపూర్ణంగా రక్షించాడని ఇది మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు స్వీకరించిన బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తమును కార్చిన విశ్వాసమును విశ్వసించే వారు ఎవరైనా పాపముల నుండి విడుదల పొందగలరని ఆయన సమక్షంలో నిలబడగలరని తండ్రియైన దేవుడు నిర్ణయించాడు. మీరు ఈ సత్యాన్ని నమ్ముతారా లేదా?
దేవుడు నిన్ను ప్రేమించినట్లే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా నిన్ను ప్రేమిస్తాడు, మరియు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా మరియు సిలువ వేయబడటం ద్వారా ఆయన మీకు సంపూర్ణ రక్షణను అనుగ్రహించియున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబబడిన ఈ దేవుని ప్రేమను పొందడం ద్వారా, మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మనకు సహాయపడే సత్యాన్ని విశ్వసించడం ద్వారా, మన పాపములన్ని అదృశ్యమాయెను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా, మన వ్యక్తిగత పాపములు కూడా తొలగించబడెను, ఎందుకనగా మన పాపములు మరియు శిక్షయు ఇప్పటికే యేసు బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తంతో శుద్దిచేయబడ్డాయి.
హెబ్రీయులు 10:22 ఇలా చెప్పుచున్నది" మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము." పరిశుద్ధగ్రంధము పాపమును శుద్దిచేయడం గురించి మాట్లాడుతోంది. యేసుక్రీస్తు తన బాప్తీస్మం ద్వారా మన యొక్క శరీరముతోను మరియు మనస్సుతో చేసే సమస్త పాపములను శుద్దిచేసాడు అనే సత్యాన్ని విశ్వసించడం ద్వారా మన పాపములన్నిటి నుండి మనం రక్షించబడవచ్చు. ప్రధాన యాజకుడు కూడా నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఇత్తడి కుండలో తన అపరిశుభ్రతను కడిగివేసినట్లే, యేసు బాప్తీస్మం నందు విశ్వాసం ఉంచడం ద్వారా మన యొక్క పాపములన్నిటిని ప్రక్షాళన చేసిన తర్వాత, మనం కూడా ఈ సత్యాన్ని ప్రతిరోజూ గుర్తుంచుకోవాలి. ప్రధాన యాజకుడు ఇత్తడి కుండలో తనను తాను శుద్దిచేసుకున్నట్లుగా, మన పాపములన్ని ఇప్పటికే యేసు బాప్తీస్మం ద్వారా శుద్ధి చేయబడ్డాయని ప్రతిరోజూ గుర్తుంచుకోవడం మరియు నమ్మడం ద్వారా మన వ్యక్తిగత పాపములను శుద్దిచేసుకోవాలి, ఎందుకనగా మనం ఈ లోకములో నివసిస్తున్నందున, కొన్ని సందర్భాలలో మనం దాని యొక్క అపవిత్రతకు లోనగుదుము.
మన యొక్క సమస్త పాపములు అనగా మన శరీరాలు, హృదయాలు లేదా ఆలోచనలతో చేసిన పాపములన్నియు లోకపాపములకు చెందినవి. లోకములోని ఈ పాపములన్నిటిని మనం ఏ విశ్వాసంతో శుద్దిచేయబడగలము? యేసు స్వీకరించిన బాప్తిస్మము పై నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే మనం వాటి నుండి శుద్దిచేయబడగలము. యేసు యొక్క బాప్తీస్మం నందు విశ్వాసం ద్వారా ఒకప్పుడు పరిశుద్ధులైన వారు తమ హృదయాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మరియు వారు పాపములు చేసిన ప్రతి సారి, వారిని మరల విశ్వాసంతో శుద్ధిచేయాలి. ప్రతిరోజూ యేసు యొక్క బాప్తీస్మం గుర్తుకు తెచ్చుకుని, విశ్వాసంతో వారి క్రియల యొక్క దుస్తులను ఉదుకు కొనువారు ధన్యులు. బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి ఆయన స్వీకరించిన బాప్తీస్మం ద్వారా మన పాపములన్ని యేసుక్రీస్తుపైకి పంపబడినందున, ఈ సత్యాన్నిగూర్చి ప్రతి రోజు విశ్వసించడం ద్వారా,మన పాపములన్నిటి నుండి శాశ్వతంగా విమోచన పొందవచ్చు. 
బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీ పాపములన్ని ఎల్లప్పుడూ యేసుక్రీస్తు పైకి వెళ్లేలా మీరు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించాలి. ఈ సువార్తను నమ్మడం వలన మీరు కోల్పోయేది ఏదీ లేదు, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు జగత్తుపునాది వేయబడక మునుపే , పాత నిబంధన కాలానికి ముందుగానే దీనిని ప్రణాళిక చేసియున్నాడు. యేసు యొర్దాను నదిలో బాప్తీస్మం పొందడం ద్వారా మీ పాపములన్నిటిని అంగీకరించాడు మరియు సిలువ పైకి వెళ్లడం ద్వారా మీ పాపములన్నిటికై శిక్షించబడ్డాడనే సత్యం మీరు దేవుని నీతిని మరియు మీ యొక్క రక్షణను చేరుకోవడానికి దోహదపడింది. రాజుల రాజు యేసు మనల్ని శాశ్వతంగా పాపం నుండి రక్షించాడని గ్రహించడానికి ఈ సత్యం మిమ్మల్ని అనుమతించింది. మరియు యేసు బాప్తీస్మం యొక్క ఈ స్వచ్ఛమైన నీరు మీ హృదయాలలో కుమ్మరించబడింది, తద్వారా మీ శరీరం మరియు మనస్సాక్షి శుభ్రంగా మరియు సంపూర్ణంగా శుద్దిచేయబడును. ఇక్కడ యేసు యొక్క బాప్తీస్మం యొక్క స్వచ్ఛమైన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను సూచిస్తుంది. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మీ జీవితానికి ఒక అవసరమైన వాక్యం మరియు మీరు దానిని విశ్వసించినప్పుడు అది మరింత అద్భుతంగా ప్రకాశిస్తుంది.
మూడు సంవత్సరాల తన ప్రజా జీవితంలో, సమస్త మానవజాతి యొక్క పాపము నుండి రక్షించడానికి యేసు చేసిన మొదటి పని బాప్తిస్మం తీసుకోవడం. మరో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు మన పాపములన్నిటిని స్వీకరించవలసి వచ్చింది, అలా చేయాలంటే ఆయన బాప్తీస్మం మిచ్చు యోహాను యెదుటకు వెళ్లి అతని ద్వారా బాప్తిస్మం తీసుకోవాలి. కాబట్టి, నాలుగు సువార్తలు ఈ క్లిష్టమైన సంఘటనలు వాటి ప్రారంభంలోనే వ్రాయబడ్డాయి. మీరు దీనిని నమ్ముతున్నారా ?
వాస్తవానికి, మీరు మరియు నేను మన అందరము మన పాపముల నిమిత్తమై చనిపోవుటకు బంధింపబడిన వారము. అయితే ఏం జరిగింది? మన ప్రభువు ఈ భూమిపైకి వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా మన పాపములన్నిటిని స్వీకరించి, దేవుని గొర్రెపిల్లగా మారి, లోకములోని సమస్త పాపములను సిలువపైకి తీసుకొని, మన పాపముల కోసం ఆయన చేతులు మరియు కాళ్ల ద్వారా వ్రేలాడదీయబడి ఆయన హృదయంలో ఉన్న రక్తమంతయు కార్చి , పాతిపెట్టబడి , తిరిగి మృతులలో నుండి లేచాడు. అందుకే యేసు, యోహాను 19:30 లో, ఆయన సిలువ పై తుది శ్వాస తీసుకొని "ఇది సమాప్తమైంది !" అని పలికెను.
యేసు చెప్పినది మరియు చేసిన ప్రతిదీ సత్యమే. మనల్ని రక్షించడానికి యేసు మన కొరకు పాప పరిహారంగా మారి మూడువ రోజు మృతులలో నుండి లేచాడు. మరియు మృతులలో నుండి లేచిన తరువాత, ఆయన నలభై రోజుల పాటు తన పునరుద్ధానము గూర్చి సాక్షమిచ్చి, పరలోకానికి ఎక్కి తండ్రి అయిన దేవుని సింహాసనం యొక్క కుడి పార్శమున కూర్చొని యున్నాడు. ఈ యేసుక్రీస్తు మనల్ని తీసుకెళ్లుటకు మరల ఈ భూమ్మీదకు వచ్చును. యేసు ఈ భూమిపైకి మొదటిసారి వచ్చినప్పుడు రక్షకునిగా వచ్చాడు, కానీ ఆయన రెండవసారి మరల వచ్చినప్పుడు, విశ్వసించని వారందరినీ శిక్షించటానికి న్యాయమూర్తిగా వస్తాడు. యేసుక్రీస్తు తన ముప్పై మూడు సంవత్సరాల జీవితం ద్వారా నీరు, రక్తం మరియు ఆత్మ యొక్క రక్షణను విశ్వసించే వారిని దేవుని బిడ్డలుగా పిలవడానికి మరియు స్వీకరించడానికి న్యాయమూర్తిగా ఈ భూమికి తిరిగి వస్తాడని ఇప్పుడు మీరు గ్రహించాలి. ఈ భూమిపై వెయ్యేళ్ళ రాజ్యం మరియు శాశ్వతమైన పరలోకములో నివసించడానికి నీరు, రక్తం మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మని వారిని అలాగే ఆయన ప్రేమను తిరస్కరించిన వారికి ఆయన శాశ్వతమైన తీర్పును వారిపై అనుమతించబడును. 
ఇప్పుడు, మీరు ఇకపై నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విస్మరించకూడదు మరియు దాని గురించి తెలియదు అని నటించకూడదు, కానీ ఈ రక్షణ యొక్క సత్యాన్ని మీరు నమ్మాలి. ప్రత్యక్షపు గుడార వ్యవస్థ మరియు బలి వ్యవస్థ ద్వారా దేవుడు వాగ్దానం చేసినట్లుగానే, యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి, చేతులు వేయు పద్దతిలో బాప్తిస్మంతీసుకొని, సిలువ వేయబడి విశ్వం యొక్క దాని పాపముల నుండి, ఆయన సమస్త దేశ ప్రజలను కాపాడాడు. మరియు మీరు ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించడం ద్వారా మీ పాపముల నుండి విడుదల పొందుదురు. 
అయినప్పటికీ, ఇశ్రాయేలు దేశం ఇప్పటికీ ఈ సత్యం నుండి వెనుదిరిగింది మరియు మరొక దూత కోసం వేచి ఉంది. కానీ ఇశ్రాయేలీయులు యేసు కొరకు కాకుండా మెస్సీయ కోసం ఎంత తీవ్రంగా ఎదురుచూస్తున్నా, యేసు క్రీస్తును తప్ప మెస్సయ్య మరొకరు లేరని గ్రహించాలి. ఈ భూమిపై యేసు తప్ప మరే మెస్సీయా లేడు అనేది స్పష్టమైన సత్యం, మరియు ఈ సత్యం విషయానికి వస్తే ఇశ్రాయేలు ప్రజలు కూడా నియమానికి మినహాయింపు కాదు, లేదా వారికి వేరే రక్షకుడు కూడా లేడు. అందువల్ల, ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా విశ్వసించనందుకు చేసిన పాపం నుండి పశ్చాత్తాపపడాలి, మరియు యేసు క్రీస్తు నిజంగానే వారి నిజమైన మెస్సీయా అని వారు నమ్మాలి మరియు దీనిని తప్పుపట్టలేని సత్యంగా అంగీకరించాలి. యేసు క్రీస్తు రాబోయే రక్షకుడని మరోసారి ధృవీకరించడం మరియు నమ్మడం ద్వారా, ఇశ్రాయేలుదేశం నిజమైన, ఆధ్యాత్మికంగా ఎన్నుకోబడిన దేవుని దేశంగా మారాలి.
ఇప్పుడు కూడా, ఇశ్రాయేలు ప్రజలు ఈ ప్రపంచంలోని శ్రమలు మరియు కష్టాల నుండి వారిని రక్షించగల గంభీరమైన, సమర్ధవంతమైన మరియు శక్తివంతమైన మెసయ్య కోసం ఎదురుచూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఈ భూమిపైకి మెస్సయ్యగా ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి వచ్చి వారి పాపములన్నిటి బట్టి అగ్ని వలన కలుగు తీర్పులోనికి వారిని వెళ్లకుండా రక్షించాడు. అందువల్ల, వారు ఈ సత్యాన్ని అంగీకరించాలి మరియు దానిని విశ్వసించాలి. వారి ఆత్మల కొరకు, పాత నిబంధనలో వాగ్దానం చేసినట్లుగా, యేసు స్వయంగా ఈ భూమిపైకి వచ్చాడు, వారి పాపం కొరకు త్యాగం చేయబడి వారి పాపముల నుండి వారిని శాశ్వతంగా రక్షించి వారిని దేవుని స్వంత ప్రజలుగా చేశాడు.
యేసుక్రీస్తు రక్షకునిగా వచ్చి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మనందరినీ రక్షించాడు, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారలో సత్యం కనిపిస్తుంది. మరియు దీనిని నమ్ము వారు ఆయనతో పాటు వేయ్యేండ్లు రాజ్యములోపరిపాలించడానికి ఆయన వారికి అవకాశం కలిగించును. దీని తరువాత, ఆయన వారిని నిత్యమైన దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి మరియు సంతోషంగాదేవుని మహిమలో శాశ్వతంగా జీవించడానికి కూడా అనుమతించును. అందువల్ల, మనం ఈ భూమిపై ఉన్నప్పుడు, మనమందరం మన హృదయాలతో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించాలి మరియు దేవుని స్వంత బిడ్డలుగా మారాలి. ఈ సత్య సువార్తను విశ్వసించే వారు మాత్రమే దేవుని యొక్క పాప రహిత పిల్లలు కాగలరు తదుపరి ప్రపంచంలో వారు ఎదురుచూసే సమస్త ఆశీర్వాదాలను అందుకొను హామీ వారికి ఇవ్వబడింది.
హల్లెలూయా! పరలోకం యొక్క ఆధ్యాత్మిక దీవెనలు మనకు ఇచ్చినందుకు విశ్వాసంతో నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన త్వరలో తిరిగి వచ్చునని మన ప్రభువు వాగ్దానం చేశాడు. కావున, రండి, ప్రభూ!