(నిర్గమకాండము 28: 1-14)
"మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈ తామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము. పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను. రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజ ఖండములు దాని కుండవలెను; అట్లు అది సమకూర్పబడి యుండును. మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీల ధూమ్రరక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను. మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమిబంగారుతో రెండుగొలుసులను చేయవలెను;సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.
ఇప్పుడు మనము ప్రధాన యాజకుని వస్త్రాలకు ఉపయోగించే పదార్థాలపై మన దృష్టిని మలుపుదామం. ప్రధాన యాజకుడు ధరించే వస్త్రాలలో ఏఫోదు ఒక ప్రత్యేకమైన వస్తువు. ఈ ఏఫోదు బంగారం, నీలం,ఊదా,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో నేయబడింది. ప్రధానయాజకుడు యొక్క పరిశుద్ధ వస్త్రములను ఒక చిత్రకారుని పనిగా ఈ ఐదు రకములు దారములను ఎంతో నైపుణ్యముగా అల్లిక చేశాడు.
పరిశుద్ధగ్రంథములో పేర్కొన్న బంగారు దారం నిజమైన విశ్వాసం గురించి మాట్లాడుతుంది. ప్రధాన యాజకుని వస్త్రాలకు ఉపయోగించే నీలిరంగు దారం మానవజాతి పాపములను స్వీకరించడానికి యేసుక్రీస్తు బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి స్వీకరించిన బాప్తిస్మమమును సూచిస్తుంది (మత్తయి 3:15). ఊదా దారము రాజుల రాజు గురించి మాట్లాడుతుంది, మరియు రక్తవర్ణముగల దారం యేసుక్రీస్తు మానవజాతి పాపముల కొరకు శిక్షించబడిన త్యాగం గురించి మాట్లాడుతుంది. ప్రధాన యాజకుని దుస్తులు కోసం ఉపయోగించే తెల్లటి నార నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో అందరి పాపములను తొలగించిన దేవుని నీతిని తెలుపుతుంది.
ప్రధాన యాజకులు విధుల నిర్వహణలో, దేవునికి నైవేద్యం అర్పించటం చాలా ముఖ్యమైనది. బలి వ్యవస్థకు అనుగుణంగా దేవునికి బలులు అర్పించే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడం ద్వారా, ప్రధాన యాజకుడు దేవునికి సేవ చేయడమే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు యొక్క పాపముల నుండి విమోచన పొందడానికి అతను సహాయం చేయును. ప్రధాన యాజకుని యొక్క అన్ని విధులలో మొదటిది మరియు ప్రధానమైనది దేవునికి సేవ చేయడానికి మరియు ఆరాదించటానికి నైవేద్యాలు అర్పించుటయో నని మనం గుర్తుంచుకోవాలి.
ఈ విషయాన్ని నిరూపించడానికి, నిర్గమాకాండము 32 లో చెప్పినట్లుగా ఒక సంఘటనను మీకు ప్రస్తావిస్తాను. పది ఆజ్ఞలను స్వీకరించడానికి మోసే సీనాయి పర్వతాన్ని ఎక్కినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు, పర్వతం నుండి క్రిందికి రావడంలో మోసే ఆలస్యం అవుతున్నట్లు చూసి, అహరోనుతో ఇలా అన్నారు,“మాషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. (నిర్గమ 32: 1) ”అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారుఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి!(నిర్గమ 32: 4) ”ఇది చూసి, అహరోను దూడకు ముందు ఒక బలిపీఠం కట్టి, మరుసటి రోజు యెహోవా దేవునికి విందుగా ప్రకటించాడు.
మరుసటి రోజు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దహన బలులు అర్పించారు మరియు సమాధాన బలిని తీసుకువచ్చారు; వారు తినడానికి మరియు త్రాగడానికి కూర్చున్నారు, మరియు ఆడటానికి లేచారు. ఇది దేవుని ముందు గొప్ప పాపంగా మారింది, ఇశ్రాయేలు ప్రజలు ఆయన యొక్క తీవ్రమైన తీర్పును అనుభవించేలా చేసుకున్నారు. ఈ సంఘటనను మనం గుర్తుంచుకోవాలి. ప్రధాన యాజకుడైన అహరోను కూడా ఒక ప్రక్కన బలహీనతను కలిగి ఉన్నాడు, అయితే, అతను దేవుని చిత్తానికి కట్టుబడి ఉండవలసిన వాడు, దేవునికి సేవ చేయడం ప్రధాన యాజకునిగా తన అతి ముఖ్యమైన విధి అని మర్చిపోకూడదు. కానీ అహరోను ప్రధాన యాజకునిగా తన విధులకు నమ్మకంగా ఉండడంలో విఫలమయ్యాడు. ప్రధాన యాజకుని యొక్క విధులను నిర్వహించడానికి, అతను తన ప్రజలు తనను అనుసరించినా లేదా అనుసరించకపోయినా, దేవుడు స్థాపించిన బలి వ్యవస్థకు అనుగుణంగా అతను దహన బలులు అర్పించాలి మరియు సమాధాన సమర్పణలు తీసుకరావలసి ఉన్నది.
క్లుప్తంగా, అహరోను ప్రధాన యాజకుడు దేవునికి మాత్రమే సేవ చేయాలి. ఈ విధంగా, ఈ రోజుల్లో పాస్టర్‌లు తరచుగా ప్రజల కోసం మాత్రమే పని చేస్తారు, దేవుడి కోసం కాదు. ఈనాటి ఆధునిక యాజకులు చాలా మంది అలాంటి తప్పుడు ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారనుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. అయినను నేను ఎక్కువగా భయపడలేదు, ఎందుకంటే సరైన యాజకులు ఇప్పటికీ వారి మధ్య కనిపిస్తారు. ప్రజల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి, బలి వ్యవస్థ ప్రకారం క్రమంగా దేవునికి నైవేద్యాలు ఇవ్వడానికి యాజకులు తమ బాధ్యతను నెరవేర్చాలి.
దేవుడు మోషేతో చెప్పే ఈ వాక్యానికి మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి, "మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము."(నిర్గమ 28:1).దేవుడు ప్రధాన యాజకుడు యొక్క వస్త్రాలను దేవుడు అహరోనుకు ధరింపచేసాడు. ఈరోజు పరిచర్య చేస్తున్న ప్రతి యాజకుడు దీనిని మర్చిపోకూడదు: ప్రధాన యాజకుడు యొక్క వస్త్రములు బంగారం, నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో తయారు చేయబడ్డాయి.
ప్రధాన యాజకుని యొక్క విధులు నెరవేర్చుటకు
ప్రాయశ్చిత్తపు రోజున, సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీయుల పాపములను పరిహరించడానికి, ప్రధాన యాజకుడు బలి పశువు యొక్క తల మీద చేతులు వేసి, వారి పాపములు బలి అర్పణ పైకి పంపించి దాని రక్తమును తీసి, ఆపై దానిని దహన బలిపీఠం మీద చిలకరించి తరువాత కరుణాపీఠము ముందుర చిలకరించవలెను. అదేవిధంగా, పరలోకానికి నిజమైన ప్రధానయాజకుడైన యేసు ఈ భూమ్మీదకు వచ్చి , బాప్తీస్మం తీసుకున్నాడు, దాని ద్వారా ఆయన మానవజాతి పాపములను స్వీకరించి, ఆయన రక్తం చిందించి సిలువపై మరణించి, తిరిగి మృతులలో నుండి లేచాడు, తద్వారా నమ్మిన వారి కొరకు ఆయన రక్షణ యొక్క విజయాన్ని తీసుకురావటం జరిగింది.
దేవుని యొక్క ప్రధాన యాజకునిగా సేవ చేస్తున్నప్పుడు, అహరోను బంగారం, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో చేసిన "ఏఫోదు" అనే విచిత్రమైన దుస్తులను ధరించవలసి వచ్చింది. ప్రధాన యాజకుని యొక్క ఈ వస్త్రంతో, పాపం నుండి విమోచించబడుటకు మనం మన యొక్క సమర్పణలను ఎలా ఇవ్వాలో దేవుడు మనకు బోధిస్తున్నాడు. బంగారం, నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు ప్రధాన యాజనుకుని యొక్క వస్త్రాల కోసం ఉపయోగించిన సన్నని పేనిన నారతో ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించడానికి, దేవుని యొక్క నీతి మరియు ఆయన ప్రేమ ద్వారా నెరవేర్చబడిన పాపము యొక్క విమోచనను మనం తెలుసుకోవాలి.
ప్రధాన యాజకుని వస్త్రాల కోసం ఉపయోగించే ఐదు రకాల దారముల ద్వారా, దేవుడు జగత్తుపునాదికి ముందే యేసుక్రీస్తులో శాశ్వతమైన పాప పరిహారాన్ని స్థాపించాడని మనకు చూపించాడు (ఎఫెసీ 1: 4). అందుచేత, మనము యాజకుల విధులను చక్కగా నిర్వర్తించాలంటే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో ఉన్నపాపమును శుద్ధిచేయు రహస్యాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి మరియు దానిని విశ్వసించాలి. ఇది యేసుక్రీస్తులో మన కోసం తండ్రియైన దేవుడు స్థాపించిన రక్షణకు ముందుగా నిర్ణయించబడిన ప్రణాళిక.
ప్రధాన యాజకుడు తన యాజక విధులను చక్కగా నెరవేర్చడానికి అతను దేవునికి క్రమముగా నైవేద్యాలు అర్పించవలసి వచ్చింది -అనగా , తన ప్రజల పాప విమోచన కోసం, ఆయన బలిపశువు యొక్క తలపై తన చేతులను వేసి, వారి పాపములను క్రమముగా దాని మీదకు పంపవలసి వచ్చింది బలి వ్యవస్థ ప్రకారం. ప్రాయశ్చిత్తం రోజున, ప్రధాన యాజకుడు బలిపశువు తలపై చేతులు వేసి, దాని రక్తం తీయుటకు దాని గొంతు కోయును. ఈ చేతులు వేయడం ద్వారా, ఇశ్రాయేలీయుల వార్షిక పాపుములన్ని బలి అర్పణకు మీదకు పంపబడ్డాయి. మరియు దాని రక్తం చిందించడం ద్వారా, వారి పాపములన్ని ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి. అప్పుడు అతను ఈ బలిని పూర్తి చేయడానికి దాని రక్తాన్ని చల్లి దాని మాంసాన్ని కాల్చును. అతను ఆవిధంగా తన ప్రజల యొక్క పాప విమోచన కోసం ఈ బలిని అర్పించును.
మనం ఈ విషయంపై ఇక్కడ చాలా శ్రద్ధ వహించాలి: ప్రధాన యాజకుడు తన ప్రజల యొక్క పాపములను అగ్నితో కాల్చడానికి ముందే వారి పాపములు బలి అర్పణ మీదకు పంపించబడెను తద్వారా వారి పాప విమోచన చేతులు వేయడం ద్వారా మరియు నైవేద్యం యొక్క రక్తం చిందించడం నెరవేరుతుందని బోధించవలసి వచ్చింది.ఇది ప్రతి ప్రధాన యాజకుని యొక్క గొప్ప విధి. ప్రధానయాజకుడు సత్యాన్ని రక్షించాల్సిన వ్యక్తి. మరో మాటలో చెప్పాలంటే, అతను నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క నమ్మకమైన సంరక్షకుడిగా ఉండాలి. ప్రధాన యాజకుడు కూడా ఇశ్రాయేలీయులలో సాధారణ ప్రజలలాగే బలహీనమైన మానవుడే అయినప్పటికీ, బలి వ్యవస్థలో వ్యక్తీకరించబడిన సత్యాన్ని విశ్వసించడం ద్వారా మరియు దేవుని కోసం నైవేద్యాలను అర్పించటం, ద్వారా, అతను తన ప్రజల యొక్క పాప విమోచనను పొందగలిగాడు. అదే విధంగా, మనం తగినంత జీవులం కానప్పటికీ, పరలోక ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనకు చేసిన దానిని విశ్వసించడం ద్వారా మరియు మన పాప విమోచనను స్వీకరించడం ద్వారా, మనం దేవునితో నడవగలుగుతున్నాము.
ప్రత్యక్షపు గుడార వ్యవస్థలో వెల్లడి చేయబడిన ఈ బలి వ్యవస్థ దేవుని నుండి వచ్చిన రక్షణ యొక్క జ్ఞానం. పాపం నుండి మనల్ని రక్షించిన దేవుని యొక్క జ్ఞానం బంగారం, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణము గల దారం మరియు ప్రధాన యాజకుని వస్త్రాలకు ఉపయోగించే సన్నని పేనిన నారతో ఉంటుంది. ప్రధాన యాజకుడు తన విధులను విజయవంతంగా నెరవేర్చాలంటే, దేవుడు నిర్దేశించిన బలి వ్యవస్థ ద్వారా మానవజాతిని పాప రహితంగామార్చే ఏకైక సమర్థవంతమైన మార్గమని ఆయన బోధించాలి.మనము,నేటి రాజులైనా యాజకులుగా ఎల్లప్పుడును సత్యమును గూర్చిన సాక్షమివ్వవలెను (1పేతురు 2: 9), అది యేసు ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం పొందడం ద్వారా లోకములోని పాపములను ఒకసారి స్వీకరించి, ఆయన రక్తాన్ని చిందించి మన స్థానములో మరణించి, పాతిపెట్టబడి మన కొరకు మృతుల నుండి లేపబడ్డారు.
మనుషులు తమ పాపములను స్వయంగా తొలగించుకోగలరా? ఈ లోకములోని మతాలు మానవజాతి యొక్క పాపమును పోగొట్టగలవా? మన పాపములు తొలగిపోవుట అనేది మనకు ప్రధాన యాజకుడు నేర్పించిన యేసు బాప్తీస్మం మరియు ఆయన రక్తం ద్వారా సిద్ధపరచబడిన రక్షణ యొక్క సత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని చేత స్థాపించబడిన రక్షణ యొక్క సువార్త ద్వారా మాత్రమే మన పాపములన్నియు విమోచించబడగలవు. మానవజాతి పాపములను పరిహరించడం అనేది పరలోకానికి శాశ్విత ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే, దేవుడైన యేసుక్రీస్తు స్వయంగా మనిషిగా ఈ భూమ్మీదకు వచ్చి బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొందడం ద్వారా మన పాపములన్నిటిని స్వీకరించాడు కాబట్టి, ఆయన తన దోషములన్నిటిని శుద్దిచేయడానికి సిలువపై తన రక్తాన్ని చిందించగలడు.మనం పాపాత్ములం. ప్రభువు బాప్తీస్మం ద్వారా మన పాపములన్నిటిని తన భుజాన వేసుకొనియున్నాడు కావున, సిలువ వేయబడటం, ఆయన రక్తాన్ని చిందించడం మరియు సిలువ పై మరణించడం ద్వారా మన పాపములన్నిటికకై శిక్షను భరించాడు. మరియు ఆయన ఈ నీతిమంతమైన కార్యం ద్వారా పాపం నుండి మానవజాతియొక్క రక్షణను పూర్తి చేసాడు (రోమా 5:18). ఇది యేసు మన కొరకు సాధించినది కాకపోతే, మనం ఎన్నటికీ రక్షింపబడలేము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యంతో మన పాపములన్నిటిని పూర్తిగా శుద్ధి చేయడం ద్వారా పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా చేసిన పరలోకపు ఈ ప్రధాన యాజకుడు యేసు క్రీస్తు తప్ప మరెవరో కాదు.
పరలోకపు ఆధ్యాత్మిక ప్రధాన యాజకునికి మన పాప విమోచన కోసం ముందుగా నిర్ణయించిన తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక గురించి తెలుసు. అందుకే దేవుడు చెప్పాడు,"నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను."(ప్రకటన 22:13). ఆదియు మరియు అంతము గురించి తన పరిపూర్ణ జ్ఞానంతో, బలి వ్యవస్థలో చూపిన వాగ్దానాల ప్రకారం ప్రభువు మన యొక్క రక్షణను నెరవేర్చాడు. మన పాపములు మరియు బలహీనతల కోసం మనం ఎప్పటికీ శిక్షించబడకుండ మరియు నాశనం చేయబడకుండా ఆయన దానిని సాధ్యపరిచాడు. పరలోకం యొక్క ప్రధాన యాజకుడు మన కోసం ఏమి చేసాడు -అంటే, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మానవజాతి పాపములను స్వీకరించి ఆయన రక్తం చిందించి వాటిని శుద్దిచేయడంద్వారా, ఆయన మన కొరకు పరిపూర్ణమైనరక్షణను పూర్తి చేశాడు. దేవుని జ్ఞానం మానవులందరికీ వారి పాపము నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది నీలం, ఊదా మరియు ధూమ్ర రక్త వర్ణము గల దారం మరియు సన్నని పేనిన నారతో నెరవేరింది. యేసుక్రీస్తులో,తండ్రియైన దేవుడు నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారములో దాగి ఉన్న సత్యంతో పాపముల యొక్క శాశ్వత విమోచనను ప్రణాళిక చేశాడు మరియు ఈ సత్యంలో విశ్వాసులందరికీ, ఆయన ఈ పరిపూర్ణమైన రక్షణను అనుమతించాడు.
ప్రధాన యాజకుని ఏఫోదు యొక్కనడికట్టు
ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలలో ఏఫోదు కోసం ఒక నడికట్టు ఉంది. ఈ నడికట్టు , ప్రధాన యాజకుడు తన ఏఫోదు కోసం ధరించే నడుము పట్టీ కూడా బంగారం, నీలం, ఊదా, మరియురక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో తయారు చేయబడింది. నడికట్టు సాధారణంగా "బలాన్ని" సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార ద్వారా వచ్చిన రక్షణను విశ్వసించే విశ్వాసం మన పాపముల నుండి మనల్ని రక్షించే శక్తిని కలిగి ఉందని మనకు చెబుతుంది. నీరు మరియు ఆత్మ యొక్క నిజమైన సువార్త మాత్రమే విశ్వసించే ప్రతి ఒక్కరినీ రక్షించే దేవుని యొక్క శక్తిని కలిగి ఉంది (రోమా 1:16). కాబట్టి, నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో ఇక్కడ చూపబడినవి కాకుండా ఇతర అబద్ద -సువార్తలను నమ్మడం వ్యర్థమైన వ్యాయామం.
అనేక లోపాలను కలిగి ఉన్నవారు కూడా ప్రభువు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తను విశ్వసించడం ద్వారా సమస్త పాపములు నుండి వారు సంపూర్ణంగా శుద్దిచేయబడుదురు, ఎందుకంటే దేవుని ద్వారా నేవేర్చబడిన ఈ పాప విమోచన యొక్క సత్యం ద్వారా లోకములోని పాపములన్నియు యేసుక్రీస్తుపైకి వెళ్లాయి. (మత్తయి 3: 15-17; లేవీ 16: 1-22). అందువల్ల, నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారంలో వ్యక్తీకరించబడిన యేసు యొక్క ఈ నీతియుక్తమైన కార్యములు తమను రక్షించాయని విశ్వసించే వారు తమ శరీరము యొక్క సంకల్పము యొక్క శక్తి చాలా బలహీనంగా ఉన్నప్పటికీ భరోసా పొందవచ్చు. మనం నీటి సువార్తలో పరలోకపు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించిన ఆత్మలో నివసించినప్పుడు, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు ? నీలం, ఊదా మరియు రక్తవర్ణముగలదారం మరియు సన్నని పేనిన నారలో వెల్లడి చేయబడిన సత్యాన్ని విశ్వసించే మన విశ్వాసం ద్వారా దేవుని యొక్క రక్షణ పూర్తయింది.
యాజకులు తమ యాజక విధులను నిర్వర్తించడానికి, ప్రత్యక్షపు గుడారంలో స్పష్టంగా చూపిన బలి వ్యవస్థను పాటించని తప్పుడు సువార్తలను బోధించే వారు, తమ ప్రసంగాలు ఎంత స్పష్టంగా చెప్పినా, ఎవరికీ ఎలాంటి సహాయం అందించలేరు ఎందుకంటే వారు దేవుని నిజమైన సువార్త గుడారంలో వ్యక్తమయ్యే ఆత్మ యొక్క సాక్ష్యాలను కలిగి ఉండరు. అందువల్ల, వారు కేవలం మోసగాళ్ళు మరియు జీతాలు తీసుకునేవారు. పరలోకపు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును మన రక్షకునిగా విశ్వసించు విషయానికి వస్తే, ప్రత్యక్షపు గుడార వ్యవస్థలో వ్యక్తీకరించబడిన చేతులు వేయు విధానం మరియు రక్తాన్ని చిందించే బలి విధానాన్ని మనం గుర్తించకుండా ఉండలేము.ఈ ప్రపంచంలో చాలా అబద్ద సువార్తలు ఉన్నాయని మనం గ్రహించాలి. అలాగే, బోధకుడు ఎవరైనప్పటికీ, బోధకుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని బోధిస్తున్నట్లయితే, మనం అతని లేదా ఆమె బోధనలన్నింటినీ వినాలి మరియు అంగీకరించాలి.
ఏఫోదు మరియు దాని నడికట్టు కోసం ఉపయోగించే ఐదు పదార్థాలు మన నిజమైన రక్షణను సూచిస్తాయి. పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన బలి విధానం ప్రకారం ఖచ్చితంగా అర్పించినప్పుడు పాపులకు పాప విమోచన కలిగించే బలి అర్పణను వ్యక్తపరిచే పదార్థాలు అవి, మరియు ఇందులో ప్రధానంగా చేతులు వేయడం మరియు రక్తం చిందించడం వంటివి ఉంటాయి.ఈ పదార్థాలు చివరికి యేసు యొక్క బాప్తీస్మం మరియు ఆయనరక్తాన్ని చిందించడం ద్వారా కొత్తనిబంధనలో వ్యక్తమయ్యాయి; యేసు ఈ విధంగా నమ్మిన వారికి పాప విమోచన యొక్క రక్షణను తీసుకువచ్చాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తనుఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తారో వారు పాప విమోచనను మరియు శాశ్వత జీవితాన్ని పొందుదురు. ఈ సత్యం నిజంగా జన్మించిన ప్రతి ఒక్కరికీ చెప్పబడింది, వారికి నేటి ప్రధాన యాజకుల యొక్క బాధ్యతలు అప్పగించబడ్డాయి.
భూసంబంధమైన ప్రధాన యాజకుడు బలి అర్పణ తలపై చేతులు వేయడం ద్వారా తన ప్రజల పాపములను ఆమోదించాడు; అతను దాని గొంతు కోసి దాని రక్తం తీసి, కరుణా పీఠంపై చిలకరించాడు తద్వారా దేవుని యెదుట నిజమైన సువార్తను రక్షించే తన యాజక విధులను నెరవేర్చాడు. కానీ పరలోకం యొక్క ప్రధాన యాజకుడు తన స్వంత శరీరంపై లోకములోని పాపములను తీసుకోవడానికి బాప్తిస్మం తీసుకున్నవాడు ;ఆయన తన శరీరాన్ని, సిలువపై తన రక్తాన్ని చిందించి తిరిగి మృతులలో నుండి లేవడం ద్వారా తన ప్రజల యొక్క పాపములన్నిటిని పూర్తిగా తొలగించాడు. అలా చేయడం ద్వారా, ఆయన తన ప్రజలైన వారి పాపములను పరిహరించేలా చేసి దాని నెరవేర్పుగా దేవుని యొక్క రక్షణను తీసుకువచ్చాడు. నేడు, యేసు శిష్యులు ఈ సువార్తను వ్యాప్తి చేసినప్పుడే, యేసుక్రీస్తు మానవాళి యొక్క సమస్త పాపములను నిర్మూలించటం వలన వారు తమ యాజక విధులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
నేడు క్రైస్తవ మతం చాలా సమస్యలను కలిగి ఉండటానికి ఒక కారణం ఏమిటనగా, సమాజాలలో చాలా మంది ఆధ్యాత్మిక మోసగాళ్ళు ఉన్నారు, వారికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త తెలియకపోయినా వారి యాజక విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారని చెప్పుకుంటారు. దేవుని ముందు నిజమైన యాజకులుగా మారడానికి మార్గం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం. ఈ విశ్వాసం ఉన్నవారు మాత్రమే దేవునికి సరైన పాప పరిహారం అర్పించగలరు మరియు ఇతరులను వాస్తవంగా ప్రేమిచుదురు. దేవుని యొక్క సంఘం దేని కోసం ఉందని మీరు అనుకుంటున్నారు? పాపులకు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను వ్యాప్తి చేయడానికి దేవుని యొక్క సంఘం ఉందని నేను మీకు చెప్పగలను. దేవునికి సేవ చేయడం మరియు ఆయన పోలికలో సృష్టించబడిన సమస్త ఆత్మలను ఈ విధంగా ప్రేమించుటకు.
ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తెలుసుకోవాలి
ప్రపంచవ్యాప్తంగా ఉన్ననేటి క్రైస్తవ మతం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను తెలుసుకోవాలి. అది మన ప్రభువు చెప్పాడు,"మీరు లోకమునకు ఉప్పయి యున్నారు....మీరులోకమునకు వెలుగైయున్నారు(మత్తయి 5:1314).”నీరుమరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనం నిజమైన వెలుగు మరియు ప్రపంచంలోని ఆధ్యాత్మిక ఉప్పైయున్నాము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ఎరిగిన వారు మరియు విశ్వసించే వారు ఆధ్యాత్మిక యాజకులై, ప్రజలకు ప్రయోజనాలను తెచ్చువారు అలాగే వారిని పాప విమోచన పొందేలా చేయు వారు. కానీ, మరోవైపు, ఈ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త తమకు తెలియనప్పటికీ, తమ యాజక విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పుకునే పాస్టర్లు కేవలం జీతాలు తీసుకునేవారని చెప్పక తప్పదు. జీతానికి మాత్రమే తమ యాజక విధులను నిర్వర్తించే వారు ప్రజలను నామమాత్రపు క్రైస్తవులుగా చేయగలరు, కానీ వారు తమను అనుసరించు వారిలో కనిపించే పాపములను శుద్దిచేయలేరు.
నిజమైన యాజకులు వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడిన వారు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా దేవుని యెదుట పాపం లేకుండా నిలుచువారు. వారికి వారి యాజక విధులను నిర్వర్తించటం ద్వారా ఆయన ప్రజల పాపములన్నిటి శుద్ధిచేయు చట్టపరమైన బలి అర్పణను అందించడం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని వారి సమస్త పాపముల నుండి శుద్ధిచేయును. అటువంటి యాజకులు ద్వారానే దేవుడు మానవాళికి తన రక్షణకు సంబంధించిన పనులను తెలుసుకోవడానికి, వాటిని విశ్వసించడానికి, ఆయన వద్దకు తిరిగి వచ్చి నీతివంతమైన జీవితాలను గడపడానికి వీలు కల్పించాడు.నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం యొక్క మర్మమును ప్రతిఒక్కరూ గ్రహించేలా ఈ సత్యాన్ని వ్యాప్తి చేసే బాధ్యత మరియు కర్తవ్యం యాజకులకు ఉంది, అందువల్ల, ఆధ్యాత్మిక యాజకుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వలె చాలా ముఖ్యమైన వాడు.
దేవుడు మనకు ఆధ్యాత్మిక యాజకత్వాన్ని శక్తివంతంగా నెరవేర్చడానికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యాన్ని యిచ్చియున్నాడు.నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో వ్యక్తం చేయబడిన నిజమైన సువార్తను విశ్వసించే ఈ విశ్వాసాన్ని (బంగారు దారమును ) ఇచ్చినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ప్రధాన యాజకుడు ధరించిన వస్త్రాలను మనం అధ్యయనం చేసినప్పుడు,మానవజాతి యొక్క పాప విమోచన ఎలా నెరవేరిందో మనం తెలుసుకోవచ్చు. ప్రధాన యాజకుని వస్త్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాత, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త స్ఫటికం వలె స్పష్టంగా కనిపిస్తుంది. లోక పాపము నుండి దేవుడు మానవజాతిని రక్షించాడని అబద్దాల ద్వారా ప్రచారం చేయబడిన తప్పుడు సువార్తల ద్వారా కాదు. బదులుగా,దేవుడు జగత్తుపునాది వేయబడక మునుపే యేసుక్రీస్తులో పాపం నుండి మన రక్షణను సిద్ధం చేసాడు.అది యేసు బాప్తీస్మం మరియు రక్తం ద్వారా ఈ ప్రణాళికను ఖచ్చితంగా నెరవేర్చాడు.
ప్రధాన యాజకుని దుస్తులలో, నైపుణ్యంగా పేనిన అంగీయు మరియు నార యొక్క నిలువ టంగీ కూడా ఉన్నాయి. మనము కూడా లోదుస్తులను ధరిస్తాము, అయితే ప్రధానయాజకుడు యొక్క ఈ వస్త్రాలు మనం ధరించే లోదుస్తులకు భిన్నంగా ఉంటాయి. ప్రధాన యాజకుని యొక్క అంగీ మోకాలి వరకు విస్తరించిన పొడవాటి వస్త్రం. అది చక్కటి నార దారంతో అల్లినందున, గాలి స్వేచ్ఛగా ప్రసరించే అవకాశం ఉంది. యాజకులు దహన బలులు అర్పించినప్పుడు, వాటిని దహన బలిపీఠం మీద దహనం చేయడానికి వాటిని సమర్పించాలి. ఈ బలిపీఠం సాపేక్షంగా ఎత్తైనది, అందుచేత ప్రధాన యాజకుని శరీరం యొక్క దిగువ భాగం దహనబలి బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు శరీరము బహిర్గతంగా కనబడును. కాబట్టి, ప్రధాన యాజకుడు అతిక్రమములకు గురై చనిపోకుండా ఉండేలా, అతని శరీరం యొక్క దిగువ భాగాన్ని పూర్తిగా కప్పడానికి ఒక అంగీ మరియు నార యొక్క నిలువ టంగీ చేయమని దేవుడు మోషేను ఆదేశించాడు.
ప్రధాన యాజకుని దుస్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయి? అతని ఛాతీపై ఉంచబడిన న్యాయ విధాన పతకము దానిపై ఉంచబడిన పన్నెండు విలువైన రాళ్లతో మెరుస్తుంది మరియు భుజం పట్టీలు కూడా విలువైన రాళ్లను కలిగి ఉన్నాయి. న్యాయ విధాన పతకము భుజం పట్టీలకు అల్లిన త్రాడుల వలె తయారు చేసిన రెండు స్వచ్ఛమైన బంగారు గొలుసులతో బిగించబడింది మరియు అది ఏఫోదు నుండి వదులుగా రాకుండా ఏఫోదు యొక్క నడికట్టుగా కట్టుబడి ఉంది. కాబట్టి ప్రధాన యాజకుడు నడిచినప్పుడు, స్వచ్ఛమైన బంగారుతో అల్లిన ఈ త్రాడులు అటూ ఇటూ ఊగుతూ మెరుస్తున్నాయి. అంతేకాక, న్యాయ విధాన పతకముపై ఉన్న పన్నెండు విలువైన రాళ్ళు కూడా అబ్బురపరిచాయి, రెండు భుజాల పట్టీలపై ఉంచిన పెద్ద విలువైన రాళ్ళు కూడా మెరుస్తున్నాయి, మరియు సన్నని నారతో చేసిన తలపాగాపై వేలాడదీసిన బంగారు పళ్ళెంతో నుదిట కూడా బంగారంతో మెరియును.
ప్రత్యక్షపు గుడారంలో ఎంత బంగారం ఉంది? దాని పలకలన్నియు బంగారంతో పొదిగించబడ్డాయి, కరుణాపీఠం, దీపస్తంభం, సన్నిధి రొట్టెల బల్ల, అలా పరిశుద్ధ స్థలంలోని అనేక పాత్రలు బంగారంతో చేయబడ్డాయి. ప్రత్యక్షపు గుడారం అనునది అద్భుతమైనది. అదే విధంగా, మనం యేసుక్రీస్తు ఆధిపత్యంలోకి ప్రవేశించినప్పుడు, ఈ రాజ్యం ఎంత అద్భుతమైనదో మనం గ్రహించవచ్చు. బయటి నుండి చూసినప్పుడు, ప్రత్యక్షపు గుడారం అంత ఆకట్టుకునేలా అనిపించకపోవచ్చు, కానీ దాని కోసం ఉపయోగించిన బంగారం గురించి తెలిసిన వారు ఎవరైనా ఈ బంగారం యొక్క మొత్తం బరువు ఒక టన్నుకు పైగా ఉంటుందని గమనించగలరు.ప్రత్యక్షపు గుడారానికి ఉపయోగించిన మొత్తం బంగారం నూట పదహారుమణుగుల ఐదువందల ముప్పది తులములు మరియు నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు. (నిర్గమ 38:24) మరియు మనం దీనిని నేటి కొలతలో లెక్కించినప్పుడు అది ఒక టన్ను దాదాపుగా ఉంటుంది, ఎందుకంటే ఒక తులము (= 3000 షెకెల్స్) 42 కిలోగ్రాముల బరువు.
బంగారం, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో చేయబడిన విశ్వాసపు వస్త్రాలను మీరు సిద్ధం చేసియున్నారా? ఇక్కడ బంగారు దారం విశ్వాసాన్ని సూచిస్తుంది; నీలిరంగు దారం యేసు స్వీకరించిన బాప్తిస్మమును సూచిస్తుంది; ఊదారంగు దారం యేసు యొక్క దైవత్వాన్ని దేవునిగా సూచిస్తుంది; రక్తవర్ణము గల దారం యేసు క్రీస్తు తన బాప్తిస్మముతో మన పాపములన్నిటిని తీసుకొనెను కావున ఆయన తన విలువైన రక్తాన్ని సిలువపై చిందించవలసి వచ్చింది; మరియు సన్నని పేనిన నార దేవుని నీతిని వెల్లడించే దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతుంది. ఈ విధంగా, నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు ఉపయోగించబడినవి మరియు ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు దేవుడు మన పాపములన్నిటి శుద్దిచేసినది చెప్పును.
ఈ సత్యం యొక్క విశ్వాసంతో మనం దేవుని యెదుటకు వచ్చినప్పుడు,మన పాపములన్నిటికి విమోచన లభిస్తుంది
మనము దేవుని యెదుటకు వచ్చినప్పుడు, నీలం, ఊదా, మరియు రక్తవర్ణము గల దారం మరియు ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలలో మరియు ప్రత్యక్షపు గుడారపు ద్వారములో కనిపించే సన్నని పేనిన నారలో ఉండే రక్షణ యొక్క సత్యాన్ని విశ్వసించే విశ్వాసం మనకు ఉండాలి. ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తపు దిన బలి అర్పించినప్పుడు, అతను బలి అర్పించే తలపై చేతులు ఉంచి, దాని రక్తాన్ని తీయడానికి దాని గొంతును కోయవలసి ఉంటుంది. ఈ చేతులు వేయు పద్ధతి ద్వారా, అతని ప్రజలందరి పాపములను ఆ బలి పశువుపైకి పంపి రక్తం చిందించడం ద్వారా ఆ పాపములన్ని ఆ బలిపశువు పైకి పంపబడి వారి పాపములు విమోచించబడును. ఈ విశ్వాసం లేని వారెవరూ దేవుని యొద్దకు వెళ్లలేరు. ఈ విశ్వాసం లేకుండా దేవునికి నైవేద్యాలు ఇవ్వడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం. బలి వ్యవస్థ మరియు గుడారంలోని వస్తువులు అన్నీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే విశ్వాసానికి సంబంధించినవి. ప్రధాన యాజకుడు దేవుని సన్నిధికి వచ్చి, వారి పాపములన్నిటిని పోగొట్టే బలులు అర్పించడం ద్వారా తన ప్రజల కోసం తన యాజక బాధ్యతలను నెరవేర్చగలడు అది దేవుడు చెప్పిన వాక్యంపై అతనికి ఉన్న విశ్వాసమును బట్టియు.
మరి మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఈ ప్రస్తుత కాలములో, మీరు మరియు నేను ఈ సత్యాన్ని తెలుసుకొని విశ్వసించి, విశ్వాసంతో దేవుని యెదుట జీవించే వారు కూడా ఆయనకు రాజులైన యాజకులే (1 పేతురు 2:9). మీ విశ్వాసం అనునది పాత నిబంధనలో వెల్లడి చేయబడిన బలి వ్యవస్థను విశ్వసించే విశ్వాసమేనా? పాత మరియు క్రొత్త నిబంధన ద్వారా చెప్పబడిన నిజమైన సువార్తను విశ్వసించే విశ్వాసమే నిజమైన విశ్వాసం అయి ఉండాలి. విశ్వాసం యొక్క బాహ్య రూపాలు కాలానుగుణంగా మారవచ్చు, కానీ నిజమైన విశ్వాసం యొక్క విధానం ఒకేలా ఉండాలి. దేవుడిచే ఆమోదించబడిన ప్రధాన యాజకుల యొక్క బలి వ్యవస్థ ప్రకారం తమ సమర్పణలను ఇచ్చే వారు.
ఏఫోదు చిత్రకారుని పనిగా చేయబడింది "అని బైబిల్ చెప్పినప్పుడు, అది చక్కగా వివరంగా అల్లిక చేయబడిందని అర్థం. ప్రధాన యాజకుడు పూర్తిగాపేనిన ఏఫోదును ధరించాలి,అందులో పేర్కొన్న ఐదు దారాలలో దారం లేదు. ఇలా, నీలి, ఊదా, రక్తవర్ణముగల దారాన్ని, సన్నని పేనిన నారను నిజంగా విశ్వసించే విశ్వాసం వల్లనే యాజకులుగా మారిన వారు మొదట పరిశుద్దతను ధరించి, ఆ తర్వాత మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి పాప పరిహారం యొక్క నైవేద్యాన్నిఇతరుల కొరకు ఇవ్వగలరు.
అప్పుడు మీ విశ్వాసం ఎలా ఉంది? నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మీరు క్రమముగా తెలుసుకొని నమ్ముచున్నారా ? నీలిరంగు, ఊదారంగు, రక్తవర్ణ దారంతోనూ, సన్నని పేనిన నారతోనూ వ్యక్తమయ్యే సత్యాన్ని విశ్వసించే పాత నిబంధన యాజకుల యొక్క విశ్వాసం నీటి సువార్తను, ఆత్మను విశ్వసించే విశ్వాసంతో సమానం ఈ కొత్త నిబంధన కాలములో. ఈ విశ్వాసం ఎవరూ మార్చలేని రక్షణ యొక్క సంపూర్ణ సత్యం. ఈ విశ్వాసం లేకుండా, ఎవరూ దేవుని యెదుటకు రాలేరు, లేదా ఆయన పరిశుద్ధమైన సువార్తను వ్యాప్తి చేయలేరు. చివరిగా, ఈ నిజమైన సువార్త ద్వారా తమ పాప విమోచనను పొందని వారు ఇతరుల కోసం తమ యాజక బాధ్యతలను నెరవేర్చలేరని దీని యొక్క అర్థం.
మన యొక్క మొదటి పేజీ ద్వారా, మనము అనేక ఇతర దేశాల నుండి వార్తలు వింటాము. పెరూ నుండి చైనా వరకు మరియు ఉగాండా నుండి హోలాండ్ వరకు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు మా ఉచిత క్రిస్టియన్ బుక్స్ ద్వారా పాప విమోచన పొందుతున్నారని మేము వింటున్నాము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను కలిగి ఉన్న ఈ పుస్తకాల ద్వారా, మనం ఇంకా కలవని ప్రజలు కూడా తమ పాపములను బట్టి విడుదల పొందుతున్నారు. ప్రతి దేశంలో ప్రజలు పాప పరిహారాన్ని స్వీకరించి వారు మా సహోద్యోగులుగా మారి సువార్తను వ్యాపిస్తే, ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు సాదించగలమో?మా ఉచిత క్రిస్టియన్ పుస్తకాలు ప్రతి దేశంలోకి ప్రవేశించగలిగితే, ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి నిజంగా పుట్టడం చాలా కష్టం కాదు. ప్రపంచమంతటా లెక్కలేనన్ని ఆత్మలు ఇప్పుడు మన పుస్తకాలను చదవడం ద్వారా పాప విడుదలను పొందుతున్నారు. కాబట్టి మనము మన యాజక విధులను విశ్వాసముతో కొనసాగించాలి మరియు విశ్వాసం ద్వారా ప్రత్యక్షపు గుడార వ్యవస్థలో వ్యక్తమయ్యే ఈరక్షణ యొక్క సత్యాన్ని వ్యాప్తి చేయాలి.
ప్రియమైన తోటి విశ్వాసులారా, మీరు పాపం లేనివారుగా మరియు పరిశుద్దులుగా మారినప్పుడు మాత్రమే మీరు నిజమైన సువార్తను పూర్తిగా ప్రపంచ ప్రజలకు వ్యాప్తి చేయవచ్చు, దాని కంటే ముందు. మనం యాజకులం కావడానికి, ప్రత్యక్షపు గుడారంలో కనిపించే నాలుగు సత్యాలను విశ్వసించే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి మరియు వ్యాప్తి చేయాలి. నిజ దేవుడైన మన ప్రభువు నీలం, ఊదా మరియు రక్తవర్ణము గల దారంతో మన పాపములన్నిటిని పరిహరించాడు. ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం తీసుకొని, తన రక్తాన్ని చిందించడం ద్వారా, మన ప్రభువు మన పాపములన్నిటిని శుద్దిచేసాడు మరియు ఈ పాపములన్నిటికై మన స్థానంలో శిక్షను భరించడం ద్వారా, నమ్ము వారి వారి సమస్త పాపముల నుండి ఆయన రక్షించాడు. మనల్ని నీతిమంతులుగా మరియు పాపం లేనివారిగా చేసే నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారు ఎవరైనా ఈ పరిశుద్ధ దుస్తులను ధరించవచ్చు.మనం ఈ వస్త్రాలను ధరించినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి, ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయన సహాయం కోరినప్పుడు మరియు ఆయనను సేవించినప్పుడు, ఈ సువార్తను వ్యాప్తి చేయడం ద్వారా మనం మన యాజక విధులను నిర్వర్తించవచ్చు.
నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్తను విశ్వసించడం ద్వారా మీరు మీ పాపముల నుండి విడుదల పొందారా? ఈ బంగారు దారం లాంటి విశ్వాసం మీ హృదయాలలో కనిపిస్తుందా? ఈ సువార్త సత్యాన్ని మనం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, కానీ మనం దానిని హృదయపూర్వకంగా విశ్వసించాలి. ప్రధాన యాజకుడు ప్రత్యక్షపు గుడారపు ద్వారం యొక్క వస్త్రాలకు ఉపయోగించే నాలుగు దారాలలో కనిపించే ఈ సత్యాలలో దేనినైనా మనం వదిలివేయకూడదు; వాటిలో ప్రతి ఒక్కటి మన విశ్వాసంలో కనిపించాలి. నేడు అబద్దపు విశ్వాసులు ఎవరు? ఏదైనా సారూప్యంగా కనిపించినప్పటికీ, నిశితంగా పరిశీలించినప్పుడు దాని విధానం చాలా భిన్నంగా ఉంటే, మనము దీనిని అనుకరణ అని పిలుస్తాము.ఇవన్నీ తప్పుడు సువార్తలకు సంబందించినవి కావా ? నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించక దానికి బదులుగా కొన్ని ఇతర తప్పుడు సువార్తలను విశ్వసించే వారు కేవలం బూటకపు విశ్వాసం కలిగి ఉన్నవారు.
ఆత్మీయ యుద్ధవీరులుగా పోరాడుతూ మరియు మీ విశ్వాసమును కాపాడుకొనుడి
కొంతకాలంగా, అనేక మంది సాధారణ రిపోర్టర్లు నిజమైన జర్నలిస్టులుగా నటిస్తూ ప్రజల దగ్గర డబ్బును మోసం చేశారు. ఈ బోగస్ జర్నలిస్టులు నకిలీ ధృవపత్రాలను కలిగి ఉన్నారు మరియు నిజమైన జర్నలిస్టులుగా నటించడంలో చాలా మంచివారు, చాలా మంది ప్రజలు వారి ద్వారా మోసపోయారు. ఈ రోజు, వాస్తవమైన సువార్తను పోలి ఉండే అనేక ఇతర అబద్దపు సువార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, కానీ వాస్తవం ఏమిటంటే, వారు నిజానికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్తకు భిన్నంగా ఉన్నారు. కాబట్టి, మరొక సువార్తను విశ్వసించే ముందు, అందులో నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార యొక్క ప్రతి ఒక్క దారం ఉందా లేదా మరియు వీటిలో ఏ ఒక్కటైనను ఉందా లేదా విడువబడిందా అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా దానిని నిశితంగా పరిశీలించగలము.దేవుడు ఏ ఒక్క దారమును వదలకుండా కళాత్మకంగాపేనడం ద్వారా ప్రధాన యాజకునికి వస్త్రాలను తయారు చేయమని దేవుడు మోషేకు ఆదేశించాడు; నేటి యాజకులు తమ విశ్వాసం విషయానికి వస్తే నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నుండి ఏ మూలకాన్ని వదలకూడదని దీని అర్థం. ఈ నాలుగు దారాలతో-నీలం, ఊదా, రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో దేవుడు మన రక్షణను నెరవేర్చాడని మనం విశ్వసించకపోతే, మనం దేవుని యొక్క ఆమోదం పొందలేము.
ఒకరి విశ్వాసం బూటకమైనదో కాదో మనం ఎలా గుర్తించగలం? ప్రధాన యాజకుడు ధరించే వస్త్రాల రంగులను చూసినప్పుడు, ఈ రోజు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారి విశ్వాసం మాత్రమే సంపూర్ణంగా ఉందని మనం గ్రహించగలము. ఈ వ్యక్తులలాగా ఎవరైనా నిజమైన సువార్తను విశ్వసిస్తే, మీరు ఈ వ్యక్తిని అతని పాపముల నుండి పూర్తిగా విడుదల పొందిన వ్యక్తిగా పరిగణించవచ్చు. నీలి దారంలోని సత్యాన్ని, యేసు బాప్తిస్మమును విశ్వసించక , సిలువ రక్తాన్ని మాత్రమే విశ్వసించి, తమ విశ్వాసం సంపూర్ణమని భావించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు పరిపూర్ణమైన సువార్తను విశ్వసించే వారు కాదు. ఈ వ్యక్తులకు దేవుని యెదుట వారికి నిజమైన సువార్త తెలియదు కాబట్టి, వారు పాపముల యొక్క ఆధ్యాత్మిక విడుదల గురించి బోధించలేరు.
ప్రియమైన తోటి విశ్వాసులారా, నిజమైన సువార్తను విశ్వసించే వారి నుండి అబద్దపు -సువార్తలను విశ్వసించే వారి విశ్వాసాన్ని మీరు గుర్తించగలగాలి. ఈ అబద్దపు సువార్తలను విశ్వసించే పాస్టర్లు ఈ భూమిపై చాలా మంది ఉన్నారు. పాత నిబంధనలో, ప్రధాన యాజకుడు యొక్క వస్త్రాలు ఐదు పదార్థాలతో తయారు చేయబడ్డాయి, మరియు ఈ విశ్వాసం కలిగి ఉండడం ద్వారానే మనం పాపముల నుండి విడుదల పొందాము. అందుకే సాతానుకు వ్యతిరేకంగా మనము ఆధ్యాత్మిక పోరాటం చేస్తున్నాం.
అపొస్తలుడైన పౌలు ఈ సమస్యను ఎఫెసీయుల పుస్తకంలో ప్రస్తావించాడు. మనం ఎఫెసీయులకు 6:10-18 వైపుకు వెళ్దాం: “తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి.ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. ”
అపొస్తలుడైన పౌలు "తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి." మరియు "దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి." అని చెబుతున్నాడు, తద్వారా మనం "దెయ్యం యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా నిలబడగలుగుతాము." దేవుని యొక్క సర్వాంగ కవచం అనగా ఏమిటి ? ఇది దేవుని యొక్క వాక్యం. మరో మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడం ద్వారా, దానిని ధరించడం ద్వారా మరియు దానిని పట్టుకోవడం ద్వారా ఈ అబద్దపు విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడాలని పౌలు మనకుచెప్పుచున్నాడు. అందుకే ఆయన ఇలా అంటున్నాడు, “ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను పోరాడుచున్నాము.” ఈ యుగపు పాలకులకు వ్యతిరేకంగా, ఈ లోకం పక్షాన ఉన్నవారికి వ్యతిరేకంగా మరియు అపవాది యొక్క దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు.
పౌలు మనకు చెబుతున్నాడు, "అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి ”ఈ విషయాలన్నీమనము చేయునట్లుగా , దేవుని యెదుట నిలబడటానికి పౌలు మనకు ఇలా చెప్పచున్నాడు. మనము దేవుని యొక్క నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తున్నందున, మనము పాపవిమోచనను స్వీకరిస్తాము మరియు దేవునితో నిత్యజీవమును ఆస్వాదించడానికి దేవుని యెదుట నిలబడతాము.
మనమందరం మన శరీరంలో బలహీనులం. కాబట్టి మనం విశ్వాసం అను నడికట్టును ధరించాలి. నీతి అనే కవచాన్ని ధరించమని చెప్పడం ద్వారా, ఈ సువార్తను మనము మన హృదయాలతో విశ్వసించాలని పౌలు మనకు చెబుతున్నాడు. ప్రధాన యాజకుడు తన ఛాతీపై ఉన్న న్యాయ విధాన పతకము మీద పన్నెండు విలువైన రాళ్లను ధరించాడు మరియు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలలోని ప్రతి గోత్రం యొక్క పేరు ప్రతి రాయిపై చెక్కబడి ఉండును, అతను అందరిని మన హృదయాలలో హత్తుకొని వారిని క్రీస్తు వైపుకు నడిపించాలని చెప్పాడు. ప్రధాన యాజకుడు ఈ పన్నెండు విలువైన రాళ్లను న్యాయ విధాన పతకము పై ధరించాడు మరియు దానిని తన ఛాతీపై ఉంచాడు అంటే అతను ఇశ్రాయేలు ప్రజలందరినీ తన హృదయంలో ఉంచుకొనియున్నాడని దాని భావన.
అపొస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పినట్లు, “మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని,”నీలి, ఊదా, రక్తవర్ణము గల దారం మరియు సన్నని పేనిన నారను నమ్మే విశ్వాసాన్ని తప్పనిసరిగా మరియు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మన బలహీనతలకు భయపడక మన హృదయాలలో నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారంపై విశ్వాసం ఉంచినప్పుడు,మన హృదయాలు బలపడతాయి. ఈ విశ్వాసం ద్వారానే మనం మన అచంచల విశ్వాసంపై దృఢంగా నిలబడగలం. కాబట్టి, మనం న్యాయ విధాన పతకమును ధరించాలి మరియు దానిని మన మనస్సులలో మరియు మన హృదయాలలో కూడా విశ్వసించాలి. ఈ నిజమైన సువార్తను మన మనస్సుతో తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, కానీ మన హృదయాలలో కూడా మనం దానిని విశ్వసించాలి.
అప్పుడు మనం సమాధాన కరమైన సువార్త యొక్క సిద్ధ పాటుతో సువార్త వ్యాప్తికి సంబంధించిన బూట్లు ధరించాలి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో, దేవుడు మనకు శాంతిని యిచ్చియున్నాడు. ఈ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తయందు విశ్వాసముంచమని దేవుడు మనకు చెప్పాడు ఏదైతే మనకు శాంతిని మరియు సువార్తను ప్రకటించుట ద్వారా మన జీవితాలను నడిపించవలెనని దేవుడు చెప్పాడు.
దేవుడు కూడా "విశ్వాసం యొక్క కవచం" మరియు "మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు." అని చెప్పాడు. పురాతన కాలంలో, మండుతున్న బాణాలు తరచుగా యుద్ధంలో మోహరించే మొదటి ఆయుధం. సాతాను మనపై ఈ విధంగా దాడి చేస్తాడని పౌలు చెప్పుచున్నాడు. సాతాను మన బలహీనతలు మరియు లోపాలపై తన దాడిని నిర్దేశిస్తాడు, “మీ గురుంచి మీరు ఏమనుకొనుచున్నారు? మీ హృదయాలలో నుండి పైకి వచ్చే మీ ఆలోచనలు మరియు క్రియలన్ని మురికిగా ఉన్నాయి, అయినప్పటికీ మీరు సువార్తను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది ఎంతటి అర్ధంలేనిది? మీరు చాలా అహంకారంతో ఉన్నారని మీరు అనుకోటంలేదా?మిమ్మల్ని మీరు ఎందుకు స్థిరులుగా చేసుకోకూడదు ? ”మీరు ఈ మండుతున్న బాణాలతో కొట్టబడి, దాని కారణంగా" మీరు చెప్పింది నిజమే "అని లొంగిపోతే, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి, నాకు నేనుసరిగ్గా ఉండలేనప్పుడు నేను వాస్తవంగా ఎలాంటి యాజకుడను?"ఇలా జరిగితే మీ ఆత్మలు చనిపోవును మరియుమీరు ఆధ్యాత్మికంగా చనిపోతారు.అందుకే అపొస్తలుడైన పౌలు మనకు, “అన్నింటికంటే ముఖ్యంగా విశ్వాస కవచాన్ని ధరించుకోండని” చెప్పాడు. మన బలహీనతల్లో మనల్ని పడేసేలా సాతాను మన హృదయాల్లో అమర్చడానికి ప్రయత్నించే ఈ శారీరక ఆలోచనల నుండి మనల్ని ఏది రక్షిస్తుంది? అది నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార యందు విశ్వాసము. ఇది విశ్వాసం యొక్క కవచం.
మండుతున్న బాణాలు విచక్షణారహితంగా మనపై వర్షం వలె పడినప్పుడు, ఈ విశ్వాసంతో వారిని పారద్రోలమని ప్రభువు మనకు చెప్పాడు: “నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారంతో ప్రభువు నన్ను నీతిమంతుడిగా చేశాడు. నేను దీన్ని మనస్పూర్తిగా నమ్ముతాను”అటువంటి విశ్వాసం ద్వారానే మనం ఈ అగ్ని బాణాలను మరియు సాతాను పన్నిన అన్ని కుట్రలను మరియు దాడులను తిప్పికొట్టగలము.
మీరు తగిన వారు కారా ? మీ శరీరం కచ్చితంగా సరితూగినది . దీని ప్రకారం, మీరు దేవుడు మీకు దయ చేసిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై ఉన్న విశ్వాసంతో మీరు సమస్త విషయాలను వ్యవహరించాలి. పాప విమోచన పొందిన తర్వాత, మొదట మీరు విశ్వాసం ద్వారా చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ తరువాత, అనేక ఇతర కష్టాలను నిజంగా ఇతర మార్గాల ద్వారా పరిష్కరించలేము కానీ విశ్వాసం ద్వారా మాత్రమే మీరు తలుపు తట్టాలి. ప్రారంభంలో, మీ బలహీనతలు కొంచెంగా మాత్రమే కనిపిస్తాయి, కానీ కాలక్రమేణా, అలాంటి బలహీనతలు మరింత ఎక్కువ స్థాయిలో చాలా సూటిగా బహిర్గతం అవుతూనే ఉంటాయి. చివరికి, మీరు చాలా బలహీనతలతో ముంచెత్తుతారు, అప్పుడు అవి మిమ్మల్ని మీ నుండి వెనక్కి నెట్టేలా చేస్తాయి.
ఇలాంటి సమయాల్లో, మీరు నిజంగా మీరు మీ పాప విమోచనను అందుకున్నారా లేదా అనే సందేహాలతో ప్రారంభించినప్పుడు, సాతాను మీకు వ్యతిరేకంగా తీవ్రమైన దాడులను ప్రారంభించును. కాబట్టి, మీ విశ్వాసంతో, మీరు మీ బలహీనతలను కూడా జాగ్రత్తగా చూసుకోగలరు. మరో మాటలో చెప్పాలంటే, మీ బలహీనతల కారణంగా మీ స్వంత స్వీయ విధ్వంసం వైపు నడిపించే అలాంటి శరీర సంబంధమైన ఆలోచనలను మీరు నివారించాలి. విశ్వాసం అనే కవచంతో, మీరు సాతాను దాడులను తిప్పికొట్టాలి మరియు “సాతానా, నా వెనుకకు రా! రోమా 1:17 చెప్పినట్లుగా,” నీతిమంతుడు విశ్వాసంతో జీవించును, “నాకు అనేక లోపాలు ఉన్నప్పటికీ దేవుని నీతి పై నాకున్న విశ్వాసమును బట్టి నేను ఇంకను నీతిమంతుడును.’’ నీతిమంతులు విశ్వాసంతో జీవించవలెను.
ఈ ప్రపంచంలో మన గురించి గొప్పగా చెప్పుకోగలిగేది ఏదైనా ఉందా? ప్రాపంచిక పదంలో మనం గొప్పలు పలకడానికి ఏమీ లేదు, కానీ మనం ఇప్పటికీ ఈ ప్రపంచ ప్రజల ముందు నమ్మకంగా మాట్లాడగలము. లోకంలోని ప్రజలు మీతో ఇలా అనవచ్చు, “మీరు నీతిమంతులైతే, నేను కూడా నీతిమంతుడినే.” అప్పుడు మీరు వారికి సమాధానం చెప్పాలి, “వినండి, మీరు నీతిమంతులైతే, నేను నీతిమంతులందరికీ తల్లిని.”అవగాహన లేని మరియు మన లోపాలను బయటకు లాగడం ద్వారా మనపై దాడి చేసే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు.“నువ్వు మంచి విద్యార్థివి కాదు. మీరు దీన్ని చేయలేరు మరియు మీరు కూడా చేయలేరు.”ఇలావారు మనపై ఇలా దాడి చేసినప్పటికీ, మనము ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు. మీరు ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు,“ మీరు చెప్పింది నిజమే. నేను ఆ విషయంలో అంత మంచి వాడిని కాదు. అయినప్పటికీ, నేను ఈ నిజమైన సువార్తను విశ్వసిస్తున్నాను. ఈ సువార్త ఏమిటో మీకు తెలుసా? నీలిరంగు దారం ఏమిటో మీకు తెలుసా? ఊదా దారం అనగా నేమి ? రక్తవర్ణముగల దారం అనగా నేమి ? సన్నని పేనిన నార ఏమిటి? అసలు గ్రంథాలను చూడండి. మీరు వాటి అర్థాలను కనుగొనడానికి మీకు కనీసం ఒక నెల ఆదివారాలు పట్టవచ్చు. లేదు, వాస్తవానికి, మీరు దాని రహస్యాన్ని ఒక సంవత్సరం తర్వాత కూడా అర్థంచేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు. మీరు వాటిని గ్రహించడం ప్రారంభించడానికి ముందు బహుశా మీకు 500 తరాలు పట్టవచ్చు. బంగారు దారం ఏంటో మీకు తెలుసా? మీలా కాదు , ఈ విషయాలన్నీ నాకు తెలుసు మరియు నేను నమ్ముతున్నాను. ఈ విధంగా, మీరు మీ విశ్వాసంతో సాతాను యొక్క అన్ని దాడులను ధైర్యంగా తిప్పికొట్టాలి. అలాంటిప్పుడు మీకు బలమైన విశ్వాసం ఉండాలి, మరియు ఈ విశ్వాసంతో మీరు అతన్ని తిప్పికొట్టాలి.
నేను తగినంతగా లేనప్పటికీ,దేవుని సువార్తను సేవిస్తున్నాను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను సేవించడం దేవునికి సేవ చేయడమే. నేను కొదువ కలిగి ఉన్నప్పటికీ, దేవుని రాజ్యంలో ఇప్పటికీ నేను రాజునే. నేను రాజులా ఉండే రాజులైన యాజకుడిని. నేను ఈ సువార్తను వ్యాప్తి చేయకపోతే, మీరందరూ నరకంలో ఉంటారు. " సోదర సోదరీమణులారా, మీరందరూ అలాంటి ధైర్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ విశ్వాసం అనేది మిమ్మల్ని బలవంతంగా సాదించమని చెప్పేది కాదు, కానీ అది దేవుడు మనకు అనుగ్రహించినది , అందుచేత మీరు చేయాల్సిందల్లా కేవలం విశ్వాసం ద్వారా దాన్నిపొందుకోవలెయును. మీరు నమ్ముట ద్వారా ఈ విశ్వాసాన్ని పొందారా?
ఎఫెసీయులు 6:17 లో అపొస్తలుడైన పౌలు మనకు "మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి."అని హెచ్చరించాడు. శిరస్త్రాణము అంటే ఏమిటో మీకు తెలుసా, అవునా ? మధ్యయుగపు శూరులు గుర్తున్నారా ? వారు లోహంతో చేసిన శిరస్త్రాణమును ధరించారు మరియు పొడవైన ఈటతో గుర్రంపై ఒకరిపై ఒకరు దూసుకెళ్లెను. వారు తమ ముఖాలను కప్పి ఉంచే ఈ శిరస్త్రాణమును ధరించినప్పుడు, వారి కళ్ళకు మాత్రమే గాయాలైతే తప్ప వారిని చంపే అవకాశం చాలా అరుదు. ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ శిరస్త్రాణములు అటువంటి ఈటల దాడులను నిరోధించాయి మరియు వారిని రక్షించాయి. అదే విధంగా, రక్షణ యొక్క శిరస్త్రాణము అటువంటి పాత్రను పోషిస్తుంది.
ఈ విధంగా, మన మనస్సులలో కూడా, సత్యం గురించి జ్ఞానం మనకు ఖచ్చితంగా ఉండాలి. సువార్త యొక్క సత్యములో కూడా మనకు మేధోపరమైన జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉండాలి.“ఇది వాస్తవమైనదేనా? ఇది సరియైనదేనా? ”—ఇలా మనo అనిశ్చితితో బాధపడే బదులు, మన అవగాహనను మన మనస్సులో స్పష్టంగా క్రమబద్ధీకరించాలి: “నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారంతో ప్రభువు నన్ను పరిపూర్ణంగా నీతిమంతునిగా చేసాడు. నేను దీనిని నమ్ముతున్నాను." మనం దీనిని ఇలా చేసినప్పుడు సాతాను లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించవచ్చు. ఇది మనల్ని రక్షించే శిరస్త్రాణముతో సన్నద్ధం చేసుకోవడం. సత్యం యొక్క ఖచ్చితమైన జ్ఞానంతో మనం విశ్వసించాలి.
మరియు పౌలు కూడా ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండమని చెప్పాడు. ఆత్మ యొక్క ఈ ఖడ్గంఅనునది దేవుని యొక్క వాక్యం, కాబట్టి మనం నేర్చుకుని, తెలుసుకున్నప్పుడు మరియు వాక్యాన్ని విశ్వసించినప్పుడు, అది ఒక గొప్ప ఆయుధాన్ని కలిగి ఉన్నట్లుగా ఉంటుంది. సాతాను ఇతర వ్యక్తుల ద్వారా, డబ్బు ద్వారా, వ్యతిరేక సంపర్కం ద్వారా మరియు మీ బలహీనతల ద్వారా కూడా తెలివిగా దాడి చేస్తాడు, కాని దేవుని యొక్క వాక్యం అనే మన విశ్వాసంతో వాటన్నిటిని తిప్పికొట్టగలము.
ఎఫెసీయులలో, ప్రధాన యాజకుని యొక్క వస్త్రాల నుండి ఈ సారూప్యతను ఉపయోగించి, అపొస్తలుడైన పౌలు ఈ విధంగా నిజమైన విశ్వాసం ఏమిటో మనకు వివరిస్తాడు: "నీతియను మైమరువు తొడుగుకొనుడి." మరో మాటలో చెప్పాలంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసిన సత్యానికి శిరస్త్రాణము ధరించమని ఆయన మనకు చెబుతున్నాడు.“రక్షణ అనే శిరస్త్రాణాన్ని, ఆత్మ ఖడ్గాన్ని ధరించండి” అని కూడా పౌలు మనకు చెప్పాడు. ఈ ఉదాహరణను ఉపయోగించడం ద్వారా, ఆయన సాతానుకు వ్యతిరేకంగా పోరాడమని, సత్యం గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉండటం ద్వారా మరియు దేవుని వాక్యాన్ని విశ్వసించడం ద్వారా సాతానుని ఓడించమని చెప్పాడు. మన విశ్వాసాన్ని దెబ్బతీసే సమస్త చెడు అడ్డంకులను ఎలాంటి సంకోచం లేకుండా చంపేయమని ఆయన చెప్పుచున్నాడు. అబద్దపు సువార్తలను కలిగి ఉన్నవారు ఒక భాగాన్ని మాత్రమే విశ్వసించినప్పటికీ, యేసు యొక్క సిలువ రక్తాన్ని మరియు దేవుని కుమారునిగా ఆయన యొక్క దైవిక లక్షణాలను విశ్వసించినప్పటికీ, వారి పాపములన్నియు శుద్ధి చేయబడినట్లు చెప్పుకుంటారు. మనం తప్పని సరిగా తిరస్కరించునవి మరియు పక్కన పెట్టు అనునవి ఈ బోగస్ విశ్వాసమే.
నీలిరంగు దారం యొక్క పరిచర్యలే బూటకపు వస్త్రాలు ధరించినట్లుగా ఉంటుంది. ఇంకను ఈ ప్రపంచంలో, చాలా మంది మోసపూరిత క్రైస్తవులు తమ విశ్వాసం నుండి నీలిరంగు దారమును వదిలివేయుదురు , వాటన్నింటినీ మనం లెక్కించలేము. అయితే, మన పుస్తకాలలో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను పొందుపరచాము అలాగే నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో వచ్చిన ఈ సువార్తకు సాక్ష్యమిస్తాము, అంటే మనం నమ్మే సువార్త. ప్రజలు నమ్ముతారో లేదో అనే దానితో సంబంధం లేకుండా, వారికి మన పుస్తకాలను ఖచ్చితమైన దేవుని వాక్యానికి కట్టుబడి ఉండేలా సత్యాన్ని చదవడానికి, తెలుసుకోవడానికి మరియు విశ్వసించడానికి కనీసం ఒక అవకాశాన్ని ఇవ్వడం. యేసు దేవుడని మరియు ఆయన తన రక్తాన్ని సిలువపై చిందించడం ద్వారా తమ పాపములను కడిగివేసినట్లు మాత్రమే విశ్వసించే వారు ఇతరులను మరియు తమను కూడా మోసగించడం ద్వారా తమ విశ్వాసానికి ఆధారాన్ని తమ భావోద్వేగాల ద్వారా చూపించడానికి,,,,, ఇష్టపడతారు. అయితే సత్యాన్ని విశ్వసించే మనకు తెలియును, నమ్మకం, మరియు బోధించడం ద్వారా అనగా బాప్తిస్మం తీసుకొని సిలువ పై రక్తం చిందించడం ద్వారానే, ప్రభువైన యేసు మనల్ని సంపూర్ణంగా రక్షించాడు.
ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు బంగారం, నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో తయారు చేయబడ్డాయని మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? పరిశుద్దతను పూర్తిగా ధరించికున్న వారు ఈ ఐదు దారాలతో చేయబడిన ఈ వస్త్రాలను ధరిస్తారు. బంగారు, నీలం, ఊదా, రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నారతో తీసుకోరాబడిన పాప విమోచనను తమ హృదయాలలో విశ్వసించే వారు విశ్వాసం గల నిజమైన వ్యక్తులు మరియు ఆధ్యాత్మిక యాజకులు వారు పాపము నుండి నిజంగా రక్షించబడ్డారని నమ్మువారు.
ఇప్పుడు ఆధ్యాత్మిక యాజకులుగా మారిన వారు ఎన్నటికీ మరచిపోలేని విషయం ఉంది. ఇది నీలం, ఊదా మరియురక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార, సత్య సువార్త యొక్క నీడ. ఈ ఐదు విశ్వాసాలతోనే మనం పాప విమోచన అనే పవిత్ర వస్త్రాలను తయారు చేసి, విశ్వాసంతో వాటిని ధరించి, దేవుని యెదుటకు రాగలము.ఇది మన యొక్క నిజమైన విశ్వాసమును తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని విశ్వసించే మన యొక్క విశ్వాసం కోసం, దేవుడు పాత నిబంధనలోని ప్రధాన యాజకుడికి చేసినట్లే మన హృదయాలను పరిశుద్ధపరచాడు. ఈ సత్యాన్ని విశ్వసించడం ద్వారా, మనమందరం దేవుని యెదుట యాజకులము కాగలిగితిమి. మనము దేవునికి సేవ చేసే రాజులైన యాజకులము.
సోదరి మరియు సోదరులారా, ఈ సత్యాన్ని విశ్వసించే విశ్వాసాన్ని కలిగి ఉండాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరియు ఈ విశ్వాసంతో సాతానుపై పోరాడండి మరియు మీ యాజక విధులను నెరవేర్చండి. మరియు అలా చేయడం ద్వారా, మీరందరూ మీ యాజకత్వపు బాధ్యతలను ఎప్పటికీ నిష్ఠతో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. నీలం, ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు సన్నని పేనిన నార సువార్తను మీరు నమ్మడం మానుకొంటే, మీ యాజకత్వం మీ నుండి తీసివేయబడుతుంది. సత్య సువార్త పట్ల మీరు స్థిరమైన విశ్వాసంతో దేవుడిని సంతోషపరచే మరింత నమ్మకమైన యాజకులు కావలెనని నేను ప్రార్థిస్తున్నాను. మీరు నిత్యజీవపు సువార్తను కోల్పోకుండా, మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మీ యాజక విధులను శాశ్వతంగా నిర్వర్తించేలా మీరందరూ అంతము వరకు సత్య సువార్తను విశ్వసిస్తారని నా యొక్క నిరీక్షణ.