Search

Book Reviews

ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వైపుకు మరలవలెను

  • Santhi Jyothy Kuchipudi
  • India
  • 2
  • 06/21/2022

Telugu 2

ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వైపుకు మరలవలెను

Rev. Paul C. Jong

  • ISBN8983144602
  • Pages355
  • Rate

 
మీకందరికి యేసు నామమందు శుభములు,నేనొక సాధారణ గృహిణిని.నేను ఇండియాలోని నిడుబ్రోలు పట్టణములో నివశించుచున్నాను నాభర్త తెలుగులోనికి అనువదించిన పాల్ సి. జాంగ్ ‘‘ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వైపుకు మరలవలెను." అనుపేరుగల గ్రంధమును ఖాళీ సమయములలో నేను  చదవగా ‘‘యేసుక్రీస్తు లోక పాపములను నా పాపములతో సహా యోహాను చేత ఆయన బాప్తిస్మము ద్వారా మోసికొనిపోయి సిలువమీద రక్తము ద్వారా నా పాపములను లోకపాపములను కడిగివేసి హృదయమందు పాపములేనిదానినిగా చేసెనని నేను తెలుసుకొన్నాను’’. ఈ గ్రంధము పాత నిబంధనలోని పాప ఒక పాపి తన పాపముల ప్రాయశ్చిత్తమునకు ఒక పాప పరిహారార్ధ బలి పశువుపై యాజకుడుతన హస్తములను ఆ పశువు తలపైఉంచి పాపములను బలిపశువుమీదికి బదిలీ చేసేవాడు.అయితే క్రొత్త నిబంధనలో యాజకునిగా లోక పాపములను మోపుటకు దేవుడు బాప్తిస్మమిచ్చు యోహానును ఆయన మార్గమును సరాళము చేయుటకు ముందుగానే పంపెను.యాజకుడైన జెకర్యా కుమారుడైన యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చుట చేత లోక పాపములను యేసుమీదికి బదిలీచేసి నీతియావత్తు నెరవేర్చెను, మరునాడు యేసు రాగా యోహాను చూచి ‘‘ఇదిగో లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల” అని ప్రకటించెను. యేసు బాప్తిస్మము మరియు సిలువమీద ఆయన రక్తముఅను నీరు మరియు ఆత్మ సువార్త నన్ను పాపములేనిదానిగాచేసి నా జీవితమును మార్చివేసింది. ఇందునుబట్టి దేవునికి వందనములు. ఈ పుస్తకము చదువుట వలన పాపమంటే ఏమిటో, పాత నిబంధనలో పాప ప్రాయశ్చిత్తము ఎలా ఉండెనో, క్రొత్త నిబంధనలో దేవుని ప్రణాలిక తెలుసుకొనుట ద్వారా, పాపములనుండివిమోచనము పొందుట చేత హృదయములోని భారమంతా తొలగిపోయింది. దీనిని చదివినవారు దేవుని కృపపొంది పాపములనుండి విమోచన పొందగలరు. నేను ఈ నీరు మరియు ఆత్మ సువార్త వాక్యానుసారముగా ఈ గ్రంధము ద్వారా మర్మమును తెలియపరచిన పాల్ సి. జాంగ్ గారికి, నా వందనములు. ఈ గ్రంధములు అనేకులు చదివునట్లుగా ఈ వెబ్ సైట్ అందరికి పరిచయం చేయవలెనని నేను అభ్యర్ధించుచున్నాను.
Kuchipudi Santhi, India