Search

Book Reviews

నాలో నివసించు పరిశుద్ధాత్మ - పరిశుద్ధాత్మను పొందేందుకు సురక్షితమైన మార్గము

  • Santhi Jyothy Kuchipudi
  • India
  • 10
  • 06/21/2022

Telugu 3

నాలో నివసించు పరిశుద్ధాత్మ - పరిశుద్ధాత్మను పొందేందుకు సురక్షితమైన మార్గము

Rev. Paul C. Jong

  • ISBN8983143231
  • Pages317
  • Rate

 
మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమందు శుభములు.  నా పేరు శాంతిజ్యోతి, ఇండియాలోని నిడుబ్రోలు పట్టణమునుండి నివాసముండు పరిశుద్ధాత్మను నా హృదయమందుంచిన‘‘నీరు మరియు ఆత్మ సువార్త’’ కు సాక్షిగా నిలబడుచున్నాను. పాల్ సి. జాంగ్ 3వ గ్రంధము ‘‘నీవు పరిశుద్ధాత్మ పొందుటకు సురక్షిత మార్గము’’ అను గ్రంధమును అనువదించుటకు దేవుడు నాకు అనుగ్రహించిన దీవెననుబట్టి ఆయనకు అనేక వందనములు చెల్లించుచున్నాను.  పరిశుద్ధాత్మ పొందుట అనునది ఒక ప్రత్యేక సందర్భమేమో అను సందేహము ఇంతకుముందు తరచు నాకు కలిగేది. అయితే, నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా  నా సమస్తపాపములనుండి విడుదల పొందినప్పుడే, ఆత్మ ఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్యము, మంచితనము, సాత్వికము మరియు ఆశానిగ్రహగము లను ఆత్మ ఫలము యొక్క లక్షణములు నాయందు పని చేయుచూ దేవునిపని  చేయుచున్నకొలదీ, హృదయములో జీవపు ఊటలు ప్రవహించుచున్నందున, నేను నివాసముండు పరిశుద్ధాత్మను కలిగియున్నానను నిశ్చయతకు వచ్చాను.  ప్రశాంతతో కూడిన జీవితము, దేవుని పనిలో ఆనందము, అన్ని విషయములలో సంతోషము ఆత్మయందు నడుచుట ద్వారా సాధ్యమని ఇవి పరిశుద్ధాత్ముని కార్యములని, ఆత్మయందు నడుచుట చేత శరీరేశ్ఛలను నెరవేర్చమని ఈ గ్రంధము ద్వారా మరియొకసారి ధృఢపరచుకొన్నాను. భాషలలో బాట్లాడడం, క్రిందపడి గిలగిల కొట్టుకోవడంవంటి అల్లరితోకూడిన కార్యములు పరిశుద్ధాత్మ కార్యములు కావని రూఢి అయింది.  నేను నా భర్త అనేక శోధనలు జయించుటకు సహాయము చేసినవాడు మాలో నివాసముండిన పరిశుద్ధాత్ముడు.  మాకు పునరుత్ధానములో పాలు ఉన్నదని నిర్ధారించిన పరిశుద్ధాత్మునుకి, మా పాపములు క్షమించి మమ్మును పాపములేనివారిగాచేసి పరిశుద్ధాత్మను ఒకవరముగా మాకు అనుగ్రహించి పునరుత్ధాన నిశ్ఛయతను ఇచ్చిన ప్రభువుకు కృతజ్ఞతా వందనములు.
Kuchipudi Santhi, India