Search

GRATIS BOEKEN,
eBOEKEN EN LUISTERBOEKEN

Jezus Christus en Johannes de Doper.

Telugu 21

నాలుగు సువార్తలలో నమోదుచేయబడిన యేసు మరియు బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యలో ఉన్న సంబంధం

Rev. Paul C. Jong | ISBN 9788928260294 | Pagina’s 372

Download GRATIS e-books en audioboeken

Kies uw gewenste bestandsformaat en download veilig naar uw mobiele apparaat, PC of tablet om de prekencollecties overal en altijd te lezen en te beluisteren. Alle e-books en audioboeken zijn volledig gratis.

U kunt het audioboek beluisteren via de onderstaande speler. 🔻
Bezit een paperback
Koop een paperback op Amazon
విషయ సూచిక
 
ముందుమాట 
1. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యను మీరు తప్పక తెలుసుకోవాలి మరియు విశ్వసించాలి (మార్కు 1:1-2)
2. బాప్తిస్మమిచ్చు యోహాను ఒక వైఫల్యం కాదు (మత్తయి 11:1-14)
3. నీతి మార్గంలో వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను (మత్తయి 17:1-13) 
4. బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యను చూడండి! (లూకా 1:17-23) 
5. దేవుని మహిమను మనం ఆనందంగా ఆస్వాదిద్దాం (యోహాను 1:1-14) 
6. ఇద్దరి దేవుని సేవకుల పరిచర్యలు మీకు తెలుసా? (యోహాను 1:30-36) 
7. యేసు ఎందుకని బాప్తిస్మమును పొందవలసి వచ్చింది? (యోహాను 3:22-36) 
8. నిజమైన సువార్తను మరియు యేసు నీతి కార్యమును వ్యాప్తి చేయండి (మత్తయి 3:1-17) 
9. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య మరియు మన పాపములకు ప్రాయశ్చిత్తం యొక్క సువార్త మధ్య సంబంధం (మత్తయి 21:32) 
10. మీ పాపములను తుడిచిపెట్టుటకు వచ్చిన యేసు (మత్తయి 3:13-17) 
11. “ఇదిగో, నేను నా దూతను పంపుతున్నాను” (మార్కు 1:1-5) 
12. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క అవగాహనతో యేసును విశ్వసిద్దాం (లూకా 1:1-17)
 
కొత్త నిబంధన నాలుగు సువార్తలతో ప్రారంభమవుతుంది, అంటే మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలు. నాలుగు సువార్తలన్నీ బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యతో వ్యవహరించాయి మరియు పూర్తిగా నమోదు చేశాయి. ఎందుకంటే అతని పరిచర్య చాలా ముఖ్యమైనది. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య యొక్క అవగాహన లేకుండా, మనము యేసుక్రీస్తు పరిచర్యను తెలుసుకున్నామని చెప్పలేము.
అలాగైతే, “నాలుగు సువార్తలలో నమోదు చేయబడిన బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య అంత ప్రాముఖ్యమైనదా?” అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. బాప్తిస్మమిచ్చు యోహానును ఎత్తిచూపుతూ, యేసు కూడా ఇలా అన్నాడు, “ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే” (మత్తయి 11:14). కాబట్టి, బాప్తిస్మమిచ్చు యోహాను ఒక ప్రత్యేకమైన పరిచర్యను నిర్వహించడానికి ఈ భూమిపై జన్మించిన వ్యక్తి. యేసు ఇలా కూడా చెప్పాడు, “బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు” (మత్తయి 11:12). ఇది నిజం ఎందుకంటే బాప్తిస్మమిచ్చు యోహాను ఈ భూమిపై జన్మించాడు, మరియు అతను యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన్నప్పుడు, ఈ లోకములోని పాపములు ఆయనకు బదిలీ చేయబడ్డాయి. ఆ విధంగా, యేసు ఈ లోక పాపములను ఒకేసారి భరించగలిగాడు. ఇది అలా ఉండేందుకు అనుమతించడం ద్వారా, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యను మరియు యేసు యొక్క పరిచర్యను విశ్వసించే వారిని పాపముల విముక్తిని పొందడం ద్వారా ప్రభువు పరలోకములో ప్రవేశించడానికి అనుమతించాడు. ఇది మత్తయి సువార్త 11వ అధ్యాయం, 12-14 వచనాల లేఖన వాక్యభాగంలో అంతర్లీనంగా ఉన్న అర్థం.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యమని మీరు నమ్ముతున్నారా? మీరు అలా చేస్తే, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య మరియు యేసు యొక్క పరిచర్య మీకు పూర్తిగా తెలుసు అని అర్థం. అయినప్పటికీ, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యను అర్థం చేసుకోని చాలా మంది క్రైస్తవులకు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం తెలియదు మరియు వారు తమ శరీరపు ఉత్సాహంతో మాత్రమే తమ విశ్వాస జీవితాన్ని గడుపుతారు. అజ్ఞానం ఉన్నప్పటికీ, అటువంటి వ్యక్తులు నాలుగు సువార్తలలో వ్రాసిన బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. కాబట్టి, యేసును విశ్వసిస్తున్నామని చెప్పుకునే క్రైస్తవులలో కూడా బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడుతోంది. బహుశా ఈ కారణంగానే, ఈ రోజుల్లో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యలో ఆసక్తి ఉన్నవారు అంతగా లేరని నేను కనుగొన్నాను. అందువల్ల, ఈ అంశంపై ఆసక్తి ఉన్నవారిని ప్రజలు వింతగా చూసే అవకాశం ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య మరియు యేసు యొక్క పరిచర్య గురించి చాలా కాలం నుండి చాలా మంది ఇష్టపడకపోవడమే దీనికి కారణం.
Meer
The New Life Mission

Doe mee aan ons onderzoek

Hoe heeft u over ons gehoord?