ప్రత్యక్షపుగుడారం: యేసు క్రీస్తు యొక్క ఒక వివరణాత్మక రూప చిత్రము (Ⅱ)
Rev. Paul C. Jong
విషయము
ముందుమాట 1. మన పాపములను బట్టి లోనికి లాగబడు వారము మనము కాదు (యోహాను 13:1-11) 2. పరిశుద్ధ స్థలము యొక్క తెర స్తంభములు (నిర్గమ 26:31-37) 3. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలవారు ఎవరు (నిర్గమ 26:31-33) 4. చినిగిన ఆ తెర (మత్తయి 27:50-53) 5. ప్రత్యక్ష గుడారపు ప్రతి పలక కొరకు రెండు వెండి దిమ్మెలు మరియు రెండు కుసులు (నిర్గమ 26:15-37) 6. సాక్ష్యపు మందసములో దాగి ఉన్న ఆత్మీయ మర్మము (నిర్గమ 25:10-22) 7. ఆ కరుణా పీఠముపై పాప పరిహారార్ధ బలిగా ప్రోక్షింపబడెను (నిర్గమ 25:10-22) 8. సన్నిధి రొట్టె బల్ల (నిర్గమ 37:10-16) 9. సువర్ణ దీప వృక్షము (నిర్గమ 25:31-40) 10. ధూప వేదిక (నిర్గమ 30:1-10) 11. ప్రాయశ్చిత దినమున అర్పణమును అర్పించు ఆ ప్రధాన యాజకుడు (లేవీ కాండము 16:1-34) 12. ప్రత్యక్ష గుడారపు పై కప్పులో దాగిన ఆ నాలుగు మర్మములు (నిర్గమ 26:1-14) 13. పాఠకుల విశ్లేషణ
ప్రత్యక్షగుడారములో దాగి ఉన్న సత్యమును నీవు ఎట్లు కనుగొనగలవు? నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలుసుకొనుట ద్వారానే మందసము యొక్క నిజ పదార్థమును మనం సరిగా అర్ధం చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానమును తెలిసికొనగలము. నిజానికి నీల దూమ్ర రక్తవర్ణముగల పేనిన సన్ననారలో చూపబడిన ప్రత్యక్షగుడార ప్రాంగణము యొక్క ద్వారము నూతన నిబంధన కాలములో మానవుని రక్షించుటకు యేసు క్రీస్తు చేసిన కార్యమును తెలియచేస్తున్నది. ఈ విధముగా పాత నిబంధన యొక్క ప్రత్యక్షగుడార వాక్యము మరియు నూతన నిబంధన వాక్యము సామీప్యము గలిగి పేనిన సన్నపు నారవలె ఖచ్చితముగా ఒకదానికొకటి సంబంధము కలిగినవై యున్నవి. కానీ దురదృష్టకరముగా క్రైస్తవ్యములోని సత్యాన్వేషకులకు ఈ సత్యము ఎంతో కాలముగా మరుగైయున్నది. ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మమును పొంది తన రక్తమును సిలువపై చిందించెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని అర్ధం చేసుకొనకుండా మనలో ఎవరూ కూడా ప్రత్యక్షగుడారములో చూపబడిన సత్యమును కనుగొనలేము. మనమిప్పుడు ప్రత్యక్షగుడారము యొక్క సత్యము తెలిసికొని దానిని విశ్వసించాలి. మందిర ప్రాంగణము యొక్క ద్వారములోనున్న నీలి ధూమ్ర రక్త వర్ణపు పేనిన సన్నపు నార యొక్క సత్యమును మనమంతా నేర్చుకోవాలి.
למרות שמגיפת קוביד-19 הסתיימה, עדיין קיימים קשיים בשליחת או קבלת הספרים המודפסים שלנו בדואר עקב מצבים בינלאומיים קשים שונים. כשהמצב הבינלאומי ישתפר והדיוור יתנרמל, נמשיך לשלוח ספרים מודפסים.